టీడీపీ మూకల దాడి.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు! | YSRCP activists severely injured In TDP mobs attack Chittoor District | Sakshi
Sakshi News home page

టీడీపీ మూకల దాడి.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు!

Nov 20 2026 7:32 PM | Updated on Nov 20 2026 7:32 PM

YSRCP activists severely injured In TDP mobs attack Chittoor District

బంగారుపాలెం (చిత్తూరు జిల్లా):  పచ్చమూకలు రెచ్చిపోతున్నాయి. వైఎస్సార్‌సీపీ శ్రేణులను నామినేషన్లు  వేయనీయకుండా చేయడానికి దాడులకు సైతం దిగుతున్నాయి. చిత్తూరు జిల్లా బంగారు పాలెం మండలంలోని నల్లగాంపల్లెలో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, మద్దతుదారులపై శుక్రవారం టీడీపీ మూకలు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాయి. 

నామినేషన్లను అడ్డుకునే క్రమంలో జరిగిన ఈ ఘర్షణలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు కాగా, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సోమలలో నామినేషన్ల హైడ్రామా.. పత్రాలు లాక్కెళ్లిన దుండగులు
పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అన్నమయ్య జిల్లా  సోమల మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సోమల క్లస్టర్ వద్ద సర్పంచ్ అభ్యర్థి లలితమ్మ నామినేషన్ వేసేందుకు రాగా, గుర్తుతెలియని వ్యక్తి ఆమె పత్రాలను లాక్కొని పరారయ్యాడు. అలాగే కందూరు క్లస్టర్ వద్ద మధ్యాహ్నం 2 గంటలకు వల్లిగట్ల సర్పంచ్ అభ్యర్థి మల్లికార్జున వద్ద నుంచి కూడా దుండగులు నామినేషన్ పత్రాలను అపహరించారు. 

మరోవైపు కందూరు సర్పంచ్ అభ్యర్థి లక్ష్మీపతికి రక్షణ కల్పించాలని మధ్యాహ్నం కోర్టు ఉత్తర్వులు రాగా, పోలీసులు ఆయన్ను సాయంత్రం 5 గంటల వరకు స్టేషన్‌లోనే ఉంచి కాలయాపన చేశారు. ఆ తర్వాత కేంద్రం వద్దకు తీసుకెళ్లగా సమయం ముగిసిందని ఆర్వో చెప్పడంతో లక్ష్మీపతి నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.

ఇదీ చదవండి: జేసీ ప్రభాకర్ రెడ్డి నా హత్యకు కుట్ర పన్నారు : కేతిరెడ్డి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement