breaking news
Middle East Conflict
-
సౌదీనే వణికిస్తున్న హౌతీలు.. అంత పవర్ ఎక్కడిది అసలు?
ఒకప్పుడు యెమెన్‌లోని పర్వత ప్రాంతాలకే పరిమితమైన తిరుగుబాటు బృందం.. ఇప్పుడు సౌదీ అరేబియా రాజధాని రియాద్ వరకు క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసే స్థాయికి ఎదిగింది. విమానాశ్రయాలు, చమురు కేంద్రాలే లక్ష్యంగా విరుచుకుపడుతున్న హౌతీలను అడ్డుకోవడం సౌదీ రక్షణ వ్యవస్థకూ సవాలుగా మారింది. అత్యాధునిక ఆయుధాలు ఉన్న దేశాలకే వీరిని నిలువరించడం ఎందుకు కష్టమవుతోంది?. ఇంతకీ హౌతీలకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది?..హౌతీ రెబల్స్ తొలుత యెమెన్‌లో పుట్టుకొచ్చిన రాజకీయ, సైనిక, మత ఉద్యమం. వీరు తమను తాము ‘అన్సార్ అల్లా’గా పిలుచుకుంటారు. 1990లలో ఉత్తర యెమెన్‌లో జైదీ షియా మత సంప్రదాయ పునరుజ్జీవన ఉద్యమంగా మొదలైన ఈ సంస్థ.. క్రమంగా సాయుధ శక్తిగా మారింది. 2011లో అరబ్ వసంతం నిరసనలతో యెమెన్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన తర్వాత ఉత్తర ప్రాంతాల్లో తమ పట్టును పెంచుకుంది. 2014లో రాజధాని సనాను స్వాధీనం చేసుకుని, అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వాన్ని వెనక్కి నెట్టింది.2015లో హౌతీలను ఓడించి యెమెన్ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు యుద్ధంలోకి దిగాయి. అయితే పర్వత ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు, సుదీర్ఘ పోరాటం, హౌతీల గెరిల్లా వ్యూహాల కారణంగా ఆ సైనిక చర్య వారికి నిర్ణయాత్మక ఓటమిని తీసుకురాలేకపోయింది. యెమెన్‌లోని వాయవ్య ప్రాంతాలపై హౌతీలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు.ఇరాన్ అండ.. అదే అసలు బలం!హౌతీల సైనిక శక్తి వెనుక ఇరాన్ మద్దతు కీలకంగా కనిపిస్తోంది. క్షిపణులు, డ్రోన్ల తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, ఆయుధాలు, నిఘా సమాచారాన్ని ఇరాన్ అందిస్తోందని అమెరికా సహా పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే హౌతీలు తమను ఇరాన్ చేతిలో కీలుబొమ్మలుగా అభివర్ణించడాన్ని తిరస్కరిస్తున్నారు. తమ ఆయుధాలను తామే అభివృద్ధి చేసుకుంటున్నామని చెబుతున్నారు.అయితే నిపుణుల అంచనా ప్రకారం.. ఇరాన్ సాయం హౌతీలకు సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని పెంచింది. వాళ్ల అమ్ముల పొదిలో బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, దాడి డ్రోన్లు ఉన్నాయి. వీటితో సౌదీ చమురు కేంద్రాలు, విమానాశ్రయాలే కాకుండా ఇజ్రాయెల్‌ను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. ఒకేసారి వేర్వేరు వేగాలు, మార్గాల్లో క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించడం ద్వారా ప్రత్యర్థి రక్షణ వ్యవస్థలను గందరగోళానికి గురిచేసే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.సౌదీకి ఎందుకీ ఇబ్బంది?సౌదీ అరేబియా ప్రపంచంలో అత్యధికంగా రక్షణ రంగంపై ఖర్చు చేసే దేశాల్లో ఒకటి. అయినప్పటికీ హౌతీల దాడులను పూర్తిగా అడ్డుకోలేకపోతోంది. దీనికి పలు కారణాలున్నాయి. హౌతీలు పర్వత ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం, ఆయుధాలను రహస్య ప్రదేశాల్లో దాచడం, చిన్న డ్రోన్ల నుంచి సుదూర క్షిపణుల వరకు వివిధ రకాల ఆయుధాలను ఉపయోగించడం సౌదీకి సవాలుగా మారాయి.అత్యాధునిక రక్షణ వ్యవస్థలు ఉన్నా ప్రతి దాడిని అడ్డుకోవడం సులభం కాదు. దాడులు ఎక్కడి నుంచి వస్తాయో ముందుగా గుర్తించడం, ఏ లక్ష్యాన్ని ముందుగా కాపాడాలో నిర్ణయించడం, అందుబాటులో ఉన్న క్షిపణి నిరోధక ఆయుధాలను సమర్థంగా వినియోగించడం కీలకం. రియాద్ విమానాశ్రయంపై దాడుల నేపథ్యంలో తమ రక్షణ వ్యవస్థలు ఎందుకు ముందస్తు హెచ్చరిక ఇవ్వలేకపోయాయన్న అంశంపై సౌదీ ఇప్పటికీ వివరణ ఇవ్వలేకపోయింది!.ప్రపంచ చమురు రవాణాపైనా పట్టు!హౌతీలకు మరో ప్రధాన బలం యెమెన్ భౌగోళిక స్థానం. ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌తో కలిపే బాబ్ అల్ మండేబ్ జలసంధికి యెమెన్ సమీపంలో ఉంటుంది. ప్రపంచ వాణిజ్యానికి, చమురు రవాణాకు ఇది కీలకమైన మార్గం. ఈ ప్రాంతంలో నౌకలపై దాడులు లేదా రవాణాకు ఆటంకాలు సృష్టిస్తే అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం పడుతుంది. నౌకలు ఆఫ్రికా చుట్టూ ఎక్కువ దూరం ప్రయాణించాల్సి రావడంతో రవాణా ఖర్చులు, సమయం పెరుగుతాయి.2023 నవంబర్ నుంచి గాజా యుద్ధానికి ప్రతిస్పందనగా ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు, ఇజ్రాయెల్‌పై క్షిపణి, డ్రోన్ ప్రయోగాలు చేపట్టిన హౌతీలు.. ప్రాంతీయ ఘర్షణల్లో మరింత కీలక శక్తిగా మారారు. తాజా పరిణామాలతో సౌదీ చమురు ఎగుమతులు, విమాన ప్రయాణాలు, అంతర్జాతీయ సరఫరా మార్గాల భద్రతపై ఆందోళనలు పెరిగాయి.అసలు బలం ఏంటి?హౌతీల శక్తి కేవలం ఇరాన్ ఇచ్చే ఆయుధాల్లోనే లేదు. యెమెన్‌లోని విస్తారమైన ప్రాంతాలపై నియంత్రణ, దీర్ఘకాలిక యుద్ధ అనుభవం, పర్వత ప్రాంతాలను అనుకూలంగా మలుచుకునే సామర్థ్యం, క్షిపణులు–డ్రోన్ల సమన్వయ వినియోగం, కీలక సముద్ర మార్గాలపై ఒత్తిడి తీసుకురాగలగడం.. ఇవన్నీ వారికి బలాన్నిస్తున్నాయి.అందుకే భారీ సైన్యం, ఆధునిక యుద్ధ విమానాలు, క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉన్న సౌదీకి కూడా హౌతీలను పూర్తిగా అణచివేయడం కష్టమవుతోంది. ఇరాన్ మద్దతు వారికి ఆయుధ బలాన్నిస్తే.. యెమెన్ భౌగోళిక పరిస్థితులు, సముద్ర మార్గాలపై వ్యూహాత్మక పట్టు వారిని మరింత ప్రమాదకర శక్తిగా మారుస్తున్నాయి.ఇదీ చదవండి: భారత్‌తో పెట్టుకున్నాడు.. మస్క్ పరువు పోయిందిగా! -
హౌతీల దెబ్బకు అజ్ఞాతంలోకి సౌదీ యువరాజు!
ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక వ్యవస్థల్లో ఒకటిగా పేరొందిన సౌదీ అరేబియాకు ఇప్పుడు హౌతీ తిరుగుబాటుదారుల దాడులు తీవ్ర తలనొప్పిగా మారాయి. క్షిపణి దాడులతో రాజధాని రియాద్ సహా కీలక ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఈ పరిణామాల మధ్య సౌదీ యువరాజు, ఆ దేశ అసలు అధికార కేంద్రంగా భావించే మొహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) భద్రతపై ఉత్కంఠ నెలకొంది.భద్రత కట్టుదిట్టంగా ఉండే ఒక రాజభవనం నుంచి మరో రాజభవనానికి తరలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బంకర్లు ఉన్న భవనాల్లో ప్రత్యేక భద్రతా బృందం పర్యవేక్షణలో బిన్ సల్మాన్ ఉంటున్నట్లు సమాచారం. అయితే, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వస్తున్న కథనాలపై సౌదీ ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంది.రక్తదానం తర్వాత మాయం!41 ఏళ్ల మొహమ్మద్ బిన్ సల్మాన్ చివరిసారిగా మంగళవారం ఒక జాతీయ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు బహిరంగంగా కనిపించారు. ఆ తర్వాత నుంచే ఆయన అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారన్నది ఆ కథనాల సారాంశం!. ఈ నేపథ్యంలో ఆయన కదలికలపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. యువరాజు కదలికల గురించి తెలిసిన అధికారులను ఉటంకిస్తూ, ఆయనను అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న రాజభవనాల మధ్య తరలిస్తున్నట్లు పేర్కొంది. ఈ భవనాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా బంకర్లు కూడా ఉన్నట్లు తెలిపింది. యువరాజు భద్రత కోసం ఆయనకు అత్యంత విశ్వసనీయమైన ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు వెల్లడించింది.హౌతీ తిరుగుబాటుదారుల దాడులు తీవ్రం కావడం, సౌదీపై ముప్పు పెరుగుతుండటంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు కథనం పేర్కొంది. అయితే, ఆయన ఎక్కడ ఉన్నారు? ఎప్పటికప్పుడు ఎందుకు నివాసం మారుస్తున్నారు? అనే సమాచారం అంత్యంత గోప్యంగా ఉంచారు.దశాబ్దంలోనే అత్యంత తీవ్రమైన దాడి!సౌదీ అరేబియాపై హౌతీలు ఇటీవల జరిపిన దాడులు అక్కడి భద్రతా వ్యవస్థకు సవాలుగా మారాయి. శనివారం జరిగిన దాడిని గత దశాబ్ద కాలంలోనే అత్యంత తీవ్రమైన దాడిగా నివేదికలు అభివర్ణించాయి. రాజధాని రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై కనీసం ఒక హౌతీ క్షిపణి దాడి జరిపింది. ఈ దాడిలో కనీసం 13 మంది మరణించగా, మరో 300 మందికిపైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇరాన్ యుద్ధానికి సంబంధించి అమెరికా లేదా గల్ఫ్ మిత్రదేశాలపై జరిగిన దాడుల్లో ఇదే అత్యంత ప్రాణాంతకమైన ఘటనగా అధికారులకు వివరించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.ఈ దాడి తీవ్రతకు బాధితులు ఎదుర్కొన్న పరిస్థితులు అద్దం పడుతున్నాయి. 28 ఏళ్ల ఈజిప్టు విమాన సహాయకురాలు ఒకరు చేతిని కోల్పోయి తీవ్ర రక్తస్రావంతో మరణించినట్లు కథనం వెల్లడించింది. మరికొందరు కూడా అవయవాలు కోల్పోయినట్లు పేర్కొంది.ఐదు రోజుల్లో నాలుగుసార్లు!రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా వరుస దాడులు జరగడం సౌదీ అధికారులను కలవరపెడుతోంది. గత ఐదు రోజుల్లో ఈ విమానాశ్రయంపై నాలుగుసార్లు దాడులు జరిగినట్లు నివేదికలు తెలిపాయి. వారాంతపు దాడి తర్వాత విమానాశ్రయాన్ని మూసేశారు. కీలక మౌలిక సదుపాయాలపై పదేపదే దాడులు జరగడం వల్ల సౌదీ భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారీగా ఖర్చు చేసి అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకున్నప్పటికీ, హౌతీల దాడులను పూర్తిగా అడ్డుకోలేకపోవడం ఆ దేశానికి సవాలుగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్అజీజ్ బిన్ సల్మాన్ తీవ్ర హెచ్చరిక చేశారు. దాడుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సౌదీ ప్రతిస్పందన కూడా అంతే తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేసినట్లు నివేదిక పేర్కొంది.రంగంలోకి దిగనున్న ట్రంప్?హౌతీలపై సౌదీ అరేబియా జరుపుతున్న దాడుల్లో తాము కూడా పాల్గొనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. దీంతో యెమెన్ సంక్షోభం మరింత విస్తరించే అవకాశాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. మరోవైపు, సౌదీ అరేబియాకు మక్కా ఒప్పందంలోని మిత్రదేశాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఈ పరిణామాలు హౌతీలపై సైనిక ఒత్తిడిని పెంచే దిశగా సాగుతున్నాయి.కాల్పుల విరమణకు బ్రేక్!సౌదీ అరేబియా, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల మధ్య పోరాటం కొత్తది కాదు. 2015లో యెమెన్ అంతర్యుద్ధంలో అక్కడి ప్రభుత్వానికి మద్దతుగా సౌదీ సైనిక జోక్యం చేసుకోవడంతో ఈ పోరు మరింత తీవ్రమైంది. అనంతరం ఇరుపక్షాల మధ్య సుదీర్ఘ ఘర్షణలు కొనసాగాయి. 2022లో కుదిరిన కాల్పుల విరమణతో పరిస్థితులు కొంతమేర అదుపులోకి వచ్చినప్పటికీ, ఆ ఒప్పందం ఈ ఏడాది జూలైలో కుప్పకూలినట్లు నివేదిక పేర్కొంది. అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరగడం కూడా ఈ ఘర్షణలకు ఆజ్యం పోసింది.సనా విమానాశ్రయంలో ఇరాన్ నుంచి వస్తున్న విమానం దిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో సౌదీ దళాలు కాల్పులు జరిపాయని ఆరోపిస్తూ హౌతీలు మళ్లీ దాడులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.మధ్యవర్తిత్వానికి ఇరాన్ సిద్ధం?పశ్చిమాసియాలో ఇరాన్‌కు అత్యంత భారీ ఆయుధ సామర్థ్యం ఉన్న మిత్ర బలగాల్లో హౌతీలు ఒకటిగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో సౌదీ–హౌతీ ఘర్షణలు ప్రాంతీయ రాజకీయాలపైనా ప్రభావం చూపుతున్నాయి. అరేబియా ద్వీపకల్పంలో పరిణామాలపై ఇరాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు. ఈ పోరాటం వల్ల ఇజ్రాయెల్‌కు మాత్రమే ప్రయోజనం చేకూరుతుందని ఆయన వ్యాఖ్యానించారు.ఆదివారం రాత్రి సౌదీ, ఇరాన్ విదేశాంగ మంత్రులు కూడా తాజా పరిణామాలపై చర్చించారు. సైనిక చర్యలపైనే పట్టుబట్టి, రాజకీయ పరిస్థితులను విస్మరించడం సరికాదని తాను హెచ్చరించినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తెలిపారు. సౌదీ, హౌతీల మధ్య చర్చలు ప్రారంభించేందుకు సహకరించడానికి తమ దేశం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.మొత్తానికి, హౌతీల క్షిపణి దాడులు సౌదీ భద్రతా వ్యవస్థకు సవాలు విసురుతున్న వేళ.. యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ భద్రత, ఆయన బహిరంగంగా కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇదీ చదవండి: ఒక్క దాడి.. ఎన్నో అనుమానాలు! -
సౌదీలో హైటెన్షన్.. భారతీయులకు బిగ్ అలర్ట్
సౌదీ అరేబియాలో హౌతీల దాడులు తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. రాజధాని రియాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అక్కడ నివసిస్తున్న భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని, అవసరమైనప్పుడు ఇళ్లలోనే ఉండాలని, స్థానిక అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరింది.ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు సంబంధించిన వీడియోలు, వార్తలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం, తిరిగి పోస్టు చేయడం మానుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు, సౌదీలో నెలకొన్న భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఎయిరిండియా, ఇండిగో, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. రియాద్‌కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమాన సర్వీసులను అక్టోబర్ 10 వరకు రద్దు చేశాయి. ప్రభావితమైన ప్రయాణికులకు పూర్తి రీఫండ్ లేదంటే ప్రత్యామ్నాయ తేదీల్లో ప్రయాణించే అవకాశం కల్పిస్తామని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రకటించింది.రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ప్రయాణికులకు సూచనలు జారీ చేసింది. విమానాశ్రయానికి బయలుదేరే ముందు సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించి, తమ విమాన సర్వీసుల తాజా పరిస్థితిని తెలుసుకోవాలని కోరింది. గురువారం సౌదీ రాజధాని రియాద్ మీదుగా పలు పేలుళ్ల శబ్దాలు వినిపించిన నేపథ్యంలో ఈ సూచన ప్రాధాన్యం సంతరించుకుంది.ఆ సేవలు యథాతథంసౌదీలోని భారతీయులకు అవసరమైన సహాయం అందించేందుకు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని భారత కాన్సులేట్ సాధారణంగానే పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. వీఎఫ్ఎస్ ద్వారా అందించే సేవలు కూడా కొనసాగుతున్నాయని వెల్లడించారు. పరిస్థితులకు అనుగుణంగా అవసరమైనప్పుడు కొత్త సూచనలు జారీ చేస్తామని పేర్కొన్నారు.భారతీయుల కోసం 24 గంటలూ అందుబాటులో ఉండే ప్రవాసీ భారతీయ సహాయ కేంద్రం (PBSK) టోల్‌ఫ్రీ నంబర్ 8002471234 ద్వారా సంప్రదించవచ్చని రాయబార కార్యాలయం తెలిపింది.అమెరికాకు మద్దతుపై హౌతీల గురి?ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఇటీవలి రోజుల్లో సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలు, సైనిక స్థావరాలు, చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాకు సౌదీ మద్దతు ఇస్తుండటమే ఈ దాడులకు కారణమని వారు పేర్కొంటున్నారు. సౌదీ గగనతలం తమ సైనిక కార్యకలాపాలకు వేదికగా మారుతోందని ఆరోపిస్తూ.. అక్కడి గగనతలంలో కార్యకలాపాలు నిర్వహించే అంతర్జాతీయ విమానయాన సంస్థలకు గురువారం మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.బుధవారం రియాద్, అభా విమానాశ్రయాలపై జరిగినట్లు హౌతీలు ప్రకటించిన దాడుల్లో ముగ్గురు మరణించినట్లు సౌదీ అధికారులు వెల్లడించారు. హౌతీలపై సౌదీ అరేబియా, దానికి మద్దతుగా ఉన్న యెమెన్ బలగాలు పెద్ద ఎత్తున భూతల, వైమానిక దాడులు ప్రారంభించిన తర్వాత ఈ మరణాలు సంభవించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో సౌదీలో నివసిస్తున్న భారతీయులు అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, భద్రతా సూచనలను నిర్లక్ష్యం చేయవద్దని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.ఇదీ చదవండి: గ్రీన్‌కార్డ్ ఆశలకు షాక్ -
మళ్లీ రణరంగమా? ఇరాన్ చుట్టూ అమెరికా యుద్ధ వలయం!
పశ్చిమాసియాను మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? ఇరాన్‌పై అమెరికా మళ్లీ సైనిక చర్యకు సిద్ధమవుతోందా? తాజా పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. కొత్త దాడులకు అవకాశం కచ్చితంగా ఉందని ట్రంప్ చెప్పడం.. పైగా గల్ఫ్ ప్రాంతానికి భారీగా సైనిక బలగాలను తరలించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బలగాలే గనుక చేరుకుంటే మిడిల్ఈస్ట్లో అమెరికా సైనిక ఉనికి గతంలో ఎన్నడూలేని స్థాయికి చేరే అవకాశం కనిపిస్తోంది.దాదాపు 9 వేల మంది సైనికులు, మెరైన్లను యుద్ధ నౌకల సమూహంతో కలిసి మిడిల్‌ఈస్ట్‌కు తరలిస్తున్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఈ బలగాల తరలింపు సాధారణ మోహరింపు కాదని, ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా వ్యూహాత్మకంగా తన సైనిక సామర్థ్యాన్ని పెంచుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా బలగాలకు అదనంగా ఈ కొత్త దళాలు చేరితే.. మధ్యప్రాచ్యంలో అమెరికా నావికాదళ ఉనికి మరింత బలపడనుంది. మొత్తం మీద 20 వేల మందికి పైగా సైనికులు, వందలాది యుద్ధ విమానాలు, అత్యాధునిక ఆయుధ వ్యవస్థలతో అమెరికా సైనిక శక్తి ఈ ప్రాంతంలో అత్యున్నత స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఇంధన సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమం, ఇటీవలి ప్రాంతీయ దాడుల నేపథ్యంలో ఈ మోహరింపు ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు చర్చలకు తాము సిద్ధమంటూ ఇరాన్ సంకేతాలు ఇస్తుండగా.. మరోవైపు అమెరికా సైనిక బలగాలను పెంచడం పశ్చిమాసియాలో తదుపరి పరిణామాలపై ఉత్కంఠను పెంచుతోంది.మూడు విమాన వాహక నౌకలతో సిద్ధంఅమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్ఎస్ థియోడోర్ రూజ్వెల్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్, యూఎస్ఎస్ మాకిన్ ఐలాండ్ యాంఫిబియస్ రెడీనెస్ గ్రూప్ పశ్చిమాసియా వైపు కదులుతున్నాయి. వీటిలో వేలాది మంది నావికులు, మెరైన్లు ఉన్నారు. ప్రస్తుత ఏర్పాట్ల ప్రకారం అక్టోబర్ చివరి నాటికి ఈ ప్రాంతంలో మూడు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు ఉండే అవకాశం ఉందని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. యూఎస్ఎస్ జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్, యూఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ క్యారియర్లు ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్నాయి. 2003 తర్వాత.. తొలిసారిగా ఒకేసారి మూడు క్యారియర్ స్ట్రైక్ గ్రూపులు ఆ రీజియన్‌లో ఉండే పరిస్థితి ఏర్పడనుందని అధికారులు చెబుతున్నారు.ఇరాన్‌పై ట్రంప్ హెచ్చరికలుఇరాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌కు వెళ్తున్న విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన ఘటనలో కో–పైలట్‌కు ఇరాన్‌తో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. "ఇరాన్‌తో సంబంధం ఉన్నట్లు తేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయి" అంటూ ట్రంప్ హెచ్చరించారు. ‘‘వారిపై చాలా తీవ్రంగా దాడి జరుగుతుంది’’ అని వ్యాఖ్యానించారు.ఎన్నికల వరకు ఆగుతారా?నవంబర్ 3న జరగనున్న అమెరికా ఎన్నికల తర్వాత ఇరాన్‌పై బాంబు దాడులను పెంచే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ట్రంప్ ‘‘అది సాధ్యమే’’ అని సమాధానం ఇచ్చారు. ఇరాన్ ప్రతిపాదించిన తాజా కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించినట్లు ట్రంప్ తెలిపారు. హార్ముజ్ జలసంధిని తెరవాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ.. మొత్తం ఒప్పందం తనకు ఆమోదయోగ్యంగా లేదని పేర్కొన్నారు. అయితే తాజాగా మధ్యప్రాచ్యంలో భారీగా సైనిక బలగాలను మోహరించడం చూస్తుంటే.. ఎన్నికల వరకు అమెరికా వేచి చూస్తుందా? లేక అంతకుముందే సైనిక చర్యకు దిగుతుందా? అనే చర్చ మొదలైంది.హార్ముజ్‌లో ట్యాంకర్‌పై దాడిఇదిలా ఉండగా, ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో 25 లక్షల బ్యారెళ్ల చమురు తీసుకెళ్తున్న సూపర్ ట్యాంకర్‌పై గుర్తుతెలియని ఆయుధంతో దాడి జరిగింది. ఘటనలో నౌకలో మంటలు చెలరేగినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. ఈ ఘటనతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా ఆందోళనలు మరింత పెరిగాయి.ఇరాన్ మరోలా..మరోవైపు ఇరాన్ అమెరికాతో చర్చలకు తాము ఎప్పుడూ దూరంగా లేమని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తెలిపారు. చర్చల సమయంలోనే తమపై మూడుసార్లు దాడులు జరిగాయని ఆరోపించారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ (IRGC) సీనియర్ సలహాదారు బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ రెజా నక్దీ మాత్రం అమెరికా ప్రభావం ఈ ప్రాంతంలో తగ్గుతోందని వ్యాఖ్యానించారు. ఇరాక్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు.అమెరికా భారీ సైనిక మోహరింపు, ట్రంప్ దూకుడు వ్యాఖ్యలు, హార్ముజ్ పరిణామాలు.. మొత్తం మీద మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. అనూహ్యంగా మధ్యవర్తులు ఎంట్రీ ఇచ్చి ఇరాన్–అమెరికా మధ్య మళ్లీ చర్చలను తెరపైకి తెస్తారా? లేదంటే మరోసారి సైనిక ఘర్షణ దిశగా పరిస్థితులు వెళ్తాయా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.ఇదీ చదవండి: ఫ్లైదుబాయ్ ఘటన.. అంతుచిక్కని ప్రశ్నలివే! -
మెట్టు దిగిన ఇరాన్?.. పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధానికి తెరదించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇరాన్ నేరుగా కాకుండా మధ్యవర్తుల ద్వారా మరోసారి చర్చలకు సిద్ధమయ్యాయి. సోమవారం ఇరు దేశాల అధికారులు మధ్యవర్తులతో వేర్వేరుగా సంప్రదింపులు జరిపారు. ఏడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు తాజా దౌత్య ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్చలు జరుగుతున్నాయి.ఇరాన్ గత వారం ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సందర్భంగా ప్రతిపాదించిన ఏడు రోజుల కాల్పుల విరమణ ప్రణాళికను కొద్దిగా సవరించి తాజా చర్చల్లో ముందుకు తీసుకెళ్లే అవకాశముంది. ఖతార్ మధ్యవర్తులు న్యూయార్క్‌లో ఉన్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో, అలాగే అమెరికా వర్గాలతో విడివిడిగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. యుద్ధంలో అమెరికాదే విజయం: ట్రంప్మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం యుద్ధం త్వరలోనే ముగుస్తుందని, అమెరికా గెలుస్తుందని వ్యాఖ్యానించారు. సోమవారం వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధికారులు మధ్యవర్తులతో చర్చలు జరిపినట్లు తెలిపారు. “మేం గెలవబోతున్నాం. నా వరకు ఇది ఎలాగైనా సరే జరుగుతుంది. చాలా త్వరగానే ఇది ముగిసిపోతుంది” అని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధంలో అమెరికా విజయం సాధించిన తర్వాత గ్యాస్ ధరలు కూడా గణనీయంగా తగ్గుతాయని చెప్పారు.ఇరాన్ కీలక ప్రతిపాదన ఇదే..ఇరాన్ ప్రతిపాదనలో ప్రధానంగా యుద్ధాన్ని నిలిపివేయడం, లెబనాన్‌లోనూ శత్రుత్వ చర్యలకు ముగింపు పలకడం, ఫ్రీజ్ చేసిన తమ బిలియన్ల డాలర్ల ఆస్తులను విడుదల చేయడం, ఇరాన్ చమురుపై ఆంక్షలను ఎత్తివేయడం వంటి అంశాలు ఉన్నాయి. అలాగే ఇరాన్ పోర్టులపై అమెరికా విధించిన నావికా దిగ్బంధాన్ని తొలగించాలని కోరుతోంది.దీనికి ప్రతిగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికాతో చర్చలను పునఃప్రారంభించేందుకు ప్రతిపాదించింది. శుద్ధిచేసిన యురేనియం అంశంపైనా చర్చలు జరపాలని అమెరికా కోరుతోంది. ..అయినా చర్చలకు గ్రీన్ సిగ్నల్ఇరాన్ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం తిరస్కరించినట్లు ప్రకటించారు. ఆర్థిక ఒత్తిడి కారణంగానే ఇరాన్ వేగంగా ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆదివారం ఇదే అంశంపై మాట్లాడుతూ.. ఈ వారంలో అమెరికా ప్రతినిధులు మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు. సోమవారం కూడా మధ్యవర్తులతో అమెరికా అధికారులు మాట్లాడినట్లు వైట్‌హౌస్‌లో ట్రంప్ వెల్లడించారు. మరోవైపు, అమెరికా అధికారికంగా తమ ప్రతిపాదనను తిరస్కరించిన సమాచారం తమకు ఇంకా అందలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ చెబుతున్నారు. వాషింగ్టన్ నుంచి స్పష్టమైన సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని ఆయన తెలిపారు. శాంతియుత పరిష్కారం కోరుకుంటే తాము ఇప్పటికే పరిష్కార మార్గాన్ని ప్రతిపాదించామని పేర్కొన్నారు. హర్ముజ్‌పైనే అసలు పట్టుప్రస్తుత చర్చల్లో హర్ముజ్ జలసంధి కీలక అంశంగా మారింది. ఈ మార్గం ద్వారా ప్రపంచ ఇంధన రవాణాలో భారీగా చమురు, ఎల్ఎన్జీ రవాణా జరుగుతుంది. యుద్ధం కారణంగా ఇక్కడ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడుతోంది. సోమవారం కూడా దౌత్య ప్రయత్నాలపై ఆశలు, యుద్ధంపై ఆందోళనల మధ్య చమురు ధరలు పెరిగాయి.గతంలో ఏప్రిల్, జూన్‌లో మధ్యవర్తుల ప్రయత్నాలతో కాల్పుల విరమణలు కుదిరినా అవి ఎక్కువకాలం కొనసాగలేదు. అయితే ఇప్పుడు ఇరాన్ మాత్రం తమ షరతులు నెరవేరిన తర్వాతే హర్ముజ్‌ను పూర్తిగా తెరిచే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. దీంతో తాజా మధ్యవర్తిత్వ చర్చలు యుద్ధానికి ముగింపు పలుకుతాయా? లేదంటే మరోసారి విఫలమవుతాయా?.. రాబోయే రోజుల్లో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది.ఇదీ చదవండి: ఎల్ నినో ఏం చేయబోతోందో తెలుసా? -
డూమ్స్‌డే వార్: ఇరాన్ బిగ్ వార్నింగ్.. ట్రంప్ రియాక్షన్ ఇదే
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ముగింపు కోసం దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. పరిస్థితులు మాత్రం మరోసారి ఉద్రిక్తంగా మారుతున్నాయి. హర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ ప్రతిపాదించిన ఏడు రోజుల రోడ్‌మ్యాప్‌ను అమెరికా తిరస్కరించడంతో.. అవసరమైతే భయానక యుద్ధాన్ని సైతం ఎదుర్కొనేందుకు తమ దేశం పూర్తిగా సిద్ధంగా ఉందని ఇరాన్ అంటోంది. ఈసారి యుద్ధం మొదలైతే అదీ ఎవరూ ఊహించని స్థాయిలో భీకరంగా మారొచ్చు అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. యుద్ధం పునఃప్రారంభమైతే అది ‘డూమ్స్‌డే వార్’(Doomsday War)ప్రళయం తరహా) స్థాయికి చేరినా ఎదుర్కొనేందుకు సిద్ధం అని అమెరికాను హెచ్చరించారాయన. అదే సమయంలో దౌత్యానికి తలుపులు మాత్రం మూసివేయలేదని చెప్పారు.హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, యుద్ధాన్ని ముగించే దిశగా ఇరాన్ ఏడు రోజుల ప్రణాళికను ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను అమెరికా తిరస్కరించింది. ఇరాన్ తమను ఫ్రీజ్ చేసిన బిలియన్ల డాలర్ల నిధులను విడుదల చేయాలని, ఆంక్షలను ఎత్తివేయాలని కోరిందని.. అందుకు తాము సిద్ధంగా లేమని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్జ్ తెలిపారు. ఇవి కేవలం అమెరికా విధించిన ఆంక్షలు కాదని, ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న ఆంక్షలని ఆయన పేర్కొన్నారు.‘యుద్ధం త్వరలో ముగుస్తుంది’.. ట్రంప్మరోవైపు.. ఆరాఘ్ఛి వార్నింగ్ వెలువడ్డ కాసేపటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఈ వారంలో ఇరాన్‌తో మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. యుద్ధంలో అమెరికా ‘త్వరలోనే విజయం సాధిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్ ప్రతిపాదనను తిరస్కరించినప్పటికీ దౌత్య మార్గాలు పూర్తిగా మూసుకుపోలేదని నిపుణులు చెబుతున్నారు.న్యూయార్క్‌లో ఐరాస సర్వసభ్య సమావేశాల సందర్భంగా ఇరాన్ ప్రతినిధులతో దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సెంటర్ ఫర్ మిడిల్ ఈస్ట్ స్ట్రాటజిక్ స్టడీస్ సీనియర్ పరిశోధకుడు అబ్బాస్ అస్లానీ తెలిపారు. మధ్యవర్తుల ద్వారా అమెరికా అధికారిక స్పందన కోసం ఇరాన్ ఎదురుచూస్తోందని చెప్పారు. ఇరుదేశాలు తమకు ఉన్న ప్రధాన ఒత్తిడి సాధనాలను ముందుగా ఎవరు వదులుకుంటారన్నదే ఇప్పుడు కీలకంగా మారిందని ఆయన విశ్లేషించారు.డ్రోన్ స్వాధీనం చేసుకున్నామన్న ఇరాన్ ప్రకటనపై..హర్ముజ్ జలసంధిలో అమెరికాకు చెందిన అధునాతన అండర్‌వాటర్ డ్రోన్‌ను ఇరాన్ సైన్యం స్వాధీనం చేసుకుందన్న వార్తలు కూడా ఉద్రిక్తతను పెంచాయి. అయితే ఇరాన్ చేసిన ఈ ప్రకటనను అమెరికా సైన్యం ఖండించింది. డ్రోన్ తమ ఆధీనంలోకి వెళ్లిందన్న వాదనలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. ఇరాన్‌పై అమెరికా దాడులకు ఉపయోగిస్తున్న బ్రిటన్‌లోని ఓ వైమానిక స్థావరం సమీపంలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పేలుడు పదార్థాలు, ఉగ్రవాదానికి సంబంధించిన నేరాల అనుమానంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాళ్లు ఇరాన్ పౌరులని తెలుస్తోంది.నస్రల్లా హంతకుల్ని శిక్షించాల్సిందేమరోవైపు హెజ్బొల్లా నేత హసన్ నస్రల్లా హత్యకు రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. నస్రల్లా హత్యను ‘క్షమించరాని నేరం’గా అభివర్ణించిన ఇరాన్ విదేశాంగ శాఖ.. బాధ్యులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని ప్రపంచ దేశాలను కోరింది. 2024 సెప్టెంబర్ 27న బీరుట్‌లోని దక్షిణ శివార్లపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో నస్రల్లా మరణించిన విషయం తెలిసిందే.మొత్తంగా హర్ముజ్ జలసంధి తెరవడం, ఆంక్షల ఎత్తివేత, అణు కార్యక్రమం వంటి అంశాలపై అమెరికా–ఇరాన్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఒకవైపు చర్చలకు అవకాశం ఉందన్న సంకేతాలు కనిపిస్తుండగా.. మరోవైపు యుద్ధం మళ్లీ మొదలైతే పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని ఇరాన్ హెచ్చరించడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది.ఇదీ చదవండి: భారత్-కెనడా బంధంలో కీలక ‘మలుపు’! -
బంతి అమెరికా కోర్టులో.. ఇరాన్ నెక్స్ట్ మూవ్ ఏంటి?
ఇరాన్–అమెరికా యుద్ధానికి తెరపడుతుందన్న ఆశలు మళ్లీ ఆవిరవుతున్నాయా? హర్ముజ్ జలసంధిని ఏడు రోజుల్లో తెరిచి.. యుద్ధాన్ని నిలిపివేసేందుకు ఇరాన్ ప్రతిపాదించిన ప్లాన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించాడనే కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఇదే నిజమైతే.. ఇప్పుడు ఇరాన్ తదుపరి అడుగు ఏంటి? హర్ముజ్ పరిస్థితి ఎలా మారుతుంది? యుద్ధం మళ్లీ తీవ్ర రూపం దాల్చుతుందా?.. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వేదికగా ఇరాన్ తన ప్రతిపాదనను అమెరికా ముందుంచింది. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఈ ప్రతిపాదనను వాషింగ్టన్కు పంపినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తెలిపారు. అమెరికా అంగీకరిస్తే ఏడు రోజుల కౌంట్‌డౌన్ మొదలై.. హర్ముజ్ జలసంధిలో సాధారణ నౌకాయానం పునరుద్ధరించవచ్చని చెప్పారు. అదే సమయంలో ప్రాంతీయంగా అన్ని రంగాల్లో పోరాటాన్ని నిలిపివేసి విస్తృత చర్చలకు వెళ్లొచ్చని ప్రతిపాదించారు.అయితే ఇందుకు ప్రతిగా అమెరికా ఇరాన్ పోర్టులపై దిగ్బంధాన్ని ఎత్తివేయాలని, స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయాలని, చమురు ఆంక్షలను తొలగించాలని ఇరాన్ కోరుతోంది. అణు కార్యక్రమంపై మాత్రం తమ హక్కుల్లో ఎలాంటి రాయితీ ఇవ్వబోమని ఇరాన్ వర్గాలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా యురేనియం శుద్ధి విషయంలో రాజీ ఉండదని తెలిపాయి.ట్రంప్ తిరస్కరిస్తే.. తర్వాత?‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ కథనం ప్రకారం.. ఇరాన్ తన డిమాండ్లను అంగీకరిస్తుందన్న నమ్మకం ట్రంప్‌కు లేదని, తిరిగి బాంబుల దాడి చేసే అవకాశం ఉందని ఆయన తన సిబ్బందితో చెప్పినట్లు అమెరికా అధికారులు పేర్కొన్నారు. మరో నివేదిక ప్రకారం.. నవంబర్‌లో జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత బాంబుల దాడులు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాన్ని ట్రంప్ అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. గతంలోనూ చర్చల ప్రయత్నాలు విఫలమై.. కొంతకాలం కాల్పుల విరమణ తర్వాత మళ్లీ దాడులు జరిగిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.హర్ముజ్ సంగతేంటి?ఇరాన్ ప్రతిపాదనలో కీలక అంశం హర్ముజ్ జలసంధి. ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటైన ఈ జలసంధి ద్వారా రవాణా తీవ్రంగా దెబ్బతినడంతో ఇప్పటికే ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడింది. అమెరికా–ఇరాన్ మధ్య ఒప్పందం కుదరకపోతే హర్ముజ్ పరిస్థితి మరింత కాలం అనిశ్చితంగానే కొనసాగే అవకాశం ఉంది. ఇరాన్ మాత్రం అమెరికా తమపై సైనిక ఒత్తిడి తగ్గించి, పోర్టుల దిగ్బంధాన్ని ఎత్తివేస్తే ఏడు రోజుల్లో జలసంధిని తిరిగి తెరవడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతోంది. అంటే ఇప్పుడు బంతి అమెరికా కోర్టులోనే ఉందన్నది ఇరాన్ వాదన.ఇరాన్ ముందున్న దారులేంటి?అమెరికా తన ప్రతిపాదనను అంగీకరించకపోతే ఇరాన్ ముందున్న మార్గాలు ప్రధానంగా మూడు. మొదటిది.. దౌత్య మార్గాన్ని కొనసాగిస్తూ ఖతార్, ఒమన్ వంటి మధ్యవర్తుల ద్వారా చర్చలను ముందుకు తీసుకెళ్లడం. రెండోది.. హర్ముజ్ జలసంధిపై తన నియంత్రణను కొనసాగిస్తూ అమెరికాపై ఒత్తిడి పెంచడం. అయితే ఇది ప్రపంచ ఇంధన సరఫరాపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఇరాన్‌కూ ఆర్థిక, దౌత్యపరమైన ఒత్తిళ్లు పెరగొచ్చు. మూడోది.. అమెరికా సైనిక చర్యలకు ప్రతిస్పందిస్తూ ప్రాంతీయంగా తన మిత్ర బలగాల ద్వారా ఒత్తిడి పెంచడం. కానీ ఈ మార్గం యుద్ధం మరింత విస్తరించే ప్రమాదాన్ని పెంచుతుంది. మరోవైపు ఏడు రోజుల ప్రతిపాదనను ముందుకు తెచ్చిన ఇరాన్.. హర్ముజ్‌ను తిరిగి తెరవడం, కాల్పుల విరమణ, తదుపరి అణు చర్చలను ఒకే ప్యాకేజీగా మలచాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. అందువల్ల అమెరికా స్పందన ఆధారంగా ఈ మూడు మార్గాల్లో ఏది ముందుకు వస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.మరోవైపు సౌదీపై హౌతీల దాడులుఇదిలా ఉండగా.. ఇరాన్ మద్దతుగల యెమెన్ హౌతీలు సౌదీ అరేబియాపై దాడులు కొనసాగిస్తున్నారు. రియాద్ వైపు వచ్చిన రెండు డ్రోన్లను, ఖమీస్ ముషైత్ వైపు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్నట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణం తెలిపింది. ఈ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా భద్రతకు మద్దతుగా పాకిస్థాన్, టర్కీ రక్షణాధికారులు రియాద్‌లో సమావేశమై భద్రతా పరిస్థితిపై చర్చించారు.ఇరాన్ ప్రతిపాదనకు అమెరికా స్పందన ఎలా ఉండబోతోంది? ట్రంప్ వైఖరి నేపథ్యంలో హర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందా? లేదంటే పశ్చిమాసియాలో పోరాటం మళ్లీ ముదురుతుందా? అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ఇరాన్ ఏడు రోజుల గడువుతో శాంతి ప్రతిపాదనను ముందుకు తెచ్చిన నేపథ్యంలో.. తదుపరి నిర్ణయం అమెరికా చేతుల్లోనే ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఇదీ చదవండి: ట్రంపరితనంతో మళ్లీ బాంబుల మోతేనా? -
హార్ముజ్ కోసం ట్రంప్–ఇరాన్ కీలక బేరం!
అమెరికా–ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలకు తెరదించే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల నేపథ్యంలో ఇరు దేశాల ప్రతినిధులు దశలవారీ ఒప్పందంపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా అమెరికా ఇరాన్‌పై విధించిన ఆర్థిక దిగ్బంధనాన్ని సడలిస్తే.. ఇరాన్ వ్యూహాత్మకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇన్నాళ్లూ కత్తులు దూసుకున్న అమెరికా–ఇరాన్ ఇప్పుడు ఒకే టేబుల్ వద్దకు వచ్చాయి. యుద్ధాన్ని ఆపేందుకు జరుగుతున్న చర్చల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇరు దేశాల చేతుల్లో ఉన్న రెండు బలమైన అస్త్రాలే ఇప్పుడు బేరసారాలకు వచ్చాయి. ఒకటి అమెరికా ఆంక్షలు.. మరొకటి ఇరాన్ చేతిలో ఉన్న హార్ముజ్ జలసంధి!ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ప్రధాన బేరసారాల అంశంగా మారింది. హార్ముజ్ ద్వారా నౌకల రాకపోకలు స్వేచ్ఛగా సాగాలని అమెరికా కోరుతోంది. మరోవైపు తమ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్న అమెరికా ఆంక్షలు, దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. స్తంభించిన పరిస్థితిని దశలవారీగా పరిష్కరించడమే సాధ్యమైన మార్గమని ఇరాన్‌కు చెందిన సీనియర్ అధికారి పేర్కొన్నట్లు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది.ప్రతిపాదిత ఒప్పందంలో తొలి దశగా ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై విధించిన ఆర్థిక దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, దానికి ప్రతిగా టెహ్రాన్ హార్ముజ్ మీదుగా నౌకల రాకపోకలను పునరుద్ధరించడం ఉండొచ్చని ఆ కథనం తెలిపింది. అంతేకాకుండా విదేశాల్లో ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తులను మోక్షం కల్పించే అంశాన్ని కూడా టెహ్రాన్ కోరవచ్చని తెలుస్తోంది.ట్రంప్ ప్రభుత్వం ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తే.. ఇరాన్ ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన జలమార్గాన్ని తెరవాలన్నది ప్రతిపాదన. అయితే ఇది తుది శాంతి ఒప్పందం కాకపోవచ్చని, గత జూలైలో కుదిరిన అవగాహన విఫలమైన నేపథ్యంలో ఈసారి ఇరు దేశాల రాయితీలు ఎంతకాలం అమల్లో ఉంటాయన్నదే కీలకమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.హార్ముజ్ తెరవడానికి ఇరాన్ రెడీ.. కానీ!అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించి, ఇరాన్ నౌకాశ్రయాలపై దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే వారం రోజుల్లోనే హార్ముజ్‌ను తిరిగి తెరవడానికి సిద్ధంగా ఉందట. ఈ ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా సెప్టెంబర్ 16న ట్రంప్ ప్రభుత్వానికి చేరవేసినట్లు తెలుస్తోంది. అయితే అసలు చిక్కు ఇక్కడే ఉంది.తమ వద్ద ఉన్న బలమైన బేరసారాల అస్త్రాన్ని ముందుగా వదులుకోవడానికి ట్రంప్ ప్రభుత్వం, ఇరాన్ రెండూ సిద్ధంగా లేవు. అమెరికా వద్ద ఆర్థిక ఆంక్షలు, దిగ్బంధనం ప్రధాన ఒత్తిడి సాధనాలైతే.. ఇరాన్ చేతిలో హార్ముజ్ జలసంధి ఉంది. దీంతో ఎవరు ముందుగా మెట్టు దిగాలన్నదే చర్చల్లో కీలకంగా మారింది.ట్రంప్ ఒత్తిడి.. ఇరాన్ ప్రతిఘటనట్రంప్ ప్రభుత్వం మాత్రం టెహ్రాన్‌పై ఒత్తిడి తగ్గించే సంకేతాలు ఇవ్వడం లేదు. ఇరాన్ చమురు ఎగుమతులను దెబ్బతీసే ఆంక్షలకు తోడు ఈ నెలలో ఆ దేశ వాణిజ్య విమానయాన సంస్థలు, వాటి సహాయక నెట్‌వర్క్‌లపైనా అమెరికా చర్యలు తీసుకుంది. ఒప్పందానికి రాకపోతే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణిస్తుందని ట్రంప్ హెచ్చరించారు.మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. అమెరికా తమపై విధించిన ఆర్థిక, సైనిక ఒత్తిడిని ముందుగా తగ్గించాలని టెహ్రాన్ కోరుతోంది. ‘‘మా వేళ్లు ట్రిగ్గర్‌పైనే ఉన్నాయి’’ అని పదే పదే చెబుతూ వస్తుండడం.. పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో వెల్లడిస్తోంది.ట్రాన్సిట్ ఫీజుపై ఇరాన్ మెట్టు దిగుతుందా?హార్ముజ్ మీదుగా వెళ్లే నౌకల నుంచి ట్రాన్సిట్ ఫీజు వసూలు చేయాలన్న తన డిమాండ్‌ను ప్రధాన ఒప్పందం నుంచి పక్కన పెట్టేందుకు ఇరాన్ సిద్ధంగా ఉన్నట్లు ప్రాంతీయ వర్గాలు చెబుతున్నాయి. ఆ అంశాన్ని ప్రత్యేక అనుబంధంలో చేర్చే అవకాశం ఉందని సమాచారం. గల్ఫ్ దేశాలు మాత్రం ఇలాంటి రుసుముల చెల్లింపును వ్యతిరేకిస్తున్నాయి.అయితే ఫీజు అంశాన్ని పక్కన పెట్టడం అంటే.. హార్ముజ్‌పై తన నియంత్రణను ఇరాన్ వదులుకున్నట్లు కాదని సంబంధిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ప్రధాన డీల్‌లో మాత్రం ముందుగా హార్ముజ్ రాకపోకలను పునరుద్ధరించడంపైనే దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది.ఎన్నికల తర్వాతే డీల్?అమెరికా మధ్యంతర ఎన్నికలు నవంబర్ 3న జరగనున్నాయి. ఈ ఎన్నికల తర్వాత అమెరికా–ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ ఇప్పటికే చెప్పారు. అయితే న్యూయార్క్‌లో ఇప్పుడు చర్చలు మళ్లీ వేగం పుంజుకోవడంతో.. ఎన్నికలకు ముందే ఏదైనా తాత్కాలిక అవగాహన కుదురుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.ఇరాన్ మాత్రం తమ డిమాండ్ల జాబితా చాలా పెద్దదేనని సంకేతాలిస్తోంది. దీంతో ట్రంప్ ప్రభుత్వం ఎంత మేరకు ఆర్థిక ఆంక్షలను సడలిస్తుంది? దానికి ప్రతిగా ఇరాన్ హార్ముజ్‌పై ఎలాంటి హామీ ఇస్తుంది? అన్నదే కీలకంగా మారింది.గల్ఫ్ దేశాలకూ టెన్షన్అమెరికా–ఇరాన్ చర్చలను గల్ఫ్ దేశాలు కూడా నిశితంగా గమనిస్తున్నాయి. హార్ముజ్‌పై ఇరాన్‌కు శాశ్వత నియంత్రణ కల్పించే ఏ ఒప్పందాన్నైనా అవి వ్యతిరేకిస్తున్నాయి. అదే సమయంలో యుద్ధం మరింత విస్తరించకుండా ఉద్రిక్తతలు తగ్గాలని కోరుకుంటున్నాయి. ఎందుకంటే హార్ముజ్ కేవలం ఇరాన్–అమెరికా మధ్య బేరసారాల అంశం కాదు. ప్రపంచ ఇంధన రవాణాకు ఇది అత్యంత కీలకమైన మార్గం. ఈ జలసంధిలో నౌకల రాకపోకలు సాధారణ స్థితికి వస్తే అంతర్జాతీయ చమురు సరఫరాపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ట్రంప్–ఇరాన్ చర్చల్లో ఏ చిన్న పురోగతినైనా గల్ఫ్ దేశాలు, ఇంధన మార్కెట్లు నిశితంగా గమనిస్తున్నాయి.ఇదీ చదవండి: మీకు దణ్ణం పెడతాం.. ఏఐని ఆపండి -
ఇరాన్‌తో 3 గంటల చర్చలు.. గుడ్‌న్యూస్ చెప్పిన ట్రంప్
అమెరికా–ఇరాన్ మధ్య దాదాపు ఏడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి తెరపడే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ వేదికగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి మధ్య సుమారు మూడు గంటలపాటు సమావేశం జరిగినట్లు ఇరు వర్గాలు ధ్రువీకరించాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సమావేశంలో నేరుగా పాల్గొనలేదు. ఆయన రాయబారులు, ఇరాన్ ప్రతినిధులు మధ్యే చర్చలు సాగాయి. ఈ భేటీపై ట్రంప్ మాత్రం సానుకూల వ్యాఖ్యలు చేశారు. అమెరికా–ఇరాన్ ప్రతినిధుల మధ్య జరిగిన సమావేశం ‘చాలా బాగుంది’ అని ఆయన చెప్పారు. ఇరాన్‌కు ఒప్పందం చేసుకోవడం ప్రయోజనకరమని వ్యాఖ్యానించారు.మరోవైపు విట్కాఫ్ కూడా చర్చలు సుదీర్ఘంగా జరిగాయని, అవి నిర్మాణాత్మకంగా ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. మధ్యవర్తుల ద్వారా ఇరు వర్గాల మధ్య చర్చలు కొనసాగుతాయని చెప్పారు.హర్ముజ్ తెరవాలంటే మూడు షరతులుఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం హర్ముజ్ జలసంధి. ప్రపంచంలోని కీలక చమురు రవాణా మార్గాల్లో ఒకటైన ఈ జలసంధి ద్వారా భారీ స్థాయిలో చమురు, గ్యాస్ రవాణా జరుగుతుంది. యుద్ధం కారణంగా ఇక్కడ రవాణా తీవ్రంగా దెబ్బతినడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడుతోంది. అయితే జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ అమెరికా ముందు మూడు ప్రధాన షరతులు పెట్టినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.మొదటిది.. ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేయాలి.రెండోది.. అమెరికా వద్ద స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలి.మూడోది.. ఇరాన్ మద్దతు ఉన్న వివిధ ‘రెసిస్టెన్స్ ఫ్రంట్ల’పై కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించాలి.ఈ షరతులను నెరవేర్చినట్లయితే హర్ముజ్ జలసంధిని ఏడు రోజుల్లో తిరిగి తెరవగలమని ఇరాన్ గతంలోనే మధ్యవర్తుల ద్వారా అమెరికాకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.ఆ విషయంలో ట్రంప్ ‘నో’మరోవైపు ట్రంప్ వైఖరిలో మాత్రం కీలకమైన అంశం మారలేదు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని పొందకూడదని ఆయన స్పష్టం చేశారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన సమయంలో కూడా ఇరాన్ విషయంలో తన ముందు రెండు మార్గాలున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒకటి ఒప్పందం చేసుకుని ఇరాన్ భవిష్యత్తును మార్చడం.. మరో మార్గం తీవ్ర సైనిక చర్య అని హెచ్చరించారు.అయితే అదే సమయంలో ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు. ‘ఎలాగైనా ఒప్పందం కుదుర్చుకుంటాం.. వేగంగా పూర్తి చేస్తాం’ అన్నట్టుగా వ్యాఖ్యానించారు. దీంతో ట్రంప్ ఒకవైపు కఠిన హెచ్చరికలు చేస్తూనే.. మరోవైపు చర్చలకు తలుపులు తెరిచి ఉంచిన పరిస్థితి కనిపిస్తోంది.వాళ్లే ముందడుగు వేయాలిఇరాన్ వైపు నుంచి కూడా తాజాగా దౌత్యానికి అవకాశం ఉందన్న సంకేతాలు వచ్చాయి. అమెరికా నిజంగా సమస్యను దౌత్యపరంగా పరిష్కరించాలనుకుంటున్నట్లు అధికారికంగా స్పష్టం చేయాలని, ఆ తర్వాత చర్చలకు విధివిధానాలు, షెడ్యూల్ ఖరారు చేయాలని ఇరాన్ కోరుతోంది.ఇక హర్ముజ్ విషయంలోనూ ఇదే వైఖరిని ఇరాన్ అవలంబిస్తోంది. అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించి, దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే ఏడు రోజుల్లో జలసంధిని తెరవడానికి సిద్ధమని చెబుతోంది. అంటే ముందుగా అమెరికా చర్య తీసుకోవాలి.. ఆ తర్వాతే హర్ముజ్ తెరుచుకుంటుందన్నది ఇరాన్ ప్రతిపాదన.ఇప్పట్లో డీల్ కష్టమేనా?మూడు గంటల చర్చలు జరిగినప్పటికీ అమెరికా–ఇరాన్ మధ్య ఎలాంటి తుది ఒప్పందం కుదరలేదు. సమావేశంలో కొన్ని షరతులు, యుద్ధం ముగింపు మార్గాలు, హర్ముజ్ పునఃప్రారంభం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. రానున్న రోజుల్లో మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది.ప్రస్తుతం పరిస్థితి ‘యుద్ధం నుంచి చర్చల వైపు అడుగు’ వేసినంతవరకే ఉంది. అమెరికా తన సైనిక, ఆర్థిక ఒత్తిడిని తగ్గించాలన్నది ఇరాన్ డిమాండ్ కాగా.. ఇరాన్ అణ్వాయుధం దిశగా వెళ్లకుండా హామీ ఇవ్వాలన్నది ట్రంప్ ప్రధాన డిమాండ్. ఈ రెండు వైఖరుల మధ్యే అసలు పేచీ ఉంది.ప్రపంచం చూపు హర్ముజ్‌పైనే..హర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందా లేదా అన్నదే ఇప్పుడు అంతర్జాతీయంగా కీలకంగా మారింది. యుద్ధం కారణంగా ఈ మార్గంలో ఇంధన రవాణా దెబ్బతినడంతో చమురు మార్కెట్లలో ఆందోళన పెరిగింది. మరోవైపు సౌదీ అరేబియా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు ఎగుమతులను కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. అమెరికా కూడా హర్ముజ్‌పై ఆధారాన్ని తగ్గించేందుకు గల్ఫ్ దేశాలతో ప్రత్యామ్నాయ ఇంధన రవాణా మౌలిక వసతులపై చర్చలు జరుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యూయార్క్‌లో జరిగిన ఈ మూడు గంటల భేటీకి ప్రాధాన్యత పెరిగింది. తదుపరి చర్చల్లో ఈ రెండు వైఖరుల మధ్య ఎంతవరకు సయోధ్య కుదురుతుందన్నదే అసలు కీలకం కానుంది.ఇదీ చదవండి: నా మాట వినకపోతే మీ గతి అదోగతే! -
హౌతీల దూకుడు.. ట్రంప్ ప్లాన్ ఢమాల్!
పశ్చిమాసియాలో ఇప్పటికే ఇరాన్–అమెరికా యుద్ధంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. యెమెన్‌లో హౌతీల దూకుడు ఆ ప్రాంతాన్ని మరో సంక్షోభంలోకి నెడుతోంది. ఇరాన్ మద్దతున్న హౌతీలు ఎర్ర సముద్రం తీరంలో వేగంగా ముందుకు సాగుతూ కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు వారి చూపు వ్యూహాత్మక పర్వతాలపై పడింది. మరోవైపు హౌతీలను అడ్డుకునేందుకు అమెరికా సాయం కోరిన యెమెన్ ప్రభుత్వం.. ట్రంప్ నుంచి మాత్రం ప్రత్యక్ష హామీ పొందలేకపోయింది.హౌతీలపై అమెరికా నేరుగా దాడి చేయబోతోందనే పరిస్థితి చివరి నిమిషంలో మారిపోయింది. పక్కా సమాచారం ప్రకారం.. ఆదివారం హౌతీలపై వైమానిక దాడులు చేయడానికి ట్రంప్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. హౌతీల స్థావరాలపై దాడులు చేసేందుకు విమానాల్లో బాంబులు ఎక్కిస్తున్న సమయంలోనే ట్రంప్ వాటిని నిలిపివేయాలని ఆదేశించారు. అంటే.. హౌతీలపై అమెరికా సైనిక చర్యకు సిద్ధమైనా.. ఆఖరి క్షణంలో ఆ ప్లాన్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇటు అమెరికా సెంట్రల్ కమాండ్ అటు వైట్‌హౌస్ రెండూ ఇప్పటికీ స్పందించలేదు.ఇదే సమయంలో సౌదీ మద్దతు ఉన్న యెమెన్ ప్రభుత్వం అమెరికా సాయం కోరింది. ఆ దేశ అధ్యక్షుడు రషాద్ అల్ అలీమి, ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడారు. అయితే ట్రంప్ ఎలాంటి ప్రత్యక్ష సైనిక మద్దతు హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.ఇప్పుడు పర్వతాలే టార్గెట్హౌతీల తాజా వ్యూహం యెమెన్‌లో పరిస్థితిని మరింత కీలకంగా మార్చేలా కనిపిస్తోంది. ఈ నెలలో ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో వేగంగా ముందుకు సాగిన హౌతీలు.. ఇప్పుడు తైజ్, లహిజ్ ప్రావిన్సుల మధ్య ఉన్న కహ్బూబ్ పర్వతాల వైపు కదులుతున్నారు. ఈ ఎత్తైన ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటే ఎర్ర సముద్ర తీరాన్ని దక్షిణ యెమెన్‌లో ప్రభుత్వ ఆధీనంలోని ప్రాంతాల నుంచి వేరు చేసే అవకాశం ఉంటుంది.అల్-వజియాహ్ పర్వత ప్రాంతం, బాబ్ ఎల్ మండెబ్ జలసంధి సమీపంలోని రాస్ అల్-అరా ప్రాంతాల్లో పోరు తీవ్రంగా సాగుతున్నట్లు సమాచారం. మరీ ముఖ్యంగా బాబ్ ఎల్ మండెబ్ రీజియన్‌పై పట్టు కోల్పోయాక.. యెమెన్ రక్షణాత్మక ధోరణి ప్రదర్శిస్తోందనే విశ్లేషణలు నడుస్తున్నాయి.700 మంది మృతి.. 1.30 లక్షల మంది నిరాశ్రయులుహౌతీల తాజా దాడులతో యెమెన్‌లో మానవతా పరిస్థితి కూడా విషమిస్తోంది. తాజా పోరులో దాదాపు 700 మంది మరణించగా.. వేలాది మంది గాయపడ్డారు. సుమారు 1,30,000 మంది యెమెన్లోనే నిరాశ్రయులయ్యారు. మరో 3,000 మందికి పైగా ఎర్ర సముద్రం దాటి పడవల్లో ఆఫ్రికా వైపు వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి గణాంకాలను ఉటంకిస్తూ కథనం పేర్కొంది.హౌతీలను అడ్డుకునేందుకు సౌదీ అరేబియా కూడా రంగంలోకి దిగింది. హౌతీల స్థావరాలపై వందలాది వైమానిక దాడులు చేసింది. అయినప్పటికీ పర్వత ప్రాంతాల్లో హౌతీలను వెనక్కి నెట్టడం సౌదీ బలగాలకు సవాలుగా మారింది.సౌదీ చమురు ఎగుమతులకు కొత్త చిక్కుయెమెన్లో జరుగుతున్న పోరుకు మరో కీలక కోణం ఉంది. అది చమురు రవాణా. బాబ్ ఎల్ మండెబ్ ప్రాంతంలో హౌతీల పట్టు బలపడితే.. హర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడే అంతరాయాలను తప్పించుకునేందుకు సౌదీ ఉపయోగించే ప్రత్యామ్నాయ చమురు మార్గానికి ఇబ్బంది కలగొచ్చు. దీంతో సౌదీ ఇప్పటికే హర్ముజ్ మీదుగా మరిన్ని చమురు రవాణాలను పెంచింది.ఆగస్టులో రోజుకు సుమారు 7 లక్షల బ్యారెళ్లుగా ఉన్న సౌదీ చమురు ఎగుమతులు హర్ముజ్ మీదుగా ఇటీవలి రోజుల్లో 29 లక్షల బ్యారెళ్లకు చేరినట్లు ఉపగ్రహ డేటా తెలియజేస్తోంది. యుద్ధ పరిస్థితుల్లో హర్ముజ్ మార్గంలో రవాణా ఖర్చులు కూడా భారీగా పెరిగినట్లు పేర్కొంది.అమెరికాకు పెరుగుతున్న ఒత్తిడిహౌతీల దూకుడు ట్రంప్ ప్రభుత్వాన్ని చిక్కులో పడేస్తోంది. ఒకవైపు సౌదీ అరేబియా తమకు మద్దతుగా అమెరికా సైనిక జోక్యం చేసుకోవాలని కోరుతోంది. మరోవైపు యెమెన్‌లో ప్రత్యక్షంగా మరో యుద్ధంలోకి దిగితే ఈ ఘర్షణ మరింత విస్తరించే అవకాశం ఉంది.గతంలో 2025 ప్రారంభంలో అమెరికా రెండు నెలల పాటు హౌతీలపై దాడులు చేసినప్పటికీ.. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ట్రంప్ వాటిని నిలిపివేశారు. అప్పటి నుంచి యెమెన్ ఘర్షణలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు మరోసారి హౌతీలపై దాడులకు సిద్ధమై.. విమానాల్లో బాంబులు ఎక్కించే దశకు వెళ్లిన అమెరికా.. ట్రంప్ ఆదేశాలతో చివరి నిమిషంలో ఆ చర్యను నిలిపివేసినట్లు వచ్చిన వార్తలు ఆసక్తి రేపుతున్నాయి.అదే సమయంలో హౌతీలు మాత్రం వ్యూహాత్మక ఎత్తైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని తమ ఆధిపత్యాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఒకవైపు హౌతీల దూకుడు కొనసాగుతుండగా.. మరోవైపు వారిపై సైనిక చర్యకు సిద్ధమైన ట్రంప్ ప్రభుత్వం చివరి నిమిషంలో వెనక్కి తగ్గడం యెమెన్ సంక్షోభంలో కీలక పరిణామంగా మారింది.ఇటు హర్ముజ్‌లోనూ ఉద్రిక్తతఇటు హర్ముజ్ జలసంధిలోనూ ఉద్రిక్తత కొనసాగుతోంది. బ్రిటన్ సముద్ర భద్రత సంస్థ యూకేఎంటీవో (UKMTO) ప్రకారం.. జలసంధిలోకి వెళ్తున్న ఓ నౌకపై ప్రాజెక్టైల్ దాడి జరగడంతో సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. మరో గ్యాస్ ట్యాంకర్‌పై కూడా దాడి జరిగినట్లు సమాచారం.ఇరాన్–అమెరికా మధ్య దౌత్య ప్రయత్నాలు కూడా నిలిచిపోయిన పరిస్థితుల్లో యెమెన్‌లో హౌతీల దూకుడు.. మిడిల్ ఈస్ట్ వార్‌కు మరో కీలక ఫ్రంట్‌ను జోడించింది. హౌతీలపై దాడులకు సిద్ధమైన అమెరికా చివరి నిమిషంలో ఆ ప్రణాళికను ఎందుకు నిలిపివేసిందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. అమెరికా ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతుందా? లేదంటే సౌదీ, యెమెన్ బలగాలకే మద్దతు పరిమితం చేస్తుందా? అన్నది చూడాలి.ఇదీ చదవండి: అమెరికా వర్సెస్ చైనా.. ఇప్పుడు ఓ కొత్త వార్ -
ఇరాన్ చుట్టూ ఉచ్చు.. మూడు వైపులా టెన్షన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి వేడెక్కాయి. ఒకవైపు అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరగా.. మరోవైపు ఇరాన్ మద్దతున్న హౌతీలు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌పై క్షిపణులు, డ్రోన్లతో దాడికి దిగారు. ఇదే సమయంలో ఇరాన్–ఫ్రాన్స్ మధ్య దౌత్య వివాదం కూడా ముదురుతోంది. దీంతో ఇప్పటికే నెలలుగా కొనసాగుతున్న ప్రాంతీయ సంక్షోభం కొత్త మలుపు తీసుకుంటోంది.అమెరికా కొత్త దాడికి సిద్ధమవుతోందన్న సమాచారం తమ వద్ద ఉందని ఇరాన్ సైన్యం ప్రకటించింది. అమెరికా లేదా దాని మిత్రదేశాలు మరోసారి దాడి చేస్తే.. ఈసారి ప్రతిస్పందన పరిమితం కాదని, అమెరికా స్థావరాలు.. ప్రయోజనాలపై సుదీర్ఘంగా దాడులు కొనసాగిస్తామని ఇరాన్ సైనిక కమాండ్ హెచ్చరించింది. అమెరికా మిత్రదేశాలను కూడా ఈ ఘర్షణలో భాగస్వాములుగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది.మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్‌పై ఒత్తిడి పెంచారు. ఒప్పందానికి ముందుకు రావాలని.. లేదంటే ఇరాన్ ఆర్థికంగా మరింత కుదేలవుతుందని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఈ వారంలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి న్యూయార్క్ వెళ్లనున్న నేపథ్యంలో ఆయనతో భేటీకి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ చెప్పడం గమనార్హం. రియాద్‌పై హౌతీల మెరుపుదాడిఇదిలా ఉండగానే యెమెన్‌లోని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు సౌదీ రాజధాని రియాద్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. సెప్టెంబర్ 19న క్షిపణి, డ్రోన్లతో దాడి ప్రయత్నం జరిగినట్లు సౌదీ అరేబియా ధ్రువీకరించింది. రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడుతో దట్టమైన పొగ అలుముకుంది. అయితే సౌదీ నేతృత్వంలోని కూటమి ఆ దాడిని అడ్డుకున్నట్లు తెలిపింది. పెద్దగా నష్టమూ జరగలేదని వెల్లడించింది. హౌతీలు రియాద్‌తో పాటు యాన్బు, తాయిఫ్, బైష్, ఫరాసాన్ ప్రాంతాల్లోనూ దాడులకు ప్రయత్నించినట్లు సమాచారం. యాన్బు సౌదీ చమురు ఎగుమతులకు కీలక కేంద్రం కావడంతో ఈ దాడులు మరింత ఆందోళనకు కారణమయ్యాయి. ఎందుకంత కీలకం బాబ్-ఎల్-మండేబ్..యెమెన్‌లో హౌతీల దూకుడు ఇటీవలి రోజుల్లో మరింత పెరిగింది. వ్యూహాత్మకమైన మొఖా ప్రాంతంతో పాటు బాబ్ ఎల్ మందెబ్ జలసంధికి సమీప ప్రాంతాలపై వారి పట్టు పెరిగింది. ఈ మార్గం ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌తో కలుపుతుంది. ఆసియా–యూరప్ మధ్య నౌకాయానానికి ఇది కీలకమైన మార్గం.ఇప్పటికే హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఆంక్షల కారణంగా ఇంధన రవాణాపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఇప్పుడు బాబ్ ఎల్ వద్ద కూడా భద్రతా సమస్యలు పెరగడంతో ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళన మరింత పెరిగింది. హౌతీల దాడుల నేపథ్యంలో సౌదీ చమురు ఎగుమతుల మార్గాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. తాజా పరిణామాల్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగానే కొనసాగుతోంది. చైనాకు కూడా టెన్షన్.. ఇరాన్‌పై ఒత్తిడిహౌతీల దూకుడుతో సౌదీ మాత్రమే కాకుండా చైనా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనం ఇచ్చింది. సౌదీ విజ్ఞప్తి నేపథ్యంలో హౌతీలను అదుపులో ఉంచేందుకు ఇరాన్‌పై చైనా ప్రైవేటుగా ఒత్తిడి తెచ్చినట్లు మూడు ఇరాన్ వర్గాలను ఉటంకిస్తూ ఆ వార్తను ప్రచురించింది. ఎర్ర సముద్ర మార్గం చైనా వాణిజ్యానికి కూడా కీలకం కావడంతో ఈ పరిణామాలను బీజింగ్ నిశితంగా గమనిస్తోంది. ఇటు ఫ్రాన్స్‌తోనూ కొత్త వివాదంఇక ఇరాన్–ఫ్రాన్స్ సంబంధాల్లోనూ కొత్త చిచ్చు రేగింది. టెహ్రాన్‌లో ఫ్రెంచ్ రాయబార కార్యాలయానికి అనుబంధంగా ఉన్న ఫ్రెంచ్ భాషా కేంద్రాన్ని ఇరాన్ అధికారులు మూసివేశారు. సరైన లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు జాతీయ భద్రతకు వ్యతిరేకమైన చర్యలకు పాల్పడిందని ఇరాన్ ఆరోపించింది. వ్యక్తుల నెట్‌వర్క్‌లను నిర్మించడం, నైపుణ్యం ఉన్న ఇరానియన్లు దేశం విడిచి వెళ్లేందుకు సహకరించడం వంటి ఆరోపణలను కూడా చేసింది. అయితే ఫ్రాన్స్ ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. తమ సాంస్కృతిక సంస్థలపై మరో దాడిగా అభివర్ణించింది. ఇరాన్ రాయబారిని పిలిపించి వివరణ కోరనున్నట్లు ప్రకటించింది. ఈ వివాదం ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఉన్న దౌత్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. ‘మొసలి కన్నీరు’ అంటూ ఫైర్ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారో ఇరాన్లో మానవ హక్కుల పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తీవ్రంగా స్పందించారు. ఫ్రాన్స్ గతంలో అల్జీరియాలో చేసిన చర్యలను ప్రస్తావిస్తూ.. ఇరాన్‌పై ఇప్పుడు సానుభూతి చూపడం ‘మొసలి కన్నీరు’ అంటూ బారోను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా దాడుల్లో ఇరాన్ పాఠశాల విద్యార్థులు చనిపోయిన సమయంలో ఫ్రాన్స్ మౌనం వహించిందని కూడా అరాఘ్చీ ఆరోపించారు.ఒకవైపు చర్చలు.. మరోవైపు దాడులుఇలా చూస్తే ప్రస్తుతం ఇరాన్ చుట్టూ ఒకేసారి పలు స్థాయిల్లో ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి. అమెరికాతో ప్రత్యక్ష ఘర్షణ మళ్లీ ముదిరే సంకేతాలు, సౌదీపై హౌతీల దాడులు, హర్ముజ్–బాబ్ ఎల్ మండేబ్ జలమార్గాలపై ఒత్తిడి, ఫ్రాన్స్‌తో దౌత్య వివాదం.. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడుతున్నాయి.అయితే ఇదే సమయంలో చర్చలకు అవకాశం పూర్తిగా మూసుకుపోలేదు. ట్రంప్–ఇరాన్ మధ్య కఠిన ప్రకటనలు కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్ అధ్యక్షుడితో భేటీకి ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు చెప్పడం దౌత్య మార్గం ఇంకా తెరిచే ఉందనే సంకేతంగా నిలుస్తోంది. మరోవైపు హౌతీలను నియంత్రించేందుకు చైనా ప్రయత్నాలు కూడా తెరవెనుక దౌత్యం కొనసాగుతున్నట్లు సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: ఆ ఏడు కండీషన్స్‌తో ఇరాన్ యుద్ధం ముగిసేనా? -
పాక్‌లో ఇంధన సంక్షోభం.. లీటర్ పెట్రోల్ 400 పైమాటే!
పాకిస్థాన్‌లో భారీ ఇంధన సంక్షోభం నెలకొంది. శుక్రవారం రాత్రి ప్రకటించిన తాజా ధరల సవరణ ప్రకారం.. పెట్రోల్ ధర లీటర్ కు రూ.390.79కి చేరింది. హై-స్పీడ్ డీజిల్ (HSD) ధర లీటర్‌కు రూ.424.92గా ఉంది. ఈ ధరల్లో ప్రభుత్వం విధించే పన్నులు, సుంకాలు కూడా ఉన్నాయి. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.114, డీజిల్‌పై లీటరు రూ.100 చొప్పున పన్నులు, సుంకాలు ఉన్నట్లు డాన్ నివేదించింది.పశ్చిమాసియా యుద్ధం మొదలైన దగ్గర నుంచి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తాజాగా హౌతీలు సౌదీపై దాడులు ఉధృతం చేయడంతో ప్రస్తుతం చమురు సంక్షోభంగా మరింత కఠినంగా మారింది. దీంతో పాక్ ప్రభుత్వం ఇంధన ధరలు భారీగా పెంచేసింది. దీంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇక ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రతిపక్ష పీటీఐ నేతలు గాడిద బండ్లపై అసెంబ్లీకి వచ్చి నిరసన తెలిపారు.పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు. పెట్రోల్ ధరలు రూ.400కు చేరువ కావడాన్ని నిరసిస్తూ సింధ్ అసెంబ్లీకి గాడిద బండ్లపై వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. పెట్రోల్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. డాన్ నివేదిక ప్రకారం.. PTI నేత సజ్జాద్ అలీ సూమ్రో నేతృత్వంలో పలువురు పార్టీ ఎమ్మెల్యేలు సింధ్ అసెంబ్లీకి సమీపంలోని ప్రాంతాల నుంచి గాడిద బండ్లపై ప్రయాణించారు. అసెంబ్లీ ప్రధాన ద్వారం వరకు చేరుకున్న వారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెట్రోల్ ధరల పెంపుపై సజ్జాద్ అలీ తీవ్రంగా స్పందించారు. ప్రజలపై ప్రభుత్వం 'పెట్రోల్ బాంబు' వేసిందని విమర్శించారు. పెరిగిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. "పెట్రోల్ ధర ఎంతగా పెరిగిందంటే.. మా వాహనాల్లో అసెంబ్లీకి కూడా రాలేకపోతున్నాం. ప్రభుత్వ విధానాల ప్రభావాన్ని ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు” అని సజ్జాద్ అలీ పేర్కొన్నట్లు డాన్ నివేదించింది.ఇదీ చదవండి: బట్లర్ విధ్వంసం.. ఇంగ్లండ్ చేతిలో శ్రీలంక వైట్‌వాష్ -
ట్రంప్ తెచ్చిన యుద్ధం: అమెరికాకు 3 లక్షల కోట్ల బిల్లు!! ఇకపై ప్రతీ నెలా మరో 25 వేల కోట్లు!
