పశ్చిమాసియా యుద్ధం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు | Prime Minister Narendra Modi Key Comments On West Asia Crisis | Sakshi
Sakshi News home page

పశ్చిమాసియా యుద్ధం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Mar 28 2026 2:40 PM | Updated on Mar 28 2026 3:44 PM

Prime Minister Narendra Modi Key Comments On West Asia Crisis

ఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని.. దేశాల్లో ధరలు పెరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్‌లో సంక్షోభ పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామన్న మోదీ.. సామాన్య ప్రజలు, రైతులపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంక్షోభ పరిస్థితుల్లోనూ అభివృద్ధిని ముందుకు తీసుకెళుతున్నామన్నారు.

‘‘నోయిడాలో సెమీ కండక్టర్ ప్లాంట్, ఢిల్లీ మీరట్ మెట్రో రైలు సహా నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించుకున్నాం. ఇవన్నీ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వానికి నిదర్శనం. జేవర్ ఎయిర్‌పోర్ట్‌ ఉత్తర భారతాన్ని ప్రపంచానికి అనుసంధానిస్తుంది. ప్రతి రెండు నిముషాలకు ఒక విమానం ఎగురుతుంది. గత యూపీఏ ప్రభుత్వం యూపీని దోచుకుంది. 2004 నుంచి 2014 వరకు జేవర్ ఎయిర్‌పోర్ట్‌ ఫైళ్లకి మాత్రమే పరిమితమైంది. యూపీలో ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణం పూర్తయి అందుబాటులోకి కూడా వచ్చింది’’ అని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు.

రైతులు పండించే పంటలు, ఉద్యోగులు తయారు చేసే వస్తువులు ప్రపంచ నలుమూలకు చేరుతాయి. అంధ విశ్వాసాలతో నోయిడాను పక్కన పడేశారు. ఎస్పీ హయాంలో ముఖ్యమంత్రి నోయిడా వచ్చే దైర్యం చేయలేదు. నోయిడా ఎయిర్ పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ.. రైతుల వల్ల నోయిడాలో కొత్త అభివృద్ధి ప్రారంభమవుతుందంటూ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement