చైనాపై భారత్‌ ఘన విజయం | India beats China in womens Asian Champions Trophy hockey tournament | Sakshi
Sakshi News home page

చైనాపై భారత్‌ ఘన విజయం

Nov 25 2026 4:08 AM | Updated on Nov 25 2026 4:08 AM

India beats China in womens Asian Champions Trophy hockey tournament

భోపాల్‌: మహిళల ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్‌కు మరో విజయం లభించింది. ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించిన భారత్‌ మంగళవారం జరిగిన పోరులో 6–2 గోల్స్‌ తేడాతో చైనాను చిత్తు చేసింది. భారత్‌ తరఫున దీపిక మూడు గోల్స్‌ సాధించడం విశేషం. మ్యాచ్‌ 1వ, 6వ, 14వ నిమిషాల్లో ఆమె గోల్స్‌ కొట్టింది. లాల్‌రెమ్‌సియామి (19వ ని.), నేహ (22వ ని.), రాణా సాక్షి (38వ ని.) ఒక్కో గోల్‌ నమోదు చేశారు. 

చైనా తరఫున ఫెంగ్‌ ఖింగ్‌మియోవా (15వ ని.), చెన్‌ టాంగ్‌ (34వ ని.) గోల్స్‌ చేశారు. నేడు జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌తో జపాన్‌తో భారత్‌ తలపడుతుంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) మహిళల టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు అత్యుత్తమంగా ఐదో స్థానానికి చేరుకోవడం విశేషం. గతంలో భారత్‌ 2022లో ఆరో స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్, అర్జెంటీనా, బెల్జియం, స్పెయిన్‌ తొలి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement