వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్
జెనీవా (స్విట్జర్లాండ్): భారత స్టార్ గుకేశ్ దొమ్మరాజు, ఉజ్బెకిస్తాన్ గ్రాండ్‌మాస్టర్ జవోఖివ్ సిందరోవ్ మధ్య ప్రతిష్టాత్మక వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ పోరు ‘డ్రా’తో మొదలైంది. మంగళవారం జరిగిన తొలి గేమ్‌ను డిఫెండింగ్ చాంపియన్ గుకేశ్, సిందరోవ్ సమంగా ముగించారు. 38 ఎత్తుల తర్వాత గేమ్‌ను ముగించేందుకు ఇద్దరూ అంగీకరించారు. తెల్ల పావులతో ఆడిన సిందరోవ్ ఒక దశలో ఆధిపత్యం ప్రదర్శించినా...తీవ్ర ఒత్తిడిని అధిగమించి గుకేశ్ గేమ్‌ను కాపాడుకోగలిగాడు.
నల్ల పావులతో ఆడిన గుకేశ్ ‘బెర్లిన్ డిఫెన్స్’తో మొదలు పెట్టాడు. అయితే సమయాన్ని సమర్థంగా వాడుకోవడంలో అతను ఇబ్బంది పడ్డాడు. 21 ఎత్తులు ముగిసే సరికి 16 నిమిషాలు వెనుకబడిన గుకేశ్‌కు 31 ఎత్తులు పూర్తయ్యే సరికి 6 నిమిషాలు మాత్రమే మిగిలాయి. అయితే ఈ స్థితిని సిందరోవ్ ఉపయోగించుకోలేకపోయాడు. ‘డ్రా’ తర్వాత ఇద్దరూ 0.5–0.5 పాయింట్లతో నిలిచారు. నేడు జరిగే రెండో రౌండ్‌లో గుకేశ్ తెల్ల పావులతో ఆడతాడు.