ఇరాన్‌పై యుద్ధానికి దిగినందుకు అమెరికా ఇప్పుడు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది. ఆరు నెలలు ముగిసినా.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇందుకోసం అమెరికా ఇప్పటిదాకా ఎంత ఖర్చు చేసిందో తెలుసా?.. మన కరెన్సీలో 3,00,00,00,00,00,000. అంటే మూడు లక్షల కోట్లు. ఇదే కాకుండా సైన్యానికి భారీగా నష్టం వాటిల్లింది. ఇది ఇలాగే కొనసాగితే ఇంకా నెలకు రూ.25 వేల కోట్లు చెల్లించుకుంటూనే పోవాలంట!.డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ యుద్ధం మొదలైంది. అయితే ఈ యుద్ధంతో ఇప్పటివరకు అమెరికా రక్షణ శాఖపై పడిన ప్రత్యక్ష వ్యయం ఏకంగా 38 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో దాని లెక్క రూ.3.2 లక్షల కోట్లు. యుద్ధం ఇదే స్థాయిలో కొనసాగితే ప్రతి నెలా మరో 2–3 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ (CBO) తాజాగా అంచనా వేసింది. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని అడ్డుకోవడం, అమెరికా భద్రతకు ముప్పును తొలగించడం లక్ష్యంగా ఈ దాడులకు ఆదేశించినట్లు ట్రంప్ అప్పట్లో ప్రకటించారు. అయితే కొన్ని వారాల్లో ముగుస్తుందని భావించిన ఈ సైనిక చర్య సుదీర్ఘ ఘర్షణగా మారింది. సెప్టెంబర్ నాటికీ పోరాటం పూర్తిగా ఆగలేదు. తాజాగా ట్రంప్ ఈ యుద్ధాన్ని ప్రారంభించిన నిర్ణయంపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని చెప్పారు. నెలకు మరో రూ.25 వేల కోట్లు!యుద్ధం మరింత కొనసాగితే అమెరికా ఖజానాపై భారం ఆగేలా కనిపించడం లేదు. తక్కువ తీవ్రతతో పోరాటం కొనసాగితే నెలకు సుమారు 2 బిలియన్ డాలర్లు, దాడులు మళ్లీ తీవ్రరూపం దాల్చితే దాదాపు 3 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని సీబీవో తెలిపింది. అంటే భారత కరెన్సీలో చూస్తే ఒక్క నెలలోనే దాదాపు రూ.17 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. ఈ యుద్ధంలో అమెరికా ఖజానాకే కాదు.. ఆ దేశ సైన్యానికీ భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ ప్రతిదాడుల్లో అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. పలు విమానాలు, సైనిక పరికరాలు నష్టపోయినట్లు నివేదికలు వెలువడ్డాయి. మరోవైపు ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణులను అడ్డుకునేందుకు అమెరికా భారీ సంఖ్యలో ఇంటర్సెప్టర్లను ప్రయోగించాల్సి వచ్చింది. దీంతో యుద్ధం సాగుతున్న కొద్దీ అమెరికా సైనిక సామర్థ్యాలపై, ముఖ్యంగా కీలక ఆయుధ నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది.అసలు ఖర్చు.. క్షిపణులే!ఈ యుద్ధంలో అమెరికా భారీగా క్షిపణులు, ఇంటర్సెప్టర్లను ప్రయోగించింది. ఆగస్టు 1 వరకు ఉపయోగించిన ఆయుధాలను తిరిగి సమకూర్చుకోవడానికే సుమారు 21.7 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని సీబీవో లెక్కించింది. ఇందులో ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైళ్లకు 7.3 బిలియన్, మిసైల్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్లకు 13.1 బిలియన్ డాలర్లు, ఇతర ఆయుధాలకు 1.2 బిలియన్ డాలర్లు ఉన్నాయి. యుద్ధంలో కోల్పోయిన పరికరాలను భర్తీ చేయడానికి మరో 1.9 బిలియన్ డాలర్లు అవసరమని పేర్కొంది. ఆయుధ నిల్వలకు గండి..డబ్బు ఖర్చవడమే కాదు.. అమెరికా ఆయుధ నిల్వలపైనా యుద్ధం ప్రభావం పడుతోంది. ముఖ్యంగా క్షిపణి రక్షణ ఇంటర్సెప్టర్ల నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని సీబీవో పేర్కొంది. వాటిని పూర్తిస్థాయిలో తిరిగి సమకూర్చుకోవడానికి ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు రక్షణ కార్యాలయం పెంటగాన్ మాత్రం తమ వద్ద అధ్యక్షుడి వ్యూహాత్మక అవసరాలకు సరిపడా ఆయుధాలు ఉన్నాయని చెబుతోంది. అయితే ఇందుకు విరుద్ధంగా పెంటగాన్ ఇన్స్పెక్టర్ జనరల్ నివేదిక మాత్రం.. యుద్ధం కారణంగా కీలక ఆయుధాల్లో ‘స్ట్రాటజిక్ ఇన్వెంటరీ షార్ట్‌ఫాల్స్’ ఏర్పడ్డాయని పేర్కొంది. హర్ముజ్ మూసివేత.. ప్రపంచానికి మరో దెబ్బఇరాన్తో యుద్ధం ప్రభావం అమెరికా సరిహద్దులకే పరిమితం కాలేదు. హార్ముజ్ జలసంధిలో రవాణా తీవ్రంగా దెబ్బతినడంతో చమురు సరఫరాపై ఒత్తిడి పెరిగింది. యుద్ధం తర్వాత బ్రెంట్ క్రూడ్ ధర రెండో త్రైమాసికంలో బ్యారెల్‌కు 103 డాలర్ల వరకు చేరింది. ఇంధన ధరల పెరుగుదల ఇతర వస్తువులు, రవాణా ఖర్చులపై ప్రభావం చూపడంతో అమెరికాలో ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉందని సీబీవో తెలిపింది. 2027 తొలి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం గతంలో వేసిన అంచనాల కంటే 0.5 శాతం పాయింట్లు ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. ఇంకా అసలు బిల్లు రాలేదు!సీబీవో చెప్పిన 38 బిలియన్ డాలర్లలో యుద్ధానికి సంబంధించిన ప్రతి ఖర్చూ లేదు. అమెరికా స్థావరాలకు జరిగిన నష్టం, భవిష్యత్‌లో వాటి మరమ్మతులు, యుద్ధానికి అప్పులు తీసుకుంటే చెల్లించాల్సిన వడ్డీ, సైనికులకు భవిష్యత్‌లో అందించాల్సిన వైద్య, వైకల్య ప్రయోజనాలు వంటి ఖర్చులు ఇందులో పూర్తిగా లేవు. రక్షణ శాఖ నుంచి సీబీవో కోరిన సమాచారానికి పూర్తి సహకారం అందకపోవడంతో ఈ అంచనాల్లో కొంత అనిశ్చితి కూడా ఉందని బడ్జెట్ ఆఫీస్ స్పష్టం చేసింది. అమెరికాకే కాదు.. డ్యామేజ్ ట్రంప్‌కు కూడా!యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్నది స్పష్టంగా లేకపోవడంతో ఈ బిల్లు చివరకు ఎంతకు చేరుతుందన్నది కీలక ప్రశ్నగా మారింది. మరోవైపు.. ఈ యుద్ధం ట్రంప్ రాజకీయ ప్రతిష్టపైనా ప్రభావం చూపుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయనకున్న ప్రజాదరణ క్రమంగా తగ్గిపోయిందని రాయిటర్స్ లాంటి పలు ప్రముఖ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలు చెబుతున్నాయి. ఇరాన్ యుద్ధం, పెరిగిన ఇంధన ధరలు అమెరికన్లలో అసంతృప్తికి కారణమవుతున్నట్లు అవి వెల్లడించాయి.ముఖ్యంగా నవంబర్ మిడ్‌టర్మ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రిపబ్లికన్ పార్టీలో ఆందోళన పెరిగిపోతోంది. యుద్ధ వ్యయం, పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, ఆయుధ నిల్వలపై ఒత్తిడి వంటి అంశాలు ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా కీలకంగా మారనున్నాయి. ఒకవైపు యుద్ధాన్ని కొనసాగించాల్సిన వ్యూహాత్మక అవసరాన్ని ట్రంప్ సమర్థిస్తుండగా.. మరోవైపు పెరుగుతున్న ఖర్చు, ఆర్థిక భారం, ప్రజాభిప్రాయంపై దాని ప్రభావం ఆయన ముందున్న పెద్ద సవాళ్లుగా మారాయి.ఇదీ చదవండి: అమెరికా ఇలాంటి పని చేస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు! -
‘మరో దారి లేదు..’ ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై తమ సైనిక చర్యను ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఆయన అభివర్ణించారు. గెలుపే లక్ష్యంగా పోరాడుతున్నామని.. వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. పశ్చిమాసియా సంక్షోభంపై పూటకో ప్రకటన చేస్తున్న ఆయన.. ఇప్పుడు మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు.9/11 దాడులకు పాతికేళ్లు పూర్తైన సందర్భంగా వాషింగ్టన్‌లోని పెంటగాన్‌లో జరిగిన స్మారక కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2001 నాటి ఉగ్రదాడులను గుర్తుచేసుకుంటూ.. పెంటగాన్‌పై దూసుకొచ్చిన హైజాక్ విమానంలో 64 మంది, భవనంలో 125 మంది మరణించిన విషయాన్ని ట్రంప్ గుర్తుచేశారు. ‘వార్ ఆన్ టెర్రర్’లో సేవలందించిన అమెరికా సైనికులకు నివాళులర్పించిన ఆయన.. ప్రస్తుతం ఇరాన్‌పై జరుగుతున్న సైనిక చర్యను కూడా ప్రస్తావించారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని పొందకుండా అమెరికా సైనికులు పనిచేస్తున్నారని చెప్పారు.9/11 విషాదాన్ని, ఇరాన్‌పై యుద్ధాన్ని నేరుగా ముడిపెడుతూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మనం ఎప్పటికీ, ఎప్పటికీ మర్చిపోం. అందుకే ఈరోజు పోరాడుతున్నాం. మనకు మరో మార్గం లేదు. విజయం తప్ప మరోటి ఉండదు. మేం గట్టిగా పోరాడతాం. గెలవడానికి పోరాడతాం’’ అని ట్రంప్ అన్నారు.ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం ఆరు నెలలకు పైగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. వరుస సైనిక దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికాలోనూ ఈ యుద్ధంపై రాజకీయంగా తీవ్ర చర్చ, వ్యతిరేకత కొనసాగుతోంది.ట్రంప్ తీరుపై విమర్శలు9/11 వార్షికోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లోని గ్రౌండ్ జీరోలో జరిగే ప్రధాన స్మారక కార్యక్రమానికి ట్రంప్ హాజరుకాకుండా వాషింగ్టన్లోనే ఉండటంపై విమర్శలు వచ్చాయి. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ న్యూయార్క్ వెళ్లి వరల్డ్ ట్రేడ్ సెంటర్ స్థలంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.పెంటగాన్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం దాదాపు 20 నిమిషాల పాటు సాగింది. అమెరికా ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లను ప్రస్తావిస్తూ.. ‘‘అమెరికా ఈరోజు పరీక్షను ఎదుర్కొంటోంది. ఆ పరీక్షలో మనం ఘనంగా విజయం సాధిస్తున్నాం’’ అని చెప్పారు. అయితే 9/11 దాడుల సమయంలో, అనంతరం అమెరికాకు మద్దతుగా నిలిచిన మిత్రదేశాల సహకారాన్ని ట్రంప్ తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడంపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి.‘ఇరాన్ రక్షణ వ్యవస్థలు కుప్పకూలాయి’అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా పెంటగాన్ కార్యక్రమంలో ఇరాన్‌పై కఠిన వ్యాఖ్యలు చేశారు. దాదాపు అర్ధ శతాబ్దంగా అమెరికా నాశనాన్ని కోరుకుంటున్న ‘‘ఇస్లామిక్ థియోక్రసీ’’గా ఇరాన్‌ను అభివర్ణించారు. ఇరాన్ రక్షణ వ్యవస్థలు పూర్తిగా కూలిపోయాయని ఆయన పేర్కొన్నారు. ‘‘మేం ఇప్పటికీ ఉగ్రవాదులను వారు చేరాల్సిన చోటుకు పంపుతున్నాం. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకుండా చూస్తున్నాం. ఆర్థిక ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది’’ అని హెగ్సెత్ అన్నారు. 9/11 తర్వాత మొదలైన ‘‘చెడుపై పోరాటం’’ ఇంకా కొనసాగుతోందని, అది ‘‘జడ్జ్మెంట్ డే’’ వరకు కొనసాగుతుందని వ్యాఖ్యానించారు.అమెరికాలోనూ ముప్పు పొంచి ఉందని హెగ్సెత్ హెచ్చరించారు. విదేశాల్లో, దేశంలో ఉన్న ఇస్లామిక్ ఉగ్రవాదులతో పాటు అమెరికా శక్తిని బలహీనపర్చాలని, అమెరికన్లను చంపాలని చూస్తున్న శత్రువులపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ట్రంప్ నాయకత్వంలో ఇరాన్ సైనిక సామర్థ్యాలను నిర్వీర్యం చేస్తున్నామని చెప్పిన ఆయన.. దేశ సేవకు సిద్ధంగా ఉండే ‘‘బలమైన, ధైర్యవంతమైన యోధుల’’ కొత్త తరం అవసరమని పేర్కొన్నారు.సౌదీ అరేబియాపై చర్యకు డిమాండ్మరోవైపు న్యూయార్క్‌లో జరిగిన 9/11 స్మారక కార్యక్రమంలో బాధిత కుటుంబాల తరఫున టెర్రీ స్ట్రాడా అమెరికా ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు. 9/11 బాధితురాలి భర్త అయిన ఆమె.. దాడులతో సౌదీ అరేబియాకు సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఆ దేశాన్ని బాధ్యులను చేయాలని ట్రంప్ ప్రభుత్వాన్ని కోరారు. ‘‘ఒక్కొక్కటిగా మాకు ద్రోహాలు ఎదురవుతూనే ఉన్నాయి. అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికీ దాన్ని మార్చగలరు’’ అని స్ట్రాడా అన్నారు. అమెరికాతో స్నేహం కోరుకుంటే 9/11 ఉగ్రవాదులతో సంబంధాలపై సౌదీ అరేబియా చేస్తున్న నిరాకరణలను ఆపేలా ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.సాధారణంగా 9/11 వార్షికోత్సవ కార్యక్రమాలు 2001లో మరణించిన దాదాపు 3,000 మందిని స్మరించుకోవడానికే పరిమితమవుతాయి. అయితే 25వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై కొనసాగిస్తున్న యుద్ధాన్ని సమర్థించేందుకు కూడా ఈ వేదిక ఉపయోగపడింది.ఇదీ చదవండి: ఇంట్రెస్టింగ్.. ట్రంప్ వారసుడెవరు? -
రాకెట్లా దూసుకుపోతున్న ముడిచమురు ధరలు
పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు రాకెట్లా దూసుకుపోతున్నాయి. హర్ముజ్ సహా కీలకమైన సముద్ర మార్గాల్లో వరుస దాడులు, చమురు రవాణాకు అంతరాయాల భయాలు మార్కెట్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో వరుసగా రెండో రోజూ చమురు ధరలు భారీగా పెరిగాయి. నిన్న ఒక్కరోజే 6 శాతానికి పైగా ఎగబాకిన ధరలు.. శుక్రవారం కూడా పైపైకి కదిలాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర ఏకంగా బ్యారెల్‌కు 108.68 డాలర్లకు చేరింది. అంటే 110 డాలర్ల మార్క్‌కు అత్యంత చేరువలో ఉంది. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ధర కూడా బ్యారెల్‌కు 103.45 డాలర్లకు చేరింది. ఈ రెండు బెంచ్‌మార్క్‌లు మే మధ్య తర్వాత తొలిసారిగా వారాన్ని 100 డాలర్లకు పైన ముగించే దిశగా సాగుతున్నాయి.పశ్చిమాసియాలో ఇటీవలి కాలంలో మళ్లీ తీవ్రత పెరిగిన పోరుతో చమురు సరఫరాపై అనిశ్చితి పెరిగింది. ముఖ్యంగా కీలక సముద్ర మార్గాల్లో చమురు ట్యాంకర్లు, ఇతర నౌకలపై దాడులు పెరగడం మార్కెట్‌ను కలవరపెడుతోంది. గురువారం బ్రెంట్, WTI ధరలు రెండూ 6 శాతానికిపైగా పెరిగాయి. వారాంత ప్రాతిపదికన చూస్తే రెండు సూచీలు దాదాపు 13 శాతం మేర లాభపడ్డాయి.ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ఏడో నెలలోకి ప్రవేశించినప్పటికీ.. ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అమెరికా, ఇరాన్ రెండూ వెనక్కి తగ్గే ఉద్దేశం లేదన్న సంకేతాలు ఇస్తుండటంతో ఈ పరిస్థితి మరింత కాలం కొనసాగవచ్చన్న అంచనాలు పెరిగాయి.హర్ముజ్ నుంచి ఎర్ర సముద్రం వరకు..ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్ముజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలు ఇప్పటికే పరిమితమయ్యాయి. మరోవైపు యెమెన్‌లో ఇరాన్‌కు అనుకూలంగా ఉన్న హౌతీలు మొచా పోర్టుపై నియంత్రణ సాధించడం ఎర్ర సముద్ర మార్గంపై కొత్త ఆందోళనలకు దారితీసింది. సెప్టెంబర్ 10న ఒమన్ సమీపంలో రెండు నౌకలు గుర్తుతెలియని ప్రాజెక్టైళ్ల దాడికి గురైనట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. ఇరాన్ సమీప సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరగడం, అమెరికా ఐదు ఇరానియన్ చమురు ట్యాంకర్లపై దాడి చేయడం, అనంతరం ఇరాన్ పలు నౌకలపై దాడులు చేసినట్లు ప్రకటించడం.. చమురు రవాణాపై ముప్పును మరింత పెంచాయి.ఇదే సమయంలో సౌదీ అరేబియాలోని ఇంధన మౌలిక వసతులపై హౌతీల దాడులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని కార్యకలాపాలు నిలిచిపోవడంతో మిడిల్ఈస్ట్ నుంచి చమురు సరఫరా మరింత తగ్గే ప్రమాదం ఉందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి.చైనా కొనుగోళ్లతో మరింత మంట..సరఫరా ఆందోళనలకు తోడు డిమాండ్ వైపు పరిణామాలు కూడా క్రూడాయిల్ ధరలకు మద్దతు ఇస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడాయిల్ దిగుమతిదారు అయిన చైనా ఇటీవలి వారాల్లో కొనుగోళ్లను పెంచింది. చైనా ఇదే స్థాయిలో కొనుగోళ్లు కొనసాగిస్తే.. సరఫరా అంతరాయాల ప్రభావం మరింత పెరిగి ధరలు పైకి వెళ్లే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి ఏడాదిలోనే కనిష్ట స్థాయికి పడిపోయినట్లు నివేదికలు వెల్లడించాయి. దీంతో ఇప్పటికే సరఫరాపై ఉన్న ఒత్తిడికి ఇది మరింత తోడైంది.క్రూడాయిల్ అంటే.. భూమి నుంచి వెలికితీసే ముడిచమురు. దీన్ని శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, ఎల్పీజీతో పాటు ప్లాస్టిక్, పెయింట్లు, రసాయనాలు వంటి అనేక ఉత్పత్తులను తయారు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలను సాధారణంగా బ్యారెల్‌కు లెక్కిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర పెరిగితే.. దాని ప్రభావం ఇంధన ధరలు, రవాణా ఖర్చులు, చివరకు నిత్యావసర వస్తువుల ధరలపైనా పడే అవకాశం ఉంటుంది.భారత్‌పై ప్రభావం..క్రూడాయిల్ ధరలు ఇలా భారీగా పెరగడం భారత్‌పై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. దేశం తన అవసరాల్లో ఎక్కువ భాగం ముడిచమురును దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో.. అంతర్జాతీయ ధరలు పెరిగితే దిగుమతి బిల్లు, కరెంట్ అకౌంట్ లోటుపై ఒత్తిడి పెరుగుతుంది. రూపాయి విలువపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాల్సిన పరిస్థితి వస్తే రవాణా ఖర్చులు పెరిగి.. ఆ ప్రభావం నిత్యావసర వస్తువులు, కూరగాయలు, సరుకుల ధరలపై పడొచ్చు. దీంతో క్రూడాయిల్ ర్యాలీ భారత్‌లో ద్రవ్యోల్బణ ఆందోళనలను కూడా పెంచే అవకాశం ఉంది.120 డాలర్లకు చేరుతుందా?ప్రస్తుత పరిణామాలు ఇలాగే కొనసాగితే క్రూడాయిల్ ధరలు మరింత పెరిగే అవకాశాన్ని విశ్లేషకులు కొట్టిపారేయడం లేదు. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే బ్రెంట్ ధర బ్యారెల్‌కు 120 డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్ ఇప్పటికే హెచ్చరించింది. బ్రెంట్ ధర ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 80 శాతం పెరిగింది. యుద్ధ సమయంలో నమోదైన గరిష్ఠ స్థాయి 126 డాలర్లతో పోలిస్తే(ఏప్రిల్ 30న).. ప్రస్తుత ధరలు కూడా ఆ స్థాయికి చేరువలోనే ఉన్నాయి.అయితే ధరల ర్యాలీ ఎంతకాలం కొనసాగుతుందన్నది ప్రధానంగా యుద్ధ తీవ్రత, సముద్ర మార్గాల్లో చమురు రవాణా పరిస్థితులు, చైనా కొనుగోళ్లపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత యుద్ధం ముగుస్తుందని, ఆ తర్వాత చమురు ధరలు భారీగా తగ్గుతాయని పేర్కొన్నారు. కానీ ప్రస్తుత పరిణామాలు మాత్రం సమీప భవిష్యత్తులో ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలపై సందేహాలను పెంచుతున్నాయి.ఇదీ చదవండి: భారత్ వద్ద న్యూక్లియర్ వెపన్స్ లెక్క తెలుసా? -
చమురు ధరలు భగ్గుమంటున్నాయ్.. ప్రపంచానికి కొత్త ముప్పు!
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. ముఖ్యంగా చమురు, సహజవాయువు ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 105 డాలర్లకు చేరింది. ఈ పరిస్థితులతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.గల్ఫ్ ప్రాంతంలో అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు ఈ మధ్య మరింత తీవ్రం కావడంతో ఈ ప్రభావం చమురు సరఫరాలపై పడుతోంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధి దాదాపుగా మూసుకుపోవడంతో గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచ మార్కెట్లకు చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో భవిష్యత్తులో ఇంధన కొరత ఏర్పడవచ్చన్న భయాలు పెరుగుతున్నాయి.అయితే, మరోవైపు సహజవాయువు ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. యూరప్‌లో ఈ ఏడాది ఇదే సమయానికి సాధారణంగా ఉండే స్థాయికంటే గ్యాస్ నిల్వలు తక్కువగా ఉన్నాయి. చలికాలం కోసం నిల్వలను పెంచుకోవాల్సిన అవసరం ఉండటంతో గ్యాస్‌కు డిమాండ్ పెరిగి ధరలు మరింత ఎక్కువవుతున్నాయి. అలాగే, బ్రిటన్‌లో గ్యాస్ ధరలు 2022 తర్వాత తొలిసారిగా ఒక థర్మ్కు 200 పెన్స్ దాటాయి.ఇలా ఇంధన ధరలు పెరగడంతో ప్రజలపై కూడా వాటి ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే, బ్రిటన్‌లో స్వల్పకాలిక గ్యాస్ ధరల పెరుగుదల నుంచి వినియోగదారులకు ధరల పరిమితి కొంత రక్షణ కల్పిస్తున్నప్పటికీ.. ధరలు ఎక్కువ కాలం కొనసాగితే విద్యుత్, గ్యాస్ బిల్లులు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అక్టోబర్ నుంచి అక్కడ ఇంధన ధరల పరిమితి 3.6 శాతం పెరగనుంది.చమురు, గ్యాస్ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం మళ్లీ వేగం పుంజుకుంటుందన్న ఆందోళనలు కూడా పెరిగాయి. దీనికి తోడు అమెరికా, బ్రిటన్‌లో ప్రభుత్వాలు తీసుకునే దీర్ఘకాలిక రుణాలపై వడ్డీ రేట్లు కూడా గణనీయంగా పెరిగాయి. బ్రిటన్‌లో పదేళ్ల ప్రభుత్వ బాండ్లపై రాబడి 2007 తర్వాత అత్యధిక స్థాయికి చేరింది. దీంతో ప్రభుత్వ రుణభారం పెరగడంతో పాటు.. గృహ రుణాలు వంటి కొన్ని ఆర్థిక ఉత్పత్తులపై ప్రజలు చెల్లించే వడ్డీ కూడా పెరిగే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా, ఇరాన్‌కు అనుకూలంగా ఉన్న హౌతీ దళాలు యెమెన్‌లోని కీలకమైన మోఖా పోర్టును స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు రావడం ఆందోళనకు మరింత కారణమైంది. ఈ పరిణామంతో సముద్ర మార్గాల్లో చమురు, ఇతర సరుకుల రవాణాకు మరిన్ని అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. యుద్ధ పరిస్థితులు త్వరగా ముగియకపోతే ఇంధన ధరల పెరుగుదల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెంచే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఇవి కూడా చదవండి: ఖరీదైన విడాకులు.. మాజీ భార్యకు రూ.18 వేలకోట్లు! -
ఇరాన్ దెబ్బ.. అమెరికా ఫైటర్ జెట్లకు చిల్లు!
ఇరాన్ మరోసారి అమెరికాపై విరుచుకుపడింది. జోర్డాన్‌లోని కీలక అమెరికా వైమానిక స్థావరంపై రాత్రికి రాత్రే భారీ క్షిపణి దాడులు జరిపింది. క్షిపణుల వర్షం కురిపించడంతో పలు యుద్ధవిమానాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఏకంగా ఒక ఏ-10 థండర్‌బోల్ట్ విమానం నాశనం కాగా.. మరో ఎనిమిది ఎఫ్-15 యుద్ధవిమానాలు దెబ్బతిన్నట్లు సమాచారం.జోర్డాన్‌లోని మువాఫాక్ సాల్టీ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ ఈ దాడులు జరిపినట్లు సీబీఎస్ న్యూస్ ఏజెన్సీ ఓ కథనం ఇచ్చింది. ఇరాన్‌పై అమెరికా సైనిక కార్యకలాపాలకు ఈ స్థావరం కీలక కేంద్రంగా ఉండడం గమనార్హం. ఇక దాడులను అడ్డుకునేందుకు అమెరికా బలగాలు 30కి పైగా పేట్రియాట్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. Iran’s ballistic missile attack on Muwaffaq Salti Air Base in Jordan last night damaged several American aircraft -CBS Roughly eight F-15s suffered light damage and one A-10 was severely damaged, losing a wing. pic.twitter.com/DQydfG4WYH— OSINTtechnical (@Osinttechnical) September 10, 2026దెబ్బతిన్న విమానాలపై అమెరికా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ఒక ఏ-10 థండర్‌బోల్ట్ తీవ్రంగా దెబ్బతిని, దాని ఒక రెక్క పూర్తిగా కనిపించకుండా పోయినట్లు వెల్లడించింది. సుమారు ఎనిమిది ఎఫ్-15లకు స్వల్ప నష్టం వాటిల్లినప్పటికీ.. వాటిని తిరిగి పునరుద్ధరించినట్లు పేర్కొంది.అందుకు ప్రతీకారంగానే..ఇటీవల అమెరికా ఐదు ఇరాన్ చమురు ట్యాంకర్లను ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత మరింత ముదిరింది. దీనికి ప్రతీకారంగానే ఇరాన్ అమెరికా స్థావరాలు, మిత్రదేశాలపై వరుస దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) తమ దాడుల్లో జోర్డాన్‌లోని అల్ అజ్రాక్ అమెరికా స్థావరాన్ని భారీ క్షిపణులతో లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. అలాగే హర్ముజ్ జలసంధి వైపు వెళ్తున్న పలు నౌకలపైనా దాడులు చేసినట్లు వెల్లడించింది.Iranian Strike Damages EIGHT 🇺🇸 F-15s In Jordan (CBS)The overnight strike reportedly damaged multiple US warplanes at an air base in Jordan. While an A-10 suffered significant damage, the eight F-15s sustained lighter damage and were returned to service. (CBS)The escalation… pic.twitter.com/dyAEspAra6— RT_India (@RT_India_news) September 10, 2026అయితే ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో 20 జోర్డాన్ గగనతలంలోకి వచ్చినట్లు ఆ దేశ సైన్యం తెలిపింది. వీటిలో 18 క్షిపణులను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని, మిగిలిన రెండు జనావాసాలు లేని ప్రాంతాల్లో పడినట్లు వెల్లడించింది.యుద్ధానికి ముగింపు పలుకుతాం.. కానీ ఇవే షరతులుమరోవైపు యుద్ధానికి ముగింపు పలికేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ సంకేతాలు ఇచ్చింది. అయితే అమెరికా తమ కొన్ని షరతులకు అంగీకరించాలని స్పష్టం చేసింది. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సైన్యాన్ని వెనక్కి తీసుకోవడం, యెమెన్‌పై దిగ్బంధాన్ని ఎత్తివేయడం, ఇరాన్‌కు చెందిన స్తంభింపజేసిన 24 బిలియన్ డాలర్ల ఆస్తులను విడుదల చేయడం, తమ అణు, క్షిపణి సామర్థ్యాల్లో జోక్యం చేసుకోకపోవడం వంటి డిమాండ్లను ముందుపెట్టింది.ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి త్వరలో ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత యుద్ధం ముగిసిపోతుందని బుధవారం ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ ఇక ఎక్కువ కాలం యుద్ధాన్ని కొనసాగించే పరిస్థితిలో లేదని పేర్కొన్నారు.అయితే ట్రంప్ వ్యాఖ్యలకు భిన్నంగా అమెరికా ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ తెలిపింది. యుద్ధం ట్రంప్ పదవీకాలంలో మరో రెండేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉందని ఆయనకు సన్నిహితంగా ఉన్న ఉన్నతాధికారులు ప్రైవేటుగా హెచ్చరిస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఇరాన్–అమెరికా ఘర్షణకు తక్షణమే తెరపడుతుందా? మరింత కాలం కొనసాగుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది.ఇదీ చదవండి: ట్రంప్ ఎండ్ గేమ్ ప్లాన్ ఇదేనంట! -
హర్ముజ్‌లో ఇరాన్ ఎదురుదాడి.. సంచలన ప్రకటన
పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి.హర్ముజ్ జలసంధి ప్రవేశద్వారం వద్ద అమెరికాకు చెందిన అత్యాధునిక మానవరహిత జలాంతర్గామిని పట్టుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అదే సమయంలో అమెరికా దళాలు ఐదు ఇరానియన్ చమురు ట్యాంకర్లను ధ్వంసం చేసినట్లు ప్రకటించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) అధికారిక మీడియా ‘సెపాహ్ న్యూస్’ ప్రకారం.. సంక్లిష్టమైన నిఘా ఆపరేషన్‌లో అమెరికాకు చెందిన డైవ్ ఎల్డీ(Dive-LD) మానవరహిత అండర్‌వాటర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యాధునిక అండర్‌వాటర్ టెక్నాలజీ కలిగిన వాహనంగా దీన్ని ఇరాన్ అభివర్ణించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. మరోవైపుహర్ముజ్ జలసంధిపై ఓ అమెరికా డ్రోన్( MQ-9 Reaper)ను కూల్చివేసినట్లు కూడా ఐఆర్జీసీ ప్రకటించింది.అమెరికా రియాక్షన్ ఇదేఇరాన్ ప్రకటనపై అమెరికా స్పందించింది. తమ మానవరహిత అండర్‌వాటర్ వాహనం ఒకటి అంతకుముందు రోజు పనిచేయకుండా నిలిచిపోయిందని అమెరికా సైన్యం తెలిపింది. అయితే ఇరాన్ స్వాధీనం చేసుకున్నది అదే వాహనమా అనేది మాత్రం స్పష్టం చేయలేదు. ఆ వాహనం పాత మోడల్ అని.. అందులో సున్నితమైన సమాచారం, రహస్య సోనార్ లేదంటే రాడార్ పరికరాలు లేవని పెంటగాన్ వెల్లడించింది.ఐదు చమురు ట్యాంకర్లపై అమెరికా దాడిఇదే సమయంలో ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం.. తమ యుద్ధనౌకపై ఇరాన్ క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా ఐదు ఇరానియన్ ముడిచమురు ట్యాంకర్లను ధ్వంసం చేశారు. గత రెండు రోజుల్లో అమెరికా నౌకపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో రెండుసార్లు దాడికి ప్రయత్నించిందని సెంట్కామ్ పేర్కొంది.ఇరాన్ విమానయాన సంస్థలపై ఆంక్షలుమరోవైపు అమెరికా ఆర్థిక శాఖ ఇరాన్‌కు చెందిన మరో 27 విమానయాన సంస్థలను ప్రత్యేక ఆంక్షల జాబితాలో చేర్చింది. ఇరాన్ పాలనకు, ఐఆర్‌జీసీకి ఆయుధాల రవాణా, సిబ్బంది తరలింపులో వాణిజ్య విమానయాన సంస్థలు సహకరిస్తున్నాయని అమెరికా ఆరోపించింది.‘వాళ్లు పశ్చాత్తాపపడే వరకు..’ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మాత్రం.. యుద్ధంలో విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. యుద్ధాన్ని ఇరాన్ ఎప్పుడూ కోరుకోలేదని.. అయితే దాడులను ఎదుర్కొనేందుకు తమ ప్రతిఘటన కొనసాగుతుందని తెలిపారు. ఆక్రమణదారులు పూర్తిగా పశ్చాత్తాపపడే వరకు బలంగా పోరాడతామని పేర్కొన్నారు.మళ్లీ ముదిరిన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలుఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులతో ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధానికి ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులు చేసింది. అనంతరంహర్ముజ్ జలసంధిపై తన పట్టును మరింత బిగించింది. జూన్ 18న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా, ఇరాన్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ.. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలతో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి.ఇదీ చదవండి: ఇరాన్‌కు దిమ్మతిరిగే షాక్.. భారీ దెబ్బకొట్టిన అమెరికా -
ఇలాంటి పనులు ట్రంప్‌కు మాత్రమే సాధ్యం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు మరోసారి అదే కనిపించింది. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని వరుస పోస్టులతో విరుచుకుపడుతున్న ఆయన.. తాజాగా ఏకంగా ఇరాన్ మ్యాప్‌పై తన ముఖాన్ని పెట్టారు. అక్కడితో ఆగారా అంటే అదీ లేదు.. ‘ఇరాన్ ఓ విఫల దేశం’ అంటూ సందేశం ఇచ్చారు. ఆదివారం ట్రూత్ సోషల్‌లో గంట వ్యవధిలో ఇరాన్‌కు సంబంధించిన ఏడు పోస్టులు పెట్టిన ట్రంప్.. ఆ దేశంపై అమెరికా ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో చూపించేందుకు మ్యాప్‌లు, గ్రాఫిక్స్‌ను ఉపయోగించారు. తాజా పోస్టుల్లో ఒకదానిలో ఇరాన్ మ్యాప్ కనిపించగా.. దానిపై ట్రంప్ ముఖాన్ని ఉంచారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని చెప్పేందుకు ఈ చిత్రాన్ని ఉపయోగించారు. మరో పోస్టులో ఇరాన్ చమురు ఎగుమతులు భారీగా పడిపోయాయని పేర్కొన్నారు. ఇరాన్‌కు కీలకమైన ఖర్గ్ ద్వీపాన్ని క్షిపణులతో పేల్చేసినట్లు ఓ పోస్ట్ చేశారు. అలాగే హర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా మళ్లీ పెరిగిందంటూ మరో గ్రాఫిక్‌ను పోస్ట్ చేశారు. హర్ముజ్కూ ‘ట్రంప్’ ముద్ర?ట్రంప్ ఇంతటితో ఆగలేదు. వ్యూహాత్మకంగా కీలకమైన హర్ముజ్ జలసంధికి ‘ట్రంప్ స్ట్రెయిట్’ అని పేరు మార్చాలని గతంలో వ్యాఖ్యానించారు. ఆ వెంటనే వైట్‌హౌజ్ వర్గాలు అదే పేరుతో ఓ మ్యాప్‌ను రిలీజ్ చేశారు. ఇక ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ జలమార్గం ప్రస్తుతం అమెరికా-ఇరాన్ ఘర్షణకు ప్రధాన కేంద్రంగా మారింది. అమెరికా ఆంక్షలు, నౌకా దిగ్బంధంతో ఇరాన్ చమురు ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయని అమెరికా చెబుతుండగా.. హర్ముజ్‌పై తన ప్రభావాన్ని కొనసాగిస్తామని టెహ్రాన్ స్పష్టం చేస్తోంది. ట్రంప్‌తో మాములుగా ఉండదుట్రంప్కు ఇలాంటి పనులు కొత్తేం కాదు. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ పేరును ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా, అలాస్కాలోని ‘డెనాలి’ పేరును ‘మౌంట్ మెకిన్లీ’గా మార్చేందుకు ఏకంగా కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా ఫెడరల్ ప్రభుత్వ వినియోగంలో ఈ పేర్లు అధికారికంగా అమల్లోకి వచ్చాయి. ఇటీవల మరో అడుగు ముందుకేసి కెనడా లేక్ ఒంటారియోను ‘లేక్ అమెరికా’గా పేరు మార్చాలంటూ యాపిల్ మ్యాప్స్‌కు ట్రంప్ సూచించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. గూగుల్ ఇప్పటికే అమెరికా వినియోగదారుల కోసం ఆ పేరును చూపించడం ప్రారంభించింది. ట్రంప్ రాజకీయ అస్త్రంట్రంప్ తాజా ఇరాన్ పోస్టులను గమనిస్తే.. మ్యాప్‌లు కేవలం భౌగోళిక వివరాల కోసం కాకుండా రాజకీయ సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే సాధనంగా ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్ మ్యాప్‌పై తన ముఖం, ‘ఫెయిలింగ్ నేషన్’ అనే వ్యాఖ్య.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై చమురు ఎగుమతులు, కరెన్సీ పతనం, హర్ముజ్ సంక్షోభాన్ని కలిపి చూపించే గ్రాఫిక్స్.. ఇవన్నీ ఒకే సందేశాన్ని బలపరిచేలా ఉన్నాయి. ఇరాన్‌పై ఆర్థిక, సైనిక ఒత్తిడిని పెంచుతున్న సమయంలో ట్రంప్ సోషల్ మీడియా పోస్టులు కూడా అదే దూకుడును ప్రతిబింబిస్తున్నాయి. అయితే టెహ్రాన్ మాత్రం అమెరికా ఒత్తిడికి తలొగ్గేది లేదని చెబుతోంది. దీంతో ట్రంప్ తాజా ‘మ్యాప్ పోస్టు’ కూడా అమెరికా-ఇరాన్ ఘర్షణలో మరో రాజకీయ సందేశంగా మారింది.ఇదీ చదవండి: అంతులేని వెతుకులాట! -
ఇరాన్ పికాక్స్.. ట్రంప్‌కు ఎందుకంత పట్టుదల?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. ప్రపంచంలోనే అత్యంత పటిష్ఠమైన భూగర్భ అణు కేంద్రంగా భావిస్తున్న ‘పికాక్స్ మౌంటెన్’పై తమ నిఘా కొనసాగుతోందని.. త్వరలోనే దానిపై దాడి చేసే అవకాశం ఉందని ప్రకటించారు. తద్వారా ఇరాన్‌ను మరో తీవ్ర హెచ్చరిక జారీ చేశారాయన. ఓవల్ ఆఫీసులో శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. అక్కడ అణు కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే ఎంతకైనా వెనుకాడబోమని స్పష్టం చేశారాయన.ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసుకోకుండా అడ్డుకోవడమే అమెరికా సైనిక చర్యల ప్రధాన లక్ష్యం. మేం ఐదు నెలలుగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ సమయంలో ఇరాన్‌కు అణ్వాయుధం లేకుండా చేశాం. ఒకవేళ ఆ దేశం అణ్వాయుధాన్ని పొందితే పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారతాయి. అందుకే మా నిరంతర నిఘా కొనసాగుతుంది అని అన్నారాయన. పికాక్స్ మౌంటెన్‌పై నిఘానటాంజ్ యురేనియం శుద్ధి కేంద్రానికి సమీపంలో ఉన్న పికాక్స్ మౌంటెన్ అత్యంత లోతైన భూగర్భ నిర్మాణాలతో కూడిన ప్రాంతంగా భావిస్తున్నారు. అక్కడ రెండు లోతైన సొరంగ వ్యవస్థలు ఉన్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ నిఘా వర్గాల అంచనా ప్రకారం.. ఇరాన్ వేలాది సెంట్రిఫ్యూజ్‌లను ఈ భూగర్భ కేంద్రానికి తరలించినట్లు గతంలో వార్తలు వచ్చాయి.‘‘పికాక్స్లో ఏదైనా కార్యకలాపం జరుగుతున్నట్లు గుర్తిస్తే చాలా త్వరలోనే దాడి చేయవచ్చు. అక్కడి ప్రతీ కదలిక మాకు తెలుసు. ఇరాన్ అంతటా జరుగుతున్న కదలికలపై నిఘా ఉంది. ఏదైనా తప్పు జరిగితే తీవ్రంగా దాడి చేస్తాం’’ అని ట్రంప్ హెచ్చరించారు.భూగర్భంలో అత్యంత లోతుగా నిర్మించిన ఈ కేంద్రం.. సాధారణ వైమానిక దాడులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉందన్న అంచనాలు ఉన్నాయి. అయితే అమెరికా ఇక్కడ దాడి చేస్తే ఇరాన్ అణు మౌలిక వసతులపై యుద్ధం మరింత తీవ్రతరం అయ్యే అవకాశముంది.ట్రంప్ ఇలా అనడం ఇదే తొలిసారి కాదు. జులైలోనే పికాక్స్ మౌంటెన్‌ను అమెరికా టార్గెట్ చేసే అవకాశం ఉందని ఆయన బహిరంగంగా హెచ్చరించారు. అప్పట్లో ‘‘త్వరలోనే, భారీగా దాడి చేస్తాం’’ అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా మరోసారి ఇదే స్థావరాన్ని ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్ అణు కార్యకలాపాలకు పికాక్స్ భవిష్యత్తులో కీలక కేంద్రంగా మారే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలోనే ట్రంప్ దృష్టి దీనిపైనే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఎక్కడ ఉంది.. ఎందుకు కీలకం? ఇరాన్‌లోని జాగ్రోస్ పర్వత శ్రేణిలో ఉన్న పికాక్స్ మౌంటెన్.. దేశంలోని ప్రధాన యురేనియం శుద్ధి కేంద్రం నతాంజ్‌కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పర్వతం లోపల వందల మీటర్ల లోతులో రెండు భారీ భూగర్భ టన్నెల్ సముదాయాలను నిర్మిస్తున్నారు. అత్యంత పటిష్ఠమైన ఈ నిర్మాణం వల్ల సాధారణ బంకర్-బస్టర్ బాంబులతోనూ దీనిని పూర్తిగా ధ్వంసం చేయడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ తన అణు పరికరాలు, సెంట్రిఫ్యూజ్‌లు లేదా యురేనియం నిల్వలను ఇక్కడ భద్రపరిచే అవకాశం ఉండటంతో.. భవిష్యత్తులో అణు కార్యక్రమాలను తిరిగి కొనసాగించేందుకు ఇది కీలక స్థావరంగా మారొచ్చన్నదే అమెరికా ఆందోళన.ఇజ్రాయెల్‌కు అండగా..అమెరికా జోక్యం చేసుకోకపోతే ఇజ్రాయెల్, మొత్తం మిడిల్ఈస్ట్ మరింత తీవ్రమైన ముప్పును ఎదుర్కొనేవని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేసుకునే పరిస్థితిని తాము అడ్డుకున్నామని చెప్పారు. ఇరాన్ నుంచి యూరప్, అమెరికా నగరాలపైనా భవిష్యత్తులో ముప్పు ఏర్పడే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.ఇదిలా ఉండగా.. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇటీవల ఇరాన్‌కు చెందిన పలు సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్లు, సముద్ర కార్యకలాపాలకు సంబంధించిన ప్రాంతాలు, మైన్లు అమర్చే సామర్థ్యాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.రాడార్లను రెండుసార్లు ధ్వంసం చేశాంఇరాన్ రాడార్ వ్యవస్థలపై అమెరికా దాడులను కూడా ట్రంప్ ప్రస్తావించారు. అత్యాధునిక రాడార్ వ్యవస్థలను ఇరాన్ రెండుసార్లు ఏర్పాటు చేసినా.. వాటిని అమెరికా ధ్వంసం చేసిందన్నారు. ‘‘రాడార్‌ను మళ్లీ ఏర్పాటు చేసి మళ్లీ దాడికి గురికావడం వారికి విసుగొచ్చిందని అనుకుంటున్నా’’ అని వ్యాఖ్యానించారు.అమెరికా తాజా దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. తమ సార్వభౌమత్వాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఆరోపించింది. పలు ప్రావిన్సుల్లో సైనికేతర మౌలిక వసతులు, పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించింది. అమెరికా దాడులకు ప్రతిగా పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ‘తీవ్రమైన ప్రతిదాడులు’ చేపట్టినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది.ఇదీ చదవండి: అబ్బే.. అదసలు విషయమే కాదు: ట్రంప్ -
ఇరాన్ యుద్ధం అమెరికాకు పెద్ద విషయమే కాదు: ట్రంప్
ఇరాన్‌తో జరుగుతున్న సైనిక ఘర్షణ అమెరికాకు పెద్ద విషయం కాదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దీనిని యుద్ధం అని పిలవడం కంటే 'సైనిక ఘర్షణ' అని చెప్పడమే సరైందని వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై అమెరికా అడపాదడపా దాడులు చేస్తోందని, ప్రస్తుతం తమ దేశం నేరుగా యుద్ధంలో లేదని చెప్పారు.వైట్‌హౌస్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 'చాలామంది దీనిని యుద్ధం అని పిలవడం లేదు. నేను సైనిక ఘర్షణ అంటాను. ఎందుకంటే ఇది మాకు పెద్ద విషయం కాదు' అని ట్రంప్ పేర్కొన్నారు.'ఇరాన్ అణ్వాయుధం తయారు చేయకుండా అడ్డుకున్నాం'ఇరాన్‌పై అమెరికా సాధించిన విజయాలను ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. తమ చర్యలతో ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయకుండా అడ్డుకున్నామని అన్నారు. హర్మూజ్ జలసంధిపై అమెరికాకు గణనీయమైన నియంత్రణ ఉందని కూడా పేర్కొన్నారు.మధ్యంతర ఎన్నికల వేళ యుద్ధంపై చర్చఅమెరికాలో నవంబర్‌లో కీలక మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరాన్ ఘర్షణపై ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరి ప్రాధాన్యం సంతరించుకుంది. యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరగడం అమెరికా ప్రజలపై ఆర్థిక భారం పెంచుతోంది.ఇంధన ధరల పెరుగుదల వచ్చే ఎన్నికల్లో రిపబ్లికన్లకు నష్టం కలిగించే అవకాశం ఉందన్న ఆందోళనల మధ్య.. ఇరాన్‌తో జరుగుతున్న ఘర్షణ తీవ్రతను తగ్గించి చూపేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే విమర్శలు కూడా ఉన్నాయి.ఇదిలా ఉంటే, అమెరికా-ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో హర్మూజ్ జలసంధి భద్రత, అంతర్జాతీయ నౌకాయానం, చమురు సరఫరాలపై ఆందోళనలు మాత్రం కొనసాగుతున్నాయి.చదవండి: పాకిస్తాన్‌కు వెళ్తున్న రష్యా నౌకపై డ్రోన్ దాడి.. అందులో23 మంది భారతీయులు -
డీజిల్ ధరలు ఆల్‌టైమ్ హై
అమెరికాలో డీజిల్ ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా డీజిల్ సగటు ధర గ్యాలన్‌కు 5.85 డాలర్లకు చేరినట్లు అమెరికన్ ఆటోమొబైల్ అసోసియేషన్ (AAA) వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో గ్యాలన్ డీజిల్ ధర సుమారు 3.71 డాలర్లుగా ఉండగా.. ఏడాది వ్యవధిలో భారీగా పెరిగింది.డీజిల్ ధరల పెరుగుదలకు అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం, అంతర్జాతీయ ఇంధన సరఫరాల్లో ఏర్పడిన అంతరాయాలు ప్రధాన కారణాలుగా మారాయి. ఇరాన్ హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణాపై ఆంక్షలు విధించడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడుతోంది.రవాణా, వ్యవసాయ రంగాలపై ప్రభావంఅమెరికాలో ట్రక్కులు, సరుకు రవాణా వాహనాలు, వ్యవసాయ యంత్రాలు, నిర్మాణ రంగంలోని భారీ యంత్రాలకు డీజిల్ కీలక ఇంధనం. డీజిల్ ధరలు పెరగడం వల్ల రవాణా వ్యయాలు కూడా పెరుగుతున్నాయి. ఈ ప్రభావం క్రమంగా కిరాణా సరుకులు, దుస్తులు, ఫర్నిచర్ వంటి రోజువారీ వస్తువుల ధరలపై పడే అవకాశం ఉంది.మరోవైపు అమెరికాలో పెట్రోల్ ధర కూడా భారీగా పెరిగింది. శుక్రవారం దేశవ్యాప్తంగా గ్యాసోలిన్ సగటు ధర గ్యాలన్‌కు సుమారు 4.14 డాలర్లకు చేరింది.నాలుగేళ్ల రికార్డును అధిగమించిన డీజిల్ప్రస్తుత డీజిల్ ధర 2022 జూన్‌లో నమోదైన గత రికార్డు 5.81 డాలర్లను అధిగమించింది. అప్పట్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. తాజాగా ఇరాన్ యుద్ధం కారణంగా మరోసారి ఇంధన సరఫరాలపై ఒత్తిడి పెరిగింది.నవంబర్‌లో అమెరికా మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంధన ధరల పెరుగుదల, జీవన వ్యయం పెరగడం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా కూడా సవాలుగా మారుతోంది.చదవండి: వచ్చేస్తోంది సూపర్ ఎల్‌నినో! -
‘హబీబీ.. దా!’.. అమెరికాను ఆటాడుకున్న ఇరాన్
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటల యుద్ధం ఓ రేంజ్లో సాగుతోంది. ఓసారి ‘హర్ముజ్ సీమైన్లను తొలగించి.. పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకున్నాం’ అంటారు. మరోసారి హర్ముజ్‌లో ఇరాన్ మళ్లీ సీమైన్లు పెడుతోందని.. తమ సైన్యం అడ్డుకుంటోందని అంటారు. ఇంకోసారి ఇరాన్లో అమెరికా నిఘా ఎంత పక్కాగా ఉందో చెబుతూ.. ‘వాళ్లు బాత్రూమ్కు వెళ్లినా మాకు తెలిసిపోతుంది’ అని వ్యాఖ్యానించారు. మరి ట్రంప్ ఇంతలా మాట్లాడుతుంటే.. ఇరాన్ ఏం చేసిందో తెలుసా?.. ‘హబీబీ.. ఇరాన్‌కు రా!’ అంటూ అమెరికాను ఓ ఆటాడుకుంటోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్ముజ్ విషయంలో చేస్తున్న హెచ్చరికలకు నేరుగా స్పందించకుండా.. ఒక వీడియో గేమ్ రూపంలో వ్యంగ్యాస్త్రం సంధించింది ఇరాన్. ఆ దేశ ఎంబసీకి చెందిన సోషల్ మీడియా ఖాతా ఈ వ్యంగ్య వీడియోను పోస్టు చేసింది. కేవలం 35 సెకన్ల నిడివి ఉన్న యానిమేషన్లో హర్ముజ్ జలసంధి 3డీ మ్యాప్ కనిపిస్తుంది. ఆ తర్వాత అది ‘మైన్స్వీపర్’ గేమ్‌లా మారుతుంది. పాత కంప్యూటర్లలో బాంబులు ఎక్కడున్నాయో గుర్తిస్తూ ఆడే ఈ గేమ్‌ను.. హర్ముజ్‌లోని సీమైన్లకు అన్వయిస్తూ ఇరాన్ ఈ వీడియో రూపొందించింది. దానితోపాటు ‘హబీబీ (అంకుల్ సామ్).. ఇరాన్‌కు రా!’ అంటూ సందేశం ఇచ్చింది. అంటే మైన్స్వీపర్లో బాంబుల కోసం వెతికినట్టే.. అమెరికా కూడా హర్ముజ్‌లో సీమైన్ల కోసం వెతుకుతోందన్న భావన వచ్చేలా హేళన చేస్తూ వీడియోను రూపొందించిందన్నమాట.అసలు మైన్ల గొడవేంటి?పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి.. హార్ముజ్ జలసంధిలో సీమైన్లు ఏర్పాటు చేసి నౌకల రాకపోకలను అడ్డుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు ఐదు నెలల తర్వాత సీక్రెట్ ఆపరేషన్‌తో వాటిని సమర్థవంతంగా తొలగించామని.. ఇది అమెరికా సైన్యం సాధించిన అజేయ విజయమని ట్రంప్ ప్రకటించారు. అయితే రెండ్రోజులకే నాలిక మడతేసి.. ఇరాన్ మళ్లీ కొత్తగా సీమైన్లు ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు. అయినప్పటికీ అంతర్జాతీయ నౌకా మార్గాల్లో వాటిని తొలగించే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు.Habibi (Uncle Sam), come to Iran! pic.twitter.com/Ay6FdpwF8E— Iran Embassy in Sierra Leone (@IRANinSalone) September 3, 2026ఈ క్రమంలో.. హార్ముజ్ జలసంధిలోని ఇరాన్‌కు చెందిన లారక్ దీవిపై అమెరికా రెండు రాకెట్ లాంచర్లను ధ్వంసం చేసింది. ఆ లాంచర్లతో సీమైన్లను హార్ముజ్‌లోకి పంపేందుకు ఇరాన్ సిద్ధమవుతోందని అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతిగా జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించడంతో దాదాపు నెల రోజుల తర్వాత పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. ఈ క్రమంలో అమాయకులు సైతం ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇరాన్ మాత్రం అమెరికా వాదనలను ముందు నుంచే కొట్టిపారేస్తోంది. హర్ముజ్ సీమైన్ల విషయంలో అమెరికా తొలి నుంచి చెబుతోందంతా అబద్ధమేనని.. మార్కెట్లను శాంతింపజేసే ప్రయత్నమేనని అంటోంది. అంతేకాదు.. హర్ముజ్‌పై పూర్తి నియంత్రణ తమదేనంటూ ఉద్ఘాటించింది. దీంతో అమెరికా-ఇరాన్‌ల మధ్య‘ఎవరి నిఘా ఎంత?’.. ‘హార్ముజ్‌పై ఎవరి పట్టు?’ అనే రీతిలో పోరు కొనసాగుతోంది.ట్రంప్ మాటలకు మాటలతోనే కాదు..తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ఇరాన్‌పై సైనిక దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా అమెరికా స్థావరాలు, ప్రాంతీయ మిత్రదేశాలపై క్షిపణి, డ్రోన్ దాడులకు దిగుతోంది. దీంతో హర్ముజ్ చుట్టూ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇదే సమయంలో చమురు ఎగుమతులను అడ్డుకోవడం, ఆంక్షలను కఠినతరం చేయడం ద్వారా ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచాలని అమెరికా ప్రయత్నిస్తోంది. అయితే హర్ముజ్ విషయంలో అమెరికా సైనిక బలం, ఇరాన్ వ్యూహాత్మక ప్రతిస్పందన.. రెండూ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఇదీ చదవండి: శని గ్రహంపై సరికొత్త మిస్టరీ! -
ఇరాన్‌పై అమెరికా నిఘా మామూలుగా లేదట!
ఇరాన్‌పై అమెరికా నిఘా ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్లో ఏం జరుగుతుందో తమకు క్షణక్షణం తెలుసని.. అక్కడి వ్యక్తులు తమ కంటపడకుండా కనీసం బాత్రూమ్కు కూడా వెళ్లలేరంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై మరోసారి దాడి చేయాల్సి వస్తే ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.వైట్‌హౌస్‌లో ఇవాళ విలేకరులతో మాట్లాడిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ హర్ముజ్ జలసంధి ప్రాంతంలో రాడార్ వ్యవస్థలు, క్షిపణి వ్యవస్థలు, సముద్రంలో మైన్లు వేసే సామర్థ్యాన్ని తిరిగి నిర్మించేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. వాటిని అమెరికా నిఘా వ్యవస్థలు గుర్తించాయని.. నిర్మాణం పూర్తయ్యేలోపే లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశామని పేర్కొన్నారు. ‘‘ఇరాన్ నాయకత్వం మమ్మల్ని తక్కువ అంచనా వేస్తోంది. కానీ, వాళ్లేం చేస్తున్నారో మాకు అంతా కనిపిస్తోంది. వాళ్లు కదలలేరు. ప్రశాంతంగా బాత్రూమ్కు కూడా వెళ్లలేరు’’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలు, అక్కడి కదలికలపై అమెరికా ఎంత విస్తృతంగా నిఘా కొనసాగిస్తుందో చెప్పే క్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ రాడార్ వ్యవస్థలు, క్షిపణి సామర్థ్యాలు, హోర్ముజ్ జలసంధి వద్ద సైనిక కార్యకలాపాలపై అమెరికాకు పూర్తి సమాచారం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.మరోవైపు.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి ట్రంప్ భద్రత విషయంలో అమెరికా భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. దీనికి నిదర్శనంగా టర్కీలో చోటుచేసుకున్న ఘటనను చెప్పుకోవచ్చు. ఇరాన్ నుంచి ట్రంప్‌పై ముప్పు ఉందన్న నిఘా సమాచారంతో.. ఆయన ప్రయాణాన్ని అత్యంత రహస్యంగా మార్చారు. అంకారా నుంచి బయలుదేరే సమయంలో ట్రంప్ పాత ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ఉన్నట్లు బయట ప్రపంచానికి కనిపించినప్పటికీ.. అనంతరం క్యాటరింగ్ వాహనం ద్వారా మరో చిన్న సైనిక విమానంలోకి రహస్యంగా తరలించారు. మీడియా, కొంతమంది సిబ్బందికి కూడా ఆయన అసలు విమానంలో లేరన్న విషయం వెంటనే తెలియలేదు. అంటే.. ట్రంప్ భద్రత కోసం అమెరికా ఎంత స్థాయిలో రహస్య ఆపరేషన్లు నిర్వహించిందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఇప్పుడు ఇరాన్ కదలికలపై తమ నిఘా సామర్థ్యాన్ని చాటుకునే క్రమంలో ట్రంప్ చేసిన ‘‘బాత్రూమ్కు కూడా వెళ్లలేరు’’ వ్యాఖ్యలు.. భద్రతా వ్యవస్థపై ఆయనకున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.హర్ముజ్ మా ఆధీనంలోనే..ఇరాన్ ఆంక్షల కారణంగా నెలలుగా తీవ్ర ఉద్రిక్తతకు కేంద్రంగా మారిన హర్ముజ్ జలసంధిపై కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంపై అమెరికాకు బలమైన నియంత్రణ ఉందని చెప్పారు. ప్రతిరోజూ భారీ మొత్తంలో చమురును తీసుకెళ్లే నౌకలు అక్కడి నుంచి వెళ్తున్నాయని.. అప్పుడప్పుడు ఇరాన్ డ్రోన్లు దాడి చేసినా వాటిని కూల్చివేస్తున్నామని తెలిపారు.ఇరాన్ సముద్రంలో మైన్లు వేయడానికి ప్రయత్నిస్తోందని, ఇందుకోసం ప్రత్యేకంగా రాకెట్ వ్యవస్థను సిద్ధం చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఆ సామర్థ్యాన్ని అమెరికా దాడుల్లో ధ్వంసం చేశామని పేర్కొన్నారు.భారీ దాడి.. 18 మంది మృతిఇటీవల.. దాదాపు నెల గ్యాప్ తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఇందులో ఇరాన్లో కనీసం 18 మంది మృతి చెందగా, 108 మంది గాయపడ్డారని తాజా నివేదికలు చెబుతున్నాయి. హర్ముజ్ సమీపంలోని కుహెస్తక్ ప్రాంతంలో ఓ వివాహ వేడుక జరుగుతున్న ఇంటిపై అమెరికా దాడి జరిగినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు ఏపీ నివేదించింది. అయితే అమెరికా సైన్యం మాత్రం తామేమీ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని తెలిపింది.అమెరికాకు ఇరాన్ దీటైన బదులుఅమెరికా దాడులకు ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించింది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు, అమెరికా మిత్రదేశాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు సమాచారం. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్, యూఏఈ, ఇరాక్‌లోని కుర్దిస్తాన్ ప్రాంతాల్లో అమెరికా ప్రయోజనాలకు చెందిన లక్ష్యాలపై ఇరాన్ దాడులు చేసినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.‘ఏ క్షణమైనా దాడి చేస్తాం’ఇరాన్‌తో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా అవసరమైతే ఇరాన్‌పై ఎప్పుడైనా కొత్త దాడికి దిగేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఆ దాడులు భీకరంగా ఉండొచ్చని కూడా వ్యాఖ్యానించారు. అయితే తాజా దాడుల తర్వాత పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగదని, త్వరలోనే ముగిసే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: ఇరాన్ అధ్యక్షుడితో మోదీ భేటీ.. అమెరికా కన్నెర్ర -
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. యూఏఈ విమాన సర్వీసులపై భారీ ప్రభావం
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు యూఏఈ నుంచి నడిచే విమాన సర్వీసులపై భారీ ప్రభావం చూపుతున్నాయి. Emirates, Etihad Airways, flydubai, Air Arabia వంటి ప్రాంతీయ విమానయాన సంస్థలు కొన్ని కీలక సర్వీసులను కొనసాగిస్తున్నప్పటికీ, పలు మార్గాల్లో విమానాలు రద్దు, ఆలస్యం లేదా దారి మళ్లింపులకు గురవుతున్నాయి.సెప్టెంబర్ 1న అమెరికా బలగాలు ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై దాడులు చేయగా, అనంతరం ఇరాన్ బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లోని అమెరికా ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. దీంతో గల్ఫ్ ప్రాంతంలోని గగనతల పరిస్థితులు మరింత అనిశ్చితంగా మారాయి.నిలిచిపోయిన అంతర్జాతీయ సర్వీసులుAir Canada, British Airways, Cathay Pacific, Singapore Airlines, ITA Airways, Finnair, Philippine Airlines, AirBaltic, Korean Air, Pegasus, Virgin Atlantic, Lufthansa, Eurowings, SWISS తదితర అంతర్జాతీయ సంస్థలు దుబాయ్ లేదా అబుదాబికి సంబంధించిన కొన్ని సర్వీసులను వివిధ తేదీల వరకు నిలిపివేశాయి.ప్రస్తుత పరిస్థితుల్లో విమానం బుక్ అయినా, విమానాశ్రయానికి బయలుదేరే ముందు తప్పనిసరిగా విమాన స్థితిని తనిఖీ చేసుకోవాలని యూఏఈ విమానాయాన సంస్థలు ప్రయాణికులకు సూచిస్తున్నాయి.చదవండి: "ట్రంప్ స్ట్రయిట్"గా మార్చాలా..? అమెరికా అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు -
అమెరికా–ఇరాన్ యుద్ధం: గల్ఫ్‌లో హైటెన్షన్.. తాజా పరిణామాలు ఇవే
దాదాపు నెల రోజుల తర్వాత మళ్లీ పశ్చిమాసియా భగ్గుమంటోంది. కాల్పుల విరమణను తుంగలో తొక్కి.. శాంతి చర్చలను పక్కన పెట్టి.. అమెరికా-ఇరాన్‌ను పరస్పర దాడులు జరుపుతున్నాయి. తాజాగా అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ వరుస క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది. మరోవైపు అమెరికా బలగాలు హర్ముజ్ జలసంధిపై దాదాపు పూర్తి నియంత్రణ సాధించాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ఇవిగో..US-Iran War Live Updatesఅరబ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్అమెరికా బలగాలను పంపించేయండి.. లేదంటే దాడులే అంటూ అరబ్ దేశాలను ఇరాన్ హెచ్చరించింది. తమ భూభాగాల్లోని అమెరికా బలగాలను, సైనిక స్థావరాలను తొలగించాలని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) పొలిటికల్ వింగ్ డిప్యూటీ జనరల్ యదొల్లా జవానీ హెచ్చరించారు. అమెరికా దాడులకు తమ దేశాల నుంచి ఏదైనా వేదికగా మారితే ‘తీవ్రమైన’ ప్రతీకారం తప్పదన్నారు. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లను ప్రత్యేకంగా ప్రస్తావించారు.బెత్లహెమ్‌లో పాలస్తీనా ఇంటి కూల్చివేతవెస్ట్ బెత్లహెమ్లోని నహాలిన్ పట్టణంలో పాలస్తీనాకు చెందిన ఓ ఇంటిని ఇజ్రాయెల్ బలగాలు కూల్చివేశాయి. సైనిక వాహనాలు, బుల్డోజర్లతో పట్టణంలోకి ప్రవేశించిన బలగాలు.. 15 ఏళ్లకు పైగా నివాసంగా ఉన్న ఆ భవనాన్ని నేలమట్టం చేసినట్లు తెలుస్తోంది.బహ్రెయిన్‌పై ఇరాన్ డ్రోన్ దాడులు?బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాన్ని ఇరాన్ భారీ డ్రోన్ దాడులతో లక్ష్యంగా చేసుకున్నట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ దాడిపై ఇప్పటివరకు అధికారిక ధ్రువీకరణ వెలువడలేదు. ఇదే సమయంలో బహ్రెయిన్ రక్షణ దళాలు తమ గగనతలంలోకి వచ్చిన పలు ఇరాన్ వైమానిక దాడులను అడ్డుకున్నట్లు ప్రకటించాయి.జోర్డాన్లోకి 13 బాలిస్టిక్ మిసైళ్లుఇరాన్ నుంచి వచ్చిన 13 బాలిస్టిక్ క్షిపణులను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు ఎదుర్కొన్నట్లు జోర్డాన్ ప్రకటించింది. అయితే ఈ క్షిపణుల వల్ల నష్టం జరిగిందా?.. ఎక్కడ పడ్డాయి? అనే వివరాలను అధికారులు వెల్లడించలేదు.మష్హద్లో విషాదంఇరాన్లోని ఈశాన్య నగరం మష్హద్లో ప్రభుత్వానికి, సాయుధ దళాలకు మద్దతుగా జరుగుతున్న కార్యక్రమంలోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా.. 10 మందికి పైగా గాయపడ్డారు. డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది రోడ్డు ప్రమాదమేనని, రాజకీయ ఉద్దేశం ఉన్నట్లు ఆధారాలు లేవని అధికారులు తెలిపారు.జోర్డాన్‌లో అమెరికా స్థావరంపై ఇరాన్ దాడిజోర్డాన్లోని ప్రిన్స్ హసన్ ఎయిర్‌బేస్‌పై భారీ బాలిస్టిక్ క్షిపణి దాడి చేసినట్లు ఇరాన్ IRGC ప్రకటించింది. అక్కడ RQ-4, MQ-9 డ్రోన్లను ఉంచిన హ్యాంగర్లను లక్ష్యంగా చేసుకున్నామని తెలిపింది. పలు డ్రోన్లు ధ్వంసమయ్యాయని, అమెరికా సిబ్బందిలో కొందరు మరణించారని, మౌలిక వసతుల్లో మంటలు చెలరేగాయని పేర్కొంది. అయితే దీనిపై అమెరికాగానీ, జోర్డాన్గానీ ఇంకా స్పందించలేదు. లవాన్ ద్వీపంపై అమెరికా దాడులుఇరాన్లోని లవాన్ ద్వీపంపై అమెరికా జరిపిన తాజా దాడుల్లో ముగ్గురు బసీజ్ పారామిలటరీ సభ్యులు మరణించినట్లు ఇరాన్ సెమీ అధికారిక మెహర్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.పెళ్లి వేడుకపై దాడి.. ఘోరంఇరాన్లోని సిరిక్ సమీపంలో జరిగిన పెళ్లి వేడుకపై అమెరికా దాడి జరిగిందని ఇరాన్ అధికారులు ఆరోపించారు. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి సహా ఐదుగురు మరణించగా.. మరో 50 మంది గాయపడినట్లు తెలిపారు. ఇరాన్ విదేశాంగ శాఖ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది.హర్ముజ్‌లో షిప్పింగ్ ట్రాఫిక్ డౌన్హర్ముజ్ జలసంధి మీదుగా మంగళవారం కేవలం నాలుగు వాణిజ్య నౌకలు మాత్రమే ప్రయాణించాయి. సాధారణంగా 10 రోజుల సగటు రోజుకు సుమారు 13 నౌకలుగా ఉండగా.. తాజా సంఖ్య దాని కంటే గణనీయంగా తక్కువగా ఉంది. కేప్లర్ ప్రాథమిక షిప్పింగ్ డేటా ప్రకారం నాలుగు నౌకల్లో ఒకటి భారీ క్రూడ్ ఆయిల్ క్యారియర్, మిగిలినవి వివిధ రకాల సరకు/చమురు రవాణా నౌకలు. అయితే సోమవారం హర్ముజ్ జలసంధి మీదుగా 17 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా జరిగినట్లు అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ తెలిపారు. యుద్ధం కారణంగా రాకపోకలు తగ్గిన తర్వాత ఒక్కరోజులో నమోదైన అత్యధిక చమురు రవాణా ఇదేనని పేర్కొన్నారు.బహ్రెయిన్‌లో వరుస అలర్ట్లుబహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆరు గంటల వ్యవధిలో మూడోసారి ‘పొంచి ఉన్న ముప్పు’పై అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. అధికారిక మార్గాల్లో వచ్చే సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని కోరింది.ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది: ట్రంప్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్ముజ్ జలసంధిపై అమెరికా బలగాలు దాదాపు పూర్తి నియంత్రణ సాధించాయని అన్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతున్నదని పేర్కొన్నారు. ఇరాన్‌పై అమెరికా దాడులు, ఆ తర్వాత టెహ్రాన్ ప్రతీకార చర్యల నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇరాన్ ప్రతీకార దాడులుఅమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తన భూభాగం నుంచి క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్లు IRGC ప్రకటించింది. అమెరికా దాడులను ‘నిరాశతో కూడిన దాడులు’గా అభివర్ణించింది. ప్రతీకార చర్యల్లో పెద్ద సంఖ్యలో అమెరికా బలగాలను హతమార్చినట్లు పేర్కొన్నప్పటికీ.. ఈ వాదనపై అమెరికా నుంచి తక్షణ ధ్రువీకరణ రాలేదు.ఇరాన్ ప్రతీకార దాడుల పరిధి కువైట్, బహ్రెయిన్, జోర్డాన్, ఇరాక్‌లోని ఎర్బిల్ వరకు విస్తరించినట్లు తెలుస్తోంది. మరోవైపు గల్ఫ్ దేశాలు తమ వైమానిక రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేశాయి. ముఖ్యంగా హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు, చమురు రవాణాపై యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమవుతోంది.ఇదీ చదవండి: అమెరికా సైనికుల రాక.. సెక్స్‌వర్కర్ల వేట! -
అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు
మిడిల్ ఈస్ట్‌లో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్థావరాలపై అమెరికా తాజా దాడుల తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది.ఇరాన్ మంగళవారం రాత్రి జోర్డాన్, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. జోర్డాన్‌లో సైరన్లు మోగగా, ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించిన 13 ఇరాన్ క్షిపణుల్లో పదింటిని వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. మిగిలిన మూడు క్షిపణులు జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో పడినట్లు జోర్డాన్ సాయుధ దళాలు వెల్లడించాయి.జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై జరిగిన దాడుల్లో అమెరికా సైనికులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ఇరాన్‌కు చెందిన IRGC మాత్రం జోర్డాన్‌లోని క్యాంప్ టిటిన్పై దాడి చేసి భారీ సంఖ్యలో అమెరికా సైనికులను హతమార్చినట్లు ప్రకటించింది.మరోవైపు బహ్రెయిన్‌లోని షేక్ ఇసా ఎయిర్ బేస్ వద్ద అమెరికా సైనికులు, రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని కామికేజ్ డ్రోన్లతో భారీ దాడి చేసినట్లు IRGC ప్రకటించింది. అయితే ఈ దాడిపై బహ్రెయిన్ లేదా అమెరికా నుంచి అధికారిక ధృవీకరణ రాలేదు.బహ్రెయిన్, కువైట్‌కు హెచ్చరికలుఅమెరికా దాడులు ప్రారంభమైన కొద్దిసేపటికే ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫఘారి తీవ్ర హెచ్చరికలు చేశారు. బహ్రెయిన్, కువైట్ విషయంలో ఇకపై ఇరాన్ సంయమనం పాటించబోదని తెలిపారు. “బహుమతులు దారిలో ఉన్నాయి” అంటూ హెచ్చరించారు.అమెరికా దాడులకు ఇదే కారణంఇరాన్పై తాజా దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. హర్మూజ్ జలసంధిలో సముద్రపు మైన్లు అమర్చేందుకు ఇరాన్ ప్రయత్నించడం, అమెరికా సైనిక స్థావరంపై ఎనిమిది క్షిపణులు ప్రయోగించడం తమ దాడులకు కారణమని ట్రంప్ తెలిపారు.చదవండి: ఇరాన్‌పై మళ్లీ దాడులు మొదలుపెట్టిన అమెరికా -
ఇరాన్‌పై మళ్లీ దాడులు మొదలుపెట్టిన అమెరికా
ఇరాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కు చెందిన లక్ష్యాలపై అమెరికా బలగాలు దాడులు ప్రారంభించాయి. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ దాడులు ప్రారంభమైనట్లు అమెరికా వెల్లడించింది.Today at 12 p.m. ET, U.S. forces began striking Islamic Revolutionary Guard Corps (IRGC) targets in Iran. The strikes follow recent attempted attacks by the IRGC against commercial shipping in the Strait of Hormuz and against American service members deployed to the region.— U.S. Central Command (@CENTCOM) September 1, 2026హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని IRGC ఇటీవల దాడులకు ప్రయత్నించిందని అమెరికా పేర్కొంది. అలాగే ఈ ప్రాంతంలో మోహరించిన అమెరికా సైనికులపై కూడా IRGC దాడులకు ప్రయత్నించినట్లు తెలిపింది.ఈ పరిణామాల నేపథ్యంలోనే IRGC లక్ష్యాలపై అమెరికా సైనిక చర్య చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ప్రపంచంలోని కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హర్మూజ్ జలసంధి చుట్టూ ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతలు తాజా దాడులతో మరింత పెరిగే అవకాశం ఉంది.కాగా, అమెరికా-ఇరాన్ మధ్య దాదాపు నెల రోజుల తర్వాత ఈ ఆదివారం మరోసారి దాడి-ప్రతిదాడులు జరిగాయి. తొలుత హర్ముజ్ జలసంధిలోని ఇరాన్ లారక్ దీవిపై అమెరికా దాడి చేయగా (ముగ్గురు చనిపోయారు).. ప్రతీకారంగా ఇరాన్ జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్ననే తీవ్ర దాడులు తప్పవని గట్టి వార్నింగ్ ఇచ్చాడు.చదవండి: ఉత్తరకొరియా బిగ్ వార్నింగ్.. ఇలాగైతే ప్రపంచం.. -
పెద్దన్నా.. ఏంటీ కన్ఫ్యూజన్?? ఆంక్షలా.. దాడులా?
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ఒకవైపు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను క్రమంగా ఉక్కిరిబిక్కిరి చేసేలా కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్న ట్రంప్.. మరోవైపు అవసరమైతే ఇరాన్‌పై భారీ సైనిక దాడులు తప్పవంటూ బెదిరిస్తున్నారు. ఆ వెంటనే అదో చిన్న యుద్ధమంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయంలో పెద్దన్న వైఖరిలో స్పష్టత కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాల సంయుక్త దాడితో పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. అంటే ఆర్నెలు పూర్తయ్యిందన్నమాట. అయితే ఇరాన్‌పై అమెరికా తాజాగా మరోసారి సైనిక చర్యకు దిగింది. దాదాపు నెల రోజుల తర్వాత జరిగిన దాడి ఇది. హర్ముజ్ జలసంధిలో సముద్ర గనులను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ అమెరికా సైన్యం.. ఇరాన్ రాకెట్ లాంచర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ మరో అడుగు ముందుకేశారు. ఇరాన్ కీలక ఇంధన కేంద్రంగా ఉన్న ఖర్గ్ ద్వీపాన్ని ‘తునాతునకలు చేస్తాం’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఏఐ వీడియోతో హెచ్చరించారు.అయితే దీనికి కొద్ది రోజుల ముందే అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ మరో వ్యూహాన్ని ప్రకటించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసేలా కొత్త ఆంక్షలను అమలు చేయనున్నామని.. దీనిని ఆయన ‘ఆర్థిక డీ-డే’గా అభివర్ణించారు. ఈ ఆర్థిక ఒత్తిడి ద్వారా ఇరాన్‌ను చర్చల బాట పట్టించవచ్చని.. తద్వారా మరోసారి సైనిక ఉద్రిక్తతకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయన సంకేతాలిచ్చారు. ఇరాన్ యుద్ధం విషయంలో ట్రంప్ పట్ల ప్రజాదరణ క్రమంగా తగ్గిపోతున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ అటు ప్రత్యర్థి డెమోక్రట్లే కాదు.. ఇటు సొంత పార్టీ రిపబ్లికన్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ‘ఏ వ్యూహమో ఏమో.. ఏమీ అర్థం కావడం లేదు’ఆరు వారాల్లో ముగుస్తుందని ట్రంప్ గతంలో చెప్పిన యుద్ధం.. ఆరు నెలలు దాటినా కొనసాగుతుండటం కూడా ప్రశ్నలకు తావిస్తోంది. ట్రంప్, ఆయన కేబినెట్ సభ్యులు పలుమార్లు ఈ యుద్ధం ముగిసిందని, అమెరికా విజయం సాధించిందని ప్రకటించినప్పటికీ.. ఇరాన్‌తో ఉద్రిక్తతలు మాత్రం పూర్తిగా చల్లారలేదు. ట్రంప్ వైఖరిలో తరచూ కనిపిస్తున్న ఈ మార్పులపై అమెరికా రాజకీయ వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోంది. ట్రంప్ పాలనలోని విధానాలపై అవగాహన ఉన్న మాజీ భద్రతా అధికారి ఒకరు.. ఇరాన్‌పై యుద్ధం స్పష్టమైన ప్రణాళిక లేకుండానే ప్రారంభమైందని, ఇప్పటికీ పరిస్థితులకు అనుగుణంగానే నిర్ణయాలు మారుతున్నాయని వ్యాఖ్యానించారు. ట్రంప్‌తో ఎవ్వరూ సంతృప్తిగా లేరా?రిపబ్లికన్ పార్టీలో ఇరాన్ ఉద్రిక్తతలపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. యుద్ధం మరింత పొడిగితే చమురు ధరలు పెరిగి.. అమెరికన్లపై భారం పడుతుందని, వచ్చే మధ్యంతర ఎన్నికలపై ప్రభావం చూపొచ్చని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సహా యుద్ధంపై అప్రమత్తంగా ఉన్న వర్గాలు సైతం సంఘర్షణ త్వరగా ముగియాలని కోరుకుంటున్నాయి. మరోవైపు ఇరాన్‌పై మరింత కఠినంగా వ్యవహరించాలని కోరుకునే హార్డ్లైన్ వర్గం కూడా ట్రంప్ తీరుపై పూర్తిగా సంతృప్తిగా లేదు.ట్రంప్ ప్రచార బృందంలో పని చేసిన ఓ మాజీ అధికారి మాట్లాడుతూ.. ఇరాన్‌ను అదుపులోకి తీసుకురావాలన్న ట్రంప్ లక్ష్యాన్ని సమర్థించే రిపబ్లికన్లు కూడా ప్రస్తుత పరిణామాలతో అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. మరో రిపబ్లికన్ వ్యూహకర్త ఈ పరిస్థితిని సరదాగా ‘ఫ్రెండ్లీ జోన్లో చిక్కుకున్నట్లుంది’ అంటూ అభివర్ణించారు. అంటే.. ట్రంప్ తీసుకుంటున్న ఏ నిర్ణయం కూడా పూర్తిగా ఏ వర్గాన్నీ సంతృప్తిపరచడం లేదన్నమాట.మధ్యంతర ఎన్నికల వేళ పెరుగుతున్న ఒత్తిడిఅమెరికాలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరాన్ యుద్ధం ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా కూడా సవాలుగా మారుతోంది. ఇప్పటికే అధిక ధరలతో అమెరికన్లు ఇబ్బంది పడుతున్న సమయంలో.. హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు చమురు సరఫరాపై ప్రభావం చూపితే పరిస్థితి మరింత కఠినంగా మారే అవకాశం ఉంది.ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా గతంలో ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు రవాణా జరిగేది. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికాలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే ఆందోళన కలిగిస్తున్నాయి.‘ఇది వ్యూహంలో భాగమే’అయితే ట్రంప్ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్నవారు మాత్రం ఈ పరిణామాలను మరోలా చూస్తున్నారు. ఇరాన్‌పై సైనిక, ఆర్థిక ఒత్తిడిని ఒకేసారి కొనసాగించడం ఉద్దేశపూర్వక వ్యూహమేనని వారు చెబుతున్నారు. ఒకవైపు హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు పూర్తిగా నిలిచిపోకుండా ఒత్తిడి కొనసాగిస్తూ.. మరోవైపు ఆంక్షల ప్రభావం ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై పడే వరకు వేచి చూడాలన్నది ట్రంప్ వ్యూహంగా వారు పేర్కొంటున్నారు.మాజీ అమెరికా రాయబారి జేమ్స్ జెఫ్రీ కూడా తాజా పరిణామాలను ఇరువైపులా జరుగుతున్న ప్రతిచర్యలుగానే అభివర్ణించారు. ఇరాన్, అమెరికా రెండూ పూర్తిస్థాయి దాడులకు తిరిగి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కనిపించడం లేదని పేర్కొన్నారు.యుద్ధం త్వరగా ముగిస్తే మంచిదిఇదిలా ఉండగా.. ట్రంప్ యంత్రాంగంలోనే యుద్ధాన్ని ముగించాలన్న అభిప్రాయం బలపడుతున్నట్లు చర్చ జరుగుతోంది. చమురు పరిశ్రమకు చెందిన ఓ ఉన్నతాధికారి ప్రకారం.. ఘర్షణలను ముగించాలన్న ఒత్తిడి భారీగా ఉంది. ఇరాన్ పూర్తిగా బలహీనపడే వరకు ఒత్తిడి కొనసాగించాలని భావించే అధికారులు కూడా ఉన్నారు. ఇరాన్‌ను తీవ్ర ఆర్థిక, సైనిక ఒత్తిడిలోకి నెట్టినప్పుడే అది అమెరికాతో తమకు అనుకూలమైన ఒప్పందానికి వస్తుందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదుఅమెరికా విధిస్తున్న ఆంక్షలు తమను చర్చల బాట పట్టిస్తాయన్న వాదనను ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది. అమెరికా వాదనలు అబద్ధాలంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘెర్ ఘలీబాఫ్ విమర్శించారు. అమెరికా ఆంక్షల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చైనా కూడా ఇరాన్‌కు మద్దతుగా నిలుస్తోంది. ఇరాన్ నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేసే చైనా.. అంతర్జాతీయ చట్టాలకు ఆధారం లేని ఏకపక్ష అమెరికా ఆంక్షలను వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది.మొత్తంగా.. ఇరాన్‌పై ట్రంప్ ఒత్తిడి మాత్రం తగ్గడం లేదు. ఆర్థిక ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి చేయాలా? సైనిక దాడులతో లొంగదీసుకోవాలా? లేక ఒత్తిడితోనే చర్చల బాట పట్టించాలా? అన్నది మాత్రం స్పష్టంగా కనిపించడం లేదు. ఒకవైపు యుద్ధం ముగిసిందంటూనే.. మరోవైపు దాడుల హెచ్చరికలు చేయడం, ఆ తర్వాత మళ్లీ చర్చలకు సంకేతాలివ్వడం అమెరికా వ్యూహంపై సందేహాలకు తావిస్తోంది. ఇరాన్‌ను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ట్రంప్ నిర్ణయం ఏదైనా కావొచ్చు.. కానీ యుద్ధాన్ని ఎప్పుడు, ఎలా ముగించాలన్నదే ఇప్పుడు ఆయన ముందున్న అసలు సవాలు!. ఇదీ చదవండి: ఈసారి కాస్త గట్టిగానే కొడతాం -
‘ఈసారి గట్టిగానే కొడతాం’.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. అమెరికా దాడులకు ప్రతిగా జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసింది. అయితే దీనికి దీటుగా స్పందిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. ‘‘మేం వారిని గట్టిగా కొడతాం. ప్రతిస్పందన తప్పకుండా ఉంటుంది’’ అని ఆయన అన్నారు. ఫాక్స్ న్యూస్‌తో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ దాడులకు కచ్చితంగా ప్రతీకారం ఉంటుంది. ఈసారి గట్టిగానే కొడతాం. అది వాళ్లు కోలుకోలేని స్థాయిలోనే ఉంటుందని అని అన్నారు. అయితే ఆ ప్రతీకార చర్యలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై స్పష్టత ఇవ్వకపోయినా.. అమెరికా సైనిక, ఆర్థిక మార్గాల్లో చర్యలకు సిద్ధమవుతున్న సంకేతాలు ఇచ్చారు. అలాగే ఇరాన్‌ను ఓ విఫల దేశంగా అభివర్ణిస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికే ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం, కరెన్సీ వంటి కీలక వ్యవస్థలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వం తీవ్ర గందరగోళంలో ఉందని, దేశాన్ని సరిగ్గా నడిపించే స్థితిలో లేదని అన్నారు. అదే సమయంలో హర్ముజ్ జలసంధి సురక్షితంగానే ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా బలగాలపై ఇరాన్ దాడులు చేసినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో జోర్డాన్ సైన్యం అప్రమత్తమైంది. తమ గగనతలంలోకి వచ్చిన ఎనిమిది క్షిపణులను అడ్డుకున్నట్లు జోర్డాన్ ప్రకటించింది. దాదాపు నెల రోజుల తర్వాత.. లారక్ ద్వీపంపై అమెరికా బలగాలు దాడులు చేశాయి. ఆ దాడుల్లో సాధారణ పౌరులు సైతం మరణించారని ఆరోపిస్తూ ఇరాన్ ఈ దాడులకు పాల్పడింది.మరోవైపు ఇరాన్ సాయుధ దళాలు, అమెరికా మధ్య ఉద్రిక్తతలు గల్ఫ్ ప్రాంతానికీ విస్తరించాయి. తూర్పు హర్ముజ్ జలసంధిపై అమెరికాకు చెందిన MQ-9 డ్రోన్‌ను తమ వాయు రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది.‘ఖర్గ్’పై ట్రంప్ పోస్టు.. ఇరాన్‌కు సందేశమేఇరాన్లోని ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ ఆదివారం చేసిన సోషల్ మీడియా పోస్టు కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ద్వీపాన్ని పేల్చేస్తూ అమెరికా సైనిక దాడులకు సంబంధించినట్లు కనిపించే ఏఐ రూపొందించిన వీడియోను ఆ పోస్టుతో జత చేశారు. అయితే ఖర్గ్ ద్వీపంపై అమెరికా సైన్యం రాత్రి దాడులు చేయలేదని ఓ అమెరికా అధికారి స్పష్టం చేశారు. ట్రంప్ పోస్టు వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించగా.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వ్యూహాత్మకంగా సందేశాలు ఇస్తారని, ఇరాన్‌కు ఆయన ఓ సందేశం పంపుతున్నారని చెప్పారు.ఐరాసను ఆశ్రయించిన ఇరాన్అమెరికా దాడులపై ఇరాన్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని ఆశ్రయించింది. లారక్ ద్వీపంపై అమెరికా దాడిలో సైనికులు, పౌరులు మరణించారని, పలువురు గాయపడ్డారని ఇరాన్ ఆరోపించింది. ఈ దాడి తమ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడమేనని పేర్కొంది. జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై తాము చేసిన దాడులు ‘‘ఆత్మరక్షణ చర్యల్లో భాగమే’’ అని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా మరిన్ని దాడులకు పాల్పడితే తాము వెనక్కి తగ్గబోమని హెచ్చరించింది. అమెరికా దాడులను నిలిపివేయాలని భద్రతా మండలిని కోరింది.ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై దెబ్బఇరాన్పై అమెరికా తాజాగా ప్రకటించిన ఆంక్షల ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ అన్నారు. తాజా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ‘‘వారాలు లేదా నెలల్లో కుప్పకూలే అవకాశం ఉందని’’ వ్యాఖ్యానించారు. అయితే అమెరికా అసలు లక్ష్యం ఇరాన్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయడం కాదని.. చర్చలకు ఇరాన్‌ను రప్పించే ప్రయత్నమేనని బెసెంట్ స్పష్టం చేశారు. యూఏఈకి ఇరాన్ డ్రోన్.. తీవ్ర ఆగ్రహంఇరాన్ తమపై డ్రోన్ దాడికి ప్రయత్నించిందని యూఏఈ ఆరోపించింది. గగనతల రక్షణ వ్యవస్థలు ఆ డ్రోన్‌ను అడ్డుకున్నాయని తెలిపింది. ఈ ఘటనను ‘‘ప్రమాదకరమైన ఉద్రిక్తత’’గా అభివర్ణిస్తూ ఇరాన్ చర్యను తీవ్రంగా ఖండించింది.హర్ముజ్‌లో ట్యాంకర్‌పై దాడి జరిగిందా?హర్ముజ్ జలసంధిలో ఓ సూపర్ ట్యాంకర్ రెండు సముద్ర గనులను ఢీకొని నిలిచిపోయిందన్న ఇరాన్ ప్రభుత్వ మీడియా, రెవల్యూషనరీ గార్డ్స్ వాదనలను అమెరికా సెంట్రల్ కమాండ్ ఖండించింది. ఆ వార్త పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం కావడంతో.. అక్కడ ఎలాంటి చిన్న ఘటన జరిగినా అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇరాన్‌కు అండగా ఈయూ ఒత్తిడిఇరాన్ తన అస్థిరత సృష్టించే చర్యలను నిలిపివేసి శాంతి చర్చలకు రావాల్సిందేనని యూరోపియన్ యూనియన్ పేర్కొంది. అమెరికాతో పాటు ఇతర మిత్రదేశాలతో కలిసి ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని కొనసాగిస్తామని తెలిపింది. మరోవైపు ఇరాన్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్.. ఈ ప్రాంతంలో అమెరికాను చుట్టుముట్టేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. చమురు ఎగుమతి చేసే దేశాలపై ఒత్తిడి పెంచడం ద్వారా అమెరికాపై ఆర్థిక ప్రభావం చూపాలని సూచించారు.ఇదీ చదవండి: H4 వీసాదారులకు ట్రంప్ ఝలక్ -
ఇరాన్‌పై మరింత తీవ్ర దాడులు తప్పవు.. ట్రంప్ వార్నింగ్
అమెరికా, ఇరాన్ మధ్య దాదాపు నెల రోజుల తర్వాత (ఆదివారం) మరోసారి దాడి-ప్రతిదాడులు జరిగాయి. తొలుత హర్ముజ్ జలసంధిలోని ఇరాన్ లారక్ దీవిపై అమెరికా దాడి చేయగా (ముగ్గురు చనిపోయారు).. ప్రతీకారంగా ఇరాన్ జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. దీంతో ఇరుదేశాల మధ్య ఘర్షణలు మరోసారి తారాస్థాయికి చేరినట్లైంది.ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించాడు. ఇరాన్‌పై మరింత తీవ్ర దాడులు తప్పవని గట్టి వార్నింగ్ ఇచ్చాడు.ఇరాన్ ప్రతిదాడుల తర్వాత ట్రంప్ తన ట్రూత్ ఖాతాలో ఇరాన్‌లోని కీలక చమురు కేంద్రం 'ఖార్గ్ ద్వీపం' పేలిపోతున్నట్లు ఓ ఏఐ వీడియోను పోస్ట్ చేశాడు. అయితే దీనిపై అమెరికాకు చెందిన ఓ కీలక అధికారి భిన్నంగా స్పందించాడు. అమెరికా ఖార్గ్ ద్వీపాన్ని లక్ష్యంగా చేసుకోలేదని ఆయన తెలిపాడు.ఖార్గ్ ద్వీపం యుద్ధానికి ముందు ఇరాన్ చమురు ఎగుమతుల్లో సుమారు 90 శాతం నిర్వహించేది. ఒకవేళ అక్కడ దాడి జరిగితే ప్రపంచ ఇంధన మార్కెట్లపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది.ఇరాన్ అధ్యక్షుడి శాంతి స్వరంజోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడుల తర్వాత ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ శాంతి స్వరం వినిపించాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కిర్గిజిస్థాన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇరాన్ ఇంకా చర్చల ద్వారా ఒప్పందానికి రావాలని కోరుకుంటోందని అన్నాడు. యుద్ధం కొనసాగడం ఎవరికీ ప్రయోజనం కలిగించదని పేర్కొన్నాడు.చదవండి: అమెరికా మెరుపు దాడులు.. ఇరాన్ ఎదురుదెబ్బ! -
అమెరికా మెరుపు దాడులు.. ఇరాన్ ఎదురుదెబ్బ!
పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలోని ఇరాన్ లారక్ దీవిపై అమెరికా దాడి చేయగా.. ప్రతీకారంగా ఇరాన్ అమెరికా బలగాలపై క్షిపణి దాడులకు దిగింది. లారక్ దీవిలో ఇరాన్ రాకెట్ లాంచర్లను అమెరికా బలగాలు ధ్వంసం చేసిన కొన్ని గంటల్లోనే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్, జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. దీంతో ఇరుదేశాల మధ్య ఘర్షణ మరోసారి తీవ్రరూపం దాల్చింది.హర్ముజ్ జలసంధిలోని లారక్ దీవిపై అమెరికా బలగాలు రెండు ఇరానియన్ లాంచర్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ సిబ్బంది సముద్రంలో నౌకా విధ్వంసక మైన్లను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు గుర్తించిన నేపథ్యంలోనే ఈ దాడి చేసినట్లు అమెరికా వెల్లడించింది. లారక్‌పై జరిగిన దాడి.. జూలై చివరి తర్వాత ఇరాన్ భూభాగంపై అమెరికా చేసిన తొలి దాడిగా తెలుస్తోంది.అమెరికా అధికారుల ప్రకారం.. లారక్‌లోని లాంచర్లు హర్ముజ్ జలసంధిలో సముద్ర మైన్లను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ జలమార్గంలో మైన్లను అమర్చడం ద్వారా అంతర్జాతీయ నౌకాయానానికి తీవ్ర ముప్పు ఏర్పడే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యగా దాడి చేసినట్లు వాషింగ్టన్ చెబుతోంది.‘ప్రతీకారం తప్పదు’.. ఇరాన్ హెచ్చరికఅమెరికా దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. లారక్ దాడిలో తమ సైనిక సిబ్బందితో పాటు పౌరులు కూడా మరణించినట్లు, గాయపడినట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ దాడికి తప్పకుండా ప్రతిస్పందిస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్(IRGC) హెచ్చరించింది. అమెరికా దాడికి ‘ప్రతిస్పందన, శిక్ష’ ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది.ఆ హెచ్చరికకు అనుగుణంగానే ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. జోర్డాన్‌లో అమెరికా బలగాలు ఉన్న కింగ్ హుస్సేన్, అల్ అజ్రాక్ స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్లు IRGC ప్రకటించింది. ఇరాన్ దాడిలో రెండు స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.8 క్షిపణులను అడ్డుకున్న జోర్డాన్ఇరాన్ దాడులను జోర్డాన్ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్లు ఆ దేశం ప్రకటించింది. మొత్తం ఎనిమిది క్షిపణులను తమ గగనతలంలోనే కూల్చివేసినట్లు తెలిపింది. దీంతో ఇరాన్–అమెరికా ఘర్షణ ప్రభావం ప్రాంతంలోని ఇతర దేశాలపై కూడా పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.హర్ముజ్ జలసంధే అసలు కేంద్రంఈ మొత్తం పరిణామాలకు హర్ముజ్ జలసంధే కీలక కేంద్రంగా మారింది. ఇరాన్‌కు చెందిన లారక్ దీవి హార్ముజ్ దీవికి దక్షిణంగా, ఖేష్మ్ దీవికి తూర్పున ఉంది. సుమారు 49 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే ఉన్నప్పటికీ.. అత్యంత కీలకమైన సముద్ర మార్గానికి సమీపంలో ఉండటంతో దీనికి వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంది. లారక్‌లో IRGC నేవీ స్థావరం కూడా ఉంది.ప్రపంచ ఇంధన సరఫరాకు హర్ముజ్ జలసంధి అత్యంత కీలకం. ప్రపంచ చమురు, ద్రవీకృత సహజవాయువు (LNG) రవాణాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం గుండా సాగుతుంది. దీంతో ఈ జలమార్గంలో మైన్లు వేయాలన్న ఇరాన్ చర్యలను అమెరికా తీవ్రంగా పరిగణిస్తోంది.ఒమన్ వైపు మారిన నౌకలుహర్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడుల నేపథ్యంలో కొన్ని నౌకలు ఒమన్ తీరానికి సమీపంలోని దక్షిణ మార్గం గుండా ప్రయాణిస్తున్నాయి. అయితే ఆ మార్గంలోనూ ఇరాన్ మైన్లు అమర్చే సామర్థ్యం కలిగి ఉంటే.. అంతర్జాతీయ నౌకాయానానికి మరింత ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉందని అమెరికా రక్షణ రంగ మాజీ అధికారి డేవిడ్ డెస్ రోచెస్ విశ్లేషించారు.ట్రంప్ ‘జీరో టాలరెన్స్’ హెచ్చరికహర్ముజ్లో మైన్లను ఏర్పాటు చేసే ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలోనే తీవ్రంగా హెచ్చరించారు. మైన్లను అమర్చే ఏ నౌక లేదంటే పడవనైనా ఒక క్రమపద్ధతిలో ధ్వంసం చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. మైన్ల ఏర్పాటు విషయంలో ‘జీరో టాలరెన్స్’ విధానం అమల్లో ఉందని ట్రంప్ స్పష్టం చేశారు.పెరిగిన చమురు ధరలు.. ముదిరిన ఆందోళనఅమెరికా లారక్ దాడి వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన పెరిగింది. చమురు ధరలు రెండు శాతానికి పైగా పెరిగాయి. హార్ముజ్ జలసంధిలో నౌకాయానం మరింత దెబ్బతింటే ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో మార్కెట్లు అప్రమత్తమయ్యాయి.అమెరికా–ఇరాన్ మధ్య తాజా దాడులు ఇరు దేశాల మధ్య ఇప్పటికే కొనసాగుతున్న ఘర్షణను మరింత ప్రమాదకర దశలోకి తీసుకెళ్లే అవకాశముంది. ఒకవైపు హర్ముజ్ జలసంధిలో నౌకాయానాన్ని సురక్షితంగా కొనసాగించేందుకు అమెరికా ప్రయత్నిస్తుండగా.. మరోవైపు ఆ మార్గంపై తన ప్రభావాన్ని కొనసాగించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది. లారక్‌పై అమెరికా దాడి, దానికి ప్రతీకారంగా జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడం.. ఈ పోరాటం మళ్లీ నేరుగా ఇరుదేశాల మధ్య సైనిక ఘర్షణగా మారుతున్న సంకేతాలను ఇస్తోంది. ఇదీ చదవండి: 270 మందితో వెళ్తున్న బోటు బోల్తా -
ఇరాన్ కళ్లుగప్పి.. హర్ముజ్‌లో అమెరికా సీక్రెట్ ఆపరేషన్!
ఇరాన్‌తో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా కీలక ప్రకటన చేసింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఏర్పాటు చేసిన మందుపాతరలను(సీ మైన్స్) పూర్తిగా తొలగించినట్లు తెలిపింది. అమెరికా దళాలు అత్యంత రహస్య ఆపరేషన్ నిర్వహించి.. శ్రమించి వాటిని తొలగించాయని అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు. ఈ చర్యను అమెరికా సైనిక కార్యకలాపాల్లో ‘మేజర్ మైలురాయి’గా అభివర్ణించారు.హర్ముజ్‌పై పట్టు సాధించే క్రమంలో ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కొన్ని నెలల క్రితం అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాల్లో సీ మైన్స్‌ను ఏర్పాటు చేసింది. వీటి కారణంగా అమెరికా బలగాల కదలికలు నిలిచిపోవడంతో పాటు వాణిజ్య నౌకల రాకపోకలకు తీవ్ర ముప్పు ఏర్పడింది. వాటిని తొలగించడమూ అంత సులువు కాదని.. చాలా సమయం పట్టొచ్చని అప్పట్లో చర్చలు నడిచాయి. ఈ క్రమంలో హర్ముజ్ బ్లాకేడ్(నిర్బంధం) కొనసాగిస్తున్న అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వీటి తొలగింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అయితే ఇరాన్ ఏర్పాటు చేసిన సముద్రపు మైన్స్‌ను తొలగించేందుకు అమెరికా బలగాలు అత్యంత రహస్యంగా ఆపరేషన్ చేపట్టాయి. ముందుగా మైన్స్ ఉన్న ప్రాంతాలను గుర్తించి.. అమెరికా నేవీకి చెందిన ప్రత్యేక డైవింగ్ బృందాలను రంగంలోకి దించారు. సముద్రంలోకి వెళ్లిన ఈ బృందాలు మైన్స్‌ను గుర్తించి, వాటిని సురక్షితంగా తొలగించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు. అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాల్లో ఏర్పాటు చేసిన మైన్స్‌ను పూర్తిగా తొలగించడం అమెరికా సైనిక కార్యకలాపాల్లో ‘మేజర్ మైలురాయి’ అని ఆయన పేర్కొన్నారు.హర్ముజ్‌లో మైన్స్ తొలగింపుతో పాటు గత కొన్ని నెలల్లో సుమారు 1,500 వాణిజ్య నౌకలు ఈ జలసంధిని దాటేందుకు అమెరికా దళాలు సహకరించినట్లు కూపర్ తెలిపారు. ఈ నౌకల ద్వారా ప్రపంచ మార్కెట్లకు దాదాపు 750 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు రవాణా అయినట్లు వెల్లడించారు. హర్ముజ్‌లో సురక్షిత రవాణా మార్గాలను పునరుద్ధరించడం అంతర్జాతీయ వాణిజ్యానికి కీలక పరిణామమని ఈ సందర్భంగా అమెరికా ప్రకటించుకుంది.ఇదిలా ఉంటే.. మైన్స్ తొలగించినంత మాత్రాన హర్ముజ్‌లో ముప్పు పూర్తిగా తొలగిపోయినట్లు కాదని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ నుంచి డ్రోన్లు, క్షిపణుల ముప్పు ఇంకా తొలగిపోలేదు. దీంతో నౌకల రాకపోకలు పూర్తిగా సాధారణ స్థితికి చేరడానికి సమయం పట్టే అవకాశం ఉంది.ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిమరోవైపు ఇరాన్‌పై అమెరికా ఆర్థిక, సైనిక ఒత్తిడిని మరింత పెంచుతోంది. ఇరాన్ నౌకాశ్రయాల్లోకి ప్రవేశించేందుకు.. అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన 75 నౌకలను వెనక్కి పంపినట్లు అమెరికా తెలిపింది. మరో మూడు నౌకలపై సైనిక చర్యలు(స్వల్ప దాడులు!) తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే మానవతా అవసరాల కోసం ప్రయాణించే నౌకలకు మాత్రం మినహాయింపులు ఇచ్చినట్లు పేర్కొంది.ఇదే సమయంలో హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచి, నౌకల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకురావడంపై దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఖతార్, ఒమన్ వంటి దేశాలు ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నాయి. అమెరికా దిగ్బంధాన్ని ఎత్తివేయడం, ఆంక్షలను సడలించడం వంటి అంశాలపై ఇరాన్ పట్టుబడుతున్నట్లు సమాచారం.చమురు మార్కెట్లపై ప్రభావం?ప్రపంచ ఇంధన సరఫరాలో హర్ముజ్ జలసంధిది అత్యంత కీలకమైన స్థానం. ఈ మార్గంలో నౌకల రాకపోకలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించగలిగితే చమురు, గ్యాస్ సరఫరాపై ఉన్న ఒత్తిడి తగ్గి అంతర్జాతీయ ధరలు కొంత స్థిరపడే అవకాశం ఉంది. అయితే అమెరికా–ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో హర్ముజ్ పూర్తిగా సురక్షితంగా మారిందని చెప్పడానికి ఇంకా పరిస్థితులను నిశితంగా గమనించాల్సి ఉంది.ఇదీ చదవండి: కెనడాకు బీపీ తెప్పించిన ట్రంప్.. ఏం చేశారంటే? -
లాభాల స్వీకరణతో దేశీయ సూచీలపై ఒత్తిడి
భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఈవారం ఆరంభంలో ఒడిదొడుకులకు లోనయ్యాయి. ఈరోజు (ఆగస్టు 24, 2026) ట్రేడింగ్ ముగిసే సమయానికి బెంచ్‌మార్క్ సూచీ నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయి 24,219 వద్ద, సెన్సెక్స్ 171 పాయింట్లు క్షీణించి 77,369 వద్ద ముగిశాయి. ఆరంభంలో స్వల్ప లాభాలతో ముందంజ వేసినప్పటికీ గ్లోబల్ మార్కెట్ ప్రతికూలతలు, మదుపరుల లాభాల స్వీకరణతో సూచీలు చివరకు నష్టాల్లో ముగిశాయి.సెంటిమెంట్‌ను దెబ్బతీసిన అంశాలుగ్లోబల్ మార్కెట్లలో బాండ్ ఈల్డ్స్ గరిష్ఠ స్థాయిల్లో నిలకడగా కొనసాగడం, దానికి తోడు పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి పెట్టుబడిదారుల్లో రిస్క్ అపెటైట్‌ను (ఆసక్తిని) తగ్గించింది. డాలర్ బలపడటంతో రూపీపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా ఇటీవల విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకోవడం సూచీలను దిగువకు లాగుతోంది. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాల కీలక షేర్లలో భారీగా విక్రయాలు జరిగాయి. ముఖ్యంగా అధిక వాల్యుయేషన్ల వద్ద లాభాలను స్వీకరించేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలలోని హెచ్చుతగ్గులు ద్రవ్యోల్బణ సంబంధిత ఆందోళనలను పెంచి మార్కెట్ స్థిరత్వాన్ని దెబ్బతీశాయి.మదుపరులకు సూచనసాంకేతికపరంగా నిఫ్టీకి 24,000–24,100 వద్ద బలమైన సపోర్ట్ ఉంది. మార్కెట్ తిరిగి కోలుకోవాలంటే నిఫ్టీ 24,400 స్థాయిని అధిగమించాల్సి ఉంటుంది. ప్రస్తుత అనిశ్చిత వాతావరణంలో రిటైల్ ఇన్వెస్టర్లు తొందరపడి బల్క్ ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా నాణ్యమైన షేర్లలో క్రమానుగతంగా పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: అనలాగ్ పన్నీర్‌పై నిషేధం -
హర్ముజ్‌పై పట్టు కోసం ఇరాన్ కొత్త ఎత్తుగడ
హర్ముజ్.. ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయలాంటి ఈ కీలక సముద్ర మార్గంపై ఆధిపత్య పోరు మరింత తీవ్రంగా మారుతోంది. జలసంధిపై ఇరాన్ ప్రభావం, అమెరికా ఒత్తిడి మధ్య నౌకల రాకపోకలపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, తీసుకుంటున్న చర్యలు కూడా ఈ పోరుకు మరింత ఆజ్యం పోశాయి. ఈ నేపథ్యంలో జలసంధిపై తన పట్టు సడలుతోందనే సంకేతాల మధ్య.. ఇరాన్ కొత్త వ్యూహాలను అమలు చేయాలని నిర్ణయించింది.గత కొంతకాలంగా హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు మారిపోయాయి. ఇరాన్ సూచించే మార్గం కంటే.. ఒమన్ తీరానికి సమీపంలోని ప్రత్యామ్నాయ మార్గాన్నే అంతర్జాతీయ నౌకలు ఎక్కువగా ఎంచుకుంటున్నాయి. షిప్ ట్రాకింగ్ సంస్థల సమాచారం ప్రకారం.. ఇటీవల హర్ముజ్ దాటిన నౌకల్లో 80 శాతానికి పైగా ఒమన్ మార్గంలో ప్రయాణించినట్లు తెలుస్తోంది. అమెరికా నౌకాదళ భద్రతతో ఈ మార్గంలో రాకపోకలు పెరిగినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. దీంతో హర్ముజ్‌పై ఇరాన్ నియంత్రణ సడలుతోందనే చర్చ మొదలైంది. సరిగ్గా ఇదే సమయంలో.. నౌకల నుంచి సేవల పేరుతో రుసుములు వసూలు చేసే ప్రతిపాదనకు ఇరాన్ పార్లమెంట్ కమిషన్ ఆమోదం తెలిపింది.టెహ్రాన్ కొత్త ప్లాన్ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిషన్ ‘హర్ముజ్ జలసంధి భద్రత, అభివృద్ధి కోసం వ్యూహాత్మక చర్యలు’ ప్రణాళికలోని ఆర్టికల్-3కు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం హర్ముజ్ గుండా ప్రయాణించే నౌకలకు ఇరాన్ అందించే సముద్ర భద్రత, పర్యావరణ సేవలు, ప్రత్యేక పరిస్థితుల్లో ఇంధన సరఫరా, బీమా తదితర సేవలకు రుసుములు వసూలు చేయనుంది. ఈ ఫీజులను హర్ముజ్ గుండా ప్రయాణించేందుకు అనుమతి పొందిన దేశాల నౌకల నుంచే వసూలు చేస్తామని ఇరాన్ తెలిపింది. చెల్లింపులు ఇరాన్ కరెన్సీ రియాల్ లేదంటే టెహ్రాన్ నిర్ణయించే ఇతర కరెన్సీలో ఉండవచ్చని వెల్లడించింది.అమెరికా మద్దతుదారులకూ వార్నింగ్ఓవైపు ట్రంప్ ఇరాన్ మద్దతుదారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆంక్షల మోతకు సిద్ధపడాలంటూ చెబుతున్నారు. అయితే ఇటు అమెరికా ఆంక్షలపై ఇరాన్ మరింత ఘాటుగా స్పందిస్తోంది. ఆర్థిక ఒత్తిడి కొనసాగితే హర్ముజ్ నుంచే కాదు.. పర్షియన్ గల్ఫ్ నుంచి కూడా ఒక్క చుక్క చమురు బయటకు వెళ్లదని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయ్ హెచ్చరించారు. అమెరికా చర్యలకు మద్దతిచ్చే దేశాలను కూడా ఇరాన్ వ్యతిరేక శక్తులుగా పరిగణిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. చమురు రవాణా విషయంలో ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని టెహ్రాన్ సంకేతాలు ఇస్తోంది.నౌకలకు ఇరాన్ హెచ్చరికలుహర్ముజ్ నిబంధనలు ఉల్లంఘించే నౌకలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇరాన్ పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ హెచ్చరించింది. నిబంధనలు అతిక్రమించే నౌకలకు జరిమానాలు, భవిష్యత్ ప్రయాణాలపై ఆంక్షలు, అవసరమైతే స్వాధీనం వంటి చర్యలు ఉంటాయని తెలిపింది. ఉల్లంఘన చేసే నౌకలకు సహకరించే షిప్పింగ్ సంస్థలు, సరుకు యజమానులను కూడా సమస్యాత్మక జాబితాలో చేర్చుతామని పేర్కొంది.ఇంకా రూట్లోనే..ఇరాన్ బెదిరింపులు పెద్దగా పని చేయడం లేదా? అనే చర్చా నడుస్తోంది. మరోవైపు హర్ముజ్‌లో తన ప్రభావాన్ని పెంచుకునేందుకు అమెరికా కూడా ప్రయత్నిస్తోంది. ఒమన్ మార్గంలో ప్రయాణించే నౌకలకు రక్షణ కల్పిస్తున్నామని, ప్రపంచ చమురు సరఫరా నిరాటంకంగా కొనసాగడమే తమ లక్ష్యమని వాషింగ్టన్ చెబుతోంది. గల్ఫ్ దేశాల నుంచి బయలుదేరే భారీ క్రూడాయిల్ ట్యాంకర్లు హర్ముజ్‌పైనే ఎక్కువగా ఆధారపడతాయి. అయితే భద్రతా కారణాలతో కొన్ని నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ఇరాన్‌కు సవాల్‌గా మారింది.ప్రపంచ చమురు మార్కెట్‌పై ప్రభావం?ప్రపంచ చమురు రవాణాలో హర్ముజ్ జలసంధికి అత్యంత కీలక స్థానం ఉంది. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. 80 శాతం నౌకలు ప్రత్యామ్నాయ మార్గం పట్టినా.. హర్ముజ్‌పై పట్టు కోల్పోకుండా ఉండేందుకు ఇరాన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. రుసుముల ప్రతిపాదన నుంచి కఠిన హెచ్చరికల వరకు.. చమురు మార్గంపై తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు టెహ్రాన్ ప్రయత్నిస్తోంది.ఇదీ చదవండి: శత్రువులు చేతులు కలుపుతారా?.. సర్కత్రా ఉత్కంఠ! -
మిడిల్ఈస్ట్లో బిగ్ ట్విస్ట్.. ఇరాన్ నిర్ణయంపై ఉత్కంఠ
దశాబ్దాలుగా సాగుతున్న వైరం.. ఎప్పుడూ ప్రత్యర్థులుగా కనిపించిన దేశాలు.. ఇప్పుడు ఒకే వేదికపైకి వస్తాయా? మిడిల్ఈస్ట్ రాజకీయాల్లో ఇదే ఇప్పుడు అతిపెద్ద చర్చ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లు, ఇరాన్‌పై పెరుగుతున్న ఆంక్షలు, ప్రాంతీయ భద్రతా ఆందోళనల మధ్య అనూహ్య పరిణామం తెరపైకి వచ్చింది. సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ ఏర్పాటు చేసిన మక్కా రక్షణ కూటమిలో చేరాలని ఇరాన్‌కు ఆహ్వానం అందినట్లు వచ్చిన వార్తలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇరాన్-సౌదీ అరేబియా.. ఈ రెండు పేర్లు వినగానే గుర్తొచ్చేది ఆధిపత్య పోరు. గల్ఫ్ ప్రాంతంలో ప్రభావం కోసం ఇరు దేశాల మధ్య ఏళ్లుగా సాగుతున్న పోటీ. యెమెన్‌లో హౌతీల అంశం నుంచి సిరియా, లెబనాన్ వరకు పలు పరిణామాల్లో ఈ విభేదాలు బయటపడ్డాయి. అలాంటి రెండు దేశాలు భద్రతా వేదికపై దగ్గరవుతాయా? అనే ప్రశ్న ఇప్పుడు మిడిల్ఈస్ట్లో కొత్త చర్చకు తెరతీసింది. ఒకప్పుడు ఒకరిపై ఒకరు అనుమానంతో చూసుకున్న దేశాలు.. ఇప్పుడు ఒకే భద్రతా గొడుగు కిందకు వస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది. అమెరికా ప్రభావం, ప్రాంతీయ భద్రతా పరిణామాలు, మారుతున్న ప్రపంచ రాజకీయాల నేపథ్యంలో ఈ పరిణామం మిడిల్ఈస్ట్ భవిష్యత్ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముంది.మక్కా కూటమిలోకి ఇరాన్?సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ ఆగస్టు 7న మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం.. ఈ మూడు దేశాల్లో ఏదో ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే, అది మిగిలిన దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. రక్షణ సహకారం, వ్యూహాత్మక సమన్వయం, సంయుక్త భద్రతా చర్యలు ఈ ఒప్పందంలో భాగంగా ఉంటాయని ప్రకటించారు. అయితే ఈ కూటమి ఏర్పడిన కొద్ది రోజులకే మరో ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. మక్కా ఒప్పందంలో చేరాలని ఇరాన్‌కు ఆహ్వానం అందినట్లు ‘అల్ మయదీన్’ నివేదించింది. ఇరాన్ పార్లమెంట్‌కు అనుబంధంగా ఉన్న ఖానే మెల్లత్ వార్తా సంస్థ అధిపతి మెహదీ రహీమి ఈ విషయాన్ని వెల్లడించినట్లు పేర్కొంది. ఆ ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పినట్లు సమాచారం. అయితే ఇరాన్ ప్రభుత్వం గానీ, సౌదీ, పాకిస్థాన్, టర్కీ ప్రభుత్వాలు గానీ దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు.ట్రంప్ ప్రభావమేనా?ఈ పరిణామాల వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల ప్రభావం ఉందా? అన్న చర్చ కూడా మొదలైంది. ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి పెరగడం, ఆంక్షల భయం, గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రాంతీయ దేశాలు తమ భద్రతా వ్యూహాలను పునరాలోచిస్తున్నాయి. ఇప్పటివరకు మిడిల్ఈస్ట్లో భద్రతకు అమెరికా కీలక శక్తిగా ఉండేది. అయితే ఇటీవలి పరిణామాల్లో ప్రాంతీయ దేశాలే తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలనే ఆలోచనలోకి వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మక్కా కూటమి కూడా ఇదే దిశలో మరో అడుగుగా భావిస్తున్నారు. శత్రువుల మధ్య కొత్త స్నేహమా?ఇరాన్ నిజంగా మక్కా కూటమిలో చేరితే అది సాధారణ పరిణామం కాదు. ఎందుకంటే ఈ కూటమిలో ప్రధాన దేశమైన సౌదీ అరేబియాతో ఇరాన్‌కు గతంలో తీవ్ర విభేదాలున్నాయి. 2016లో తెగిపోయిన దౌత్య సంబంధాలు 2023లో చైనా మధ్యవర్తిత్వంతో తిరిగి ప్రారంభమైనప్పటికీ.. అనుమానాలు పూర్తిగా తొలగిపోలేదు.యెమెన్‌లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు, సౌదీ ప్రయోజనాల మధ్య ఉన్న విభేదాలు కూడా ఈ సంబంధాలకు సవాలుగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒకే రక్షణ వేదికపైకి రావడం జరిగితే.. అది మిడిల్ఈస్ట్ రాజకీయాల్లో భారీ మార్పుగా మారే అవకాశం ఉంది.ఇరాన్ లెక్కలు ఏంటి?ఇరాన్ మాత్రం ఈ పరిణామాన్ని పూర్తిగా వ్యతిరేకించలేదు. ప్రాంతీయ దేశాలు తమ స్వంత భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. మరోవైపు ట్రంప్ ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో తనకు అనుకూలమైన కొత్త వ్యూహాలను రూపొందించుకోవాల్సిన పరిస్థితిలో టెహ్రాన్ ఉంది.అయితే.. మక్కా కూటమిలో చేరడం ద్వారా ఇరాన్‌కు లాభమా? లేదంటే తన పాత మిత్ర, ప్రత్యర్థి సమీకరణాలను మార్చుకోవాల్సి వస్తుందా? అన్నది కీలక ప్రశ్న.ఇరాన్ తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఉన్న దేశాలు నిజంగా చేతులు కలిపితే.. అది ట్రంప్ హయాంలో మిడిల్ఈస్ట్లో అతిపెద్ద దౌత్య మలుపుగా నిలిచే అవకాశం ఉంది.ఇదీ చదవండి: అమెరికాలో కాల్పులు.. భారతీయుడి దుర్మరణం -
ట్రంప్ కొత్త అస్త్రం.. ప్రతీకారం భీకరంగా ఉంటుందన్న ఇరాన్
అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఇరాన్‌పై చరిత్రలోనే అత్యంత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించగా.. దానికి ఇరాన్ తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించింది. కొత్త ఆంక్షలు, బెదిరింపులకు సమాధానం విధ్వంసకరంగా ఉంటుందని టెహ్రాన్ వార్నింగ్ ఇచ్చింది.‘అమెరికా బెదిరింపులకు గట్టి సమాధానం’.. అమెరికా నుంచి ఎదురయ్యే ఎలాంటి కొత్త బెదిరింపులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఇరాన్ సాయుధ దళాలు ప్రకటించాయి. ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ అలీ అబ్దొల్లాహీ మాట్లాడుతూ.. “భూమి, సముద్రం, గగనం, వాయు రక్షణ, సైబర్ రంగాల్లో మా బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయి. శత్రువుల కొత్త బెదిరింపులకు శిక్షాత్మక, వినాశకర ప్రతిస్పందన ఇస్తాం” అని హెచ్చరించారు.ఆంక్షల యుద్ధం విఫలమవుతుంది: అరాఘ్చీఅమెరికా ప్రతిపాదిస్తున్న ఆర్థిక ఆంక్షలు విఫలమవుతాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. ఆర్థిక ఒత్తిళ్లతో ఇరాన్‌ను లొంగదీసుకోవాలన్న ప్రయత్నాలు ఫలించవని అన్నారు. దౌత్య మార్గమే సమస్యలకు పరిష్కారమని పేర్కొంటూనే.. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అన్ని మార్గాల్లో సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ట్రంప్ లక్ష్యం.. ఇరాన్‌పై గరిష్ఠ ఒత్తిడిఇరాన్కు సహకరించే ఏ దేశంపైనైనా ఆర్థిక చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ సోమవారం కొత్త ఆంక్షల వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అయితే ట్రంప్ మాత్రం.. “ఇరాన్ ఒక ఒప్పందాన్ని కోరుకుంటోంది. కానీ సరైన ఒప్పందానికి ఇంకా సిద్ధంగా లేదు” అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, హర్ముజ్ జలసంధిని ప్రస్తుతం “అమెరికా భూభాగంగా చూస్తున్నాను” అంటూ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి కారణమయ్యాయి.హర్ముజ్.. ఇరాన్ చేతిలో కీలక ఆయుధంప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గం హార్ముజ్ జలసంధి. ఈ మార్గం ద్వారా రోజూ భారీ స్థాయిలో చమురు రవాణా జరుగుతుంది. ఇరాన్ వద్ద ఉన్న క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యంతో ఈ ప్రాంతంలో నౌకా రవాణాకు అంతరాయం కలిగించే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే హర్ముజ్ ప్రాంతంలో జరిగిన ఘటనల్లో పలువురు నావికులు ప్రాణాలు కోల్పోయారు.చమురు మార్కెట్లపై ఆందోళనఅమెరికా కొత్త ఆంక్షల హెచ్చరికలతో అంతర్జాతీయ చమురు ధరలు పెరిగాయి. ఇరాన్ చమురు సరఫరాపై ఆంక్షలు మరింత కఠినమైతే ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇరాన్ నుంచి ఎగుమతి అయ్యే చమురులో ఎక్కువ భాగాన్ని చైనా కొనుగోలు చేస్తోంది. దీంతో అమెరికా ఒత్తిడి ప్రధానంగా బీజింగ్పైనా పడే అవకాశముంది. చైనా మాత్రం.. “ఆంక్షలు, ఒత్తిళ్లు సమస్యను పరిష్కరించవు. చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యం” అని స్పష్టం చేసింది.చర్చలకు ఒమన్ ప్రయత్నాలుహర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ఒమన్ మధ్యవర్తిత్వం చేస్తోంది. ఒమన్, ఇరాన్ విదేశాంగ మంత్రులు ఫోన్లో చర్చించి.. నౌకా రవాణాపై కొత్త ఒప్పందం కోసం చర్చలు పునఃప్రారంభించే అంశాన్ని పరిశీలించారు.యెమెన్ హౌతీలతో మరో సమస్యఇదే సమయంలో యెమెన్‌కు చెందిన హౌతీ గ్రూప్ బాబ్ అల్ మందెబ్ జలసంధిలో సౌదీ నౌకలపై దిగ్బంధం ప్రకటించడంతో ఎర్ర సముద్ర రవాణాపైనా ప్రభావం పడింది. సౌదీ అరేబియాలోని యన్బు పోర్టుకు వచ్చే ట్యాంకర్ రాకపోకలు గణనీయంగా తగ్గినట్లు సమాచారం.అమెరికా ఆర్థిక ఆంక్షల బెదిరింపులు.. ఇరాన్ ప్రతీకార హెచ్చరికలు.. హర్ముజ్‌పై ఆధిపత్య పోరు.. ఇవన్నీ పశ్చిమాసియా సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తున్నాయి. దౌత్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఇరు దేశాల నుంచి వస్తున్న కఠిన ప్రకటనలు కొత్త ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.ఇదీ చదవండి: ప్లీజ్.. ప్లీజ్.. మా చక్కెర కొనరా? -
ఇరాన్‌తో సంబంధాలు కట్.. యూఏఈ సంచలన ఆరోపణలు
పశ్చిమాసియా సంక్షోభం మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. ఇరాన్–యూఏఈ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. గల్ఫ్‌లో నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని యూఏఈ ఆరోపించగా.. ఆ వాదనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తిగా నిరాధార ఆరోపణలని, ఇలాంటి ప్రకటనలు ప్రాంతీయ శాంతి, భద్రతకు విఘాతం కలిగిస్తాయని ఇరాన్ విదేశాంగశాఖ స్పష్టం చేసింది. మరోవైపు.. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌తో అన్ని రకాల వాణిజ్య, ఆర్థిక లావాదేవీలను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు నిలిపివేస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది.మంగళవారం గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ నుంచి రెండు బాలిస్టిక్ క్షిపణులు తమ వైపు దూసుకొచ్చినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. తమ వైమానిక రక్షణ వ్యవస్థలు ఈ రెండు క్షిపణులను గుర్తించాయని పేర్కొంది. వాటిలో ఒకటి యూఏఈ ప్రాదేశిక జలాల వెలుపల సముద్రంలో పడగా.. మరో క్షిపణి తమ ప్రాదేశిక జలాల్లోనే కూలిపోయిందని వెల్లడించింది.ఆ తర్వాత విడుదల చేసిన మరో ప్రకటనలో.. ఈ రెండు క్షిపణులు సముద్ర రవాణాను లక్ష్యంగా చేసుకున్నట్లు తమ అంచనాల్లో తేలిందని యూఏఈ పేర్కొంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా భారీ నష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు.‘నిరాధార ఆరోపణలు’.. ఇరాన్ కౌంటర్యూఏఈ ఆరోపణలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమ దేశం నుంచి యూఏఈపై క్షిపణి ప్రయోగించారన్న ఆరోపణలను ‘పూర్తిగా ఖండిస్తున్నట్లు’ ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు. ప్రాంతీయ దేశాల మధ్య విశ్వాసాన్ని పెంచే ప్రయత్నాలకు ఇలాంటి ఆరోపణలు విఘాతం కలిగిస్తాయని అన్నారు. పొరుగు దేశాలతో సత్సంబంధాల సూత్రాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి నిరాధార ఆరోపణలకు దూరంగా ఉండాలని యూఏఈ సహా ప్రాంతీయ దేశాలకు సూచించారు.అమెరికా, ఇజ్రాయెల్ చర్యల కారణంగా ఇప్పటికే మధ్యప్రాచ్యంలో పరిస్థితులు సంక్లిష్టంగా మారాయని బఘాయీ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో తప్పుడు ఆరోపణలు చేయడం ప్రాంతీయ భద్రతను మరింత దెబ్బతీస్తుందని అన్నారు.యూఏఈలో మిసైల్ అలర్ట్ఈ ఆరోపణలకు కొద్దిసేపటి ముందు యూఏఈ ప్రజలకు ఫోన్ ద్వారా అత్యవసర హెచ్చరిక సందేశం వచ్చింది. ‘సంభావ్య క్షిపణి ముప్పు’ ఉన్నందున సమీపంలోని సురక్షిత భవనంలోకి వెళ్లాలని అధికారులు సూచించారు. కొద్దిసేపటికే ఆ అలర్ట్‌ను ఉపసంహరించుకున్నారు.జూన్‌లో తప్పుడు అలారం వెలువడిన తర్వాత.. జూలైలో జరిగిన మరో ఘటనలో క్షిపణి యూఏఈ భూభాగంలోకి ప్రవేశించకపోయినప్పటికీ హెచ్చరిక జారీ చేశారు. తాజాగా వచ్చిన అలర్ట్ మాత్రం ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో మరింత ఆందోళనకు దారితీసింది.ఇరాన్‌తో సంబంధాలు కట్!తాజా పరిణామాల నేపథ్యంలో యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌తో అన్ని రకాల వాణిజ్యం, వాణిజ్య మార్పిడి, ఆర్థిక లావాదేవీలను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యూఏఈ విదేశాంగశాఖ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అఫ్రా అల్ హమెలీ.. ప్రాంతీయ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతల్లో ఉన్న ఇరాన్–యూఏఈ సంబంధాలు మరింత దిగజారే పరిస్థితి ఏర్పడింది.ఇప్పటికే ఆయిల్ ట్యాంకర్లపై దాడులుయూఏఈకి చెందిన ప్రభుత్వ చమురు సంస్థ ADNOC ట్యాంకర్లు గత కొన్ని వారాలుగా వరుస దాడులకు గురవుతున్నాయి. దీంతో గల్ఫ్ ప్రాంతంలో సముద్ర రవాణా భద్రతపై ఆందోళనలు పెరిగాయి.ఫిబ్రవరి 28న మధ్యప్రాచ్య యుద్ధం ప్రారంభమైన సమయంలో ఇరాన్ దాడుల్లో యూఏఈ తీవ్రంగా ప్రభావితమైన దేశంగా నిలిచింది. దాదాపు 3,000 క్షిపణులు, డ్రోన్లు యూఏఈ వైపు ప్రయోగించినట్లు సమాచారం. అయితే జూన్‌లో ఇరుపక్షాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత కొంతకాలం దాడులు తగ్గాయి. తాజాగా ఆ ఒప్పందం కుప్పకూలడంతో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి.‘హర్ముజ్ మూసివేత కొనసాగుతుంది’మరోవైపు ఇరాన్ కీలక హెచ్చరిక చేసింది. ప్రపంచంలోని అత్యంత వ్యూహాత్మక చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగుతుందని స్పష్టం చేసింది. అమెరికాతో శాంతి ఒప్పందం కుదిరే వరకు హర్ముజ్‌ను తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ తన వైఖరిని వెల్లడించింది. యూఏఈ నుంచి గల్ఫ్ వెలుపలికి వెళ్లే నౌకలకు హర్ముజ్ కీలక మార్గం కావడంతో.. ఇరాన్ తాజా ప్రకటన యూఏఈ ఆర్థిక వ్యవస్థతో పాటు అంతర్జాతీయ చమురు రవాణాపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.హర్ముజ్.. మరోసారి యుద్ధ కేంద్రంగా!ఒకవైపు క్షిపణి ఆరోపణలు, మరోవైపు వాణిజ్య ఆంక్షలు, ఇంకోవైపు హర్ముజ్ మూసివేతపై ఇరాన్ హెచ్చరికలు.. మొత్తంగా గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. ఇరాన్ ఆరోపణలను ఖండిస్తున్నప్పటికీ.. యూఏఈ మాత్రం సముద్ర రవాణాపై ముప్పు పెరిగిందని చెబుతోంది. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్ముజ్‌పై ఆధిపత్యం తమదేనంటూ ఓ మ్యాప్(ఏఐ జనరేటెడ్) రిలీజ్ చేశారు కూడా. ఈ నేపథ్యంలో హర్ముజ్ జలసంధి చుట్టూ పరిణామాలు తదుపరి రోజుల్లో మరింత కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. -
‘యుద్ధంతో జీవించలేం’.. ఇరాన్లో వినిపిస్తున్న కొత్త స్వరం
అమెరికా–ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ ఇరాన్లో అంతర్గత చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. యుద్ధ మార్గమా? లేక దౌత్య మార్గమా? అనే ప్రశ్నపై దేశ రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖటామీ చేసిన వ్యాఖ్యలు టెహ్రాన్‌లో కొత్త చర్చకు దారితీశాయి.‘‘యుద్ధంతో ఎప్పటికీ జీవించలేం.. సమస్యలను పరిష్కరించేందుకు దౌత్య మార్గాలను అన్వేషించాలి’’ అని ఖటామీ చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుత ఇరాన్ విధానంపై పరోక్ష విమర్శలుగా భావిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లను ఎదుర్కొంటూనే.. దేశ అంతర్గత సమస్యలు, ప్రజల జీవన పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.సంస్కరణవాద నేత ఖటామీ స్వరంమహ్మద్ ఖటామీ 1997 నుంచి 2005 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన సంస్కరణవాద భావజాలానికి దగ్గరగా ఉన్న నేతగా గుర్తింపు పొందారు. పాశ్చాత్య దేశాలతో సంబంధాల మెరుగుదల, రాజకీయ సంస్కరణలు, పరిమిత దౌత్య విధానాలకు ఆయన మద్దతు ఇచ్చేవారు. ప్రస్తుతం అధికారంలో లేకపోయినా.. ఇరాన్లో ఆయనకు ఉన్న రాజకీయ ప్రభావం కారణంగా తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా యుద్ధ వాతావరణంలో ఉన్న దేశంలో శాంతి, చర్చల ప్రస్తావన చేయడం రాజకీయంగా కీలక సంకేతంగా మారింది.‘‘ప్రజలు యుద్ధంలో జీవించలేరు’’యుద్ధం ద్వారా శాశ్వత పరిష్కారం సాధ్యం కాదని ఖటామీ స్పష్టం చేశారు. విదేశీ శక్తుల నుంచి వచ్చే బెదిరింపులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. దేశ ప్రజల ఆర్థిక పరిస్థితులు, సాధారణ జీవనం కూడా ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఉండాలని సూచించారు. అమెరికా ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిళ్లు ఇప్పటికే ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక ఘర్షణలు కొనసాగితే ప్రజలపై మరింత భారం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.మరోవైపు కఠిన వైఖరిలో అధికార వర్గంఅయితే ఇరాన్ అధికార వ్యవస్థలోని కీలక వర్గాలు మాత్రం అమెరికా, ఇజ్రాయెల్ విషయంలో కఠిన వైఖరినే కొనసాగిస్తున్నాయి. సుప్రీం లీడర్ వర్గం విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది. ఇరాన్లో అత్యంత ప్రభావశీలమైన శక్తిగా ఉన్న ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కూడా ప్రతిఘటన విధానానికే మద్దతు ఇస్తోంది. భద్రత, విదేశాంగ విధానం, ప్రాంతీయ వ్యూహాల్లో కీలక పాత్ర పోషించే ఐఆర్జీసీ.. అమెరికా, ఇజ్రాయెల్‌పై వ్యతిరేకతను దేశ రక్షణలో భాగంగా చూస్తోంది.అధ్యక్షుడి పాత్ర పరిమితంప్రస్తుత ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ గతంలో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు అనుకూలంగా మాట్లాడిన నేతగా గుర్తింపు పొందారు. అయితే ఇరాన్ రాజకీయ వ్యవస్థలో తుది నిర్ణయాధికారం సుప్రీం లీడర్, భద్రతా వ్యవస్థ చేతుల్లో ఉంటుంది. అందువల్ల అధ్యక్షుడి వైఖరి కంటే.. సుప్రీం లీడర్ వర్గం, సైనిక వ్యవస్థ నిర్ణయాలే కీలకంగా మారుతాయి.ఆర్థిక సమస్యలు.. ప్రజల్లో అసంతృప్తిఇరాన్లో యుద్ధ వాతావరణం, ఆంక్షలు, ఆర్థిక ఇబ్బందులు ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా యువతలో ఉద్యోగాలు, జీవన ప్రమాణాలు, అంతర్జాతీయ అవకాశాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. యుద్ధం మరింత కొనసాగితే ఈ సమస్యలు తీవ్రం కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో దేశంలో కొంత వర్గం దౌత్యానికి అవకాశం ఇవ్వాలని కోరుతోంది.ముందున్న మార్గం ఏంటి?ఖటామీ వ్యాఖ్యలు వెంటనే ఇరాన్ విదేశాంగ విధానాన్ని మార్చే అవకాశం లేకపోయినా.. దేశంలో ఉన్న అంతర్గత భిన్నాభిప్రాయాలను మాత్రం బయటపెట్టాయి. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా కఠినంగా ముందుకు వెళ్లాలనే వర్గం.. మరోవైపు దేశ ప్రయోజనాల కోసం చర్చలకు అవకాశం ఇవ్వాలనే వర్గం మధ్య ఇరాన్లో చర్చ కొనసాగుతోంది. యుద్ధం మరింత తీవ్రం అవుతుందా? లేదంటే దౌత్యానికి కొత్త మార్గం తెరుచుకుంటుందా? అనేది రాబోయే పరిణామాలపై ఆధారపడి ఉంది. ఖటామీ వ్యాఖ్యలు మాత్రం ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో కొత్త ప్రశ్నలకు తెరలేపాయి. -
ఓ ఫేక్ న్యూస్.. అమెరికా–ఇరాన్ అణు చర్చల్లో కలకలం
క్షిపణులు, డ్రోన్లతో సాగుతున్న అమెరికా–ఇరాన్ ఘర్షణ ఇప్పుడు మరో కొత్త మలుపు తీసుకుంది. యుద్ధం కేవలం మైదానంలోనే కాదు.. సోషల్ మీడియా వేదికలపైనా సాగుతోంది. తాజాగా ఓ తప్పుడు సమాచారం అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది. ఎలాంటి నిర్ధారణ లేకుండానే ఇజ్రాయెల్, అమెరికా రాజకీయ వర్గాల్లోకి చేరి.. చివరకు అణు చర్చలపై ప్రభావం చూపే స్థాయికి చేరుకుంది.ఆగస్టు 5న ‘ఎక్స్’ (X) వేదికగా ఓ గుర్తుతెలియని భారతీయ ఖాతా నుంచి ఓ సంచలన పోస్టు వెలువడింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వహీది.. ‘‘అమెరికా, ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు ఉన్నంత కాలం.. ఇరాన్ కూడా తన అణు ఆయుధాల లక్ష్యాన్ని వదులుకోదు’’ అని వ్యాఖ్యానించినట్లు అందులో పేర్కొన్నారు. దీనికి అణు పేలుడు మేఘాన్ని పోలిన ఏఐ రూపొందించిన చిత్రాన్ని కూడా జత చేశారు.అయితే ఈ వ్యాఖ్యలు నిజంగా వహీది చేశారనే ఆధారాలు ఏవీ లేవు. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసిందనే ఆధారాలు కూడా లేవు. అయినప్పటికీ ఆ పోస్టు వేగంగా వైరల్ అయింది.భారత్ టు అమెరికా వయా ఇజ్రాయెల్.. సుమారు 1.75 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఆ భారతీయ ఖాతా నుంచి మొదలైన ఈ ప్రచారం.. కొన్ని గంటల్లోనే మరో భారతీయ ఖాతా ద్వారా హిందీలోకి అనువదించబడింది. ఆ తర్వాత ఇజ్రాయెల్‌కు చెందిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలు దీనిని విస్తృతంగా ప్రచారం చేశాయి. ఇజ్రాయెల్‌లోని ఓ టీవీ ఛానల్ ఈ తప్పుడు సమాచారాన్ని ఆధారంగా చేసుకుని.. ‘‘ఇరాన్ తొలిసారి అణుబాంబు తయారీ లక్ష్యాన్ని అంగీకరించింది’’ అన్నట్టుగా కథనం ప్రసారం చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ జెరూసలేంలోని మౌంట్ హెర్జెల్ వద్ద చేసిన ప్రసంగంలో కూడా దీనిని ఇరాన్ ఉద్దేశాలకు నిదర్శనంగా ప్రస్తావించారు.అమెరికాలోనూ ఈ ప్రచారం ప్రభావం చూపింది. ఐక్యరాజ్యసమితిలో ట్రంప్ ప్రభుత్వ ప్రతినిధి మైక్ వాల్ట్జ్ ఈ పోస్టును షేర్ చేస్తూ.. ఇరాన్ అసలు ఉద్దేశాలను అంగీకరించిందన్న అర్థంలో వ్యాఖ్యానించారు. అమెరికా సెనేటర్ రిక్ స్కాట్ కూడా దీన్ని పంచుకున్నారు. అయితే తర్వాత మైక్ వాల్ట్జ్ తన పోస్టును ఎలాంటి వివరణ లేకుండా తొలగించారు.అణు చర్చలపై ప్రభావంఅమెరికా–ఇరాన్ మధ్య ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, ఇజ్రాయెల్ అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. తాము శాంతియుత అవసరాల కోసమే అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని టెహ్రాన్ చెబుతోంది. ఇలాంటి సమయంలో అణ్వాయుధాలపై ఇరాన్ నేత వ్యాఖ్యలంటూ వచ్చిన తప్పుడు ప్రచారం.. దౌత్య చర్చల వాతావరణాన్ని మరింత క్లిష్టంగా మార్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఫేక్ న్యూస్ పవర్ అది!ఈ ఘటన సోషల్ మీడియా యుగంలో తప్పుడు సమాచారానికి ఉన్న ప్రభావాన్ని మరోసారి బయటపెట్టింది. ఒక గుర్తుతెలియని ఖాతా నుంచి వచ్చిన నిర్ధారణ లేని పోస్టు.. భాషలు, దేశాల సరిహద్దులు దాటి.. ప్రపంచ నాయకుల ప్రసంగాల్లోకి చేరింది. నిజానిజాలు నిర్ధారించకుండానే ప్రచారం జరిగితే.. అంతర్జాతీయ రాజకీయాలు, యుద్ధ నిర్ణయాలపైనా ప్రభావం చూపగలదని ఈ ఉదంతం స్పష్టం చేసింది. -
హర్ముజ్‌ను అమెరికా భూభాగంగా ప్రకటిస్తా!: ట్రంప్
ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హర్ముజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా కేవలం దాని నియంత్రణ మాత్రమే తమదేనంటూ ఆయన ప్రకటించుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సైన్యం మోహరించామని చెబుతున్నారు. అయితే తాజాగా ఈ వ్యూహాత్మక జలమార్గాన్ని అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని మరో సంచలనానికి తెర తీశారు. “ఇరాన్‌ను ఓడించడం ఖాయం. ఆ తర్వాత.. అతి త్వరలో హర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తాను” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఈ నిర్ణయం ఎలా అమలు చేస్తారు? దీనికి అంతర్జాతీయంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే అంశాలపై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడమే తమ లక్ష్యమని ట్రంప్ చెబుతుండగా.. ఇరాన్‌పై మరింత కఠిన ఆర్థిక చర్యలు తీసుకుంటామని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.‘కొంత ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు’.. అమెరికన్లకు ట్రంప్ఇరాన్పై చర్యల కారణంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని ట్రంప్ అంగీకరించారు. “అమెరికన్లు పెట్రోల్ కోసం కొంచెం ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు. కానీ ఇరాన్ అణ్వాయుధ శక్తిగా మారకుండా అడ్డుకోవడం ప్రపంచానికి చేసే సేవ” అని అన్నారు.హర్ముజ్‌పై అధికారం మాదే: ఇరాన్ స్పష్టంట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ ఘాటుగా స్పందించింది. హర్ముజ్ జలసంధిపై నియంత్రణ తమదేనని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది స్పష్టం చేశారు. “ఒక ట్వీట్‌తోనో, విమాన వాహక నౌకతోనో హార్ముజ్‌ను స్వాధీనం చేసుకోలేరు. ఇరాన్ ఓటమిని అంగీకరించే వరకు ఈ మార్గంపై మా నియంత్రణ కొనసాగుతుంది” అని ఆయన పేర్కొన్నారు.ప్రపంచానికి చమురు షాకే!ప్రపంచ ఇంధన మార్కెట్లకు హర్ముజ్ జలసంధి అత్యంత కీలకం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు, ఎల్ఎన్జీలో దాదాపు 20 శాతం ఈ మార్గం గుండా రవాణా అవుతుంది. అయితే ఫిబ్రవరి 28వ తేదీన మొదలైన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో నౌకల రాకపోకలు భారీగా తగ్గాయి. ఫలితంగా ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 90 డాలర్లకు చేరువైంది. అమెరికాలో పెట్రోల్ ధర గ్యాలన్‌కు 4 డాలర్ల స్థాయికి చేరింది.నిలిచిన చర్చలు.. పెరుగుతున్న ఉద్రిక్తతఅమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు నిలిచిపోయాయి. యుద్ధాన్ని ముగించే దిశగా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. మరోవైపు ఇరాన్‌పై మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధిస్తామని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తెలిపారు.హర్ముజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం సాగుతున్న ఈ పోరు కొనసాగితే.. ప్రపంచ చమురు సరఫరా, ఇంధన ధరలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఇరాన్ నెత్తిన అమెరికా మరో పిడుగు! అవసరమైతే..
తమ డిమాండ్లు, షరతుల విషయంలో రాజీ పడబోమని.. అవసరమైతే ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం యుద్ధం కొనసాగిస్తామని ఇరాన్ కుండబద్ధలు కొట్టేసింది. ఈ తరుణంలో అమెరికా ఒత్తిడి మరింత పెంచింది. హర్ముజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ‘ నో ఎండ్ ప్లాన్’తో మరింత దూకుడుగా వ్యవహరించాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే జలసంధిలో నౌకా దిగ్బంధాన్ని (బ్లాకేడ్) కొనసాగిస్తున్న అమెరికా సైన్యం.. అవసరమైతే నిరవధికగా ఆ పని చేయాలని భావిస్తోంది. అంటే నిర్దిష్ట కాలపరిమితి అంటూ ఏదీ లేకుండా ఇరాన్ పోర్టులకు వచ్చి పోయే నౌకలపై నిఘా కొనసాగించడం(అవసరమైతే దాడులు జరపడం) అన్నమాట.కాల్పుల విరమణ చర్చలు నిలిచిపోవడం, ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో నౌకాదళాన్ని కొనసాగించే సామర్థ్యం అమెరికాకు ఉందని చెప్పారు. అవసరమైనప్పుడు యుద్ధ నౌకలను మార్చుతూ హర్ముజ్ ప్రాంతంలో పహారా కొనసాగిస్తామని తెలిపారు.ఇరాన్‌పై మరిన్ని ఆర్థిక ఆంక్షలునౌకా దిగ్బంధంతో పాటు ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఆంక్షల చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అమెరికా లక్ష్యం ఇరాన్‌ను చర్చల బల్లపైకి తీసుకురావడమేనని వాషింగ్టన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటివరకు విధించిన ఆంక్షలు, ఒత్తిళ్లు ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదని కూడా విశ్లేషణలు ఉన్నాయి.హర్ముజ్ జలసంధే కేంద్రంగా పోరుఅణు ఒప్పందంతో మొదలైన పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఇప్పుడు హర్ముజ్ జలసంధి చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ రవాణాలో ఈ మార్గం అత్యంత కీలకం. యుద్ధం ప్రారంభానికి ముందు ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం ద్వారానే జరిగేది. తమపై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ ఈ వ్యూహాత్మక మార్గంపై నియంత్రణ సాధించేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. మరోవైపు హర్ముజ్ తమ ఆధీనంలోనే ఉందని ఇరాన్ చెబుతోంది.రెండు చమురు నౌకలపై దాడిహర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి చెందిన రెండు నౌకలపై దాడి జరిగినట్లు యూఏఈ అధికారిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనకు ఇరాన్ కారణమని యూఏఈ ఆరోపించింది. ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా ఆందోళనలు మరింత పెరిగాయి. నౌకల రాకపోకలు కూడా భారీగా తగ్గిపోయాయి.నౌకల రాకపోకలకు బ్రేక్యుద్ధానికి ముందు హర్ముజ్ జలసంధి ద్వారా రోజుకు 130 నుంచి 140 వరకు నౌకలు ప్రయాణించేవి. ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఒక దశలో రోజుకు కేవలం ఎనిమిది నౌకలు మాత్రమే ఈ మార్గంలో ప్రయాణించినట్లు సమాచారం. అమెరికా గతంలో ఇరాన్ నౌకలు, పోర్టులపై ఉన్న దిగ్బంధాన్ని కొంతకాలం సడలించినప్పటికీ.. తర్వాత మళ్లీ పునరుద్ధరించింది. దీనివల్ల ఇరాన్‌కు కీలకమైన విదేశీ మారక ఆదాయంపై ప్రభావం పడుతోంది.ప్రపంచ చమురు మార్కెట్లో కలవరంఇరాన్ సంక్షోభం కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ఈ ఏడాది ప్రపంచ చమురు సరఫరా రోజుకు 43 లక్షల బ్యారెళ్ల మేర తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇది దాదాపు 4 శాతానికి సమానం. అయితే మరోవైపు డిమాండ్ తగ్గడం, అమెరికా ముడిచమురు నిల్వలు పెరగడంతో చమురు ధరలు కొంత తగ్గాయి. గురువారం ధరలు 2 శాతానికి పైగా పడిపోయాయి.ట్రంప్‌పై దేశీయ ఒత్తిడిఇరాన్తో యుద్ధం ముగించాలని అమెరికాలోనూ ఒత్తిడి పెరుగుతోంది. పెరిగిన ఇంధన ధరలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి. నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఈ అంశం రాజకీయంగా కీలకంగా మారింది. ట్రంప్ ఈ మధ్య హర్ముజ్‌పై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని వ్యాఖ్యానించారు. అయితే ఇరాన్ దీనిని ఖండిస్తూ.. ఆంక్షలు ఎత్తివేయడం, తమ నిలిపివేసిన ఆస్తులను విడుదల చేయడం వంటి షరతులు నెరవేరే వరకు జలసంధిని పూర్తిగా తెరవబోమని స్పష్టం చేసింది.యుద్ధం కంటే ఆర్థిక దెబ్బే వ్యూహమా?ఇరాన్‌పై సైనిక చర్యలు చేపడతామని ట్రంప్ గతంలో హెచ్చరించినప్పటికీ.. ప్రస్తుతం ఆర్థిక ఒత్తిడిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా ఇప్పటికే ఇరాన్‌కు ఆయుధాల సరఫరాకు సహకరిస్తున్న వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలు విధించింది. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని పొందకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని హెగ్సెత్ తెలిపారు.అబ్రహం లింకన్ నౌకపై వదంతులుహర్ముజ్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌకపై సిబ్బంది మరణించారన్న వార్తలను అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఖండించింది. ఈ యుద్ధం ఆగదని.. తమ జీవితాలు ఇంతేనన్న వైరాగ్యంతో ఏడుగురు నేవీ సిబ్బంది బలవన్మరణానికి పాల్పడ్డారన్నది ఇరాన్ మీడియా కథనాల సారాంశం. అయితే అది తప్పు సమాచారమని అమెరికా తెలిపింది. 260 రోజులకు పైగా సముద్రంలో ఉన్నప్పటికీ అబ్రహం లింకన్ క్యారియర్ గ్రూప్ సిబ్బంది ధైర్యంగా ఉన్నారని CENTCOM పేర్కొంది. ఆగస్టు 3న సముద్రంలో పడిపోయిన ఒక నావికుడిని కూడా సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించింది. ఈ తరుణంలో.. లింకన్ నౌకను ఒడ్డుకు రప్పించి జార్జ్ వాషింగ్టన్ నౌకతో రిప్లేస్ చేశామని, ఇది సాధారణ చర్యేనని ప్రకటించుకుంది.హర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరు ఇప్పుడు అమెరికా–ఇరాన్ ఘర్షణలో కీలక అంశంగా మారింది. ఒకవైపు అమెరికా నిరవధిక బ్లాకేడ్, ఆర్థిక ఆంక్షలతో ఒత్తిడి పెంచుతుండగా.. మరోవైపు ఇరాన్ వ్యూహాత్మక మార్గాన్ని తన ఆధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ పోరు ఎంతకాలం కొనసాగుతుందన్నది చమురు మార్కెట్లతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపనుంది. -
‘ఆయనకేం.. చెత్తబుట్టలో కూడా దాక్కుంటారు!’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతకు సంబంధించిన రహస్య ఆపరేషన్ అంతర్జాతీయ చర్చకు దారితీసింది. టర్కీలోని అంకారాలో నాటో సదస్సు పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఆయన్ని మరో చిన్న విమానంలోకి మార్చిన ఘటనపై విశ్లేషణలు నడుస్తున్నాయి. అయితే ఈ ఘటనపై ఇరాన్ మీడియా తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ ఘటన అమెరికా అధ్యక్షుడి భద్రతా ఆందోళనలను బయటపెట్టిందంటూ వ్యాఖ్యానించింది.నాటో సదస్సు కోసం టర్కీ వెళ్లిన ట్రంప్ తిరుగు ప్రయాణం సందర్భంగా ఎయిర్‌ఫోర్స్ వన్‌పై క్షిపణి (shoulder-fired missile) దాడి ముప్పు ఉందన్న సమాచారంతో అమెరికా సీక్రెట్ సర్వీస్ అప్రమత్తమైంది. ముప్పు నమ్మదగినదిగా, తక్షణ చర్య అవసరమయ్యే స్థాయిలో ఉందని భావించి ఈ రహస్య మార్పిడి చేపట్టినట్లు సమాచారం.ఇరాన్ మీడియా వ్యంగ్యంఈ ఘటనను ఇరాన్ ప్రభుత్వ మీడియా తమ ప్రచారానికి ఉపయోగించుకుంది. అమెరికా అధ్యక్షుడు ఇరాన్ సైనిక శక్తికి భయపడుతున్నారనే సంకేతంగా ఈ విమాన మార్పిడిని చిత్రీకరించింది. ట్రంప్ తాజా “స్కాండల్”గా అభివర్ణిస్తూ.. ఇది ఆయనకు అవమానకర పరిస్థితి అని ఇరాన్ టీవీ వ్యాఖ్యాత పేర్కొన్నారు. ఇరాన్ దక్షిణాఫ్రికా రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ట్రంప్‌ను కేటరింగ్ బాక్స్‌లో దాచినట్లు చూపించే మీమ్‌ను కూడా షేర్ చేసింది. “త్వరలో చెత్త బుట్టలో దాచాల్సి వస్తుంది” అనే వ్యాఖ్యను జోడించింది.He will be hidden in a trash can before long. pic.twitter.com/ZTkAahNIKw— Iran Embassy SA (@IraninSA) August 11, 2026Brave American hero, or a coward hiding in a catering truck? pic.twitter.com/t1vcmrdcHw— Iran Embassy SA (@IraninSA) August 12, 2026కేటరింగ్ వాహనంలో రహస్య తరలింపుజూలై 8న అంకారా నుంచి బ్రిటన్‌కు బయలుదేరే సమయంలో ట్రంప్, ఆయనతో ఉన్న కొద్దిమంది సిబ్బందిని కేటరింగ్ ట్రక్కు ద్వారా పెద్ద విమానం నుంచి చిన్న ప్రభుత్వ విమానం C-32Aలోకి మార్చినట్లు నివేదికలు వెల్లడించాయి. అదే సమయంలో అసలు ఎయిర్‌ఫోర్స్ వన్ వేరుగా బయలుదేరింది. అందులో సీనియర్ అధికారులు, వైట్‌హౌస్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఉన్నారు.ఈ ఆపరేషన్ వివరాలను తొలుత వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. ట్రంప్ ప్రయాణ వివరాలు, ఆయన అంకారాలో ఉన్న హోటల్ అంతస్తు వరకు ఇరాన్‌కు తెలిసినట్లు అమెరికా అధికారులు ఆందోళన చెందారని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అలాగే ఇలాంటి డీకాయ్ ఆపరేషన్లు(మోసపూరిత భద్రతా వ్యూహం) సర్వసాధారణమేనని వ్యాఖ్యానించింది. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ఘటనఅమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్‌పై గతంలోనూ దాడి కుట్ర ఆరోపణలు వచ్చాయి. 2024లో ట్రంప్ అప్పటి అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో ఆయన హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై అమెరికా న్యాయశాఖ ఓ ఇరానియన్పై కేసు నమోదు చేసింది. అయితే ఆ ఆరోపణలను ఇరాన్ ఖండించింది.ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ఇజ్రాయెల్-అమెరికా.. ఇరాన్‌ల యుద్ధం మొదలైంది. అయితే గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులకు శాశ్వత ముగింపు కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో ఇప్పటికీ ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే విమాన మార్పిడి ఘటన రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.భద్రతా చర్యా? రాజకీయ ప్రచారమా?అమెరికా వర్గాల ప్రకారం ఇది అధ్యక్షుడి భద్రత కోసం తీసుకున్న ముందస్తు జాగ్రత్త మాత్రమే. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన సమాచారంతోనే డీకాయ్ ఆపరేషన్ చేపట్టింది. అయితే కేవలం ఒక ఏజెన్సీ సమాచారంతోనే.. అదీ ధృవీకరణ చేసుకోకుండానే అమెరికా భద్రతా బలగాలు ట్రంప్‌ను అలా తరలించారని తర్వాత తెలిసింది. ఏది ఏమైనా.. ఈ మొత్తం వ్యవహారాన్ని ఇరాన్ మాత్రం దీన్ని అమెరికా బలహీనతకు సంకేతంగా చూపిస్తూ ప్రచారం చేస్తోంది. ట్రంప్‌ను రక్షించేందుకు చేపట్టిన అత్యంత రహస్య ఆపరేషన్ ఇప్పుడు ఇరు దేశాల మధ్య మాటల యుద్ధానికి కొత్త కారణంగా మారింది. -
ట్రంప్ బిగ్ వార్నింగ్: హర్ముజ్ మాదే.. ఇక వదులుకోం!
పశ్చిమాసియా సంక్షోభంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ.. హర్ముజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గంపై పూర్తి నియంత్రణ అమెరికాదేనని.. ఇక మీదట దానిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. హర్ముజ్ జలసంధిపై అమెరికాకు సంపూర్ణ ఆధిపత్యం ఉందని, ఇరాన్ దీనిని ఎదుర్కొనే పరిస్థితిలో లేదని వ్యాఖ్యానించారు. అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని ‘‘ఉక్కు గోడ’’గా అభివర్ణించారు. అయితే తన పోస్ట్ చివర్లో ‘అల్లాహ్‌కు స్తుతి’ అంటూ ట్రంప్ ముగించారు. సాధారణంగా ఇస్లామిక్ సందర్భాల్లో వినిపించే ఈ పదబంధాన్ని ట్రంప్ ఇరాన్ అంశాన్ని ప్రస్తావిస్తూ వ్యంగ్య ధోరణిలో ఉపయోగించినట్లు భావిస్తున్నారు.వీక్ ఇరాన్!ఇరాన్‌కు నౌకాదళం, వైమానిక దళం బలహీనంగా ఉన్నాయని ట్రంప్ అంటున్నారు. ఇరాన్ సైనికులకు జీతాలు కూడా అందడం లేదని వ్యాఖ్యానించారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) తీవ్రంగా దెబ్బతిన్నదని, వెనక్కి తగ్గుతోందని పేర్కొన్నారు.తగ్గమంటున్న ఇరాన్ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ కొట్టిపారేసింది. హార్ముజ్ జలసంధిపై అమెరికా పూర్తి నియంత్రణ సాధించిందన్న వాదన వాస్తవాన్ని మార్చలేదని పేర్కొంది. హార్ముజ్ ఇంకా మూసివేసే ఉందని, ఇరాన్ పెట్టిన షరతులు అంగీకరించే వరకు దానిని తిరిగి తెరవబోమని పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ (PGSA) స్పష్టం చేసింది. అమెరికా అధికారులు పదేపదే చేస్తున్న ప్రకటనలు పరిస్థితిని మార్చలేవని వెల్లడించింది. అమెరికా నౌకాదళ దిగ్బంధం ఎత్తివేయడం, తమ ఆస్తులపై ఆంక్షలు తొలగించడం, యుద్ధ నష్టాలకు పరిహారం చెల్లించడం వంటి డిమాండ్లను ఇరాన్ ముందుకు తెస్తోంది. ఈ షరతులు నెరవేరే వరకు జలసంధి విషయంలో వెనక్కి తగ్గబోమని చెబుతోంది.ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావంప్రపంచ చమురు సరఫరాలో హార్ముజ్ జలసంధి అత్యంత కీలకమైన మార్గం. ఇక్కడ నెలకొన్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. నౌకల రాకపోకలు తగ్గడం, భద్రతా భయాలు పెరగడంతో చమురు ధరలు, రవాణా వ్యయాలపై ప్రభావం కనిపిస్తోంది.చర్చలపై ట్రంప్ వ్యూహంఇరాన్తో చర్చల విషయంలో ట్రంప్ భిన్నమైన వైఖరి ప్రదర్శిస్తున్నారు. తాము తక్కువ స్థాయిలో చర్చలు జరుపుతున్నామని, ఇది ఒక చెస్ ఆటలా ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందని, ద్రవ్యోల్బణం పెరిగిందని పేర్కొన్నారు. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మాత్రం అమెరికాతో నేరుగా చర్చలు జరగడం లేదని, మధ్యవర్తుల ద్వారా కేవలం సందేశాల మార్పిడి మాత్రమే జరుగుతోందని తెలిపారు. -
హర్ముజ్‌పై ఉడుంపట్టు.. ట్రంప్ సంచలన ప్రకటన
పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. ఇరాన్‌పై ఆంక్షలు, నౌకా దిగ్బంధం కొనసాగుతున్న వేళ.. అమెరికా దళాలు రంగంలోకి దిగాయి. హర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఓ కార్గో నౌకపై నిబంధనలు ఉల్లంఘించిందని చెబుతూ చర్యలు చేపట్టింది. దీంతో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో.. హర్ముజ్‌పై పూర్తి నియంత్రణ మాదే అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హర్ముజ్‌లో అమెరికా ఇప్పటిదాకా బ్లాకేడ్కే పరిమితం కాగా.. తాజా దాడులకూ దిగింది. ఇరాన్ పోర్టు వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన పనామా జెండా కలిగిన ఓ కార్గో నౌకను అమెరికా దళాలు అడ్డుకున్నాయి. హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో ఆ నౌక స్టీరింగ్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని రెండు హెల్ఫైర్ క్షిపణులు ప్రయోగించి దాన్ని నిర్వీర్యం చేశాయి. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అధికారంగా ప్రకటించింది. హర్ముజ్ దిగ్బంధాన్ని దాటేందుకు ప్రయత్నించిన వాణిజ్య నౌకల్లో ఇప్పటివరకు 55 నౌకలను దారి మళ్లించామని, మూడు నౌకలను నిలిపివేశామని, రెండు నౌకలను తనిఖీ చేశామని అమెరికా వెల్లడించింది. తద్వారా హర్ముజ్‌పై తాము పూర్తిగా పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉన్నట్లు సంకేతాలిచ్చింది. అయితే.. హర్ముజ్ మా నియంత్రణలోనే.. ట్రంప్ఇరాన్ పరిస్థితి “బాగానే సాగుతోంది” అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. హర్ముజ్ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని, తమ నౌకాదళం అత్యంత శక్తివంతమైనదని పేర్కొన్నారు. ఇరాన్‌ను నమ్మలేమని, గతంలో ఆ దేశం పలుమార్లు అబద్ధాలు చెప్పిందని మండిపడ్డారు. అంతేకాదు ఇరాన్‌తో చర్చల్లో గత దశాబ్దాల ఘర్షణల్లో జరిగిన నష్టాలకు పరిహారం కోరుతామని ట్రంప్ ప్రకటించడం మరింత ఉద్రిక్తతకు కారణమైంది. అయితే ట్రంప్ తాజా ప్రకటనను ఇరాన్ ఎలా స్వీకరిస్తుందనేది చూడాలి.మా ఈ డిమాండ్లు.. నిబంధనలు నేరవేరాల్సిందే!: ఇరాన్హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలంటే అమెరికా తమ డిమాండ్లను అంగీకరించాలని ఇరాన్ స్పష్టం చేసింది. అవి..అమెరికా యుద్ధ చర్యలు, బెదిరింపులకు పూర్తిగా ముగింపుఇరాన్ పోర్టులపై నౌకా దిగ్బంధం ఎత్తివేతఅమెరికా సైనిక బలగాల ఉపసంహరణయుద్ధ నష్టాలకు పరిహారంఆంక్షల తొలగింపుస్తంభింపజేసిన ఇరాన్ నిధుల విడుదలప్రాంతీయ కాల్పుల విరమణ.. ఈ షరతులు నెరవేరే వరకు హర్ముజ్ మూసివేత కొనసాగుతుందని ఇరాన్ జాతీయ భద్రతా మండలి అధికారి మొహ్సెన్ రెజాయి తెలిపారు.ఒమన్ మధ్యవర్తిత్వం.. చర్చలు తుది దశలో?అమెరికా-ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు లేవని ఇరాన్ చెబుతున్నప్పటికీ.. ఒమన్ మధ్యవర్తిత్వంతో హర్ముజ్ భవిష్యత్ నిర్వహణపై చర్చలు జరుగుతున్నాయి. నౌకల రాకపోకల కోసం కొత్త మార్గాలపై ఒప్పందం చివరి దశకు చేరుకుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తెలిపారు. ఖతార్ కూడా ఇరాన్, ఒమన్ మధ్య చర్చలు గణనీయమైన పురోగతిలో ఉన్నాయని పేర్కొంది.90 డాలర్లకు చేరువలో.. “ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన ఈ మార్గం ద్వారా గతంలో చమురు, ఎల్ఎన్జీ రవాణాలో దాదాపు ఐదో వంతు సాగేది. అయితే సంక్షోభంతో ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు దాదాపు 90 డాలర్లకు చేరువైంది. హర్ముజ్ మార్గం ద్వారా గతంలో ప్రపంచంలోని చమురు, ఎల్ఎన్జీ సరఫరాలో ఐదో వంతు రవాణా అయ్యేది.బాబ్ అల్ మందెబ్‌లో హౌతీ దాడి.. నలుగురు మృతిమరోవైపు ఎర్ర సముద్రంలోని బాబ్ అల్ మందెబ్ జలసంధిలో హౌతీలు వాణిజ్య నౌకపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు పాకిస్థానీలు, ఒక ఇండోనేషియా పౌరుడు మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. సౌదీ సైనిక సామగ్రిని తరలిస్తున్న నౌకను లక్ష్యంగా చేసుకున్నామని హౌతీలు ప్రకటించారు. అయితే ఆ నౌక సౌదీ యాజమాన్యంలో లేదని, ఈజిప్టు కంపెనీలకు చెందినదని సమాచారం.అటు.. వెస్ట్ బ్యాంక్‌లో ఉద్రిక్తతలుఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోనూ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 76 మంది పాలస్తీనియన్లు, వారిలో 18 మంది చిన్నారులు మరణించారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.ప్రపంచం చూపు హర్ముజ్‌పైనే!హర్ముజ్ జలసంధిపై అమెరికా, ఇరాన్ వైఖరులు పరస్పర విరుద్ధంగా కొనసాగుతున్న వేళ.. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఉత్కంఠగా మారింది. ఒకవైపు అమెరికా పూర్తి నియంత్రణ తమదేనని చెబుతుండగా.. మరోవైపు తమ షరతులు నెరవేరే వరకు హర్ముజ్ తెరవబోమని ఇరాన్ స్పష్టం చేస్తోంది.చర్చలు పురోగమిస్తాయా? లేదంటే ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా? అన్నదే ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న అతిపెద్ద ప్రశ్న. హర్ముజ్ సంక్షోభం పరిష్కారం కాకపోతే.. దాని ప్రభావం చమురు ధరల నుంచి అంతర్జాతీయ వాణిజ్యం వరకు పడే అవకాశం ఉంది. -
రివర్స్ రీయింబర్స్మెంట్.. ట్రంప్ నయా గేమ్!
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి చుట్టూ మొదలైన వివాదం ఇప్పుడు దౌత్యపరమైన ఆధిపత్య పోరుగా మారింది. ఐదు నెలలపాటు కొనసాగిన ఘర్షణల తర్వాత పరిస్థితులు కొంత చల్లబడతాయని భావిస్తున్న సమయంలో.. ఇరు దేశాలు పరస్పరం కొత్త డిమాండ్లు, ఆరోపణలతో ముందుకు రావడం అంతర్జాతీయ ఆందోళనలకు కారణమవుతోంది.యుద్ధంలో తమకు జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించాలని, అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ డిమాండ్లను తిరస్కరించడమే కాకుండా.. గత ఘర్షణల్లో అమెరికా పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోవడానికి ఇరాన్ బాధ్యత వహించాలని, తమ నష్టాలకు టెహ్రాన్ నుంచే పరిహారం కోరుతామని స్పష్టం చేశారు.హర్ముజ్ తెరవాలంటే ఇరాన్ షరతులుహర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ తన వైఖరిని కఠినంగా వెల్లడించింది. అమెరికా చర్యల కారణంగా తమ దేశానికి జరిగిన నష్టాలను భర్తీ చేయాలని, అంతర్జాతీయ ఆంక్షల నుంచి ఉపశమనం కల్పించాలని కోరుతోంది. యుద్ధ పరిస్థితుల్లో నిలిచిపోయిన తమ ఆస్తులను విడుదల చేయాలని, మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించాలని కూడా టెహ్రాన్ డిమాండ్ చేస్తోంది.ఈ డిమాండ్లపై స్పష్టమైన హామీ లభించే వరకు హర్ముజ్ విషయంలో తమ వైఖరిలో మార్పు ఉండకపోవచ్చనే సంకేతాలను ఇరాన్ ఇస్తోంది. హర్ముజ్ జలసంధి తమ భద్రత, ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశమని టెహ్రాన్ చెబుతోంది.ట్రంప్ ఎదురుదాడి.. ‘పరిహారం మాకే రావాలి’ఇరాన్ డిమాండ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. యుద్ధంలో అమెరికన్ల ప్రాణ నష్టానికి, గత ఘర్షణల్లో జరిగిన నష్టాలకు ఇరాన్ బాధ్యత వహించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ నుంచి పరిహారం కోరుతామని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌కు అమెరికా పరిహారం చెల్లించాలన్న డిమాండ్‌ను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. గతంలో ఇరాన్ చర్యల వల్ల అమెరికా ఎదుర్కొన్న నష్టాలను ప్రస్తావిస్తూ.. బాధ్యత టెహ్రాన్పైనే ఉందని వాదిస్తున్నారు.ఆంక్షలతో ఒత్తిడి పెంచాలన్న అమెరికా వ్యూహంప్రస్తుతం ఇరాన్‌పై సైనిక చర్యల కంటే ఆర్థిక ఒత్తిడి పెంచడంపైనే అమెరికా దృష్టి పెట్టిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు తీవ్రతరం అయితే ఇరాన్ చర్చలకు రావాల్సి వస్తుందని ట్రంప్ వర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఇరాన్ మాత్రం అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని చెబుతోంది. ఆంక్షలు తమను బలహీనపర్చేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నమని ఆరోపిస్తూ.. తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని మార్గాల్లో పోరాడతామని స్పష్టం చేస్తోంది.ప్రపంచానికి ఎందుకు కీలకం హర్ముజ్?పర్షియన్ గల్ఫ్‌ను ఒమన్ గల్ఫ్‌తో కలిపే సన్నని సముద్ర మార్గమే హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలో ఇది అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటి. మధ్యప్రాచ్యం నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు వెళ్లే భారీ స్థాయి ఇంధన సరఫరా ఈ మార్గంపైనే ఆధారపడి ఉంటుంది. హర్ముజ్‌లో ఏదైనా అంతరాయం ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇంధన సరఫరాలో అనిశ్చితి ఏర్పడటంతో పాటు అంతర్జాతీయ వాణిజ్యంపైనా ప్రభావం పడే ప్రమాదం ఉంది. అందుకే ఇరాన్–అమెరికా వివాదంలో హర్ముజ్ జలసంధి కేంద్ర బిందువుగా మారింది.ట్రంప్‌పై ఎన్నికల ఒత్తిడి.. ఇరాన్‌కు కలిసొస్తుందా?అమెరికాలో రాజకీయ పరిణామాలు కూడా ఈ సంక్షోభంపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్‌తో దీర్ఘకాలిక ఘర్షణ కొనసాగితే దేశీయంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మాజీ అమెరికా అధికారి చార్లెస్ కుప్చాన్ అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల ఒత్తిడి కారణంగా చర్చల్లో ఇరాన్‌కు కొంత వ్యూహాత్మక ఆధిక్యం లభించే అవకాశం ఉంది. అయితే అదే సమయంలో టెహ్రాన్ చేస్తున్న డిమాండ్లు అమెరికాకు అంగీకరించలేని స్థాయిలో ఉన్నాయని ఆయన విశ్లేషించారు.కొనసాగుతున్న ఉద్రిక్తతలుఇరాన్–అమెరికా వివాదం ప్రభావం పశ్చిమాసియాలో ఇతర ప్రాంతాలపైనా కనిపిస్తోంది. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండగా.. యెమెన్‌లో హౌతీ దళాల చర్యలు పరిస్థితులను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. గాజా శాంతి ప్రయత్నాలపైనా అనిశ్చితి కొనసాగుతోంది.హర్ముజ్ తాళం ఎవరి చేతిలో?ప్రస్తుతం అమెరికా–ఇరాన్ మధ్య అసలు పోరు కేవలం పరిహారం, ఆంక్షల అంశానికే పరిమితం కాలేదు. ఇది మిడిల్ఈస్ట్లో ఆధిపత్యం, భద్రత, ప్రపంచ ఇంధన సరఫరాలపై ప్రభావం చూపే పెద్ద సంక్షోభంగా మారింది.ఇరాన్ తన డిమాండ్లపై పట్టుబడుతుండగా.. ట్రంప్ కూడా వెనక్కి తగ్గే సూచనలు ఇవ్వడం లేదు. చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందా? లేదంటే హర్ముజ్ జలసంధి మరోసారి ప్రపంచ సంక్షోభానికి కేంద్రంగా మారుతుందా? అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న. -
ఇరాన్‌ను లొంగదీసుకునేందుకు మరో మాస్టర్‌ప్లాన్!
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు ఇరాన్‌పై తీవ్ర హెచ్చరికలు చేస్తూ.. మరోవైపు చర్చలకు తలుపులు తెరిచి ఉంచుతున్న ఆయన తీరు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. “ఇది యుద్ధం కాదు.. చెస్ గేమ్ లాంటిది” అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆయన వ్యూహానికి అద్దం పడుతున్నాయి. సైనిక చర్యల కంటే ముందుగా ఆర్థిక ఒత్తిడి, ఆంక్షలు, దౌత్యపరమైన ఎత్తుగడలతో ఇరాన్‌ను చర్చల బాట పట్టించాలన్నది అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది. ఇరాన్‌తో అమెరికా ప్రస్తుతం “పాక్షిక చర్చలు మాత్రమే” జరుపుతోందని ట్రంప్ తాజాగా స్పష్టం చేశారు. “ఇరాన్లో భారీ ద్రవ్యోల్బణం ఉంది. వారి వద్ద డబ్బు లేదు. మేం పరిస్థితిని గమనిస్తున్నాం” అని ట్రంప్ పేర్కొన్నట్లు అమెరికా మీడియా సంస్థ ఆక్సియోస్ తెలిపింది.వెంటనే మరో సైనిక చర్యకు దిగకుండా.. ఇరాన్ ఆర్థిక పరిస్థితిని మరింత ఒత్తిడికి గురిచేసే విధానాన్ని అనుసరిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.ఇటీవల ఇరాన్‌పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ట్రంప్.. ఇప్పుడు మాట మార్చడం వెనుక వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం వల్ల అమెరికాపై పడే ఆర్థిక, రాజకీయ ప్రభావాలను అంచనా వేసుకుంటూనే.. ఒత్తిడి ద్వారా ఫలితం సాధించాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.ఓసారి దాడుల మాట.. మరోసారి చర్చల బాట!ట్రంప్ విదేశాంగ విధానంలో ఈ మార్పు కొత్తది కాదు. ప్రత్యర్థి దేశాలపై గరిష్ఠ ఒత్తిడి తీసుకురావడం.. ఆ తర్వాత చర్చలకు మార్గం సుగమం చేయడం ఆయన శైలిలో కనిపించే అంశం. ఇరాన్ విషయంలోనూ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు సైనిక శక్తిని ప్రదర్శిస్తూ హెచ్చరికలు చేయడం.. మరోవైపు చర్చలకు అవకాశం ఉందని చెప్పడం ద్వారా టెహ్రాన్‌పై మానసిక ఒత్తిడి పెంచే ప్రయత్నం జరుగుతోందని అంచనాలు ఉన్నాయి.“ఇది చెస్ ఆట లాంటిది. చివరకు అంతా సర్దుకుంటుంది” అని ట్రంప్ చెప్పడం కూడా ఈ వ్యూహాన్నే సూచిస్తోంది. చమురు ధరలు తగ్గుతున్నాయని, దీంతో యుద్ధ ప్రభావం అమెరికా ప్రజలపై పెద్దగా పడటం లేదని ఆయన పేర్కొన్నారు.మారిన సమీకరణాలుఅమెరికా–ఇరాన్ వివాదం కొత్తది కాదు. ఇరాన్ అణు కార్యక్రమం చుట్టూ మొదలైన వివాదం.. ఆంక్షలు, చమురు ఎగుమతులు, ప్రాంతీయ ఆధిపత్య పోరు వరకు విస్తరించింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ప్రధాన పట్టు హర్ముజ్ జలసంధిపై ఉంది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ మార్గం ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది.హర్ముజ్‌ను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలంటే అమెరికా ముందుగా నౌకాదళ ఆంక్షలు, చమురు ఆంక్షలను తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మాట్లాడుతూ.. అమెరికాతో నేరుగా చర్చలు జరగడం లేదని, కానీ మధ్యవర్తుల ద్వారా చర్చలకు అనుకూల వాతావరణం కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.అదసలు సాధ్యమేనా?ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి అమెరికాకు కొత్త వ్యూహం కాదు. దశాబ్దాలుగా అమలు చేస్తున్న ఆంక్షల కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. చమురు ఎగుమతులు, విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థపై ఆంక్షలు ఆ దేశ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేశాయి. అయితే ఇరాన్‌ను పూర్తిగా లొంగదీయడం మాత్రం అంత సులభం కాలేదు. ఆంక్షల మధ్య కూడా చైనా వంటి దేశాలకు చమురు విక్రయించడం, ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలు అనుసరించడం ద్వారా టెహ్రాన్ కొంతవరకు నష్టాన్ని భర్తీ చేసుకుంటోంది.అంటే.. ఆంక్షలు ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతున్నప్పటికీ, అవి ఇప్పటివరకు ఆ దేశాన్ని పూర్తిగా అమెరికా షరతులకు తలొగ్గే స్థాయికి తీసుకురాలేదని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు ట్రంప్ ఆర్థిక ఒత్తిడితో పాటు దౌత్యపరమైన ఒత్తిడిని కూడా కలిపి ప్రయోగిస్తున్నట్లు కనిపిస్తోంది.ట్రంప్‌కు నెతన్యాహూ షాక్ఇదిలా ఉండగా.. గాజా అంశంలో అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ పూర్తిగా ఆయుధాలు పక్కన పెట్టేంత వరకు గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ ఉండదని నెతన్యాహూ స్పష్టం చేశారు. ఈ అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. తన దేశ ప్రజల ముందు తాను కఠిన వైఖరినే కొనసాగిస్తున్నానని చూపించుకోవాల్సిన రాజకీయ ఒత్తిడి కూడా ఆయనపై ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.హౌతీల దాడులతో మరింత ఉద్రిక్తతమరోవైపు యెమెన్‌లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలోని అల్-మఖా పోర్టుపై దాడి చేశారు. ఈ ఘటనలో కనీసం ఏడుగురు మరణించినట్లు సమాచారం. హౌతీల చర్యలు, హార్ముజ్ వివాదం, గాజా యుద్ధ పరిణామాలు కలిసి మధ్యప్రాచ్య పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి.ట్రంప్ వ్యూహం ఫలిస్తుందా?ఇరాన్‌తో ఘర్షణను పూర్తిస్థాయి యుద్ధంగా మార్చకుండా.. ఆర్థిక ఒత్తిడి, చర్చలు, వ్యూహాత్మక బెదిరింపులతో తన లక్ష్యాలను సాధించాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. అయితే ఇరాన్ కూడా వెనక్కి తగ్గే పరిస్థితిలో లేదు. అణు కార్యక్రమం, చమురు ఆంక్షలు, హార్ముజ్ జలసంధి వంటి అంశాలపై రెండు దేశాల మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ట్రంప్ ఆడుతున్న ఈ ‘చెస్ గేమ్’లో ఇరాన్ చివరకు ఏ ఎత్తు వేస్తుంది? లేదంటే ఈ వ్యూహం మరోసారి పశ్చిమాసియా యుద్ధం అంచులకు తీసుకెళ్తుందా?.. రాబోయే రోజుల్లోనే తెలిసేది. -
ఇరాన్ యుద్ధం.. ట్రంప్ బిగ్ సిగ్నల్
పశ్చిమాసియాను కుదిపేస్తున్న యుద్ధ మేఘాలు క్రమంగా తొలగిపోతున్నాయా? నెలల తరబడి కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ ఘర్షణకు తెరపడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఆయుధ నిల్వలు, యుద్ధ సామర్థ్యంపై చర్చలు సాగుతుండగా.. మరోవైపు కీలక దేశాల మధ్య దౌత్య ప్రయత్నాలు వేగం పుంజుకోవడం ఆసక్తిని రేపుతోంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం “చాలా త్వరలోనే ముగుస్తుందని భావిస్తున్నా” అని ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. ఇరాన్ ఈ యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగించే పరిస్థితిలో లేదని ఆయన పేర్కొన్నారు.క్షిపణుల నిల్వలపై వస్తున్న ప్రశ్నలపైనా ట్రంప్ స్పందించారు. కొన్ని అత్యంత శక్తివంతమైన ఆయుధాలు తమ వద్ద భారీగా ఉన్నాయని, మరికొన్ని ఆయుధాల నిల్వలు పరిమితంగా ఉన్నాయని అంగీకరించారు. అయితే అమెరికా సైన్యం మాత్రం “చాలా మంచి స్థితిలోనే ఉందని” స్పష్టం చేశారు.ఇటీవల ఇరాన్‌తో నెలల తరబడి సాగిన యుద్ధంలో అమెరికా సైన్యం అత్యంత ఖచ్చితమైన దీర్ఘశ్రేణి క్షిపణుల నిల్వలను భారీగా వినియోగించిందని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఆయుధాల లభ్యతపై చర్చ మొదలైంది. అయితే ఆయుధాల కొరతను అధిగమించేందుకు అమెరికా రక్షణ సంస్థలు కొత్త తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయని ట్రంప్ తెలిపారు. ముఖ్యంగా పేట్రియాట్, టామాహాక్ క్షిపణుల ఉత్పత్తిని పెంచుతున్నట్లు వెల్లడించారు.హర్ముజ్ జలసంధిపై కీలక నిర్ణయం?మరోవైపు ఇరాన్, అమెరికా, ఒమన్ మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి తాత్కాలిక ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నట్లు సమాచారం. ఈ మార్గంలో ఆంక్షలు, భద్రతా సమస్యలు ప్రపంచ చమురు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.మోదీ–నెతన్యాహు ఫోన్కాల్పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్లో చర్చించారు. భారత్–ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కూడా ఇరువురు నేతలు సమీక్షించినట్లు మోదీ తెలిపారు.Received a phone call from Prime Minister Benjamin Netanyahu. We reviewed progress on various aspects of the India-Israel Special Strategic Partnership which continues to grow from strength-to-strength.We also exchanged views on the current situation in West Asia.@netanyahu— Narendra Modi (@narendramodi) August 6, 2026ప్రాంతీయ భద్రతపై సౌదీ–ఫ్రాన్స్ చర్చలుతాజా పరిస్థితులు, ఎర్ర సముద్రంలో నౌకా రవాణా స్వేచ్ఛపై సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ చర్చించారు. హౌతీ దాడుల నేపథ్యంలో ప్రాంతీయ భద్రతపై ఇరువురు నేతలు దృష్టి సారించారు.చమురు ధరలు మళ్లీ పైకిపశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 82 డాలర్లకు పైగా చేరింది. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ధర కూడా 77 డాలర్లకు ఎగబాకింది. హర్ముజ్ జలసంధిలో అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలపై ఆంక్షలు విధించేలా ఇరాన్ పార్లమెంట్లో ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. నిబంధనలు ఉల్లంఘించే నౌకలకు భారీ జరిమానాలు విధించే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది.ఇరాన్ తీవ్ర ఆరోపణలు.. గ్యాస్ నష్టంపై వ్యాఖ్యలుఅమెరికా గరిష్ఠ ఆర్థిక ఒత్తిడి విధానాన్ని కొనసాగిస్తోందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఆరోపించారు. అమెరికా–ఇజ్రాయెల్ దాడుల కారణంగా రోజుకు దాదాపు 230 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ నష్టపోతున్నామని పేర్కొన్నారు.కొనసాగుతున్న ఉద్రిక్తతలుఇరాన్–అమెరికా యుద్ధ వాతావరణం కొనసాగుతుండగా, ప్రాంతంలోని ఇతర దేశాల్లోనూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. యెమెన్‌లో హౌతీ దాడుల్లో కనీసం 18 మంది సైనికులు మరణించినట్లు సమాచారం. డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో దాడులు జరిగినట్లు హౌతీ వర్గాలు ప్రకటించాయి. లెబనాన్–ఇజ్రాయెల్ మధ్య రోమ్‌లో జరిగిన చర్చలు ముగిశాయి. చర్చలు ఫలప్రదంగా సాగాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడులు నిర్వహించింది. కాల్పుల విరమణ చర్చలు పక్కకు జరిగిన సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం.గాజాలో పిల్లల మరణాలపై యూనిసెఫ్ ఆందోళనగాజాలో పరిస్థితిపై యూనిసెఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 2025 అక్టోబర్ కాల్పుల విరమణ తర్వాతి 300 రోజుల్లో కనీసం 300 మంది పిల్లలు మరణించినట్లు తెలిపింది. రోజుకు సగటున ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.ఇరాన్‌పై యుద్ధం ముగింపుకు చేరుకుంటోందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, హర్ముజ్ ఒప్పంద ప్రయత్నాలు, చమురు ధరల పెరుగుదల.. పశ్చిమాసియా సంక్షోభం కీలక మలుపులోకి ప్రవేశించిన సంకేతాలుగా కనిపిస్తున్నాయి. -
ఇరాన్‌పై ట్రంప్ ‘టూ ఆప్షన్స్’ బాంబ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చర్చల విషయంలో ఇరాన్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరాన్ ముందు ఇప్పుడు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయని.. వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవడం తప్ప మరో మార్గం లేదని అల్టిమేటం జారీ చేశారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ బహిరంగంగా అమెరికాతో చర్చలు జరగడం లేదని చెబుతున్నప్పటికీ, సమస్య పరిష్కారం కోసం చర్చలకు ప్రయత్నించిందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఇరాన్ సృష్టించిన సమస్యకు పరిష్కారం కోసం తాము చర్చలు జరుపుతున్నామని అన్నారు.“ఒకటి ఒప్పందం చేసుకోవడం.. లేదంటే పూర్తిగా లొంగిపోవడం” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.హర్ముజ్ జలసంధిపై ట్రంప్ హెచ్చరికప్రపంచంలోని అత్యంత కీలకమైన వాణిజ్య మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధి అంశంపైనా ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతంపై అమెరికా నౌకాదళానికి పూర్తి నియంత్రణ ఉందని, తమ అనుమతి లేకుండా ఇరాన్‌కు ఎలాంటి రాకపోకలు జరగవని స్పష్టం చేశారు. “ఒప్పందం కుదిరే వరకు లేదా పూర్తిగా లొంగిపోయే వరకు ఎలాంటి మార్పు ఉండదు” అనే రీతిలో ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి.దాడి నుంచి చర్చల వైపు ట్రంప్ అడుగుఇరాన్పై రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద దాడి చేస్తామని మొన్న హెచ్చరించిన ట్రంప్.. నిన్న ఆ సైనిక చర్యను తాత్కాలికంగా నిలిపివేశారు. గల్ఫ్ దేశాలు ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ నేతల సూచనలతో పాటు దౌత్య మార్గాలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు సోమవారం ప్రారంభమవుతాయని ట్రంప్ చెప్పినప్పటికీ.. వాటి వివరాలను వెల్లడించలేదు.ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ రియాక్షన్ ఇదేఅంతకు ముందు అమెరికా వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. ప్రస్తుతం వాషింగ్టన్‌తో ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ.. అమెరికాతో చర్చలు జరుగుతున్నాయన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ప్రస్తుతం తాము ఒమన్‌తో మాత్రమే సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. హర్ముజ్ జలసంధిలో తాత్కాలిక సురక్షిత రాకపోకల ఏర్పాటుకు సంబంధించిన చర్చలు మాత్రమే జరుగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇరాన్‌కు డీల్ లేదంటే పూర్తిగా లొంగిపోవడం అనే ఆప్షన్లు ఉంచారు. అయితే ట్రంప్ ఫ్రెష్వార్నింగ్పై ఇరాన్ స్పందన రావాల్సి ఉంది. మరోవైపు.. ఇరాన్ తన సార్వభౌమత్వంపై రాజీపడబోదనే సంకేతాలు ఇస్తోంది. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని చెబుతూనే, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా దౌత్య మార్గాలను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే క్షిపణి బెదిరింపులు, సైనిక కదలికలతో వేడెక్కిన పరిస్థితుల్లో.. ట్రంప్ తాజా అల్టిమేటం, ఇరాన్ తిరస్కరణతో తదుపరి పరిణామాలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. -
యుద్ధానికి బ్రేక్.. ఇరాన్ కీలక ప్రకటన
అమెరికా-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నడుమ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. క్షిపణులు, దాడుల హెచ్చరికలతో హోరెత్తిన వాతావరణం ఒక్కసారిగా చర్చల వైపు మళ్లింది. ఇరాన్‌పై భారీ సైనిక చర్యకు సిద్ధమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు దౌత్య మార్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని ప్రకటించిన ట్రంప్.. సోమవారం నుంచి చర్చలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. దీంతో పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ భయాలు కొంత తగ్గే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఇరాన్ కీలక మౌలిక వసతులపై భారీ దాడులకు అమెరికా ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ.. చివరి దశలో వాటిని నిలిపివేసినట్లు ట్రంప్ తెలిపారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఖతార్ వంటి గల్ఫ్ దేశాలు యుద్ధాన్ని విస్తరించకుండా దౌత్య పరిష్కారానికి అవకాశం ఇవ్వాలని కోరినట్లు ట్రంప్ చెప్పారు.ఇరాన్‌పై తాను చేపట్టబోయిన సైనిక చర్య సాధారణ దాడి కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆ దాడి జరిగి ఉంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద దాడుల్లో ఒకటిగా నిలిచేదని వ్యాఖ్యానించారు. “నేను ప్రజలను చంపాలని కోరుకోవడం లేదు. యుద్ధంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. ఒకవేళ దాడి జరిగి ఉంటే భారీ విధ్వంసం జరిగేది.. తిరిగి నిర్మించడానికి ఎన్నో సంవత్సరాలు పట్టేది” అని ట్రంప్ పేర్కొన్నారు.అందుకే యుద్ధం కంటే చర్చల ద్వారా పరిష్కారం సాధించడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌తో ఒప్పందం కుదిరితే ప్రాణనష్టం, విధ్వంసం రెండింటినీ నివారించవచ్చని తెలిపారు.“ఇరాన్‌తో ఒక ఒప్పందం దగ్గరలోనే ఉంది” అని ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. అయితే ఈ ఒప్పందంలో ఏ అంశాలపై రాజీ కుదరబోతోందన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.ఇరాన్ కీలక వ్యాఖ్యలుమరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ కూడా అమెరికాతో చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి అమెరికా కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. “అమెరికా తన హామీలను గౌరవించాలి.. పరస్పర నమ్మకంతో ముందుకు సాగాలి” అనే సంకేతాలను పెజెష్కియన్ ఇచ్చారు.జూన్‌లో కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందమే భవిష్యత్‌లో ఇరాన్ విదేశాంగ విధానానికి కీలక ఆధారంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఇరాన్ తన ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో వెనక్కి తగ్గబోదని కూడా ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.టెహ్రాన్‌కు దౌత్య బృందాలు!అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు మార్గం సుగమం చేసేందుకు మధ్యవర్తి దేశాలు రంగంలోకి దిగుతున్నాయి. గత 24 గంటల్లో చోటుచేసుకున్న పరిణామాల తర్వాత.. టెహ్రాన్‌లో పరోక్ష చర్చలకు వేదిక సిద్ధమవుతోందని సమాచారం. అమెరికా, ఇరాన్ మధ్య నేరుగా చర్చలు కాకుండా.. ఒమన్, ఖతార్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉంది.ఇప్పటికే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ.. సౌదీ అరేబియా, పాకిస్థాన్ తదితర దేశాలతో సంప్రదింపులు జరిపారు. ప్రాంతీయ దేశాల సహకారంతో యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించి, హార్ముజ్ జలసంధి విషయంలో ఒక అవగాహనకు రావడమే లక్ష్యంగా దౌత్య ప్రయత్నాలు సాగుతున్నాయి.హర్ముజ్ జలసంధిపై అసలు పోరుఅమెరికా-ఇరాన్ చర్చల్లో అత్యంత కీలక అంశంగా హర్ముజ్ జలసంధి మారింది. ప్రపంచ చమురు రవాణాలో ఈ మార్గానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచ మార్కెట్లకు వెళ్లే భారీ స్థాయి చమురు రవాణా ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. అందుకే ఏ చిన్న అంతరాయం ఏర్పడినా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ.. ఒమన్‌తో హార్ముజ్ నిర్వహణపై జరుగుతున్న చర్చలు చివరి దశకు చేరుకున్నాయని వెల్లడించారు. అయితే ఇవి అమెరికాతో నేరుగా జరుగుతున్న చర్చలు కావని ఇరాన్ స్పష్టం చేసింది. యుద్ధానికి ముందు ఉన్న పరిస్థితులకు హర్ముజ్‌ను పూర్తిగా తీసుకెళ్లడం సాధ్యం కాదని కూడా సంకేతాలు ఇచ్చింది.హర్ముజ్ కోసం తెర వెనుక డీల్!హర్ముజ్ జలసంధి విషయంలో కొత్త విధానం రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరు పర్యవేక్షిస్తారు? నౌకల రాకపోకలు ఎలా ఉంటాయి? భద్రతా ఏర్పాట్లు ఎలా ఉండాలి? వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల్లో ఒమన్ కీలక పాత్ర పోషిస్తోంది. గతంలోనూ అమెరికా-ఇరాన్ మధ్య రహస్య దౌత్య చర్చలకు ఒమన్ వేదికగా నిలిచింది.ఇరాన్ వ్యూహం.. చర్చలు కూడా, ఒత్తిడి కూడాఇరాన్ ఒకవైపు చర్చలకు సిద్ధమని చెబుతూనే.. మరోవైపు తన వ్యూహాత్మక బలాన్ని కొనసాగిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ.. సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తదితరులతో సంప్రదింపులు జరిపారు. ప్రాంతీయ భద్రత, స్థిరత్వంపై చర్చించినట్లు ఇరాన్ వెల్లడించింది. అయితే హార్ముజ్‌పై తన ప్రభావాన్ని మాత్రం కొనసాగించాలని భావిస్తున్నట్లు స్పష్టం చేసింది.అణు అంశమే అసలు పరీక్ష!అమెరికా-ఇరాన్ మధ్య జరిగే ఏ ఒప్పందానికైనా అణు కార్యక్రమం ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఇరాన్ అణు సామర్థ్యాలను పరిమితం చేయాలని అమెరికా కోరుతోంది. మరోవైపు తమపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఈ రెండు అంశాలపై రాజీ కుదిరితేనే చర్చలు విజయవంతమయ్యే అవకాశం ఉంది.ట్రంప్ ప్రకటనతో చమురు ధరలు దిగొచ్చాయియుద్ధ భయాల మధ్య పెరిగిన చమురు ధరలు ట్రంప్ తాజా ప్రకటనతో తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 4 డాలర్లకు పైగా పడిపోయింది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరట లభిస్తుందని మార్కెట్లు భావిస్తున్నాయి.ఎర్రసముద్రంలో ఉత్కంఠ!మరోవైపు సౌదీ అరేబియా నుంచి బయలుదేరిన రెండు చమురు నౌకలు బాబ్ అల్ మందెబ్ జలసంధిని దాటాయి. హౌతీల హెచ్చరికల మధ్య కూడా చమురు రవాణా కొనసాగుతుండటం గమనార్హం. అయితే భద్రతా కారణాలతో కొన్ని నౌకలు తమ ఆటోమేటిక్ ట్రాకింగ్ వ్యవస్థలను నిలిపివేసినట్లు సమాచారం.ఇజ్రాయెల్ చూపు చర్చలపైనేఅమెరికా-ఇరాన్ చర్చలను ఇజ్రాయెల్ కూడా నిశితంగా పరిశీలిస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమంపై ఎలాంటి రాజీ వచ్చినా అది తమ భద్రతకు ముప్పుగా భావించే ఇజ్రాయెల్.. గతంలో ఇరాన్‌పై కఠిన వైఖరి ప్రదర్శించింది. అందుకే ఈ చర్చలు కేవలం వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య వ్యవహారం కాకుండా మొత్తం పశ్చిమాసియా భవిష్యత్తును ప్రభావితం చేసే పరిణామంగా మారాయి.యుద్ధానికి ముగింపా? లేదంటే.. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు మార్గం సుగమమైనప్పటికీ.. పూర్తి ఒప్పందం ఇంకా దూరంలోనే ఉంది. హర్ముజ్ నియంత్రణ, అణు కార్యక్రమం, ఆంక్షల తొలగింపు, భద్రతా హామీలపై ఇరు దేశాల మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయి. యుద్ధం అంచుల నుంచి చర్చల బల్లపైకి వచ్చిన అమెరికా-ఇరాన్ సంబంధాలు.. నిజంగా శాంతి దిశగా అడుగులు వేస్తాయా? లేక ఇది కేవలం వ్యూహాత్మక విరామమేనా? అన్నది రాబోయే చర్చలే తేల్చనున్నాయి. -
అమెరికా ‘హెవీ వేవ్’ దాడులు.. విస్తరిస్తున్న యుద్ధం!
మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకుంటున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రాంతీయ యుద్ధం దిశగా సాగుతున్నాయి. ఇరాన్ నుంచి అమెరికా స్థావరాలపై జరిగిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా అమెరికా భారీ వైమానిక దాడులు చేపట్టింది. దక్షిణ ఇరాన్‌లోని కీలక ప్రాంతాలపై ‘హెవీ వేవ్’ పేరుతో దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ దాడులతో పాటు ఇరాక్‌లో ఇరాన్ అనుకూల మిలీషియాలపై అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త చర్యలు చేపట్టడం, యెమెన్‌లో హౌతీల కదలికలు, హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరగడం.. మొత్తం ప్రాంతాన్ని యుద్ధ వాతావరణంలోకి నెట్టాయి.ఇరాన్‌లోని రెవల్యూషనరీ గార్డ్ (IRGC)కు చెందిన స్థావరాలే లక్ష్యంగా తాజాగా అమెరికా దాడులు జరిపింది. సైనిక కమాండ్ కేంద్రాలు, మిసైల్, డ్రోన్ సదుపాయాలు, తీర రక్షణ వ్యవస్థలు, సముద్ర కార్యకలాపాలకు సంబంధించిన కేంద్రాలను టార్గెట్ చేసినట్లు అమెరికా వెల్లడించింది. అబాదాన్, బుషెహర్, కిష్, క్విష్మ్ దీవులు, ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. కిష్ దీవిలోని కజెరూన్ ప్రాంతంలోనూ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు సమాచారం.క్విష్మ్లో నివాస భవనంపై మిసైల్.. రెస్క్యూ కొనసాగింపుఅమెరికా దాడుల్లో క్విష్మ్ దీవిలోని ఓ నివాస భవనం దెబ్బతింది. మిసైల్ దాడితో భవనం కూలిపోవడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి ఇద్దరు చిన్నారులను రక్షించి ఆస్పత్రికి తరలించాయి. మరో ముగ్గురి కోసం శిథిలాల తొలగింపు, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటన యుద్ధంలో పౌర ప్రాంతాలు కూడా ప్రభావితమవుతున్నాయన్న ఆందోళనలను పెంచింది.‘ఇప్పుడు మా వంతు’.. ట్రంప్ హెచ్చరికల తర్వాతే దాడులుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా బలగాలపై దాడులకు ప్రతిస్పందన తప్పదని స్పష్టం చేసిన ఆయన.. “ఇప్పుడు కొట్టే వంతు మాది” అనే సంకేతాలు ఇచ్చారు. ఇరాన్ నుంచి దాడులను ఆపాలని కోరినా అమెరికా చర్యలు తప్పవని ట్రంప్ వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే వైమానిక దాడులు ప్రారంభమయ్యాయి.జోర్డాన్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులుఇటీవల జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసినట్లు అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతీకారంగానే తాజా ఆపరేషన్ చేపట్టినట్లు వాషింగ్టన్ వెల్లడించింది. మరోవైపు ఇరాన్ మాత్రం తమ చర్యలను అమెరికా బెదిరింపులకు ప్రతిస్పందనగా సమర్థించుకుంది. అమెరికా ఒత్తిడి కొనసాగితే ప్రతిఘటన కూడా కొనసాగుతుందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ హెచ్చరించింది.ఇరాక్‌లో అమెరికా–సౌదీ దాడులు.. తీవ్ర ఉద్రిక్తతయుద్ధ ప్రభావం ఇరాక్‌కు కూడా చేరింది. ఇరాన్‌కు అనుబంధంగా ఉన్న మిలీషియా గ్రూపుల స్థావరాలపై అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త దాడులు జరిపాయి. ఈ దాడుల్లో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ (PMF)కు చెందిన పలువురు సభ్యులు మరణించినట్లు సమాచారం. కనీసం 20 మంది మృతి చెందినట్లు ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఇరాక్ ప్రభుత్వం ఈ చర్యలను తీవ్రంగా ఖండించింది. తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించారని, అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించింది.రంగంలోకి హౌతీలు.. యెమెన్ నుంచి మరో ముప్పుఇరాన్కు మద్దతుగా వ్యవహరిస్తున్న యెమెన్‌లోని హౌతీ గ్రూపు కూడా ఈ ఘర్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. సౌదీ అరేబియా చమురు రవాణా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని హౌతీలు దాడులు చేసినట్లు సమాచారం. దీనికి ప్రతిగా హోడెయిడా ప్రావిన్స్‌లోని హౌతీ స్థావరాలపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో యుద్ధ ప్రభావం గల్ఫ్ ప్రాంతం దాటి యెమెన్ వరకు విస్తరించింది.హర్ముజ్ జలసంధిలో పెరుగుతున్న టెన్షన్ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మరోసారి యుద్ధ కేంద్రంగా మారింది. ఈ మార్గంలో ప్రయాణించే నౌకలపై ఇరాన్ ఆంక్షలు విధించడం, అనుమతి లేని మార్గాల్లో వెళ్లే ట్యాంకర్లను అడ్డుకుంటామని హెచ్చరించడం ఉద్రిక్తతలకు కారణమైంది. ఇరాన్ నౌకాదళం మూడు చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. మరోవైపు అమెరికా మాత్రం అంతర్జాతీయ నౌకాయానానికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. హర్ముజ్‌లో అమెరికా ఆంక్షలను దిక్కరించిన లావిన్ ట్యాంకర్‌పై దాడి జరిగింది. ఇంజిన్ రూమ్‌పై కాల్పులు జరపడంతో నౌక దెబ్బతింది. ఈజిప్ట్ పోర్టులో డ్రోన్ దాడి కలకలం?యుద్ధం కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోందన్న సంకేతంగా ఈజిప్ట్‌లోని డమియెట్టా పోర్టులో అమెరికాకు చెందిన ఎల్ఎన్జీ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి ఘటన కలకలం రేపింది. దాడి తర్వాత నౌకలో మంటలు చెలరేగాయి. మంటలు మరో నౌకకు కూడా వ్యాపించాయి. అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇది ఇరాన్ జరిపిన డ్రోన్ దాడియేనా?.. లేదంటే అగ్నిప్రమాదమా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. చమురు ధరలకు యుద్ధ సెగమిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్లపై పడుతోంది. యుద్ధ భయాలతో క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఏకంగా సెంచరీ దాటేశాయి. ఇరాన్ చమురు స్థావరాలు, హర్ముజ్ జలసంధి భద్రతపై అనిశ్చితి కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రాంతీయ యుద్ధంగా మారుతున్న ఘర్షణఅమెరికా–ఇరాన్ మధ్య మొదలైన పోరు ఇప్పుడు ఇరాక్, యెమెన్, సౌదీ అరేబియా, సముద్ర మార్గాల వరకు విస్తరించింది. ఒకవైపు ప్రతీకార దాడులు.. మరోవైపు చమురు మార్గాలపై ముప్పు.. ఇంకోవైపు మిత్ర దేశాల జోక్యం.. ఇవన్నీ కలిసి మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చుతున్నాయి. -
మళ్లీ భీకర యుద్ధం.. ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరుకున్నాయి. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులకు ప్రతీకారంగా అమెరికా బుధవారం రాత్రి ఇరాన్‌పై భారీ వైమానిక దాడులు ప్రారంభించింది. ఇరాన్ భూభాగంపై దాదాపు వారం రోజుల తర్వాత అమెరికా చేపట్టిన తొలి ప్రత్యక్ష దాడులు ఇవే.అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఈ దాడులను ధ్రువీకరించింది. ఇరాన్ నుంచి అమెరికా బలగాలపై జరిగిన దాడులకు ఇది “శక్తివంతమైన ప్రతిస్పందన” అని పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు దాడులు ప్రారంభమైనట్లు తెలిపింది.U.S. forces began launching strikes against Iran at 8 p.m. ET today. The strikes are a powerful response to yesterday's attempted Iranian attacks on U.S. forces based in the Middle East.— U.S. Central Command (@CENTCOM) July 30, 2026ట్రంప్ హెచ్చరికల తర్వాతే..ఇరాన్‌పై దాడులకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడి చేసిన నేపథ్యంలో.. ‘‘ఇరాన్‌కు గట్టి సమాధానం ఇస్తాం.. చాలా బలంగా ఎదురుదాడి చేస్తాం’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘వాళ్లు దాడి చేశారు.. ఇప్పుడు మా వంతు వచ్చింది’’ అంటూ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ చర్యలకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.🚨 BREAKING: President Trump is warning adversaries that a forceful U.S. response is coming after a drone attack on an LNG tanker off the coast of Egypt."We're going to hit them very hard."Trump confirmed five rockets were fired and signaled that retaliation is imminent,…— Stephen Gardner (@StephenGardnerX) July 29, 2026దక్షిణ ఇరాన్లో పేలుళ్ల శబ్దాలుఅమెరికా దాడుల తర్వాత దక్షిణ ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. అయితే అమెరికా దాడుల లక్ష్యాలు, నష్టం వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడికాలేదు.ప్రతిఘటన ఉంటుంది: ఇరాన్అమెరికా బెదిరింపులు కొనసాగినంత కాలం తమ ప్రతిఘటన కొనసాగుతుందని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. అమెరికా బలగాలపై తాము చేపట్టిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించింది.ఇరాన్ నావికా దళాలు హార్ముజ్ జలసంధి వైపు వెళ్తున్న మూడు చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు కూడా సమాచారం వెలువడింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన ఈ మార్గంపై ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయంగా ఆందోళనకు కారణమవుతోంది.ఇరాక్‌లోనూ ఉద్రిక్తతలు..ఇరాక్‌లో అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త దాడులపై అక్కడి ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ దాడుల్లో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్‌కు చెందిన 20 మంది మరణించగా.. మరో 32 మంది గాయపడినట్లు సమాచారం. ఈ పరిణామాలు ఇరాక్‌ను కూడా ప్రాంతీయ ఘర్షణలోకి లాగుతున్నాయని అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.చర్చల నుంచి యుద్ధం వైపు?..కొద్ది రోజుల క్రితం ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని ట్రంప్ చెప్పినప్పటికీ.. తాజా పరిణామాలతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇరాన్ తీవ్ర చర్యలకు దిగితే యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించాల్సి వస్తుందని ట్రంప్ గతంలో హెచ్చరించారు.అమెరికా తాజా దాడులతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ ప్రతిస్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి పరిణామాలు ప్రపంచ చమురు మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. -
రెచ్చిపోయిన ఇరాన్.. ట్రంప్ రియాక్షన్‌పై టెన్షన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతున్నాయన్న సమయంలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇస్తున్న వేళ.. ఇరాన్ మరోసారి తన సైనిక శక్తిని ప్రదర్శించింది. అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. మంగళవారం సాయంత్రం ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నుంచి పలు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు CENTCOM తెలిపింది. జోర్డాన్‌లో ఉన్న అమెరికా బలగాల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. అయితే వాటన్నింటినీ విజయవంతంగా అడ్డుకున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది.‘‘ఇది ఆకస్మిక దాడికి చేసిన ప్రయత్నం. ప్రయోగించిన అన్ని క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నాం’’ అని అమెరికా కమాండ్ వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా సమాచారం లేదని తెలిపింది.ట్రంప్ చర్చల మాటలు.. ఇరాన్ క్షిపణుల బదులుఇటీవల ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలకు తాత్కాలిక విరామం ప్రకటించిన ట్రంప్.. చర్చలకు అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో మంచి చర్చలు జరుగుతున్నాయని, ఒప్పందం కుదిరే అవకాశం ఉందని కూడా చెప్పారు. అయితే చర్చలు విఫలమైతే మళ్లీ సైనిక చర్యలు ప్రారంభిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిణామాల మధ్యే ఇరాన్ క్షిపణి దాడి జరగడం అంతర్జాతీయంగా ఆసక్తిని రేపుతోంది.ట్రంప్‌కు ఇరాన్ హెచ్చరిక సంకేతమా?ఇరాన్ తాజా చర్యను అమెరికాకు ఒక బలమైన సందేశంగా విశ్లేషకులు చూస్తున్నారు. తమను పక్కన పెట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అంగీకరించబోమని చెప్పే ప్రయత్నంగానే ఈ దాడిని భావిస్తున్నారు. ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన ఘర్షణల్లో భాగంగా అమెరికా బలగాలు ఇరాన్‌కు చెందిన పలు లక్ష్యాలపై దాడులు చేశాయి. ఆ తర్వాత ట్రంప్ దౌత్యానికి అవకాశం కల్పిస్తూ సైనిక చర్యలను నిలిపివేశారు.మళ్లీ మొదలైన యుద్ధం?తాజా క్షిపణి దాడి నేపథ్యంలో అమెరికా తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ ఇప్పటికే ఇరాన్‌పై కఠిన వైఖరి ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఇప్పుడు జరిగిన దాడికి అమెరికా ఎలా స్పందిస్తుందన్నది కీలకంగా మారింది. మరోవైపు మధ్యప్రాచ్యంలో అమెరికా నౌకాదళం, సైనిక బలగాల మోహరింపు కొనసాగుతోంది. ఇరాన్-అమెరికా మధ్య మరోసారి ప్రత్యక్ష ఘర్షణకు దారితీస్తుందా? లేదంటే దౌత్య మార్గంలోనే పరిష్కారం దొరుకుతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది.హౌతీల దాడులతో మరింత టెన్షన్ఇదే సమయంలో యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో సౌదీ చమురు నౌకను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించినట్లు ప్రకటించారు. మరోవైపు సౌదీ అరేబియా, అమెరికా కలిసి ఇరాక్‌లోని ఇరాన్ అనుకూల మిలీషియా స్థావరాలపై దాడులు చేసినట్లు CENTCOM తెలిపింది. ఈ పరిణామాలన్నీ కలిసి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.ఇక ట్రంప్ నిర్ణయం ఏంటి?ఇరాన్ క్షిపణి దాడికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. చర్చలకు అవకాశం ఇస్తూనే.. సైనికంగా కఠిన చర్యలకు వెనుకాడబోమన్న ట్రంప్ వైఖరి నేపథ్యంలో తదుపరి పరిణామాలు కీలకం కానున్నాయి. -
ట్రంప్ శాంతి మంత్రం.. ఇరాన్ షాక్!
అమెరికా–ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కాస్త చల్లబడుతున్న వేళ.. శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష దాడులు మూడు రోజులుగా నిలిచిపోవడంతో చర్చలకు అవకాశం ఏర్పడిందని చెప్పారు. అయితే దౌత్య ప్రయత్నాలు విఫలమైతే తిరిగి సైనిక చర్యలకు దిగుతామని హెచ్చరించారు.‘‘ఇరాన్‌తో మంచి చర్చలు జరుగుతున్నాయి. ఏదో ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది’’ అని ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. అయితే చర్చలు ఫలించకపోతే గతంలో చేపట్టిన చర్యలను తిరిగి కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దౌత్య మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తే అది అందరికీ మంచిదేనని పేర్కొన్న ఆయన.. అమెరికా ప్రయోజనాలు, భద్రత విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదని సంకేతాలు ఇచ్చారు. ఇరాన్‌తో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, అవసరమైతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని ట్రంప్ తెలిపారు.ప్రత్యక్ష చర్చలు లేవంటున్న ఇరాన్అమెరికాతో నేరుగా ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. మధ్యవర్తుల ద్వారా అమెరికా నుంచి కొన్ని సందేశాలు అందుతున్నాయని, కానీ ప్రస్తుతం అధికారిక చర్చలు మాత్రం లేవని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు. ఇటీవలి కాలంలో అమెరికా దాడులతో ఇరాన్‌లోని పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయని, ప్రతిగా ఇరాన్ కూడా అమెరికా అనుబంధ లక్ష్యాలపై దాడులు చేసిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఎంతకాలం కొనసాగుతుందన్నది ఆసక్తిగా మారింది.‘అమెరికా ఆయుధ నిల్వలు తగ్గలేదు’.. ట్రంప్ఇరాన్పై దీర్ఘకాలిక సైనిక చర్యలకు అమెరికా వద్ద క్షిపణులు, ఆయుధ నిల్వలు సరిపోవడం లేదన్న వార్తలను ట్రంప్ ఖండించారు. అమెరికా వద్ద భారీగా ఆయుధ నిల్వలు ఉన్నాయని, అవసరానికి మించి ఉన్నాయని పేర్కొన్నారు. అయితే గత బైడెన్ ప్రభుత్వ హయాంలో ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధాలు పంపడం వల్ల నిల్వలపై ఒత్తిడి ఏర్పడిందని ట్రంప్ ఆరోపించారు. ప్రస్తుతం అత్యాధునిక ఆయుధ వ్యవస్థల ఉత్పత్తిని వేగవంతం చేస్తున్నామని చెప్పారు.సౌదీ చమురు స్థావరాలపై డ్రోన్ దాడులుపశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గలేదు. సోమవారం సౌదీ అరేబియాలోని చమురు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు జరిగాయి. ఇరాన్ అనుకూల వర్గాలే ఈ దాడులకు కారణమని సౌదీ ఆరోపించింది. మరోవైపు యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు కూడా సౌదీ చమురు మౌలిక వసతులపై దాడులు చేసినట్లు ప్రకటించారు. అయితే దీనిపై సౌదీ నుంచి అధికారిక స్పందన రాలేదు.హర్ముజ్ జలసంధిపైనే అసలు పంచాయితీప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి ఇప్పుడు ప్రధాన వివాదంగా మారింది. ఈ మార్గంపై నియంత్రణ తమదేనని ఇరాన్ చెబుతుండగా.. నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని అమెరికా పట్టుబడుతోంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇటీవల ఈ మార్గంలో ప్రయాణిస్తున్న కొన్ని నౌకలను అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో ప్రపంచ చమురు మార్కెట్లు ఆందోళనకు గురయ్యాయి. అయితే తాజా కాల్పుల విరమణ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో కొంత ఉపశమనం కనిపించింది.చర్చలా? దాడులా? ఉత్కంఠ కొనసాగింపుఅమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలపై ఆశలు కనిపిస్తున్నప్పటికీ.. ఇరు దేశాల ప్రకటనల్లో భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు చర్చలకు సిద్ధమంటూ సంకేతాలు ఇస్తూనే.. మరోవైపు సైనిక చర్యలకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరికలు రావడం మిడిల్ఈస్ట్ సంక్షోభాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తోంది.ట్రంప్ మాటల్లో శాంతి సంకేతాలు కనిపిస్తున్నా.. హర్ముజ్ జలసంధి, ఆయుధ నిల్వలు, ప్రాంతీయ దాడులు ఈ ఒప్పందానికి అసలు పరీక్షగా మారనున్నాయి. -
ఇజ్రాయెల్‌కు సవాల్.. హెజ్బొల్లాకు ఖమేనీ భరోసా
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సంచలన ప్రకటన విడుదల చేశారు. మరోసారి షియా సాయుధ సంస్థ హెజ్బొల్లాకు బహిరంగంగా అండగా నిలిచారు. ఇజ్రాయెల్, అమెరికా ఒత్తిళ్లు ఎంత పెరిగినా ప్రతిఘటన ఉద్యమం ఆగదని స్పష్టం చేస్తూ.. హెజ్బొల్లాను ఉద్దేశించి ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హెజ్బొల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నయీమ్ ఖాసెమ్‌కు పంపిన సందేశంలో "జిహాద్, ప్రతిఘటనే ముందుకు సాగే ఏకైక మార్గం" అని పేర్కొన్నారు. తన సందేశంలో ఖమేనీ, హెజ్బొల్లా ప్రస్తుతం "ప్రతిఘటన చరిత్రలో కీలక దశ"లో ఉందని పేర్కొన్నారు. యుద్ధాలు, ఆంక్షలు, నాయకత్వ మార్పులు వచ్చినా ప్రతిఘటన ఆగదని, పోరాట స్ఫూర్తే తమ బలమని చెప్పారు. హెజ్బొల్లా యోధులు లెబనాన్ ప్రజల హక్కులు, గౌరవాన్ని కాపాడేందుకు పోరాడుతున్నారని ప్రశంసించారు.ఇటీవలి నెలల్లో ఇజ్రాయెల్-హెజ్బొల్లా ఘర్షణలు, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, అనంతరం కాల్పుల విరమణతో మధ్యప్రాచ్య పరిస్థితులు కొంత మారాయి. ఇదే సమయంలో లెబనాన్‌లో హెజ్బొల్లా వద్ద ఉన్న ఆయుధాలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ పరిణామాల మధ్య ఖమేనీ చేసిన తాజా వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇరాన్‌కు హెజ్బొల్లా కేవలం మిత్ర సంస్థ మాత్రమే కాదు. ఇజ్రాయెల్, అమెరికా ప్రభావాన్ని ఎదుర్కొనే ప్రాంతీయ "యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్"లో అది కీలక భాగంగా టెహ్రాన్ భావిస్తోంది. అందుకే హెజ్బొల్లాకు రాజకీయ, వ్యూహాత్మక మద్దతు కొనసాగుతుందని ఖమేనీ తాజా ప్రకటన ద్వారా మరోసారి స్పష్టం చేశారు. లెబనాన్‌లో ఇరాన్ ప్రభావం తగ్గలేదనే సంకేతాన్ని కూడా ఈ సందేశం ఇస్తోందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం హెజ్బొల్లాను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్నాయి. ఆ సంస్థ సైనిక సామర్థ్యాన్ని బలహీనపర్చేందుకు లెబనాన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. దేశంలోని అన్ని ఆయుధ బలగాలు ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలని లెబనాన్ ప్రభుత్వం కూడా చెబుతోంది. అయితే ఇజ్రాయెల్ నుంచి ముప్పు ఉన్నంత వరకు ఆయుధాలను వదిలే ప్రసక్తే లేదని హెజ్బొల్లా స్పష్టం చేస్తోంది.ఇటీవల ఇరాన్-అమెరికా మధ్య జరిగిన సైనిక ఉద్రిక్తతల తర్వాత టెహ్రాన్ వైఖరిలో మార్పు వస్తుందేమోనని అంతర్జాతీయ వర్గాలు భావించాయి. అయితే ఖమేనీ తాజా ప్రకటనతో అలాంటి సంకేతాలు కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌పై కఠిన వైఖరిని కొనసాగిస్తూనే, తమ మిత్ర బలగాలకు మద్దతు తగ్గబోదని ఇరాన్ మరోసారి స్పష్టం చేసినట్లయింది.ఖమేనీ వ్యాఖ్యలతో మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులపై మరోసారి చర్చ మొదలైంది. ఒకవైపు శాంతి చర్చలు, కాల్పుల విరమణ ప్రయత్నాలు కొనసాగుతుండగా, మరోవైపు "జిహాద్, ప్రతిఘటనే ముందుకు సాగే మార్గం" అనే సందేశం వెలువడటం ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇజ్రాయెల్-హెజ్బొల్లా ఉద్రిక్తతలు, ఇరాన్ పాత్రపై ప్రపంచ దృష్టి మరోసారి మధ్యప్రాచ్యంపైనే కేంద్రీకృతమైంది. -
డబుల్ గేమ్ మొదలుపెట్టిన ట్రంప్
ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని చెబుతూనే.. అవసరమైతే భారీ సైనిక చర్యకు వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ ఇప్పుడు చర్చల్లో మరింత సీరియస్‌గా వ్యవహరిస్తోందని చెప్పిన ఆయన.. ఒప్పందం కుదరకపోతే గతం కంటే తీవ్ర స్థాయి దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్‌పై భారీ దాడులకు సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అయితే అమెరికా సైన్యం మాత్రం పూర్తిగా సిద్ధంగా ఉందని, ‘‘మేం సిద్ధంగా ఉన్నాం.. అవసరమైతే ముందుకు వెళ్తాం’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘డీల్ లేదంటే భారీ దాడులు’ఇరాన్‌కు ఇప్పుడు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాతో ఒక ఒప్పందానికి రావడం లేదా మరింత తీవ్ర స్థాయి సైనిక చర్యలను ఎదుర్కోవడం అని హెచ్చరించారు. ‘‘మేము వారితో మాట్లాడుతున్నాం. గతంతో పోలిస్తే ఇరాన్ ఇప్పుడు మరింత సీరియస్‌గా కనిపిస్తోంది. అయితే చర్చలు ఫలిస్తాయని ఇప్పుడే చెప్పలేం’’ అని ట్రంప్ అన్నారు.‘లాక్డ్ అండ్ లోడెడ్’అమెరికా సైనిక సామర్థ్యంపై ట్రంప్ మరోసారి స్పష్టత ఇచ్చారు. అవసరమైతే ఇరాన్‌పై మరింత భారీ దాడులకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దౌత్య మార్గానికి అవకాశం ఇస్తున్నప్పటికీ.. సైనిక ఎంపికను పూర్తిగా పక్కన పెట్టలేదని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమమే ఈ వివాదానికి ప్రధాన కారణమని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.ఇరాన్ మాత్రం..మరోవైపు అమెరికా ఒత్తిళ్లకు తాము తలొగ్గబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తెలిపారు. బెదిరింపులు, ఒత్తిళ్లతో ఇరాన్‌ను నియంత్రించలేరని స్పష్టం చేశారు. చర్చలకు తాము సిద్ధమే అయినప్పటికీ.. బలవంతపు షరతులను అంగీకరించబోమని పేర్కొన్నారు. మరోవైపు మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వారాలుగా అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణలు, సైనిక చర్యల నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్ముజ్ జలసంధిపై ప్రభావం పడుతోంది. గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో వాణిజ్య నౌకల రాకపోకలు, సముద్ర రవాణాపై అనిశ్చితి నెలకొంది.ఈ పరిణామాల నేపథ్యంలో హర్ముజ్ ప్రాంతంలో వేలాది మంది నౌకా సిబ్బంది భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వందలాది నౌకలు ఆగిపోయాయని.. దాదాపు 6 వేల మంది నౌకా సిబ్బంది ఈ ప్రాంతంలోని ఉద్రిక్త పరిస్థితుల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ సముద్ర సంస్థ (IMO) పేర్కొంది. నౌకల రాకపోకలకు అంతరాయాలు, భద్రతా పరమైన సవాళ్ల కారణంగా సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది.రష్యా, చైనాపైనా ట్రంప్ దృష్టిఇరాన్కు రష్యా, చైనా ఆయుధ సహాయం అందిస్తున్నాయన్న వార్తలపైనా ట్రంప్ స్పందించారు. ఆ దేశాల అధినేతలు ఇరాన్‌కు ఆయుధాలు అందించబోమని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఇరాన్ విషయంలో అమెరికా తదుపరి నిర్ణయం ఏంటన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతోంది. ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధిలో ఏదైనా పెద్ద పరిణామం చోటుచేసుకుంటే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు సఫలం అవుతాయా? లేక పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారతాయా? అన్నది ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. -
ఇది చాల్లేదు.. ఇరాన్‌కు ఇంకా నొప్పి తెలియట్లేదు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఇరాన్ మౌలిక వసతులపై అమెరికా బలగాలు దాడులు కొనసాగిస్తుండగా.. ప్రతిగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ కౌంటర్ అటాక్‌లు జరుపుతోంది. మరోవైపు ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు కూడా రంగంలోకి దిగడంతో ఈ ఘర్షణ మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై మరింత కఠిన చర్యలకు దిగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇరాన్‌పై భారీ స్థాయి సైనిక చర్యను పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇప్పటికే జరుగుతున్న దాడులు సరిపోలేదని భావిస్తున్న ఆయన.. “ఇరాన్‌కు ఇంకా తగినంత నొప్పి తెలియలేదు” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆక్సియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌పై గతంలో కంటే పెద్ద స్థాయిలో దాడి చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. “నేను భారీ దాడి గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పటివరకు జరిగిన వాటికంటే పెద్దదిగా ఉంటుంది. నిర్ణయం తీసుకునే దశకు చేరుకున్నాను” అని పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది. అయితే కొత్త దాడికి సంబంధించి అధ్యక్షుడు తుది నిర్ణయం తీసుకోలేదని అమెరికా అధికారులు వెల్లడించారు. ఎలాంటి కొత్త సైనిక ఆదేశాలు కూడా జారీ కాలేదని తెలిపారు.చర్చలకు ఇరాన్ సిద్ధంగా లేదు: ట్రంప్ఇరాన్ చర్చలకు ఆసక్తి చూపుతున్నప్పటికీ.. ఒప్పందానికి రావడానికి సిద్ధంగా లేదని ట్రంప్ ఆరోపించారు. “వారికి ఇంకా తగినంత నొప్పి తెలియలేదు” అని వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై ఒత్తిడి కొనసాగాల్సిన అవసరం ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు.13వ రోజూ అమెరికా దాడులుమరోవైపు ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం.. వరుసగా 13వ రాత్రి కూడా ఇరాన్ సైనిక లక్ష్యాలపై దాడులు జరిగాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సామర్థ్యాన్ని తగ్గించడం, వాణిజ్య నౌకలపై ముప్పును అడ్డుకోవడమే తమ లక్ష్యమని అమెరికా చెబుతోంది.ఇజ్రాయెల్ మద్దతుపై ట్రంప్ వ్యాఖ్యలుఇటు.. ఇరాన్‌పై కొత్త ఆపరేషన్ జరిగితే ఇజ్రాయెల్ వెంటనే అమెరికాతో కలిసి వస్తుందని ట్రంప్ అన్నారు. “నేను అడిగితే ఇజ్రాయెల్ రెండు నిమిషాల్లో చేరుతుంది” అని వ్యాఖ్యానించారు. అయితే అమెరికా చర్యలకు ఇజ్రాయెల్ సహకారం తప్పనిసరి కాదని స్పష్టం చేశారు.హర్ముజ్ జలసంధిపై ఉత్కంఠఅమెరికా–ఇరాన్ ఘర్షణ ప్రభావం ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధిపై పడుతోంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళనలు నెలకొన్నాయి. ఇరాన్ కూడా తనపై దాడులు కొనసాగితే ప్రాంతీయ చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలపై ప్రతీకారం ఉంటుందని హెచ్చరించింది.యుద్ధం విస్తరిస్తుందా?ఇరాన్‌కు మద్దతుగా ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో సౌదీ నౌకలపై దాడులు చేసినట్లు ప్రకటించారు. దీంతో మధ్యప్రాచ్య సంక్షోభం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
గల్ఫ్‌లో డ్రోన్ వార్.. ఆ ‘అదృశ్య శక్తి’ ఎవరు?.. అమెరికా ఆరా
గల్ఫ్ ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడులు ఇప్పుడు మరో అంతర్జాతీయ రహస్యానికి తెరతీశాయి. అమెరికా కీలక నిఘా సంస్థ సీఐఏకు చెందిన రహస్య స్థావరాలపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేయడం కలకలం రేపింది. అయితే ఈ దాడుల వెనుక ఇరాన్ సొంత సామర్థ్యమే ఉందా? లేక మరేదైనా శక్తి సాంకేతికంగా సహకరించిందా? అన్న కోణంలో అమెరికా నిఘా వర్గాలు దర్యాప్తు ప్రారంభించాయి.ముఖ్యంగా ఇరాన్ ఉపయోగించిన డ్రోన్ల కచ్చితత్వం, లక్ష్యాలను చేరుకున్న విధానం అమెరికా అధికారుల్లో అనుమానాలు పెంచుతోంది. ఇంత అధునాతన సామర్థ్యం కలిగిన డ్రోన్లు ఎలా సిద్ధమయ్యాయన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.CIA స్థావరాలే లక్ష్యంగా?రాయిటర్స్ కథనం ప్రకారం.. మార్చిలో గల్ఫ్ ప్రాంతంలోని కొన్ని సీఐఏ అనుబంధ కేంద్రాలపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది. సౌదీ అరేబియాలోని రియాద్ అమెరికా రాయబార కార్యాలయంలోని సీఐఏ కేంద్రం, ఇరాక్‌లోని మరో సీఐఏ అనుబంధ ప్రాంతం కూడా లక్ష్యంగా మారినట్లు సమాచారం. మరిన్ని రహస్య స్థావరాలు కూడా దాడుల పరిధిలోకి వచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ దాడులకు ఇరాన్‌కు చెందిన ‘షహీద్’ డ్రోన్లను ఉపయోగించినట్లు పాశ్చాత్య నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.టెక్నాలజీ ఆ దేశానిదేనా?అమెరికా దర్యాప్తులో ఇప్పుడు కీలకంగా మారిన అంశం.. ఇరాన్ డ్రోన్ల సామర్థ్యాన్ని పెంచడంలో రష్యా పాత్ర ఉందా అన్నది. ముఖ్యంగా రష్యాకు చెందిన ‘కొమెటా-ఎం’ శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థను ఇరాన్ డ్రోన్లలో ఉపయోగించారా అనే కోణంలో పరిశీలన సాగుతోంది. ఈ సాంకేతికత వల్ల డ్రోన్లు మరింత కచ్చితంగా లక్ష్యాలను చేరుకోవడంతో పాటు, వాటిని ఎలక్ట్రానిక్ జామింగ్‌తో అడ్డుకోవడం కూడా కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు.దాడుల వెనుక నిఘా సమాచారమా?ఇరాన్‌కు రష్యా కేవలం సాంకేతిక సాయం మాత్రమే అందించిందా? లేక లక్ష్యాల వివరాలు, నిఘా సమాచారం కూడా ఇచ్చిందా? అనే అంశాన్ని అమెరికా పరిశీలిస్తోంది. అయితే ఇక్కడ మరో కోణం కూడా ఉంది. ఇరాన్ అసలు లక్ష్యం అమెరికా రాయబార కార్యాలయాలు కావొచ్చని, సీఐఏ కేంద్రాలు అనుకోకుండా దెబ్బతిని ఉండొచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై తుది నిర్ధారణకు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.రష్యా–ఇరాన్ బంధంపై కొత్త చర్చఇప్పటికే రష్యా, ఇరాన్ మధ్య సైనిక సహకారం కొనసాగుతోంది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ డ్రోన్ల వినియోగంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న వేళ.. గల్ఫ్‌లో అమెరికా లక్ష్యాలపై జరిగిన దాడుల్లో రష్యా పాత్ర ఉందా అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అమెరికా, రష్యా ప్రభుత్వాలు అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.డ్రోన్లతో సాగుతున్న ఆధునిక యుద్ధంలో.. ఒక దేశం దాడి చేస్తే, దాని వెనుక సాంకేతిక బలం ఎవరిది? అనే ప్రశ్న ఇప్పుడు గల్ఫ్ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇరాన్ డ్రోన్ దాడుల వెనుక నిజంగా రష్యా హస్తం ఉందా? లేక ఇది కేవలం అనుమానమేనా? అమెరికా దర్యాప్తు తేల్చాల్సి ఉంది. -
ట్రంప్ నిర్ణయంతో మిడిల్ ఈస్ట్‌లో కొత్త టెన్షన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సౌదీ అరేబియాతో న్యూక్లియర్ డీల్‌కు ఆమోదం తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా సౌదీ తన భూభాగంలోనే యురేనియం శుద్ధి (ఎన్రిచ్మెంట్) చేపట్టే అవకాశం లభించనుంది. అయితే గతంలో అమెరికా కుదుర్చుకున్న అణు ఒప్పందాలతో పోలిస్తే.. సౌదీ డీల్‌లో కీలక భద్రతా నిబంధనలు లేకపోవడంపై అంతర్జాతీయంగా కలకలం రేగింది.ట్రంప్ ప్రభుత్వం ఆమోదించిన ఈ ఒప్పందం దాదాపు 30 ఏళ్ల పాటు కొనసాగనున్నట్లు సమాచారం. దీని విలువ పదుల బిలియన్ల డాలర్లుగా ఉండనుంది. ఈ ఒప్పందం అమలైతే సౌదీ అరేబియాలో పౌర అణు విద్యుత్ కార్యక్రమాల నిర్మాణంలో అమెరికా కంపెనీలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఇతర దేశాల కంపెనీలకు అవకాశాలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. అణు ఇంధన రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని పెంచే వ్యూహంలో భాగంగానే ఈ ఒప్పందాన్ని చూస్తున్నారు.సంప్రదాయ భద్రతా నిబంధనలు లేవా?అమెరికా గతంలో కుదుర్చుకున్న అణు ఒప్పందాల్లో.. అణు సాంకేతికత దుర్వినియోగం కాకుండా కఠినమైన నిబంధనలు ఉండేవి. కానీ సౌదీతో కుదుర్చుకున్న తాజా ఒప్పందంలో అలాంటి కొన్ని కీలక రక్షణ చర్యలు లేకపోవడం చర్చకు దారితీసింది. ముఖ్యంగా యురేనియం ఎన్రిచ్మెంట్ అనుమతి ఇవ్వడం భవిష్యత్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.వైట్‌హౌస్‌లో కీలక భేటీ తర్వాత నిర్ణయంఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం అణు ఒప్పందంపై ముందడుగు పడింది. ఈ ఒప్పందానికి సంబంధించిన ప్యాకేజీని త్వరలోనే అమెరికా కాంగ్రెస్ పరిశీలనకు పంపనున్నట్లు సమాచారం.‘123 అగ్రిమెంట్’లో భాగంగా..అమెరికా విదేశీ దేశాలతో అణు సహకారం కోసం రూపొందించే ప్రత్యేక ఒప్పందాన్ని సాధారణంగా ‘123 Agreement’ అని పిలుస్తారు. తాజా ఒప్పందంలో భాగంగా అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్, సౌదీ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్అజీజ్ బిన్ సల్మాన్ సంతకాలు చేసినట్లు సమాచారం.మిడిల్ ఈస్ట్‌లో కొత్త అణు సమీకరణాలు?చమురు సంపదతో ప్రపంచంలో కీలక శక్తిగా ఉన్న సౌదీ.. ఇప్పుడు అణు ఇంధన రంగంలో అడుగులు వేయడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా-సౌదీ అణు ఒప్పందం మిడిల్ ఈస్ట్ వ్యూహాత్మక సమీకరణాలను మార్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం నేపథ్యంలో ఈ ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది. -
యుద్ధంలో కీలక మలుపు.. ఇరాన్ సంచలన ప్రకటన
టెహ్రాన్: తమ దేశం.. అమెరికాతో పూర్తిస్థాయి యుద్ధంలో ఉందని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అన్నారు. యుద్ధ సమయంలో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడం ఎంతో కీలకమని ఆయన ఉద్ఘాటించారు. నేటి యుద్ధం కేవలం క్షిపణుల యుద్ధం మాత్రమే కాదు. మిలిటరీ దాడులతో ఇరాన్ జాతీయులను లొంగదీసుకోలేమని శత్రువు గ్రహించాడంటూ టెహ్రాన్‌లోని హై కౌన్సిల్ ఆఫ్ ది జుడీషియరీ సమావేశంలో పెజెష్కియాన్ వ్యాఖ్యానించారు. యుద్ధం పరిణామాలను ప్రజలు అంగీకరించాలన్న పెజెష్కియన్.. ప్రతిఘటనే ప్రస్తుత మార్గమన్నారు.శత్రువు.. ఇరాన్‌పై హైబ్రిడ్ యుద్ధాన్ని మొదలుపెట్టాడన్న పెజెష్కియాన్.. యుద్ధ సమయంలో పరిపాలనా వ్యవస్థ ప్రాధాన్యతల్లో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం, సామాజిక ఆస్తులను పరిరక్షించడం ప్రధానమైనవని ఆయన స్పష్టం చేశారు. జూన్ 18న కుదిరిన అవగాహన ఒప్పందంతో సహా అమెరికాతో జరిగిన చర్చల్లో తమ ప్రభుత్వం ఇరాన్ జాతీయ హక్కులను, ప్రయోజనాలను పూర్తిస్థాయిలో కాపాడిందన్నారు.కాగా, వాణిజ్య నౌకలను బెదిరించే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా గత వారంలో అమెరికా ఇరాన్‌లోని దక్షిణ ప్రావిన్సులపై వరుస దాడులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్.. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్ వంటి ప్రాంతీయ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు మరియు సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం తుది ఒప్పందానికి రావడానికి 60 రోజుల వ్యవధిలో చర్చలు జరగాల్సి ఉన్న తరుణంలో ఈ ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి.మరో వైపు, అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్‌పై మరో విడత దాడులను ప్రారంభించినట్లు ప్రకటించడంతో.. సోమవారం రాత్రి, మంగళవారం వేకువజామున దక్షిణ, మధ్య ఇరాన్లో పలు పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. దక్షిణ ప్రావిన్స్ హోర్మోజ్గాన్లోని బందర్ అబ్బాస్, సిరిక్, బందర్ లెంగే, ఖేష్మ్ కౌంటీలతో పాటు ఆగ్నేయ ప్రావిన్స్ సిస్తాన్ అండ్ బలూచిస్థాన్‌లోని చాబహార్, కొనారక్ కౌంటీలలో సోమవారం రాత్రి పేలుళ్లు జరిగాయి. -
ఇరాన్‌పై మరోసారి అమెరికా బాంబింగ్
అమెరికా – ఇరాన్‌ల యుద్ధం మరింత వేడెక్కింది. ఇరాన్ మిలిటరి కమాండర్ సెంటర్‌పై అమెరికా దాడి చేసింది. ఇరాన్ డ్రోన్ లాంచ్ సైట్లు, ఎయిర్ డిఫైన్స్ సిస్టమ్‌పై ఎటాక్ చేసింది. మరోవైపు యూఎస్స్థానిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. కువైట్‌లోని యూఎస్ స్థావరంపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. యూఎస్ రాడర్ సిస్టమ్, అమెరికన్లు టార్గెట్‌గా ఇరాన్ విరుచుకుపడుతోంది.ఇరాన్, యూఎస్ మధ్య యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. క్షిపణి, డ్రోన్ దాడులతో గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వాషింగ్టన్ వరుసగా 10వ రాత్రి కూడా దాడులు కొనసాగించగా.. బహ్రెయిన్‌లోని అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థపై దాడి చేసినట్లు ఇరాన్ వెల్లడించింది. మరో వైపు, హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై కూడా దాడులు జరిగాయి. తాము పూర్తి స్థాయి యుద్ధంలో ఉన్నామని టెహ్రాన్ హెచ్చరించగా.. ఇరాన్ దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులు మరణించినట్లు పెంటగాన్ ధృవీకరించింది.నిన్న (సోమవారం) కూడా ఇరాన్ లక్ష్యంగా అమెరికా మరోసారి దాడులకు తెగబడగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్‌లపై ప్రతిదాడులకు దిగింది. ఇరాన్ వాయువ్య ప్రాంతంలో భూగర్భ క్షిపణి కేంద్రంగా భావిస్తున్న తబ్రిజ్ నగరం లక్ష్యంగా అమెరికా దాడులకు దిగగా ఒకరు మరణించినట్లు ఇరాన్ ప్రకటించింది. ప్రతీకారంగా ఇరాన్ బహ్రెయిన్‌తోపాటు అమెరికా నావికాదళపు ఫిఫ్త్ ఫ్లీట్ ఉన్న కువైట్‌పై క్షిపణులతో విరుచుకుపడింది. ఇరు దేశాల్లో సోమవారం ఉదయమే క్షిపణి దాడులకు సంబంధించిన హెచ్చరికలు జారీ అయ్యాయి.దూసుకొస్తున్న క్షిపణులను అడ్డుకున్నట్లు కువైట్ ప్రకటించింది. ఇరుదేశాల మధ్య యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటిస్తూ గత నెలలో ఒక ఒప్పందం కుదిరినా ఆ తరువాత దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూండటంతో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో కార్యకలాపాలు మళ్లీ స్తంభించిపోయాయి. ఇరుపక్షాలూ మౌలిక సదుపాయాలు లక్ష్యంగా దాడులు చేసుకుంటూండంతో చమురు ధరలు మళ్లీ పైకి ఎగబాకాయి. సోమవారం బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్ ధర 90 డాలర్ల కంటే ఎక్కువ పలికి ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. ఇరాన్‌పై సోమవారం జరిగిన దాడులు బాగా జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఒరాన్ డ్రోన్ దాడిలో శనివారం వీరసైనికుడి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నామని ఆయన ప్రకటించారు. -
హర్ముజ్ తర్వాత మరో షాక్.. హౌతీల సంచలన ప్రకటన
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకుంటున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ పదో రోజుకు చేరుకున్న వేళ.. యెమెన్‌కు చెందిన ఇరాన్ అనుకూల హౌతీ తిరుగుబాటుదారులు చేసిన సంచలన ప్రకటన ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. సౌదీ అరేబియాకు చెందిన వాణిజ్య, ఇంధన నౌకలపై నావికా దిగ్బంధం విధిస్తున్నట్లు హౌతీలు ప్రకటించారు. ఈ పరిణామంతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న గల్ఫ్ ప్రాంతంలో మరో కొత్త యుద్ధ ఫ్రంట్ తెరుచుకునే ప్రమాదం కనిపిస్తోంది.సౌదీ నేతృత్వంలోని కూటమి యెమెన్‌పై విధించిన ఆంక్షలు, చర్యలకు ప్రతిస్పందనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హౌతీ సాయుధ విభాగం వెల్లడించింది. సౌదీకి వ్యతిరేకంగా ‘మారిటైమ్ ఎంబార్గో’ అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ ప్రకటనతో ప్రపంచ ఇంధన సరఫరా మార్గాలపై మరోసారి తీవ్ర ఆందోళన మొదలైంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన బాబ్ ఎల్ మండెబ్ bab el mandeb జలసంధిపై ప్రభావం పడితే పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది.ఇప్పటికే హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ రెండు కీలక సముద్ర మార్గాల్లో అంతరాయం ఏర్పడితే ప్రపంచ చమురు సరఫరాలో భారీ కోత వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు మార్కెట్లలో కలవరంహౌతీల ప్రకటన వెలువడిన వెంటనే అంతర్జాతీయ చమురు మార్కెట్లు అప్రమత్తమయ్యాయి. అయితే దౌత్య చర్చలపై ఆశలు ఉండటంతో ధరలు కొంత మేర తగ్గాయి. అయినప్పటికీ.. గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు అదుపు తప్పితే ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచ చమురు ఎగుమతుల్లో కీలక పాత్ర పోషించే సౌదీ అరేబియా రవాణా మార్గాలకు ముప్పు ఏర్పడితే దాని ప్రభావం కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉంది.ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగింపుమరోవైపు ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. పదో రోజు కూడా అమెరికా వైమానిక దాడులు జరిపినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ సైనిక కమాండ్ కేంద్రాలు, క్షిపణి ప్రయోగ స్థావరాలు, డ్రోన్ కేంద్రాలు, నౌకా సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. తబ్రీజ్, చాబహార్, బందర్ అబ్బాస్, ఖెష్మ్ దీవి పరిసర ప్రాంతాల్లో అమెరికా దాడుల ప్రభావం కనిపించినట్లు సమాచారం.ఇరాన్ మాత్రం అమెరికా దాడులకు ప్రతీకార చర్యలు కొనసాగిస్తామని ప్రకటిస్తోంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అమెరికా మిత్ర దేశాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది.హర్ముజ్‌లో ట్యాంకర్లపై దాడులుగల్ఫ్ ఉద్రిక్తతలకు కేంద్రంగా మారిన హర్ముజ్ జలసంధిలో మరో కలకలం చోటుచేసుకుంది. రెండు చమురు ట్యాంకర్లు పేలిపోయినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. సురక్షితం కాని మార్గంలో ప్రయాణించడంతో ఈ ఘటన జరిగిందని ఇరాన్ పేర్కొంది.అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలను స్వతంత్ర సంస్థలు ధ్రువీకరించలేదు. మరోవైపు ఒమన్ తీరంలో ఓ వాణిజ్య నౌకపై గుర్తుతెలియని ఆయుధంతో దాడి జరిగినట్లు బ్రిటన్‌కు చెందిన సముద్ర భద్రతా సంస్థ వెల్లడించింది.దౌత్య ప్రయత్నాలు.. కానీ తగ్గని ఉద్రిక్తతలుయుద్ధ వాతావరణం కొనసాగుతున్నప్పటికీ మరోవైపు దౌత్య ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎస్కందర్ మొమెని పాకిస్థాన్‌కు చేరుకుని చర్చలు ప్రారంభించారు. గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నాలు చేస్తోంది.అయితే అమెరికా మాత్రం ప్రస్తుతం దౌత్యం కంటే సైనిక చర్యలకే ప్రాధాన్యం ఇస్తోంది. ఇరాన్ దాడుల్లో మరణించిన అమెరికా సైనికులకు ప్రతీకారం తీర్చుకుంటామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.గల్ఫ్ దేశాల్లో భయంఇరాన్-అమెరికా ఘర్షణ ప్రభావం గల్ఫ్ దేశాలపై కూడా పడుతోంది. కువైట్, బహ్రెయిన్, ఖతార్ వంటి దేశాలు అప్రమత్తమయ్యాయి. తమపై జరిగిన దాడులపై ఖతార్ ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. నష్టపరిహారం కోరుతూ చర్యలు తీసుకుంటోంది.ఇప్పటికే హర్ముజ్ జలసంధి.. ఇప్పుడు బాబ్ ఎల్ మండెబ్ మార్గంపై కూడా ముప్పు ఏర్పడటంతో ప్రపంచ దేశాల దృష్టి మొత్తం మధ్యప్రాచ్యంపై పడింది. అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ మరింత విస్తరిస్తే.. అది కేవలం ప్రాంతీయ యుద్ధంగానే కాకుండా ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్ కొత్త ఎత్తుగడ!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర మలుపు తిరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా ఇరాన్ విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే.. ఎర్ర సముద్రానికి ప్రవేశ ద్వారమైన బాబ్ అల్-మందెబ్ జలసంధిని మూసివేసేందుకు సిద్ధంగా ఉండాలని యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ సూచించింది!. ఈ సమాచారం బయటకు రావడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లతో పాటు ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు పెరిగాయి.రాయిటర్స్ కథనం ప్రకారం.. ఇప్పటికే హౌతీలు క్షిపణులు, డ్రోన్లను బాబ్ అల్-మందెబ్ ప్రాంతానికి సమీపంలో మోహరించి, ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. ఎర్ర సముద్ర మార్గం కూడా దెబ్బతింటే ప్రపంచ చమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.బాబ్ అల్-మందెబ్ జలసంధి(Bab al-Mandab Strait) ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటి. ఎర్ర సముద్రాన్ని ఏడెన్ గల్ఫ్‌తో అనుసంధానించే ఈ జలసంధి మీదుగానే ఆసియా-యూరప్ మధ్య పెద్దఎత్తున చమురు, సహజవాయువు, ఇతర వాణిజ్య సరకు రవాణా జరుగుతుంది. ఈ మార్గం మూసివేయబడితే నౌకలు ఆఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా సుదీర్ఘ మార్గంలో ప్రయాణించాల్సి వస్తుంది. దీంతో రవాణా ఖర్చులు, బీమా ప్రీమియాలు పెరిగి అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో హౌతీలను వ్యూహాత్మక ఒత్తిడి సాధనంగా ఉపయోగించేందుకు టెహ్రాన్ ప్రయత్నిస్తోందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇరాన్‌పై నేరుగా దాడులు జరిగితే సమాధానం కేవలం తన భూభాగానికే పరిమితం కాకుండా, ప్రాంతంలోని కీలక సముద్ర మార్గాలపై కూడా ప్రభావం చూపించేలా వ్యూహం అమలు చేసే అవకాశాన్ని ఈ పరిణామాలు సూచిస్తున్నాయని భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు... ఇదే సమయంలో ఈ పరిణామాలు పాకిస్థాన్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. హౌతీలు ఇటీవల సౌదీ అరేబియాపై మళ్లీ క్షిపణి దాడులు ప్రారంభించడంతో ఇస్లామాబాద్‌లో ఆందోళన పెరిగింది. ఒకవైపు ఇరాన్‌తో దౌత్య సంబంధాలు కొనసాగించాలని చూస్తున్న పాకిస్థాన్, మరోవైపు సౌదీ అరేబియాతో ఉన్న రక్షణ భాగస్వామ్యాన్ని కూడా కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.గత ఏడాది కుదిరిన రక్షణ ఒప్పందం ప్రకారం వేలాది మంది పాకిస్థాన్ సైనికులు ప్రస్తుతం సౌదీ అరేబియాలో విధులు నిర్వహిస్తున్నారు. యుద్ధం మరింత విస్తరించి సౌదీపై దాడులు తీవ్రతరమైతే.. పాకిస్థాన్ తటస్థంగా ఉండే అవకాశం చాలా తక్కువగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన ఓ ఉన్నతాధికారి "సౌదీపై దాడి అంటే పాకిస్థాన్‌పైనే దాడిగా పరిగణిస్తాం. అదే మా రెడ్‌లైన్" అని రాయిటర్స్‌కు చెప్పడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.మరోవైపు ఎర్ర సముద్రంలో హౌతీలు నౌకలపై దాడులు ప్రారంభిస్తే.. ప్రపంచ వాణిజ్యంతో పాటు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హర్ముజ్ జలసంధిలో అంతరాయాల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌కు.. ఎర్ర సముద్ర మార్గం కూడా దెబ్బతింటే ఇంధన దిగుమతులు, సరకు రవాణా మరింత సంక్షోభంలో పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం పరిస్థితి పూర్తిస్థాయి ఘర్షణకు దారితీయకపోయినా, ఇరాన్, హౌతీలు, అమెరికా, సౌదీ అరేబియా, పాకిస్థాన్‌ల ప్రయోజనాలు ఒకే వేదికపై ఢీకొనే పరిస్థితి ఏర్పడుతోంది. బాబ్ అల్-మందెబ్, హర్ముజ్ జలసంధుల భద్రతపై నెలకొన్న అనిశ్చితి ప్రపంచ ఇంధన సరఫరా, సముద్ర వాణిజ్యం, ప్రాంతీయ భద్రతపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశముండటంతో అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను అత్యంత నిశితంగా గమనిస్తోంది. -
హర్ముజ్ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి.. ఉద్రిక్తతలతో పాటు మరోసారి అంతర్జాతీయ రాజకీయాల కేంద్రంగా మారింది. జలసంధి గుండా వెళ్లే ప్రతి కార్గో నౌకపై 20 శాతం టోల్ వసూలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. నౌకల భద్రత కోసం తాము ఎంతో చేస్తున్నామని.. భారత్ సహా పలు దేశాలు ఈ రుసుము చెల్లించాల్సిందేనని అంటున్నారాయన. దానికి ఇరాన్ కాస్త ఘాటుగానే బదులిచ్చింది.ట్రూత్ సోషల్‌లో ట్రంప్ చేసిన పోస్టులో.. ఇకపై అమెరికా "ది గార్డియన్ ఆఫ్ ది హర్ముజ్ స్ట్రైట్"గా వ్యవహరిస్తుందని ప్రకటించారు. ప్రపంచ వాణిజ్య నౌకలకు భద్రత కల్పించేందుకు అమెరికా భారీ ఖర్చు చేస్తున్నందున, ఆ ఖర్చుకు ప్రతిఫలంగా హర్ముజ్ (Strait of Hormuz) గుండా వెళ్లే ప్రతి కార్గోపై 20 శాతం రుసుము వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని వెల్లడించారు. దీనికి విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ స్పందిస్తూ.. "హర్ముజ్‌కు నిజమైన సంరక్షకులు ఇరానేనని అన్నారు. అంతేకాదు 20 శాతం రుసుము చాలా ఎక్కువ.. మేమైతే న్యాయమైన రుసుమే వసూలు చేస్తాం" అంటూ వ్యంగ్యంగా స్పందించారు.ఇరాన్ ఘాటు కౌంటర్ట్రంప్ వ్యాఖ్యలపై ఎక్స్ (X) వేదికగా స్పందించిన అరాగ్చీ.. "వాణిజ్య నౌకలకు సురక్షిత మార్గం కల్పించే వారికి పారితోషికం ఇవ్వాలన్న ట్రంప్ మాట సరైనదే. కానీ హర్ముజ్‌కు ఎప్పటినుంచో నిజమైన గార్డియన్ ఇరానే. ఇకముందూ అలాగే ఉంటుంది" అన్నారు. అయితే ట్రంప్ ప్రతిపాదించిన 20 శాతం టోల్‌పై సెటైర్ వేస్తూ.. "20 శాతం చాలా ఎక్కువ. మేమైతే న్యాయంగా వ్యవహరిస్తాం" అని వ్యాఖ్యానించారు. దీంతో హర్ముజ్‌పై అమెరికా-ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.POTUS is absolutely right. Whoever provides secure and safe passage of commercial vessels through the Strait of Hormuz should be compensated for this service. Iran has always been the GUARDIAN of the Strait and will remain so FOREVER.20% is of course too much. We will be fair— Seyed Abbas Araghchi (@araghchi) July 13, 2026మరోసారి అమెరికా బ్లాకేడ్ఇదే సమయంలో ఇరాన్‌పై అమెరికా మరోసారి సముద్ర దిగ్బంధనాన్ని (Maritime Blockade) అమలు చేయడం ఉద్రిక్తతను పెంచింది. జూలై 14 సాయంత్రం 4 గంటల (ET) నుంచి ఇరాన్ పోర్టులకు వచ్చే, వెళ్లే నౌకలపై దిగ్బంధన చర్యలు తిరిగి ప్రారంభిస్తున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. ఇరాన్ పోర్టులకు వెళ్తున్న లేదా అక్కడి నుంచి వస్తున్న నౌకలను అమెరికా దళాలు తనిఖీ చేస్తాయని, గల్ఫ్ ఆఫ్ ఒమన్, హర్ముజ్ పరిసరాల్లో ప్రయాణించే నౌకలు అమెరికా నౌకాదళంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని సూచించింది.పాత ఒప్పందం ముగిసిందా?గతంలో ఏప్రిల్ 13 నుంచి జూన్ 18 వరకు అమెరికా ఇదే తరహా దిగ్బంధనం అమలు చేసింది. అనంతరం అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదరడంతో దానిని ఎత్తివేశారు. అయితే ఇటీవల ఆ ఒప్పందం ఇక అమల్లో లేదని ట్రంప్ ప్రకటించడంతో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది.ఇరాన్ మాత్రం గత నెల కుదిరిన మధ్యంతర ఒప్పందం ప్రకారం హర్ముజ్‌లో రవాణాను నియంత్రించే హక్కు తమకే ఉందని, అవసరమైతే టోల్ కూడా వసూలు చేసే అధికారం ఉందని చెబుతోంది. దీనిని అమెరికా పూర్తిగా తిరస్కరిస్తోంది. అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం ప్రపంచ నౌకలకు స్వేచ్ఛగా ప్రయాణించే హక్కు ఉందని వాషింగ్టన్ వాదిస్తోంది.ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావంప్రపంచంలో ఉత్పత్తి అయ్యే చమురు, ద్రవీభవించిన సహజ వాయువు (LNG)లో దాదాపు 20 శాతం హోర్ముజ్ జలసంధి గుండా రవాణా అవుతుంది. అందువల్ల ఈ మార్గంలో ఏ చిన్న అంతరాయం వచ్చినా ప్రపంచ ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం పడుతుంది.విశ్లేషకుల అంచనా ప్రకారం.. ట్రంప్ ప్రతిపాదించిన 20 శాతం టోల్ అమల్లోకి వస్తే, పూర్తిగా చమురుతో నిండిన ఒక సూపర్ ట్యాంకర్ దాదాపు 30 మిలియన్ డాలర్ల వరకు అదనపు రుసుము చెల్లించాల్సి రావచ్చు. ఇప్పటివరకు ఇరాన్ వసూలు చేసినట్లు భావిస్తున్న రుసుము సుమారు 2 మిలియన్ డాలర్ల పరిధిలోనే ఉందని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి.ఇంధన వ్యయం భారీగా పెరగడంతో అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు, రవాణా ఖర్చులు, ద్రవ్యోల్బణంపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో హర్ముజ్ జలసంధి చుట్టూ అమెరికా-ఇరాన్ ఆధిపత్య పోరు మరింత ఉత్కంఠగా మారింది. -
మళ్లీ ట్రిగ్గర్ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం
వాషింగ్టన్/టెహ్రాన్: పశ్చిమాసియాపై మళ్లీ దట్టమైన యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. మధ్యవర్తి ఖతార్ చొరవతో కాల్పుల విరమణపై ఆశలు చిగురిస్తున్నాయనుకున్న సమయంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి దూకుడు ప్రదర్శించారు. హర్ముజ్ జలసంధి పరిసరాల్లోని ఇరాన్ సైనిక లక్ష్యాలపై అమెరికా సెంట్రల్ కమాండ్ ఆదివారం సాయంత్రం నుంచి తాజా వైమానిక దాడులు ప్రారంభించింది. వాణిజ్య నౌకలు, పౌర నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చర్యలు కొనసాగిస్తోందని ఆరోపిస్తూ ఈ దాడులకు ట్రంప్ ఆదేశాలు జారీ చేసినట్లు అమెరికా ప్రకటించింది.ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హర్ముజ్ జలసంధి ఇప్పుడు అమెరికా-ఇరాన్ మధ్య ప్రధాన యుద్ధరంగంగా మారింది. "వాణిజ్య నౌకలపై దాడి చేసే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యం" అని సెంట్కామ్(CENTCOM) ప్రకటించింది. మరోవైపు అమెరికా జోక్యం ఆగే వరకు హర్ముజ్‌లో రాకపోకలను అనుమతించబోమని ఇరాన్ స్పష్టం చేస్తోంది. దీంతో ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గం తీవ్ర ఉద్రిక్తతకు కేంద్రబిందువైంది.ఓవైపు దాడులు, మరోవైపు..అమెరికా తాజా దాడులు హర్మొజ్ జలసంధికి సమీపంలోని హోర్మోజ్గాన్, ఖుజెస్టాన్, సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్సులపై కేంద్రీకృతమయ్యాయి. బందర్ అబ్బాస్, జాస్క్, సిరిక్, ఖెష్మ్ దీవి, చాబహార్ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఖొండాబ్‌లోని హెవీ వాటర్ కేంద్రం సమీపంలోనూ దాడులు జరిగినట్లు సమాచారం.దీనికి ప్రతిగా హర్ముజ్ గుండా వెళ్తున్న వాణిజ్య నౌకలపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కాల్పులు జరిపిందని అమెరికా ఆరోపించింది. ఇరాన్ ప్రయోగించిన ఒక క్రూయిజ్ క్షిపణి, ఒక ఆత్మాహుతి డ్రోన్‌ను కూల్చివేసినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది.నీటి పంపింగ్ కేంద్రంపై దాడి.. ఒకరు మృతిఖుజెస్టాన్ ప్రావిన్స్‌లోని మహ్షహర్ ప్రాంతంలో వ్యవసాయ నీటి పంపింగ్ స్టేషన్‌పై జరిగిన దాడిలో ఒక భద్రతా సిబ్బంది మృతి చెందగా, మరో నలుగురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోంది.ఐదో విడత దాడులుకాల్పుల విరమణ ప్రకటించి మూడు వారాలు కూడా గడవకముందే అమెరికా ఐదో విడత వైమానిక దాడులు చేపట్టింది. శనివారం ఒక్కరోజే ఇరాన్లో 140కి పైగా లక్ష్యాలపై దాడులు చేసిన అమెరికా.. తాజా దాడులతో మరింత ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు బహ్రెయిన్, ఖతార్, కువైట్, ఒమన్, జోర్డాన్‌లోని అమెరికా ప్రయోజనాలపై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది.క్షీణించిన నౌకల రాకపోకలుయుద్ధ ప్రభావం సముద్ర రవాణాపై స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధానికి ముందు రోజుకు సుమారు 130 నౌకలు హర్ముజ్ జలసంధిని దాటుతుండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 22కు పడిపోయినట్లు అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థల అంచనాలు చెబుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 79 డాలర్ల వద్దకు చేరడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లలో ఆందోళన పెరిగింది.భారత్‌కూ ప్రభావంఒమన్ తీరంలో దాడికి గురైన జీఎఫ్ఎస్ గెలాక్సీ GFS Galaxy కంటైనర్ నౌకలో చిక్కుకున్న భారతీయ నావికుల్లో 23 మందిని రక్షించినట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. మరో నావికుడి కోసం గాలింపు కొనసాగుతోంది. హర్ముజ్‌లో పరిస్థితులు మరింత దిగజారితే భారత చమురు దిగుమతులు, సముద్ర వాణిజ్యంపై కూడా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక ముందు ఏం జరుగుతుంది?హర్ముజ్ జలసంధిపై నియంత్రణ విషయంలో అమెరికా-ఇరాన్ ఎవరూ వెనక్కి తగ్గే సంకేతాలు కనిపించడం లేదు. ఒకవైపు అమెరికా వరుస వైమానిక దాడులతో ఒత్తిడి పెంచుతుంటే.. మరోవైపు ఇరాన్ సముద్ర మార్గాన్ని తన ఆధీనంలో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రతిష్ఠంభన కొనసాగితే ప్రపంచ చమురు సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యం, పశ్చిమాసియా భద్రతపై మరింత తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. -
ఇరాన్‌పైకి వెయ్యి క్షిపణులు.. నాన్‌స్టాప్‌గా ఏడాదిపాటు దాడులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత ఎగసిపడేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస ప్రకటనలు చేస్తున్నారు. శాంతి చర్చలకు ఇరాన్ ఇప్పుడు దిగి వచ్చినా ప్రయోజనం ఉండకపోవచ్చన్న ఆయన.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తే.. అమెరికా నుంచి వెయ్యి క్షిపణులు వెంటనే ఆ దేశంపై విరుచుకుపడతాయని హెచ్చరించారు. తొలి దాడితో ఆగకుండా.. అవసరమైతే ఏడాది పాటు ఇరాన్‌లోని కీలక ప్రాంతాలను పూర్తిగా ధ్వంసం చేసేలా అమెరికా సైన్యానికి ముందుగానే ఆదేశాలు జారీ చేశానని వెల్లడించారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. "అమెరికా అధ్యక్షుడిని, ముఖ్యంగా నన్ను హత్య చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తే.. వెయ్యి క్షిపణులు ఇప్పటికే లక్ష్యంగా సిద్ధంగా ఉన్నాయి. తొలి దాడి తర్వాత వేలాది క్షిపణులు వెంటనే ప్రయోగిస్తాం. అమెరికా సైన్యానికి అవసరమైన అన్ని ఆదేశాలు ఇప్పటికే ఇచ్చాం. ఒక సంవత్సరం పాటు అవసరమైతే ఇరాన్‌లోని ప్రతి కీలక ప్రాంతాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి సైన్యం సిద్ధంగా ఉంది. అవసరమైతే ఈ గడువును పొడిగించే అవకాశం కూడా ఉంది" అని పేర్కొన్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి.బ్యాక్ టు బ్యాక్ వార్నింగులుట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల అమెరికా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా.. తనకు ఏదైనా జరిగితే ఇరాన్‌పై ప్రపంచం ఎన్నడూ చూడని స్థాయిలో బాంబుల వర్షం కురిపించాలని ముందుగానే అధికారులకు ఆదేశాలు ఇచ్చానని చెప్పారు. తనపై కొత్త హత్య కుట్రకు సంబంధించి ఇజ్రాయెల్ వద్ద ఎలాంటి తాజా సమాచారం లేదని, అయితే చాలా ఏళ్లుగా తానే ఇరాన్ 'కిల్ లిస్ట్'లో మొదటి లక్ష్యంగా ఉన్నానని మరోసారి పునరుద్ఘాటించారు.సోలేమానీ హత్యతో మొదలైన వైరం2020లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్‌కు చెందిన అగ్ర సైనికాధికారి ఖాసెం సోలేమానీ మరణించారు. అప్పటి నుంచి ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌కు చెందిన పలువురు నేతలు హెచ్చరిస్తూ వస్తున్నారు. అమెరికా దర్యాప్తు సంస్థలు కూడా గతంలో ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌కు అనుబంధంగా ఉన్న వ్యక్తులు కుట్రలు పన్నినట్లు వెల్లడించాయి. అయితే ఇరాన్ ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తోంది. అయితే అయతొల్లా ఖమేనీ మరణంతో మళ్లీ ట్రంప్‌ను టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.శాంతి చర్చలపైనా కఠిన వైఖరిఇదిలా ఉండగా.. అమెరికాతో మళ్లీ చర్చలు కొనసాగించాలని ఇరాన్ కోరినట్లు ట్రంప్ తెలిపారు. అయితే అమెరికా ఇప్పటికే ఇరాన్‌కు కాల్పుల విరమణ ముగిసిందని స్పష్టం చేసిందన్నారు. చర్చలకు అంగీకరించినా.. ఇరాన్‌పై తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని సంకేతాలు ఇచ్చారు.పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు?అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్న సమయంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు మరోసారి ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఒకవైపు మధ్యవర్తి దేశాలు శాంతి చర్చలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు "వెయ్యి క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి.. ఏడాది పాటు దాడులు కొనసాగుతాయి" అంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మళ్లీ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
పశ్చిమాసియాలో ఆగిన యుద్ధం.. మళ్లీ చర్చల బాట!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య రెండు రోజుల పాటు భీకర దాడులు కొనసాగాయి. అయితే.. ఆ శాంతి చర్చలను మళ్లీ పట్టాలెక్కించేందుకు మధ్యవర్తి దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. దీంతో యుద్ధం తాత్కాలికంగా ఆగిందని సమాచారం.అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన పరస్పర దాడులతో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే ప్రస్తుతం ఇరు దేశాలు చర్చల దిశగా అడుగులు వేస్తున్నట్లు అల్‌జజీరా ఓ కథనం ఇచ్చింది. అందులో.. వాషింగ్టన్ ఇప్పటికీ ఇరాన్‌తో చర్చలకు కట్టుబడి ఉందని ఓ అమెరికా అధికారి వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సాంకేతిక స్థాయి చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇదే విషయాన్ని మొదటి నుంచి చెబుతున్నట్లు గుర్తు చేశారాయన.ఇవాళ.. కొత్తగా దాడులేం జరగలేదు. అంతకు ముందు బుషెహర్ సైనిక స్థావరం వద్ద బాంబుల మోత మోగింది. అయితే అమెరికా-ఇజ్రాయెల్ తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించాయి.ఖతార్ చొరవతో..అమెరికా-ఇరాన్ ఘర్షణను తగ్గించేందుకు ఖతార్ మధ్యవర్తిత్వ ప్రయత్నం చేస్తోంది. ఘర్షణలకు పరిష్కారం కేవలం దౌత్యం, చర్చల ద్వారానే సాధ్యమని ఖతార్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాజిద్ అల్ అన్సారీ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో శాశ్వత భద్రత, స్థిరత్వం కోసం సంభాషణలు, దౌత్య మార్గాలకే తమ దేశం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. లండన్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో..అమెరికా-ఇరాన్ మధ్య పరిస్థితి చాలా చల్లబడ్డప్పటికీ.. లెబనాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని నబాతియే ప్రాంతంలో ఇజ్రాయెల్ డ్రోన్ దాడి జరిగింది. చెత్తను తరలిస్తున్న ఓ వాహనంపై జరిగిన ఈ దాడిలో ఇద్దరు గాయపడినట్లు లెబనాన్ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. షుకిన్, కఫర్ దజ్జల్ ప్రాంతాల సమీపంలో ఉదయం ఈ ఘటన జరిగినట్లు సమాచారం.ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్‌లో మార్చి 2 నుంచి ఇప్పటివరకు 4,321 మంది మరణించగా.. 12,203 మంది గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. జూన్ 26న అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య దళాల ఉపసంహరణకు సంబంధించి ఒప్పందం కుదిరినప్పటికీ.. తాజా దాడి ఆందోళన కలిగిస్తోంది.చర్చలే కీలకంఅమెరికా-ఇరాన్ మధ్య తాజా పరిణామాలు తాత్కాలిక శాంతి సంకేతాలను ఇస్తున్నప్పటికీ.. పూర్తిస్థాయి కాల్పుల విరమణ, దీర్ఘకాలిక ఒప్పందంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రత, పరస్పర నమ్మకం వంటి అంశాలపై చర్చలు కీలకంగా మారనున్నాయి. రెండు రోజుల దాడుల తర్వాత ఇప్పుడు తుపాకులు మౌనంగా ఉన్నా.. శాంతి శాశ్వతమవుతుందా? అన్నది రాబోయే దౌత్య చర్చలపైనే ఆధారపడి ఉంది. -
ఇజ్రాయెల్ నిఘా అస్త్రం.. మళ్లీ దగ్గరవుతున్న ట్రంప్-నెతన్యాహు!
