పాకిస్తాన్‌ కెప్టెన్‌ ప్రపంచ రికార్డు | PAK vs SL T20Is Sahibzada Farhan breaks Abhishek Sharma World Record | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ కెప్టెన్‌ ప్రపంచ రికార్డు

Oct 14 2026 2:15 PM | Updated on Oct 14 2026 3:00 PM

PAK vs SL T20Is Sahibzada Farhan breaks Abhishek Sharma World Record

పాకిస్తాన్‌ టీ20 జట్టు కెప్టెన్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ సభ్య దేశాల జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు.

ఈ క్రమంలో టీమిండియా విధ్వంసకర వీరుడు అభిషేక్‌ శర్మ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ఫర్హాన్‌ బద్దలు కొట్టాడు. కాగా మూడు టీ20, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంక పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత రావల్పిండి వేదికగా టీ20 సిరీస్‌ మొదలైంది.

హ్యాట్రిక్‌ హాఫ్‌ సెంచరీలు
మొదటి రెండు టీ20లలో ఆతిథ్య పాకిస్తాన్‌ గెలవగా.. మంగళవారం రాత్రి జరిగిన నామమాత్రపు మూడో మ్యాచ్‌లో శ్రీలంక ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి క్లీన్‌స్వీప్‌ గండం నుంచి తప్పించుకుంది. ఇదిలా ఉంటే.. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో పాక్‌ కెప్టెన్‌, ఓపెనింగ్‌ బ్యాటర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ వరుసగా 53 బంతుల్లో 89, 44 బంతుల్లో 73, 47 బంతుల్లో 76 పరుగులు సాధించాడు.

అభిషేక్‌ శర్మ వరల్డ్‌ రికార్డు బ్రేక్‌
ఈ మేరకు హ్యాట్రిక్‌ హాఫ్‌ సెంచరీలు బాదిన ఫర్హాన్‌.. మొత్తంగా మూడు మ్యాచ్‌లలో కలిపి 238 పరుగులు సాధించాడు. తద్వారా ఐసీసీ ఫుల్‌ మెంబర్ల దేశాలకు చెందిన జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 

గతంలో ఈ రికార్డు టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ పేరిట ఉండేది. ఇటీవల అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌లో ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. 229 పరుగులు సాధించాడు. తాజాగా ఫర్హాన్‌ ఈ రికార్డును బద్దలు కొట్టాడు.

పురుషుల టీ20 క్రికెట్‌లో ఐసీసీ ఫుల్‌ మెంబర్‌ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు
👉సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (పాకిస్తాన్‌)- శ్రీలంక మీద.. 2026లో 238 పరుగులు
👉అభిషేక్‌ శర్మ (ఇండియా)- అఫ్గానిస్తాన్‌ మీద... 2026లో 229 పరుగులు
👉కొలిన్‌ మున్రో (న్యూజిలాండ్‌)- వెస్టిండీస్‌ మీద... 2023-24లో 223 పరుగులు
👉డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా)- శ్రీలంక మీద... 2019లో 217 పరుగులు
👉హజ్రతుల్లా జజాయ్‌ (అఫ్గానిస్తాన్‌)- ఐర్లాండ్‌ మీద... 2019లో 204 పరుగులు.  

చదవండి: టీ20 చరిత్రలో మునుపెన్నడూ చూడని రనౌట్‌!.. స్పందించిన తిలక్‌ వర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement