సాక్షి,తాడేపల్లి: రామాయపట్నం పోర్టుకు కస్టమ్స్ గుర్తింపు రావడంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తమ హయాంలో జరిగిన అభివృద్ధి ఫలిస్తోందంటూ వైఎస్ జగన్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు.
‘ఏపీ పారిశ్రామిక అభివృద్ధికి పోర్టులే చోదక శక్తులు. పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణే ఏపీకి అతిపెద్ద పెట్టుబడుల ఆకర్షణ. కస్టమ్స్ గుర్తింపు రామాయపట్నం పోర్టుకు కీలక మైలురాయి. దిగుమతులు, ఎగుమతుల కోసం కస్టమ్స్ పోర్టుగా సీబీఐసీ నోటిఫై చేసింది. మా ప్రభుత్వ హయాంలో పోర్టుల నిర్మాణాలను రూపొందించాం. ఏపీలలోని విస్తారమైన తీరప్రాంతాన్ని ఉపయోగించుకుని నాలుగు పోర్టుల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే పోర్టుల నిర్మాణమే లక్ష్యంగా ప్రణాళికను రూపొందించాం.

ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు చొప్పున తీరప్రాంత మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. పోర్టుల ఆధారంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది.రామాయపట్నం పోర్టును ప్రధాన వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేశాం. రామాయపట్నం పోర్టు పరిసరాల్లో భారీ పెట్టుబడులకు కార్యరూపం దాల్చాయి. బీపీసీఎల్ భారీ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ముందడుగు పడింది.

ఇండోసోల్ సోలార్ సమగ్ర తయారీ పరిశ్రమతో పాటు మరిన్ని భారీ పెట్టుబడులకు అవకాశం లభించింది.లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు.. వేలాది ఉద్యోగాలకు మార్గం ఏర్పడింది.భారీ పారిశ్రామిక వ్యవస్థకు పునాది పడింది. దావోస్ నుంచి సీఐఐ సదస్సుల వరకు ప్రస్తుత ప్రభుత్వం ప్రస్తావిస్తున్న పోర్టులు మా ప్రభుత్వ హయాంలో ప్రారంభించినవే. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు మేము చేపట్టిన పోర్టులనే ప్రస్తుత ప్రభుత్వం చెప్పుకుంటోంది’అని ధ్వజమెత్తారు.
𝐏𝐨𝐫𝐭-𝐥𝐞𝐝 𝐢𝐧𝐝𝐮𝐬𝐭𝐫𝐢𝐚𝐥𝐢𝐬𝐚𝐭𝐢𝐨𝐧: 𝐓𝐡𝐞 𝐢𝐧𝐟𝐫𝐚𝐬𝐭𝐫𝐮𝐜𝐭𝐮𝐫𝐞 𝐯𝐢𝐬𝐢𝐨𝐧 𝐰𝐞 𝐜𝐨𝐧𝐜𝐞𝐢𝐯𝐞𝐝 𝐢𝐬 𝐧𝐨𝐰 𝐛𝐞𝐜𝐨𝐦𝐢𝐧𝐠 𝐀𝐏'𝐬 𝐛𝐢𝐠𝐠𝐞𝐬𝐭 𝐢𝐧𝐯𝐞𝐬𝐭𝐦𝐞𝐧𝐭 𝐩𝐫𝐨𝐩𝐨𝐬𝐢𝐭𝐢𝐨𝐧. A major milestone for Ramayapatnam Port! CBIC has officially notified it as a Customs Port for imports and exports, marking another important step in realising the maritime infrastructure vision we pursued during our tenure. We had set out to harness AP's vast coastline by developing 𝟰 𝗽𝗼𝗿𝘁𝘀 (𝗥𝗮𝗺𝗮𝘆𝗮𝗽𝗮𝘁𝗻𝗮𝗺, 𝗠𝗮𝗰𝗵𝗶𝗹𝗶𝗽𝗮𝘁𝗻𝗮𝗺, 𝗠𝘂𝗹𝗮𝗽𝗲𝘁𝗮 𝗮𝗻𝗱 𝗞𝗮𝗸𝗶𝗻𝗮𝗱𝗮 𝗚𝗮𝘁𝗲𝘄𝗮𝘆), 𝟭𝟬 𝗳𝗶𝘀𝗵𝗶𝗻𝗴 𝗵𝗮𝗿𝗯𝗼𝘂𝗿𝘀 𝗮𝗻𝗱 𝟲 𝗳𝗶𝘀𝗵 𝗹𝗮𝗻𝗱𝗶𝗻𝗴 𝗰𝗲𝗻𝘁𝗿𝗲𝘀 ensuring coastal infrastructure roughly every 50 km. Our vision was port-led industrialisation, with Ramayapatnam as a major growth engine. That vision is now translating into reality, with BPCL's mega refinery-petrochemical complex, Indosol Solar's integrated manufacturing facility and several other major investments taking shape around the port. Lakhs of crores in investment, thousands of jobs and an entire industrial ecosystem taking shape. The most telling endorsement? Wherever the present @ncbn government goes, from Davos to CII summits, it showcases these very ports started by us to attract investors.
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 20, 2026


