జేసీ ప్రభాకర్ రెడ్డి నా హత్యకు కుట్ర పన్నారు : కేతిరెడ్డి | Kethireddy accuses JC Prabhakar Reddy of assassination | Sakshi
Sakshi News home page

జేసీ ప్రభాకర్ రెడ్డి నా హత్యకు కుట్ర పన్నారు : కేతిరెడ్డి

Nov 20 2026 5:22 PM | Updated on Nov 20 2026 5:25 PM

Kethireddy accuses JC Prabhakar Reddy of assassination

సాక్షి,అనంతపురం : మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నా హత్యకు కుట్ర పన్నారు. 500 మందితో నా ఇంటి పై దాడులు చేశారు . పెట్రోల్ బాంబులు విసిరి.. నా ఇంటి వద్ద ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. తాడిపత్రి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ శ్రేణులకు నేను అండగా ఉన్నాను.

నన్ను చంపి.. రాజకీయ ప్రత్యర్థి లేకుండా చేసుకోవాలని జేసీ భావించారు. తాడిపత్రి నియోజకవర్గంలో క్రియాశీలకంగా పనిచేసే 24 మంది వైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని చంపుతానని జేసీ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు నామినేషన్లు వేయకుండా భయభ్రాంతులకు గురి చేసేలా జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

మరోవైపు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై జరిగిన దాడి ఘటనను పోలీసులు తేలిగ్గా తీసుకున్నారు. ఈ ఘటనపై తాడిపత్రి డీఎస్పీ చంద్రశేఖర్ స్పందిస్తూ..ఇరువర్గాలు రాళ్లు విసరుకోవడం, క్రాకర్స్ కాల్చుకోవడం వల్లే ఘటన జరిగిందని, పరస్పరం కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని వెల్లడించారు. తీవ్రమైన ఆరోపణలు వస్తున్న వేళ పోలీసుల తీరుపై చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement