Israel Vs Iran War: పశ్చిమాసియాకు విమానాలు రద్దు | Israel Vs Iran War, Airlines In India Cancelled All Flights To West Asia, Check More Details Inside | Sakshi
Sakshi News home page

Israel Vs Iran War: పశ్చిమాసియాకు విమానాలు రద్దు

Mar 1 2026 7:13 AM | Updated on Mar 1 2026 1:10 PM

Israel Vs Iran War: Airlines In India Cancel All Flights To West Asia

న్యూఢిల్లీ: ఇరాన్‌లో యుద్ధమేఘాలు దట్టంగా కమ్ముకోవడంతో ఆ దేశానికి విమానసరీ్వసులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు భారతీయ పౌర విమానయాన సంస్థలు ప్రకటించాయి. యుద్ధం కారణంగా విమాన ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమన్, ఇరాక్, జోర్డాన్, కువైట్, ఖతార్‌లకు విమానసర్వీసులను తాత్కాలికంగా రద్దుచేయాలని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) భారతీయ విమానయాన సంస్థలకు సూచించింది.

ఈ ఆదేశాల మేరకు తమ సరీ్వసులను నిలిపేస్తున్నట్లు ఇండిగో, ఎయిర్‌ ఇండియా, ఆకాశ ఎయిర్, స్పైస్‌ జెట్‌ తదితర సంస్థలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. ప్రభుత్వ సూచనల మేరకు సరీ్వస్‌లు ఆగిపోవడంతో శనివారం సాయంత్రం 5.45 గంటలవరకు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 57 దేశీయ, అంతర్జాతీయ సర్వీస్‌లు రద్దయ్యాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

యుద్దం కారణంగా రద్దయిన విమానాల్లో టికెట్లను వేరే తేదీలకు ఉచితంగా షెడ్యూల్‌ చేసుకోవడానికి లేదా రద్దుచేసుకోవడానికి ప్రయాణికులకు విమానయాన సంస్థలు అవకాశం కల్పించాయి. పశ్చిమాసియాకు అన్ని దేశాల నుంచీ విమాన సరీ్వసులు రద్దయ్యాయి. ప్రపంచంలోనే అత్యధిక రద్దీగా ఉండే దుబాయ్‌ విమానాశ్రయం మూతపడింది.

బ్రిటన్‌ సహా పలు దేశాల నుంచి పశి్చమాసియాకు విమానసరీ్వసులు రద్దయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం మూతపడింది. బ్రిటన్‌ నుంచి దుబాయ్‌కు విమానాలు రద్దయ్యాయి. టర్కీ ఎయిర్‌లైన్స్‌ సైతం లెబనాన్, సిరియా, ఇరాక్, ఇరాన్, జోర్డాన్‌లకు సోమవారం దాకా సరీ్వసులు ఆపేసింది. అమెరికాకు చెందిన డెల్టాఎయిర్‌లైన్స్, యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్, నెదర్లాండ్స్‌కు చెందిన కేఎల్‌ఎం సైతం ఇజ్రాయెల్‌కు విమానాలను నిలిపేశాయి. 

Advertisement
 
Advertisement
Advertisement