కరెంట్‌ కట్‌చేసి.. ఎంపీపీ పీఠం కైవశం | Power cut at the time of the lottery draw | Sakshi
Sakshi News home page

కరెంట్‌ కట్‌చేసి.. ఎంపీపీ పీఠం కైవశం

Nov 21 2026 4:52 AM | Updated on Nov 21 2026 4:52 AM

Power cut at the time of the lottery draw

వెంకటగిరి మండలంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీకి చెరి సగం ఓట్లు 

లాటరీ తీసే సమయంలో కరెంట్‌ నిలిపివేత 

ఆ వెంటనే టీడీపీ అభ్యర్థి చీటీ వచ్చిందని ఆర్వో ప్రకటన 

అభ్యంతరం వ్యక్తం చేసిన వెఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి, పార్టీ శ్రేణులు

సాక్షి, తిరుపతి: మండల పరిషత్‌ ఎన్నికల్లో టీడీపీ కూటమి అక్రమాలు, దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. తిరుపతి జిల్లా వెంకటగిరి మండలంలో లాటరీ సమయంలో కరెంటు కట్‌ చేసి, అక్రమ మార్గంలో టీడీపీ గెలిచినట్లు ప్రకటించుకున్నారు. ఈ మండలంలోని ఎనిమిది ఎంపీటీసీల్లో వైఎస్సార్‌సీపీ నాలుగు, టీడీపీ అభ్యర్థులు నాలుగు స్థానాల్లో  గెలుపొందాయి. దీంతో మండల పరిషత్‌ అధ్యక్షుడి ఎన్నికల్లో డ్రా తీసి విజేతను ప్రకటించాల్సి ఉండగా అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చి ఆర్వో చేత శుక్రవారానికి వాయిదా వేయించారు. 

పథకం ప్రకారం వెంకటగిరి ఎంపీడీవో కార్యాలయాన్ని శుక్రవారం పూర్తిగా పోలీసుల ఆదీనంలో తీసుకొన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తిని ఎన్నికల హాల్‌ నుంచి బయటకు పంపేశారు. ఆ వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. అదే సమయంలో టీడీపీ నేతల ఒత్తిడితో ఆర్వో కోటేశ్వరరావే స్వయంగా డ్రా తీసేసి, టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించేశారు. ఆర్వోనే చీటీల్లో పేర్లు రాయడం, టీడీపీ అభ్యర్థులవి గుర్తించేలా మడవడం.. చివరకు ఆయనే డ్రా తీయడం అంతా ఓ అక్రమ మార్గంలో ఎన్నిక ముగించారు. ఈ వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి, పార్టీ శ్రేణులు అభ్యంతరం తెలిపారు. 

వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ కిడ్నాప్, విడుదల 
ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉయ్యాలవాడ మండలం పెద్దఎమ్మనూరు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ తలారి వెంకటరాముడును గురువారం ఉదయం టీడీపీ నాయకులు గ్రామ శివా­ర్లలో కిడ్నాప్‌ చేశారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఉయ్యాలవాడ పోలీస్‌ స్టేషన్‌లో, ఆళ్లగడ్డలో సీఐ, డీఎస్పీలకు ఫిర్యాదు చేశారు. ఎవరు ఎత్తుకుపోయారు, ఎక్కడ దాచారో కూడా తెలిపి, విడిపించాలని కోరారు. 

అయినా పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, బాధితుడి కుటుంబ సభ్యు­లు ఉయ్యాలవాడ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. వెంకటరాముడు భార్య లక్ష్మీదేవి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నిరసన తెలుపుతూ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. అయినా ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరించారు. తన భర్తను విడిచిపెట్టే వరకు అక్కడి నుంచి కదలనంటూ భీషి్మంచారు. దీంతో ఆమెకు వైద్యులు అక్కడే సెలైన్‌ ఎక్కించారు. ఈ ఆందోళనలతో చివరకు శుక్రవారం సాయంత్రం వెంకటరాముడిని విడిచిపెట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement