ఇరాన్, ఇజ్రాయిల్‌లో జాగ్రత్తగా ఉండండి | Be careful in Iran and Israel | Sakshi
Sakshi News home page

ఇరాన్, ఇజ్రాయిల్‌లో జాగ్రత్తగా ఉండండి

Mar 1 2026 5:33 AM | Updated on Mar 1 2026 5:33 AM

Be careful in Iran and Israel

సహాయం కోసం +91 8500027678 హెల్ప్‌లైన్‌ నంబర్‌లో సంప్రదించాలి  

ప్రవాసాంధ్రులకు ఏపీ ఎన్‌ఆర్టీఎస్‌ విజ్ఞప్తి 

సాక్షి, అమరావతి: ఇరాన్‌పై అమెరికా యుద్ధం ప్రారంభించిన నేపథ్యంలో ఇరా­న్, ఇజ్రాయిల్‌తోపాటు, సౌదీ అరేబియాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు జాగ్రత్తగా ఉండాలని ఏపీ ఎన్‌ఆర్టీఎస్‌ సూచించింది. ఇజ్రాయిల్, ఇరాన్‌లో ఉన్న భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడంతో పాటు ఆయా దేశాలు జారీచేసిన సూచనలను తప్పకుండా పాటించాల్సిందిగా భారత విదేశాంగ శాఖ సూచించింది. 

తదుపరి నోటీసు వచ్చేవరకు అనవసర ప్రయాణాలను రద్దుచేసుకోవాలని కోరింది. ఇజ్రాయెల్‌లోని భారత రాయ­బార కార్యాలయం, టెల్‌ అవీవ్‌–24్ఠ7 హెల్ప్‌లైన్‌: +972–54–75207­11.. ఇరాన్‌లోని +989128109 115, +98912­8109109, +9891281091­02, +9899321793 59 నంబర్లలో సంప్రదించాలని కోరింది. 

యుద్ధం విస్తరిస్తున్నందున పశ్చిమాసియాలోని ప్రవాసాంధ్రులు సు­రక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పింది. భారత ఎంబసీతో ఏపీ ఎన్‌ఆర్టీఎస్‌ సంప్రదింపులు జరుపుతుందని, అత్యవసరమైతే హెల్ప్‌లైన్‌ నంబర్‌ +91 8500 027678ను సంప్రదించాలని ఎన్‌ఆర్‌ఐ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కోరారు. 

Advertisement
 
Advertisement
Advertisement