ఇంటర్నేషనల్ లీగ్ (ILT20) చరిత్రలోనే ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ (MI Emirates) అత్యంత చెత్త రికార్డును నమోదు చేసింది. మంగళవారం రాత్రి గల్ఫ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్ 91 పరుగులకే కుప్పకూలింది. తద్వారా టోర్నీ చరిత్రలోనే ముంబై జట్టు అత్యల్ప స్కోరు నమోదు జట్టుగా రికార్డులకెక్కింది.
ఇప్పటిదాకా 2024లో దుబాయ్ క్యాపిటల్స్ 8 వికెట్ల నష్టానికి 128 పరుగులే అత్యల్పంగా ఉంది. ILT20 టోర్నీలో మూడుసార్లు దుబాయ్ క్యాపిటల్స్ అత్యల్ప స్కోర్లు నమోదు చేయగా, డెసర్ట్ వైపర్స్ ఒకసారి అత్యల్ప స్కోరు చేసింది. తాజాగా ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్టు 91 పరుగులకే ఆలౌటై ఆ చెత్త రికార్డును తన పేరిట లఖించుకుంది.
మ్యాచ్ విషయానికొస్తే, గల్ఫ్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ముంబై ఎమిరేట్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ 19.3 ఓవర్లలో 91 పరుగులకు ఆలౌటైంది. నికోలస్ పూరన్ (23) టాప్ స్కోరర్‌గా నిలవగా, కీరన్ పొలార్డ్ (13), రొమారియో షెపర్డ్ (13) రెండంకెల స్కోరు సాధించారు.
గల్ఫ్ జెయింట్స్ బౌలర్లలో షమర్ జోసెఫ్, డేవిడ్ వీస్‌లు చెరో 3 వికెట్లు తీయగా, అజ్మతుల్లా, అల్జారీ జోసెఫ్, హైదర్ రజాక్‌లు తలా ఒక వికెట్‌పడగొట్టారు. అనంతరం గల్ఫ్ జెయింట్స్ 13.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రన్ (50 నాటౌట్) అజేయ అర్థసెంచరీతో జట్టును గెలిపించాడు. జోర్డాన్ థాంప్సన్ రెండు వికెట్లు తీశాడు. 9 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసిన షమర్ జోసెఫ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఇదీ చదవండి: Abhishek Sharma:'అతడిని క్షమిస్తున్నా.. ఇక్కడితో వదిలేయండి'


