Live Updates
పాక్‌లో చర్చలు షురూ.. ఎంతకాలం కొనసాగుతాయి?
సానుకూల వాతావరణంలో కొనసాగిన చర్చలు
- ముగిసిన అమెరికా-ఇరాన్ మొదటి రౌండ్ శాంతి చర్చలు
- రెండు గంటలపాటు కొనసాగిన చర్చలు
- సానుకూల వాతావరణంలో కొనసాగిన చర్చలు
విమాన ఇంధనం ఏటీఎఫ్‌పై సుంకం పెంచిన కేంద్రం
- విమాన ఇంధనం ఏటీఎఫ్‌పై సుంకం రూ. 29.5 నుంచి రూ. 42కు పెంపు
- డీజిల్‌పై ఎగుమతి సుంకం రూ. 21.5 నుంచి రూ. 55.5కు పెంపు
- పెట్రోల్ ఎగుమతి సుంకంలో ఎలాంటి మార్పులు లేవన్న
కేంద్రం
ఇరాన్ చిత్తుగా ఓడిపోతుంది: ట్రంప్
ఇరాన్ గెలుస్తోందని చెప‍్పడానికే మీడియా మొగ్గుచూపుతోంది
వాస్తవానికి అందరికీ ఇరాన్ ఓడిపోతుందనే విషయం తెలుసు
వారికి నౌకాదళం, వైమానిక దళం లేదు
వారికి యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వ్యవస్థ లేదు
వారి రాడార్ వ్యవస్థ పనిచేయడం లేదు
ఇరాన్ చిత్తుగా ఓడిపోతుంది: డొనాల్డ్ ట్రంప్
అమెరికా సంచలన ప్రకటన
- విదేశాలలో ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని కోరిన ఇరాన్
- ఆ ప్రకటనను అమెరికా ఒప్పుకుందని ప్రకటించిన ఇరాన్
- తాజాగా ఆ ప్రకటనను ఖండించిన అమెరికా
- అటువంటి ఒప్పందం ఏమి జరగలేదని వెల్లడి
- ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన వైట్‌హౌస్
చర్చల్లో ప్రధానంగా అడ్డొస్తున్న అంశాలివే..!
- అమెరికా-ఇరాన్ మధ‍్య పాక్‌లో చర్చలు
- ఇరాన్ సేకరించిన యురేనియం ప్రధాన అడ్డంకి
- చర్చల్లో హార్మూజ్ జలసంధి అంశం ఇబ్బంది పెట్టే ఛాన్స్
- లెబనాన్‌లో దాడులు ఆపాలని ఇరాన్ పట్టు
షెహబాజ్ షరీఫ్‌తో ఇరాన్ ప్రతినిధి బృందం భేటీ
- పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో ఇరాన్ ప్రతినిధి బృందం భేటీ
- ఇరాన్‌తో ఈ సమావేశం తర్వాత అమెరికా ప్రతినిధులతో భేటీ కానున్న షెహబాజ్
- ఈ ప్రారంభ సమావేశాల తర్వాతే ప్రధాన చర్చల దశ షురూ
పాక్‌లో చర్చలు షురూ.. ఎంతకాలం కొనసాగుతాయి?
పాకిస్థాన్‌లో చర్చలు ప్రారంభమయ్యాయి
చర్చలు ఎంతకాలం కొనసాగుతాయన్న విషయంపై స్పష్టత లేదు
తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ మాత్రం ఓ విషయం చెప్పింది
చర్చలు ఒక రోజు మాత్రమే జరగనున్నాయి
శనివారం సాయంత్రం వరకు జరిగే అవకాశం ఉంది
తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ అంచనాను మాత్రమే చెప్పినట్లు తెలుస్తోంది
ఇరాన్ కండీషన్స్‌కు ఒప్పుకున్న అమెరికా
- కాసేపట్లో పాక్ ప్రధానితో ఇరాన్ బృందం భేటీ
- ఇరాన్ కండీషన్స్‌కు ఒప్పుకున్న అమెరికా
- చర్చలకు ముందు రెండు కండీషన్స్ పెట్టిన ఇరాన్
- లెబనాన్ సీజ్‌ఫైర్, ఫ్రీజ్ చేసిన ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ కండీషన్స్
- ఈ రెండింటికి ఒప్పుకున్న అమెరికా
అమెరికాతో చర్చలు.. ఇరాన్ షరతులివే..
- ఇరాన్‌పై దురాక్రమణకు పాల్పడకపోవడం
- హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కొనసాగించడం, అంగీకరించడం
- అన్ని ప్రాథమిక ఆంక్షలను ఎత్తివేయడం
- అన్ని ద్వితీయ ఆంక్షలను ఎత్తివేయడం
- ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలన్నింటినీ రద్దు చేయడం
- IAEA బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ తీర్మానాలన్నింటినీ రద్దు చేయడం
- ఇరాన్‌కు నష్టపరిహారం చెల్లించడం
- ఈ ప్రాంతం నుండి అమెరికా సైనికదళాలనుఉపసంహరించుకోవడం
- లెబనాన్‌పై యుద్ధాన్ని విరమించడం
మధ్యాహ్నం తర్వాత చర్చలు ప్రారంభం
- మధ్యాహ్నం తర్వాత చర్చలు ప్రారంభం
- తొలి దశ చర్చలు సాఫీగా సాగితే రాత్రికి ముఖాముఖి చర్చలు
- జేడీవాన్స్‌తో పాటు పాక్ చేరుకున్న స్టీవ్ విట్కాఫ్, కుష్నర్
- పాక్ ప్రధాని అధ్యక్షతన జరగనున్న శాంతి చర్చలు
- చర్చలకు ముందు పాక్ ప్రధానితో వేర్వేరుగా భేటీ
కాసేపట్లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు
- కాసేపట్లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు
- ఇస్లామాబాద్ చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
- అమెరికా తరఫున చర్చల్లో జేడీ వాన్స్ బృందం
- ఇరాన్ తరఫున పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్ బృందం చర్చలు
హెజ్బొల్లాపై దాడులు కొనసాగుతాయని ప్రకటించిన ఇజ్రాయెల్
- హెజ్బొల్లాపై దాడులు కొనసాగుతాయని ప్రకటించిన ఇజ్రాయెల్
- నిన్న ఫోన్‌లో మాట్లాడిన ఇజ్రాయెల్, లెబనాన్ రాయబారులు
- ఈ నెల 14న వాషింగ్టన్‌లోని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ వేదికగా ముఖాముఖి చర్చలు
శాంతి చర్చలు.. ఇస్లామాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
- ఇస్లామాబాద్‌లో రెడ్ అలర్ట్
- శాంతి చర్చల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
- 10 వేల మందికిపైగా భద్రతా సిబ్బంది మోహరింపు
- ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బహుళ అంచెల రక్షణ వ్యవస్థలు ఏర్పాటు
- ఈ చర్చలను పాక్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది
- దాడులు జరుగుతుండగానే చర్చలా?
- లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగించడం ప్రాథమిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుంది: ఇరాన్
- ఒకవైపు దాడులు కొనసాగుతుండగానే మరోవైపు చర్చలు జరపడం అర్థంపర్థం లేని పని
మరో 24 గంటల్లో.. ట్రంప్ హాట్ కామెంట్స్
ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్‌లు శాంతి చర్చలకు సిద్ధం
శాంతి చర్చలకు ముందు లెబనాన్‌పై దాడులు ఆపాలని, ఫ్రీజ్ చేసిన నిధుల్ని విడుదల చేయాలని ఇరాన్ రెండు కండీషన్లు
దీంతో చర్చలు ఎలా ముందుకు సాగుతాయా? అనే ఉత్కంఠ నెలకొంది
అయితే చర్చల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాట్ కామెంట్లు
శాంతి చర్చలు గనుక విఫలమైతే ఇరాన్‌పై గట్టి దాడులే జరుపుతామని హెచ్చరిక
చర్చలు విఫలమైతే అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్‌పై దాడులకు రెడీగా ఉన్నాయి
ఈసారి మా యుధ్ధనౌకలను అత్యంత ఆధునిక ఆయుధాలతో నింపాం
ఒకవేళ ఒప్పందం గనుక కుదరకపోతే అత్యంత శక్తివంతంగా సైనిక చర్య ఉంటుంది
మరో 24 గంటల్లో ఏదనేది తేలిపోతుందంటూ ట్రంప్ వ్యాఖ్య
అమెరికా-ఇరాన్ చర్చలపై వీడిన ఉత్కంఠ
అమెరికా ఇరాన్ శాంతి చర్చలపై ఉత్కంఠ వీడింది
గత అర్ధరాత్రి దాటాక ఇరాన్ ప్రతినిధులు ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు.
అంతకంటే ముందే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అక్కడికి చేరారు.
పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఈ చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
రెండు వారాల యుద్ధ విరామం ప్రకటించినప్పటికీ..
అమెరికా మిత్రదేశం ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్‌పై భీకర దాడులతో విరుచుకుపడింది.
ఈ దాడుల్లో సుమారు 300 మంది మరణించారు.
అయితే.. హెజ్‌బొల్లా సంస్థను తుడిచిపెట్టడమే తమ లక్ష్యమంటూ ఇజ్రాయెల్ ప్రకటించుకుంది.


