breaking news
Ananthapur
-
సూపర్ సిక్స్ సభకు రాకుంటే రూ.200 ఫైన్
సాక్షి, అనంతపురం: ‘సూపర్ సిక్స్–సూపర్ హిట్ సభకు రానివారికి రూ.200 ఫైన్ వేస్తాం. లోన్ మంజూరు, పొదుపు సమయంలో ఇబ్బందిపడతారు’ అంటూ డ్వాక్రా మహిళలను బెదిరించి మరీ అనంతపురంలో ప్రభుత్వం బుధవారం నిర్వహించిన సభకు తీసుకొచ్చారు. డ్వాక్రా మహిళలపై వెలుగు యానిమేటర్లు, సీసీల ద్వారా అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారు. విధిలేని పరిస్థితుల్లో వారు అయిష్టంగానే సభకు వచ్చారు. అయినా, సీఎం చంద్రబాబుతో పాటు ఇతర నాయకుల ప్రసంగాలు వినకుండా అన్యమనస్కంగా కనిపించారు. ఎప్పుడెప్పుడు తిరిగి వెళ్లిపోదామా అనే భావనతో ఉన్నట్లు అనిపించింది.అనంతపురం రూరల్ మండలం పాపంపేట, మరికొన్ని ప్రాంతాల్లో డ్వాక్రా సంఘాల లీడర్లు అధికారులపై తిరగబడ్డారు. మాకు ప్రభుత్వం తరఫున పైసా లబ్ధి చేకూర్చలేదు. మేం సభకు ఎందుకు రావాలి అని నిలదీశారు. రాయలసీమలోని పాత ఉమ్మడి జిల్లాలైన అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ కడపల నుంచి పెద్ద సంఖ్యలో బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేసినా సభకు అంతంతమాత్రమే హాజరయ్యారు. కొన్ని బస్సుల్లో అయితే నలుగురైదుగురు కూడా రాలేదు. చివరకు కూటమి పార్టీల కార్యకర్తలకు సైతం చాలావరకు డబ్బు, మద్యం, ఆహార పొట్లాలు ఇచ్చి ప్రత్యేక బస్సులు, వాహనాల్లో తీసుకొచ్చారు. తప్పతాగిన ‘తమ్ముళ్లు’ సభా ప్రాంగణంలోనే చిందులు తొక్కారు.మరికొందరు మద్యం మత్తులో సభకు రాలేక బస్సుల్లోనే ఉండిపోయారు. ఇక ట్రాఫిక్ మళ్లింపుతో హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్–44) గుండా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అనంతపురం నగరంలోనూ రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డగించడంతో ప్రజలు, వాహనదారులు అసహనానికి గురయ్యారు. సీఎం సభ ఉంటే మరీ ఇన్ని ఆంక్షలా? ఇంత ఓవరాక్షనా? అంటూ మండిపడ్డారు. -
‘మమ్మల్ని క్షమించు దేవుడా’.. దోచేసిన సొమ్ముతో పాటు లేఖను వదిలేసిన దొంగలు
సాక్షి,అనంతపురం: దొంగలు దేవుడికి భయపడ్డారు. తప్పైపోయింది. మమ్మల్ని క్షమించు దేవుడా అంటూ దోచేసిన సొమ్ముతో పాటు ఓ లేఖను విడుదల చేశారు. నెలరోజుల క్రితం ప్రముఖ బుక్కరాయసముద్రం శ్రీ శ్రీ ముసలమ్మ పుణ్యక్షేత్రంలో హుండీ చోరీ జరిగింది. ఈ క్రమంలో దోచేసిన నగదును మళ్లీ ఆలయ ఆవరణలో వదిలేసి వెళ్లిపోయారు. అందుకు గల కారణాల్ని వివరిస్తూ డబ్బుతో పాటు ఓ లేఖను విడుదల చేశారు.‘దొంగతనం చేసిన నాటి నుంచి ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగా లేదు. తప్పు తెలుసుకుని డబ్బు తిరిగి ఇచ్చేస్తున్నాం. కొడుకు హాస్పిటల్ ఖర్చుల కోసం డబ్బును వాడుకున్నాం. క్షమించండి’ అంటూ ఆ లెటర్లో పేర్కొన్నారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో దొంగిలించిన సొమ్ము రూ.లక్షా 86 వేలుగా ఆలయ అధికారులు లెక్కతేల్చారు. హుండీని చోరీ చేసింది ఎవరు? అనేది తేలాల్సి ఉంది.ముసలమ్మ దేవాలయానికి సుదీర్ఘ చరిత్రఇక దొంగతనం జరిగిన ముసలమ్మ దేవాలయానికి సుదీర్ఘ చరిత్ర ఉండటంతో చర్చకు దారితీసింది. ముసలమ్మ ఆలయానికి సుదీర్ఘ చరిత్రనే ఉంది. మూడు శతాబ్దాల క్రితం బుక్కరాయసముద్రం చెరువు నిండి ఉప్పొంగి కట్టకు భారీగా గండిపడింది. దీంతో చెరువులోని నీరంతా గ్రామంలోకి చొరబడి మునిగిపోతుండగా గ్రామస్తులు గ్రామ సమీపంలో ఉన్న పోలేరమ్మ తల్లిని ప్రార్థించారు. ఆ సమయంలో ‘గ్రామంలో ఉన్న బసిరెడ్డి చిన్నకోడలు ముసలమ్మ ప్రాణత్యాగంతో కట్ట నిలుస్తుంది’ అనే మాటలు వినిపించడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. విషయం తెలుసుకున్న ముసలమ్మ దేవుడిని ప్రార్థిస్తూ గండి పడిన చోట చెరువులోకి దూకింది. దీంతో వరద నీరు నిలిచిపోయిందట. అప్పటి నుంచి ముసలమ్మను ఇలవేల్పుగా గ్రామస్తులు పూజిస్తూ వస్తున్నారు. ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించి ప్రాణత్యాగం చేసిన ముసలమ్మకు ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు చేస్తూ వస్తున్నారు. అనంతరం కాలంలో రూ.3 కోట్లు వెచ్చించి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. -
కారు - బైక్ రేసింగ్.. టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణికి ముడుపులు
సాక్షి,అనంతపురం: శింగనమల నియోజకవర్గంలో కారు - బైక్ రేసింగ్ వివాదంగా మారింది. అటవీ ప్రాంతంలో రేసింగ్ చేసుకునేందుకు నిర్వాహకులకు టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుమతి ఇచ్చారు. పర్యాటక అభివృద్ధి కోసమే రేసింగ్‌కు అనుమతి ఇచ్చామని అన్నారు. అయితే, కారు-బైక్ రేసింగ్‌కు ఎలాంటి అనుమతులు లేవని అటవీ శాఖ అధికారులు తెలిపారు. శింగనమల, నార్పల, పుట్లూరు మండలాల్లో జరుగుతున్న రేసింగ్ నిర్వహణను బెంగళూరుకు చెందిన ఓ సంస్థ నిర్వహిస్తుంది. సదరు సంస్థ నుంచి భారీ మొత్తంలో ముడుపులు తీసుకుని రేసింగ్‌కు అనుమతి ఇచ్చారంటూ ఎమ్మెల్యే బండారు శ్రావణిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామ శివారులో బైకు, కార్ రేస్ పోటీలు జరుగుతున్నాయి. ‘దక్షణి డేర్ క్రాస్ కంట్రీ ర్యాలీ అండ్ బైక్ రేస్’ పేరిట ఈ పోటీలను 3 రోజులపాటు నిర్వహిస్తున్నారు. పుట్లూరు మండలం నుంచి నార్పల మండలం వరకూ ఉన్న కొండ ప్రాంతాల్లో జరుగుతున్న బైక్, కార్ రేస్‌లో ఏపీ, తెలంగాణ, గోవా, తమిళనాడు, కేరళల రేసర్లు పాల్గొన్నారు. -
‘దగ్గుపాటి.. చంద్రబాబు వదలిపెట్టినా.. మేం నిన్ను వదలం’
సాక్షి,అనంతపురం: జూనియర్ ఎన్టీఆర్‌పై రాయలేని భాషలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను టీడీపీ అధిష్టానం వెనకేసుకొస్తున్నట్లు తేలిపోయింది. ఆ వివాదాస్పద వ్యాఖ్యలు తాను చేయలేదని ఇప్పటికే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్లారిటీ ఇచ్చారని.. క్షమాపణలు కూడా చెప్పినందున ఆ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలని ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్ వ్యాఖ్యానించటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్‌పై రాయలేని భాషలో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వార్ 2 సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన స్పెషల్ షోకి రావాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను ఆహ్వానించారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నేతలు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చంద్రబాబు, నారా లోకేష్‌లకు జూనియర్,ఎన్టీఆర్ అంటే నచ్చదని... మీరు కూడా సినిమా విడుదల చేయడం ఆపాలని వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగక ఒకవేళ సినిమా విడుదల చేస్తే స్క్రీన్లు కాల్చేయిస్తానని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించారు.జూనియర్ ఎన్టీఆర్ పైనా ఆయన తల్లి నందమూరి షాలిని పైనా అసభ్యంగా మాట్లాడారు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను లాగిపడేసిన పోలీసులు... వారిపై లాఠీచార్జి కూడా చేశారు. తమ అభిమాన హీరో పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను వెంటనే సస్పెండ్ చేయాలని, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను పిలిపించి వివరణ తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయనను మందలించి వదిలేసినట్లు ఎల్లో మీడియా లో కథనాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన పై స్పందించారు మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్. జూనియర్ ఎన్టీఆర్ పై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్లారిటీ ఇచ్చారని..పైగా క్షమాపణలు కూడా చెప్పారని తెలిపారు.జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ.. కొందరు కావాలనే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని..ఇలాంటి అనవసరమైన విషయాలను పక్కనపెట్టి.. టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలుసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు మంత్రులు. ఇది టీడీపీ అధిష్టానం ఉద్దేశం గా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ వివాదాన్ని..ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలను టీడీపీ అధిష్టానం లైట్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరసన కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవద్దని మంత్రులు చెప్పకనే చెబుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.సుమారు పది రోజుల తర్వాత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం వచ్చారు. అనంతపురం కలెక్టరేట్లో జరిగిన డీఆర్సీ సమావేశానికి హాజరయ్యేందుకు సిద్ధం కాగా..జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అడ్డుకుంటారని, మీరు సమావేశానికి వెళ్లొద్దని కొందరు అధికార పార్టీ నేతలు, ఇంటిలిజెన్స్ అధికారులు సూచించినట్లు సమాచారం. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొనే కార్యక్రమాల్లో ఎప్పుడు ఏం జరుగుతోంది అన్న ఉత్కంఠ నెలకొంది. -
Anantapur: దివ్యాంగులపై పోలీసుల దురుసు ప్రవర్తన
-
'ఎన్టీఆర్' ఫ్యాన్స్‌పై దాడులు, అరెస్ట్‌లు.. తారక్‌ను తేలిగ్గా తీసుకున్న ప్రభుత్వం
జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు నిరసనలు తెలుపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు దగ్గుపాటి క్షమాపణ చెప్పాలని ఆయన ప్యాన్స్ కర్ణాటక, బళ్లారి, ఏపీలోని ఇతర జిల్లాల నుంచి భారీగా అనంతపురం చేరుకున్నారు. అయితే, సమాచారం అందుకున్న పోలీసు సిబ్బంది వారిని అరెస్టు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ తమ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన అనుచిత వాఖ్యలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి నిరసన తెలిపారు. అయితే, ఈ ఆందోళన కేవలం అనంతపురం జిల్లాకు మాత్రమే పరిమితం కాలేదు. నేటి నుంచి ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాలని వారు ప్లాన్ చేస్తున్నారు.'ఛలో అనంతపూర్' పేరుతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనంతపపురంలోని దగ్గుపాటి క్యాంప్ ఆఫీస్‌కు రాబోతున్నారు. అభిమానుల చర్యల వల్ల దగ్గుపాటి నుంచి సరైన సమాధానం రాకపోతే.. రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు చేపడతామని వారు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే అఖిల కర్నాటక ఎన్టీఆర్ సేవాసమితి సభ్యుల్ని పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు 40 మందిని ఉరవకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో కొంతమందిపై పోలీసులు చేయిచేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తారక్ ఫ్యాన్స్‌పై టీడీపీ పేరుతో ఉన్న కొన్ని పేజీలు బూతులతో దాడులకు దిగుతున్నాయి.అనంతపురంలో ఇంత జరుగుతుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం తారక్ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. కేవలం ఎమ్మెల్యేపై చంద్రబాబు భగ్గుమన్నారంటూ లీకులు మాత్రమే ఇచ్చి సరిపెట్టారు. అయితే, తారక్ ఫ్యాన్స్ మాత్రం దానిని నమ్మలేదు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బహిరంగంగా మీడియా ముందు క్షమాపణలు చెప్పడంతో పాటు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న ఎమ్మేల్యే వెనుక లోకేష్ ఉన్నారని ఫ్యాన్స్ కూడా చెప్పుకొస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ వివాదం మరింత తీవ్రరూపం దాల్చేలా కనిపిస్తుంది. ఇప్పటికే కర్ణాటక, బళ్ళారి నుంచి చాలామంది అభిమానులు అనంతపురం చేరుకున్నారు. నేడు తమిళనాడు నుంచి కూడా ఫ్యాన్స్ అక్కడికి రానున్నారు. దీంతో పోలీసులు కూడా అలెర్ట్‌గా ఉన్నారు. The Constitution Of India Gives People The Right To Speak Freely And Protest Peacefully Under Article 19(1)(a) and 19(1)(b)When The Government Stops Such Protests, Is It Really Following The Constitution?#SuspendMLADaggupatiPrasad pic.twitter.com/lKpDjfGmuY— NTR Trends (@NTRFanTrends) August 24, 2025🙏🙏#SuspendMLADaggupatiPrasad pic.twitter.com/naYbfuvbRN— Jr NTR Fan Club (@JrNTRFC) August 24, 2025 -
Thimmampalli: రోడ్డుకు అడ్డంగా జీపులు పెట్టి పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు
-
ఎన్టీఆర్‌కు మద్ధతుగా నిలిచిన ప్రముఖ సింగర్
టాలీవుడ్ హీరో, నందమూరి వారసుడు ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్న వివషయం తెలిసిందే. లోకేశ్‌ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తానంటూ లం.. భాష ఉపయోగించి రెచ్చిపోయారు. దీంతో తారక్ ఫ్యాన్స్ రంగంలోకి దిగి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేశారు. అయితే, చిత్ర పరిశ్రమ నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్‌కు మద్ధతుగా ఎవరూ నిలబడలేదు. కనీసం ఎమ్మెల్యే చేసిన మురికి వ్యాఖ్యలను తప్పుబట్టలేదు. ఆపై టీడీపీ కూడా ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ వ్యాఖ్యలు వెనుక నారా లోకేశ్ ఉన్నాడంటూ విమర్శలు వచ్చాయి. అయితే, ఎట్టకేలకు టాలీవుడ్ నుంచి ప్రముఖ సింగర్, సంగీత దర్శకుడు అనుదీప్ దేవరకొండ (అనుదీప్ దేవ్) రియాక్ట్ అయ్యారు. తారక్ సార్‌తో సంఘీభావంగా నిలబడుతున్నానంటూ తన మద్థతు ఇచ్చాడు.తారక్‌కు సపోర్ట్‌గా రండి.. రేపొద్దున మీకూ ఇదే జరగొచ్చుఎన్టీఆర్కు మద్ధతుగా అనుదీప్ ఇలా చెప్పుకొచ్చారు. 'తారక్ సార్‌తో సంఘీభావంగా నిలబడుతున్నాను. సినిమా మనల్ని ఏకం చేస్తుంది. రాజకీయాలు మనల్ని విభజిస్తాయి. రెండింటినీ వేరుగా ఉంచుదాం. ఈ రోజు ఎన్టీఆర్‌కు ఎదురైన సందర్భం రేపు మరే ఇతర స్టార్‌కు ఎదురుకావచ్చు. మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ (TFI) కలిసికట్టుగా నిలబడి మన ప్రియమైన ఎన్టీఆర్‌కు మద్దతు ఇవ్వాలని అందరినీ అభ్యర్థిస్తున్నాను' అంటూ #StandWithNTR అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.'హనుమాన్' సినిమాతో పాపులర్ ఆంధ్ర ప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన అనుదీప్ 2011లో 'అహ నా పెళ్ళంటా' సినిమాతో సింగర్‌గా పరిచయమయ్యారు. అనుదీప్ ఇప్పటికే 70 చలన చిత్రాలలో సుమారుగా 100 పాటలకు పైగా పాడారు. 'హను మాన్' వంటి హిట్ సినిమాకు సంగీతం అందించిన వారిలో ఆయన కూడా ఒకరు. ప్రముఖ సంగీత దర్శకులు కోటి, యువన్ శంకర్ రాజా,మిక్కీ జె. మేయర్,అనూప్ రూబెన్స్, థమన్, సంతోష్ నారాయణన్ వంటి వారితో ఆయన పనిచేశారు.Standing in solidarity with @tarak9999 sir .Cinema unites us, politics divides us. Let’s keep both separate. Today it’s NTR garu and tomorrow it could be any other star.Requesting the entire TFI to stand together and support our beloved NTR garu.#StandWithNTR #TFIUnited— Anudeep Dev (@anudeepdev) August 19, 2025 -
జూనియర్ ఎన్టీఆర్ బుడ్డా ఫకీర్.. వాని సినిమాలు ఆడనిస్తానా..?
సాక్షి ప్రతినిధి, అనంతపురం/అనంతపురం క్రైం: ‘జూనియర్ ఎన్టీఆర్ ఒక బుడ్డా ఫకీర్.. వాడి సినిమాలు ఇక్కడ ఎలా ఆడనిస్తానని అనుకున్నారు.. లోకేశ్‌ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తాను.. వానెమ్మ.. లం.. కొడుకు.. వాని సినిమాలు ఆడనిస్తానా.. మీరెలా ఆడనిస్తార్రా గాడిదల్లారా.. నా పర్మిషన్ లేకుండా వేయిస్తారా.. ఈ సినిమా ఆడదు..’ అంటూ అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘వార్–2’ సినిమా విడుదల నేపథ్యంలో ఎమ్మెల్యే ఇటీవల ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత ధనుంజయనాయుడుతో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. ఎన్టీఆర్ అభిమాన సంఘం నేతకు ఫోన్ చేసి.. ‘ఈ సినిమాకు ఎన్ని థియేటర్లు అనుమతించారు.. ఎవరు అనుమతి ఇచ్చారు.. ఎలా ఆడనిస్తారు? ఆ సినిమాను ఆడనిచ్చేదే లేదు.. వాడు బుడ్డా ఫకీర్.. లోకే‹శ్ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తాను.. వానెమ్మ.. లం..కొడుకు ఈ టైమ్‌లో వాని సినిమాలు ఆడనిస్తానా.. మీరెలా ఆడనిస్తార్రా గాడిదల్లారా? నా పర్మిషన్ లేకుండా వేయిస్తారా? ఈ సినిమా ఆడదు.. వాడు బుడ్డా ఫకీర్ గాడు లోకేశ్ గురించి మాట్లాడతాడా? ఈ సినిమా ఆడదు.నాకు తెలియకుండా సినిమా ఎట్లా ఆడుతుంది.. నేను అనంతపురం ఎమ్మెల్యే.. బుడ్డా ఫకీర్ నా కొడుకు.. సార్ గురించి మాట్లాడతాడా? గాడ్ ప్రామిస్‌గా చెబుతున్నా.. ఈ సినిమా ఆడదు.. ఆపేయిస్తున్నా.. నేను ఊరుకుంటానా.. పంపించేయండి అందరినీ’ అని హుకుం జారీ చేశారు. లోకేశ్, చంద్రబాబు ప్రోద్భలంతోనే ఎన్టీఆర్ సినిమాను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎమ్మెల్యే ప్రసాద్ వ్యాఖ్యలు అందులో భాగమేనని నందమూరి, ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.వాయిస్ రికార్డ్ బయట పెట్టిన ధనుంజయ నాయుడుసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో తనది కాదని ఎమ్మెల్యే ప్రసాద్ వివరణ ఇవ్వబోగా జూ.ఎన్టీఆర్ అభిమాని, టీఎన్ఎస్ఎఫ్ నేత గుత్తా ధనుంజయ నాయుడు ఆయన వాయిస్ రికార్డు బయట పెట్టారు. జూ.ఎన్టీఆర్‌ను తిడుతూ.. తనను ఎమ్మెల్యే ఫోన్లో బెదిరించిన అనంతరం ఆయన ఒక ఆడియోను రికార్డు చేసి ఎమ్మెల్యేకు పంపినట్లు తెలుస్తోంది. ‘అన్నా.. మీరంటే గౌరవం ఉంది. దయచేసి చెబుతున్నా.. ఎవరో చెప్పిన మాటలు విని అలా మాట్లాడవద్దు. జూ.ఎన్టీఆర్‌కు సినిమా పరంగా ముందు నుంచీ అభిమానిని.ఈ విషయాన్ని నారా లోకేశ్ ముందు చెప్పమన్నా చెబుతా. అంతేగానీ ఎవరి కోసమో పని చేయలేదు నేను. దయచేసి నన్ను కాంట్రవర్సీలోకి లాగొద్దు. సినిమా మీద కాంట్రవర్సీ ఎందుకు? నన్నెందుకు మీరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు? అసభ్యంగా మాట్లాడితే నేను పడను. నాకు ఫోన్ చేసి బెదిరించడం తప్పు. ఎన్టీఆర్ గాడు.. గీడు అని మాట్లాడవద్దు. మీరు నాతో మాట్లాడిన ప్రతిదీ వాయిస్ రికార్డు చేశాను. ఈ రికార్డులన్నీ నారా రోహిత్ అన్నకు పంపినా. నాకు నీవు ఏమైనా అర్ధ రూపాయి ఇచ్చినావా? ఏడాది దాటింది.ఒక్క పని ఇచ్చావా? చిన్న సహాయం చేశావా? నా మీద నీకేం హక్కుంది మాట్లాడేందుకు? నన్ను చంపుతావా.. చంపు. నన్ను చంపావంటే మా వాళ్లు ఊరికే ఉండరు. నువ్వు నోరు జారినావంటే బాగుండదు’ అని గుత్తా ధనుంజయ నాయుడు ఎమ్మెల్యేకు పంపిన వాయిస్ రికార్డులో పేర్కొన్నారు. దీంతో జూ.ఎన్టీఆర్ అభిమానులు మరింతగా రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాదులో జూ.ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఉమ్మడి రాష్ట్ర కన్వీనర్లు, ముఖ్య నేతలు సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నీ బండారం బయట పెడతానన్న ప్రభాకర్ చౌదరిఎమ్మెల్యే ఆడియో సామాజిక మాధ్యమాల్లోకి రాకమునుపే రెండ్రోజుల ముందు టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి.. దగ్గుపాటి ప్రసాద్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘నువ్వు జూ.ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడావో నా దగ్గర రికార్డులున్నాయి. నీ బండారం బయటపెడతా’నని హెచ్చరించారు. ఆగ్రహించిన జూ.ఎన్టీఆర్ అభిమానులుఅనంత ఎమ్మెల్యే ప్రసాద్ వ్యాఖ్యలతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ అభిమాన హీరోను నోటికొచ్చినట్లు తిట్టడాన్ని వారు జీర్ణించుకోలేక పోయారు. ఆదివారం ఉదయం అనంతపురం శ్రీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపైకి దాడికి దిగారు. ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే భారీ ఫ్లెక్సీలను చింపేసి నిరసన తెలిపారు. ‘అవసరమైనప్పుడు పార్టీకి పని చేసిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. ఆ విషయం తెలియదా? మీతో ఇలా ఎవరు మాట్లాడించారో చెప్పాలి. మేము కూడా ఓట్లేస్తేనే మీరు ఎమ్మెల్యే అయ్యారు.అలాంటిది మా అభిమాన నాయకుణ్ని దూషిస్తారా? మాకు రాజకీయాలతో పని లేదు. నాలుగు గోడల మధ్య కూర్చొని క్షమాపణ చెబితే సరిపోదు. బయటకు వచ్చి.. మీరు, మీతో మాట్లాడించిన వారు బహిరంగ క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఇంట్లో ఉండీ బయటకు రావడం లేదని జూ.ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. కొందరు టీడీపీ చోటా నాయకులు కలుగజేసుకుని జూనియర్ అభిమానులకు సర్దిచెప్పారు. కాగా, శనివారం రాత్రే ఈ విషయం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో పార్టీ పెద్దల పిలుపు మేరకు ఎమ్మెల్యే దగ్గుపాటి విజయవాడకు వెళ్లినట్లు తెలిసింది.ఆ వాయిస్ ఎమ్మెల్యేదే ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదని ఎమ్మెల్యే అంటున్నారు. అది నిజం కాదు. అది ఎమ్మెల్యే వాయిస్సే. అతని వాయిస్ కాదనుకుంటే ఆడియోలో ఇంకో వైపు మాట్లాడింది ధనుంజయ నాయుడు (టీఎన్ఎస్ఎఫ్) వాయిస్ ఫేక్ కాదు కదా?! అంత పెద్ద హీరో తల్లిని అనరాని మాటలు అనడం తప్పు. ఎవరి తల్లి అయినా తల్లే కదా? ఎన్టీఆర్ అభిమాన సంఘాల నేతలు రేపు హైదరాబాద్‌లో సమావేశానికి పిలుపునిచ్చారు. అధికారం ఉంది కదా అని అనంతపురంలో అభిమాన సంఘం నేతలను, కార్యకర్తలను నోరు మూయించవచ్చు. ప్రభుత్వం మాది.. ఏమైనా చేస్తామంటే కుదరదు. ఇది ఇక్కడితో ఆగదు. ఎమ్మెల్యే కచ్చితంగా మీడియా వేదికగా, అభిమానుల ముందు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. – మహేష్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానిఅనంత ఎమ్మెల్యే ప్రసాద్‌పై భగ్గుమన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్తిరుపతి మంగళం/నెల్లూరు (బృందావనం)/గాందీనగర్(విజయవాడసెంట్రల్) : జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా వార్–2 విడుదల సందర్భంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై అభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి.. ప్రముఖ హీరోను పట్టుకుని.. అదీ టీడీపీ అభ్యున్నతికి సహకరించిన జూనియర్ ఎన్టీఆర్ పట్ల దారుణంగా మాట్లాడటం ఏమాత్రం క్షమార్హం కాదని మండిపడుతున్నారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జూనియర్ అభిమానులు తమదైన శైలిలో నిరసన తెలిపారు.తిరుపతి పరిధిలోని తిమ్మినాయుడుపాలెం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ డౌన్ డౌన్.. అంటూ నినదిస్తూ అభిమానులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు సోముయాదవ్, తులసీరామిరెడ్డి, తదితర అభిమానులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఎన్టీఆర్‌ను హేళన చేస్తూ మాట్లాడడం దారుణం అన్నారు. అసలు ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.రాజకీయం.. టీడీపీ నాయకులకు నందమూరి కుటుంబం పెట్టిన భిక్ష అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని నెల్లూరు జిల్లా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వైఖరిని ఎండగడుతూ జూనియర్ ఎన్టీఆర్ సేవాదళ్ ఫౌండర్ గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షుడు గాలి మధుసూదన్, నగర అధ్యక్షుడు రియాజ్, రూరల్ అ«ధ్యక్షుడు అశోక్, గాలి శ్రీధర్ తదితరులు నర్తకీ సెంటర్లో ఆందోళన చేపట్టారు. ఎవరైనా జూనియర్ ఎన్టీఆర్ జోలికివస్తే సహించేది లేదంటూ బహిరంగంగా హెచ్చరించారు.జూనియర్ ఎన్టీఆర్ తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన దగ్గుపాటి ఇలా మాట్లాడడం తగదన్నారు. విజయవాడ గాం«దీనగర్‌లోని జయరాం థియేటర్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాష్ట్ర కనీ్వనర్ నున్న గణేష్ ఆధ్వర్యంలో అభిమానులు భారీ స్థాయిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ ఫ్లెక్సీని చెప్పులతో కొట్టారు. ఆపై ఫ్లెక్సీని దహనం చేసి, ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.జూనియర్ ఎన్టీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూ.ఎన్టీఆర్‌కు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అభిమానుల సమక్షంలో బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో ఫ్యాన్స్ సిటీ కనీ్వనర్ కావూరి కృష్ణ, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. సాక్ష్యాధారాలతో బయట పెడతాంఅనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతకరం. నోటికి వచ్చిన పదజాలంతో జూనియర్ ఎన్టీఆర్‌ను తిడుతూ వార్–2 సినిమా ఆపుతానని, మీరెలా సినిమా ప్రదర్శిస్తారో చూస్తానని, రీల్స్‌ను తగలబెడతానని, అభిమానులు సినిమాకు వెళ్లరాదని బెదిరించడం దారుణం. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై గౌరవం లేని ఇలాంటి ఎమ్మెల్యేను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. పైగా ఆ వాయిస్ తనది కాదని ఎమ్మెల్యే అబద్ధాలు చెప్పడం సరికాదు. ఎమ్మెల్యే ఫోన్ నంబర్ ద్వారా వెలువడిన సంభాషణను సాక్ష్యాధారాలతో బయట పెడతాం. ఇప్పటికైనా అభిమానుల సమక్షంలో ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. – యర్రమల సుధాకర్‌రెడ్డి, జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ ఎన్టీఆర్ సినిమాలు ఆపడం మీతరం కాదు మొన్నటి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఓట్లు కూడా ఉన్నాయని ఆ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఎన్టీఆర్‌ను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు జూ.ఎన్టీఆర్ సినిమాలను ఆపాలనుకుంటే అది మీ తరం కాదు. ఒక ప్రజా ప్రతినిధిగా అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రసాద్.. బాధ్యత గల స్థానంలో ఉండి అసభ్య పదజాలంతో మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ప్రజలకు మీరు నేర్పించేది ఇదేనా? ఎన్టీఆర్‌ను, ఎన్టీఆర్ అభిమానులను రెచ్చగొట్టొద్దు. – పి.పూర్ణ, ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత, ప్రకాశం జిల్లా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదుజూనియర్ ఎన్టీఆర్‌ను అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నోటికి ఇష్టం వచ్చినట్లుగా దూషించడం అభిమానులకు తీరని మనోవేదన కలిగిస్తోంది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు తక్షణమే స్పందించి ఆ ఎమ్మెల్యేను బర్తరఫ్ చేయాలి. లేకపోతే భవిష్యత్‌లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – డి.భాస్కర్, టీమ్ తారక్ ట్రస్టు, జిల్లా అధ్యక్షుడు, శ్రీకాకుళం జిల్లా -
వివాహ వేడుకలో వైఎస్ జగన్.. అనంతపురం జన సంద్రం
-
హరిత నన్ను క్షమించు..
అనంతపురం: ‘హరిత నన్ను క్షమించు. నేను బతికి మీకు ఎలాంటి లాభమూ లేదు. పిల్లల్ని, నిన్ను వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. నేను చేసుకున్న అప్పులే నా పాలిట శాపంగా మారాయి’ అంటూ లేఖ రాసి ఓ బ్యాంకు ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డారు. అధిక వడ్డీలకు అప్పులు చేసి..వాటిని తీర్చేమార్గం కానరాక బ్యాంకు బాత్రూంలో ఉరేసుకుని తనువు చాలించాడు. వివరాలు..కర్నూలు నగరంలోని సీ క్యాంప్‌కు చెందిన సంకుల రవికుమార్ (40) గత 12 ఏళ్లుగా సెంట్రల్ బ్యాంకులో అటెండరుగా పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు అనంతపురంలో నివాసం ఉంటున్న ఇంటి నుంచి బ్యాంకుకు వెళ్లారు. 9.45 గంటలకు భార్య హరితకు ఫోన్ చేసి మనసు బాగోలేదని చెప్పారు. 10.20 గంటలకు బ్యాంకు ఉద్యోగి పద్మజ ..అటెండర్ రవికుమార్ భార్యకు ఫోన్ చేశారు. బాత్రూంలోకి వెళ్లి లోపల లాక్ చేసుకున్నాడని, పిలిస్తే పలకడం లేదని, మీరు వెంటనే బ్యాంకుకు రావాలని చెప్పారు. 20 నిమిషాల్లో ఆమె అక్కడికి చేరుకుంది. కార్పెంటర్ సాయంతో బాత్రూం తలుపు పగులగొట్టారు. అప్పటికే బాత్రూం కిటికీ ఇనుప కడ్డీకి నైలాన్ తాడుతో ఉరివేసుకున్న రవికుమార్ విగత జీవిగా పడి ఉన్నాడు. అప్పులు అధికం కావడంతో మానసిక ఒత్తిడికి గురై అఘాయిత్యానికి పాల్పడినట్లు మృతుడి భార్య హరిత స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్యతో పాటు కుమారుడు సూర్యతేజ, కుమార్తెలు ఎస్.దీక్షిత, ఎస్.వీక్షిత ఉన్నారు.అప్పులే శాపంగా మారాయి..రవికుమార్ ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశాడు. అందులో ఏముందంటే... ‘హరిత క్షమించు. నేను బతికి మీకు ఎలాంటి లాభమూ లేదు. పిల్లల్ని, నిన్ను వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. నేను చేసుకున్న అప్పులే నా పాలిట శాపంగా మారాయి. నేను ఎలాంటి జూదాలూ ఆడలేదు. అధిక వడ్డీలు కట్టలేక..వడ్డీలకు తిరిగి అప్పు చేసి అలా ఒకదానికి ఒకటి తోడయ్యాయి. కరణ్ నన్ను క్షమించరా.. నిన్ను మోసం చేశాను. అమ్మా.. నువ్వు జాగ్రత్త.. పిల్లలు జాగ్రత్త. నా టైం ఇక్కడితో అయిపోయింది. హుస్సేన్.. నేను ఎవరినీ మోసం చేయలేదు. ఎవరినైనా అప్పు అడుగుదామనుకుంటే నా పరిస్థితి బాగోలేదు. హుస్సేన్ నాకో హెల్ప్ చెయ్.. నా తర్వాత హరితకు బ్యాంకుకు సంబంధించి ఏదైనా సహాయం చేస్తావని నమ్ముతున్నాను. గుజ్జల రాముడు అనే వ్యక్తి దగ్గర రూ.50 వేలు అప్పు చేస్తే రూ.15 వేలు పట్టుకుని రూ.35 వేలు ఇచ్చాడు. ప్రతి నెలా రూ.15,000 వడ్డీ కడుతూనే ఉన్నాను. ఇప్పటి వరకు రూ.1,20,000 కట్టాను. ఇక నా వల్ల కాదు. హరీష్ సారీ రా..నీవు చాలా సార్లు హెల్ప్ చేశావు. నా కోసం చీటీ కూడా ఎత్తేసి డబ్బిచ్చావు. నువ్వు చాలా చాలా హెల్ప్ చేసినా.. నేను నీకోసం ఏమీ చేయలేని పరిస్థితి. కిశోర్ ఇకనైనా లోన్ కట్టుకోరా.. చాలా సార్లు హెల్ప్ చేశాను. కానీ నువ్వు చాలా మోసం చేశావు. హరిత పిల్లలు జాగ్రత్త.. శ్రావణి పిల్లలు జాగ్రత్త..వదిన చిన్నారిని నువ్వే చూసుకో’ అని పేర్కొన్నారు. -
లిఖిత అమ్మమనసు, హ్యాట్సాఫ్ అనాల్సిందే!
నవజాత శిశువులకు తల్లిపాలు అమృతం’ అనే మాటను చాలాసార్లు విని ఉంటాం. అయితే దురదృష్టవశాత్తూ కొన్ని పరిస్థితుల వల్ల అందరు శిశువులు ఆ అదృష్టానికి నోచుకోవడం లేదు. నెలలు నిండని పిల్లలు, తక్కువ బరువుతో పుట్టే నవజాత శిశువులకు తల్లిపాలు దొరకడం గగనమైంది. ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది అనంతపురం నగరానికి చెందిన దర్శి లిఖిత. తాను పడిన ఇబ్బంది ఇతరులు పడకూడదని భావించిన లిఖిత పేదింటి శిశువులకు డబ్బా పాలు కాకుండా తల్లిపాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందడుగు వేసింది.ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బెంగూరులో ఎలక్ట్రికల్ మేనేజర్‌గా పని చేస్తోంది లిఖిత. ఈ ఏడాది ఏప్రిల్ 30న ఆమెకు బాబు పుట్టాడు. ‘మొదటి రెండు వారాల పాటు నాకుపాలు తక్కువగా వచ్చేవి. నాపాలతో పాటు డబ్బాపాలు బాబుకు పట్టేవాళ్లం. బాబు కడుపు నిండా తాగేవాడుపాలు తక్కువైన ప్పుడల్లా ఏడ్చేవాడు. ఆ సమయంలో అందుబాటులో ఉన్న డబ్బాపాలు పట్టేదాన్ని. అయితే డబ్బాపాలు తాగించేటప్పుడల్లా ఎంతో బాధపడేదాన్ని. ఆ తర్వాత పెద్దలు, అనుభవజ్ఞులు, కొందరు వైద్యులు చెప్పిన సూచనలను, సలహాలను పాటించిన తర్వాత అదృష్టవశాత్తూ నాకు పాలు బాగా పడ్డాయి. నా బిడ్డ బొజ నింపుకున్న తర్వాత కూడా ఇంకా మిగిలేవి. వాటిని తల్లిపాలు దొరకని చిన్నారుల కోసం ఉపయోగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. విదేశాల్లో, బెంగళూరులాంటి ప్రాంతాల్లో మిల్క్ బ్యాంకుల గురించి విన్నాను. అనంతపురంలోనూ మదర్ మిల్క్ బ్యాంకు ఉందని అక్క శ్రీలేఖ (గైనకాలజిస్టు) చెప్పారు. నేను పడ్డ ఇబ్బంది ఇతరుల పిల్లలు, తల్లులూ పడకూడదని, అలాంటి వారికి తల్లిపాలు అందజేయాలని నిర్ణయించు కున్నాను’ అంటుంది లిఖిత.చదవండి: కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు!లిఖిత తీసుకున్న నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు స్వాగతించారు. ప్రోత్సహించారు. పాలను స్టోరేజ్ చేయడానికి ఆన్లైన్లో ΄్యాకెట్స్ కొనుగోలు చేస్తుంది లిఖిత. వాటిలో నుంచి తన బిడ్డకు సరిపడాపాలు ఇస్తూనే మిగిలిన పాలను రోజూ 200 మి.లీ. వరకు సేకరించి డీప్ ఫ్రీజర్‌లో నిల్వ చేస్తుంది. అలా నెల రోజుల పాటు సేకరించిన మొత్తం తొమ్మిది లీటర్ల పాలను ప్రభుత్వ ఆసుపత్రిలోని మదర్ మిల్క్ బ్యాంకుకు అందిస్తోంది.