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుతున్నాయనుకున్న సమయంలో మరోసారి మంటలు చెలరేగాయి. హర్ముజ్ జలసంధి పరిణామాలు, పరస్పర ఆరోపణలతో ఇరు దేశాల మధ్య టెన్షన్ పెరుగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మట్టుపెట్టేందుకు ఇరాన్ స్కెచ్ వేసిందన్న ప్రచారం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని స్వయంగా ట్రంపే వెల్లడించడం.. నాటో సదస్సు ప్రయాణంలో భద్రతా కారణాలతో విమానం మార్చుకోవడం.. వరుసగా చర్చనీయాంశాలయ్యాయి. అయితే ఈ మొత్తం పరిణామాల్లో ఇజ్రాయెల్ నిఘా సమాచారం కీలకంగా మారినట్లు తెలుస్తోంది.తన నిఘా వ్యవస్థ ద్వారా ఈ సమాచారాన్ని అందుకున్న ఇజ్రాయెల్ వెంటనే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ట్రంప్‌కు ముప్పుపై కీలక వివరాలను అమెరికాకు అత్యవసరంగా చేరవేసిందని.. ఈ హెచ్చరికతో అమెరికా భద్రతా వ్యవస్థ అప్రమత్తమైందని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఇరాన్‌తో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇజ్రాయెల్ అందించిన నిఘా సమాచారం ట్రంప్ వైఖరిలో మార్పునకు కారణమైందా? అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ప్రక్రియపై దీని ప్రభావం పడనుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఇజ్రాయెల్ హెచ్చరిక.. అమెరికా దూకుడు?అమెరికా మీడియా కథనాల ప్రకారం.. ఇరాన్ నుంచి ట్రంప్‌కు ముప్పు ఉందన్న సంకేతాలను అమెరికా నిఘా సంస్థలు ఇప్పటికే గుర్తించాయి. అయితే, ఒక నిర్దిష్ట హత్యా ప్రణాళికకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇజ్రాయెల్ తాజాగా అమెరికా రక్షణ శాఖకు అందించినట్లు తెలుస్తోంది.ఈ సమాచారాన్ని అమెరికా స్వతంత్రంగా పూర్తిస్థాయిలో ధ్రువీకరించలేదని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో.. ఇరాన్‌పై మరింత కఠిన వైఖరి అవలంబించేలా ట్రంప్‌పై ఒత్తిడి తీసుకురావడానికి ఇజ్రాయెల్ ఈ నిఘా సమాచారాన్ని ఉపయోగించిందా? అన్న చర్చ కూడా అమెరికా వర్గాల్లో సాగుతోంది. అయితే భద్రతా అంశంగా ఈ హెచ్చరికను అమెరికా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు.. ఇరాన్ కదలికలపై నిఘాను పెంచినట్లు సమాచారం.మరోవైపు, ఈ పరిణామం అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. నేరుగా ఘర్షణకు వెళ్లకుండా పరిష్కారం కోరుతున్న ట్రంప్ వైఖరిలో ఈ హెచ్చరిక మార్పు తీసుకొస్తుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.మళ్లీ దగ్గరవుతున్న ట్రంప్-నెతన్యాహుఇరాన్ విషయంలో ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య భిన్నాభిప్రాయాలు బహిర్గతమయ్యాయి. ఇరాన్‌పై ఒత్తిడిని కొనసాగించాలని నెతన్యాహు భావించగా.. యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చమురు మార్కెట్లపై పడే ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని ట్రంప్ దౌత్య పరిష్కారం వైపు మొగ్గు చూపారు.ఈ క్రమంలో లెబనాన్ పరిణామాలు, శాంతి ఒప్పందం ఆలస్యం వంటి అంశాలపై ట్రంప్ ఇజ్రాయెల్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక దశలో నెతన్యాహును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో.. ఇరు దేశాల మధ్య దూరం పెరుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అయితే, తాజాగా ట్రంప్‌కు ఇరాన్ నుంచి ముప్పు ఉందన్న నిఘా సమాచారం నేపథ్యంలో అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాల్లో మళ్లీ సాన్నిహిత్యం పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా చేపడుతున్న చర్యలు, భద్రతా పరిస్థితులపై ట్రంప్, నెతన్యాహు మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది.ఇరాన్ ముప్పు నేపథ్యంలో గత విభేదాలను పక్కన పెట్టి.. రెండు దేశాలు మళ్లీ వ్యూహాత్మక సమన్వయంపై దృష్టి పెడుతున్నాయా? అన్న చర్చ ఇప్పుడు మొదలైంది.కొత్తేం కాకపోయినా..ట్రంప్‌కు ఇరాన్ నుంచి ముప్పు ఉందన్న ఆరోపణలు కొత్తవేమీ కాదు. ట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కీలక కమాండర్ ఖాసిం సోలైమనీ మరణించారు. ఆ ఘటన తర్వాత ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌లోని కొన్ని వర్గాలు బహిరంగంగా హెచ్చరించాయి.ఆ తర్వాత కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లోని కొన్ని వర్గాల నుంచి హెచ్చరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇరాన్లో జరిగిన సంతాప కార్యక్రమాల్లోనూ ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు వినిపించినట్లు సమాచారం. అయితే ఇరాన్ నిజంగానే ఇలాంటి కుట్రకు పాల్పడుతోందా? లేక దౌత్య, వ్యూహాత్మక పోరాటంలో భాగంగానే ఈ ఆరోపణలు తెరపైకి వచ్చాయా? అన్నది ఇంకా స్పష్టతకు రావాల్సి ఉంది.అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు వరుసగా అవరోధాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ హత్యా కుట్ర ఆరోపణలు, ఇజ్రాయెల్ నిఘా సమాచారం, అమెరికా భద్రతా చర్యలు, ఇరాన్ ప్రతిస్పందనలు.. మరోసారి పశ్చిమాసియా రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.శాంతి దిశగా సాగాల్సిన చర్చలకు తాజా పరిణామాలు మరో పరీక్షగా మారాయి. ట్రంప్-ఇరాన్ ఘర్షణలో తదుపరి అడుగు ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. -
ఒక్క దెబ్బ కొడితే.. 20 రెట్లు బలంగా కొడతాం
వాషింగ్టన్: ఇరాన్‌పై తాజా దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. తమపై లేదంటే తమ మిత్రదేశాలపై ఇరాన్ ఎలాంటి దాడికి పాల్పడినా.. దానికి 20 రెట్లు బలమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి వద్ద అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు.అమెరికా దళాలు ఇరాన్‌పై వరుసగా రెండో రోజు దాడులు కొనసాగించాయి. ఇరాన్ ఆగ్నేయ ప్రాంతంలోని ఇరాన్షహర్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసినట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వీడియోలు, చిత్రాలను విడుదల చేశారు. ఈ స్థావరాన్ని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) వినియోగిస్తున్నట్లు అమెరికా వర్గాలు తెలిపాయి. అమెరికా దాడుల తర్వాత ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. దక్షిణ తీర ప్రాంతంలోని బుషెర్, చాబహార్, కొనారక్, బందర్ అబ్బాస్, సిరిక్ ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు పేర్కొంది. బుషెర్లోనే ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం ఉంది. ‘‘చూస్తూ ఊరుకోం’’: ట్రంప్ఇరాన్ నుంచి వచ్చే ఏ దాడినైనా తిప్పికొడతామని ట్రంప్ తెలిపారు. ‘‘వాళ్లు మమ్మల్ని ఒక్కసారి కొడితే.. మేము 20 రెట్లు బలంగా సమాధానం ఇస్తాం’’ అని వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో కుదిరిన తాత్కాలిక ఒప్పందం ముగిసిందని గతంలో ప్రకటించిన ట్రంప్.. చర్చలకు మాత్రం అవకాశం ఉందని చెప్పారు. ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఇరాన్ గతంలో చేసుకున్న ఒప్పందాలను గౌరవిస్తుందా? అన్నదే ప్రధాన సందేహమని అన్నారు. అందుకే ఎలాంటి ఒప్పందం విషయంలోనూ తొందరపడబోమని స్పష్టం చేశారు. ఇది సాధారణ యుద్ధం కోసం చేస్తున్న చర్య కాదని.. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు.ఇజ్రాయెల్ మౌనం వెనుక వ్యూహమేంటి?అమెరికా-ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ వైఖరి ఆసక్తికరంగా మారింది. ఇరాన్‌ను ప్రధాన భద్రతా ముప్పుగా చూస్తున్న ఇజ్రాయెల్.. తాజా పరిణామాలపై నిశితంగా గమనిస్తోంది. అయితే ఈ దశలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మౌనం పాటిస్తోంది. అమెరికా చర్యలకు మద్దతు ఇస్తూనే.. పరిస్థితులు ఏ దిశగా వెళ్తాయో అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.ప్రతీకార చర్యలకు దిగిన ఇరాన్అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా స్పందించింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్‌లపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిగినట్లు సమాచారం. అయితే ఈ దాడుల్లో జరిగిన నష్టంపై వెంటనే స్పష్టత రాలేదు. కువైట్ సైన్యం మాత్రం డ్రోన్లు, క్షిపణులను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది.హర్ముజ్‌పై ఇరాన్ పట్టుహర్ముజ్ జలసంధిపై నియంత్రణ తమకే ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘలీబాఫ్ మాట్లాడుతూ అమెరికా బెదిరింపులకు తలొగ్గేది లేదన్నారు. ‘‘మీరు దాడి చేస్తే.. మిమ్మల్ని కూడా దాడి చేస్తాం’’ అంటూ హెచ్చరించారు. హర్ముజ్ మార్గంలో నౌకల రాకపోకలు ఇరాన్ నిబంధనల ప్రకారమే సాగుతాయని తెలిపారు.చర్చలకు బ్రేక్?ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు తాజా పరిణామాలు అడ్డంకిగా మారాయి. ఇరువైపులా దాడులు, ప్రతిదాడులతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. బెదిరింపులు బలానికి సంకేతం కాదని, అమెరికా విధానాల వైఫల్యాన్ని చూపిస్తున్నాయని విమర్శించింది.పెరిగిన చమురు ధరలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై పడింది. కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందన్న ట్రంప్ వ్యాఖ్యల తర్వాత చమురు ధరలు దాదాపు 8 శాతం పెరిగాయి. హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు మరింత దిగజారితే ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
భీకరంగా మారిన అమెరికా-ఇరాన్ యుద్ధం!
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలిక శాంతి ఒప్పందం "ముగిసిపోయింది" అని ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా సైన్యం ఇరాన్‌పై మరోసారి భారీ వైమానిక దాడులకు దిగింది. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అమెరికా స్పష్టం చేసింది. చాబహార్, బందర్ అబ్బాస్, కొనారక్, ఇరాన్షహర్ సహా దక్షిణ ఇరాన్‌లోని పలు కీలక ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించగా, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అధికారిక ప్రకటనలో, హర్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛకు ముప్పుగా మారుతున్న ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని మరింత బలహీనపరచడమే తాజా దాడుల లక్ష్యమని వెల్లడించింది. వాణిజ్య నౌకలు, పౌర సిబ్బందిపై జరిగిన దాడులకు ఇరాన్‌ను బాధ్యుడిగా నిలబెడుతున్నామని స్పష్టం చేసింది.హెచ్చరిక తర్వాతే దాడులుమంగళవారం హర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న మూడు సరకు నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకారంగానే తాజా ఆపరేషన్ చేపట్టినట్లు ట్రంప్ ప్రకటించారు. "నిన్న నౌకలపై జరిగిన దాడికి ఇదే సమాధానం. మళ్లీ అలాంటి దాడులు జరిగితే ఇంకా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం" అని ఆయన హెచ్చరించారు.టర్కీలో జరిగిన నాటో సదస్సులో మాట్లాడుతూ, "ఇరాన్‌తో శాశ్వత ఒప్పందం కుదిరినా అది నిలుస్తుందనే నమ్మకం లేదు. వాళ్లు విశ్వసనీయులు కాదు. నా దృష్టిలో తాత్కాలిక ఒప్పందం ఇప్పటికే ముగిసింది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే పూర్తి స్థాయి యుద్ధం మళ్లీ ప్రారంభమవుతుందని మాత్రం తాను భావించడం లేదని కూడా చెప్పారు.మరింత తీవ్రంగా అమెరికా దాడులురాయిటర్స్ కథనం ప్రకారం.. బుధవారం జరిగిన దాడులు మంగళవారం కంటే మరింత విస్తృతంగా సాగాయి. ఇరాన్ దక్షిణ తీరంలోని కీలక సైనిక, నౌకాదళ మౌలిక సదుపాయాలనే ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇరాన్లో అతిపెద్ద నౌకాశ్రయం ఉన్న బందర్ అబ్బాస్, నౌకాదళ స్థావరాలు ఉన్న కొనారక్, వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన చాబహార్ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. చాబహార్లో సముద్ర రవాణా నియంత్రణ టవర్‌కు నష్టం వాటిల్లినట్లు స్థానిక మీడియా తెలిపింది. పేలుళ్ల అనంతరం అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇరాన్‌షహర్‌లో కూడా వరుస పేలుళ్లు నమోదయ్యాయి.అమెరికా స్థావరాలే లక్ష్యంగా..అమెరికా దాడులకు ముందు ఇరాన్ కూడా ప్రతిస్పందించింది. బహ్రెయిన్, కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు జరిపినట్లు ప్రకటించింది. అలాగే అమెరికా తాజా దాడులకు ప్రతీకారంగా మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలపై "భారీ దాడి"కి సిద్ధమవుతున్నామని ఇరాన్ భద్రతా వర్గాలకు చెందిన నూర్ న్యూస్ వెల్లడించింది.హర్ముజ్ జలసంధే అసలు కేంద్రబిందువుప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు హర్ముజ్ జలసంధి గుండా వెళ్తుంది. ఈ వ్యూహాత్మక మార్గంపై ప్రభావం చూపగల సామర్థ్యం ఇరాన్‌కు ఉండటంతో అంతర్జాతీయంగా దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది. వాణిజ్య నౌకలపై దాడుల ద్వారా చర్చల్లో పైచేయి సాధించాలనే వ్యూహాన్ని ఇరాన్ అనుసరిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కారణంగానే అమెరికా హర్ముజ్‌లో ఇరాన్ సామర్థ్యాన్ని బలహీనపరచడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.శాంతి చర్చలకు మరోసారి దెబ్బజూన్ 17న కుదిరిన అవగాహన ఒప్పందం ఆధారంగా శాశ్వత శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపించినప్పటికీ, తాజా దాడులతో ఆ ఆశలు దాదాపు ఆవిరయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) నుంచి వైదొలగడం, అణు విధానంలో మార్పులు చేయడం, ఎర్ర సముద్రానికి కీలక ద్వారమైన బాబ్ ఎల్ మండెబ్ జలసంధిని మూసివేయడం వంటి ప్రతీకార చర్యలను కూడా ఇరాన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.చమురు మార్కెట్లలో కలకలంతాజా దాడుల ప్రభావంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు వెంటనే స్పందించాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక దశలో సుమారు 7 శాతం వరకు ఎగసిపడగా, తర్వాత బ్యారెల్‌కు సుమారు 79 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు మరింత దిగజారితే ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
మరోసారి యుద్ధమా?.. చివరి నిమిషంలో ట్రంప్ యూటర్న్
ఒకవైపు ఇరాన్‌తో శాంతి చర్చలు కొనసాగుతుండగా.. మరోవైపు వైట్‌హౌస్‌లో యుద్ధంపై అత్యంత కీలక సమావేశాలు జరిగాయి. ఇరాన్‌పై మరోసారి భారీ సైనిక దాడులు చేసి "ఈసారి కథ ముగించేయాలా?" అనే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అత్యున్నత రక్షణాధికారులతో సుదీర్ఘంగా చర్చించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే చివరి క్షణంలో ట్రంప్ యూటర్న్ తీసుకున్నట్లు ఆ కథనం వెల్లడించింది.. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ట్రంప్ ఇటీవల రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్‌తో అధ్యక్ష భవనంలో పలు దఫాలుగా సమావేశమయ్యారు. ఇరాన్‌తో కొనసాగుతున్న అణు చర్చలను విరమించి, మళ్లీ పెద్ద ఎత్తున వైమానిక దాడులు ప్రారంభించాలా? అనే అంశంపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.అమెరికా రక్షణ వర్గాల్లోని కొంతమంది అధికారులు ఈ ఆపరేషన్‌ను ఫినిష్ ది జాబ్ "Finish the Job"గా అభివర్ణించినట్లు సమాచారం. గత సైనిక చర్యలతో ఇరాన్ సైనిక సామర్థ్యం దెబ్బతిన్న నేపథ్యంలో, మిగిలిన మౌలిక సదుపాయాలనూ పూర్తిగా ధ్వంసం చేసి యుద్ధానికి ముగింపు పలకాలని వారు సూచించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తుది ఆమోదం ఇవ్వలేదు. ఇప్పుడే మరోసారి భారీ యుద్ధానికి వెళ్తే దౌత్య చర్చలు పూర్తిగా దెబ్బతింటాయని, ఇరాన్ అణు కార్యక్రమాన్ని చర్చల ద్వారానే నియంత్రించడం మంచిదని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన చెప్పింది కూడా సబబేనని అధికారులు భావించినట్లు సదరు వార్తా కథనం పేర్కొంది.అయితే యుద్ధం పూర్తిగా తప్పిపోయిందని భావించే పరిస్థితి లేదని అమెరికా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్ తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించినా లేదంటే అమెరికా బలగాలపై దాడులకు పాల్పడినా, పరిమిత స్థాయి సైనిక దాడులు చేపట్టేందుకు ట్రంప్ సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే మిలిటరీ ఆప్షన్‌ను పూర్తిగా పక్కన పెట్టలేదని అధికారులు చెబుతున్నారు.ఇదే సమయంలో ఖతార్ రాజధాని దోహాలో అమెరికా-ఇరాన్ మధ్య మరో విడత పరోక్ష చర్చలు కూడా జరిగాయి. ఈ సమావేశాల్లో హర్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకాయానం పునరుద్ధరణ, ఇరాన్‌కు చెందిన సుమారు 6 బిలియన్ డాలర్ల ఫ్రీజ్డ్ నిధుల్లో కొంత భాగాన్ని విడుదల చేయడం, ఒప్పంద ఉల్లంఘనలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయడం వంటి అంశాల్లో పురోగతి సాధించినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే అణు కార్యక్రమం, ఆంక్షల ఎత్తివేత వంటి ప్రధాన వివాదాలు మాత్రం ఇంకా పరిష్కారానికి రాలేదు.హర్ముజ్ జలసంధి ఇప్పటికీ ఇరు దేశాల మధ్య అతిపెద్ద వివాదంగా కొనసాగుతోంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గంపై అధిక నియంత్రణ కోరుతున్న ఇరాన్.. అంతర్జాతీయ నౌకాయానం ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనసాగాలని అమెరికా పట్టుబడుతోంది. ఇదే అంశం భవిష్యత్ చర్చల్లోనూ కీలకంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ప్రస్తుతం ట్రంప్ దౌత్య చర్చలకే ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ, పరిస్థితులు మారితే మరోసారి భారీ సైనిక చర్యలకు వెనుకాడబోమనే సంకేతాలను కూడా ఇస్తున్నారు. దీంతో ఇరాన్-అమెరికా ఉద్రిక్తత తాత్కాలికంగా తగ్గినట్లే కనిపిస్తున్నా.. యుద్ధ మేఘాలు మాత్రం ఇంకా పూర్తిగా తొలగిపోలేదని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
‘‘అవసరమైతే ఇరాన్‌పై మళ్లీ దాడి’’.. నెతన్యాహు సంచలన ప్రకటన
పశ్చిమాసియా ఉద్రిక్తతలు చల్లారాయని భావిస్తున్న వేళ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రపంచం ఉలిక్కిపడే ప్రకటన చేశారు. దేశ భద్రతే తమకు ముఖ్యమని.. అవసరమైతే మరోసారి ఇరాన్‌పై దాడులు చేసి తీరతామని అంటున్నారాయన. అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పంద ప్రయత్నాలపై అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో ఈ హెచ్చరిక మరోసారి ఉద్రిక్తతలను పెంచేలా కనిపిస్తోంది.ఇజ్రాయెల్‌కు చెందిన ఛానల్–14కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహు మాట్లాడుతూ.. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ ఇప్పటివరకు విజయవంతమైందని పేర్కొన్నారు. ‘‘ఇరాన్ నుంచి వస్తున్న అణుబాంబు ముప్పు నుంచి మేము మా దేశాన్ని కాపాడుకున్నాం. అవసరమైతే ఇంకోసారి కూడా దాడి చేస్తాం’’ అని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదన్న నెతన్యాహూ.. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలువరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మరోసారి తేల్చిచెప్పారు.ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య ఖతార్ మధ్యవర్తిత్వంలో కీలక చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవలి యుద్ధం తర్వాత ఏర్పడిన కాల్పుల విరమణను శాశ్వత శాంతి ఒప్పందంగా మార్చేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ చర్చల్లో ఆర్థిక ఆంక్షల సడలింపు, హర్ముజ్ జలసంధిని తిరిగి పూర్తిస్థాయిలో తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమంపై పర్యవేక్షణ, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలు చర్చకు వచ్చాయి.ప్రతిపాదిత అవగాహన ప్రకారం.. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. దీనిపై సాంకేతిక స్థాయి చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.'అమెరికా ఒప్పందానికి మేము కట్టుబడి ఉండం'అయితే అమెరికా–ఇరాన్ మధ్య ఎలాంటి ఒప్పందం జరిగినా.. అది తమ భద్రతకు భంగం కలిగిస్తే ఇజ్రాయెల్ దానికి కట్టుబడి ఉండబోదని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్ సైనిక లేదంటే అణు సామర్థ్యం కొనసాగితే అవసరమైన చర్యలు స్వతంత్రంగా తీసుకుంటామని హెచ్చరించారు.ట్రంప్ సూచన.. 'జాగ్రత్తగా ఉండండి'ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇజ్రాయెల్‌ను సంయమనం పాటించాలని కోరుతూ వస్తున్నారు. మరోసారి భారీ స్థాయిలో దాడులు చేస్తే ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా ఒంటరిగా మారే ప్రమాదం ఉందని నెతన్యాహుకు సూచించినట్లు వెల్లడించారు. "బీబీ.. కాస్త జాగ్రత్తగా ఉండండి. లేకపోతే త్వరలోనే మీరు ఒంటరిగా మిగిలిపోతారు" అని తాను హెచ్చరించినట్లు ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న దౌత్య చర్చలు విజయవంతం కావాలంటే కొత్త సైనిక చర్యలకు దూరంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.లెబనాన్‌లోనూ వెనక్కి తగ్గేది లేఇరాన్పై హెచ్చరికలతో పాటు లెబనాన్ విషయంలోనూ నెతన్యాహు కఠిన వైఖరినే ప్రదర్శించారు. దక్షిణ లెబనాన్‌లోని ఇజ్రాయెల్ నియంత్రణ ప్రాంతాలను సందర్శించిన ఆయన.. హెజ్బొల్లాముప్పు పూర్తిగా తొలగే వరకు అక్కడి నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లదని ప్రకటించారు. ‘‘హెజ్బొల్లా ఆయుధాలతో అక్కడే ఉన్నంత కాలం.. మా బలగాలు కూడా అక్కడే ఉంటాయి. మా ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు" అని ఆయన స్పష్టం చేశారు. దీంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా.. ఓ స్పష్టత అంటూ లేకుండా పోయింది. మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదమా?ఒకవైపు అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తుండగా.. మరోవైపు ఇజ్రాయెల్ అవసరమైతే మరోసారి సైనిక చర్యలకు సిద్ధమని స్పష్టం చేయడం మధ్యప్రాచ్యంలో కొత్త ఆందోళనలకు దారితీస్తోంది. రాబోయే రోజుల్లో దౌత్య చర్చలు ఫలిస్తాయా? లేదంటే మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయా? అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. -
'ఇరాన్‌ను లేకుండా చేస్తాం'.. 'నరకం చూపిస్తాం'!
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది రోజులకే.. ఇరు దేశాలు మళ్లీ పరస్పర దాడులకు దిగడంతో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్‌పై దాడి జరిగిందని ఆరోపిస్తూ అమెరికా వరుసగా రెండో రోజు ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. దీనికి ప్రతిగా అమెరికా గల్ఫ్ ప్రాంతంలోని సైనిక స్థావరాలపై విరుచుకుపడుతోంది. హర్ముజ్ జలసంధి సమీపంలో ప్రయాణిస్తున్న పనామా జెండా కలిగిన కికు (KIKU) అనే చమురు ట్యాంకర్‌పై ఇరాన్ డ్రోన్‌తో దాడి చేసిందని అమెరికా ఆరోపించింది. సుమారు 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురును తీసుకెళ్తున్న ఈ నౌక దెబ్బతిన్నప్పటికీ సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించింది. దీనికి ప్రతిగా అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్‌లోని 10 కీలక సైనిక లక్ష్యాలపై దాడులు నిర్వహించింది. నిఘా వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, సముద్ర మైన్లను మోహరించే సామర్థ్యాలపై లక్ష్యంగా దాడులు చేసినట్లు తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించే అవకాశం ఇచ్చినా.. ఇరాన్ మళ్లీ దాడులకు పాల్పడిందని అమెరికా ఆరోపించింది. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కాల్పుల విరమణను ఇరాన్ పదేపదే ఉల్లంఘిస్తోందని ఆరోపించిన ఆయన, అవసరమైతే అమెరికా యుద్ధాన్ని పూర్తిస్థాయిలో ముగిస్తుందని హెచ్చరించారు. అలాంటి పరిస్థితి వస్తే.. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అనే దేశమే ఇక ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. హర్ముజ్ జలసంధిపై నియంత్రణ పూర్తిగా తమదేనని మరోసారి స్పష్టం చేసిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ.. తమ నిబంధనలను ఉల్లంఘించే నౌకలు ఉద్రిక్తతలకు కారణమవుతాయని హెచ్చరించారు. అదే సమయంలో, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు త్వరలోనే నరకాన్ని అనుభవిస్తాయి అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ నేవీ కమాండర్ హెచ్చరించారు. మరోవైపు పశ్చిమాసియాలో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత విస్తరించాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. కువైట్‌లోని అలీ అల్ సలేం ఎయిర్‌బేస్, బహ్రెయిన్‌లోని అమెరికా ఐదో నౌకాదళ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే కువైట్ సైన్యం తమ వైమానిక రక్షణ వ్యవస్థలు శత్రు క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుంటున్నాయని తెలిపింది. గల్ఫ్ దేశాల్లో సైరన్లు మోగించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.అయితే తీవ్ర సైనిక ఉద్రిక్తతల మధ్య కూడా దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. స్విట్జర్లాండ్‌లో శాంతి చర్చలపై అవగాహన ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ దాడులతో.. 60 రోజుల వ్యవధిలో శాంతి చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. అయితే.. మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్, పాకిస్తాన్ల విజ్ఞప్తితో అమెరికా, ఇరాన్ ప్రతినిధులు చర్చలకు ముందుకొచ్చినట్లు సమాచారం అందుతోంది. మంగళవారం లేదంటే ఈ వారంలోనే దోహాలో సమావేశమై హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు, సముద్ర భద్రత, కాల్పుల విరమణ అమలుపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చలు సఫలమైతే ప్రాంతంలో యుద్ధ ముప్పు కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. మరోవైపు ఇరు దేశాల నుంచి వస్తున్న హెచ్చరికలు మధ్యప్రాచ్యాన్ని మరోసారి అగ్నిగుండంలా మార్చే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. -
హర్ముజ్‌లో మళ్లీ టెన్షన్.. టెన్షన్
ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం మళ్లీ సంక్షోభంలో పడింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ దాడులను కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధమని ఆరోపించిన అమెరికా, ఇరాన్‌లోని క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీర ప్రాంత రాడార్ వ్యవస్థలపై భారీ ప్రతీకార దాడులు నిర్వహించింది. మరోవైపు ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది.అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపిన వివరాల ప్రకారం.. గల్ఫ్‌లోని ఒక ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ డ్రోన్ దాడి చేసినందుకు ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించింది. ఇరాన్ తీర ప్రాంతాల్లోని క్షిపణి నిల్వలు, డ్రోన్ స్థావరాలు, రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని "శక్తివంతమైన దాడులు" నిర్వహించినట్లు పేర్కొంది.ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్ముజ్‌లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేయడం కాల్పుల విరమణ ఒప్పందానికే కాకుండా ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU)ను కూడా ఉల్లంఘించడమేనని మండిపడ్డారు. ఇరాన్ "తెలివితక్కువ పని" చేసిందని వ్యాఖ్యానిస్తూ.. ఇటువంటి చర్యలకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేసిందని, అమెరికా తన బాధ్యతలను పాటించిందని చెప్పారు. ఒప్పంద అమలుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, హింసకు హింసతోనే సమాధానం ఉంటుందని హెచ్చరించారు.అయితే అమెరికా ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అమెరికానే ఎప్పటిలాగే తన హామీలను ఉల్లంఘించిందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఆరోపించింది. అమెరికా దాడులకు ప్రతిగా ప్రాంతంలోని అమెరికా బలగాల మోహరింపు ప్రాంతాలను తమ నౌకాదళం లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తులో అమెరికా దాడులు పునరావృతమైతే తమ ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. అయితే.. అమెరికా స్థావరాలపై దాడులు ప్రారంభించినట్లు సమాచారం అందుతోంది.ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ చైర్మన్ ఎబ్రహీం అజిజీ కూడా ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. చర్చలు, కాల్పుల విరమణ సూత్రాల పట్ల ట్రంప్‌కు ఎలాంటి నిబద్ధత లేదని ఆరోపిస్తూ.. అమెరికా దాడులను నిర్లక్ష్యపూరిత చర్యగా అభివర్ణించారు. ఇదిలా ఉండగా, హర్ముజ్ జలసంధి చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరాపై ఆందోళన పెంచుతున్నాయి. ఖతార్ ఎనర్జీకి చెందిన ఎల్ఎన్జీ ట్యాంకర్ ‘ఉమ్ స్లాల్’ హర్ముజ్ సమీపంలో తన ప్రయాణాన్ని మధ్యలోనే వెనక్కి మళ్లించగా, అంతకుముందు గ్యాస్‌లాగ్ షాంఘై నౌక కూడా అదే నిర్ణయం తీసుకుంది. ఇరాన్ దక్షిణ ప్రాంతంలో పేలుళ్లు నమోదవడంతో గల్ఫ్ మార్గంలో ఎల్ఎన్జీ రవాణాపై మళ్లీ అనిశ్చితి నెలకొంది.ఇరాన్ మాత్రం హర్ముజ్ జలసంధిని తన అత్యంత కీలక వ్యూహాత్మక అస్త్రంగా భావిస్తోంది. ఈ జలసంధిపై తన ఆధిపత్యాన్ని వదులుకోవడం అంటే చర్చల్లో తన బలమైన ఒత్తిడి సాధనాన్ని కోల్పోవడమేనని టెహ్రాన్ భావిస్తోంది. అందుకే రాజకీయ నాయకులు, సైనికాధికారులు, ఐఆర్జీసీ నేతలు హర్ముజ్‌పై తమ నియంత్రణను కాపాడుకునేందుకు అవసరమైతే పోరాటానికైనా సిద్ధమని ప్రకటిస్తున్నారు. ఇటీవల జరిగిన యుద్ధం ప్రాంతీయ వ్యూహాత్మక పరిస్థితులను పూర్తిగా మార్చేసిందని, ఆ కొత్త వాస్తవాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యమని ఇరాన్ స్పష్టం చేస్తోంది.మరోవైపు, అమెరికా మాత్రం ఈ ప్రతీకార దాడులను పరిమితంగానే ఉంచినట్లు తెలుస్తోంది. ఇరాన్‌లోని క్షిపణి, డ్రోన్ స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించిన అమెరికా, విస్తృత సైనిక స్థావరాలను మాత్రం టార్గెట్ చేయలేదు. హర్ముజ్‌లో స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని కాపాడుతూనే, దౌత్య చర్చలకు అవకాశం కొనసాగించాలనే ఉద్దేశంతోనే తమ సైనిక చర్యలను పరిమితం చేసినట్లు వాషింగ్టన్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇరు దేశాల పరస్పర ఆరోపణలు, ప్రతీకార చర్యలతో కాల్పుల విరమణ ఒప్పందం భవితవ్యంపై మరోసారి తీవ్ర అనిశ్చితి నెలకొంది.ఇదీ చదవండి: ఇరాన్ యుద్ధం.. వీళ్లకేమో కాసుల వర్షం! -
రేటు పెంపు చెప్పే చేస్తాం!
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో పరిణామాలను సునిశితంగా గమనిస్తున్నామని, రేట్ల పెంపు విషయమై ఈ దశలో మాట్లాడడం తొందరపాటు అవుతుందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. ‘‘ఇందుకు (రేటు పెంపు) మార్కెట్‌ను సన్నద్ధం చేయాలని అనుకుంటే, మా వైఖరి మార్చుకునే వాళ్లం కదా!.. రానున్న నెలల్లో రేట్లు పెంచుతామన్న స్పష్టతతో ఉంటే మా వైఖరిని తటస్థం నుంచి నియంత్రిత విధానానికి మార్చుకుని ఉండే వాళ్లం. కానీ, అలా చేయలేదు. కనుక ఇప్పుడే రేటు పెంపు గురించి మాట్లాడడం భావ్యం కాదు. మేం అప్రమత్తంగా ఉన్నామని చెప్పాం. ద్రవ్యోల్బణం, వృద్ధికి సంబంధించి రిస్‌్కలు ఉన్నాయని తెలుసు. కనుక డేటా ఆధారితంగా వ్యవహరిస్తాం’’అని మల్హోత్రా వివరించారు.ఈ నెల ఆరంభంలో జరిగిన ఆర్బీఐ ఎంపీసీ సమావేశంలో రెపో రేటును 5.25 శాతం వద్దే కొనసాగించడం తెలిసిందే. పశ్చిమాసియా ఘర్షణల కారణంగా ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం, వృద్ధికి సవాళ్లు పొంచి ఉండడంతో, వేచి చూసే వైఖరిని అనుసరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026–27) వృద్ధి అంచనాను సైతం గతంలో వేసిన 6.9 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించడం గమనార్హం. ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. పైగా తటస్థ విధానాన్నే కొనసాగించింది. ప్రపంచానికి సానుకూలం పశి్చమాసియా ఘర్షణలు ఉపశమించడం ప్రపంచానికి, భారత్ ఆర్థిక వ్యవస్థకు సానుకూలమని సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. వృద్ధి, ద్రవ్యోల్బణం పరంగానూ అనుకూలమని పేర్కొన్నారు. చమురు, ఎరువుల ధరలు తగ్గడం దేశ ఆర్థిక వ్యవస్థకు సౌకర్యాన్నిస్తుందన్నారు. ప్రభుత్వం, ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఇంధన ధరల పెరుగుదల భారాన్ని వినియోగదారులపై ఎక్కువగా పడకుండా వ్యవహరించాయని, ఈ అనిశి్చతులను భారత్ గొప్పగా ఎదుర్కోందని చెప్పారు. చమురు ధరలకుతోడు నైరుతి రుతుపవనాల పురోగతిని సైతం ఆర్బీఐ పరిశీలిస్తున్నట్టు మల్హోత్రా చెప్పారు. రానున్న రోజుల్లో ద్రవ్యల్బణం తీరును ఇవే ప్రభావితం చేస్తాయన్నారు. -
డీల్‌పై కీలక వ్యాఖ్యలు.. ఇరాన్‌ను మళ్లీ రెచ్చగొట్టిన ట్రంప్
అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన తాత్కాలిక ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒప్పందంలోని నిబంధనలను ఇరాన్ పాటించకపోతే తాను అవసరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారాయన. ఈ క్రమంలో కాస్త ఘాటు హెచ్చరికలే జారీ చేశారు."ఇరాన్ తమ ఒప్పందానికి కట్టుబడి ఉండాలి. ఒప్పందం పట్ల వాళ్లు సక్రమంగా ప్రవర్తించాల్సిందే. లేకుంటే నేను చేయాల్సింది నేను చేస్తా. ఊరుకుంటానుకుంటే ఆ దేశం పొరపాటే" అని ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ.. గత వారం ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తాత్కాలిక ఒప్పందం(MoU)పై డిజిటల్ సంతకాలు చేశారు. ప్రత్యక్ష చర్చల్లో భాగంగా.. మొన్న ఆదివారం ఇరాన్, అమెరికా, మధ్యవర్తిత్వ ప్రతినిధులు స్విట్జర్లాండ్‌లో చర్చలు మొదలుపెట్టారు. దీంతో 60 రోజుల్లో ఇరాన్-అమెరికా మధ్య ఒప్పందం కుదరాల్సి ఉంటుంది. అయితే.. స్విస్ చర్చలు జరుగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు ఇరాన్‌ను కవ్వించేలా మాట్లాడారు. ఒప్పందం కుదుర్చుకోకపోతే భీకర దాడులు.. అదీ గతంలో కంటే దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగానే ఇరాన్ ప్రతినిధులు చర్చల మధ్య నుంచి అర్ధాంతరంగా బయటకు వెళ్లిపోయినట్లు ప్రచారం జరిగింది. అదే సమయంలో ఇరాన్ అధికార ప్రతినిధులు ట్రంప్ వార్నింగ్‌పై సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. ఈ తరుణంలో.. ఇప్పుడు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్‌కు ఇరాన్ నుంచి కౌంటర్ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. నిధుల వినియోగంపైనా ఓ క్లారిటీఇదిలా ఉంటే.. ఇరాన్‌కు చెందిన స్తంభింపజేసిన నిధులను విడుదల చేసే అంశంపై కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. విడుదలయ్యే డబ్బు మొత్తం అమెరికా నుంచే ఆహార పదార్థాల కొనుగోలుకు వినియోగించాల్సి ఉంటుందని చెప్పారు. "విడుదల చేసే డబ్బంతా తిరిగి అమెరికా రైతులకే చేరుతుంది. ఎందుకంటే ఆ నిధులతో ఇరాన్ అమెరికా నుంచి ఆహార ధాన్యాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సుమారు 9.1 కోట్ల జనాభాకు సరిపడా ఆహారాన్ని ఇరాన్ ఉత్పత్తి చేయలేకపోతోంది" అని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో ఇరాన్‌కు నిధుల విడుదల అనేది నేరుగా నగదు సాయం కాదని, నియంత్రిత వినియోగంతో కూడిన ఆర్థిక వ్యవస్థలో భాగమని అమెరికా సంకేతాలు ఇచ్చినట్లయ్యింది.యుద్ధ ప్రభావం ఇంకా కొనసాగుతూనే..అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు ఇరాన్ యుద్ధం ప్రపంచ మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు ధరలు పెరగడం, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. అయితే తాజా ఒప్పందం శాంతికి మార్గం వేస్తుందా? లేదంటే ఇరాన్ ఒప్పంద నిబంధనల అమలుపై కొత్త వివాదాలకు దారితీస్తుందా? అన్నది ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక చర్చగా మారింది.ఇదీ చదవండి: ఇదెక్కడి ఫిట్టింగ్?.. పే చేయాల్సింది గల్ఫ్ దేశాలేనా! -
ట్రంప్-ఇరాన్ డీల్.. గల్ఫ్ దేశాల్లో గుబులు!
అమెరికా-ఇరాన్ ఒప్పందంపై గల్ఫ్ దేశాల గుబులు.. డబ్బు, భద్రత, హర్ముజ్‌పై పెరుగుతున్న ప్రశ్నలు. ఇరాన్ పునర్నిర్మాణానికి 300 బిలియన్ డాలర్లు ఇస్తే.. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు చెల్లిస్తారు?. ప్రస్తుతం గల్ఫ్ దేశాలను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) తర్వాత ఈ అంశం ఆ రీజియన్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో (Marco Rubio) మూడు రోజుల పర్యటనలో భాగంగా యూఏఈ, కువైట్, బహ్రెయిన్ దేశాలను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా గల్ఫ్ దేశాల నేతలు ఇరాన్‌కు ప్రతిపాదిస్తున్న భారీ ఆర్థిక ప్యాకేజీ, భద్రతా హామీలు, ఆంక్షల సడలింపులపై స్పష్టత కోరే అవకాశం ఉంది.300 బిలియన్ డాలర్ల ప్యాకేజీ..అమెరికా-ఇరాన్ అవగాహన ఒప్పందం ప్రకారం, ఇరాన్ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధి కోసం కనీసం 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ.25 లక్షల కోట్లు) విలువైన ప్రణాళికను ప్రాంతీయ భాగస్వాములతో కలిసి రూపొందించాలని అమెరికా అంగీకరించింది. ఈ నిధుల అమలు విధానాన్ని 60 రోజుల్లో ఖరారు చేయాలని ఒప్పందంలో పేర్కొన్నారు.అయితే ఈ భారీ నిధులు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, దాని సైనిక సామర్థ్యాలను కూడా పెంచే ప్రమాదం ఉందని గల్ఫ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంపై ఒప్పందంలో స్పష్టమైన ప్రస్తావన లేకపోవడం వారికి మరింత కలవరపెడుతోంది.గల్ఫ్ దేశాల భద్రతా ఆందోళనలుసౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్, ఖతార్ దేశాలు అమెరికా భద్రతా వ్యవస్థలో కీలక భాగస్వాములు. ఇటీవల జరిగిన యుద్ధ సమయంలో ఈ దేశాల్లోని అమెరికా స్థావరాలు, పౌర మౌలిక వసతులు ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడుల ముప్పును ఎదుర్కొన్నాయి. అందుకే యుద్ధం ఆగడాన్ని స్వాగతిస్తున్నప్పటికీ, ఇరాన్‌కు ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తున్నారో తెలుసుకోవాలని గల్ఫ్ దేశాలు కోరుతున్నాయి.స్తంభింపజేసిన ఆస్తులపై కొత్త ఫార్ములా!చర్చల్లో మరో కీలక అంశం ఇరాన్‌కు చెందిన విదేశీ ఆస్తులు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ JD Vance వెల్లడించిన వివరాల ప్రకారం, ఆంక్షల సడలింపు తర్వాత విడుదలయ్యే నిధుల వినియోగంపై అమెరికా, ఖతార్ సంయుక్త పర్యవేక్షణ ఉండేలా ప్రతిపాదన సిద్ధమైంది.అంటే విడుదలైన డబ్బును ఇరాన్ నేరుగా వినియోగించకుండా, అమెరికా గోధుమలు, మొక్కజొన్న వంటి అవసరమైన వస్తువుల కొనుగోలుకు మాత్రమే ఉపయోగించే విధంగా వ్యవస్థను రూపొందించాలని భావిస్తున్నారు. ఈ ఆలోచనను ట్రంప్ అల్లుడు(ఇవాంక భర్త), మాజీ వైట్‌హౌస్ సలహాదారు జారెడ్ కుష్నర్ Jared Kushner ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.వందల బిలియన్ల డాలర్లు పణంగా..ప్రారంభ చర్చల్లో 6 నుంచి 25 బిలియన్ డాలర్ల మధ్య ఉన్న స్తంభింపజేసిన నిధుల గురించే చర్చ జరిగినప్పటికీ, వివిధ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇరాన్‌కు చెందిన 100 నుంచి 120 బిలియన్ డాలర్ల వరకు ఆస్తులు ఆంక్షల కారణంగా నిలిచిపోయి ఉన్నాయి. అయితే ఆ నిధుల వినియోగంపై తుది నిర్ణయం తమదే కావాలని ఇరాన్ స్పష్టం చేస్తోంది.హర్ముజ్ జలసంధిపై దృష్టిరుబియో పర్యటనలో మరో కీలక అంశం హర్ముజ్ జలసంధి Strait of Hormuz. ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాల్లో కీలక పాత్ర పోషించే ఈ జలసంధి ఇటీవల యుద్ధంతో ఉద్రిక్త ప్రాంతంగా మారింది. యుద్ధానికి ముందు రోజుకు 100 నుంచి 131 నౌకలు ఈ మార్గంలో ప్రయాణించగా, ప్రస్తుతం ఆ సంఖ్య 71కు పడిపోయింది. 60 రోజుల చర్చల కాలంలో రవాణాపై అదనపు రుసుములు విధించబోమని ఒప్పందంలో ఉన్నప్పటికీ, ఆ గడువు ముగిసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందన్నదానిపై అనిశ్చితి కొనసాగుతోంది.కీలక ప్రశ్న మాత్రం అదే..ఇరాన్‌తో శాంతి ఒప్పందం, పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధి అన్నీ బాగానే ఉన్నా... 300 బిలియన్ డాలర్ల భారీ ప్యాకేజీకి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? అమెరికానా? గల్ఫ్ దేశాలా? లేదంటే అంతర్జాతీయ భాగస్వాములా?** అనే ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం లేదు. అందుకే ప్రస్తుతం పశ్చిమాసియా రాజకీయాల్లో అందరి నోటా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే... ఆ బిల్లు చివరికి ఎవరు చెల్లించాలి?. -
మళ్లీ భీకర దాడులకు దిగిన ఇజ్రాయెల్
పశ్చిమాసియాలో శాంతి దిశగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే పరిస్థితి మళ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. లెబనాన్‌లోని దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, డ్రోన్లతో జరిపిన దాడుల్లో పలువురు మృతి చెందినట్లు సమాచారం. దీంతో ఒప్పందం మొదటి దశలోనే తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.అమెరికా, ఇరాన్, ఖతార్ మధ్య ఒత్తిళ్లతో.. ఇజ్రాయెల్–హెజ్బోల్లా దిగి వచ్చాయి. దీంతో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అయితే కొద్ది గంటల్లోనే దక్షిణ లెబనాన్‌లోని నబాటియే ప్రాంతంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ భీకర దాడుల్లో నివాస భవనాలు ధ్వంసమయ్యాయని లెబనాన్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ (NNA) తెలిపింది. తెల్లవారుజామున కూడా బాంబుల వర్షం కొనసాగినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.మొన్న ఇజ్రాయెల్–హెజ్బోల్లా మధ్య జరిగిన భీకర పోరులో లెబనాన్‌లో కనీసం 47 మంది మృతి చెందగా, ఇజ్రాయెల్ తరఫున నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. తాజా దాడులపై ఇజ్రాయెల్ స్పందించింది. కాల్పుల విరమణ ఉల్లంఘనలకు ప్రతిస్పందనగానే జరిగాయని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. హెజ్బోల్లా మిలిటరీ మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకున్నామని, భద్రతా ముప్పులు ఉన్న ప్రాంతాల్లో ఆపరేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇదే సమయంలో హెజ్బోల్లా కూడా ఇజ్రాయెల్‌పై ఆరోపణలు చేస్తూ, ఒప్పందాన్ని వారే ఉల్లంఘించారని పేర్కొంది.దౌత్య ప్రయత్నాలకు ఎదురుదెబ్బఈ తాజా దాడులు ప్రాంతీయ దౌత్య ప్రయత్నాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. లెబనాన్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్విట్జర్లాండ్‌లో జరగాల్సిన అమెరికా–ఇరాన్ చర్చలు వాయిదా పడ్డాయి. చర్చల్లో పాల్గొనాల్సిన ఇరాన్ ప్రతినిధులు ప్రయాణాన్ని రద్దు చేసుకోగా, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా తన పర్యటనను నిలిపివేశారు. అయితే ఒప్పందం కుదిందన్న ప్రకటనల తర్వాత.. మళ్లీ చర్చలు జరగొచ్చని భావించారు. ఈలోపే మళ్లీ దాడులు జరగడం గమనార్హం.ఇటీవల అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం హార్మూజ్ జలసంధి పునరుద్ధరణకు దారితీసినా, తాజా ఘర్షణలు ఆ శాంతి ప్రయత్నాలపైనా అనిశ్చితిని పెంచుతున్నాయి. శాంతి ఒప్పందంతో ఇరాన్‌కు పెద్దగా లాభం(10 శాతానికి మించి కూడా) చేకూరదని ట్రంప్ వ్యాఖ్యానించడం.. అదే సమయంలో హర్ముజ్‌లో నౌకల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడం వంటి కొత్త నిబంధనలు కూడా అమలులోకి రావడంతో పరిస్థితిని మళ్లీ ఉద్రిక్తతల వైపు మళ్లించేలా కనిపిస్తున్నాయి. ఈలోపు.. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం, మరోవైపు గంటల్లోనే మళ్లీ ప్రారంభమైన దాడులు… పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు ఎంత బలహీనంగా ఉన్నాయో స్పష్టమవుతోంది. ఈ ఒప్పందం నిజంగా నిలుస్తుందా? లేదంటే మళ్లీ ఘర్షణల చక్రం తిరుగుతుందా? అన్నది ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ప్రశ్నగా మారింది. -
ఇరాన్–అమెరికా శాంతి చర్చలకు బ్రేక్!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు శాశ్వత తెర పడే ప్రయత్నాలకు విఘాతం కలిగింది. అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన శాంతి ఒప్పందం తాలుకా కీలక సమావేశం వాయిదా పడింది. శుక్రవారం స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్ పర్వత రిసార్ట్‌లో జరగాల్సిన ఈ భేటీ చివరి నిమిషంలో రద్దైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. దీంతో.. తాత్కాలిక కాల్పుల విరమణ (ట్రూస్) భవిష్యత్తుపై భారీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.శాంతి ఒప్పందానికి అవసరమైన పరస్సర అవగాహన ఒప్పందంపై అమెరికా, ఇరాన్ అధ్యక్షులు సంతకాలు కూడా చేశారు. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం స్విట్జర్లాండ్‌లో ఇవాళ భేటీ జరగాల్సి ఉంది. దీనికి ఇరాన్-అమెరికా విదేశాంగ అధికారులతో పాటు పశ్చిమాసియా ప్రతినిధులు ఈ భేటీకి హాజరవుతారని అంతా భావించారు. అయితే.. ఇంతలోనే ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏర్పాట్లలో సమస్యలు తలెత్తడంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ స్విట్జర్లాండ్ పర్యటన రద్దు చేసుకున్నారు. మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తుండడంతోనే చర్చలు ఆగాయని ఇరాన్ ప్రకటించింది. దీంతో మరోసారి చర్చలకు బ్రేక్ పడింది. ఇప్పటికే ఇరాన్–అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక 60 రోజుల ఒప్పందాన్ని కుదిరింది. ఈ కాలంలోనే శాంతి చర్చలు పూర్తి కావాల్సి ఉంటుంది. అయితే ఒప్పందం అమలు చేసే దశలో కీలకమైన ఈ భేటీ రద్దు కావడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.వైట్ హౌస్ ప్రకారం.. చర్చలను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు, సమన్వయం, ప్రయాణాలు, షెడ్యూల్ వంటి విషయాలు(లాజిస్టిక్స్) అనూహ్యంగా మారడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అలాగే అమెరికా అధికారులు మాత్రం ఈ ఒప్పందం ఇంకా పూర్తిగా రద్దు కాలేదని, భవిష్యత్తులో చర్చలు కొనసాగవచ్చని సంకేతాలు ఇచ్చారు. ఇదే సమయంలో ఇరాన్ మాత్రం అమెరికా ముందుగా ఒప్పందాన్ని అమలు చేయాలన్న స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చర్చలకు షరతులు విధిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కూడా అమెరికా అధిక డిమాండ్లు చేస్తే ఒప్పుకోబోమని హెచ్చరించారు.ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు వేలాది మంది మరణించగా, ఎనర్జీ ధరలు పెరిగి ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. తాజా ఒప్పందం కింద ఇరాన్‌కు ఆర్థిక ఆంక్షల సడలింపు, ఆస్తుల విడుదల వంటి అంశాలు ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ ఈ చర్చల్లో భాగం కాకపోవడం వివాదంగా మారింది.అదే సమయంలో లెబనాన్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. హెజ్బొల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కనీసం 16 మంది మరణించగా, పలు ప్రాంతాల్లో భీకర బాంబు దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్ మధ్య కూడా ఈ యుద్ధ విధానంపై అభిప్రాయ భేదాలు బయటపడుతున్నాయి. కొన్నిగంటల ముందు ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన ఈ యుద్ధ లక్ష్యాలు.. ఇరాన్ అణు సామర్థ్యాన్ని పూర్తిగా నిలిపివేయడం, ప్రాంతీయ దాడులను ఆపడం. అయితే ఈ రెండూ ఇప్పటివరకు పూర్తిగా సాధ్యం కాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. అయినప్పటికీ కొత్త ఒప్పందంలో ఆర్థిక సడలింపులు, పునర్నిర్మాణ నిధులు వంటి అంశాలు ఉండటం చర్చలకు కొత్త మలుపు ఇచ్చాయి.చర్చలు ప్రస్తుతానికి రద్దు కావడంతో మిడిల్ ఈస్ట్‌లో శాంతి ఆశలు మరోసారి అనిశ్చితిలో పడిపోయాయి. రాబోయే రోజుల్లో ఇరాన్–అమెరికా మళ్లీ చర్చల టేబుల్‌కి వస్తాయా? అనేది ప్రపంచ రాజకీయాల్లో కీలక ప్రశ్నగా మారింది. -
మొజ్తాబా ఖమేనీ సంచలన వ్యాఖ్యలు
అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తొలిసారి స్పందించారు. ఇరాన్ ప్రయోజనాలు, "రెసిస్టెన్స్ ఫ్రంట్" హక్కులు కాపాడతామనే హామీతోనే తాను ఈ ఒప్పందానికి అంగీకరించానని అన్నారాయన. ఈ క్రమంలోనే ట్రంప్ తీరుపైనా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా–ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరిన తర్వాత ప్రజలను ఉద్దేశించి విడుదల చేసిన సందేశంలో మొజ్తబా ఖమేనీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం కోసం తామేమీ ప్రయత్నించలేదని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే తీవ్రంగా ఆరాటపడ్డారని.. ఈ క్రమంలో "అన్ని రకాల ఒత్తిళ్లు, ఎత్తుగడలు" ఉపయోగించారని పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..తొలుత తాను ఈ ఒప్పందాన్ని సూత్రప్రాయంగా వ్యతిరేకించానని.. అయితే ఈ విషయంలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, జాతీయ భద్రతా మండలి సభ్యులు తనను ఒప్పించారని అన్నారు. ఇరాన్ ప్రయోజనాలు దెబ్బతినవని హామీ ఇవ్వడంతోనే ఆమోదం తెలిపినట్లు చెప్పారు. "ఈ ఒప్పందం కోసం ఇరాన్ అధికారులు నిజాయితీగా కృషి చేశారు. కానీ దీనిని సాధించేందుకు అన్ని రకాల ఒత్తిళ్లు ఉపయోగించిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడే. నిరాశతోనే ఈ డీల్‌ను ముందుకు తీసుకొచ్చాడు" అని ఖమేనీ వ్యాఖ్యానించారు.భవిష్యత్తులో అమెరికా ఒప్పంద పరిధిని దాటి అదనపు షరతులు విధించాలనుకుంటే వాటికి తాము లొంగబోమని అధ్యక్షుడు తనకు స్పష్టంగా చెప్పారని ఖమేనీ వెల్లడించారు. ఇరాన్ హక్కులు, స్వాతంత్ర్యం, గౌరవం విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. అలాగే భవిష్యత్తులో అమెరికాతో ముఖాముఖి చర్చలు జరగడం అంటే.. అమెరికా వైఖరిని అంగీకరించినట్లు కాదని కూడా ఆయన స్పష్టం చేశారు.ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు సంయుక్తంగా ఫిబ్రవరి 28వ తేదీన యుద్దం ప్రారంభించాయి. ఆ దాడుల్లో ఆనాడు ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఉన్న అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. అదే దాడిలో తీవ్రంగా గాయపడిన మొబ్తాబా ఖమేనీ.. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ మధ్యలో నాయకత్వ బాధ్యతలు ఇరాన్లో తీవ్ర చర్చలు జరిగాయి. చివరకు.. మత, భద్రతా వర్గాల మద్దతుతో మొజ్తాబానే కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యారు. తాజాగా అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.ఖమేనీకి మద్దతుగా విదేశాంగ మంత్రిఖమేనీ ప్రకటనతో.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఏకీభవించారు. సుప్రీం లీడర్ మార్గదర్శకాల ప్రకారమే చర్చలు కొనసాగుతాయని పేర్కొన్నారు. చర్చల తదుపరి దశలో దేశ ప్రయోజనాలు, గౌరవం, స్వాతంత్ర్యాన్ని కాపాడేందుకు తమ పూర్తి సామర్థ్యాన్ని వినియోగిస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే.. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముగించే ఒప్పంద తాలుకా ఎంవోయూపై ఇరు దేశాల అధినేతలు డిజిటల్ సంతకాలు చేశారు. ఒప్పందం కుదిరిన వెంటనే తొలి చర్యలు ప్రారంభమయ్యాయి. హర్ముజ్ జలసంధి పరిసరాల్లో అమలు చేస్తున్న సముద్ర నిర్బంధ చర్యలను అమెరికా సెంట్రల్ కమాండ్ నిలిపివేసింది. ఇకపై ఇరాన్ నౌకాశ్రయాలకు వచ్చీపోయే వాణిజ్య నౌకలపై ఆంక్షలు ఉండవని ప్రకటించింది.మరోవైపు హర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య రవాణాను పునరుద్ధరించేందుకు ఇరాన్ చర్యలు ప్రారంభించింది. వచ్చే 60 రోజుల పాటు నౌకలకు వేగవంతమైన అనుమతులు, జలసంధి రుసుముల మినహాయింపు కల్పిస్తామని వెల్లడించింది.ఒప్పందంలో అసలు ఏముంది?"ఇస్లామాబాద్ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్" పేరుతో కుదిరిన ఈ తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు సైనిక చర్యలను నిలిపివేయాలి. హర్ముజ్ జలసంధిలో సాధారణ రవాణా పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలి. అలాగే 60 రోజుల వ్యవధిలో పూర్తి స్థాయి శాంతి ఒప్పందం కోసం చర్చలు జరపాలి. ఆ చర్చల్లో ఆంక్షల ఎత్తివేత, ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఇక..ఇటు స్విట్జర్లాండ్‌లో జరగాల్సిన కీలక సమావేశం యథాతథంగా జరగనుంది. అమెరిరా, ఇరాన్‌తో పాటు పశ్చిమాసియా ప్రతినిధులు ఈ భేటీకి హాజరు కానున్నారు. అవగాహన ఒప్పందం అమలుతో పాటు తుది ఒప్పందం విధివిధానాలపై చర్చించే అవకాశం ఉంది. -
అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది: ఇరాన్
పశ్చిమాసియాలో నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలకు తెర పడింది. అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో కీలక అడుగు పడింది. డీల్‌కు సంబంధించిన అవగాహన ఒప్పందంపై అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇటు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంతకాలు చేశారు. దీంతో యుద్ధం అధికారికంగా ముగిసినట్లైంది. అయితే ఈ ఎంవోయూపై ఇప్పుడు ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. జీ7 సదస్సు అనంతరం పారిస్‌లోని వెర్సైల్స్ ప్యాలెస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ విందు ఇచ్చారు. దీనికి హాజరైన ట్రంప్ ఒప్పంద పత్రంపై(MoU) సంతకం చేసినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఇటు ఇరాన్ కూడా డీల్‌ను కన్ఫర్మ్ చేసింది. తమ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంతకం చేసినట్లు వెల్లడించింది. అయితే ఒప్పందం కుదరడం కంటే.. దాన్ని అమలు చేయడమే ఇప్పుడు అసలు పరీక్ష అని టెహ్రాన్ అంటోంది.ఇక ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయెల్ బఘాయ్ Esmaeil Baqaei మాట్లాడుతూ.. "ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం (Memorandum of Understanding)పై ఇరు దేశాధినేతల సంతకాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఒప్పందం అమలును పరీక్షించే సమయం వచ్చింది. ఇది ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి" అంటూ వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనను ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది."అమెరికా సంయుక్త రాష్ట్రాలు – ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం" పేరుతో రూపొందించిన ఈ పత్రంలో పలు కీలక అంశాలు ఉన్నాయి. లెబనాన్ సహా అన్ని రంగాల్లో సైనిక చర్యలను వెంటనే, శాశ్వతంగా నిలిపివేయాలని ఇందులో పేర్కొన్నారు.ఒప్పందం ప్రకారం అమెరికా 30 రోజుల్లో ఇరాన్‌పై అమలు చేస్తున్న నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలి. అదే సమయంలో యుద్ధానికి ముందు ఉన్న స్థాయిలో వాణిజ్య నౌకల రాకపోకలు పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలి. తుది ఒప్పందం కుదిరిన తర్వాత 30 రోజుల్లో ఇరాన్ సమీప ప్రాంతాల నుంచి అమెరికా బలగాలు వైదొలగాలని కూడా ఇందులో పేర్కొన్నారు.మరోవైపు, వాణిజ్య నౌకలకు 60 రోజుల పాటు ఎలాంటి రుసుము లేకుండా సురక్షిత ప్రయాణం కల్పించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తామని ఇరాన్ హామీ ఇచ్చింది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.సంతకాలు పూర్తవడంతో ఇకపై 60 రోజులపాటు అమెరికా–ఇరాన్ ప్రతినిధులు తుది ఒప్పందానికి సంబంధించిన నిబంధనలపై చర్చలు జరపనున్నారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే పశ్చిమాసియాలో దీర్ఘకాలిక స్థిరత్వానికి మార్గం సుగమం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికా–ఇరాన్ ఎంవోయూలో కీలక అంశాలులెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో అమల్లోకి కాల్పుల విరమణ60 రోజుల్లో తుది ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలుపరస్పర అంగీకారంతో గడువు పొడిగింపునకు అవకాశం30 రోజుల్లో ఇరాన్‌పై అమెరికా నౌకాదళ దిగ్బంధనానికి ముగింపుయుద్ధానికి ముందు స్థాయిలో నౌకల రాకపోకల పునరుద్ధరణతుది ఒప్పందం తర్వాత 30 రోజుల్లో ఇరాన్ సమీప ప్రాంతాల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ60 రోజుల పాటు వాణిజ్య నౌకలకు ఉచిత, సురక్షిత రాకపోకలకు ఇరాన్ హామీహర్ముజ్ జలసంధిలో నౌకాయానానికి ఎలాంటి రుసుములు లేకుండా ఏర్పాట్లుఅణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని ఇరాన్ అంగీకారంఐఏఈఏ పర్యవేక్షణలో యురేనియం(శుద్ధి చేసిన) నిర్వహణకు ఒప్పుకోలుఇరాన్ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధికి కనీసం 300 బిలియన్ డాలర్ల నిధి ఏర్పాటుఆ నిధిలో అమెరికాతో పాటు ప్రాంతీయ భాగస్వామ్య దేశాల భాగస్వామ్యంఇరాన్పై ఉన్న అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేయడానికి అమెరికా అంగీకారంఆంక్షల ఎత్తివేతకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ తుది ఒప్పందంలో ఖరారుఅయితే.. అధికారిక సంతకాల కార్యక్రమం మొదట స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరగాల్సి ఉన్నప్పటికీ, ఒప్పందంపై ఇప్పటికే డిజిటల్ సంతకాలు పూర్తయ్యాయని స్పష్టమవుతోంది. అయినప్పటికీ.. ఫిజికల్ సంతకాల కోసం జెనీవా సమావేశం యథావిధిగా కొనసాగవచ్చని ఇరాన్ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం జరగబోయే ఈ భేటీలో అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాల్గొంటుండగా.. ఇరాన్ నుంచి పార్లమెంట్ స్పీకర్ హాజరు కావొచ్చని తెలుస్తోంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన తర్వాత సుమారు 110 రోజుల పాటు కొనసాగిన ఘర్షణలకు ఈ ఒప్పందం ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే టెహ్రాన్ చెప్పినట్లే, ఒప్పందం కుదరడం ఒక దశ అయితే, దాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడమే అసలు సవాలుగా మారింది.ఇదీ చదవండి: ట్రంప్ సంతకం.. డీల్‌లో మ్యాటర్ ఏంటంటే.. -
పైసా ఇవ్వని అమెరికా.. ఇరాన్ డీల్‌లో మెగా ట్విస్ట్
ఇరాన్–అమెరికా మధ్య శాంతి చర్చలు దేని కోసం అన్న ప్రశ్నకు అణు ఒప్పందం, హర్ముజ్ జలసంధి వంటి అంశాల చుట్టూ భిన్న భిన్న వెర్షన్లు వినిపిస్తున్నాయి. డీల్‌లో అసలు ఏముంది అన్నదానిపై స్పష్టత లేకపోయినా, ఒక్కో వర్గం ఒక్కో కోణాన్ని ప్రధానంగా చూపిస్తోంది. ఇక ఈ మొత్తం సమీకరణాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తున్న పదం మాత్రం ఇప్పుడు చర్చల్లో బలంగా వినిపిస్తోంది… అదే మెగా డీల్.ఇరాన్–అమెరికా మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలు కేవలం రాజకీయ ఒప్పందాలకే పరిమితం కావడం లేదు. అణు కార్యక్రమంపై నియంత్రణలు, ఆంక్షల ఎత్తివేత, అలాగే ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి అంశాలు ఈ డీల్‌లో ప్రధాన భాగాలుగా కనిపిస్తున్నాయి. ఈ రెండు అంశాలు భౌగోళిక రాజకీయాల కోణంలో అత్యంత కీలకమైనవిగా పరిగణించబడుతున్నాయి. హర్ముజ్ జలసంధి విషయానికి వస్తే, ఇది ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాకు అత్యంత కీలక మార్గం. ఈ మార్గంపై స్థిరత్వం లేకపోతే గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లు నేరుగా ప్రభావితమవుతాయి. అందుకే శాంతి ఒప్పందంలో దీనిపై ప్రత్యేక అంగీకారాలు అవసరమవుతున్నాయి. అదే సమయంలో ఇరాన్ అణు కార్యక్రమం కూడా ఈ చర్చల కేంద్రబిందువుగా కొనసాగుతోంది.అయితే ఈ రెండు కీలక అంశాల మధ్య ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది ఆర్థిక ప్యాకేజీ. సుమారు 300 బిలియన్ డాలర్ల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మొత్తం ఈ చర్చను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇరాన్-యూఎస్ పీస్ ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్లో భాగంగా ప్రతిపాదించిన ఈ ఫండ్.. యుద్ధానంతర పునర్నిర్మాణం కోసం రూపొందించిన భారీ ఆర్థిక ప్యాకేజీగా భావిస్తున్నారు.రాయిటర్స్ కథనం ప్రకారం.. ఈ ఫండ్ పూర్తిగా ప్రైవేట్ పెట్టుబడులతోనే నడుస్తుంది. అమెరికా ప్రభుత్వం నుంచి పైసా సాయం ఉండదు. అయితే.. ఇప్పటికే సుమారు 150 బిలియన్ డాలర్లకు పైగా కమిట్మెంట్లు వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా, గల్ఫ్ దేశాలు, ఆసియా, యూరప్, ఆఫ్రికా ప్రాంతాలకు చెందిన కంపెనీలు ఇందులో భాగస్వామ్యం కానున్నాయి. ఈ ఫండ్ ప్రధాన లక్ష్యం యుద్ధం వల్ల దెబ్బతిన్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థను తిరిగి నిలబెట్టడమట. ఎనర్జీ, రవాణా, లాజిస్టిక్స్, పరిశ్రమలు వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు తీసుకురావడం ద్వారా దేశాన్ని మళ్లీ గ్లోబల్ ఎకానమీకి కలపడం దీని ఉద్దేశమని ఆ కథనం పేర్కొంది. ముఖ్యంగా ఈ ఆర్థిక ప్యాకేజీని అణు ఒప్పంద చర్చలు, అలాగే హర్ముజ్ జలసంధి అంశం నుండి వేరుగా ఉంచినట్లు సమాచారం. అంటే ఒక వైపు రాజకీయ భద్రతా ఒప్పందాలు కొనసాగుతుండగా, మరోవైపు ఈ ఫండ్ పూర్తిగా ఆర్థిక ట్రాక్‌లో ముందుకు వెళ్లనుందన్నమాట.ఇరాన్ మొదట యుద్ధ నష్టాలకు 400 బిలియన్ డాలర్ల పరిహారం కోరినప్పటికీ.. అమెరికా ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. దాంతో ప్రత్యామ్నాయంగా ఈ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఆలోచన ముందుకు వచ్చింది. ఈ మార్పే ఇప్పుడు ఈ డీల్‌ను పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్తోందనే విశ్లేషణ నడుస్తోంది.విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. హర్ముజ్ జలసంధి భద్రత, అణు ఒప్పందం రాజకీయ స్థిరత్వాన్ని నిర్ణయిస్తే… ఈ 300 బిలియన్ డాలర్ల ఫండ్ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే గేమ్‌చేంజర్‌గా మారే అవకాశం ఉంది. అంటే ఒకవైపు వ్యూహాత్మక భద్రత, మరోవైపు ఆర్థిక జాక్‌పాట్ – రెండూ ఈ డీల్‌ను నడిపిస్తున్న రెండు ఇంజిన్లలా భావిస్తున్నారు. -
డీల్‌పై ట్రంప్ ఒక మాట.. ఇరాన్ మరో మాట!
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించుతూ.. తమ మధ్య ఓ కీలక అవగాహన ఒప్పందం కుదిరినట్టు అమెరికా–ఇరాన్‌లు ప్రకటించాయి. అయితే ఈ ఒప్పందంలో నిజంగా ఏముంది? ప్రచారంలో వినిపిస్తున్నట్లుగా 14 ప్రతిపాదనల ప్యాకేజీ నిజమేనా? అణు కార్యక్రమంపై ఇరాన్ ఎలాంటి హామీలు ఇచ్చింది? ఈ చర్చల్లో అమెరికా ఎక్కడైనా వెనక్కి తగ్గిందా? ఇరాన్ నిజంగానే అణ్వస్త్రాల అభివృద్ధికి శాశ్వతంగా స్వస్తి చెప్పిందా?.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలతో అంతర్జాతీయ సమాజంలో మరింత గందరగోళం నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. ‘‘ఇరాన్ ఎప్పటికీ అణ్వస్త్రాలను కలిగి ఉండబోదని అంగీకరించింది. ఈ మేరకు స్పష్టమైన హామీని కూడా ఇచ్చింది’’ అని అన్నారాయన. అలాగే గత కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్న ఆర్థిక ప్యాకేజీ ఊహాగానాలకు ఆయన చెక్ పెట్టారు. ‘‘అమెరికా ఇరాన్‌కు 300 మిలియన్ డాలర్లు చెల్లిస్తోందన్న వార్త పూర్తిగా అబద్ధం" అని స్పష్టం చేశారాయన. అయితే ఇరాన్ మాత్రం పాత పాటే పాడింది. అవును.. మేం అణ్వాస్త్రాలు వదిలేశాం అని చెప్పడం లేదు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ స్పందిస్తూ.. ప్రాథమిక అవగాహన ఒప్పందాన్ని "ఒక ముఖ్యమైన ముందడుగు"గా అభివర్ణించినప్పటికీ తుది ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేశారు. అలాగే ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధులు కూడా ‘‘చర్చలు ముందుకు వెళ్తున్నాయి.. కీలక పురోగతి చోటు చేసుకుంది.. ముసాయిదా ఒప్పందాలు ఉన్నాయి’’అని చెబుతున్నారే తప్ప.. తుది నిర్ణయం తీసుకున్నట్లు ఎక్కడా చెప్పడం లేదు. దీంతో అణు కార్యక్రమానికి సంబంధించిన పూర్తి నిబంధనలు, ఆంక్షల సడలింపు వంటి కీలక అంశాలు ఇంకా చర్చల దశలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. అలాగే ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య కుదిరింది పూర్తి శాంతి ఒప్పందం కాదు. ఇరు దేశాలు ఒక ప్రాథమిక అవగాహన ఒప్పందం (MoU)పై అంగీకరించాయి. అదీ నెలల తరబడి జరిగిన చర్చల తర్వాతే. అయితే ఖతార్ సమక్షంలో ఎంవోయూపై డిజిటల్ సంతకాలు కూడా పూర్తయ్యాయని అమెరికా అధికారులు చెబుతున్నారు. తుది సంతకాల కార్యక్రమం మాత్రం ఈ వారం(19న) జెనీవా( స్విట్జర్లాండ్)లో జరగనుంది. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరయ్యే అవకాశం ఉంది. ట్రంప్ హాజరుపై స్పష్టత లేదు.ఈ అవగాహన ఒప్పందంలో అత్యంత కీలక అంశం హర్ముజ్ జలసంధి పునఃప్రారంభం. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం మళ్లీ పూర్తిస్థాయిలో తెరుచుకుంటే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లకు ఊరట లభించనుంది. ఇప్పటికే చమురు ధరలపై ఒత్తిడి తగ్గినట్లు అంతర్జాతీయ మార్కెట్ల కదలికలు చెబుతున్నాయి.అలాగే ఇరాన్‌పై విధించిన కొన్ని ఆంక్షల సడలింపుపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇరాన్‌కు నేరుగా నగదు బదిలీ చేయబోమని జేడీ వాన్స్ స్పష్టం చేశారు. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తగ్గించడం, అంతర్జాతీయ తనిఖీలకు అంగీకరించడం వంటి షరతులు నెరవేర్చిన తర్వాతే ఆంక్షల సడలింపు అమల్లోకి వస్తుందని ఆయన చెబుతున్నారు.ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ట్రంప్ "ఇరాన్ అణ్వస్త్రాలు కలిగి ఉండదు" అని ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు బయటకు వచ్చిన వివరాల ప్రకారం అణు కార్యక్రమానికి సంబంధించిన పూర్తి నిబంధనలు ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుత అవగాహన ఒప్పందం కేవలం చర్చలకు మార్గం సుగమం చేసే ఫ్రేమ్‌వర్క్ మాత్రమేనని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అణు కార్యక్రమం, యురేనియం నిల్వలు, ఆంక్షల పూర్తి ఎత్తివేత వంటి అంశాలపై తదుపరి చర్చలు జరగాల్సి ఉంది.లేటెస్ట్ అప్డేట్స్:* అమెరికా, ఇరాన్ మధ్య ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదిరింది.* జెనీవాలో ఈ వారం తుది సంతకాల కార్యక్రమం జరగనుంది.* హర్ముజ్ జలసంధి పూర్తిస్థాయిలో తెరుచుకునే అవకాశం ఉంది. * ఇరాన్‌కు 300 మిలియన్ డాలర్లు చెల్లిస్తున్నారన్న వార్తలను ట్రంప్ ఖండించారు. * అణు కార్యక్రమంపై తుది ఒప్పందం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ట్రంప్ దీనిని చారిత్రాత్మక విజయంగా ప్రచారం చేస్తున్నప్పటికీ.. అసలు పరీక్ష ఇప్పుడు మొదలయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ నిజంగానే అణ్వస్త్రాల దిశగా అడుగులు ఆపుతుందా? అమెరికా వాగ్దానం చేసిన ఆంక్షల సడలింపు ఎంతవరకు అమలవుతుంది? జెనీవా సమావేశం తర్వాతే దీనిపై పూర్తి స్పష్టత రానుంది. -
అమెరికా–ఇరాన్ ఒప్పందంపై స్పందించిన మోదీ
పశ్చిమాసియాలో నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా అమెరికా–ఇరాన్ మధ్య అవగాహన కుదిరింది. ఇరు దేశాలు కాల్పుల విరమణ పాటిస్తూ.. శాంతి ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించాయి. ఈ పరిణామాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఆయన ఓ పోస్ట్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. పశ్చిమాసియాలో జరిగిన ఈ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపిందని, అనేక దేశాల్లో ప్రాణనష్టం కూడా జరిగిందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం అమలైతే ప్రాంతంలో శాంతి, స్థిరత్వం పునరుద్ధరించడమే కాకుండా ప్రపంచ వాణిజ్య మార్గాలకు ఊరట లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. “పశ్చిమాసియాలో జరిగిన ఘర్షణను ముగించేందుకు అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన అవగాహనను నేను స్వాగతిస్తున్నాను. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అంతరాయాలను కలిగించింది, అనేక దేశాల్లో ప్రాణనష్టానికి కారణమైంది. ఈ ఒప్పందం అమలైతే ప్రాంతంలో శాంతి, స్థిరత్వం పునరుద్ధరించబడుతుంది. కీలక సముద్ర మార్గాల ద్వారా వాణిజ్యం సజావుగా కొనసాగుతుంది. ఈ అవగాహన అమలు పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వాన్ని తీసుకురావడమే కాకుండా వాణిజ్య నౌకా మార్గాల్లో స్వేచ్ఛాయుత రవాణాను నిర్ధారిస్తుందని మేము ఆశిస్తున్నాం అని ప్రధాని మోదీ తెలిపారు. మిగిలిన అంశాలపై.. అమెరికా–ఇరాన్ మధ్య జరిగే చర్చలు స్థిరమైన, దీర్ఘకాలిక ఒప్పందానికి దారితీయాలని కూడా మోదీ ఆకాంక్షించారు.I welcome the understanding reached between the United States and Iran on ending the conflict in West Asia, which has caused serious economic disruption across the world and led to loss of life in many countries. India hopes that the implementation of this understanding will…— Narendra Modi (@narendramodi) June 15, 2026ప్రస్తుతం మోదీ స్లోవేకియా పర్యటనలో ఉన్నారు. 1993 తర్వాత ఆ దేశంలో పర్యటిస్తున్న భారత ప్రధాని ఆయనే కావడం గమనార్హం. ఫ్రాన్స్ నుంచి అక్కడికి వెళ్లిన ఆయనకు.. వందేమాతరంతో ఘన స్వాగతం లభించింది.ఇక.. ఇరాన్-అమెరికా డీల్‌కు సంబంధించి కొన్ని మీడియా సంస్థల నివేదికల ప్రకారం.. ఈ ఫ్రేమ్‌వర్క్‌లో కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. హర్ముజ్ జలసంధి ద్వారా నౌకా రవాణా పునరుద్ధరణ, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు తిరిగి ప్రారంభం, తాత్కాలిక ఆంక్షల సడలింపు, అలాగే ఇరాన్‌కు నిలిచిపోయిన ఆస్తుల విడుదల వంటి అంశాలు ఇందులో భాగమని తెలుస్తోంది. హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గం కావడంతో.. ఈ ఒప్పందం భారత్ వంటి దేశాలకు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్‌కు, ఈ మార్గంలో ఉద్రిక్తతలు తగ్గితే ఇంధన ధరల ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ప్రమాదంలో ఇరాన్–అమెరికా డీల్?!
పశ్చిమాసియా సంక్షోభం మరో కీలక మలుపు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. యుద్ధం ముగిసిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలోనే ఇజ్రాయెల్ వైఖరి కొత్త ఉద్రిక్తతలకు దారితీసింది. భద్రతా విషయంలో తగ్గేదేలే అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెబుతుండడం.. లెబనాన్‌పై కొనసాగుతున్న భీకర దాడులు శాంతి చర్చలపై తీవ్ర ప్రభావం చూపొచ్చన్న ఆందోళనలు పెంచుతున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య నెలల తరబడి సాగిన శాంతి చర్చలు తుది దశకు చేరుకుంటున్న సమయంలోనే మిడిల్ఈస్ట్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. డీల్‌కు ససేమీరా చెబుతూ.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ చర్యలకు దిగింది. లెబనాన్ రాజధాని బీరూట్‌తో పాటు దక్షిణ ప్రాంతాల్లో డ్రోన్ దాడులు జరిగినట్లు లెబనాన్ మీడియా తెలిపింది. కఫర్ టెబ్నిట్ ప్రాంతంలో కూడా డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. ఆదివారం హెజ్బొల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇవి జనావాసాలను కూడా ప్రభావితం చేస్తున్నాయని లెబనాన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ, అంతర్జాతీయ జోక్యం కోరుతున్నారు. డీల్ కుదిరిందని ట్రంప్ ప్రకటించిన వేళ.. ఇజ్రాయెల్ వైపు నుంచి మరింత కఠిన వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. ‘‘ట్రంప్ నిర్ణయాలు మమ్మల్ని ప్రభావితం చేయలేవు. లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తాం. భద్రతా విషయంలో రాజీ పడేది లేదు’’ అని నెతన్యాహు చెప్పినట్లు అంతర్జాతీయా మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. ఇక ట్రంప్ కుదిర్చిన ఒప్పందం తమను కట్టిపడేయదని ఇజ్రాయెల్ మంత్రి ఇత్మార్ బెన్ గ్విర్ వ్యాఖ్యానించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. “భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు” అనే సందేశాన్ని ఇజ్రాయెల్ స్పష్టంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ, ప్రధాని నెతన్యాహుతో కలిసి తాము స్పష్టమైన భద్రతా విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. లెబనాన్, సిరియా, గాజా ప్రాంతాల్లో భద్రతా జోన్లలో ఇజ్రాయెల్ సైన్యం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఒత్తిడులున్నప్పటికీ తమ వైఖరిలో మార్పు ఉండదని, దేశ భద్రతే ప్రధాన ప్రాధాన్యమని ఆయన తేల్చిచెప్పారు. లెబనాన్ పరిణామాల కారణంగా ఇరాన్ దాడి చేస్తే తక్షణ ప్రతిచర్య తప్పదని ఆయన హెచ్చరించారు.🔴 Israel’s Defense Minister Israel Katz says that along with Prime Minister Benjamin Netanyahu, he is leading a clear policy that states that the Israeli army will remain in the security zones in Lebanon, Syria and Gaza🔴 Katz says that Israel opposes the Israeli army’s… pic.twitter.com/dYPahEDsTE— Al Arabiya English (@AlArabiya_Eng) June 15, 2026అంతకు ముందు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ‘ది న్యూయార్క్ టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, నెతన్యాహు చాలా కఠినమైన నాయకుడని, ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు శాంతి చర్చలను క్లిష్టం చేశాయని వ్యాఖ్యానించారు. బీరూట్ ఘటనలు అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రతికూల ప్రభావం చూపినట్లు కూడా ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తం పరిణామాలను చూస్తే, ఒకవైపు అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఆశలు కొనసాగుతున్నప్పటికీ, మరోవైపు లెబనాన్ కేంద్రంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ చర్యలు ఆ ప్రక్రియకు ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ గనుక ఈ దాడులకు ప్రతిస్పందిస్తే.. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు మళ్లీ ప్రమాదంలో పడిన పరిస్థితి నెలకొంది. -
ముగిసిన ఇరాన్-అమెరికా యుద్ధం
పశ్చిమాసియా సంక్షోభానికి ఎట్టకేలకు తెర పడింది. మూడు నెలలుగా జరుగుతున్న ఇరాన్-అమెరికా యుద్దం ముగిసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు.. ఇటు ఇరాన్ జాతీయ భద్రతా మండలి కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. దీంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.లెబనాన్ సహా అన్ని సరిహద్దు ఫ్రంట్లలో తక్షణమే సైనిక చర్యలు నిలిపివేయాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి. ఈ అంగీకారంతో 60 రోజులపాటు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రానుంది. ఈ కాలంలో ఇరు దేశాలు మరిన్ని శాంతి చర్చలు నిర్వహించి దీర్ఘకాలిక పరిష్కారానికి మార్గం సుగమం చేయనున్నాయి. అయితే ఈ డీల్ తాలుకా మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఖతార్ మధ్యవర్తిత్వంతోనే ఈ ఒప్పందం ఖరారైనట్లు తెలుస్తోంది. డీల్ కుదిరిన నేపథ్యంలో.. ఇరాన్ ఓడరేవులపై విధించిన నౌకా దళ దిగ్భంధనం తక్షణమే రద్దు కానుంది. శాంతి ఒప్పందం పూర్తైందని.. ఇరాన్‌పై ఆంక్షలను తక్షణమే ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. హర్ముజ్‌ను వెంటనే తెరవాలంటూ సోషల్ మీడియాలో ఆయనో పోస్ట్ చేశారు. ప్రపంచంలోని నౌకలు హర్ముజ్‌లో ఇంజిన్లు ప్రారంభించాలని.. తమ ప్రయాణాలను తిరిగి ప్రారంభించాలని.. చమురు సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి రావాలని ట్రంప్ పేర్కొన్నారు.ఇటు ఇరాన్ తరఫున ఆ దేశ సుప్రీం మోజ్తబా ఖమేనీ మార్గదర్శకత్వంలో డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. చర్చలను విజయవంతం చేసిన ఖతార్‌కు ఇరు వర్గాలు కృతజ్ఞతలు తెలియజేశాయి. పాకిస్తాన్ కూడా ఈ పరిణామాన్ని స్వాగతించింది. ఇరు దేశాలకు అభినందనలు తెలిపింది. ఈ నెల 19న స్విట్జర్లాండ్‌లో అమెరికా-ఇరాన్ ప్రతినిధులు అధికారిక శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. ట్రంప్ పుట్టినరోజు సమయంలోనే(జూన్ 14) డీల్ కుదరడం విశేషమంటూ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వ్యాఖ్యానించారు. భారీ మూల్యం అయితే ఈ మూడు నెలల యుద్ధం ఇరు దేశాలనే కాదు.. పలు దేశాల్ని సైతం భారీ మూల్యం చెల్లించుకునేలా చేసింది. అమెరికా వైమానిక దాడులు, క్షిపణి దాడులతో ఇరాన్‌లోని పలు సైనిక స్థావరాలు, చమురు నిల్వ కేంద్రాలు, కీలక మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హర్ముజ్‌లో అమెరికా బ్లాకేడ్ వల్ల వాణిజ్య నౌకలు ఆగిపోయాయి. మరోవైపు ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్ల దాడుల కారణంగా అమెరికా సైనిక స్థావరాలు, ఆయుధ సంపత్తి నాశనం అయ్యాయి. ఇరువైపులా తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది.యుద్ధ ప్రభావంతో పశ్చిమాసియాలోని అనేక ప్రాంతాల్లో సాధారణ జీవనం అస్తవ్యస్తమైంది. వేలాది మంది ప్రజలు తమ నివాస ప్రాంతాలను విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ ఇంధన మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. హర్ముజ్ జలసంధి మూతపడే ప్రమాదం నెలకొనడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. సముద్ర రవాణా వ్యయాలు పెరగడంతో.. ప్రపంచ వాణిజ్యంపై కూడా ప్రభావం పడింది. ప్రాంతీయ భద్రత, అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరా వ్యవస్థలపై ఈ యుద్ధం తీవ్ర ప్రభావం చూపిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
యుద్ధానికి ముగింపు? కీలక ప్రకటన చేసిన ఇరాన్!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు దారితీసిన అమెరికా-ఇరాన్ ఘర్షణ ముగింపుకు చేరువైనట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండు దేశాల మధ్య ప్రాథమిక ఒప్పందం కుదిరే దశకు చేరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇప్పటిదాకా ట్రంప్ ప్రకటనలను ఖండిస్తూ వచ్చిన ఇరాన్.. ఈసారి కాస్త సానుకూలంగానే స్పందించింది. ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేసిన హర్ముజ్ జలసంధి మళ్లీ తెరుచుకోనున్న నేపథ్యంలో.. అసలు ఈ ఒప్పందంలో ఏం ఉండబోతోంది? యుద్ధం ముగిస్తే ఎవరు గెలిచినట్లు?.. అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ విరమణకు సంబంధించిన అవగాహన ఒప్పందం (MoU) ముసాయిదాపై ఇరు పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా పరిపాలనలోని ఓ సీనియర్ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. వచ్చే కొద్ది రోజుల్లో తొలి ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్ కూడా చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ దాదాపు ఖరారైందని ప్రకటించింది.ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. చర్చలు తుది దశకు చేరాయని అన్నారు. "అమెరికాతో ఒప్పందం ఇంత దగ్గరగా ఎప్పుడూ రాలేదు" అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆ పోస్టును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా వేదికలో షేర్ చేయడం చర్చనీయాంశమైంది. అదే సమయంలో.. ట్రంప్ మరో ట్విస్ట్ ఇచ్చారు.ఇరాన్ మీడియా ప్రచురించిన 14 అంశాల అవగాహన ఒప్పందం వివరాలను ట్రంప్ ఖండించారు. ఇటు అసలు షరతులపై ఊహాగానాలు చేయొద్దని అరాఖ్చీ మీడియాను కోరారు. చర్చలు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు ఈ యుద్ధంలో తామే గెలిచినట్లు ఇరాన్ ప్రకటించుకోవడం.. ఈ మొత్తం ఎపిసోడ్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.అదే కీలకంఈ ప్రతిపాదిత ఒప్పందంలో.. అత్యంత కీలక అంశంగా హర్ముజ్ జలసంధి ఉండబోతోందని తెలుస్తోంది. ప్రపంచ చమురు, సహజవాయు సరఫరాల్లో దాదాపు ఐదో వంతు ఈ మార్గం గుండా రవాణా అవుతుంది. యుద్ధం తర్వాత ఇరాన్ మూసివేసిన ఈ జలసంధిని మళ్లీ తెరవడానికి అంగీకరించినట్లు సమాచారం. ప్రతిగా అమెరికా ఇరాన్‌పై విధించిన కొన్ని ఆర్థిక ఆంక్షలను సడలించడంతో పాటు, నిలిపివేసిన బిలియన్ల డాలర్ల ఆస్తులను విడదీయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.అణు ఒప్పందం.. ఆగాల్సిందే!అయితే అణు కార్యక్రమం అంశం మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు. 60 రోజులపాటు ప్రత్యేక చర్చలు జరిపి దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఒప్పందంలో ప్రతిపాదించినట్లు సమాచారం. అమెరికా వాదన ప్రకారం ఇరాన్ అధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తొలగించి, అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాల్సి ఉంటుంది. కానీ ఇరాన్ మాత్రం యురేనియాన్ని పూర్తిగా వదులుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. దాన్ని తక్కువ శుద్ధి స్థాయికి మార్చే (డౌన్బ్లెండింగ్) మార్గానికే తాము సిద్ధమని అరాఖ్చీ ఓ అంతర్జాతీయ మీడియా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం గమనార్హం.ఈ ఒప్పందంలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. యుద్ధ నష్టాలకు పరిహారం, అలాగే ఇరాన్ క్షిపణి కార్యక్రమంపై అమెరికా చాలా కాలంగా చేస్తున్న డిమాండ్లను పక్కన పెట్టే అవకాశాలపై కూడా చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే అమెరికా అధికారులు ఈ అంశాలను ఖండిస్తున్నారు.ఇది ఇంకో ట్విస్ట్ఇక ఈ చర్చల్లో ఇజ్రాయెల్ భాగస్వామి కాకపోవడం మరో కీలక పరిణామం. అమెరికాతో కలిసి ఇరాన్‌పై సైనిక చర్యలకు దిగిన ఇజ్రాయెల్.. తుది ఒప్పందంలో భాగం కాదని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే లెబనాన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ వైదొలుగుతుందని ఇరాన్ కోరుతున్నప్పటికీ, ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాత్రం అలాంటి ఆలోచన లేదని ప్రకటించింది.ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. చమురు సరఫరాలపై భయాలు తగ్గడంతో బ్రెంట్ క్రూడ్ ధరలు రెండు నెలల కనిష్ఠానికి చేరాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లు కూడా లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఒప్పందం తన ప్రధాన లక్ష్యాలను నెరవేర్చిందని చెబుతున్నప్పటికీ, ఒప్పంద నిబంధనలు ఇరాన్‌కు ఎక్కువ ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు “యుద్ధంలో విజేత ఇరానే” అని టెహ్రాన్ ప్రకటించడం ఈ ఒప్పందం చుట్టూ మరింత రాజకీయ ఆసక్తిని పెంచుతోంది.ప్రస్తుతం ప్రపంచ దృష్టంతా ఒక్క విషయంపైనే ఉంది. నిజంగానే యుద్ధానికి ముగింపు పలికే చారిత్రాత్మక ఒప్పందం కుదురుతుందా? లేదంటే చివరి క్షణంలో మళ్లీ కొత్త మలుపులు తిరుగుతుందా?.. -
ట్రంప్ హామీ.. డీల్ కుదిరిందా? లేదంటే మరో ట్విస్ట్ తప్పదా??
మూడునెలలుగా యుద్ధ జ్వాలల్లో చిక్కుకున్న పశ్చిమాసియా ఒక్కసారిగా ఆశల వైపు చూస్తోంది. ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేసిన ఘర్షణకు ముగింపు దగ్గరపడిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. అయితే అదే సమయంలో ఇరాన్ నుంచి వచ్చిన స్పందన కొత్త సందేహాలకు తావిచ్చింది. నిజంగానే శాంతి ఒప్పందం కుదిరిందా? లేదంటే ఇంకా చివరి అడ్డంకులు మిగిలే ఉన్నాయా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది.ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసిన అమెరికా-ఇరాన్ యుద్ధం ముగింపు దశకు చేరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ వారాంతంలోనే రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. "ఇరాన్‌తో యుద్ధానికి అద్భుతమైన పరిష్కారం దొరికింది. కొన్ని పత్రాలపై తుది సంతకాలు మాత్రమే మిగిలి ఉన్నాయి" అని చెప్పారు.ఒప్పందంపై సంతకాలు యూరప్‌లో జరగవచ్చని, అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాల్గొనే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి తిరిగి పూర్తిస్థాయిలో తెరుచుకుంటుందని కూడా ఆయన ప్రకటించారు.అయితే ట్రంప్ ప్రకటనకు భిన్నంగా ఇరాన్ స్పందించింది. ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ.. చర్చల ముసాయిదాలో చాలా భాగం పూర్తయిన మాట వాస్తవమేనని, కానీ ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఒప్పంద ప్రతిపాదన ప్రస్తుతం దేశంలోని కీలక నిర్ణయాధికార సంస్థల పరిశీలనలో ఉందన్నారు. అమెరికా చర్చల మధ్యలో కొత్త డిమాండ్లు తెరపైకి తెస్తోందని ఆరోపించిన ఆయన.. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తన "రెడ్‌లైన్స్"ను దాటదని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యాఖ్యల మర్మం ఏంటన్నదానిపై కుతూహలం నెలకొంది.ఇక ఈ ఒప్పందంలో అత్యంత కీలక అంశం ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమమే. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోదని, కొనుగోలు చేయబోదని అంగీకరించిందని ట్రంప్ ప్రకటించారు. ఇదే మొత్తం చర్చల ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్ మాత్రం తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత అవసరాల కోసమేనని గతంలాగే పునరుద్ఘాటిస్తోంది.అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్‌పై సంయుక్త దాడులతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు మొదలయ్యాయి. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి చివరి వారంనుంచి ఇప్పటివరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఇరాన్, లెబనాన్‌లో భారీ నష్టం సంభవించింది. చమురు ధరలు విపరీతంగా పెరగడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఆ తర్వాత కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ.. పరస్పర దాడులు కొనసాగించాయి. అమెరికా అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేసిన ఘటన తర్వాత హర్ముజ్ ప్రాంతంలో అమెరికా కొత్త దాడులు జరిపింది. మరోవైపు ఇరాన్ కూడా అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది.ఇదిలా ఉండగా, ఒప్పందానికి ఇరాన్ అత్యున్నత నాయకత్వం కూడా అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆమోదం తెలిపారని తనకు సమాచారం ఉందన్నారు. అలాగే ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ సహా పశ్చిమాసియాలోని పలు దేశాలు ఈ ఒప్పందానికి మద్దతు తెలిపాయని చెప్పారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కార్యాలయం మాత్రం ఈ అవగాహన ఒప్పందంలో తాము భాగస్వాములు కాదని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఇరాన్ అణు సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా ఒప్పందం ఉండాలని ట్రంప్‌కు నెతన్యాహూ సూచించినట్లు వెల్లడించింది.మొత్తంగా చూస్తే.. ట్రంప్ "డీల్ దాదాపు ఖరారైంది" అంటుండగా, ఇరాన్ "ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు" అంటోంది. నిజంగానే ఈ వారాంతంలో శాంతి ఒప్పందం కుదిరి యుద్ధానికి తెరపడుతుందా? లేదంటే చివరి క్షణంలో మరోసారి ఉద్రిక్తతలు రాజుకుంటాయా? అని ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. -
ప్రపంచ దేశాలకు షాకిచ్చిన ఇరాన్
ప్రపంచదేశాలకు ఇరాన్ మరోసారి పెద్ద షాక్ ఇచ్చింది. హర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా తాజా వైమానిక దాడులకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ ప్రకటించింది. ఇకపై చమురు ట్యాంకర్లు, సరుకు రవాణా నౌకలు, వాణిజ్య నౌకలు సహా ఏ దేశానికి చెందిన ఓడకూ హర్ముజ్ మార్గంలో ప్రయాణానికి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. ఇరాన్ హెచ్చరికలు ఇంతటితో ఆగలేదు.నిషేధాన్ని ఉల్లంఘించి ఎవరైనా హర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే క్షిపణులు, నౌకాదళ బలగాలతో లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేస్తామని ఇరాన్ సైనికాధికారులు ప్రకటించారు. ఈ ప్రకటనతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇటు అంతర్జాతీయంగానూ తీవ్ర ఆందోళన నెలకొంది.హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలక మార్గం. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో తరలించే చమురు, సహజ వాయువులో దాదాపు 20 శాతం ఈ జలసంధి ద్వారానే గమ్యస్థానాలకు చేరుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యూఏఈ, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల ఇంధన ఎగుమతులకు ఇదే ప్రధాన మార్గం. అందుకే హర్ముజ్ మూసివేత ప్రపంచ ఇంధన మార్కెట్లకు భారీ షాక్‌గా మారింది.ఇరాన్ ప్రకటన వెలువడగానే అంతర్జాతీయ చమురు మార్కెట్లు కుదేలయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక్కసారిగా బ్యారెల్‌కు రెండు డాలర్లకుపైగా పెరిగాయి. సరఫరా సంక్షోభం మరింత తీవ్రమైతే ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ఇంధన విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.మరోవైపు, అమెరికా మాత్రం పరిస్థితి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని చెబుతోంది. కొన్ని వాణిజ్య నౌకలు ఇప్పటికీ ప్రాంతంలో ప్రయాణిస్తున్నాయని, తమ యుద్ధనౌకలపై ఎలాంటి దాడులు జరగలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అయితే ఇరాన్ హెచ్చరికలతో అనేక నౌకా సంస్థలు ఇప్పటికే తమ ప్రయాణాలను నిలిపివేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.ఈ పరిణామాలతో ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చమురు ధరల పెరుగుదలతో పాటు రవాణా వ్యయాలు, ద్రవ్యోల్బణం, ఇంధన సంక్షోభం మళ్లీ తలెత్తే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా–ఇరాన్ ఘర్షణ మరింత ముదిరితే హర్ముజ్ జలసంధి అంశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపే కీలక సంక్షోభంగా మారే అవకాశం కనిపిస్తోంది. -
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. చర్చల ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని ఆరోపిస్తూ ఇరాన్‌పై అమెరికా భీకర దాడులకు దిగింది. దీంతో కాల్పుల విరమణ నామమాత్రంగానే మిగిలి.. పరిస్థితి మళ్లీ యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తోంది. ఇక హర్ముజ్ జలసంధి నుంచి గల్ఫ్ దేశాల వరకు యుద్ధ మేఘాలు కమ్ముకుంటుండటంతో ప్రపంచం ఉత్కంఠగా పరిణామాలను గమనిస్తోంది.అమెరికా బలగాలు తాజాగా దక్షిణ ఇరాన్‌లోని పలు కీలక స్థావరాలపై వరుసగా రెండో రోజు భారీ వైమానిక దాడులు నిర్వహించాయి. ముఖ్యంగా హర్ముజ్ జలసంధికి సమీపంలోని వ్యూహాత్మక ప్రాంతాలు, రాడార్ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, సైనిక మౌలిక సదుపాయాలే ప్రధాన లక్ష్యాలుగా చేసుకున్నాయి. ఈ దాడుల్ని అమెరికా స్వీయ రక్షణ దాడులుగా అభివర్ణించడం గమనార్హం. తాజా దాడుల్లో హర్మోజ్గాన్ ప్రావిన్స్‌లోని సిరిక్, మినాబ్, ఖేష్మ్ (Qeshm) దీవి, జాస్క్ పోర్టు పరిసర ప్రాంతాల్లో పేలుళ్లు వినిపించాయి. బందర్ అబ్బాస్ సమీపంలో కూడా వైమానిక హెచ్చరిక వ్యవస్థలు చురుగ్గా పనిచేసినట్లు ఇరానియన్ మీడియా వెల్లడించింది. పలు రాడార్ కేంద్రాలు, వైమానిక రక్షణ స్థావరాలు లక్ష్యంగా దాడులు జరిగినట్లు సమాచారం.అంతేకాకుండా ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా భావించే అసలుయె ప్రాంతంలోని ప్రముఖ పెట్రోకెమికల్ ప్లాంట్‌పై కూడా అమెరికా దాడులు జరిపినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇంధన, పెట్రోకెమికల్ రంగాలపై ఆధారపడిన ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం పడే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.ఇదే సమయంలో రాజధాని టెహ్రాన్ పశ్చిమ ప్రాంతాల్లో ఎయిర్ సైరన్లు మోగడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భద్రతా బలగాలు అప్రమత్తమై కీలక ప్రాంతాల్లో పహారా పెంచాయి. దాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేసినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు.సంచలన వ్యాఖ్యలుఅమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ చేసిన వ్యాఖ్యలు ఈ పరిణామాలకు మరింత ప్రాధాన్యం తెచ్చాయి. "ఇరాన్ చర్చలకు ముందుకు రాకపోతే ఇక బాంబులతోనే మాట్లాడాల్సి వస్తుంది" అంటూ ఆయన చేసిన హెచ్చరిక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికా దాడులు ఇరాన్ సామర్థ్యాలను దెబ్బతీసేలా, తమ సైనిక కార్యకలాపాలకు అనుకూల పరిస్థితులు సృష్టించేలా కొనసాగుతాయని హెగ్సెత్ స్పష్టం చేశారు. ఇరాన్ స్పందనఅమెరికా చర్యలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా తప్పుడు నెపాలతో దాడులకు పాల్పడుతోందని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఆరోపించారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) కూడా ఈ దాడులను ఖండిస్తూ తగిన ప్రతిస్పందన ఇస్తామని హెచ్చరించింది. ఇదిలా ఉండగా, అమెరికా దాడులకు ప్రతీకారంగా బహ్రెయిన్, జోర్డాన్, కువైట్ తదితర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు సమాచారం. అయితే ఆ దేశాలు చాలా వరకు వాటిని అడ్డుకున్నట్లు ప్రకటించాయి. ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతమంతా హైఅలర్ట్‌లోకి వెళ్లింది. తాజా పరిణామాలు చూస్తే అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కేవలం పరిమిత ప్రతీకార దాడుల దశ దాటి.. మరింత విస్తృత ఘర్షణ వైపు దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి భద్రత, చమురు సరఫరాలు, గల్ఫ్ దేశాల స్థిరత్వంపై ఈ సంక్షోభం ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. -
ఇరాన్ యుద్ధం.. నెతన్యాహు సంచలన నిర్ణయం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ప్రమాదకర దశకు చేరుకుంటున్నాయా?. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీసుకున్న సంచలన నిర్ణయం అవుననే అంటోంది. ఇకపై అమెరికా మద్దతు ఇచ్చినా.. ఇవ్వకపోయినా ఇరాన్‌పై దాడులు కొనసాగించాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో.. మరికొన్ని గంటల్లో ఇరాన్‌పై దాడి చేయబోతున్నామని అమెరికా ముందుగానే ఇజ్రాయెల్‌కు సమాచారం ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.పశ్చిమాసియా సంక్షోభంపై జరిగిన తాజా కేబినెట్ సమావేశంలో నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేసినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. "అమెరికా మద్దతు లేకుండానే ఇరాన్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావొచ్చు. ఆయుధాల కొరత, అంతర్జాతీయ ఒత్తిడి, దౌత్యపరమైన ఒంటరితనం వంటి మూల్యాలు చెల్లించాల్సి వచ్చినా.. ఆ పరిస్థితికి సిద్ధంగా ఉండాలి" అని ఆయన కేబినెట్ వర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే అలాంటి పరిస్థితి రావడం తనకు ఇష్టం లేదని.. కానీ అవసరమైతే అందుకు వెనుకాడబోమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమావేశంలో.. అమెరికా-ఇరాన్ డీల్ ప్రతిపాదనలపై ఇజ్రాయెల్ సైన్యాధ్యక్షుడు ఎయాల్ జమీర్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం చర్చలో ఉన్న ఏ ఇరాన్ ఒప్పందమైనా.. ఇజ్రాయెల్ భద్రతా ప్రయోజనాలకు అనుకూలంగా కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.గత కొంతకాలంగా.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మిత్రదేశాలైన అమెరికా-ఇజ్రాయెల్ మధ్య విబేధాలకు కారణం అవుతున్నాయి. ఇరాన్‌తో అణు ఒప్పందం నేపథ్యంతో శాంతి చర్చలకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇటు ఇరాన్, అటు లెబనాన్‌లో యుద్దానికి తాత్కాలిక విరమణ ప్రకటించారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ.. హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుని లెబనాన్(దక్షిణ ప్రాంతాల్లో)పై ఇజ్రాయెల్ దాడులు జరుపుతూనే వస్తోంది. ఈ దాడుల్లో అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఈ పరిణామాలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. లెబనాన్‌పై సైనిక చర్య ఆపకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నెతన్యాహుని ట్రంప్ మందలిస్తున్నారని కొంతకాలంగా కథనాలు వెలువడుతున్నాయి. కానీ, నెతన్యాహు మాత్రం అదేం పట్టించుకోకుండా ‘పరిమిత దాడులకు’ ఆదేశాలిస్తూనే వస్తున్నారు. ఇరాన్-అమెరికా మధ్య డీల్ కుదిరితే.. తమ సైనిక చర్యల స్వేచ్ఛకు భంగం కలుగుతుందనే యోచనలో ఇజ్రాయెల్ ఉంది, అందుకే ఇరాన్ ఒప్పందంలో తమకూ ప్రాధాన్యం ఇవ్వాలని నెతన్యాహు ట్రంప్‌ను కోరుతున్నట్లు తెలుస్తోంది.ఇజ్రాయెల్‌కు సమాచారం ఇచ్చి మరీ దాడులు?ఇటు హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్ కూల్చివేతకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్‌పై వైమానిక దాడులు నిర్వహించింది. ఇరాన్ దక్షిణ ప్రాంతాల్లోని వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధవిమానాలు దాడులు నిర్వహించాయి. జాస్క్, బందర్ అబ్బాస్, ఖెష్మ్ దీవి ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా(ఇరాన్ దాడికి ప్రతీకారంగానే!) తమ దాడులు పూర్తయ్యాయని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించుకుంది. ఇరాన్ నుంచి వచ్చే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇటు.. అమెరికా దాడులకు ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది. తమపై జరిగిన ప్రతి దాడికి సమాధానం ఇస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి హెచ్చిరించిన కాసేపటికే దాడులు జరిగాయి. అమెరికా స్థావరాలు, బహ్రెయిన్‌లో ఉన్న అమెరికా ఐదో నౌకాదళాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఎదురుదాడులకు దిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి. బహ్రెయిన్ ప్రభుత్వం కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇటు అమెరికా సైనిక దూకుడు కొనసాగితే మరింత తీవ్రమైన ప్రతీకార చర్యలు తప్పవని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. అయితే..మరికొన్ని గంటల్లో ఇరాన్‌పై దాడి చేయబోతున్నామని ఇజ్రాయెల్‌కు అమెరికా ముందుగానే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తాజా దాడులు ఆ సమాచారం అనుగుణంగానే జరిగాయా? లేదంటే అమెరికా ఇరాన్‌పై మరేదైనా కొత్త దాడులకు వ్యూహ రచన చేస్తోందా? అనే ఉత్కంఠ నెలకొంది. -
అపాచీ ఎఫెక్ట్.. ఇరాన్‌పై అమెరికా రివెంజ్ ఎటాక్స్!
పశ్చిమాసియా సంక్షోభం తీవ్ర ఉద్రిక్తతల వైపు అడుగులేస్తోంది. హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అత్యాధునిక ఆర్మీ హెలికాప్టర్ ‘అపాచీ’ కూలిపోవడం.. దానిని ఇరాన్ కూల్చివేసిందంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ఇరాన్‌పై అమెరికా సైన్యం వైమానిక దాడులు ప్రారంభించింది. హర్ముజ్ జలసంధిలోని ఖేష్మ్ ద్వీపంలో, అలాగే బందర్ అబ్బాస్, సిరిక్తో పాటు దక్షిణ ఇరాన్ ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు సమాచారం. ఇరాన్ గనుక మళ్లీ దాడులకు దిగితే.. ఈసారి గట్టిగా స్పందిస్తామని అమెరికా హెచ్చరించింది. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ మాత్రం ఇది ఆత్మరక్షణ కోసమేనని అంటోంది. ఇక ఈ దాడులకు ఇరాన్ కూడా స్పందించింది. తమ భూభాగానికి సమీపంలో ఉన్న విదేశీ సైనిక బలగాలే ప్రమాదంలో ఉన్నాయంటూ ఓ ప్రకటన వెలువరించింది.ఒమన్ తీరంలో అమెరికా ఆర్మీకి చెందిన AH-64 అపాచీ హెలికాప్టర్ సాధారణ గస్తీ నిర్వహిస్తున్న సమయంలో కూలిపోయింది. హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. అమెరికా సెంట్రల్ కమాండ్ సమాచారం ప్రకారం.. తొలిసారిగా సముద్రంలో డ్రోన్ బోట్ సహాయంతో వారిని రక్షించారు. ‘కోర్సెయిర్’ పేరుతో పనిచేసే ఈ డ్రోన్ నౌక ఇద్దరు సైనికులను సురక్షిత ప్రాంతానికి తరలించగా, అక్కడి నుంచి మరో హెలికాప్టర్ వారిని తీసుకెళ్లింది.ఈ ఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇరాన్ మా అత్యాధునిక అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేసింది. మా సిబ్బంది క్షేమంగానే ఉన్నప్పటికీ, ఈ దాడికి అమెరికా తప్పనిసరిగా స్పందించాల్సిందే’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.ట్రంప్ వ్యాఖ్యల అనంతరం అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్‌పై దాడులు ప్రారంభించినట్లు ప్రకటించింది. ‘ఇరాన్ అన్యాయమైన దాడికి ఇది ప్రతిస్పందన. అమెరికా సైనికుల రక్షణ, ప్రాంతీయ భద్రత కోసం చర్యలు చేపట్టాం’ అని పేర్కొంది. ఇదే సమయంలో హర్మజ్ జలసంధిలోని ఇరాన్ ఖేష్మ్ ద్వీపంలో భారీ పేలుళ్లు వినిపించినట్లు ఇరానియన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అయితే నష్టంపై అధికారిక వివరాలు వెలువడలేదు.అమెరికా ఆరోపణలను ఇరాన్ ఖండించింది. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పందిస్తూ, ‘హర్ముజ్ జలసంధి అమెరికా తీరాలకు వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. మా భూభాగానికి సమీపంలో మోహరించిన విదేశీ బలగాలు తమ తప్పిదాలు, ప్రమాదాలు లేదంటే కాల్పుల మధ్య చిక్కుకోవడం వల్లే ప్రమాదాలకు గురవుతాయి. ప్రమాదాలను తగ్గించుకోవాలంటే వారు ఈ ప్రాంతం విడిచిపోవడం ఉత్తమ మార్గం’ అని వ్యాఖ్యానించారు.ఈ పరిణామాలు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా పరిస్థితులను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. రెండు నెలల క్రితం అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా పూర్తిస్థాయి శాంతి ఒప్పందంగా మారలేదు. ఇదే సమయంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మళ్లీ కాల్పులు చోటుచేసుకోవడం, లెబనాన్‌లో హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండడం పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తోంది.ఇదిలా ఉండగా, ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ ఇటీవలే ఆశాభావం వ్యక్తం చేశారు. ‘రెండు లేదా మూడు రోజుల్లో మంచి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది’ అని వ్యాఖ్యానించిన ఆయన.. హెలికాప్టర్ ఘటన తర్వాత మాత్రం కఠిన వైఖరి అవలంబించారు. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకోవాలని అమెరికా కోరుతుండగా.. ఆంక్షల ఎత్తివేత, స్తంభింపజేసిన ఆస్తుల విడుదలపై ఇరాన్ పట్టుబడుతోంది. దీంతో చర్చలు ఇంకా ప్రతిష్టంభనలోనే ఉన్నాయి.హర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాలకు కీలక మార్గం కావడంతో తాజా పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లను కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇంధన ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో తాజా ఘర్షణలు మరింత ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఇది ప్రేమికుల గొడవ లాంటిదే!
నలభై ఏళ్ల స్నేహం.. ఒకరి విజయాలను మరొకరు బహిరంగంగా కొనియాడుకునే అనుబంధం.. కానీ ఇరాన్ విషయంలో మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మధ్య విభేదాల మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌పై మరిన్ని దాడులకు సిద్ధమవుతున్న నెతన్యాహూను ట్రంప్ పదేపదే అప్రమత్తం(వార్నింగ్) చేస్తున్నారన్న వార్తలు వెలువడగా.. దీనిని ఇజ్రాయెల్ రాయబారి యెచియెల్ లీటర్ మాత్రం ‘ప్రేమికుల మధ్య వచ్చే చిన్నపాటి గొడవ’గా అభివర్ణించడం ఆసక్తి రేపుతోంది.పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరదించుతూ ఇరాన్.. ఇజ్రాయెల్‌పై తాము చేపట్టిన సైనిక చర్యలను తక్షణమే నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాలకూ చేసిన శాంతి విజ్ఞప్తిపై స్పందించిన ఇరాన్.. కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నట్టు ఫార్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇరాన్‌పై మరిన్ని దాడులు చేస్తే వాషింగ్టన్ మద్దతును కోల్పోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆప్తమిత్రుడు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును హెచ్చరించిన తర్వాతే ఇజ్రాయెల్ తన దాడులను నిలిపివేసినట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది.అయితే, యెచియెల్ లీటర్ ఈ కథనాలను తోసిపుచ్చారు. ఇద్దరు నేతల మధ్య చర్చలు పరస్పర సహకారంతో జరిగాయని.. మీడియా.. తప్పుదోవ పట్టించేలా కథనాలను అల్లుతుందంటూ ఆరోపించారు. ‘‘వారి మధ్య దాదాపు 40 ఏళ్ల నాటి లోతైన స్నేహం ఉంది. కొన్నిసార్లు ప్రేమికుల మధ్య చిన్నపాటి ఘర్షణలు (lovers' spat) జరుగుతుంటాయి, అలాగే కొన్నిసార్లు వారి సంభాషణల్లో వాతావరణం కాస్త వేడెక్కుతుందని ఫాక్స్ న్యూస్‌తో లీటర్ వ్యాఖ్యానించారు.ట్రంప్ అభ్యర్థన మేరకు ఇరాన్‌పై సైనిక చర్యల విషయంలో తీవ్రతను తగ్గించాలని ఇజ్రాయెల్ ప్రధాని నిర్ణయించుకున్నప్పటికీ, తమ దేశంపైకి వచ్చే బాలిస్టిక్ క్షిపణులను స్పందించకుండా ఇజ్రాయెల్ ఊరికే భరించలేదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు కూడా అర్థం చేసుకున్నారని ఇజ్రాయెల్ దౌత్యవేత్త పేర్కొన్నారు. చాలా వరకు మేము అమెరికా-ఇజ్రాయెల్ మధ్య చాలా సన్నిహిత, ఉమ్మడి సహకారంతో ముందుకు సాగుతున్నాము. మా మధ్య అద్భుతమైన అవగాహన ఉందన్నారు. మరోవైపు, నెతన్యాహుపై ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అంతకుముందు ఇజ్రాయెల్-ఇరాన్ రెండు దేశాలూ దాడులు ఆపాలని ఆయన పిలుపునిచ్చారు. అజ్ఞానం, మూర్ఖత్వం అడ్డురాకపోతే శాంతి దిశగా తుది చర్చలు ముందుకు సాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని మీడియాతో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌కు తనను తాను రక్షించుకునే పూర్తి హక్కు ఉందని.. అవసరమైన విధంగానే చర్యలు తీసుకుంటున్నామంటూ తాను ట్రంప్‌నకు స్పష్టం చేసినట్లు తెలిపారు. -
ఆందోళనలో ట్రంప్.. నెతన్యాహూకు అల్టిమేటం?
ఇరాన్‌తో శాంతి ఒప్పందం దిశగా సాగుతున్న అమెరికా ప్రయత్నాలు మళ్లీ పట్టాలు తప్పుతాయేమోనన్న ఆందోళన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లో కనిపిస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్న వేళ.. ఇరాన్‌పై మరిన్ని దాడులకు సిద్ధమవుతున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సంకేతాలు పంపిస్తున్నారు. ఈ పరిణామం వాషింగ్టన్‌ను కలవరపెడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ట్రంప్ నెతన్యాహుకు పదే పదే ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇరాన్‌తో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడొద్దని ఇజ్రాయెల్ ప్రధానికి ట్రంప్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. "బీబీ.. చాలా జాగ్రత్తగా ఉండు. లేదంటే తొందర్లోనే నువ్వు ఒంటరివాడివైపోతావు" అని నెతన్యాహూతో జరిగిన సంభాషణలో ట్రంప్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా మీడియా సంస్థ యాక్సియోస్ (Axios) కథనం వెల్లడించింది.బీబీ అనేది నెతన్యాహు చిన్నప్పటి ముద్దు పేరు. ఇజ్రాయెల్ రాజకీయ నేతలు, అభిమానులతో పాటు పలు దేశాధినేతలు కూడా ఆయన్ని అలాగే పిలుస్తుంటారు. అందుకే ట్రంప్ ఆ పదం వాడారని తెలుస్తోంది. సాధారణంగా ఇజ్రాయెల్‌కు అత్యంత సన్నిహిత మిత్రదేశంగా అమెరికాను భావిస్తారు. ముఖ్యంగా ట్రంప్, నెతన్యాహూ ఇద్దరూ రైట్‌వింగ్ లీడర్లుగా గుర్తింపు పొందారు. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే ఇరాన్ అంశంలో ఇద్దరి మధ్య వ్యూహాత్మక విభేదాలు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్‌తో దీర్ఘకాలిక ఘర్షణ కంటే చర్చల ద్వారా పరిష్కారం సాధించాలన్నది ట్రంప్ వైఖరి. మరోవైపు ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత కఠిన వైఖరిని అవలంబించాలని నెతన్యాహూ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం అమెరికా ఇరాన్‌తో శాంతి ఒప్పందం దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో ఇజ్రాయెల్ చేపట్టే ఏకపక్ష సైనిక చర్యలు చర్చలను పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం ఉందని వైట్‌హౌస్ భావిస్తోంది. అందుకే గత కొన్ని వారాలుగా లెబనాన్, ఇరాన్ అంశాల్లో ట్రంప్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని నెతన్యాహూను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు చెబుతున్నాయి.ఇక.. నెతన్యాహుకు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ అసలు సారాంశం.. అమెరికా మద్దతు గురించి. ఇజ్రాయెల్‌కు ఆయుధాలు, క్షిపణి నిరోధక వ్యవస్థలు, ఇంటెలిజెన్స్ సమాచారం వంటి కీలక సహాయం అమెరికా నుంచే అందుతోంది. ఒకవేళ నెతన్యాహూ అమెరికా అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ఇరాన్‌పై పూర్తి స్థాయి యుద్ధానికి దిగితే.. వాషింగ్టన్ నుంచి అదే స్థాయి మద్దతు కొనసాగకపోవచ్చన్న సంకేతంగా విశ్లేషకులు ఈ హెచ్చరికను చూస్తున్నారు.ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా లేదు. ఇరాన్ మళ్లీ దాడి చేస్తే కఠినంగా స్పందిస్తామని నెతన్యాహూ చెబుతుండగా, యుద్ధం కంటే దౌత్యమే పరిష్కారమని ట్రంప్ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన "జాగ్రత్త బీబీ" హెచ్చరిక కేవలం ఇద్దరు నేతల మధ్య సంభాషణ మాత్రమే కాకుండా.. పశ్చిమాసియాలో భవిష్యత్తు పరిణామాలను ప్రభావితం చేసే కీలక రాజకీయ సంకేతంగా మారింది. -
గ్యాస్ రేట్లు మళ్లీ పెరుగుతాయా?.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం కొనసాగుతున్న పరిస్థితులు.. ఈ ప్రభావంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఒత్తిడికి లోనవుతుండడం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఇంధన ధరలపై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా.. అటు పెట్రో రేట్లు పెరగడం, అలాగే ఇటు సిలిండర్లపైనా పెంపు అమల్లోకి రావడంతో, భవిష్యత్తులో మరిన్ని పెంపులు ఉండే అవకాశముందా? అనే ప్రశ్న వినియోగదారుల్లో కలకలం రేపుతోంది. ఇదే సమయంలో కేంద్రం చేసిన వివరణలు పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చాయి. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం కొనసాగుతున్న పరిస్థితులు.. ఆ ప్రభావంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఒత్తిడికి లోనవుతుండడం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. అదే సమయంలో.. వంటగ్యాస్ (LPG) ధరలపై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా.. సిలిండర్‌పై రూ.29 పెంపు అమల్లోకి రావడంతో, భవిష్యత్తులో మరిన్ని పెంపులు ఉండే అవకాశముందా? అనే ప్రశ్న వినియోగదారుల్లో కలకలం రేపుతోంది. ఇదే సమయంలో కేంద్రం చేసిన వివరణలు పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చాయి.డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ పెంపుపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియా ముఖంగా మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితుల కారణంగా ఎల్పీజీ ధరల పెంపు తప్పించలేని నిర్ణయంగా మారిందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ పెంపుపై విచారం వ్యక్తం చేస్తున్నప్పటికీ, సరఫరా పరిమితులు, రవాణా ఖర్చుల పెరుగుదల, బీమా వ్యయాలు అధికమవడం వంటి కారణాలతో ధరలను పూర్తిగా నియంత్రించడం సాధ్యం కావడం లేదని వివరించారు.అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ సరఫరా తగ్గడం, కొన్ని పరిమిత దేశాల నుంచే దిగుమతులు జరగడం, అలాగే 40–45 రోజుల ట్రాన్స్షిప్మెంట్ కారణంగా రవాణా వ్యయాలు భారీగా పెరగడం ధరల పెంపుకు ప్రధాన కారణాలుగా కేంద్రం పేర్కొంది. ఈ పరిస్థితుల్లో దేశంలో ఎల్పీజీ సరఫరా వ్యయం రూ.1,600 దాటినప్పటికీ, ఆ భారాన్ని పూర్తిగా వినియోగదారులపై మోపకుండా ప్రభుత్వం సబ్సిడీల రూపంలో ఉపశమనం కల్పిస్తోందని తెలిపింది.ఇదే సమయంలో భారత్‌లో వంటగ్యాస్ ధరలు ప్రపంచంలోనే తక్కువగా ఉన్నాయని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇక్కడ ధరలు గణనీయంగా చౌకగా ఉన్నాయని వివరించింది. ప్రస్తుతం ఢిల్లీలో సాధారణ వినియోగదారులు సిలిండర్‌కు సుమారు రూ.942 చెల్లిస్తుండగా, ప్రతి సిలిండర్‌పై దాదాపు రూ.700 వరకు ప్రభుత్వం భరిస్తోందని వెల్లడించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 10.58 కోట్లకుపైగా కనెక్షన్లు అందించగా, అర్హులైన లబ్ధిదారులకు ఏడాదికి నాలుగు సిలిండర్లపై ఒక్కో సిలిండర్‌కు రూ.300 సబ్సిడీ ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో ఉజ్వల వినియోగదారులకు సిలిండర్ ధర సుమారు రూ.642కే లభిస్తోందని వివరించింది.మొత్తంగా చూస్తే, అంతర్జాతీయ సంక్షోభం కొనసాగుతున్నా భారత్‌లో వినియోగదారులపై భారం తగ్గించేందుకు భారీ సబ్సిడీలు, ప్రత్యామ్నాయ దిగుమతులు, దేశీయ ఉత్పత్తి పెంపు వంటి చర్యలు కొనసాగుతున్నాయని కేంద్రం చెబుతోంది. అయితే పశ్చిమాసియాలో మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఒత్తిడికి లోనవుతున్న నేపథ్యంలో, రాబోయే నెలల్లో ఎల్పీజీ ధరలు ఎలా మారతాయన్నదానిపై అనిశ్చితి కొనసాగుతోంది.కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలు కూడా ఈ చర్చకు మరింత బలం చేకూర్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా సరఫరా సమస్యలు, రవాణా వ్యయాలు, దిగుమతి ఒత్తిడులు కొనసాగుతున్న నేపథ్యంలో ధరలపై ఒత్తిడి తప్పదని ఆయన పేర్కొనడం భవిష్యత్తులో మరింత పెంపులు ఉండే అవకాశాలపై సంకేతాలుగా రాజకీయ, ఆర్థిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
అన్నంత పని చేసిన ఇరాన్.. ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం
పశ్చిమాసియాలో కాల్పుల విరమణ దాదాపుగా ముగిసినట్లే కనిపిస్తోంది. లెబనాన్ బీరూట్ శివార్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపిన కొన్ని గంటల్లోనే.. ఇరాన్ రంగంలోకి దిగింది. నేరుగా బాలిస్టిక్ క్షిపణులతో ప్రతీకార దాడికి దిగింది. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతాల్లో సైరన్లు మోగగా, క్షిపణి నిరోధక వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. దీంతో ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర మలుపు తిరిగాయి. ఆదివారం రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం (IDF) వెల్లడించింది. క్షిపణుల ప్రయోగాన్ని గుర్తించిన వెంటనే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హెచ్చరిక సైరన్లు మోగించడంతో పాటు వైమానిక రక్షణ వ్యవస్థలను రంగంలోకి దింపింది. లక్షలాది మంది ప్రజలు అత్యవసర ఆశ్రయ కేంద్రాలు, బంకర్లకు పరుగులు తీశారు. ఉత్తర ఇజ్రాయెల్‌లో పలుచోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణులను వైమానిక దళం విజయవంతంగా అడ్డుకుందని తెలిపింది. ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని పేర్కొంది. అయితే అదనపు క్షిపణుల ప్రయోగాలను కూడా గుర్తించినట్లు వెల్లడించింది.ప్రతీకారమే!ఈ క్షిపణి దాడులు జరగడానికి కొన్ని గంటల ముందే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు లెబనాన్ రాజధాని బీరూట్ దక్షిణ శివార్లపై వైమానిక దాడులు నిర్వహించాయి. ముఖ్యంగా హిజ్బుల్లా ప్రభావం ఎక్కువగా ఉన్న దహియెహ్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీరూట్‌పై దాడులు చేస్తే ప్రతీకారం తప్పదని ఇప్పటికే హెచ్చరించిన టెహ్రాన్, తాజాగా రంగంలోకి దిగినట్లే స్పష్టమవుతోంది.10 క్షిపణులు అడ్డుకున్న ఇజ్రాయెల్అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇరాన్ ప్రయోగించిన కనీసం 10 బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ క్షిపణి నిరోధక వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. ఈ విషయాన్ని అమెరికా మీడియా సంస్థ CNN తన నివేదికలో పేర్కొంది.ఇజ్రాయెల్ ప్రతీకార హెచ్చరికఇరాన్ దాడిపై స్పందించిన ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ Effie Defrin, "ఇరాన్ తీవ్రమైన తప్పు చేసింది" అని వ్యాఖ్యానించారు. అలాగే ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎయల్ జమీర్ మాట్లాడుతూ.. అవసరమైతే శత్రువుపై గట్టి దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.ఏప్రిల్ తర్వాత..ఏప్రిల్ 8న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్‌పై దాడి చేయడం ఇదే మొదటిసారి. దీంతో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న సున్నితమైన శాంతి వాతావరణం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఇజ్రాయెల్-హెజ్బుల్లా ఘర్షణల నేపథ్యంలో అమెరికాతో జరుగుతున్న పరోక్ష చర్చలను కూడా ఇరాన్ నిలిపివేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో పాక్షిక కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, అదే రోజున రెండు పక్షాలు పరస్పరం దాడులు కొనసాగించడంతో ఆ ఒప్పందం నిలవలేదు.రమత్ డేవిడ్ ఎయిర్‌బేస్ లక్ష్యంగా..ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, తమ ఏరోస్పేస్ దళాలు ఇజ్రాయెల్‌లోని రమత్ డేవిడ్ ఎయిర్‌బేస్‌ను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించాయి. ఇరాన్‌కు చెందిన ఖాతమ్ అల్-అన్బియా కమాండ్ అధికారి మాట్లాడుతూ, బీరూట్ దక్షిణ శివార్లపై దాడి చేయడం ద్వారా ఇజ్రాయెల్ అన్ని "రెడ్లైన్లను" దాటిందని ఆరోపించారు.అన్నంత పని చేసిన ఇరాన్"బీరూట్ శివార్లపై దాడులు విస్తరిస్తే ఆక్రమిత భూభాగాల్లోని లక్ష్యాలపై దాడి చేస్తామని ముందే హెచ్చరించాం. ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులు ఆపకపోతే మరింత తీవ్రమైన, విధ్వంసకర దెబ్బలు ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని ఇరాన్ సైనికాధికారులు హెచ్చరించారు.గగనతలం మూసివేతఇజ్రాయెల్పై క్షిపణి దాడుల అనంతరం ప్రతీకార చర్యలు ఉండొచ్చన్న అంచనాతో ఇరాన్ తన పశ్చిమ గగనతలాన్ని (Western Airspace) తాత్కాలికంగా మూసివేసింది. అదే సమయంలో ఇరాక్, సిరియా కూడా భద్రతా కారణాల దృష్ట్యా తమ గగనతలాన్ని మూసివేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దీంతో ప్రాంతీయ విమాన రాకపోకలపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.అమెరికా లక్ష్యాలకూ హెచ్చరికఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) మరింత ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతమైతే కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాకుండా అమెరికా ప్రయోజనాలు, అమెరికా మద్దతు ఉన్న లక్ష్యాలపై కూడా దాడులు విస్తరించే అవకాశం ఉందని ప్రకటించింది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి పరిసరాల్లో జరిగిన ఘటనలను కూడా ప్రస్తావించింది.ట్రంప్ భిన్నాభిప్రాయంఅయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇజ్రాయెల్ మరింత ప్రతీకార చర్యలకు వెళ్లాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రసార సంస్థ నివేదించింది. ఇది ఇజ్రాయెల్ సైన్యం వ్యక్తం చేస్తున్న కఠిన వైఖరికి భిన్నంగా కనిపిస్తోంది.మళ్లీ యుద్ధ భయాలుఇరాన్-ఇజ్రాయెల్ తాజా ఘర్షణతో మిడిల్ఈస్ట్ దేశాలు మరోసారి అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే గాజా, లెబనాన్, సిరియా ప్రాంతాల్లో కొనసాగుతున్న అస్థిర పరిస్థితులకు ఈ పరిణామం మరింత మంటలు రాజేసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ప్రధాని మోదీ కీలక భేటీ
ఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించారు. భారత్‌పై యుద్ధ ప్రభావం తగ్గించే చర్యలపై కసరత్తు, ప్రపంచవ్యాప్త అస్థిరతల మధ్య భారతదేశ ఆర్థిక వృద్ధిని మరింత పెంపొందించడానికి వివిధ ఆలోచనలు, చర్యలపై చర్చలు జరిపారు.ఆర్థికవృద్ధిని బలోపేతం చేయడంతో పాటు అంతర్జాతీయంగా వచ్చే ఒడుదొడుకులను తట్టుకునే సామర్థం పెంపుదల, వాణిజ్యానికి మరింత అనుకూల వాతావరణాన్ని కల్పించేలా సంస్కరణలను వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ ఆర్థిక ఒడిదుడుకుల సమయంలో భారత్ ఆర్థిక వృద్ధిని మరింతగా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై వివిధ వ్యూహాలను, చర్యలను చర్చించారని వారు పేర్కొన్నారు.పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. హర్ముజ్ జలసంధిలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ల దాడికి దిగింది. అయితే వాటిని తిప్పి కొట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. అంతటితో ఆగకుండా ఇరాన్‌కు చెందిన తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది.ఇప్పటికే సున్నితంగా మారిన గల్ఫ్ ప్రాంతంలో తాజా పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. హర్ముజ్ జలసంధి వద్ద ప్రారంభమైన ఈ తాజా ప్రతిష్ఠంభన ఎటు దారి తీస్తుందనేది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రపంచ చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, పశ్చిమాసియా భద్రతా పరిస్థితులపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. -
పశ్చిమాసియాలో మళ్లీ అలజడి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. హర్ముజ్ జలసంధిలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ల దాడికి దిగింది. అయితే వాటిని తిప్పి కొట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. అంతటితో ఆగకుండా ఇరాన్‌కు చెందిన తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. ఇప్పటికే సున్నితంగా మారిన గల్ఫ్ ప్రాంతంలో తాజా పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి వైపు ఇరాన్ నాలుగు వన్‌వే అటాక్ డ్రోన్లు ప్రయోగించబడినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) ప్రకటించింది. తక్షణ ముప్పుగా ప్రకటించుకుని తమ దళాలు వాటిని గగనతలంలోనే కూల్చివేశాయని తెలిపింది. అనంతరం మరిన్ని దాడులను అడ్డుకునేందుకు ఇరాన్‌లోని గోరుక్ ప్రాంతం, ఖేశ్మ్ ద్వీపంలోని తీర నిఘా రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు వెల్లడించింది.ఈ ఘటనలతో హర్ముజ్ జలసంధి మళ్లీ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో జరిగే చమురు, సహజ వాయువు ఎగుమతుల్లో గణనీయమైన భాగం ఈ జలసంధి గుండా సాగుతుంది. ఇక్కడ ఎలాంటి సైనిక ఘర్షణ జరిగినా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా పలు చర్యలు చేపడుతోంది. ఇరాన్‌కు అనుబంధంగా ఉన్న ఓ చమురు ట్యాంకర్‌ను హిందూ మహాసముద్రంలో అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో ఇరాన్ ఇంధన రంగంపై కొత్త ఆంక్షలను కూడా ప్రకటించింది.మరోవైపు ఇరాన్ మీడియా మాత్రం హర్ముజ్ సమీప జలాల్లో తమ బలగాలు హెచ్చరిక కాల్పులు జరిపినట్లు వెల్లడించింది. అమెరికా నౌకాదళ కదలికలకు ప్రతిస్పందనగానే ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని చెబుతున్నప్పటికీ.. తాజా పరిణామాలు మాత్రం భిన్న సంకేతాలు ఇస్తున్నాయి. ఇటీవలే కాల్పుల విరమణ పొడిగింపుపై చర్చలు జరిగినప్పటికీ, తాజా దాడులు ఆ ప్రయత్నాలకు ఎదురుదెబ్బగా మారాయి. ఇదే సమయంలో లెబనాన్‌లో ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య ఘర్షణలు కూడా మళ్లీ ఉద్ధృతమవుతుండటంతో మొత్తం పశ్చిమాసియా ప్రాంతం అస్థిరత వైపు అడుగులు వేస్తోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.హర్ముజ్ జలసంధి వద్ద ప్రారంభమైన ఈ తాజా ప్రతిష్ఠంభన ఎటు దారి తీస్తుందనేది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడి పరిస్థితులు కేవలం అమెరికా-ఇరాన్ సంబంధాలకే పరిమితం కావు. ప్రపంచ చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, పశ్చిమాసియా భద్రతా పరిస్థితులపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు ఇరు వర్గాలు చెబుతున్నప్పటికీ, ఒక్క చిన్న పొరపాటు కూడా పెద్ద ఘర్షణకు దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. -
వార్ పవర్స్ షాక్.. ట్రంప్ దూకుడుకు బ్రేక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కీలక రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో యుద్ధానికి సంబంధించిన నిర్ణయాలను అధ్యక్షుడు ఏకపక్షంగా తీసుకోకుండా నియంత్రించే 'వార్ పవర్స్' (War Powers) తీర్మానాన్ని అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ఆమోదించింది. 215-208 ఓట్ల తేడాతో ఆమోదం పొందిన ఈ తీర్మానం ట్రంప్ విదేశాంగ, సైనిక విధానాలపై కాంగ్రెస్ అసంతృప్తికి నిదర్శనంగా భావిస్తున్నారు.డెమోక్రటిక్ పార్టీకి చెందిన గ్రెగరీ మీక్స్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానం ప్రకారం.. అమెరికా సైన్యాన్ని యుద్ధంలో కొనసాగించడం లేదంటే కొత్త సైనిక చర్యలు చేపట్టడం కోసం కాంగ్రెస్(అమెరికా పార్లమెంట్) అనుమతి తప్పనిసరి. అమెరికా రాజ్యాంగం ప్రకారం యుద్ధం ప్రకటించే అధికారం కాంగ్రెస్‌కే ఉందని ఈ తీర్మానం మరోసారి స్పష్టం చేస్తోంది. ఈ తీర్మానానికి నలుగురు రిపబ్లికన్లు కూడా మద్దతు తెలపడం కొసమెరుపు. ఎందుకు ఎదురుదెబ్బ?.. ఫిబ్రవరి చివర్లో ప్రారంభమైన ఇరాన్ ఘర్షణలో ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్ అనుమతి లేకుండానే సైనిక చర్యలు చేపట్టిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే యుద్ధం కారణంగా చమురు ధరలు, ఇంధన వ్యయాలు పెరగడం, ఆర్థిక ప్రభావాలు కనిపించడం వల్ల అమెరికాలో ప్రజాభిప్రాయం కూడా మారుతోంది. ఈ నేపథ్యంలోనే అధికార రిపబ్లికన్ పార్టీలోని నలుగురు సభ్యులు కూడా డెమోక్రాట్లతో కలిసి తీర్మానానికి మద్దతు ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.ఈసారి విజయంఇదే తరహా తీర్మానం గతంలో పలుమార్లు సభ ముందుకు వచ్చినప్పటికీ ఆమోదం పొందలేదు. మే నెలలో జరిగిన ఓటింగ్‌లో 212-212తో సమం కావడంతో తీర్మానం విఫలమైంది. అయితే ఈసారి అదనపు మద్దతు లభించడంతో సభ ఆమోదం దక్కింది.ఏం జరగబోతోందంటే..హౌస్ ఆమోదించిన ఈ తీర్మానం ఇప్పుడు సెనెట్‌లో కూడా ఆమోదం పొందాల్సి ఉంది. అక్కడ కూడా కొంతమంది రిపబ్లికన్ సభ్యులు మద్దతు తెలుపుతున్నప్పటికీ తుది ఫలితం ఆసక్తికరంగా మారింది. సెనెట్ ఆమోదించినా ట్రంప్ దీనిపై వీటో (Veto) విధించే అవకాశం ఉందని అమెరికా మీడియా నివేదిస్తోంది.యుద్ధం వెంటనే ఆగిపోతుందా?ఈ తీర్మానం ఆమోదం పొందినంత మాత్రాన యుద్ధం తక్షణమే ఆగిపోదు. అయితే కాంగ్రెస్ అనుమతి లేకుండా సైనిక చర్యలు కొనసాగించడంపై ట్రంప్ ప్రభుత్వంపై రాజకీయ, రాజ్యాంగపరమైన ఒత్తిడి పెరుగుతుంది. అలాగే అధ్యక్ష అధికారాలపై కాంగ్రెస్ తన నియంత్రణను పునరుద్ఘాటించినట్లవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ట్రంప్ దూకుడును కొంత మేర నియంత్రించే పరిణామంగా భావిస్తున్నారు.కీలక అంశాలుఇరాన్పై సైనిక చర్యలను పరిమితం చేసే 'వార్ పవర్స్' తీర్మానం ఆమోదం215-208 ఓట్లతో హౌస్‌లో ఆమోదంనలుగురు రిపబ్లికన్లు కూడా మద్దతుయుద్ధ నిర్ణయాలకు కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి అనే సందేశంసెనెట్ ఆమోదం, ట్రంప్ వీటోపై ఉత్కంఠట్రంప్ విదేశాంగ విధానాలకు పెద్ద రాజకీయ హెచ్చరికగా విశ్లేషణ -
ఇరాన్–అమెరికా దాడుల తీవ్రత.. ‘గల్ఫ్ విమానాల’కు అంతరాయం
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకుంది. యుద్ధ స్థావరాలపై ఇరాన్-అమెరికాలు పరస్పరం దాడులు కొనసాగిస్తున్నాయి. క్షిపణులు, డ్రోన్ దాడులు, ప్రతిదాడుల మధ్య గల్ప్ దేశాల విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.ఇరాన్ కువైట్, బహ్రెయిన్ లక్ష్యంగా క్షిపణి, డ్రోన్ దాడులు చేసినట్లు వచ్చిన వార్తలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అయితే ఈ దాడులను సమర్థంగా అడ్డుకున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. ప్రయోగించిన అనేక క్షిపణులు లక్ష్యాలను చేరలేక మార్గమధ్యంలో కూలిపోయాయని వివరించింది.ఇదే సమయంలో ప్రతిస్పందన చర్యల్లో భాగంగా అమెరికా ఇరాన్‌లోని క్వెష్మ్ ద్వీపంలోని ఒక సైనిక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌పై దాడులు చేసినట్లు వెల్లడించింది. ఈ చర్యల్లో తమ సిబ్బందికి ఎలాంటి నష్టం జరగలేదని అమెరికా స్పష్టం చేసింది. అయితే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అమెరికా స్థావరాలపై ప్రతిదాడులు చేసినట్లు ప్రకటించగా, ఆ వాదనలను అమెరికా “పూర్తిగా అసత్యం”గా ఖండించింది.ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా ఆంక్షలు మరింత కఠినమయ్యాయి. బహ్రెయిన్ తన ఆకాశ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేయగా, కువైట్, యూఏఈలలో విమాన రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దుబాయ్ సహా పలు ప్రాంతాల్లో విమానాలు ఆలస్యమవడం, మార్గమధ్యంలో నిలిపివేయడం, మార్గాలు మార్చుకోవడం వంటి పరిస్థితులు కనిపించాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అనేక అంతర్జాతీయ విమాన సంస్థలు గల్ఫ్ మార్గాల్లో సర్వీసులను రద్దు చేశాయి. మరికొన్నింటిని వాయిదా వేశాయి. ఏజియన్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ బాల్టిక్, ఎయిర్ కెనడా, ఎయిర్ ఫ్రాన్స్-KLM, లుఫ్తాన్సా, స్విస్ , ITA ఎయిర్వేస్ వంటి సంస్థలు దుబాయ్, టెల్ అవీవ్, బీరూట్, రియాద్ మార్గాల్లో తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి.పరిస్థితులు ఇంకా అస్థిరంగానే ఉండటంతో భద్రతా కారణాల దృష్ట్యా విమాన సర్వీసుల్లో మరిన్ని మార్పులు తప్పవని అధికారులు అంటున్నారు.పర్షియన్ గల్ఫ్‌లో కీలకమైన హర్ముజ్ జలసంధి పరిసరాల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడంతో చమురు, గ్యాస్ రవాణాపై కూడా ఆందోళన నెలకొంది. ఇప్పటికే కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ శాంతి ప్రయత్నాలు ఈ తాజా ఘటనలతో మరింత సంక్షోభంలోకి నెట్టేలా కనిపిస్తున్నాయి. -
నువ్వో పిచ్చోడివి! నేనే గనుక లేకుంటే..
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్న వేళ.. ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని.. యుద్ధం ఆగిపోతోందని ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఈ విషయం బయటకు వచ్చింది. లెబనాన్‌లో ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా గ్రూపులపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం కావడంతో ఆగ్రహానికి గురైన ట్రంప్.. నెతన్యాహుపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికా వార్తా సంస్థ ఆక్సియోస్ కథనం ప్రకారం.. బీరూట్‌పై ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్న సమయంలో ట్రంప్, నెతన్యాహుతో అత్యంత ఉద్రిక్తంగా మాట్లాడారు. “నువ్వు పిచ్చివాడివి.. నేను లేకపోతే జైలులో ఉండేవాడివి. ఇప్పుడు అందరూ నిన్ను, ఇజ్రాయెల్‌ను ద్వేషిస్తున్నారు” అంటూ ట్రంప్ మండిపడ్డారని అమెరికా అధికారులు వెల్లడించినట్లు కథనం పేర్కొంది. ఇజ్రాయెల్ చర్యలు కేవలం లెబనాన్‌కే పరిమితం కాకుండా.. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.బీరూట్‌పై దాడి నిలిపివేయించానన్న ట్రంప్ఫోన్ కాల్ అనంతరం ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో స్పందించారు. నెతన్యాహుతో “అత్యంత ఫలప్రదమైన” చర్చ జరిగిందని పేర్కొంటూ.. బీరూట్ వైపు వెళ్తున్న ఇజ్రాయెల్ దళాలను వెనక్కి తిప్పినట్లు చెప్పారు. అంతేకాదు.. హెజ్బొల్లా ప్రతినిధులతో కూడా చర్చలు జరిపినట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్ దాడులు చేయకపోతే తాము కూడా కాల్పులు ఆపేందుకు హెజ్బొల్లా అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు. “ఇరు పక్షాలు కాల్పులు నిలిపేస్తాయి. ఇది శాశ్వతంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాను” అంటూ “ETERNITY” అనే పదాన్ని పెద్ద అక్షరాలతో పోస్ట్ చేశారు.నెతన్యాహు మాత్రం వెనక్కి తగ్గలేదుఅయితే ట్రంప్ ప్రకటనల తర్వాత నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు మరోసారి సందేహాలకు తావిచ్చాయి. హెజ్బొల్లా తమ నగరాలు, పౌరులపై దాడులు కొనసాగిస్తే బీరూట్‌లోని లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు తప్పవని ఆయన స్పష్టం చేశారు. “హెజ్బొల్లా ఆగకపోతే మేము కూడా ఆగం” అని నెతన్యాహు ప్రకటించారు. దీంతో ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణపై ప్రశ్నలు తలెత్తాయి.యుద్ధం తాజా పరిస్థితిఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త చర్యలతో ఇరాన్‌పై సైనిక ఒత్తిడి ప్రారంభమైన తర్వాత ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్‌కు మద్దతుగా ఉన్న హెజ్బొల్లా ఉత్తర ఇజ్రాయెల్‌పై రాకెట్లు, డ్రోన్లతో దాడులు చేస్తుండగా.. ప్రతిగా ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌లో వైమానిక, భూదళాల ఆపరేషన్లు కొనసాగిస్తోంది. ఇటీవల బీరూట్ శివార్లలోని హెజ్బొల్లా స్థావరాలు కూడా ఇజ్రాయెల్ లక్ష్యాలుగా మారాయి. ఈ పరిణామాలు పూర్తి స్థాయి ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తాయన్న ఆందోళన పెరుగుతోంది.ఇరాన్ చర్చలకు బ్రేక్?లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు విస్తరించడంతో అమెరికాతో జరుగుతున్న చర్చలను నిలిపివేస్తున్నట్లు ఇరాన్‌కు చెందిన వార్తా సంస్థలు వెల్లడించాయి. తమ మిత్రదేశమైన హెజ్బొల్లాపై దాడులు కొనసాగుతుండగా చర్చలు జరపడం సాధ్యం కాదని టెహ్రాన్ అభిప్రాయపడుతోంది. అయితే ట్రంప్ మాత్రం మరోవైపు భిన్న సంకేతాలు ఇస్తున్నారు. ఇరాన్‌తో చర్చలు వేగంగా కొనసాగుతున్నాయని ఒక ప్రకటనలో చెబుతూనే.. మరో ఇంటర్వ్యూలో “ఆ చర్చలు బోరింగ్‌గా మారాయి. అవి విఫలమైనా నాకు పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు” అని వ్యాఖ్యానించారు. ఇంకా “కొంతకాలం మౌనం పాటిస్తే మంచిది” అని కూడా అన్నారు.వాషింగ్టన్-టెల్అవీవ్ మధ్య విభేదాలా?ఇప్పటివరకు ఇరాన్ విషయంలో ఒకే వేదికపై కనిపించిన అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు వ్యూహాత్మకంగా భిన్న దిశల్లో కదులుతున్నాయా అనే చర్చ మొదలైంది. ట్రంప్ యుద్ధాన్ని పరిమితం చేసి చర్చల ద్వారా పరిష్కారం కోరుతుండగా.. నెతన్యాహు మాత్రం హెజ్బొల్లాపై సైనిక ఒత్తిడి కొనసాగించాలనే వైఖరితో కనిపిస్తున్నారు.మిడిల్ఈస్ట్ సంక్షోభం ఎటు?ఒకవైపు కాల్పుల విరమణ ప్రకటనలు.. మరోవైపు బీరూట్‌పై దాడుల హెచ్చరికలు.. ట్రంప్-నెతన్యాహు మధ్య బహిర్గతమైన విభేదాలు.. ఇరాన్ చర్చల అనిశ్చితి.. ఈ పరిణామాలన్నీ మధ్యప్రాచ్యాన్ని మరో కీలక మలుపు వద్ద నిలబెట్టాయి. ట్రంప్ ఆశిస్తున్నట్లుగా ఈ శాంతి “శాశ్వతం” అవుతుందా? లేక మరో భారీ ఘర్షణకు నాంది పలుకుతుందా? అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. -
ఇరాన్ బి..గ్ ప్లాన్, ప్రపంచానికి కొత్త టెన్షన్!
శాంతి చర్చలు, కాల్పుల విరమణ ఒప్పందాలు, దౌత్యపరమైన కసరత్తులతో పశ్చిమాసియా యుద్ధం అనే అధ్యాయం ముగింపునకు చేరిందని ప్రపంచం భావించింది. కానీ తాజా శాటిలైట్ చిత్రాలు మరో కథను బయటపెడుతున్నాయి. కొన్ని వారాల క్రితం ధ్వంసమైపోయినట్లు కనిపించిన ఇరాన్ స్థావరాల్లో వద్ద మళ్లీ కదలికలు మొదలయ్యాయి. పర్వతాల కింద దాగిన ఆ రహస్య టన్నెల్ నెట్‌వర్క్‌లో అసలేం జరుగుతోంది?.. ఇరాన్ కేవలం పునరుద్ధరణ పనులే చేస్తోందా.. లేదంటే పశ్చిమాసియా యుద్ధంలో సీక్వెల్‌కు సిద్ధపడుతోందా?.. ఇప్పుడు ప్రపంచ భద్రతా వర్గాలను ఈ ప్రశ్న కలవరపెడుతోంది.అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నట్లు భావించిన ఇరాన్ భూగర్భ క్షిపణి టన్నెల్లను మళ్లీ తెరిచే పనులు జోరుగా సాగుతున్నట్లు తాజా శాటిలైట్ చిత్రాలు సూచిస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. దాడులకు గురైన 18 ప్రధాన భూగర్భ క్షిపణి కేంద్రాలకు చెందిన 69 టన్నెల్ ప్రవేశ మార్గాల్లో ఇప్పటికే 50 మార్గాలను ఇరాన్ తిరిగి వినియోగించగల స్థితికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇరాన్ క్షిపణి సామర్థ్యం నిజంగా ఎంత మేర దెబ్బతిందనే ప్రశ్న మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.గత కొంతకాలంగా ఇరాన్ క్షిపణి మౌలిక వసతులపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా భూగర్భంలో నిర్మించిన క్షిపణి నిల్వ కేంద్రాలు, ప్రయోగ స్థావరాలు, టన్నెల్ నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకున్నాయని చెప్పుకున్నాయి. ఈ దాడుల ప్రధాన ఉద్దేశం ఇరాన్ దీర్ఘశ్రేణి క్షిపణులను ఉపయోగించకుండా అడ్డుకోవడమే. టన్నెల్ ప్రవేశ మార్గాలను ధ్వంసం చేసి, లోపల నిల్వ ఉంచిన ఆయుధాలను బయటకు తీసుకురాలేని పరిస్థితి సృష్టించాలని ప్రయత్నించారు. యుద్ధ సమయంలో ఇరాన్‌కు చెందిన 450కు పైగా క్షిపణి సంబంధిత లక్ష్యాలు, నిల్వ కేంద్రాలు, ప్రయోగ సదుపాయాలు దాడులకు గురైనట్లు పాశ్చాత్య అంచనాలు చెబుతున్నాయి.అయితే తాజా శాటిలైట్ చిత్రాలు పూర్తిగా భిన్నమైన దృశ్యాన్ని చూపిస్తున్నాయి. సీఎన్ఎన్ విశ్లేషించిన ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ చిత్రాల ప్రకారం.. కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ భారీ స్థాయిలో పునరుద్ధరణ చర్యలు ప్రారంభించింది. బుల్డోజర్లు, డంప్ ట్రక్కులు, భారీ యంత్రాలతో ధ్వంసమైన ప్రవేశ మార్గాల వద్ద మట్టిని తొలగిస్తూ మళ్లీ టన్నెల్లను తెరుస్తోంది. కొన్ని స్థావరాల వద్ద భారీ బాంబుల కారణంగా ఏర్పడిన గుంతలను పూడ్చివేస్తూ, లోపలికి వెళ్లే రహదారులను తిరిగి అందుబాటులోకి తెస్తున్నట్లు చిత్రాలు సూచిస్తున్నాయి.ఈ పరిణామం అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహాత్మక అంచనాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఎందుకంటే దాడుల అనంతరం ఇరాన్ క్షిపణి ప్రయోగ సామర్థ్యం దాదాపు 90 శాతం వరకు దెబ్బతిందని పాశ్చాత్య విశ్లేషకులు పేర్కొన్నారు. కనీసం 29 క్షిపణి ప్రయోగ కేంద్రాలు, నాలుగు ప్రధాన క్షిపణి తయారీ సముదాయాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అప్పట్లో నివేదికలు వచ్చాయి. కానీ ఇప్పుడు బయటకు వస్తున్న ఆధారాలు చూస్తే.. క్షిపణి నిల్వలు పూర్తిగా నాశనం కాలేదని, కేవలం భూగర్భంలో చిక్కుకుపోయాయని కొందరు నిపుణులు భావిస్తున్నారు. టన్నెల్లను మళ్లీ తెరవగలిగితే ఆ క్షిపణులను తిరిగి వినియోగించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.ఇరాన్‌కు భూగర్భ క్షిపణి కేంద్రాలు అత్యంత కీలకమైన వ్యూహాత్మక ఆస్తులు. పర్వతాల లోపల, వందల మీటర్ల లోతులో నిర్మించిన ఈ కేంద్రాలు వైమానిక దాడులను తట్టుకునేలా రూపొందించబడ్డాయి. అందుకే అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రధాన లక్ష్యంగా ఇవే మారాయి. అయినప్పటికీ, ఇరాన్ గతంలో కూడా దెబ్బతిన్న సైనిక మౌలిక వసతులను వేగంగా పునర్నిర్మించిన చరిత్ర కలిగి ఉంది. తాజా పరిణామాలు అదే సామర్థ్యాన్ని మరోసారి సూచిస్తున్నాయని భద్రతా నిపుణులు పేర్కొంటున్నారు.ఇక హర్ముజ్ జలసంధి పరిసరాల్లో ఉన్న కొన్ని క్షిపణి స్థావరాల్లో కూడా కార్యకలాపాలు పునరుద్ధరించబడుతున్నట్లు పాశ్చాత్య గూఢచార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే హర్ముజ్ ప్రాంతంలో ఇరాన్ మళ్లీ క్షిపణి సామర్థ్యాన్ని పెంచుకుంటే మధ్యప్రాచ్య భద్రతా సమీకరణాలపై దాని ప్రభావం గణనీయంగా ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ధ్వంసమైన టన్నెల్లను తిరిగి తెరవడం, భూగర్భ స్థావరాల్లో కార్యకలాపాలను పునరుద్ధరించడం ద్వారా ఇరాన్ తన వ్యూహాత్మక సామర్థ్యాన్ని మళ్లీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని టెన్నెల్స్ తిరిగి అందుబాటులోకి రావడం, భూగర్భ నిల్వల్లో ఇంకా గణనీయమైన క్షిపణి సామర్థ్యం మిగిలి ఉండొచ్చన్న అంచనాలు పశ్చిమాసియా భద్రతా సమీకరణాలను మరోసారి సంక్లిష్టంగా మారుస్తున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం ముగిసిపోయిందని భావించడానికి ప్రపంచం ఇంకా సిద్ధంగా ఉండలేకపోతోంది. -
ట్రంప్‌వి బిల్డప్ బాబాయ్ మాటలే..!
‘అన్నీ సెట్ అయిపోయాయి.. నౌకలు ఇంటికి వెళ్లొచ్చు’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇరాన్‌తో ఒప్పందం దాదాపు ఖరారైందన్న సంకేతాలతో అంతర్జాతీయ వర్గాలు ఊరట చెందాయి. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ వెంటనే కౌంటర్ ఇచ్చింది. ఆయన చెప్పిన కీలక అంశాల్లో చాలా వరకు ముసాయిదా ఒప్పందంలోనే లేవని స్పష్టం చేసింది. దీంతో ప్రపంచాన్ని ఊరించిన ట్రంప్ ప్రకటన అంతా బిల్డప్పేనా? అనే చర్చ జోరుందుకుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని స్పష్టం చేసిన ఆయన, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని ఎలాంటి సుంకాలు లేకుండా తిరిగి తెరవాలని పేర్కొన్నారు. జలసంధిలో ఏర్పాటు చేసిన సముద్ర మైన్లను వెంటనే నిర్వీర్యం చేయాలని, అక్కడ నిలిచిపోయిన నౌకలు మళ్లీ ప్రయాణాలు ప్రారంభించవచ్చని తెలిపారు."హర్ముజ్‌లో చిక్కుకుపోయిన నౌకలు ఇప్పుడు ఇంటివైపు ప్రయాణం ప్రారంభించవచ్చు. మీ భార్యలకు, భర్తలకు, కుటుంబ సభ్యులకు నా తరఫున హలో చెప్పండి" అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే అమెరికా అమలు చేసిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తున్నామని కూడా ఆయన ప్రకటించారు. అంతేకాదు.. ఇరాన్ వద్ద ఉన్న సుసంపన్న యురేనియం నిల్వలను అమెరికా, ఇరాన్, అంతర్జాతీయ అణుశక్తి పర్యవేక్షణ సంస్థ సమన్వయంతో వెలికితీసి పూర్తిగా ధ్వంసం చేస్తామని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధ పరిహారం, పెట్టుబడులు లేదంటే ఇతర రూపాల్లో ఇప్పట్లో ఎలాంటి నిధుల మార్పిడి ఉండదని, తదుపరి ప్రకటన వచ్చే వరకు డబ్బు చెల్లింపులు నిలిపివేస్తామని స్పష్టం చేశారు. అయితే తక్కువ ప్రాముఖ్యత కలిగిన కొన్ని అంశాలపై మాత్రమే ఇప్పటివరకు అంగీకారం కుదిరిందని కూడా వెల్లడించారు.అయితే ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్‌కు చెందిన ఫార్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం, ట్రంప్ చెప్పిన అంశాలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడం లేదని పేర్కొంది. హర్ముజ్ జలసంధిని తెరవడం జరిగితే అది పూర్తిగా ఇరాన్ నిబంధనల ప్రకారమే ఉంటుందని స్పష్టం చేసింది. నౌకల తనిఖీలు, భద్రతా చర్యలు, సముద్ర సేవలు కొనసాగుతాయని, ఎలాంటి షరతులు లేకుండా జలసంధిని తెరవడానికి తాము అంగీకరించలేదని వెల్లడించింది.అలాగే ఇరాన్ అణు పదార్థాలను ధ్వంసం చేయడం, అణు కార్యక్రమాన్ని పూర్తిగా విరమించుకోవడం వంటి నిబంధనలు చర్చల్లో ఉన్న ముసాయిదా ఒప్పందంలో అసలు లేవని పేర్కొంది. ట్రంప్ చేసిన ఆ ప్రకటనలకు ఎలాంటి ఆధారమూ లేదని స్పష్టం చేసింది.ఇరాన్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం చర్చల్లో అత్యంత కీలక అంశం విదేశాల్లో స్తంభింపజేసిన 12 బిలియన్ డాలర్ల ఇరానీ నిధుల విడుదల. ఆ నిధులు విడుదలైన తర్వాతే తదుపరి దశ చర్చలకు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే లెబనాన్‌లో పూర్తి కాల్పుల విరమణ కూడా చర్చల్లో ప్రధాన అంశంగా ఉన్నట్లు తెలుస్తోంది.దీంతో అమెరికా–ఇరాన్ మధ్య ఒప్పందం నిజంగా ఎంత దూరం వెళ్లిందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవైపు ఒప్పందం దాదాపు పూర్తైందని ట్రంప్ చెబుతుండగా, మరోవైపు అలాంటి అంగీకారాలు ఏవీ జరగలేదని ఇరాన్ వాదిస్తోంది. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనల మధ్య అసలు నిజం ఏమిటన్నది తేలాలంటే తుది ఒప్పందం వెలుగులోకి రావాల్సిందే. ప్రస్తుతం మాత్రం ప్రపంచ దృష్టి మొత్తం వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య జరుగుతున్న ఈ దౌత్య పోరుపైనే కేంద్రీకృతమైంది. -
మెగా డీల్: ఇరాన్‌కు అమెరికా బంపరాఫర్!
మిడిల్ఈస్ట్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరదించుతూ అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు కీలక మలుపు దిశగా సాగుతున్నాయి. హర్ముజ్ జలసంధి, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అణు ఒప్పందం వంటి సున్నిత అంశాలపై చర్చలు ఓ కొలిక్కి వస్తున్నట్లు సమాచారం. అయితే “మెగా డీల్”లో భాగంగా ఇరాన్‌కు అమెరికా భారీ ఆర్థిక, వ్యూహాత్మక ఆఫర్లు ఇచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య గత కొన్ని వారాలుగా సాగుతున్న చర్చలు ఇప్పుడు ఒక తాత్కాలిక అంగీకారం (MoU) దశకు చేరుకున్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఈ అంగీకారం అమలైతే రెండు దేశాల మధ్య 60 రోజుల పాటు కాల్పుల విరమణ కొనసాగుతూ, ప్రధాన అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. ఇక చర్చల్లో ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమం కీలక అంశంగా ఉంది. ఇరాన్ వద్ద ఉన్న అధికంగా శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై నియంత్రణలు విధించడం, భవిష్యత్తులో అణ్వాయుధాల అభివృద్ధి చేయబోమని హామీ ఇవ్వడం వంటి అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి.ఇక మరో కీలక అంశం హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని పూర్తిగా తెరవడం, మైన్స్ తొలగించడం, నౌకా రవాణాపై ఆంక్షలు తగ్గించడం వంటి ప్రతిపాదనలు చర్చలో ఉన్నాయి. దీనికి ప్రతిగా అమెరికా కూడా తన నావికా ఆంక్షలను దశలవారీగా తగ్గించే అవకాశం ఉందని సమాచారం. అదే సమయంలో.. ఇరాన్‌పై ఉన్న ఆర్థిక ఆంక్షల సడలింపు, విదేశాల్లో నిలిచిపోయిన బిలియన్ల డాలర్ల ఆస్తుల విడుదలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్‌కు మానవతా సహాయం అందించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది. ఈ డీల్‌లో అత్యంత చర్చనీయాంశంగా మారింది 300 బిలియన్ డాలర్ల విలువైన “పునర్నిర్మాణ పెట్టుబడి నిధి”. ఒప్పందం తుది దశకు చేరుకుంటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణానికి ఈ నిధులు ఉపయోగపడతాయని చెబుతున్నారు. అంతేకాదు, అమెరికా కంపెనీలు కూడా ఇరాన్లో పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పించాలన్న ఆలోచన కూడా ఉంది.అయితే ఈ ఫైల్ ఇంకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టేబుల్ మీదే ఉందని.. ఆ ప్రతిపాదనకు ఇంకా ఆయన ఓకే చెప్పలేదని సమాచారం. అలాగే ఇరు దేశాల నుంచి సానుకూలత ఉందా? అనేదానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే ఒప్పందంలో కొన్ని అంశాలపై అమెరికా, ఇరాన్ మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఒప్పందం ఎప్పుడు తుది రూపం దాల్చుతుందో స్పష్టత లేకపోయినా.. రెండు దేశాల మధ్య చర్చలు మాత్రం వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తంగా చూస్తే, శత్రుత్వం నుంచి శాంతి దిశగా ఒక పెద్ద మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తున్న ఈ డీల్ ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. -
ట్రంప్ ఏం చెబుతాడో?.. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ
మూడు నెలలుగా పశ్చిమాసియాను అగ్నికుండంలా మార్చిన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు ముగింపు దగ్గరపడిందా? ప్రపంచాన్ని వణికించిన యుద్ధ మేఘాల మధ్య ఇప్పుడో ఆశాకిరణం కనిపిస్తోంది. అమెరికా–ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక అవగాహన కుదిరిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ ఒప్పందానికి అసలైన గ్రీన్‌సిగ్నల్ ఇంకా రావాల్సి ఉండటంతో ప్రపంచ దృష్టి ఇప్పుడు వైట్‌హౌస్‌పైనే నిలిచింది.అమెరికా, ఇరాన్ ప్రతినిధులు 60 రోజుల తాత్కాలిక అవగాహన ఒప్పందం (MoU)పై ప్రధాన అంశాల్లో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే కాల్పుల విరమణ కొనసాగడమే కాకుండా ఇరాన్ అణు కార్యక్రమంపై మళ్లీ చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధాల దిశగా వెళ్లబోదని హామీ ఇవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది.ఈ చర్చల్లో అత్యంత కీలక అంశంగా హర్ముజ్ జలసంధి మారింది. ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గమైన ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతించాలనే ప్రతిపాదనపై చర్చలు జరిగినట్లు సమాచారం. ఇందుకోసం ఇరాన్ సీమైన్లను (సముద్రంలో అమర్చిన బాంబులను) తొలగించడం, వాణిజ్య నౌకలపై జోక్యం చేసుకోకపోవడం వంటి షరతులు ఉండొచ్చని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. దానికి ప్రతిగా అమెరికా తన నౌకాదళ నిర్బంధాన్ని దశలవారీగా సడలించే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఈ ఒప్పందానికి తుది ఆమోదం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచే రావాల్సి ఉండటంతో, ఆయన వైఖరి ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.మరోవైపు.. పశ్చిమాసియాలో పరిస్థితి ఇంకా పూర్తిగా చల్లబడలేదు. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ ఇరు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ దాడి చేయగా.. బందర్ అబ్బాస్ సమీపంలో ఇరాన్ డ్రోన్ కేంద్రాలపై అమెరికా ప్రతిదాడులు జరిపింది. అమెరికా దళాలు ఐదు డ్రోన్లను కూల్చివేశామని ప్రకటించగా.. ఇరాన్ మాత్రం తమపై దాడులు పునరావృతమైతే మరింత తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించింది.ఇదే సమయంలో హర్ముజ్ జలసంధి నిర్వహణలో ఒమన్, ఇరాన్ కలిసి పనిచేస్తున్నాయన్న వార్తలను ట్రంప్ తీవ్రంగా ఖండించారు. “అది అంతర్జాతీయ జలమార్గం.. ఎవరూ దానిపై ఆధిపత్యం చెలాయించలేరు” అంటూ ఘాటుగా స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలు ఇటు టెహ్రాన్‌లో ఆగ్రహానికి దారితీశాయి.మరోవైపు ఇజ్రాయెల్–హెజ్బొల్లా ఘర్షణలు కూడా ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. లెబనాన్, బీరూట్‌లో హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతుండగా.. ఉత్తర ఇజ్రాయెల్‌లో సైరన్లు మోగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య అమెరికా–ఇరాన్ ఒప్పందం ప్రపంచ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ తుది నిర్ణయం మాత్రం ఇప్పుడు ఒక్క ట్రంప్ చేతుల్లోనే ఉండటం గమనార్హం. -
ప్రపంచాన్ని గందరగోళంలోకి నెడుతూ.. హర్ముజ్ హైడ్రామా
ఒక రోజు యుద్ధ హెచ్చరికలు.. మరుసటి రోజు శాంతి చర్చలు..! ఉదయం ఒప్పందం కుదిరిందంటూ ప్రకటనలు.. సాయంత్రానికి “అది ఫేక్” అంటూ ఖండనలు..! ప్రస్తుతం హర్ముజ్ జలసంధి చుట్టూ అమెరికా-ఇరాన్ వ్యవహారం అంతర్జాతీయ రాజకీయాల కంటే ఎక్కువగా ఒక హైటెన్షన్ డ్రామాను తలపిస్తోంది.ఒకవైపు ప్రపంచ చమురు మార్కెట్లు వణికిపోతుంటే.. మరోవైపు రెండు దేశాలు మాత్రం మాటల యుద్ధంతో ప్రపంచాన్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇరాన్ ప్రభుత్వ మీడియా ఒక్కసారిగా “అమెరికాతో ఒప్పందం కుదిరింది.. హర్ముజ్‌ను మళ్లీ తెరుస్తాం” అంటూ ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లు ఊపిరిపీల్చుకున్నాయి. అమెరికా ఆంక్షలు ఎత్తివేస్తుందని, సైన్యాన్ని వెనక్కి తీసుకుంటుందని కూడా ఇరాన్ ప్రచారం చేసింది.అంతేకాదు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా గత కొన్ని రోజులుగా “ఇరాన్ చర్చలకు సిద్ధమైంది.. అణు ఒప్పందం దిశగా పురోగతి ఉంది.. హర్ముజ్‌లో మళ్లీ స్వేచ్ఛా వాణిజ్యం జరుగుతుంది” అంటూ వరుస ప్రకటనలు చేస్తూ వచ్చారు. దీంతో నిజంగానే రెండు దేశాలు రాజీ దిశగా వెళ్తున్నాయనే అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది.కానీ అప్పుడే కథలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన వైట్‌హౌస్.. ఇరాన్ మీడియా విడుదల చేసిన ఒప్పంద ముసాయిదా “పూర్తిగా కల్పితం” అంటూ తేల్చేసింది. దీంతో అసలు నిజం ఏంటన్నది ప్రపంచ దేశాలకు అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ట్రంప్ శాంతి సంకేతాలు ఇస్తుంటే.. మరోవైపు వైట్‌హౌస్ మాత్రం ఒప్పందాన్నే ఖండించడం ఇప్పుడు మరింత గందరగోళానికి దారి తీసింది.ఇదే సమయంలో అమెరికా మరోవైపు ఇరాన్‌పై వైమానిక దాడులు కొనసాగిస్తుండటం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఒకచేత్తో చర్చలు.. మరోచేత్తో దాడులు అనే విధంగా అమెరికా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా “యుద్ధం ఉండదు” అంటూనే, హర్ముజ్‌పై నియంత్రణ మాత్రం తమదేనని స్పష్టం చేస్తోంది.ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్ముజ్ జలసంధి చుట్టూ ఇలాంటి ప్రకటనలు రావడం వల్ల మార్కెట్లు ఒక్కసారిగా కుదేలవుతున్నాయి. చమురు ధరలు భారీగా మారిపోతుండగా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో అమెరికా-ఇరాన్ దేశాలు నిజంగా శాంతి కోరుకుంటున్నాయా..? లేక ప్రపంచంపై ఒత్తిడి పెంచేందుకు రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయా..? అనే చర్చ అంతర్జాతీయ వేదికలపై జోరుగా సాగుతోంది. -
ట్రంప్ ప్లాన్‌తో పాక్ పాస్‌పోర్ట్ చెల్లదా?
“ఈ పాస్‌పోర్ట్ ఇజ్రాయెల్‌కు చెల్లదు”.. అని పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌పై కనిపిస్తున్న వాక్యం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కారణం… అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రతిపాదనే. పశ్చిమాసియా శాంతి ఒప్పందాల్లో భాగంగా పాకిస్థాన్ కూడా ఇజ్రాయెల్‌తో సంబంధాలు సాధారణీకరించాలని ట్రంప్ ఒత్తిడి తెస్తుండటంతో… “పాకిస్థాన్ తన పాస్‌పోర్ట్ నిబంధనలనే మార్చాల్సి వస్తుందా?” అనే చర్చ మొదలైంది.ట్రంప్ తాజాగా “అబ్రహామ్ అకార్డ్స్” విస్తరణపై మాట్లాడారు. సౌదీ అరేబియా, ఖతర్, టర్కీతో పాటు పాకిస్థాన్ కూడా ఈ ఒప్పందాల్లో చేరాలని ఆయన సూచించారు. మిడిల్ ఈస్ట్‌లో శాంతి, ఆర్థిక సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం ఇజ్రాయెల్‌తో ముస్లిం దేశాలు సంబంధాలు ఏర్పరచుకోవాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. “ఈ ఒప్పందంలో భాగం కావాలనుకోని దేశాలు భవిష్యత్తు డీల్‌లో ఉండకూడదు” అంటూ ఆయన స్పష్టం చేశారు.అయితే పాకిస్థాన్ మాత్రం వెంటనే ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ మాట్లాడుతూ… “ఇజ్రాయెల్‌పై నమ్మకం లేదు. పాలస్తీనా సమస్య పరిష్కారం కాకుండా మేం గుర్తింపు ఇవ్వం” అని స్పష్టం చేశారు. మరోవైపు ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాఖ్ దార్ కూడా అదే మాట చెప్పారు. 1967 సరిహద్దుల ప్రకారం స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడితేనే ఇజ్రాయెల్‌ను గుర్తించే అంశం పరిశీలిస్తామని పాకిస్థాన్ చెబుతోంది.అబ్రహం అకార్డ్స్అబ్రహం అకార్డ్స్.. 2020లో అమెరికా మధ్యవర్తిత్వంలో ఇజ్రాయెల్–అరబ్ దేశాల మధ్య కుదిరిన సంబంధాల సాధారణీకరణ ఒప్పందాల పేరు. యూదులు, ముస్లింలు, క్రైస్తవులందరికీ సామాన్య పితామహుడిగా భావించే “అబ్రహాం” పేరు మీద ఈ ఒప్పందాలకు పేరు పెట్టారు. వాణిజ్యం, పర్యాటకం, సాంకేతికత, భద్రతా సహకారాన్ని పెంచడం వీటి ప్రధాన లక్ష్యం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, మొరాకో వంటి దేశాలు ఇందులో చేరి ఇజ్రాయెల్‌తో నేరుగా దౌత్య, వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకున్నాయి. విమాన సర్వీసులు, టూరిజం, వ్యాపారం, సాంకేతిక సహకారం వంటి రంగాల్లో ఈ ఒప్పందాలు కీలక మార్పులు తీసుకొచ్చాయి. అయితే.. పాలస్తీనా సమస్య పరిష్కారం కాకముందే అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌తో చేతులు కలపడం వల్ల ఇవి మిడిల్ ఈస్ట్ పాలిటిక్స్‌లో చారిత్రక మలుపుగా భావించబడ్డాయి.నిబంధనల దాకా..ఇక్కడే పాకిస్థాన్‌కు పెద్ద చిక్కు ఎదురవుతుంది. ప్రస్తుతం పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌పై స్పష్టంగా ఇజ్రాయెల్‌కు మినహాయింపు(Israel excepted) అనే నిబంధన ఉంది. అంటే ప్రపంచంలోని అన్ని దేశాలకు ఈ పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుందిగానీ… ఇజ్రాయెల్‌కు మాత్రం కాదు. ఒకవేళ పాకిస్థాన్ ఇజ్రాయెల్‌తో అధికారిక సంబంధాలు ఏర్పరచుకుంటే… అదే సమయంలో తమ పౌరులు అక్కడికి వెళ్లకూడదని చెప్పే పాస్‌పోర్ట్ కొనసాగించడం చట్టపరంగా విరుద్ధంగా మారుతుంది. దౌత్య సంబంధాలు, వీసాలు, ట్రేడ్, ఎంబసీ వ్యవస్థ అన్నీ అమల్లోకి రావాలంటే ఈ నిబంధనను తొలగించాల్సిందే.ఇలాంటి పరిణామం ఇప్పటికే బంగ్లాదేశ్‌లో జరిగింది. ఆధునిక ఈ-పాస్‌పోర్ట్‌లను ప్రవేశపెట్టే సమయంలో “except Israel” అనే వాక్యాన్ని అక్కడి ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు పాకిస్థాన్ విషయంలో కూడా అదే ప్రశ్న ముందుకొస్తోంది. అందుకే… ట్రంప్ ప్రతిపాదన కేవలం విదేశాంగ రాజకీయాల మార్పు మాత్రమే కాదు… పాకిస్థాన్ జాతీయ గుర్తింపులో భాగమైన పాస్‌పోర్ట్ నిబంధనల వరకూ వెళ్లే పెద్ద చర్చగా మారింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ అబ్రహాం ఒప్పందాలను మరింత విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో పాక్‌తో పాటు సౌదీ అరేబియా, ఖతర్, టర్కీ వంటి దేశాలు కూడా చేరాలని ఆయన ఒత్తిడి తెస్తున్నారు. మధ్యప్రాచ్యంలో శాంతి, ఆర్థిక భాగస్వామ్యం, ఇజ్రాయెల్‌తో సహకారం కోసం ఈ ఒప్పందాల్లో చేరడం అవసరమని ట్రంప్ భావిస్తున్నారు.ఏయే దేశాలంటే.. ప్రపంచ దేశాల పాస్‌పోర్ట్‌లలో సాధారణంగా.. “ఈ పాస్‌పోర్ట్ ప్రపంచంలోని అన్ని దేశాలకు చెల్లుతుంది” అనే వాక్యం కనిపిస్తుంది. కానీ పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌పై మాత్రం దశాబ్దాలుగా .. “ఇజ్రాయెల్‌కు మినహా ప్రపంచంలోని అన్ని దేశాలకు ఈ పాస్‌పోర్ట్ చెల్లుతుంది” అనే వాక్యం ముద్రించబడుతోంది. పాకిస్థాన్ ఈ నిబంధనను ఎందుకు తీసుకొచ్చిందో అర్థం చేసుకోవాలంటే చరిత్రలోకి వెళ్లాలి. 1947లో భారత విభజన తర్వాత ముస్లింల కోసం ప్రత్యేక దేశంగా పాకిస్థాన్ ఏర్పడింది. ఆ తర్వాత ఏడాది, అంటే 1948లో ఇజ్రాయెల్ దేశం ఆవిర్భవించింది. అప్పటి నుంచే పాలస్తీనా భూభాగాలపై వివాదం మొదలైంది. పాలస్తీనాకు మద్దతుగా నిలిచిన పాకిస్థాన్… ఇజ్రాయెల్‌ను అధికారిక దేశంగా గుర్తించబోమని స్పష్టం చేసింది. ఈ విధానంలో భాగంగానే పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌లపై “ఇజ్రాయెల్‌కు చెల్లదు” అనే నిబంధనను ముద్రించడం ప్రారంభించింది. 1950ల చివరి దశ నుంచి 1960ల నాటికి ఈ వాక్యం అధికారికంగా పాస్‌పోర్ట్‌లలో స్థిరపడినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. ఇది కేవలం పాకిస్థాన్‌కే పరిమితమైన విషయం కాదు. ఒకప్పుడు అనేక ముస్లిం దేశాలు ఇలాంటి విధానాలనే పాటించాయి. అరబ్–ఇజ్రాయెల్ యుద్ధాల తర్వాత ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించిన దేశాలు తమ పౌరులు అక్కడికి వెళ్లకుండా పాస్పోర్ట్లపైనే నిషేధాలను ముద్రించేవి. బంగ్లాదేశ్, మలేషియా, బ్రూనై, ఇరాన్, సిరియా, లెబనాన్, కువైట్ వంటి దేశాలు కూడా ఇలాంటి ఆంక్షలను అమలు చేశాయి. కాలక్రమేణా ప్రపంచ రాజకీయాలు మారాయి. అనేక దేశాలు ఇజ్రాయెల్‌తో సంబంధాలు పెంచుకున్నాయి. దీంతో కొన్ని దేశాలు పాస్‌పోర్ట్‌లలోని ఆ నిబంధనలను తొలగించాయి. బంగ్లాదేశ్ ఇందుకు ముఖ్య ఉదాహరణ. అక్కడ కూడా చాలాకాలం పాటు “ఇజ్రాయెల్‌కు మినహా” అనే వాక్యం ఉండేది. కానీ ఆధునిక సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా కొత్త పాస్‌పోర్ట్‌లను ప్రవేశపెట్టేటప్పుడు ఆ వాక్యాన్ని తొలగించారు. అయితే ఇజ్రాయెల్‌ను అధికారికంగా గుర్తించలేదనే తమ వైఖరి మాత్రం మారలేదని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం కూడా పాకిస్థాన్, ఇరాన్ వంటి కొన్ని దేశాలు ఇజ్రాయెల్‌పై కఠిన వైఖరినే కొనసాగిస్తున్నాయి. పాకిస్థాన్ స్పష్టంగా చెబుతున్న విషయం ఏమిటంటే… పాలస్తీనాకు స్వతంత్ర దేశ హోదా లభించే వరకు ఇజ్రాయెల్‌ను గుర్తించే ప్రసక్తే లేదని. బంగ్లా బాటలో వెళ్తే.. మొదటిగా పాస్‌పోర్ట్‌లను పూర్తిగా మార్చాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్న “ఇజ్రాయెల్‌కు మినహా” అనే నిబంధనను తొలగించాలంటే కొత్త నమూనా పాస్‌పోర్ట్‌లు ముద్రించాలి. లక్షలాది పాస్‌పోర్ట్‌లను దశలవారీగా మార్చాల్సి రావచ్చు. ఇది ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. అదే సమయంలో వీసా విధానాలు, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, విమాన సర్వీసులు, రాయబార కార్యాలయాల ఏర్పాట్లు వంటి అనేక వ్యవస్థల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. రెండు దేశాల మధ్య అధికారిక ప్రయాణాలు ప్రారంభమైతే చట్టపరమైన మార్పులు కూడా తప్పవు.అయితే అసలు భారమంతా రాజకీయంగానే ఉండొచ్చు. ఎందుకంటే పాకిస్థాన్‌లో పాలస్తీనా అంశం భావోద్వేగానికి సంబంధించినది. ఇజ్రాయెల్‌ను గుర్తించడం అంటే “దశాబ్దాల వైఖరికి విరుద్ధం” అని మతపరమైన, రాజకీయ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. ముఖ్యంగా మతపరమైన పార్టీలు, కఠినవాద సంస్థలు దీన్ని పెద్ద రాజకీయ అంశంగా మార్చవచ్చు. మరోవైపు సైన్యం, విదేశాంగ వ్యవస్థ కూడా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ లాంటి దేశాలతో సంబంధాలపై కూడా దాని ప్రభావం పడొచ్చు.ఇక మద్దతుదారులు మాత్రం వేరే వాదన చేస్తున్నారు. ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఏర్పడితే సాంకేతికత, వ్యవసాయం, భద్రత, వాణిజ్య రంగాల్లో లాభాలు రావచ్చని అంటున్నారు. మధ్యప్రాచ్య దేశాలతో ఆర్థిక భాగస్వామ్యం మరింత బలపడుతుందని కూడా అభిప్రాయపడుతున్నారు. అందుకే… ఇది కేవలం పాస్‌పోర్ట్‌పై ఒక లైన్ మార్చడం కాదు. పాకిస్థాన్ దశాబ్దాల రాజకీయ సిద్ధాంతాన్ని మార్చే నిర్ణయంగా మారే అవకాశం ఉంది. -
బాంబుల మోత మధ్య ట్రంప్ బిగ్ డిమాండ్
పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరోసారి తీవ్రంగా మారాయి. ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని బందర్ అబ్బాస్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం తాజా దాడులు చేసినట్లు ప్రకటించింది. మిసైల్ స్థావరాలు, మైన్లు అమర్చేందుకు ప్రయత్నిస్తున్న పడవలను లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది. ఇవి తమ దళాల రక్షణ కోసం “స్వీయరక్షణ చర్యలు”గా చేపట్టినట్లు అమెరికా పేర్కొంది.ఇరాన్ దళాల నుంచి ఉన్న ప్రమాదాలను అడ్డుకునేందుకే ఈ దాడులు జరిగాయని అమెరికా ప్రకటించుకుంది. అయితే ఇదే సమయంలో దోహాలో అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతుండటం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. ఇరాన్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఖతార్ ప్రధానితో చర్చలు జరుపుతున్న సమయంలోనే ఈ దాడులు జరగడం గమనార్హం.ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం.. బందర్ అబ్బాస్ ప్రాంతంలో పలు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అనంతరం అక్కడి గగనతల రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయని, శత్రు లక్ష్యాలను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకున్నాయని సమాచారం. పర్షియన్ గల్ఫ్ సమీపంలోని సిరిక్, జాస్క్ ప్రాంతాల్లో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానిక మీడియా తెలిపింది.ఈ ఘటనలపై ఇరాన్ ఇంకా అధికారికంగా పూర్తి స్థాయి ప్రతిస్పందన ఇవ్వలేదు. అయితే దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ నూతన నేత కఠిన వ్యాఖ్యలు చేస్తూ “మేము వెనక్కి తగ్గేది లేదు” అని హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్‌పై పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.ట్రంప్ బిగ్ డిమాండ్ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారి తీశాయి. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం (enriched uranium) ను పూర్తిగా నియంత్రించాల్సిందేనని.. అది రెండు మార్గాల్లో జరగొచ్చని ఆయన సూచించారు. ఒకటి.. ఇరాన్ తమ దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు అప్పగించాలి. రెండోది.. అంతర్జాతీయ పర్యవేక్షణలోనైనా ధ్వంసం చేయాలి. ఈ మేరకు ట్రంప్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు. ఇరాన్ అణు కార్యక్రమంపై కఠిన నియంత్రణ అవసరమని ఆయన ఉధాట్టించారు.ఇరాన్–అమెరికా మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. ఈ తాజా దాడులు మరియు హెచ్చరికలు ఆ చర్చలకు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గల్ఫ్ ప్రాంతంలో శాంతి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఈ ఉద్రిక్తతలు పెరగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు జరుపుతోంది. ఇక్కడ కూడా కాల్పుల విరమణ అమల్లోకి ఉన్నప్పటికీ.. హెజ్బొల్లా గ్రూపుపై దాడులు కొనసాగిస్తున్నట్లు సమాచారం అందుతోంది. సుమారు 70 స్థావరాలను లక్ష్యంగా చేసుకోగా.. 10 కమాండ్ సెంటర్లు సహా ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. లెబనాన్ వర్గాలు ఈ దాడుల్ని ఖండిస్తున్నట్లు ప్రకటించాయి. -
దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు
వాహనదారులకు వరుస షాకులు తప్పడం లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు పదిరోజుల వ్యవధిలో నాలుగసార్లు.. అదీ భారీగా పెరిగాయి. ఇక ఇప్పుడు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) వంతు వచ్చింది. గ్యాస్ పంపిణీ సంస్థలు కిలో రూ.2 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ఈ రేటు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చింది. దేశంలో విస్తృతంగా వినియోగంలో ఉన్న సీఎన్జీ ధరలు పెరిగాయి. తాజా పెంపుతో ఢిల్లీ-NCR రీజియన్‌లో కిలోకు రూ.83 కు చేరింది. మే 15 నుంచి ఇలా పెంచుకుంటూ రావడం ఇది నాలుగోసారి. అంతకు ముందు.. మే 15న రూ2, మే 18న రూ1, మే 23న మరో రూ.1 పెంచాయి. ఇప్పుడు తాజాగా రూ.2 పెంపుతో కేవలం 11 రోజుల్లోనే దాదాపు రూ.6 వరకు ధరలు పెరిగాయి.సీఎన్జీ ధరలు – నగరాల వారీ లిస్ట్ (కేజీకి)ఢిల్లీ – రూ.83ముంబై – రూ.81పుణే – రూ.92.50నాగ్‌పూర్ – రూ.88.90అహ్మదాబాద్ – రూ.82.30వడోదరా – రూ.81.35గాంధీనగర్ – రూ.76.98నోయిడా – రూ.85.07ఫరీదాబాద్ – రూ.88.72హైదరాబాద్ – రూ.99విజయవాడ – రూ.93గుంటూరు – రూ.92బెంగళూరు – రూ.90చెన్నై – రూ.91.5కోల్‌కతా – రూ.93.5గమనిక: నగరాల వారీ ధరలు గ్యాస్ కంపెనీ + రాష్ట్ర ట్యాక్స్‌లపై ఆధారపడి మారుతాయికాలుష్య నియంత్రణ లక్ష్యాలతో ప్రభుత్వాలు సీఎన్జీ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నది తెలిసిందే. భారత్‌లో ముఖ్యంగా ఢిల్లీ-NCR, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రో నగరాలతో పాటు టైర్ టూ సిటీల్లో, పట్టణాల్లోనూ సీఎన్జీ వాహనాల వినియోగం అధికంగా ఉంది. ఆటోలు, క్యాబ్‌లు, నగర బస్సులు వంటి రవాణా రంగం పెద్ద మొత్తంలో ఈ ఇంధనంపై ఆధారపడుతున్నాయి. అయితే ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండగా.. ఇప్పుడు తక్కువ ఖర్చు ప్రత్యామ్నాయంగా భావించిన సీఎన్జీ కూడా పెరుగుతున్న రేట్ల వాహనదారుల్ని బెంబేలెత్తిస్తోంది. సీఎన్జీ ధరల పెరుగుదల వెనుక ప్రధాన కారణం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో కొనసాగుతున్న అనిశ్చితే. పశ్చిమాసియా సంక్షోభం, గ్యాస్ సరఫరా మార్గం హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు, గ్లోబల్ గ్యాస్ ధరల్లో మార్పులు.. ఫలితంగా భారత్ వంటి దేశాల్లో ఎల్ఎన్జీ (Liquefied Natural Gas) కొనుగోలు( దిగుమతి) ఖర్చు పెరుగుతోంది. తద్వారా ఎల్ఎన్జీని ప్రాసెస్ చేసి వాహన ఇంధనంగా మార్చే సీఎన్జీ సరఫరా వ్యయం కూడా పెరుగుతోందన్నమాట. రవాణా, నిల్వ, పంపిణీ వ్యయాలు పెరుగుతున్నాయి కాబట్టే గ్యాస్ పంపిణీ సంస్థలు రేట్లను సవరించాల్సి వస్తోంది. అయితే అంతిమంగా మాత్రం భారం వాహనదారులపైనే పడుతోంది. -
సీజ్ఫైర్ ఉన్నా ఆత్మరక్షణ కోసం తప్పట్లేదు
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. యుద్ధ విరమణ, శాంతి చర్చల ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలోనే అమెరికా దళాలు ఇరాన్‌పై దాడులకు దిగాయి. ఈ దాడులు “ఆత్మరక్షణ చర్యలు”గా ప్రకటించినప్పటికీ.. ఘర్షణలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ Reuters నివేదిక ప్రకారం.. సోమవారం అమెరికా సైన్యం దక్షిణ ఇరాన్ ప్రాంతంలో బందర్ అబ్బాస్ వద్ద పలు లక్ష్యాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో.. హర్ముజ్‌లో సీమైన్స్ అమర్చేందుకు ప్రయత్నిస్తున్న బోట్స్‌తో పాటు మిస్సైల్ లాంచ్ సైట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించుకుంది.అయితే ఈ చర్యలు తమ సైనిక బలగాలను రక్షించుకోవడానికే అని యూఎస్‌సీసీ స్పష్టం చేసింది. “ప్రస్తుతం కొనసాగుతున్న సీజ్ఫైర్ పరిస్థితుల్లో కూడా మా బలగాల రక్షణ కోసం జాగ్రత్తగా, పరిమితంగా చర్యలు తీసుకుంటున్నాం” అని నేవీ కెప్టెన్ టిమ్ హాకిన్స్ పేర్కొన్నారు.అమెరికా వర్గాల ప్రకారం.. ఇరాన్ మద్దతు ఉన్న శక్తులు తమ దళాలపై ముప్పు కలిగించే ప్రయత్నాల్లో ఉన్నాయని, అందుకే ఈ “ప్రివెంటివ్ స్ట్రైక్స్” తప్పనిసరి అయ్యాయని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడుల్ని ధృవీకరించాల్సి ఉంది. ఈ దాడులపై ఇరాన్ ఇంకా స్పందించాల్సి ఉంది. ఇటు లెబనాన్‌లోనూ కాల్పుల విరమణకు తూట్లు పడింది. హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది. ఈ దాడులపై ఇజ్రాయెల్ వర్గాలు “సరిహద్దు భద్రత కోసం అవసరమైన చర్యలు”గా వివరణ ఇస్తుండగా.. లెబనాన్ వర్గాలు మాత్రం దీనిని కాల్పుల విరమణ ఉల్లంఘనగా ఖండిస్తున్నాయి.ఇరాన్–అమెరికా మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ తాజా దాడులు చర్చలను మరింత సంక్లిష్టం చేస్తాయా? అనే ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఈ ఘటనపై ఇరాన్ పూర్తి స్థాయి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. అలాగే అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాన్ని ఎలా చూడబోతుందన్నది కూడా కీలకంగా మారింది. -
ఇరాన్ డీల్‌పై నిమ్మలంగా ట్రంప్!
దాదాపు మూడు నెలలుగా ప్రపంచాన్ని వణికించిన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. అయితే కాల్పుల తీవ్రత కొంత తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. “డీల్ కోసం తొందరపడొద్దు.. సమయం మాకే అనుకూలంగా ఉంది” అంటూ ట్రంప్ చెప్పడం వెనుక అసలు వ్యూహం ఏంటనేది అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ట్రంప్ చేసిన ఆ ఒక్క వ్యాఖ్యతో మళ్లీ ప్రపంచ మార్కెట్లు, చమురు దేశాలు, దౌత్య వర్గాల్లో టెన్షన్ మొదలైంది. ట్రంప్ వ్యాఖ్యలను పరిశీలిస్తే.. అమెరికా ఇప్పుడు కేవలం యుద్ధాన్ని ఆపడం మాత్రమే కాదు. ఇరాన్‌పై దీర్ఘకాల వ్యూహాత్మక ఒత్తిడి కొనసాగిస్తూ భారీ రాజకీయ-ఆర్థిక ఒప్పందాన్ని సాధించాలని చూస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమంపై పూర్తి నియంత్రణ, హర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుత నౌకా రవాణా, మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రభావాన్ని మరింత బలపరచడం వంటి లక్ష్యాలతో వాషింగ్టన్ ముందుకెళ్తోందని నిపుణులు చెబుతున్నారు. అయితే అసలు ప్రశ్న ఇప్పుడు ఒక్కటే.. ఇరాన్ ట్రంప్ ప్రతిపాదనలకు ఒప్పుకుందా?..ప్రస్తుతం అందుతున్న సంకేతాల ప్రకారం సమాధానం “పాక్షికంగానే” ఒప్పుకుంది. చర్చలకు సిద్ధమని టెహ్రాన్ వర్గాలు చెబుతున్నా.. అమెరికా షరతులకు పూర్తిగా గ్రీన్‌సిగ్నల్ మాత్రం ఇవ్వలేదు. ముఖ్యంగా అణు కార్యక్రమాన్ని పూర్తిగా పరిమితం చేయడం, యురేనియం నిల్వలను తగ్గించడం, అంతర్జాతీయ అణు సంస్థ (IAEA) తనిఖీలకు పూర్తి అనుమతి ఇవ్వడం వంటి అంశాల్లో ఇప్పటికీ విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఇరాన్ వైఖరి ప్రస్తుతం ‘‘ముందు ఆంక్షలు సడలించండి.. తర్వాత మేం నిర్ణయం చెబుతాం’’ అన్నట్టుగా కనిపిస్తోంది. అమెరికా ఆంక్షలు ఎత్తివేయడం, విదేశాల్లో నిలిచిపోయిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, యుద్ధం అధికారికంగా ముగిసిందన్న హామీ ఇవ్వడం వంటి అంశాలను టెహ్రాన్ ప్రధాన షరతులుగా పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి అంశాన్ని ఇరాన్ ఇప్పటికీ ఒత్తిడి సాధనంగానే ఉపయోగిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదే సమయంలో ట్రంప్ కూడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. “పూర్తి ఒప్పందం కుదిరే వరకు బ్లాకేడ్ అలాగే కొనసాగుతుంది” అని ఆయన స్పష్టం చేశారు. అంటే కాల్పులు తగ్గినా.. ఆర్థిక, వ్యూహాత్మక ఒత్తిడి మాత్రం కొనసాగుతుందన్న సంకేతాలు అమెరికా ఇస్తోంది. అందుకే ట్రంప్ అసలు లక్ష్యం యుద్ధాన్ని ఆపడం కంటే.. ఇరాన్‌ను బలహీన స్థితిలో చర్చల టేబుల్‌పై ఉంచడమేనా? అనే చర్చ మొదలైంది.అంతర్జాతీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఒక తాత్కాలిక అవగాహన ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఇందులో యుద్ధాన్ని అధికారికంగా ముగించడం, హర్ముజ్ మార్గాన్ని తిరిగి తెరవడం, తదుపరి 30 లేదంటే 60 రోజులపాటు అణు చర్చలు కొనసాగించడం వంటి అంశాలు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ చర్చల్లో పాకిస్థాన్, ఖతార్, ఒమన్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం చేస్తుండటం గమనార్హం.ఇక అమెరికా లోపల కూడా ట్రంప్‌పై ఒత్తిడి పెరుగుతోంది. “మూడు నెలల క్రితం ఇరాన్ సామర్థ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని చెప్పి.. ఇప్పుడు మళ్లీ అదే దేశంతో రాజీ చర్చలు ఎందుకు?” అంటూ కొందరు రిపబ్లికన్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ అణు కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలన్న డిమాండ్‌ను కొనసాగిస్తోంది.ఇప్పటికైతే యుద్ధం కాస్త చల్లారినట్లే కనిపిస్తున్నా.. అసలు గేమ్ ఇప్పుడు మొదలైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ట్రంప్ “టైమ్ మా వైపే ఉంది” అంటుంటే.. ఇరాన్ మాత్రం “మా షరతులు ముందుగా నెరవేర్చాలి” అని పట్టుబడుతోంది. ఈ బేరసారాలు ఎటు దారి తీస్తాయన్నదే ఇప్పుడు ప్రపంచ రాజకీయాలు, చమురు మార్కెట్లు, అంతర్జాతీయ భద్రత భవిష్యత్తును నిర్ణయించబోతోంది. ట్రంప్ ఆ ఒక్క మాటతో మళ్లీ ప్రపంచంలో టెన్షన్ పెరిగిందనే అభిప్రాయాలు ఇప్పుడు గట్టిగానే వినిపిస్తున్నాయి. -
భారత్‌లో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా వాహనదారులకు ఈసారి పెద్ద షాకే తగిలింది. పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరిగాయి. దాదాపు మూడేసి రూపాయాల చొప్పున పెంచేశాయి ఆయిల్ కంపెనీలు. సీఎన్జీపైనా పలు నగరాల్లో స్వల్ప పెంపు కనిపిస్తోంది. పెరిగిన ధరలు సోమవారం ఉదయం 6గం. నుంచే అమల్లోకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనే ఇంధన భారం అధికంగా కొనసాగుతుండడం గమనార్హం.అమెరికా-ఇరాన్ యుద్ధంతో భారత్‌కు వచ్చే చమురు రేట్లు పెరిగిపోయింది. దీంతో నష్టాల నుంచి బయటపడేందుకు ఆయిల్ కంపెనీలకు ధరల పెంపునకు కేంద్రం అనుమతి ఇస్తోంది. తాజాగా పెట్రోల్‌పై లీటర్‌కు రూ.2.61 పైసలు, డీజిల్‌పై రూ.2.71పైసలు చొప్పున పెంచారు. మొత్తంగా పదిరోజుల వ్యవధిలోనే నాలుగుసార్లు ఇంధన ధరలు పెంచేశారు.మే 15.. రెండింటిపైనా రూ.3 చొప్పున పెంపుమే 19.. పెట్రోల్‌పై 86 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెంపుమే 23.. 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంపు మే 25.. రూ.2.61 పైసలు.. డీజిల్‌పై రూ.2.71 పైసలు పెంపుఅంటే ఇప్పటివరకు.. అదీ పదిరోజుల వ్యవధిలో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.7.34, డీజిల్‌పై లీటర్‌కు రూ.7.45 పెరిగిందన్నమాట. తాజా రేట్లు (పెట్రోల్ రూ.2.61, డీజిల్ రూ.2.71 పెంపు కలిపి):ఢిల్లీ: పెట్రోల్ రూ.102.11, డీజిల్ రూ.95.12ముంబై: పెట్రోల్ రూ.110.88, డీజిల్ రూ.97.48హైదరాబాద్: పెట్రోల్ రూ.115.84, డీజిల్ రూ.103.76కోల్‌కతా: పెట్రోల్ రూ.112.79, డీజిల్ రూ.99.47చెన్నై: పెట్రోల్ రూ.108.14, డీజిల్ రూ.99.84బెంగళూరు: పెట్రోల్ రూ.110.30, డీజిల్ రూ.98.44పాట్నా: పెట్రోల్ రూ.112.88, డీజిల్ రూ.99.23జైపూర్: పెట్రోల్ రూ.112.37, డీజిల్ రూ.97.94తిరువనంతపురం: పెట్రోల్ రూ.114.72, డీజిల్ రూ.103.71చండీగఢ్: పెట్రోల్ రూ.101.64, డీజిల్ రూ.89.90విజయవాడ (ఏపీ): పెట్రోల్ రూ.117.96, డీజిల్ రూ.105.79విశాఖపట్నం (ఏపీ): పెట్రోల్ రూ.116.44, డీజిల్ రూ.103.94తిరుపతి(ఏపీలో): పెట్రోల్ రూ. 117.08పై, డీజిల్ రూ. 104.75 గమనిక: ధరల్లో ప్రాంతానుసారం స్వల్ప మార్పులు ఉండొచ్చుపశ్చిమాసియాలో కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధి సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలు దెబ్బతిన్నాయి. నౌకా రవాణా అంతరాయం వల్ల అధిక ధరలకు క్రూడాయిల్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోందని భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు చెబుతూ వచ్చాయి. ఇప్పటికే వేల కోట్ల రూపాయల నష్టాలు వస్తున్నాయని, వాటిని ఎక్కువకాలం భరించడం సాధ్యం కావట్లేదని ఆయిల్ సంస్థలు కేంద్రానికి వివరించాయి. ఇప్పటివరకు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం వసూలును తాత్కాలికంగా నిలిపివేసి ధరల పెంపును నియంత్రించే ప్రయత్నం చేసింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మరింత పెరుగుతుండటంతో ఇప్పుడు ధరల సవరణలు తప్పవని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా చల్లారకపోవడం, హర్ముజ్ ప్రాంతంలో అనిశ్చితి కొనసాగుతుండటంతో రాబోయే రోజుల్లో కూడా ఇంధన ధరలు దశలవారీగా మరింత పెరిగే అవకాశముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం చేసిన పెంపు మాత్రమే సరిపోదని, ఆయిల్ కంపెనీలు ఎదుర్కొంటున్న నష్టాలను పూడ్చుకోవడానికి ఇంకొన్నిరోజులపాటు ధరల పెంపులు కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు. -
మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వాహనదారులకు మరోసారి షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, సీఎన్జీ రేట్లు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్‌కు 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అలాగే సీఎన్జీ కేజీకి రూ.1 పెరిగింది. పెరిగిన ధరలు శనివారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. పది రోజుల వ్యవధిలో ఇది మూడోసారి పెంపు.. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్‌తో.. అధిక ధరలకు క్రూడాయిల్‌ను కొనుగోలు చేస్తూ నష్టపోతున్నామని భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు కొన్నివారాలుగా గగ్గోలు పెట్టాయి. ఒక అంచనా ప్రకారం ఆ లెక్క రూ.1,600 కోట్లు ఉందని.. వినియోగదారులపై ఆ భారం వేయకుండా వచ్చామని ఇన్నాళ్లు చెబుతూ వచ్చాయి. మరోవైపు కేంద్రం కూడా ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంచేందుకు ఇంధన ధరలు పెంచలేదు. అలాగే ధరల పెరుగుదలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం వసూలును తాత్కాలికంగా నిలిపివేసింది.ఈ తరుణంలో.. చమురు రేట్లు దూసుకుపోతున్న తరుణంలో ఇప్పుడు పెంపు తప్పడం లేదని ఆయిల్ కంపెనీలు, కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. మే 15.. రెండింటిపైనా రూ.3 చొప్పున పెంపుమే 19.. పెట్రోల్‌పై 86 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెంపుమే 23.. 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంపు దీర్ఘకాలంగా కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా నౌకా రవాణా ఆగిపోవడంతో చమురు, వాయువు సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే మరోసారి యుద్ధ వాతావరణం నెలకొనడం.. హర్ముజ్ ఉద్రిక్తతలు చల్లారకపోవడంతో ఈ పెంపు ఇక్కడితో ఆగకపోవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదని, దీంతో రాబోయే రోజుల్లో ఇంధన ధరల పెంపు మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. చమురు కంపెనీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాల నుంచి బయటపడడానికి ఇప్పటికీ చేసిన పెంపు సరిపోదని అంటున్నారు. మరో రెండు వారాలపాటు దశలవారీగా గానీ కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు. ✔️ తాజా పెంపు తర్వాత ప్రధాన నగరాల్లో కొత్త ధరలు ఇలా ఉన్నాయి (పెట్రోల్ 87 పైసలు, డీజిల్ 91 పైసలు పెరిగిన తర్వాత):ఢిల్లీ: పెట్రోల్ ₹99.50, డీజిల్ ₹92.41ముంబై: పెట్రోల్ ₹108.27, డీజిల్ ₹94.77హైదరాబాద్: పెట్రోల్ ₹112.23, డీజిల్ ₹100.44కోల్‌కతా: పెట్రోల్ ₹110.18, డీజిల్ ₹96.76చెన్నై: పెట్రోల్ ₹105.53, డీజిల్ ₹97.13బెంగళూరు: పెట్రోల్ ₹107.69, డీజిల్ ₹95.73పాట్నా: పెట్రోల్ ₹110.27, డీజిల్ ₹96.52జైపూర్: పెట్రోల్ ₹109.76, డీజిల్ ₹95.23తిరువనంతపురం: పెట్రోల్ ₹112.11, డీజిల్ ₹101.00చండీగఢ్: పెట్రోల్ ₹99.03, డీజిల్ ₹87.19విజయవాడ (ఏపీ): పెట్రోల్ ₹115.35, డీజిల్ ₹103.08విశాఖపట్నం (ఏపీ): పెట్రోల్ ₹113.83, డీజిల్ ₹101.23గమనిక: ధరల్లో ప్రాంతానుసారం స్వల్ప మార్పులు ఉండొచ్చు -
ఇరాన్‌తో యుద్దం.. అమెరికాకు భారీ షాక్!?
ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని ఫిబ్రవరి 28న ప్రారంభించిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో అమెరికాకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ సైనిక చర్యలో అమెరికాకు చెందిన అత్యాధునిక ఫైటర్ జెట్లు, నిఘా డ్రోన్లతో సహా కనీసం 42 విమానాలు పూర్తిగా ధ్వంసమవ్వడమో లేదా దెబ్బతినడమో జరిగిందని 'కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్' తన తాజా నివేదికలో వెల్లడించింది.అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఇతర భద్రతా కారణాల వల్ల ఈ నష్టం తీవత్ర ఇంకా పెరిగే అవకాశముందని సదరు నివేదిక పేర్కొంది. యూఎస్ సెంట్రల్ కమాండ్, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలు, అంతర్జాతీయ వార్త కథనాల ఆధారంగా ఈ దెబ్బతిన్న విమానాల జాబితాను సీఆర్ఎస్ సిద్దం చేసింది.ఇరాన్‌తో యుద్దంగా కారణంగా ద్వంసమైన వాటిలో 4 ఎఫ్-15ఇ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలు, అత్యాధునిక ఎఫ్-35ఏ లైట్నింగ్ II యుద్ధ విమానం, ఏ-10 థండర్‌బోల్ట్ గ్రౌండ్-అటాక్ విమానం ఉంది. వీటితోపాటు ఆకాశంలోనే ఇంధనాన్ని నింపే ఏడు కేసీ-135 స్ట్రాటోట్యాంకర్విమానాలు, ఒక ఈ-3 సెంటినరీ అవాక్స్ నిఘా విమానం, రెండు ఎమ్‌సి-130జే కమాండో II, ప్రత్యేక కార్యాచరణ విమానాలు, ఒక హెచ్‌హెచ్-60డబ్ల్యూ జాలీ గ్రీన్ II హెలికాప్టర్ ఉన్నాయి.అదేవిధంగా శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఎమ్క్యూ-9 రీపర్ డ్రోన్లు మొత్తం 24 దెబ్బతిన్నాయి. వీటితో పాటు ఒక ఎమ్క్యూ-4సీ ట్రైటాన్ నిఘా డ్రోన్ కూడా ద్వంసమైంది.ఈ నివేదికపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. అత్యంత అధునాతనమైన ఎఫ్-35 యుద్ధ విమానాన్ని కూల్చివేసిన ఘనత తమ సైన్యానిదేనని సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటించారు. కాగా ఇరాన్లో కొనసాగుతున్న సైనిక చర్యల అంచనా వ్యయం ప్రస్తుతం 29 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 2,42,000 కోట్లు) పెరిగినట్లు పెంటగాన్ కంప్ట్రోలర్ జూల్స్ డబ్ల్యూ హర్స్ట్ III ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ట్రంప్ అల్టిమేటం.. అమెరికాకు ఇరాన్ ఘాటు హెచ్చరిక
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. “రెండు మూడు రోజుల్లో శాంతి ఒప్పందానికి రాకపోతే, కొత్త దాడులు తప్పవు” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేశారు. గల్ఫ్ దేశాల అభ్యర్థనతో మంగళవారం జరగాల్సిన దాడిని వాయిదా వేశానని.. ఇరాన్ దిగి రాకుంటే వారాంతంలో దాడులు తప్పవని సంకేతాలిచ్చారాయన. ఈ అల్టిమేటంపై ఇరాన్ స్పందించింది. ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి స్పందించారు. అదే జరిగితే తామేంటో చూపిస్తామని అంటున్నారాయన. ‘‘మళ్లీ యుద్ధం జరిగితే అమెరికాను మామూలుగా దెబ్బ తీయం. మరిన్ని సర్ప్రైజ్లు ఉంటాయి. అందుకు ఆ దేశం సిద్ధంగా ఉండాలి’’ అని ఘాటు హెచ్చరికలు జారీ చేశారాయన. అలాగే.. ఇరాన్ తొలిసారిగా అమెరికా F-35 జెట్‌ను కూల్చివేసిందని చెప్పిన అరగ్చి.. అమెరికా కాంగ్రెస్ రీసెర్చ్ సర్వీస్ నివేదికలోనే జరిగిన నష్టాలు బయటపడ్డాయని గుర్తుచేశారు.అరగ్చి చెప్పిన “మరిన్ని సర్ప్రైజ్లు” అంచనా వేయడం కాస్త కష్టమే. అయితే యుద్ధంలో ఇరాన్ వ్యూహాలు, దాడుల స్వభావం చూసుకుంటే మాత్రం.. అధునాతన డ్రోన్ దాడులు: ఇరాన్ ఇప్పటికే అమెరికా MQ-9 రీపర్ డ్రోన్లను కూల్చివేసింది. భవిష్యత్తులో మరింత శక్తివంతమైన, స్వార్మ్ (గుంపులుగా వచ్చే) డ్రోన్ దాడులు జరిగే చాన్స్ లేకపోలేదు.మిసైల్ దాడులు: సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేసి KC-135 ట్యాంకర్లు, E-3 AWACSను దెబ్బతీసింది. ఇలాంటి దీర్ఘశ్రేణి క్షిపణి దాడులే మళ్లీ జరగవచ్చు.సైబర్ దాడులు: ఇరాన్ గతంలో అమెరికా నెట్‌వర్క్‌లపై సైబర్ దాడులు చేసినట్లు నివేదికలు ఉన్నాయి. కొత్త యుద్ధంలో సైబర్ రంగంలో పెద్ద ఎత్తున దాడులు జరగవచ్చు.సముద్ర మార్గాల అడ్డంకులు: హర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు రవాణా జరుగుతుంది. ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ కుదేలవుతుంది.అనూహ్యమైన ఆయుధ వినియోగం: అరగ్చి చెప్పిన “సర్ప్రైజ్”లో కొత్త రకం యుద్ధ సాంకేతికత, లేదంటే ఇప్పటివరకు బయటపడని ఆయుధాలు ఉండే అవకాశం ఉంది.కాంగ్రెస్ రీసెర్చ్ సర్వీస్ నివేదిక ప్రకారం.. ఈ యుద్ధంలో అమెరికా కనీసం 42 సైనిక విమానాలను కోల్పోయింది. వీటిలో 24 MQ-9 రీపర్ డ్రోన్లు, నాలుగు F-15E ఫైటర్ జెట్లు, ఒక A-10 థండర్‌బోల్ట్, రెండు MC-130J ప్రత్యేక ఆపరేషన్ విమానాలు, ఒక KC-135 ట్యాంకర్, ఒక MQ-4C ట్రిటాన్ డ్రోన్ ఉన్నాయి. అదనంగా.. F-35A జెట్, E-3 సెంట్రీ AWACS, HH-60W హెలికాప్టర్ వంటి విమానాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రక్షణ విభాగం పెంటగాన్ అంచనా ప్రకారం.. ఈ యుద్ధం అమెరికాకు ఇప్పటివరకు 29 బిలియన్ డాలర్ల ఖర్చు తెచ్చింది.ఫిబ్రవరి 28, 2026న “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ” పేరుతో అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. బదులుగా ఇరాన్ మిత్రపక్షాల సాయంతో కౌంటర్‌కు దిగింది. అయితే.. ఏప్రిల్‌లో తాత్కాలిక కాల్పుల విరమణ, ఆపై పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో చర్చలకు అడుగులు పడడంతో యుద్ధం ముగియవచ్చని అంతా భావించారు. అయితే అలా జరగలేదు. శాంతి చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఓవైపు చర్చల ప్రభావంతో యుద్ధ తీవ్రత కొంత తగ్గినా.. ఇప్పుడు మళ్లీ ఇరు దేశాల కవ్వింపు చర్యలతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ అల్టిమేటం, అరఘ్చి హెచ్చరికలతో యుద్ధం మరోసారి మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. కొత్త ఘర్షణలు ఏ సంక్షోభానికి దారి తీస్తాయోనని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
ఇరాన్ వార్.. నయా ట్రెండ్
ప్రపంచ యుద్ధాల రూపురేఖలు మారిపోతున్నాయ్. క్షిపణులు, అణు బాంబులు, డ్రోన్లు మాత్రమే కాదు.. ఇప్పుడు సరిహద్దులు, వనరులు, ఆఖరికి డిజిటల్ నెట్‌వర్క్‌లు కూడా ఆయుధాలయ్యాయి. అదెలా సాధ్యమో.. పశ్చిమాసియా యుద్ధంతో ఇరాన్ కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. తనకంటే బలమైన సైన్యం ఉన్న అమెరికాను విసిగెత్తిస్తూ ‘వార్ ట్రెండ్’ను సెట్ చేసింది.ఇరాన్ తన సరికొత్త వ్యూహం అమలుకు.. హర్ముజ్ జలసంధిని వేదికగా చేసుకుంది. దీని ద్వారానే ప్రపంచంలో ఐదో వంతు చమురు రవాణా జరుగుతుందని తెలిసిందే కదా. అందుకే జలసంధిపై తమదే పూర్తి ఆధిపత్యం అని ప్రకటించుకుని.. టోల్‌ప్లాజా ఏర్పాటుతో వసూళ్లు చేపట్టాలని భావించింది. తద్వారా.. వచ్చిన సొమ్ముతో యుద్ధం వల్ల దెబ్బతిన్న ఇరాన్‌ను పునరుద్ధరించుకోవడం, దేశ అభివృద్ధికి కావాల్సిన నిధుల్ని సమకూర్చుకుంటామని ప్రకటించి ప్రపంచ దృష్టిని ఆకర్షించుకోగలిగింది. అదే సమయంలో.. సముద్ర గర్భం కేబుళ్లపై దృష్టిసారించి భయపెట్టింది కూడా. ఇప్పుడు కేబుళ్ల విషయంలో అమెరికన్ దిగ్గజ కంపెనీలు కాంప్రమైజ్ కావాలని.. ఎంతో కొంత తమకు చెల్లించాలని(పన్ను, ఫీజు, ఫైన్.. ఏదో ఒక రూపేణా).. అలాగే వాటి నిర్వహణ(రిపేర్లు వగైరా) బాధ్యతలు కూడా తమ ఆధ్వర్యంలోనే సాగాలని కండిషన్లు పెడుతోంది. లేకుంటే కత్తిరింపులు తప్పవన్నట్లు బెదిరిస్తోంది. అలా.. తన భౌగోళిక స్థానాన్నే ఇరాన్ ఆయుధంగా మలుచుకుంది.టిట్ ఫర్ టాట్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ విషయంలో ఏం చేయాలనుకున్నాడో.. ఇరాన్ ఆ పనే కౌంటర్‌గా చేసి చూపించింది. అదే ఆర్థికంగా దెబ్బ తీయడం. ఇరాన్‌ను ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి చేసిన ట్రంప్.. హర్ముజ్ బ్లాకేడ్, నిధుల ఫ్రీజ్‌లను చూపించి ఇరాన్ మెడలు వంచాలనుకున్నాడు. అయితే ఆ నష్టం ధాటికి ఇరాన్ తలొగ్గలేదు. సరికదా.. యుద్ధాన్ని సరికొత్త మలుపులు తిప్పింది.యుద్ధం ప్రారంభంలో.. చౌకగా తయారైన షాహెడ్ డ్రోన్లు ఉపయోగించి అమెరికా రక్షణ వ్యవస్థలను ఆగమాగం చేసింది. తద్వారా అమెరికా సైన్యానికి భారీ నష్టం వాటిల్లింది. ఆ తర్వాత హర్ముజ్ జలసంధి ద్వారా నౌకాయానాన్ని అడ్డుకోవడంతో తన వ్యూహాన్ని మొదలుపెట్టింది. హర్ముజ్ అనేది కేవలం 21 కిలోమీటర్ల వెడల్పు ఉండడం, పైగా తమ తీరానికి దగ్గరగా ఇరాన్‌కు ఎంతో కలిసొచ్చింది. రోజుకు 100–150 నౌకలు వెళ్లే హర్ముజ్‌లో మైన్స్, డ్రోన్లు, ఫాస్ట్ అటాక్ బోట్స్‌తో నియంత్రించింది. ఫలితంగా ఒక్క నౌక కూడా నీట మునగకుండానే ఇన్సూరెన్స్ ప్రీమియంలు 300% పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటింది. యూరప్ దేశాలు అదనంగా 28 బిలియన్ డాలర్ల ఇంధన బిల్లు చెల్లించాల్సి వచ్చింది. అలా క్షిపణుల యుద్ధం కాస్తా ఆర్థిక యుద్ధం అయ్యింది.భవిష్యత్తులో.. ఇరాన్ తన యుద్ధాన్ని క్షిపణుల నుంచి మరో దారికి మలిచింది. ఎనర్జీ + డేటా.. ఇవి రెండూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే అంశాలే. అలా రెండు కీలక ప్రవాహాలను ఒకేసారి నియంత్రించే శక్తి తమ వద్ద ఉందని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇకపై యుద్ధం కేవలం బాంబులు, గన్స్‌తో కాదు.. వివిధ వనరుల రూపంలోనూ జరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఇరాన్ చూపించిన ఈ యుద్ధ వ్యూహాన్ని ఉత్తర కొరియా, చైనా అధ్యయనం చేస్తున్నాయి. రష్యా కూడా ఈ ఉద్రిక్తతను నిశీతంగా పరిశీలిస్తోంది. అందుకే ఇది కేవలం ఒక దేశానికి కాదు, ప్రపంచానికి కొత్త హెచ్చరిక అని నిపుణులు చెబుతున్నారు.కొత్తదేం కాదా?ఇరాన్ అనుసరించిన ఈ వ్యూహం కొత్తేదేం కాదట. ఇది అర్థం చేసుకోవాలంటే చరిత్రలోని కొన్ని ఘట్టాలను గుర్తు చేసుకోవాలనుకుంటున్నారు విశ్లేషకులు.థెర్మోపిలే యుద్ధం (480 BC): స్పార్టా రాజు లియోనిడాస్ కొద్దిమంది సైనికులతో పర్షియన్ సైన్యాన్ని ఒక పర్వత మార్గంలో నిలువరించగలిగాడు. సంఖ్యలో తక్కువైనా, భౌగోళిక స్థానం (చోక్పాయింట్)ను ఉపయోగించి శత్రువుల అధిక బలాన్ని నిర్వీర్యం చేశాడు. ఇది “స్థానం” అనే ఆయుధం ఎంత శక్తివంతమో చూపించింది.రోమన్ సామ్రాజ్యం – కార్తేజ్: ప్యూనిక్ యుద్ధాల అనంతరం రోమన్లు కార్తేజ్ పొలాలను ఉప్పు చల్లి ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు. ఇది భౌగోళిక వనరులను ధ్వంసం చేసి శత్రువును బలహీనపరిచే వ్యూహం.నెపోలియన్ (19వ శతాబ్దం): బ్రిటన్‌తో వాణిజ్యాన్ని నిషేధించి యూరప్ ఆర్థిక వ్యవస్థను నియంత్రించాడు. ఇది వాణిజ్యాన్ని ఆయుధంగా మార్చిన ఉదాహరణ.బలహీన దేశం కూడా తన భౌగోళిక స్థానాన్ని ఆయుధంగా మార్చుకుని శక్తివంతమైన దేశాలను నిలువరించగలదు. ఇది చరిత్ర చెప్పిన పాఠం. ఆ పాఠాన్నే ఇరాన్ వల్లేసింది. అమెరికా అణు బాంబులను ఆపడానికి యుద్ధం మొదలుపెడితే.. కానీ ఇరాన్ తన భూభాగాన్ని ఆయుధంగా మార్చి మరింత శక్తివంతమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. -
ద్రవ్యోల్బణం తప్పదా.. EMIలు పెరుగుతాయా?
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇంధన సరఫరా దెబ్బతినడంతో.. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితులు కేవలం విదేశీ మార్కెట్లకే పరిమితం కాకుండా, భారత్ వంటి దిగుమతి ఆధారిత దేశాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఇది దేశీయంగా ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈఎంఐలు కట్టేవారిపై భారం తప్పదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇరాన్ సంక్షోభం కారణంగా.. ముడి చమురు, సహజ వాయువు సరఫరాలో అంతరాయం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. డిమాండ్ పెరగడం.. సరఫరా తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. భారత్ తన ఇంధన అవసరాల్లో పెద్ద భాగం దిగుమతులపై ఆధారపడటంతో.. ఈ ధరల పెరుగుదల నేరుగా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి.చమురు ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఇది హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (WPI)పై ఒత్తిడి పెంచుతుంది. ఫలితంగా నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయల వంటి రోజువారీ వినియోగ వస్తువుల ధరలు కూడా పెరిగిపోతాయి. ఇలాంటి సమయంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ (RBI) రెపో రేటును పెంచే అవకాశం ఉంది.నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం!ఆర్బీఐ రేపో రేటును పెంచితే.. బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచుతాయి. ఫలితంగా హోమ్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్న వారి ఈఎంలు పెరుగుతాయి. ఇది వారి నెలవారీ బడ్జెట్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంది.అంతర్జాతీయ ఇంధన సంక్షోభం ఒక వైపు ద్రవ్యోల్బణాన్ని పెంచుతుండగా, మరోవైపు దేశీయ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేసే పరిస్థితిని తీసుకొస్తోంది. ఇంధన సరఫరా త్వరగా స్థిరపడకపోతే.. రాబోయే దీపావళి నాటికి సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: చైనా తరహాలో భారత్!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే? -
దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వాహనదారులకు ఊహించినట్లే షాక్ తగిలింది. ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను ఒక్కసారిగా రూ.3పైగా పెంచాయి. ఈ పెంపు ఇవాళ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చింది. దీంతో ఇప్పటికే భారంగా ఉన్న ఇంధన ధరలు మరింత పెరిగి ప్రజల జేబులకు మంటలు పెట్టే పరిస్థితి ఏర్పడింది.👉 పెంపు వెనుక కారణాలు.. 2022 ఏప్రిల్ నుంచి(ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంలోనూ) పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు మారలేదు. పైగా లోక్‌సభ ఎన్నికలకు ముందు 2024 మార్చిలో లీటరుకు రూ.2 చొప్పున తగ్గించాయి. అయితే పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం కారణంగా ఆ పరిస్థితి ఒక్కసారిగా మారింది. భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు (IOCL, BPCL, HPCL) అధిక ధరలకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఆ భారాన్ని వినియోగదారులపై వేయకుండా రోజుకు సుమారు రూ.1,600 కోట్ల నష్టాన్ని భరించాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంచేందుకు కేంద్రం కూడా ఇంధన ధరలు పెంచకుండా ఆగింది. కానీ.. దీర్ఘకాలంగా కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా నౌకా రవాణా ఆగిపోవడంతో చమురు, వాయువు సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంధన ధరల పెరుగుదల తప్పనిసరి అయింది.👉హింట్ ఇస్తూ.. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం.. హర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన అడ్డంకులు ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థను దెబ్బతీయడం.. పరిస్థితిని ముందుగానే అర్థం చేసుకున్న కేంద్రం పెట్రో పెంపు సంకేతాలిచ్చింది. సరిపడా నిల్వలు ఉన్నాయంటూనే.. పెంచక తప్పదనే చెబుతూ వచ్చింది. ఈలోపు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఇంధన పొదుపు పిలుపునిచ్చి, కార్‌పూలింగ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగం, అవసరం లేని ప్రయాణాలను తగ్గించాలని సూచించారు. దీంతో ఆ పెంపు భారీగా ఉండొచ్చని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే రూ.3 రూపాయల చొప్పున పెంపుతో సరిపెట్టాయి ఆయిల్ కంపెనీలు.👉 సీఎన్జీ కూడా.. మరోవైపు సంకుచిత సహజ వాయువు(సీఎన్జీ) రేట్లు కూడా పెరిగాయి. ఢిల్లీతో పాటు ముంబైలోనూ కిలోకి రూ.2 పెంచారు. పెరిగిన ధరలతో ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.87కి చేరింది. అయితే మిగతా నగరాల్లో మాత్రం సీఎన్జీ రేట్లలో మార్పు కనిపించడం లేదు. 👉 ప్రజలలో ఆందోళన.. ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరగడం ఖాయం. ఇప్పటికే కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఇంధన ధరల పెంపు మరింత భారాన్ని మోపనుంది. సోషల్ మీడియాలో "ఇది తాత్కాలిక పెంపేనా? లేక యుద్ధం కొనసాగితే మరోసారి పెరుగుతాయా?" అనే చర్చలు మొదలయ్యాయి.👉 ఆర్థికవేత్తల అభిప్రాయం.. ప్రముఖ ఆర్థికవేత్తలు ధరల పెంపు తప్పనిసరి అని చెబుతున్నారు. "ధరల పెంపు ద్వారా వినియోగం తగ్గుతుంది. ఇది సరఫరా-డిమాండ్ సమతుల్యతను కొంతవరకు కాపాడుతుంది" అని విశ్లేషిస్తున్నారు. మరోవైపు, రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతులు ఖరీదవుతాయి, ఎగుమతులు లాభదాయకమవుతాయి. దీంతో ప్రస్తుత ఖాతా లోటు తగ్గే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు.తాజా పెంపుతో ప్రధాన నగరాల్లో కొత్త ధరలుఢిల్లీ: పెట్రోల్ ₹97.77, డీజిల్ ₹90.67ముంబై: పెట్రోల్ ₹106.54, డీజిల్ ₹93.03హైదరాబాద్: పెట్రోల్ ₹110.50, డీజిల్ ₹98.70కోల్‌కతా: పెట్రోల్ ₹108.45, డీజిల్ ₹95.02చెన్నై: పెట్రోల్ ₹103.80, డీజిల్ ₹95.39బెంగళూరు: పెట్రోల్ ₹105.96, డీజిల్ ₹93.99పాట్నా: పెట్రోల్ ₹108.54, డీజిల్ ₹94.78జైపూర్: పెట్రోల్ ₹108.03, డీజిల్ ₹93.49తిరువనంతపురం: పెట్రోల్ ₹110.38, డీజిల్ ₹99.26చండీగఢ్: పెట్రోల్ ₹97.30, డీజిల్ ₹85.45తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై రూ3.29, డీజిల్‌పై రూ.3.14, తెలంగాణలో పెట్రోల్, డీజిల్‌పై రూ.3 చొప్పున ఆయిల్ కంపెనీలు పెంచాయి. మొత్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో దేశవ్యాప్తంగా వాహనదారులకు షాక్ తగిలినప్పటికీ.. అంతర్జాతీయ పరిస్థితులు సద్దుమణిగే వరకు ఇంధన ధరలు స్థిరపడే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. -
రానున్న రోజుల్లో.. చమురు ధరలు ఇలా!
అంచనాలను మించి దీర్ఘకాలం కొనసాగుతున్న పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల కారణంగా ముడిచమురు ధరలు గరిష్ట స్థాయిలలోనే కొనసాగే వీలున్నట్లు ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ) చీఫ్ ఎకనమిస్ట్ అల్బెర్ట్ పార్క్ పేర్కొన్నారు.వెరసి తాజా అంచనాల ప్రకారం.. 2026లో బ్యారల్ ముడిచమురు 96 డాలర్ల స్థాయిలో కొనసాగవచ్చు. 2027లో బ్యారల్ చమురు 80 డాలర్ల స్థాయిలో కదిలే వీలుంది. వెరసి ముడిచమురు ధరలు అధికస్థాయిలలో కొనసాగనున్నట్లు భావిస్తున్నామని వివరించారు.ఈ నేపథ్యంలో స్పాట్ ధరలతో పోలిస్తే ఫ్యూచర్స్ మార్కెట్లో అధిక(ప్రీమియం) ధరలు పలుకుతున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం చమురు సరఫరాల కొరత ప్రభావం చూపుతున్నట్లు పేర్కొన్నారు. చమురు ధరల ఫలితంగా దేశ జీడీపీ వృద్ధిలో 0.6 శాతం కోత పడవచ్చని వెరసి 6.3 శాతానికి ఆర్థిక పురోగతి పరిమితంకావచ్చని అంచనా వేశారు. -
మోదీ చెప్పినవి.. మనతో అయ్యే పనేనా??
ఏడాది పాటు బంగారం కొనొద్దు.. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించండి.. వర్క్ ఫ్రమ్ హోంకు ప్రాధాన్యం ఇవ్వండి.. కూరల్లో వంటనూనెకు తగ్గించి వాడండి.. విదేశీ ప్రయాణాలు చేయొద్దని.. ఇలా దేశ ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ నడుస్తోంది. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభ నేపథ్యంలోనే ఆయన చేసిన సూచనలపై మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో ఇవి అసలు ఆచరణ సాధ్యమేనా? అనేదానిపై ఆర్థిక నిపుణులు స్పందించారు. హైదరాబాద్ సభలో మోదీ ఏం మాట్లాడారు?.. కరోనా టైంలో అలవాటు అయిన వర్క్ ఫ్రమ్ హోం, ఆన్లైన్ మీటింగ్ విధానాలను మళ్లీ ఆచరించడం ద్వారా పెట్రోల్ వినియోగం తగ్గించవచ్చు. ఈవీలను ప్రొత్సహిస్తే మరీ మంచిది. బంగారం కొనుగోలు ఒక సంవత్సరం పాటు ఆపితే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు. ప్రతి కుటుంబం వంటనూనె వినియోగాన్ని తగ్గిస్తే ఆరోగ్యానికి, ఆర్థిక వ్యవస్థకు లాభం. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి.. రైతులు సహజ వ్యవసాయానికి మారితే దిగుమతులపై ఆధారపడకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది అని అన్నారు. మోదీ సూచనలు దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా సరైనవని ఆర్థిక నిపుణులు అంగీకరిస్తున్నారు. అదే సమయంలో అవి ఆచరణ సాధ్యమా? అంటే కష్టమేనని అంటున్నారు. మరీ ముఖ్యంగా బంగారం భారతీయ కుటుంబాల్లో ఆర్థిక భద్రతకు ప్రతీక. అలాంటి దానిని ఏడాదిపాటు కొనుగోలు నిలిపివేయడం అనేది భారతీయ సాంప్రదాయాలకు విరుద్ధమని.. ఆచరణలో సాధ్యమయ్యేది కాదని అంటున్నారు. ఎనర్జీ నిపుణులు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పెట్రోల్ వినియోగం తగ్గడం సాధ్యమే. ఇది కొంత వరకు సాధ్యమే. కానీ ఇది ప్రధానంగా ఐటీ రంగం ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. తయారీ, రవాణా రంగాల్లో ఇది అసాధ్యమంటున్నారు. అలాగే రైతులు సహజ వ్యవసాయం వైపు మారడం మంచి ఆలోచనే అయినప్పటికీ.. వాళ్లకు ప్రోత్సాహకాలు, మరింత శిక్షణ అవసరమని.. ప్రభుత్వాలు ఆ భారం భరించే స్థితిలో ఉందా? అని వ్యవసాయ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇక వంటనూనె వినియోగం తగ్గించడంపైనా ఇటు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇది ఆచరణ సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మోదీ పిలుపు దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా సరైనదే. కానీ ప్రజల జీవనశైలిలో మార్పులు తేవడం సులభం కాదు. దీని కోసం ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అవగాహన కార్యక్రమాలు అవసరం. ఇంధన సంక్షోభం వంటి జాతీయ సమస్యలను ఎదుర్కోవడానికి ప్రజల సహకారం కీలకమని నిపుణులు గుర్తు చేస్తున్నారు. పొలిటికల్ రియాక్షన్స్మోదీ పొదుపు వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎక్కు పెట్టింది. మోదీ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో చెప్పాలని అంటోంది. ఆయన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయని.. దేశంలో వాస్తవ పరిస్థితులను ప్రజలను వివరించాలని కోరుతోంది. ఇందుకోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేస్తోంది. దేశ ఇంధన భద్రతను రక్షించడంలో మోదీ విఫలమయ్యారని విమర్శిస్తోంది. ఈ విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇస్తోంది. మోదీ వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసలు గుప్పించారు. అది దూరదృష్టితో కూడిన నిర్ణయమని అన్నారాయన. -
ట్రంప్ మైండ్ గేమ్.. ఇరాన్ యుద్ధంలో మరో ట్విస్ట్
ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. తాజాగా పర్షియన్ గల్ఫ్ వేదికగా మరోసారి ఇరు దేశాలకు దాడులు మొదలయ్యాయి. కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన పేరిట పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే ఇరాన్ చర్చలకు దిగొచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన కొన్ని గంటలకే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. హర్ముజ్‌లో యూఎస్ యుద్ధనౌకలపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. జలసంధిలో గస్తీ కాస్తున్న ట్రక్ట్సన్, మాసన్ లక్ష్యంగా దాడులు చేసింది. అమెరికా రక్షణ వ్యవస్థ ఆ దాడుల్ని సమర్థవంతంగా తిప్పి కొట్టింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. అయితే కాల్పుల విరమణ కొనసాగుతోందని.. జరిగింది చిన్నస్థాయి దాడులని ఆయన అన్నారు. అయితే ఆ వెంటనే. ఇరాన్‌లోని క్షిపణి లాంచ్ సైట్లు, కమాండ్ సెంటర్లపై అమెరికా దాడికి దిగింది. మరోవైపు.. హర్ముజ్ జలసంధిలో వెళ్తున్న ఇరాన్ ట్యాంకర్‌పై అమెరికా సైన్యం కాల్పులు జరిపింది. క్విష్మ్, బందర్ అబ్బాస్ నగరాల్లోనూ దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై క్షిపణులు విరుచుకుపడడంతో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని పలు మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి!. ఈ దాడుల వెనుక యూఏఈ పాత్ర ఉందని ఇరాన్ అనుమానిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్నిఅమెరికా తుంగలో తొక్కిందని విమర్శిస్తూనే.. ప్రతిఘటన తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరించింది. దీంతో శాంతి చర్చలకు విఘాతం కలిగే అకాశం కనిపిస్తోంది.ఇరాన్‌కు సాలిడ్ వార్నింగ్!ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ‘‘ఇరాన్ వెంటనే శాంతి ఒప్పందానికి రావాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇరాన్ సాధారణ దేశం కాదు.. అది ఉన్మాదుల చేతుల్లో ఉంది. గాలిలోనే వాళ్ల డ్రోన్లు దగ్గం అయ్యాయి. సీతాకోకచిలుకల్లా సముద్రంలో రాలిపోయాయి. శాంతి ఒప్పందంపై త్వరగా సంతకం చేయాలి. లేదంటే భవిష్యత్తు మరింత భయంకరంగా ఉంటుంది’’ అని అన్నారు.ట్రంప్ తీరు బాగోలేదు!ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలకు పాక్‌తో కలిసి సౌదీ అరేబియా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హర్ముజ్ జలసంధిలో నౌకల కోసం చేపట్టిన ఎస్కార్ట్ ఆపరేషన్‌ను ట్రంప్ 24 గంటలు గడవక ముందే ఆపేశారు. ఆయన ఇలా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుండడంపై సౌదీ అరేబియా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాకు గగనతల అనుమతులు నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది. -
అందుకేనా.. బంగారం ఇంతలా పెరిగింది!
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పులు జరుగుతూనే ఉన్నాయి. అమెరికా - ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం సాధ్యమవుతుందనే ఆశలు పెరగడంతో, డాలర్ విలువ, చమురు ధరలు తగ్గాయి. దీంతో ద్రవ్యోల్బణ భయం తగ్గింది. గోల్డ్ రేటు ఊపందుకుంది.స్పాట్ గోల్డ్ ధర 3.4 శాతం పెరిగి ఔన్సుకు సుమారు 4,708 డాలర్ల స్థాయికి చేరుకుంది. ఇది గడిచిన వారం రోజుల్లో అత్యధికం అనే చెప్పాలి. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా గణనీయంగా పెరిగాయి. సాధారణంగా బంగారం ధరలు పెరగడానికి ప్రపంచ అనిశ్చితి, డాలర్ బలహీనత, వడ్డీ రేట్ల అంచనాలు ప్రధాన కారణాలు.చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గుతుంది. దీని ఫలితంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంటుంది. తక్కువ వడ్డీ రేట్లు ఉన్నప్పుడు బంగారం వంటి వాటిపై పెట్టుబడులు పెరుగుతాయి. అందుకే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇదే సమయంలో గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కూడా చమురు ధరలు తగ్గడంతో పెరుగుదల చూపాయి. ఇది పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని పెంచింది. మరోవైపు డాలర్ విలువ తగ్గడం వల్ల బంగారం ఇతర కరెన్సీలు కలిగిన వారికి మరింత చౌకగా మారింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. వెండి, ప్లాటినం, పల్లాడియం వంటి విలువైన లోహాల ధరలు కూడా పెరగడం గ్లోబల్ మార్కెట్లో బలమైన డిమాండ్‌ను సూచిస్తోంది.ఇదీ చదవండి: అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకి -
మళ్లీ మొదలైన యుద్ధం: గ్లోబల్ మార్కెట్‌పై ఎఫెక్ట్!
గత కొన్నిరోజులుగా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం.. ప్రపంచంలోని చాలా దేశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. శాంతి చర్చల తరువాత యుద్దానికి బ్రేక్ పడింది. కాగా ఇప్పుడు మళ్లీ వార్ మొదలైంది. ఈ యుద్ధం మళ్లీ మొదలవడంతో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత క్షిణించే అవకాశం ఉంది. ఈ ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై కూడా పడింది.యుద్ధం మొదలైతే.. దీని ఎఫెక్ట్ వెంటనే స్టాక్ మార్కెట్ల మీద చూపిస్తుంది. పెట్టుబడిదారులు రిస్క్ తగ్గించుకోవడానికి, ఇన్వెస్ట్ చేయడానికి పూనుకోరు. అంతే కాకుండా.. తమ పెట్టుబడులను కూడా వెనక్కి తీసుకోవడం ప్రారంభిస్తారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఏవియేషన్, కన్స్యూమర్ రంగాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. అయితే.. కొన్ని సందర్భాల్లో డిఫెన్స్ రంగానికి సంబంధించిన కంపెనీల షేర్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యుద్ధ సమయంలో ఆయుధాలకు డిమాండ్ పెరుగుతుంది.స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఉపసంహరించుకునే ఇన్వెస్టర్లు, సురక్షితమైన ఆస్తులవైపు అడుగులు వేస్తారు. కాబట్టి ఇలాంటి సమయంలో గోల్డ్ రేటు పెరుగుతుంది. అలాగే యూఎస్ డాలర్ బలపడుతుంది. డాలర్ బలపడటం వల్ల.. ఇతర దేశాల కరెన్సీలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు బలహీనపడతాయి.ఇది కరెన్సీ మార్కెట్లలో కూడా మార్పులకు దారితీస్తుంది. ఉదాహరణకు ఇండియన్ రూపాయి విలువ తగ్గే అవకాశం ఉంటుంది. రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతులు మరింత ఖరీదవుతాయి. దీనివల్ల మళ్లీ ద్రవ్యోల్బణం ప్రారంభమవుతుంది. ఈ విధంగా ఒక ప్రభావం మరో ప్రభావాన్ని పెంచుతూ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తీసుకొస్తుంది.మరో ముఖ్యమైన అంశం ట్రేడ్ అండ్ రవాణా. పశ్చిమాసియాలో ఉన్న సముద్ర మార్గాలు, ముఖ్యంగా హర్ముజ్ వంటి ప్రాంతాలు యుద్ధం వల్ల ప్రమాదంలో పడతాయి. ఈ మార్గాలు ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక్కడ అంతరాయం కలిగితే, చమురు సరఫరా ఆలస్యం అవుతుంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి.భారతదేశం వంటి దేశాలపై ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. పెరిగిన చమురు ధరలు, కరెన్సీ బలహీనత, ద్రవ్యోల్బణం అన్నీ ప్రజలపై ప్రభావాన్ని చూపిస్తాయి.ఈ పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. తద్వారా ఆర్థిక వృద్ధి గాడి తప్పుతుంది.ఇదీ చదవండి: 'ఇప్పటి ప్రపంచానికి అవి సరిపోవు': కియోసాకి హెచ్చరిక -
మళ్లీ మొదలైన పశ్చిమాసియా యుద్ధం!
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. యూఏఈలోని పుజైరా చమురు కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడులు జరిపింది. క్షతగాత్రుల్లో ముగ్గురు భారతీయులు ఉన్నట్లు సమాచారం. త్వరలో శత్రువుల పునాదులు పెకలిస్తామని ఐఆర్జీసీ ప్రకటించిన కొద్దిగంటలకే ఈ దాడులు జరగడం గమనార్హం.గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు, చిన్న పడవలతో యుద్ధానికి దిగింది. అయితే 12 బాలిస్టిక్ మిసైళ్లు, 3 క్రూయిజ్ మిసైళ్లు, 4 డ్రోన్లను యూఏఈ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే పలువురికి గాయాలైనట్లు సమాచారం. మరోవైపు.. పర్షియన్ గల్ఫ్ తీరంలోని ముసందం (Musandam) గవర్నరేట్ పరిధిలోని బుఖా ప్రాంతంలో(ఒమన్) కార్మికుల నివాస భవనం దెబ్బతింది. ఈ దాడిలో ఇద్దరు విదేశీయులు గాయపడ్డారు. ఈ దాడుల్ని ఈయూ, సౌదీ అరేబియాలు ఖండించాయి. దాడుల నేపథ్యంలో యూఏఈ తమ విమానాలను నిలిపివేసింది.ఇటు హర్ముజ్‌లోనూ..హర్ముజ్ జలసంధిలోనూ ఇరాన్ అమెరికా రక్షణలో ఉన్న నౌకలను టార్గెట్‌గా చేసుకుని దాడులు జరిపాయి. అయితే తమ నౌకలు సేఫ్‌గానే ఉన్నాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. దాడుల్లో దక్షిణ కొరియాకు చెందిన ఓ వాణిజ్య నౌక మంటల్లో కాలిపోయింది. మరోవైపు ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో వందలాది నౌకలు హర్ముజ్‌లో నిలిచిపోయాయి. వాటిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అమెరికా రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేస్తోంది.ట్రంప్ ఏమన్నారంటే.. ఇరాన్ తాజా దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. యూఎస్ నౌకలను.. యూఎస్ రక్షణలో ఉన్న నౌకలపై ఇరాన్ దాడులు జరిపిన వాళ్లను భూమ్మీద లేకుండా చేస్తాం హెచ్చరించారు. ఈ తరుణంలో కాల్పుల విరమణ(ceasefire) కొనసాగుతోందా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు. అయితే ‘‘యుద్ధం సైనికంగా ముగిసింది’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.ఇరాన్ వైఖరియూఏఈపై దాడులు జరిపింది తామేనని ఇరాన్ అంగీకరించలేదు. ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి స్పందిస్తూ.. ఈ ఉద్రిక్తతల్ని చల్లార్చేందుకు సైనిక పరిష్కారం పనికి రాదు. రాజకీయ పరిష్కారం అవసరం అని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇరాన్ తాజా దాడుల నేపథ్యంలో.. ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. గల్ఫ్ దేశాల్లో కాల్పులు, హెచ్చరికలు కొనసాగుతున్నాయి. సీజ్ ఫైర్ చాలా బలహీనంగా మారడంతో ఏ క్షణాన ఏం జరగనుందో అని గల్ఫ్ ప్రాంతంలో టెన్షన్ నెలకొంది. -
హర్ముజ్‌పై ట్రంప్ కీలక ప్రకటన
పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరోసారి యుద్ధం దిశగా అడుగులేస్తున్నాయి. ఇప్పటికే ఇరు దేశాలు పరస్పర ప్రతిపాదనలను తోసిపుచ్చుకున్నాయి. శాంతి చర్చలంటూనే.. ఇరాన్‌ను రెచ్చగొట్టేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన మరో ప్రకటన హర్ముజ్‌లో సరికొత్త ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది. ప్రాజెక్ట్ ఫ్రీడమ్.. ట్రంప్ చేసిన తాజా ప్రకటన. హర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ మేరకు ఆయన సోషల్ ట్రూత్‌లో ‘‘చిక్కుకున్న ఆ నౌకలు తటస్థమైనవి. ఈ ఉద్రిక్తతలతో వాటికి ఏ సంబంధం లేదు. ఏ తప్పు చేయకుండానే అందులో ఉన్న సిబ్బంది ఆహారం, ఇతర అవసరాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వాటిని సురక్షితంగా బయటకు తేవాల్సిన అవసరం అమెరికా బాధ్యత’’ అని ప్రకటించారు. ఏం చేస్తారంటే.. ట్రంప్ చెప్పిన వివరాల ప్రకారం.. ప్రాజెక్టు ఫ్రీడమ్ సోమవారం మధ్యాహ్నాం(మిడిల్ ఈస్ట్ కాలమానం ప్రకారం) ప్రారంభం కానుంది. మానవతా దృక్పథంతో ఈ ఆపరేషన్ చేపడుతున్నామని.. ప్రాంతీయ స్థిరత్వానికి, అలాగే అంతర్జాతీయ వాణిజ్యానికి కూడా ఎంతో కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సీ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశ్యం.. సముద్ర మార్గంలో చిక్కుకున్న వందలాది నౌకలు, వాటిల్లోని సుమారు 20,000 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకు రావడం. ఆ నౌకలు సురక్షితంగా బయటకు వచ్చేందుకు అమెరికా సైన్యం దారి చూపుతుంది. వాటికి రక్షణగా నిలుస్తుంది. తద్వారా వాటి వ్యాపార కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు సహాయం చేస్తుంది. సీ ఆపరేషన్‌కు ఇరాన్ సహకరిస్తుందా?హర్ముజ్ సముద్ర మార్గం ప్రపంచ చమురు రవాణాకు కీలకమైనది. రెండు నెలలుగా ఇక్కడ ఏర్పడ్డ అంతరాయం, కొనసాగుతున్న ఉద్రిక్తతలతో అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన మార్కెట్లపై ప్రభావం పడింది. గ్లోబల్ మార్కెట్ కుదేలైంది. దీనిని ఆసరాగా చేసుకుని అమెరికాను తమ డిమాండ్లకు ఒప్పించాలని ఇరాన్ భావిస్తోంది. ఈ తరుణంలో ట్రంప్ తాజా ప్రకటనకు, నౌకలు సురక్షితంగా బయటకు వచ్చేందుకు సహకరిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే ఇరాన్ ప్రతిపాదించిన 14 పాయింట్ల శాంతి ప్రణాళికను ట్రంప్ తిరస్కరించారు. ఆయన దానిని "అంగీకారయోగ్యం కాదు" అని వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో "సానుకూల చర్చలు" జరుగుతున్నాయని ట్రంప్ సూచించారు. అదే సమయంలో ప్రాజెక్టు ఫ్రీడమ్‌లో గనుక జోక్యం చేసుకుంటే కఠినంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు.ఇరాన్ ఏమందంటే.. ప్రాజెక్టు ఫ్రీడమ్‌ను మానవతా చర్యగా ట్రంప్ చెబుతున్నప్పటికీ.. ఇది ముమ్మాటికీ అమెరికా వ్యూహాత్మక శక్తి ప్రదర్శనగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. ఈ చర్యను అసాధ్యంగా ఇరాన్ అభివర్ణిస్తోంది. హర్ముజ్ తమ ఆధీనంలో ఉందని.. ఇప్పటికే అమెరికా బ్లాకేడ్(దిగ్బంధనం) తమ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తోందని.. ఇప్పుడు నౌకల తరలింపునకు అమెరికా తన సైన్యాన్ని రంగంలోకి దించితే గనుక అది కాల్పుల విరమణ ఉల్లంఘన కిందకే వస్తుందని ప్రకటించింది. ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ అధిపతి అబ్రహీం అజిజీ ఈ సముద్ర ఆపరేషన్‌పై సెటైర్లు వేశారు. హర్ముజ్ సముద్ర మార్గం అనేది అమెరికా ట్రూత్ సోషల్ పోస్టులతో నిర్వహించబదని ఎద్దేవా చేశారు. హర్ముజ్ పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని స్పష్టం చేశారాయన. దీంతో “ప్రాజెక్ట్ ఫ్రీడమ్”కు ఇరాన్ సహకారం ఇవ్వదనేది స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఇది ఎలాంటి ఉద్రిక్తతలకు దారి తీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. -
అమెరికాకు ఇరాన్ కొత్త ప్రతిపాదన ఇదే..
యుద్ధం శాశ్వతంగా ముగించేందుకు ఇరాన్ 14 పాయింట్లతో కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ఇరాన్ ఒక పాకిస్తానీ మధ్యవర్తి ద్వారా 14 అంశాలతో కూడిన ప్రతిపాదనను వాషింగ్టన్కు పంపింది. యుద్ధ విరమణ.. ప్రాంతీయ భద్రత, ఆంక్షల తొలగింపు, ఇతర డిమాండ్లతో ముడిపడి ఉండాలని.. వీటన్నింటినీ 30 రోజుల్లోపు పరిష్కరించాలని ఇరాన్ కోరింది. అమెరికా ప్రతిపాదించిన 9 అంశాల ప్రణాళికకు ఇరాన్ అధికారికంగా ఈ 14 అంశాల వివరణాత్మక ప్లాన్‌తో సమాధానమిచ్చినట్లు ఓ వార్తాసంస్థ పేర్కొంది.అమెరికా రెండు నెలల యుద్ధ విరమణను ప్రతిపాదించగా.. ఇరాన్ దానిని తిరస్కరించింది. అన్ని ప్రధాన సమస్యలను 30 రోజుల్లోనే పరిష్కరించాలని పట్టుబట్టింది. భవిష్యత్తులో సైనిక దాడులు జరగకుండా హామీ ఇవ్వాలని.. ఇరాన్ సరిహద్దు ప్రాంతాల నుండి అమెరికా దళాలను ఉపసంహరించుకోవాలని, నౌకాదళ దిగ్బంధనాన్ని ముగించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. నిలిపివేసిన తమ ఆర్థిక ఆస్తులను విడుదల చేయాలని, నష్టపరిహారం చెల్లించడంతో పాటు సుదీర్ఘకాలంగా ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని కోరింది.ఈ శాంతి ఒప్పందం కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా.. లెబనాన్‌తో సహా అన్ని వైపులా పోరాటాలను ముగించాలని ఇరాన్ కోరింది. అలాగే, వ్యూహాత్మకమైన హోర్ముజ్ జలసంధిలో భద్రత, రవాణా నియంత్రణ కోసం కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా స్పందిస్తూ.. ఈ కొత్త ప్రతిపాదనను సమీక్షిస్తానని చెబుతూనే.. దశాబ్దాలుగా టెహ్రాన్ చేసిన చర్యలకు ఇంకా తగినంత భారీ మూల్యం చెల్లించలేదని పేర్కొన్నారు. తాను త్వరలోనే ఇరాన్ పంపిన ఈ ప్రణాళికను పరిశీలిస్తానని.. అయితే ఇది ఆమోదయోగ్యంగా ఉంటుందని తాను ఊహించలేకపోతున్నానని ఆయన రాసుకొచ్చారు. -
మళ్లీ అదే జరగొచ్చు.. ఇరాన్ కీలక వ్యాఖ్యలు
టెహ్రాన్: అమెరికాతో మళ్లీ యుద్ధం జరగొచ్చంటూ ఇరాన్ సీనియర్ సైనిక అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలు నిలిచిపోవడంతో అమెరికాతో తిరిగి ఘర్షణ తలెత్తే అవకాశం ఉందన్నారు. అమెరికా హామీలకు, ఒప్పందాలకు కట్టుబడి ఉండదని ఆధారాలు చూపిస్తున్నాయంటూ ఇరాన్ సైనిక కేంద్ర కమాండ్ సెంటర్ 'ఖతమ్ అల్-అంబియా'కు చెందిన మొహమ్మద్ జాఫర్ అసాదీ అన్నట్లు ఇరాన్ ఫార్స్ వార్తా సంస్థ పేర్కొంది. మరో వైపు, యుద్ధాన్ని పూర్తిగా ముగించడానికి ఇరాన్ తమతో కొత్త ప్రతిపాదన చేసిందని.. అయితే, అందులోని అంశాలపై తాను సంతృప్తి చెందడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇరాన్ ప్రపోజల్ నచ్చలేదన్న ట్రంప్... అసలు ఈ ప్రపొజల్ ఏమిటి? అందులో పేర్కొన్న అంశాలేమిటి? అనేది ఆయన స్పష్టంగా చెప్పలేదు.ఇదిలా ఉండగా.. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో ఇరాన్‌పై యుద్ధం ముగిసిపోయిందంటూ అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పారు. 1973 నాటి చట్టం ప్రకారం.. ఇతర దేశాలపై 60 రోజులకు పైగా యుద్ధం చేస్తే అమెరికా కాంగ్రెస్(చట్టసభ) నుంచి ప్రభుత్వం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధన నుంచి తప్పించుకోవడానికే ఇరాన్‌పై యుద్ధం ముగిసిందని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.ఇరాన్‌పై యుద్ధం విషయంలో ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అనుమతి పొందలేదు. పశ్చిమాసియాలో ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఘర్షణలు ముగిశాయని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు ఏప్రిల్ 7న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ తర్వాత అమెరికా, ఇరాన్‌ల మధ్య దాడులు జరగలేదని గుర్తుచేశారు. -
60 రోజుల గడువు ముగుస్తున్న వేళ.. అమెరికా కీలక ప్రకటన
వాషింగ్టన్: అరవై రోజుల గడువు ముగుస్తున్న వేళ.. ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ బృందం కీలక ప్రకటన చేసింది. సైనిక చర్య కోసం కాంగ్రెస్(అమెరికా పార్లమెంటు) ఆమోదం పొందాల్సిన చట్టపరమైన గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 60 రోజుల గడువు గురించి అమెరికా హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్‌ను ఓ వార్తా సంస్థ ప్రశ్నించగా.. తాము యుద్ధంలో లేమంటూ ఆయన సమాధానమిచ్చారు.ప్రస్తుతం బాంబు దాడులు, కాల్పులు వంటి క్రియాశీలక సైనిక చర్యలేవీ జరగడం లేదు. ప్రస్తుతం మేము శాంతి స్థాపన కోసం ప్రయత్నిస్తున్నాం. చాలా సున్నితమైన చర్చలు జరుగుతున్న తరుణంలో ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుతగలడానికి నేను ఇష్టపడను. ఏం జరుగుతుందో వేచి చూడాలని జాన్సన్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా టెహ్రాన్, ఇరానియన్ నగరాలపై దాడులు చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఈ దాడుల్లో ఇరాన్ అప్పటి సుప్రీం లీడర్ అలీ ఖమేనీ, సీనియర్ కమాండర్లు, పౌరులు మరణించారు.దీనికి ప్రతికారంగా ఇరాన్.. ఇజ్రాయెల్, పొరుగున ఉన్న గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై బాంబు దాడులు చేసింది. అంతేకాకుండా కీలకమైన వాణిజ్య నౌకా రవాణా మార్గమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్'ను కూడా ఇరాన్ మూసివేసింది. మార్చి 2న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక చర్య గురించి కాంగ్రెస్‌కు సమాచారం అందించారు. మీడియా నివేదికల ప్రకారం.. అమెరికా యుద్ధ అధికారాల చట్టం (US War Powers Act) ప్రకారం, కాంగ్రెస్ అనుమతి లేకపోతే 60 రోజుల తర్వాత యుద్ధాన్ని ముగించాల్సి ఉంటుంది. ఇవాళ (మే 1)తో ముగుస్తుంది.చట్టపరమైన నిబంధనలు ప్రకారం.. యుద్ధాన్ని ప్రకటించే అధికారం కేవలం అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్)కు మాత్రమే ఉంది. అధ్యక్షుడికి లేదు. కాంగ్రెస్ ఆమోదం పొందకుండా సైన్యాన్ని వాడటానికి గరిష్ఠ గడువు 60 రోజులుగా నిర్ణయించారు. శత్రు భూభాగంలోకి తమ సైనిక దళాలను పంపిన 48 గంటల్లోగా అమెరికా పార్లమెంటుకు అధ్యక్షుడు తెలపాల్సి ఉంటుంది.కాగా, తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ.. యుద్ధాన్ని ఆపే ప్రయత్నాలు కష్టతరంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ సెనేట్‌లో తీర్మానం ఆమోదం పొందినా, రిపబ్లికన్ల ఆధీనంలో ఉన్న హౌస్‌లో ఆమోదం పొందడం.. అలాగే ట్రంప్ దానిపై వీటో (Veto) అధికారాన్ని ఉపయోగించడం వంటి అడ్డంకులు ఉన్నాయి. 'వార్ పవర్స్ యాక్ట్' (War Powers Act) అధ్యక్షుడి యుద్ధ నిర్ణయాలను నియంత్రించడంలో అరుదుగా మాత్రమే విజయం సాధించింది. మరోవైపు, కోర్టులు జోక్యం చేసుకోవడానికి వెనుకాడడం, వివాదాలు రాజకీయ వేదికలకే పరిమితం కావడంతో ట్రంప్‌ను నియంత్రించడం డెమోక్రాట్లకు సవాలుగా మారింది. -
నో ప్లాన్ బీ..! నెక్ట్స్ స్టెప్ బాంబింగ్ కంటే డేంజర్
పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. ఇరాన్ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో మాటే లేకుండా తిరస్కరించారు. అణు ఒప్పందం విషయంలో తాను పెట్టిన షరతులకు అంగీకరించే దాకా హర్ముజ్ జలసంధిలో దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో మరోసారి ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముందు హర్ముజ్‌ను తెరవండి. ఆ తర్వాత అణు ఒప్పందంపై చర్చలు జరుపుదాం.. అని ఇరాన్ నుంచి అమెరికాకు ప్రతిపాదన వెళ్లింది. అయితే ట్రంప్ అందుకు ఒప్పుకోవడం లేదు. ముందుగా అణు ఒప్పందం జరగాలని.. అప్పటివరకు బ్లాకేడ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘‘ఇప్పటికే ఇరాన్ హర్ముజ్ దిగ్బంధనంతో ఊపిరి ఆడకుండా విలవిలలాడుతోంది(ఈ క్రమంలో త్రీవ పదజాలం ప్రయోగించారాయన). అమెరికా షరతులపై అణు ఒప్పందానికి ఇరాన్ అంగీకరించే వరకు ఈ బ్లాకేడ్ కొనసాగిస్తుంటుంది. ఈసారి బ్లాకేడ్ బాంబింగ్ కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది’’ అని అన్నారాయన. అయితే..దీనికి ఇరాన్ కూడా అంతే ఘాటుగా స్పందించింది. అమెరికా బ్లాకేడ్‌కు త్వరలోనే అపూర్వమైన ప్రతిస్పందన ఇస్తాం అంటూ బదులిచ్చింది. ఇరాన్ విదేశాంగ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. మేం దౌత్యానికి అవకాశం ఇస్తున్నాం. కానీ మా సహనం పరిమితమే. అవసరమైతే కఠోర చర్యలకు దిగుతాం అని హెచ్చరించారు.ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాల సంయుక్త దాడులతో పశ్చిమాసియా యుద్ధం ఫిబ్రవరి 28న మొదలైంది. అప్పటి నుంచి హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హర్ముజ్‌పై పూర్తి ఆధిపత్యం తమదేనని.. అవసరమైతే టోల్ కూడా వసూల్ చేస్తామని చెబుతూ ఇరాన్ జలసంధిని మూసేసింది. ఫలితంగా చమురు సంక్షోభం మొదలైంది. అయితే తాత్కాలిక యుద్ధ విరమణ నేపథ్యంలో జలసంధిని ఇరాన్ తెరిచింది. ఈలోపే తన మిత్రదేశం లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఇరాన్ వెంటనే మళ్లీ మూసేసింది. ఇక చర్చల్లో ఇరాన్ మొండి వైఖరి ప్రదర్శిస్తుండడంతో ఏప్రిల్ 13న అమెరికా నేవీ హర్ముజ్ బ్లాకేడ్‌ను ప్రకటించింది. అమెరికా నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లు ఇరాన్‌కు వచ్చీపోయే వాణిజ్య నౌకలను అడ్డుకోవడం మొదలుపెట్టాయి. హెచ్చరికలను పట్టించుకోకుండా మొండిగా ముందుకు వస్తే దాడులు చేశాయి. అప్పటి నుంచి ఈ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. ఇంకోవైపు ఇరాన్ చమురు ఎగుమతులు దాదాపు నిలిచిపోయి ఆ దేశానికి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. హర్ముజ్‌ను తాము మూసేయడంతో ఇరాన్‌కు ఒకరోజుకి 500 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోందని అమెరికా అంటోంది. అయితే ఇరాన్ మాత్రం దీన్ని సార్వభౌమత్వంపై దాడిగా ప్రకటించుకుంది.ప్లాన్‌బీ లేనే లేదు!అమెరికా-ఇరాన్ మధ్య న్యూక్లియర్ డీల్ ఇంకా కుదరలేదు. మధ్యవర్తిగా ఉన్న పాక్ ఈ విషయంలో ఘోరంగా విఫలమైంది. దీంతో మరో వ్యూహం జోలికి పోకుండా ట్రంప్ ఆర్థిక ఒత్తిడి ద్వారా ఇరాన్‌ను చర్చలకు రప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ‘‘ఇరాన్ తన ప్రధాన ఆదాయ వనరు చమురును వినియోగించుకోలేకపోతోంది. ఆ నిల్వలు పేరుకుపోయి పైప్లైన్లు పేలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి’’ అంటూ వ్యాఖ్యానించారాయన. మరోవైపు.. ఇకపై తాను మంచోడిలా ఉండలేనంటూ తుపాకీతో ఉన్న ఫొటోను ఆయన పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్‌పై మరోసారి దాడులకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.ఇప్పటికే అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) పరిస్థితిని సమీక్షిస్తోంది. కుదిరితే చిన్నస్థాయిలో దాడులు చేయాలని.. వాటి ఫలితం మాత్రం ఇరాన్‌పై అత్యంత ప్రభావం చూపాలని ప్రణాళిక గీస్తోంది. అయితే ఈ దాడులకు ట్రంప్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రావాల్సి ఉందని ఓ అధికారి చెబుతున్నారు. ఇరాన్ మాత్రం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని.. ప్రతిఘటనకు సిద్ధంగా ఉన్నామని అంటోంది. ఈ లెక్కన పశ్చిమాసియా ఉద్రిక్తతలకు హర్ముజ్ మరోసారి కేంద్ర బిందువుగా మారే అవకాశం కనిపిస్తోంది. -
చర్చల వేళ మరో ట్విస్ట్.. అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
టెహ్రాన్: మరోసారి అమెరికాను ఇరాన్ తీవ్రంగా హెచ్చరించింది. అమెరికా 'సముద్రపు దోపిడీ' కొనసాగిస్తే.. ప్రతీకారం తప్పదంటూ ఇరాన్ సైన్యం తేల్చిచెప్పింది. ఇరాన్ సైన్యం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) మధ్య సమన్వయం వహించే అత్యున్నత సైనిక విభాగం 'ఖాతం అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్' ఈ ప్రకటనను విడుదల చేసింది. అమెరికా తన దిగ్బంధనాన్ని కొనసాగిస్తే.. తమ సాయుధ బలగాల నుండి గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయం అంటూ ఇరాన్ పేర్కొంది.ఇరాన్ సాయుధ దళాలు గతంలో కంటే ఇప్పుడు మరింత పటిష్టంగా, గరిష్ట స్థాయి సంసిద్ధతతో ఉన్నాయని.. జాతీయ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాయంటూ ఇరాన్ స్పష్టం చేసింది. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో శత్రువుల కదలికలను నిరంతరం గమనిస్తున్నామని.. అమెరికా ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే కోలుకోలేని దెబ్బ తీస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది.మరోవైపు, అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించి శాంతి చర్చలు జరపాలన్న పాకిస్థాన్ ప్రయత్నాలు ఘోరంగా విఫలమైనట్లు తెలుస్తోంది. ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇవాళ(శనివారం) పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సమావేశమయ్యారు. పశ్చిమాసియా పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించినట్లు పాక్ అధికారులు తెలిపారు. ఇస్లామాబాద్‌లో జరగాల్సిన ఈ చర్చల అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. అమెరికా నౌకాదళం ముందుగా హార్ముజ్ జలసంధి, ఇరాన్ ఓడరేవులపై ఉన్న దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని టెహ్రాన్ స్పష్టమైన షరతు విధించింది. ఒకవైపు శాంతి చర్చలకు అవకాశాలు పూర్తిగా మూసుకుపోగా.. మరోవైపు సముద్ర జలాల్లో అమెరికా తన కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ఇరాన్ ఓడరేవుల వైపు వెళ్తున్న ఆ దేశ నౌకను అమెరికా యుద్ధనౌక అడ్డుకోవడం అంతర్జాతీయంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని అమలు చేయడంలో భాగంగా సముద్ర జలాల్లో పహారా కాస్తున్న ‘యూఎస్ఎస్ రాఫెల్ పెరాల్టా’ అనే గైడెడ్-మిస్సైల్ డిస్ట్రాయర్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఏప్రిల్ 24న ఇరాన్ జెండాతో తమ దేశంలోని ఓడరేవు వైపు వెళ్తున్న ఒక నౌకను అమెరికా నావికాదళం విజయవంతంగా అడ్డుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ శనివారం అధికారికంగా ప్రకటించింది. -
దాదాపు 50 రోజుల ఉద్రిక్తతల తర్వాత.. ఇరాన్ కీలక నిర్ణయం
టెహ్రాన్: యాభై రోజుల ఉద్రిక్తతల తర్వాత టెహ్రాన్ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానా సేవలను పునరుద్ధరించారు. వాణిజ్య విమానాల రాకపోకలను శనివారం నుంచి ప్రారంభించినట్లు ఇరాన్ వెల్లడించింది. తాత్కాలిక కాల్పుల విరమణ నేపథ్యంలో మళ్లీ విమాన సర్వీసులు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఇరాన్ ప్రభుత్వ మీడియా సమాచారం ప్రకారం.. ఇరాన్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ పర్యవేక్షణలో విమానా సేవలను పునరుద్ధరించారు భౌగోళిక, రాజకీయ అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని విమానయాన కార్యకలాపాలను పూర్తిగా పునరుద్ధరించడానికి అధికారులు నాలుగు దశల ప్రణాళికను అమలు చేస్తున్నారు.'ఫ్లైట్ రాడార్ 24' డేటా ప్రకారం.. శనివారం ఉదయం టెహ్రాన్ నుండి ఇస్తాంబుల్‌కు మూడు విమానాలు బయలుదేరాయి. వీటితో పాటు మస్కట్, మదీనాకు కూడా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కీలకమైన మార్గాల్లో సేవలను పునరుద్ధరించారు. యుద్ధం కారణంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికుల డిమాండ్‌ను కూడా అధికారులు నిశితంగా గమనిస్తున్నారు.అమెరికాతో కుదిరిన కాల్పుల విరమణ అవగాహన ఒప్పందం తర్వాత తన వైమానిక మార్గాలను పాక్షికంగా తెరవాలని ఇరాన్ నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకే విమాన సర్వీసులు మళ్ళీ మొదలయ్యాయి. ప్రస్తుతం నేరుగా సైనిక దాడులు నిలిచిపోయినప్పటికీ, పరిస్థితి ఇంకా సాధారణ స్థితికి రాలేదని అధికారులు చెబుతున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ఒక్కో దశలో విమాన రాకపోకల సామర్థ్యాన్ని పెంచుతూ సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని అధికారులు భావిస్తున్నారు. -
ఇరాన్‌తో యుద్ధంలో న్యూక్లియర్ వెపన్స్‌పై ట్రంప్ క్లారిటీ
వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధంలో న్యూక్లియర్ వెపన్స్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టతనిచ్చారు. యుద్ధంలో న్యూక్లియర్ వెపన్స్ వాడాల్సిన అవసరం లేదన్నారు. సాధారణ దాడులద్వారానే ఇరాన్ సైన్యం చిన్నాభిన్నమైందంటూ వ్యాఖ్యానించారు. పర్మినెంట్ డీల్ కోసమే చూస్తున్నామని.. ప్రస్తుతం ఇరాన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్ దెబ్బతిన్నాయంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.మరోవైపు, పశ్చిమాసియా యుద్ధంలో మునిగిపోయిన ఇరాన్‌ను ఆర్థిక సుడిగుండంలో నిండా ముంచేందుకు హార్మూజ్ జలసంధిని గుప్పిట పట్టామని ట్రంప్ పునరుద్ఘాటించారు. జలసంధిపై తమ ఆధిపత్యాన్ని కొనసాగేంచేందుకు అగ్రరాజ్య నావికాదళాలకు ఆయన గురువారం కీలక ఆదేశాలిచ్చారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘హార్మూజ్ జలసంధిలో మన యుద్ధ నౌకలు, విదేశీ నౌకల రాకపోకలను పెను ప్రమాదంలోకి నెట్టేసే సముద్రమందుపాతరను వెనువెంటనే ఏరిపారేయండి...కొత్తగా మందుపాతరలను పెట్టేందుకు సముద్రజలాల్లో సంచరించే ఇరాన్ పడవలను వెంటనే పేల్చేయండి. అవి చిన్నపడవలు అనే కనికరం అస్సలు చూపకండి. ఇప్పటికే మన దెబ్బకు ఇరాన్ నావికాదళంలోని కీలక 159 నౌకలు మునిగిపోయి సముద్రగర్భంలోకి చేరాయి. మన మైన్ ‘స్వీపర్లు’ ఇప్పటికే సీమైన్స్‌ను ఏరిపారేయడంలో నిమగ్నమ య్యాయి. ఈ పనిని మూడు రెట్లు అత్యధిక వేగంతో పూర్తిచేసే బాగుంటుంది.హార్మూజ్ దిగ్బంధం కొనసాగుతుంది. ఇరాన్ మనతో ఒప్పందం కుదుర్చుకునేదాకా మన అనుమతి లేకుండా ఏ ఒక్క నౌక ఈ మార్గంలో రాకపోకలు సాగించడానికి వీల్లేదు. ఐఆర్జీసీ ఆధిపత్యం, పాలకులతో విబేధాలతో తమ అసలైన అత్యున్నత నేత ఎవరు అనేది తేల్చుకోవడం ఇరానియన్లకు కష్టంగా మారింది. అతివాద నేతలేమో మన దాడుల్లో చనిపోతు న్నారు. ఉదారవాదులకు కాస్తంత గౌరవం దక్కుతోంది. ఇది నిజంగా క్రేజీ విషయం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.‘‘ఇరాన్‌తో శాంతి ఒప్పందం కోసం ఆత్రంగా ఎదురుచూడట్లేము. మాకు తొందరేం లేదు. యుద్ధాన్ని త్వరగా ముగించి అమెరికా మధ్యంతర ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని ట్రంప్ అన్నారు. ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసేందుకే జలసంధి దిగ్బంధించామని అమెరికాæ ఆర్థిక మంత్రి స్కాట్బీసెంట్ అన్నారు. ‘‘ఈ విషయంలో మా అధ్యక్షుడు స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. హార్మూజ్ సహా ఇరాన్ నౌకాశ్రయాలను దిగ్బంధిస్తే ముడిచమురు సరఫరా ఆగిపోతుంది.దీంతో ఖర్గ్ ద్వీపంలోని ముడిచమురు నిల్వకేంద్రాలన్నీ క్రూడా యిల్లో నిండిపోతాయి. చమురుబావుల నుంచి సరఫరా అయ్యే ముడిచమురును నిల్వచేయడానికి చోటే ఉండదు. అప్పుడు తప్పనిపరిస్థితుల్లో చమురుబావుల నుంచి వెలికితీత ఆపేయాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆపేస్తే మళ్లీ మొదలెట్టడం శ్రమతోకూడిన సంక్లిష్ట ప్రక్రియ. దీంతో ఆదాయం లేక ఇరాన్ చేతులెత్తేస్తుంది’’ అని హెచ్చరించారు. -
పశ్చిమాసియా యుద్ధంపై రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
బెర్లిన్: శాంతి చర్చల్లో భారత్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని.. పశ్చిమాసియా యుద్ధంపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఆపాలని ఇప్పటికే ఇరుదేశాలను ప్రధాని మోదీ కోరారని గుర్తు చేశారు. బెర్లిన్(జర్మనీ)లోని భారత రాయబార కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పడంలో న్యూఢిల్లీ తన వంతు పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.పశ్చిమాసియా సంక్షోభంలో భారతదేశానికి ఏదైనా పాత్ర ఉందా అన్న ప్రశ్నకు సమాధానంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ రేపు ఒక సమయం రావచ్చు.. అప్పుడు భారత్ ఈ విషయంలో తన పాత్రను పోషించి విజయం సాధించడం కూడా సాధ్యమేనని తేల్చిచెప్పారు. ‘‘యుద్ధాన్ని ముగించాలని ప్రధాని మోదీ రెండు వైపులా విజ్ఞప్తి చేశారు. దౌత్యపరమైన విషయాల్లో మా ప్రధానికి చాలా సమతుల్యమైన దృక్పథం ఉంది’’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.కాగా, ఇరాన్ అణు శుద్ధి కార్యక్రమంపై తలెత్తిన విభేదాల కారణంగా పాకిస్థాన్‌లో జరగాల్సిన ఇరాన్-అమెరికా రెండో రౌండ్ శాంతి చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో రెండు వారాల కాల్పుల విరమణ పొడిగింపును ప్రకటించారు. ఇరుపక్షాలను తిరిగి చర్చల టేబుల్ వద్దకు తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ చేసిన అభ్యర్థన మేరకు, ఇరాన్ నాయకులు ఒక ఏకీకృత ప్రతిపాదనతో వచ్చే వరకు దాడులను వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ప్లాట్ఫామ్లో రాసుకొచ్చారు.అయితే, ఈ కాల్పుల విరమణ పొడిగింపును ఇరాన్ త్రోసిపుచ్చింది. ఇది అకస్మాత్తుగా దాడి చేయడానికి సమయాన్ని పొందేందుకు పన్నుతున్న కుట్రగా ఇరాన్ అభివర్ణించింది. ఓడిపోయే పక్షం షరతులు విధించలేదు. దిగ్బంధం కొనసాగితే దానికి సైనికపరమైన సమాధానం తప్పదంటూ ఇరాన్ ప్రతినిధి మహదీ మొహమ్మదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. -
ఇద్దరిలో ఓ మెట్టు దిగాల్సింది ఎవరు?
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. చర్చలకు అమెరికా సిద్ధంగానే ఉన్నా.. ఇరాన్ ముందుకు రాకపోవడంతో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది. యుద్ధం గనుక మళ్లీ మొదలైతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే హెచ్చరిస్తున్నారు. అయినా కూడా తగ్గబోమని.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని ఇరాన్ కూడా అంటోంది. అయితే..చర్చల విషయంలో సానుకూలంగానే ఉన్నా ఇరాన్ బెట్టు చేయడం సరికాదని అమెరికా అంటోంది. కొత్త ఒప్పందం అమలు అయితే అన్నీ సర్దుకుంటాయని.. ఆ ఒప్పందం ఓ కొలిక్కి రావాలంటే ఇరాన్ చర్చలకు దిగి రావాల్సిందేనని.. అప్పుడే పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొంటుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ చివరి నిమిషంలో ఇరాన్ చర్చలకు వచ్చినా తుది ఒప్పందం కుదురుతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఆ ‘ఒక్క’ విషయంలోనే ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేకపోవడమే ఇందుకు కారణంగా చూపిస్తున్నారు. శుద్ధి యురేనియం.. సాధారణంగా యురేనియం శుద్ధి 3–5 శాతం వరకు చేస్తే అది విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగపడుతుంది. కానీ ఇరాన్ ఏకంగా 20 శాతం పైగా శుద్ధి చేస్తోందని(60 శాతం దాకా చేసిందని కూడా!).. ఇది అణు ఆయుధాల తయారీకి దగ్గర స్థాయిలో ఉందని అమెరికా ఆరోపణ. ఇరాన్ మాత్రం ఇదంతా వైద్య పరిశోధన, అణు శక్తి ఉత్పత్తి కోసం మాత్రమే అని చెబుతోంది.2015లో కుదిరిన Joint Comprehensive Plan of Action (JCPOA) ప్రకారం.. ఇరాన్ యురేనియం శుద్ధి 3.67% వరకు మాత్రమే పరిమితం చేయాలి. అలా చేస్తే ఇరాన్ మీద ఆర్థిక ఆంక్షలను తొలగిస్తామని అమెరికా పేర్కొంది. అయితే.. 2018లో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఒప్పందం నుంచి అగ్రరాజ్యం తప్పుకుంది. తమ దేశ జాతీయ భద్రతా ప్రయోజనాలను ఈ డీల్ కాపాడలేదని.. పైగా ఇరాన్‌కు ఆర్థిక లాభాలు కట్టబెట్టిందని ఆయన ఆ టైంలో ఆరోపించారు. ఒప్పందం తొలగిపోవడంతో ఇరాన్ మళ్లీ తన అణు కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. అయితే..అదే విషయమై.. అదే ట్రంప్ ఇప్పుడు కొత్త డీల్ కుదుర్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేయడం మిడిల్ ఈస్ట్ భద్రతకు కీలకమని అంటున్నారాయన. యుద్ధం కన్నా ఒప్పందం మంచిదని పదేపదే పాట పాడుతున్నారు. ఇరాన్‌కు మరో దారి లేదని హెచ్చస్తూనే.. అవసరమైన సడలింపులు కూడా ఇచ్చేందుకు రెడీ అంటూ బుజ్జగిస్తున్నారు. అవసరమైతే.. డీల్ కుదుర్చుకునేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగుతానని అంటున్నారు. అయితే.. ఇక్కడ ప్రధాన సమస్య యురేనియం శుద్ధి (uranium enrichment) కాలపరిమితి విషయంలోనే కనిపిస్తోంది.ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని సుదీర్ఘ కాలం(20 ఏళ్లపాటు) నిలిపివేయడానికి అంగీకరించిందని, ఇది కొత్త ఒప్పందానికి మార్గం సుగమం చేస్తుందని ట్రంప్ చెబుతున్నారు. అయితే, అమెరికా ఏ రకమైన సడలింపులు ఇవ్వగలదో మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఇరాన్ మాత్రం చాలా తక్కువ కాలం (5–7 సంవత్సరాలు) మాత్రమే అంగీకరించేందుకు సిద్ధంగా ఉంది. తమకు ఇచ్చే సడలింపులపై ఇప్పుడే స్పష్టత ఇవ్వాలని కోరుతోంది. అలాగే ఆర్థిక ఆంక్షలను తక్షణమే తొలగించాలని షరతు పెడుతోంది. ఇక్కడే చర్చలు ముందుకు సాగడం లేదు.అమెరికా ఏం కోరుకుంటోందియురేనియం శుద్ధి, అణు ఆయుధాల అభివృద్ధి పూర్తిగా ఆపడం.బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌పై నియంత్రణ.లెబనాన్, సిరియా, యెమెన్ వంటి ప్రాంతాల్లో మిలిటెంట్ గ్రూపులకు మద్దతు తగ్గించడం.దేశీయ నిరసనలపై కఠిన చర్యలు తగ్గించడం.ఇరాన్ ఏం ఆశిస్తోందంటే..ఆంక్షలు ముందుగా ఎత్తివేయాలి. అమెరికా ఆర్థిక ఆంక్షలు తగ్గించకపోతే, అణు కార్యక్రమంపై పెద్ద సడలింపులు ఇవ్వలేమని ఇరాన్ అంటోంది.అణు శుద్ధి అవసరం కూడా. అణు శక్తి ఉత్పత్తి కోసం అవసరమని వాదిస్తోంది.తక్కువకాల పరిమితి మాత్రమే: అమెరికా కోరుతున్న 20 సంవత్సరాలపాటు అణు కార్యక్రమం నిలిపివేయడం సాధ్యం కాదని, గరిష్టంగా 5–7 సంవత్సరాలు మాత్రమే అంగీకరించగలమని చెబుతోంది.ప్రాంతీయ ప్రభావం తగ్గించలేం. లెబనాన్, సిరియా, యెమెన్‌లో మిలిటెంట్ గ్రూపులకు మద్దతు ఇవ్వడం తమ భద్రతా వ్యూహంలో భాగమని ఇరాన్ అంటోంది.దేశీయ విధానాల్లో జోక్యం వద్దు. నిరసనలపై చర్యలు తమ అంతర్గత వ్యవహారమని, అమెరికా లేదంటే ఇతర దేశాలు జోక్యం చేసుకోవడం అంగీకరించలేమని చెబుతోంది.సమాన ఒప్పందం కావాలి: అమెరికా మాత్రమే లాభపడే ఒప్పందం కాకుండా, ఇరాన్‌కు కూడా ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు కలిగేలా ఉండాలని కోరుతోంది.సాధ్యమైన సడలింపులు ఆర్థిక ఆంక్షల సడలింపు: చమురు ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తగ్గించడం లేదా ఎత్తివేయడం.వాణిజ్య అవకాశాలు: అంతర్జాతీయ మార్కెట్లలో ఇరాన్‌కు తిరిగి ప్రవేశం కల్పించడం.మానవతా మినహాయింపులు: ఔషధాలు, ఆహారం వంటి అవసరమైన వస్తువులపై ఆంక్షలు తగ్గించడం.సైనిక ఒత్తిడి తగ్గింపు: ఇరాన్ మిలిటెంట్ గ్రూపులకు మద్దతు తగ్గిస్తే.. అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించడం.ఒప్పందం కుదిరితేప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గవచ్చు: మధ్యప్రాచ్యంలో యుద్ధం అవకాశాలు తగ్గి, స్థిరత్వం పెరుగుతుంది.ఆర్థిక లాభం: ఇరాన్‌పై ఉన్న ఆంక్షలు సడలితే, చమురు ఎగుమతులు పెరుగుతాయి.చమురు మార్కెట్‌పై ప్రభావం: అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా పెరిగి, ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.రాజకీయ సంబంధాలు మెరుగుపడవచ్చు. అమెరికా–ఇరాన్ సంబంధాలు సానుకూల దిశలో కదిలి, ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపవచ్చు.ఒప్పందం కుదరకుంటేఉద్రిక్తతలు పెరుగుతాయి: మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ ఘర్షణలు.. సైనిక చర్యలు పెరిగే అవకాశంఆంక్షలు కొనసాగుతాయి: ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి మరింత పెరుగుతుంది.చమురు ధరలు పెరిగే అవకాశం: సరఫరా తగ్గితే, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతాయి.ప్రాంతీయ అస్థిరత: లెబనాన్, సిరియా, యెమెన్ వంటి ప్రాంతాల్లో మిలిటెంట్ గ్రూపులకు మద్దతు పెరిగి.. ఘర్షణలు మరింత తీవ్రమవుతాయి.చర్చలు విఫలమైతే.. అమెరికా–ఇరాన్ సంబంధాలు మరింత దూరమవుతాయి. రెండువారాల యుద్ధ విరమణ బుధవారంతో(భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి దాటాక) ముగియనుంది. అంటే.. ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. చర్చల్లో ఏదో ఒక పురోగతి కనిపిస్తేనే.. అది పొడిగింపు ఉండొచ్చు. అంటే.. ఈ చర్చలు మిడిల్ ఈస్ట్ భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. -
‘ప్రతీకారం తీర్చుకుంటాం..’ అమెరికా-ఇరాన్‌ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు!
ఇరాన్ - అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. రెండో దఫా చర్చలపై ప్రతిష్టంబన కొనసాగుతుండగా.. అమెరికా నౌకాదళం ‘‘టౌస్కా’’ అనే ఇరాన్ వాణిజ్య నౌకను అడ్డగించి స్వాధీనం చేసుకుంది. ఈ నౌక గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో చైనా నుండి ఇరాన్ వైపు ప్రయాణిస్తుండగా పరిణామం చోటు చేసుకుంది. అయితే ఈ చర్యకు గట్టి ప్రతీకారమే ఉంటుందని ఇరాన్ హెచ్చరిస్తోంది. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ.. హర్ముజ్ జలసంధిని దిగ్బంధించింది అమెరికా. తమ సైన్యం హెచ్చరించినా ఆ నౌక ఆగలేదని.. అందుకే స్వాధీనం చేసుకోవాల్సి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై ఇరాన్ మండిపడింది. ఇరాన్ సైనిక కమాండ్ ఖాతమ్ అల్-అన్బియా ఈ చర్యను.. సముద్ర దొంగతనంగా, ఆయుధ దోపిడీగా అభివర్ణించారు. అమెరికా రెండు వారాల కాలం ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ.. అమెరికా దాడికి తగిన ప్రతిస్పందన ఇస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో.. నౌకను అమెరికా మెరైన్లు స్వాధీనం చేసుకున్నారని, ప్రస్తుతం నౌకపై పూర్తి నియంత్రణ ఉందని పేర్కొన్నారు. ఈ నౌకపై గతంలో అక్రమ కార్యకలాపాలు జరిపినందుకు అమెరికా ట్రెజరీ శాఖ ఆంక్షలు విధించిందని ఆయన గుర్తు చేశారు.మొదట ఇరాన్ ఈ ఘటనను ఖండిస్తూ.. తమ నౌకాదళం సమయానికి స్పందించి అమెరికా దాడిని అడ్డుకుందని ప్రకటించింది. అయితే, తరువాత అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన వీడియోలో నౌకను అమెరికా స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టమైంది. ఈ సంఘటనతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.చర్చలపైనా ఉత్కంఠఇరాన్–అమెరికా మధ్య ఇస్లామాబాద్(పాకిస్తాన్) వేదికగా తొలి దఫా చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఇవాళ అమెరికా ప్రతినిధుల బృందం పాక్‌కు వెళ్తుందని ట్రంప్ ప్రకటించారు. అయితే.. ఇరాన్ మాత్రం ప్రధాన అంశాలపై ఏకాభిప్రాయం కుదరడం లేదని అంటోంది. హర్ముజ్‌లో అమెరికా కవ్వింపు చర్యలు, తమకు వ్యతిరేకంగా ఇస్తున్న ప్రకటనల నేపథ్యంలో చర్చలకు వెళ్లబోమని ప్రకటించింది. దీంతో ట్రంప్ ఇరాన్‌పై భగ్గుమన్నారు. చర్చలకు రాకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఈ నెల 22తో ముగియనుంది. ఇరాన్ దిగిరాకుంటే కాల్పుల విరమణ పొడిగింపు ఉండదని.. భీకర దాడులు జరుపుతామని ట్రంప్ అంటున్నారు. -
ఇరాన్ అణు నిల్వలపై చైనా వైఖరి ఇదేనా?
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా అంతర్జాతీయ దౌత్య రంగంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. హార్మూజ్ జలసంధి పునరుద్ధరణ, ఇరాన్ అణు నిల్వలపై చైనా వైఖరి కీలకంగా మారనుంది.హార్మూజ్ జలసంధి పునరుద్ధరణప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడంపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సంతోషంగా ఉన్నారని ట్రంప్ పేర్కొన్నారు. ‘హార్మూజ్ జలసంధి తెరిచినందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఎంతో సానుకూలంగా ఉన్నారు’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గడం వల్ల ప్రపంచ వాణిజ్యానికి, ముఖ్యంగా చైనా ఇంధన అవసరాలకు భారీ ఊరట లభించనుంది. బీజింగ్ నుంచి వస్తున్న ఈ సానుకూల సంకేతాలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఆశాభావాన్ని నింపుతున్నాయి.ఇరాన్ అణు నిల్వలు - చైనా వ్యూహాత్మక పాత్రఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైన అంశం ఇరాన్ యురేనియం. తాజా దౌత్య చర్చల ప్రకారం.. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను తగ్గించడంలో లేదా వాటిని తన ఆధీనంలోకి తీసుకోవడంలో చైనా మధ్యవర్తిగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే అటు వాషింగ్టన్, ఇటు టెహ్రాన్ మధ్య నేరుగా ఘర్షణ పడకుండా సమస్యను పరిష్కరించే మార్గం సుగమం అవుతుంది. దీనివల్ల గ్లోబల్ పాలిటిక్స్‌లో చైనా ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ట్రంప్ చైనా పర్యటనత్వరలోనే తాను చైనాలో పర్యటించనున్నట్లు వెల్లడించిన ట్రంప్, ఈ పర్యటన ప్రత్యేకమైనదని, చారిత్రాత్మకమైనదన్నారు. ‘షీ జిన్‌పింగ్‌తో భేటీ కోసం ఎదురుచూస్తున్నాను. ఈ సమావేశం ద్వారా ఎన్నో అద్భుతాలు సాధించబోతున్నాం’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఇరాన్ అణు ఒప్పందంపై ప్రతిష్టంభనను తొలగించడానికి చైనాను ఒక బఫర్‌గా వాడుకోవాలని అమెరికా భావిస్తోంది. ఒకవేళ ఇరాన్ తన యురేనియం నిల్వలను చైనాకు తరలించడానికి అంగీకరిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది.ఇదీ చదవండి: గోల్డ్ ధర.. గుండె దడ! -
అణు కార్యక్రమాన్ని నిలిపేసేందుకు ఇరాన్ అంగీకారం
ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిరవధికంగా నిలిపివేయడానికి అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అయితే, దీనికి ప్రతిఫలంగా అమెరికాలో స్తంభింపజేసిన ఇరాన్ నిధులను మాత్రం విడుదల చేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తాజాగా ఒక అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ వారాంతంలో జరగనున్న శాంతి చర్చల అనంతరం తుది ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.డబ్బు లేదు.. కేవలం శాంతి మాత్రమేట్రంప్ తన విలక్షణ శైలిలో ఈ ఒప్పందంపై స్పందిస్తూ, టెహ్రాన్‌తో చర్చలు దాదాపుగా పూర్తయ్యాయని ప్రకటించారు. ఈ ఒప్పందంలోని ప్రధాన ముఖ్యాంశాలు ఇవే..యురేనియంతో అణు కార్యక్రమాన్ని ఇరాన్ పూర్తిగా నిలిపివేయనుంది. ఇది కేవలం 10 లేదా 20 ఏళ్ల కాలపరిమితితో కూడుకున్నది కాదని, అపరిమిత కాలం పాటు అమల్లో ఉంటుందని ట్రంప్ నొక్కి చెప్పారు.ఇరాన్‌కు చెందిన సుమారు 20 బిలియన్ డాలర్ల స్తంభింపజేసిన ఆస్తులను అమెరికా విడుదల చేస్తుందన్న వార్తలను ట్రంప్ కొట్టిపారేశారు.చర్చలు తుది దశకు చేరినప్పటికీ ఇరాన్‌పై అమెరికా విధించిన నావికాదళ దిగ్బంధనం కొనసాగుతుందని, ఒప్పందం ఖరారైన తర్వాతే దీనిపై నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.కీలక పాత్రలో ఈజిప్ట్, టర్కీగత కొన్ని వారాలుగా తెర వెనుక జరిగిన దౌత్య ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో ఈజిప్ట్, టర్కీ దేశాల మద్దతుతో జరిగిన పరోక్ష చర్చలు ఈ సానుకూల ఫలితానికి దారితీశాయి. ఒప్పందం ఖరారైతే శాంతి చర్చల ముగింపు కోసం తాను స్వయంగా పాకిస్థాన్ సందర్శించే అవకాశం ఉందని కూడా ట్రంప్ సూచనప్రాయంగా తెలిపారు. ‘చాలా ప్రధాన అంశాలు ఇప్పటికే ఖరారు అయ్యాయి. ఈ ప్రక్రియ చాలా వేగంగా జరగాలి. ఇరాన్ తన అణు నిల్వలను అప్పగించడానికి సిద్ధంగా ఉంది’ అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.ఇరాన్ స్పందనఅమెరికా అధ్యక్షుడి ప్రకటనలపై ఇరాన్ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే, అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకల కోసం హార్మూజ్ జలసంధి ప్రస్తుతం తెరిచే ఉంటుందని టెహ్రాన్ ధ్రువీకరించింది. ఇది ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడానికి ఒక సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: అంతర్జాలంలో సగానికి పైగా ఏఐ రాతలే! -
హార్ముజ్ దిగ్బంధం వేళ.. యూఎస్ సంచలన వీడియో విడుదల
ఇరాన్ నౌకాశ్రయాలు, తీరప్రాంతాలు లక్ష్యంగా తాము చేపట్టిన దిగ్బంధం (Blockade) కార్యకలాపాలలో భాగంగా ఓ వాణిజ్య నౌకను అమెరికా నావికాదళ హెలికాప్టర్ పక్కకు మళ్లించిన దృశ్యాలను అమెరికా సైన్యం విడుదల చేసింది. యూఎస్ సెంట్రల్ కమాండ్ షేర్ చేసిన ఈ వీడియోలో యూఎస్ఎస్ మైఖేల్ మర్ఫీ (DDG 112) నౌకలోని ఒక నావికుడి ఆడియో సందేశం ఉంది. ఒమన్ గల్ఫ్ మీదుగా ఆ డిస్ట్రాయర్ నౌకకు చెందిన హెలికాప్టర్ ఎగురుతున్నట్లు ఈ ఫుటేజీలో కనిపిస్తోంది.ఇరాన్ నౌకాశ్రయాల్లోకి రాకపోకలు సాగించే నౌకలపై ఆంక్షలను అమలు చేస్తున్న క్రమంలో అమెరికా దళాలు ఓ వాణిజ్య నౌకను నియంత్రిస్తున్నట్లు ఈ వీడియోలో స్పష్టమవుతోంది. కాగా, 10 వేల మంది నావికులు, మెరైన్లు, యుద్దవిమాన పైలట్లు, యుద్ద విమానాలు, నిఘా నౌకలు, హెలికాప్టర్లను హార్మూజ్ దిగ్బంధం కోసం అమెరికా రంగంలోకి దింపింది. ‘‘వేల సైన్యం, ఆయుధాలు, నౌకలు, హెలికాప్టర్లను మొహరించాం. ఏ ఒక్క విదేశీ సరకు రవాణా నౌక హార్ముజ్‌ను దాటడానికి వీల్లేదు. మా బెదిరింపులకు భయపడి ఇప్పటికే 15 నౌకలు వెనక్కి వెళ్లిపోయాయి’’ అని అమెరికా జాయింట్ చీఫ్స్ చైర్మన్ జనరల్ డేన్ కెయిన్ ప్రకటించారు.Audio🔊of a Sailor aboard USS Michael Murphy (DDG 112), with video from the guided-missile destroyer’s embarked helicopter flying over the Gulf of Oman, as the U.S. Navy diverts a merchant vessel while enforcing the blockade on ships entering or departing Iranian ports. U.S.… pic.twitter.com/10QxlEoGkk— U.S. Central Command (@CENTCOM) April 16, 2026హార్మూజ్ జలసంధి సహా తమ నౌకాశ్రయాల దిగ్బంధాన్ని అమెరికా ఎత్తేయకపోతే గల్ఫ్ దేశాలతో వాణిజ్యాన్ని ఆపేస్తామని ఇరాన్ నూతన సుప్రీంనేత మొజ్తాబా ఖమేనీ సైనిక సలహాదారు అలీ అబ్దుల్లాహీ హెచ్చరించారు. అయితే కాల్పుల విరమణను మరికొన్ని రోజులు పొడిగించాలని అమెరికా, ఇరాన్ సూత్రపాయ ఒప్పందానికి వచ్చాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.మరోవైపు, పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. శాంతి చర్చల్లో కీలక పురోగతి దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో శుద్ధిచేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని చెప్పారు. ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయన్నారు. శుద్ధిచేసిన యురేనియం నిల్వలను మాకు అప్పగించేందుకు టెహ్రాన్ అంగీకరించింది. ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయి. శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు చేరువలో ఉన్నాం. ఒప్పందం కుదిరితే.. పాకిస్థాన్‌కు వెళ్లి, సంతకాల ప్రక్రియలో నేనూ భాగమయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు. -
ఇరాన్ యుద్ధం.. ట్రంప్ సంచలన ప్రకటన
పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. శాంతి చర్చల్లో కీలక పురోగతి దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో శుద్ధిచేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని చెప్పారు. గురువారం వైట్‌హౌజ్ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయన్నారు. శుద్ధిచేసిన యురేనియం నిల్వలను మాకు అప్పగించేందుకు టెహ్రాన్ అంగీకరించింది. ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయి. శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు చేరువలో ఉన్నాం. ఒప్పందం కుదిరితే.. పాకిస్థాన్‌కు వెళ్లి, సంతకాల ప్రక్రియలో నేనూ భాగమయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు. అంతటితో ఆగకుండా.. ఈ డీల్ కుదిరితే అమెరికాకు ఉచితంగా చమురుతో పాటు హర్ముజ్ జలసంధి నుంచి స్వేచ్ఛా రవాణాకు వీలు ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే.. ఇరాన్‌తో కాల్పుల విరమణ పొడిగింపు ఉండబోదన్న ఇంతకు ముందు ప్రకటించిన ట్రంప్ కాస్త చల్లబడ్డారు. పొడిగింపునకు తాను సిద్ధమేనని ఇప్పుడు చెబుతున్నారు. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్‌ల యుద్ధ విరమణ గడువు ఈ నెల 22న ముగియనుంది.మరోవైపు.. ఇరాన్ ఎన్నటికీ అణ్వస్త్రాన్ని పొందకుండా తాము నిలువరిస్తామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఉద్ఘాటించారు. తమతో చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకోవడం మినహా వాళ్లు ముందు మరో దారిలేదన్నారు. ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులకు దిగుతామని హెచ్చరించారు. ఇరాన్ తన అణు శుద్ధి ప్రయత్నాలను విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమేనని మొదటి నుంచి చెబుతున్నా.. అణ్వాయుధాల తయారీకి వీలుగా యురేనియం నిల్వలు ఉన్నాయని ఇజ్రాయెల్ సహా అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో భూగర్భంలో దాచిన యురేనియం నిల్వలను బయటకు తీయాలని.. అణు ఒప్పందానికి ముందుకు రావాలని అమెరికా ఇరాన్‌ను డిమాండ్ చేస్తోంది. “ఇకపై యురేనియం ఎన్రిచ్మెంట్ ఉండదు” అన్నది ట్రంప్ తాజా మాట. దీనిపై ఇరాన్ ఇంకా స్పందించలేదు. 2025 జూన్‌లో అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయి. అయితే.. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) అంచనా ప్రకారం.. ఇరాన్ వద్ద దాదాపు 400 కిలోల 60% శుద్ధి యురేనియం, అలాగే 200 కిలోల 20% యురేనియం నిల్వ ఉంది. ఈ నిల్వలను సులభంగా 90% ఆయుధ స్థాయి యురేనియంగా మార్చుకోవచ్చు!.పశ్చిమాసియా యుద్ధంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలకు అడుగులు పడ్డాయి. ఇస్లామాబాద్‌లో ఈ నెల 11న జరిగిన తొలి దఫా చర్చలకు ముందు.. యురేనియం శుద్ధి పూర్తిగా ఆపే ఉద్దేశ్యం లేదని ఇరాన్ స్పష్టంగా పేర్కొంది. ట్రంప్ తాజా ప్రకటనతో అమెరికా–ఇరాన్ ‘అణు’ వివాదం కొత్త మలుపు తిరిగే చాన్స్ ఉంది. -
‘మా తొలి క్షిపణికే.. మీ నౌకలు ముంచేస్తాం’
టెహ్రాన్: మా మొదటి క్షిపణులకే మీ ఓడలు మునిగిపోతాయంటూ హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. హార్ముజ్ జలసంధిని నియంత్రించేందుకు అమెరికా ప్రయత్నిస్తే.. ఆ నౌకలను ఇరాన్ ధ్వంసం చేస్తుందని ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ సైనిక సలాహాదారుడు మొహ్సెన్ రెజాయి హెచ్చరించారు. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న ఘర్షణకు ఈ జలసంధి కేంద్ర బిందువుగా మారింది. మొహ్సెన్ రెజాయీ.. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ హెచ్చరికలు చేశారు. సైనిక దుస్తుల్లో ఉన్న ఆయన మాట్లాడుతూ.. మిస్టర్ ట్రంప్.. హార్ముజ్ జలసంధికి పోలీసు కావాలనుకుంటున్నారు. ఇది నిజంగా మీ పనేనా? అమెరికా వంటి శక్తివంతమైన సైన్యం చేసే పని ఇదేనా? మీ ఓడలు మా మొదటి క్షిపణులకే సముద్రంలో మునిగిపోతాయి" అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌లో హార్డ్లైనర్గా పేరున్న రెజాయీ.. ఒకవేళ అమెరికా ఇరాన్‌పై భూతల దాడికి దిగితే.. తాము వేలమందిని బందీలుగా పట్టుకుంటామని.. ప్రతి బందీకి ఒక బిలియన్ డాలర్లు వసూలు చేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాల్పుల విరమణను పొడిగించడం తనకు ఇష్టం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరు దేశాల మధ్య ఇస్లామాబాద్‌లో జరిగిన మొదటి రౌండ్ చర్చలకు ఇరాన్ తరపున పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ గాలిబాఫ్ నాయకత్వం వహించారు. అయితే ఆదివారం ఆ చర్చలు విఫలమయ్యాయి. తిరుగు ప్రయాణంలో గాలిబాఫ్.. ట్రంప్‌ను ఉద్దేశించి, ‘‘మీరు పోరాడితే.. మేము కూడా పోరాడతాం" అని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.ఫిబ్రవరి చివరలో అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్‌పై వైమానిక దాడులు చేసి.. సుప్రీం లీడర్ అలీ ఖమేనీని చంపిన తర్వాత ఆరు వారాల పాటు యుద్ధం కొనసాగింది. ప్రస్తుతం రెండు వారాలుగా తాత్కాలిక కాల్పుల విరమణ కొనసాగుతోంది. పాకిస్థాన్‌లో వాషింగ్టన్- టెహ్రాన్ మధ్య చర్చలు విఫలమవడంతో ఇరాన్ ఓడరేవులన్నింటినీ దిగ్బంధిస్తామని అమెరికా సైన్యం గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే.. దీనిని ఇరాన్ చట్టవిరుద్ధమంటూ సముద్రపు దొంగతనంగా అభివర్ణించింది.కేవలం 34 కిలో మీటర్ల వెడల్పు ఉన్న ఈ జలసంధి ద్వారా ప్రపంచ సముద్ర చమురు వ్యాపారంలో 20 శాతం జరుగుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, ఖతార్ వంటి దేశాల ఇంధన ఎగుమతులకు ఇది కీలక మార్గం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ ఈ మార్గాన్ని దాదాపుగా అడ్డుకుంది. కేవలం చైనా వంటి మిత్రదేశాల నౌకలను మాత్రమే అనుమతిస్తోంది. -
వార్ అప్డేట్స్: హర్ముజ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఇంకా వీడలేదు. హర్ముజ్ జలసంధిలో అమెరికా దిగ్బంధనం కొసాగుతోంది. ఇరాన్ పోర్టులకు వచ్చిపోయే నౌకలపై నిఘా కొనసాగిస్తోంది. ఈ పరిణామాలు ఇరాన్‌కు సహించడం లేదు. మరోవైపు పాక్ వేదికగానే మరోసారి శాంతి చర్చలకు సన్నాహాలు జరుగుతున్నాయి. -
యుద్ధమైనా.. శాంతి చర్చలైనా.. మేం ఒక్కటే
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఇరాన్ కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా గౌరవించి తీరాల్సిందేనని పేర్కొంది. అదే సమయంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, శాంతి చర్చల ప్రతినిధి మహ్మద్ బాఘేర్ ఘలీబాఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం అయినా.. శాంతి చర్చలైనా.. ఇరాన్, దాని మిత్ర శక్తులు ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటాయని స్పష్టం చేశారు. హెజ్బొల్లా ధైర్యం, రెసిస్టెన్స్ ఐక్యత వల్లే లెబనాన్‌లో కాల్పుల విరమణను సాధ్యమైందని అన్నారాయన. యుద్ధం జరిగినా, శాంతి ఒప్పందం వచ్చినా.. ఇరాన్, రెసిస్టెన్స్(మిత్ర శక్తుల) శక్తులు ఒక్కటిగానే ఉంటాయని.. ఈ శక్తులు కలకాలం ముందుకు సాగుతాయన్నారు. అలాగే.. ఇజ్రాయెల్‌కు ప్రాధాన్యత ఇవ్వడమే పనిగా పెట్టుకున్న అమెరికా ఆ విధానాన్ని వదిలేయాలని సూచించారు. శాంతి ఒప్పందాన్ని గౌరవించాలని అమెరికాకు హితవు పలికారు. హర్ముజ్ జలసంధి అమెరికా దిగ్బంధనం(బ్లాకేడ్) కొనసాగుతోంది. ఈ చర్య అంతర్జాతీయ చమురు రవాణాపై తీవ్ర ప్రభావం చూపడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ మరోసారి అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. ఈ జోక్యాన్ని చూస్తూ ఊరుకోబోమని చెబుతోంది. లెబనాన్‌లో కాల్పుల విరమణ ఇంకా ఆచరణలోకి రాలేదు. అమెరికా మధ్యవర్తితత్వంతో ఇజ్రాయెల్-లెబనాన్ ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. హెజ్బొల్లా-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తగ్గినా.. చిన్నపాటి దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఘలీబాఫ్ వ్యాఖ్యలు పశ్చిమాసియా సంక్షోభంలో రెసిస్టెన్స్ శక్తుల ఐక్యతను బలపరిచే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇరాన్ చెబుతున్నట్లు.. అమెరికా గనుక ఇజ్రాయెల్ ఫస్ట్ విధానాన్ని వీడి శాంతి ఒప్పందాన్ని గౌరవించకపోతే ప్రాంతీయ స్థిరత్వం మళ్లీ దెబ్బతినే అవకాశం ఉంది. ఇక అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు త్వరలో మళ్లీ ఇస్లామాబాద్‌లోనే జరగనున్నాయి. తొలి దఫా చర్చలు విఫలం కావడంతో.. ఎవరో ఒకరు దిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే అటు అమెరికా.. ఇటు ఇరాన్ తగ్గేదే లే అంటున్నాయి. బంతి ఇరాన్ కోర్టులోనే ఉందని అమెరికా అంటుంటే.. తమ డిమాండ్లలో ఏ ఒక్కటి తగ్గినా చర్చలు ముందుకు సాగవని ఇరాన్ అంటోంది. పాక్ మధ్యవర్తిత్వంలో తొలుత ఇరాన్, అమెరికా ప్రతినిధులు పరోక్ష చర్చలు జరుపుతారు. ఫలితాలు సానుకూలంగా ఉంటే ప్రత్యక్ష చర్చలు జరగొచ్చు. -
ఇండియాలోనే ఆ సంక్షోభం?.. పీసీబీ చీఫ్‌నకు చివాట్లు
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీపై భారతీయ నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ఇంత తేలిగ్గా అబద్ధాలు చెప్పడానికి ఏమాత్రం సిగ్గులేదా’ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్, భారత్‌పై పడి ఏడ్వటం మానేసి పాకిస్తాన్ సంగతి చూసుకుంటే బాగుంటుందని హితవు పలుకుతున్నారు.అసలు ఏం జరిగిందంటే.. ఐపీఎల్‌కు దరిదాపుల్లో కూడా లేకపోయినా పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)ను అదే స్థాయిలో ప్రమోట్ చేయాలని పీసీబీ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ఐపీఎల్‌కు పోటీగా మార్చిలోనే ఈ లీగ్‌ను నిర్వహిస్తుండగా.. ప్రసార హక్కుల విషయంలో ఈ రెండింటికీ నక్కకీ నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.నాలుగు సీజన్లకు సమానంఐపీఎల్లో కేవలం ఏడు మ్యాచ్‌ల మీడియా హక్కుల విలువ పీఎస్ఎల్ నాలుగు సీజన్లకు సమానంగా ఉంటుందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ ఐపీఎల్‌తో పోలుస్తూ పాక్ మాజీ క్రికెటర్లు, పీసీబీ చీఫ్ నఖ్వీ పీఎస్ఎల్ను పొగుడుకుంటూ ఉంటారు.ఇక తాజా సీజన్‌పై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం గట్టిగానే పడింది. దీంతో పాక్‌లో చమురు సంక్షోభం తలెత్తగా ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఫలితంగా స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండానే కేవలం కరాచీ, లాహోర్‌లో మాత్రమే పీఎస్ఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. ఐపీఎల్ అన్ని వేదికల్లోనూ సజావుగా మ్యాచ్‌లు సాగుతుండగా.. ప్రేక్షకులు స్టేడియాలకు పోటెత్తుతున్నారు.అర్థం చేసుకోవాలిఇలాంటి తరుణంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌లకు ప్రేక్షకులను స్టేడియానికి ఎప్పుడు అనుమతిస్తారు అనే ప్రశ్న ఎదురుకాగా.. మొహ్సిన్ నఖ్వీ ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది. ‘‘ఈరోజే నేను పీఎస్ఎల్ జట్ల యజమానులు, ఆటగాళ్లతో మాట్లాడాను.కరాచీ కింగ్స్ కూడా ఈ విషయం గురించి మమ్మల్ని రిక్వెస్ట్ చేసింది. నేను ప్రధానిని కలిసి ఈ విషయంలో సానుకూలంగా స్పందించాల్సిందిగా కోరతాను. అయితే, ప్రస్తుతం చుట్టుపక్కల దేశాల్లో పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి.అంతటా ఇంధన సంక్షోభం ముదిరింది. ఓవైపు మా ప్రధాని మాత్రం ఇరాన్- అమెరికా యుద్ధానికి చరమగీతం పాడి శాంతివైపు మొగ్గుచూపేలా ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయి.ఇండియాలో పరిస్థితి ఘోరంగా ఉందిమా ప్రధాని అదే పనిమీద ఉన్నారు. ఇండియాలో పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడ చమురు సంక్షోభం ఎక్కువైంది. పెట్రోల్ పంపుల్లో బారులు తీసిన వాహనాలను చూస్తుంటే పరిస్థితిని అంచనా వేయొచ్చు’’ అని నఖ్వీ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో నెటిజన్లు అతడికి చురకలు అంటిస్తున్నారు.‘‘అవును.. పాకిస్తాన్లో అసలు ఎలాంటి సంక్షోభం లేదు. ఇండియాలో అయితే నేను ఈరోజు సాయంత్రం.. 45 లీటర్ల పెట్రోల్ కొట్టించుకోవడానికి మూడు నిమిషాలు పట్టింది. ఎంత పెద్ద సంక్షోభమో’’ అంటూ నఖ్వీకి కౌంటర్లు ఇస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. చదవండి: ఐసీసీ చైర్మన్‌గిరిపై నఖ్వీ అధికారిక ప్రకటనPakistan's effort is to establish peace. There is a petrol shortage in India, whereas there is no such issue in Pakistan. I will request the Prime Minister to allow spectators to attend the PSL matches." Mohsin Naqvi Chairman PCB#Pakistán #Cricket #PakistanShapesPeace #india pic.twitter.com/oxEJV9MvLY— Ali Hasan 🏅 (@AaliHasan10) April 13, 2026 -
War Updates: అమెరికా, ఇరాన్ శాంతి చర్చల్లో కీలక పరిణామం
పశ్చిమాసియాలో యుద్ధం ఇంకా కొనసాగుతోంది. అమెరికా నౌకలు ఇప్పటికే హర్ముజ్‌ను తమ ఆధీనంలోకి తీసుకోగా.. తీవ్ర ప్రతిఘటన తప్పదని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తోంది. -
ఇరాన్ సమీపంలో అమెరికా నౌకా దళాలు
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్టకు చేరుకున్నాయి. ఇరాన్ ఓడరేవులను లక్ష్యంగా చేసుకుని అమెరికా ప్రకటించిన ‘నౌకా దళ దిగ్బంధనం’ (నేవల్ బ్లాకేడ్) ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై రష్యా తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో పాటు శాంతి స్థాపన కోసం ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను తమ అధీనంలోకి తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించింది.యురేనియం తరలింపునకు ప్రతిపాదనప్రపంచంలోనే అతిపెద్ద అణ్వాయుధ నిల్వలు కలిగిన రష్యా, ఇరాన్ అణు సంక్షోభాన్ని నివారించడానికి కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇరాన్ వద్ద ఉన్న యురేనియంను రష్యాకు తరలించడం ద్వారా అగ్రరాజ్యంతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చని క్రెమ్లిన్ సూచించింది. ‘ఈ ప్రతిపాదనను అధ్యక్షుడు పుతిన్ గతంలోనే అమెరికా ముందు ఉంచారు’ అని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు.అంతేకాకుండా, ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో పుతిన్ ఫోన్లో మాట్లాడారు. మధ్యప్రాచ్యంలో న్యాయమైన, శాశ్వత శాంతిని సాధించడానికి రష్యా మధ్యవర్తిగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.హార్మూజ్ జలసంధి.. ట్రంప్ కఠిన నిర్ణయంపాకిస్థాన్లోని ఇస్లామాబాద్‌లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ ప్రతినిధి బృందం మధ్య జరిగిన చర్చలు విఫలమవ్వడంతో అమెరికా తన తదుపరి వ్యూహాన్ని అమలులోకి తెచ్చింది. వ్యూహాత్మక హార్మూజ్ జలసంధిని, ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తున్నట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సోమవారం నుంచి ఇది ప్రారంభమవుతుందన్నారు. ఇరాన్ ఓడరేవులకు వచ్చే లేదా అక్కడి నుంచి వెళ్లే అన్ని రకాల నౌకలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం మూతపడటం అంతర్జాతీయ మార్కెట్‌ను అతలాకుతలం చేసే అవకాశం ఉంది.అయితే, ఈ దిగ్బంధనాన్ని అమెరికా సైన్యం క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేస్తుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు, ఇరాన్ సైన్యం ఈ చర్యను పైరసీగా అభివర్ణించింది.యుద్ధం ముగిసేది ఎప్పుడు?ఫిబ్రవరి చివరలో అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వారాంతపు చర్చలు విఫలమవ్వడంతో యుద్ధం త్వరలో ముగుస్తుందన్న ఆశలు ఆవిరయ్యాయి. ప్రస్తుతం ఇరాన్ తన స్నేహపూర్వక దేశాలైన చైనా వంటి ప్రాంతాలకు మాత్రమే చమురు నౌకలను అనుమతిస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రష్యా ముందుకొస్తున్నా అమెరికా తన మొండివైఖరిని వీడకపోతే ప్రపంచం భారీ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: దేశ రాజధాని సమీపంలో కార్మికుల నిరసన.. -
ముగిసిన చర్చలు.. ఇరాన్-అమెరికా కీలక వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: ఇరాన్-అమెరికా మధ్య చర్చలు ముగిశాయి. జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మధ్య చర్చలు జరిగాయి. కాల్పుల విరమణను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చలు సాగాయి. సుమారు 14 గంటలపాటు చర్చలు సాగాయి. ఇంకా కొన్ని సాంకేతిక అంశాలు ఖరారు చేయాల్సి ఉందన్న ఇరాన్.. చర్చల్లో ఆర్థిక, సైనిక, న్యాయ, అణు కమిటీలు పాల్గొంటాయని పేర్కొంది. చర్చలు సాధారణ స్థాయి నుంచి నిపుణుల స్థాయికి చేరినట్లు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు జరగడం ఇదే తొలిసారి.తొలిదశ చర్చలు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌పై సైనిక విజయం సాధించినట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. ‘‘ఎలా చూసినా గెలుపు అమెరికాదే. చర్చల్లో ఏం జరుగుతుందనేది. మాకు అనవసరం. చర్చలు, ఫలించినా ఫలించకపోయినా హర్మూజ్‌లో మైన్స్ తొలగిస్తాం. హర్మూజ్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదు’’ అంటూ ట్రంప్ తేల్చి చెప్పారు.ఎలాంటి ఒప్పందం కుదరకుండానే వెనుదిరుగుతున్నాం: జేడీ వాన్స్అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు విఫలమయ్యాయి. ఎలాంటి ఒప్పందం కుదరకుండానే వెనుదిరుగుతున్నామని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. మా డిమాండ్లకు ఇరాన్ అంగీకరించలేదు. ఇరాన్‌తో డీల్ లేదు. 14 గంటల పాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయి.. ఇరాన్ వైపు నుంచి సానుకూల నిబద్ధత కనిపించాలి’’ అంటూ జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు.పశ్చిమాసియాలో యుద్ధానికి తెరదించి శాంతిని నెలకొల్పడమే ధ్యేయంగా వైరిపక్షాలైన అమెరికా, ఇరాన్‌ల మధ్య ప్రత్యక్ష చర్చలు శనివారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న ఈ మంతనాలకు పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఓ స్టార్ హోటల్ వేదికగా మారింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా చర్చలు జరిగాయి.ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చరిత్రాత్మక చర్చల కోసం ఇస్లామాబాద్‌కు చేరుకున్న అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలతో పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ శనివారం ఉదయం వేర్వేరుగా సమావేశమయ్యారు. పశ్చిమాసియా పరిస్థితులు, తాజా పరిణామాలపై చర్చించారు. అనంతరం సాయంత్రం అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. -
పశ్చిమాసియా సంక్షోభానికి మోక్షం లభించేనా?
వేలాది మంది ప్రాణాలను బలిగొని ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తూ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిన పశ్చిమాసియా యుద్ధం కీలక మలుపుకు చేరుకుంది. నెలల తరబడి సాగుతున్న రక్తపాతానికి ముగింపు పలికే దిశగా ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య నేడు (ఏప్రిల్ 11, 2026) పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో అత్యున్నత స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి. యుద్ధ మేఘాల మధ్య ఆశా కిరణంలా కనిపిస్తున్న ఈ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.శాంతి మంతనాలు - పట్టువిడుపులుమధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనే ధ్యేయంగా అమెరికా, ఇరాన్ దేశాల ఉన్నతాధికారులు ఇస్లామాబాద్‌లో ముఖాముఖి భేటీ అవుతున్నారు. అయితే, చర్చల ప్రారంభానికి ముందే ఇరు దేశాలు తమ పంతాలను నెగ్గించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా లెబనాన్‌లో కాల్పుల విరమణ, ఆర్థిక ఆంక్షల ఎత్తివేత వంటి అంశాలపై ఇరుపక్షాల మధ్య తీవ్ర స్థాయి భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అడ్డంకిగా మారిన హెజ్బుల్లా అంశంమార్చి నెలలో ప్రారంభమైన పోరాటంలో ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్‌లో దాదాపు 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ మద్దతు గల హెజ్బుల్లా లక్ష్యంగా సాగుతున్న ఈ దాడులను తక్షణమే నిలిపివేయాలని టెహ్రాన్ డిమాండ్ చేస్తోంది. అయితే, లెబనాన్ అంశాన్ని ఈ ద్వైపాక్షిక చర్చలతో ముడిపెట్టడానికి అమెరికా, ఇజ్రాయెల్ ససేమిరా అంటున్నాయి.ఆర్థిక ఆంక్షలు.. అణు కార్యక్రమంసంవత్సరాలుగా తమ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆంక్షలను అమెరికా వెంటనే ఎత్తివేయాలని ఇరాన్ పట్టుబడుతోంది. దీనికి ప్రతిగా ఇరాన్ తన అణు, క్షిపణి తయారీ కార్యక్రమాలు నిలిపేస్తేనే ఆంక్షల ఉపశమనం ఉంటుందని వాషింగ్టన్ సంకేతాలిచ్చింది. ముఖ్యంగా యురేనియం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.హార్మూజ్ జలసంధిపై పట్టుప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిపై తన సార్వభౌమత్వాన్ని గుర్తించాలని, అక్కడ రవాణా రుసుములు వసూలు చేసే అధికారం తమకు ఉండాలని ఇరాన్ కోరుతోంది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెరికా, ఎటువంటి పరిమితులు లేకుండా అంతర్జాతీయ చమురు ట్యాంకర్ల రాకపోకలు సాగాలని డిమాండ్ చేస్తోంది.సైనిక ఉపసంహరణ - పరిహారంగత ఆరు వారాలుగా జరిగిన యుద్ధ నష్టానికి భారీ పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేయనుండగా, అమెరికా దీనిపై మౌనం వహిస్తోంది. అలాగే, మధ్యప్రాచ్యం నుంచి అమెరికా తన దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఇరాన్ కోరుతుండగా, శాంతి ఒప్పందం కుదిరే వరకు సైన్యం కదిలేది లేదని, ఒకవేళ ఒప్పందం ఉల్లంఘిస్తే యుద్ధం తీవ్రతరం అవుతుందని ట్రంప్ హెచ్చరించారు.ఇదీ చదవండి: గ్రాట్యుటీ.. రిటైర్మెంట్ గిఫ్ట్! -
వహ్ చైనా.. వాట్ ఏ డబుల్ గేమ్!
పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలపై ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువ వినిపిస్తున్నాయి. లెబనాన్‌ను కాల్పుల విరమణ పరిధిలోకి తేకపోవడమే ఇందుకు కారణం. ఈ తరుణంలో ఇస్లామాబాద్ చర్చలు తేడా కొడితే.. అంతర్జాతీయంగా ఆ దేశం పరువు పోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అమెరికా-ఇరాన్‌ను శాంతి చర్చలకు ఒప్పించి సైలెంట్‌గా క్రెడిట్ కొట్టేసిన చైనా.. డబుల్ గేమ్‌కి తెర తీసినట్లు తెలుస్తోంది.రెండు వారాల యుద్ధ విరమణలో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. దీర్ఘకాలిక శాంతి స్థాపనే ధ్యేయంగా ఇరు వైపులా చేసిన ప్రతిపాదనలపై చర్చించబోతున్నారు. అయితే ట్రంప్ వార్నింగ్‌ను బట్టి ఒప్పందం కుదరకపోతే మాత్రం యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం లేకపోలేదు. ఈ తరుణంలో.. ఇరాన్‌కు రహస్యంగా ఆయుధాలు సరఫరా చేసేందుకు చైనా సిద్ధమవుతున్నట్లు అమెరికా గూఢచార సంస్థలు నివేదికలు ఇచ్చాయి!.సీఎన్ఎన్ కథనాల ప్రకారం.. ‘‘చైనా త్వరలో ఇరాన్‌కు కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను పంపేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా మాన్పాడ్స్ (MANPADs.. భుజంపై మోసుకెళ్లే యాంటీ-ఎయిర్ మిసైల్ వ్యవస్థ)లను రహస్యంగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ రవాణా నేరుగా కాకుండా ఇరు దేశాలకు నమ్మకంగా ఉన్న మూడో దేశం ద్వారా జరగొచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ సమాచారం’’ అని పేర్కొంది.ఎందుకిలా..ఒకవైపు ఇరాన్–అమెరికా మధ్య మధ్యవర్తిత్వం చేస్తూ శాంతి చర్చలకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటిస్తూనే.. మరోవైపు ఇరాన్‌కు సీక్రెట్‌గా ఆయుధాల్ని సరఫరా చేయాల్సిన అవసరం చైనాకు ఎందుకు?.. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ విషయంలో చైనా ద్వంద్వ వ్యూహాన్ని సూచిస్తోంది.ఇరాన్ చమురు చైనాకు అవసరం. కాబట్టే శాంతి చర్చల ద్వారా చమురు సరఫరా స్థిరంగా ఉండేలా చూడాలనుకుంది. అలాగే అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం చేయడం ద్వారా ప్రపంచ శాంతి దూతగా తనను చూపించుకోవాలని.. తన ప్రతిష్టను పెంచుకోవాలని ప్రయత్నించింది. వీటన్నింటి కంటే హర్ముజ్ జలసంధి చైనాకు ఎంతో కీలకం. అందుకే మధ్యవర్తిత్వం జరిపింది. అదే సమయంలో..అమెరికా ఆంక్షల మధ్య ఇరాన్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా.. ఆ ఆధిపత్యాన్ని ప్రశ్నించినట్లైంది. అదే సమయంలో చైనా తన “Axis of Autocracy (అమెరికా, పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని సవాల్ చేసే ధోరణి.. రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్ లాంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి) భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంటోంది.అందుకే.. బహిరంగంగా శాంతి ప్రయత్నాలు చేస్తూ, రహస్యంగా ఇరాన్‌కు మిలిటరీ సహాయం అందిస్తూ.. రెండు వైపులా లాభం పొందాలని ప్రయత్నిస్తోందన్నది విశ్లేషకుల మాట. అంతర్జాతీయంగా ఆందోళనలు కలిగిస్తున్న సీఎన్ఎన్ కథనంపై అమెరికా విదేశాంగ శాఖ, వైట్ హౌస్, వాషింగ్టన్‌లోని చైనా దౌత్య కార్యాలయం ఇంకా స్పందించలేదు. చైనా యుద్ధం మొదలైనప్పటి నుంచి బహిరంగంగానే ‘‘మేము ఎవరికి ఆయుధాలు ఇవ్వడం లేదు’’ అని చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ప్రచారాలను కూడా తోసిపుచ్చే అవకాశం లేకపోలేదు. -
ఇరాన్ విమానంలో రక్తంతో తడిసిన బ్యాగులు, బూట్లు..
ఇస్లామాబాద్: చర్చలకు పాకిస్తాన్ వచ్చిన ఇరాన్ విమానంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. రక్తసిక్తమైన స్కూల్ బ్యాగులు, బూట్లు, మృతి చెందిన చిన్నారుల ఫొటోలను తమ వెంట తీసుకువచ్చారు. మినాబ్ స్కూల్ మృతుల కోసం ఒక్కో సీటు కేటాయించారు. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు ఇవాళ ప్రారంభం కాగా.. ఈ చర్చలకు హాజరైన ఇరాన్ ప్రతినిధి బృందం రక్తసిక్తమైన స్కూల్ బ్యాగులు, బూట్లు, మృతి చెందిన చిన్నారుల ఫొటోలను తమ వెంట తీసుకురావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది.మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం వల్ల సంభవిస్తున్న మానవ ప్రాణ నష్టానికి ఇవి నిదర్శనంగా నిలిచాయి. సోషల్ మీడియాలో ఒక ఫోటోను పంచుకుంటూ, ఘలీబాఫ్ ఇలా రాశారు: "ఈ విమాన ప్రయాణంలో నా సహచరులు వీరే.. #Minab168" అంటూ ట్వీట్ చేశారు. యుద్ధానికి ముగింపు పలకాలని ఆశిస్తూ, అమెరికాతో చర్చల కోసం ఇస్లామాబాద్ వెళ్తున్న ఈ ప్రతినిధి బృందానికి 'మినాబ్ 168' అని పేరు పెట్టారు. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజున అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన పాఠశాల విద్యార్థుల జ్ఞాపకార్థం ఈ పేరును నిర్ణయించారు. దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా ఈ ఫోటోను రీ-షేర్ చేస్తూ.. "మినాబ్ చిన్నారులను మేము ఎప్పటికీ మర్చిపోము" అని రాసింది.همراهان من در این پرواز#Minab168 pic.twitter.com/xvXmDlSDiF— محمدباقر قالیباف | MB Ghalibaf (@mb_ghalibaf) April 10, 2026మినాబ్‌లో ఏం జరిగింది?ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 160 మందికి పైగా చిన్నారులు మరణించారు. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైన రోజున దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ పట్టణంలో ఉన్న 'షజరే తయ్యిబే' అనే బాలికల ప్రాథమిక పాఠశాలపై ఈ దాడి జరిగింది. ఈ దాడి జరిగిన కొద్ది రోజుల తర్వాత, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ ఒక వైమానిక చిత్రాన్ని షేర్ చేశారు. అందులో "అమాయక" బాలికల మృతదేహాలను పూడ్చిపెట్టడానికి సామూహిక సమాధులను తవ్వుతున్న దృశ్యాలు ఉన్నాయి. అదే పోస్ట్‌లో అరాగ్చీ, ట్రంప్‌పై విమర్శలు చేస్తూ దీనిని 'కోల్డ్ బ్లడెడ్ మర్డర్'(క్రూరమైన హత్య) గా అభివర్ణించారు. -
పాక్‌లో చర్చలు షురూ.. ఎంతకాలం కొనసాగుతాయి?
అమెరికా ఇరాన్ శాంతి చర్చలపై ఉత్కంఠ వీడింది. గత అర్ధరాత్రి దాటాక ఇరాన్ ప్రతినిధులు ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. అంతకంటే ముందే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అక్కడికి చేరారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఈ చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.