‘చనుబాల దానం కార్యక్రమాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తాను. తల్లిపాల ప్రాముఖ్యత, దానిలోని ΄ోషకాలు, రోగనిరోధక శక్తి గురించి ప్రచారం చేస్తాను’ అంటుంది లిఖిత– ఆర్డీవీ బాలకృష్ణారావు, సాక్షి, అనంతపురంఇదీ చదవండి: కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ మరణంపై తల్లి సంచలన ఆరోపణలు లిఖిత బాటలోఅనంతపురం జిల్లాలో ఎంతోమంది పేదతల్లులు గర్భం సమయంలో రకరకాల కారణాల వల్ల సౌష్టికాహారం తీసుకోకపోవడంతో నెలలు నిండక, బిడ్డ ఎదుగుదల సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూలో పసికందులు పాలు లేక ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారి కోసం మదర్ మిల్క్ బ్యాంక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాం. లిఖిత ముందుచూపుతో తొమ్మిది లీటర్ల పాలు అందజేయడం సంతోషంగా అనిపించింది. వృత్తిరీత్యా బిజీగా ఉండే లిఖిత పేద పిల్లల గురించి ఆలోచించడం అభినందనీయం. ఇంకా ఎంతోమంది తల్లులు ముందుకువచ్చి పాలు ఇవ్వాలి. లిఖితను స్ఫూర్తిగా తీసుకోవాలి.– డాక్టర్ హేమలత, డిప్యూటీ ఆర్ఎంఓ -
ఏయ్..ఏఎస్పీ.. నీతో తాడో పేడో తేల్చుకుంటా
సాక్షి,అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి నియోజకవర్గం యాడికి పవర్ గ్రిడ్ సంస్థలో దౌర్జన్యం చేసిన జేసీ అనుచరులపై తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి కేసు నమోదు చేశారు. దీంతో ఏఎస్పీ రోహిత్‌పై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ‘ఏఎస్పీ రోహిత్ ఓ అవినీతి అధికారి. నీపై ఫిర్యాదు చేస్తా.. కేసు పెడతా. నేను, నా కుటుంబ సభ్యులు నీకు వ్యతిరేకంగా పీఎస్ వద్ద ధర్నా చేస్తాం. వచ్చే బుధవారం రోజున నీతో తాడోపేడో తేల్చుకుంటా’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. -
అనంతపురంలో హారర్ కామెడీ
వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘వీటీ 15’ (వర్కింగ్ టైటిల్). మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తాజా షెడ్యూల్ అనంతపురంలో ముగిసినట్లు మేకర్స్ ప్రకటించారు.‘‘ఇండో–కొరియన్ హారర్ కామెడీగా రూపొందుతోన్న చిత్రం ‘వీటీ 15’. అనంతపురంలో థ్రిల్లింగ్ సన్నివేశాలతోపాటు పంచ్ హ్యూమర్‌తో కూడిన సీన్స్ షూట్ చేశాం. వరుణ్ తేజ్, రితికా నాయక్‌పై పల్లెటూరి నేపథ్యంలో చిత్రీకరించిన సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయి. మా చిత్రం తర్వాతి షెడ్యూల్ కొరియాలో ప్రారంభం అవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
పరిటాల శ్రీరామ్‌కు అరెస్టు వారెంట్
సాక్షి, అనంతపురం: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు, టీడీపీ ధర్మవరం నియోజక వర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్‌కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై 2023 అనంతపురం రెండో పట్టణ స్టేషన్లో పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు హాజరు కాకపోవడంపై ఏజేఎఫ్సీఎం కోర్టు సీరియస్ అయ్యింది. పరిటాల శ్రీరామ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. -
టీడీపీలో పొలిటికల్ వార్.. ఎమ్మెల్యే కారణంగా కీలక నేతల రాజీనామా!
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనలో పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు, వారి ప్రవర్తన కారణంగా.. టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎమ్మెల్యే బండారు శ్రావణికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా టీడీపీ ఎంపీటీసీ సైతం రాజీనామా చేశారు.వివరాల ప్రకారం.. శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణిపై టీడీపీ కార్యకర్తల తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యే శ్రావణి కార్యకర్తల కంటే డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారని పచ్చ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం వచ్చిన మంత్రి టీజీ భరత్‌కు స్థానిక టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం, ఎమ్మెల్యే బండారు శ్రావణికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు.దీంతో, అక్కడే ఉన్న పోలీసులు.. టీడీపీ కార్యకర్తలను ఈడ్చి పడేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఎమ్మెల్యే శ్రావణి వైఖరికి నిరసనగా వెస్ట్ నరసాపురం టీడీపీ ఎంపీటీసీ అంజినమ్మ రాజీనామా చేశారు. ఇదే సమయంలో 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తమకు కనీస గుర్తింపు ఇవ్వలేదని టీడీపీ నేతలు వాసాపురం బాబు, కనంపల్లి ప్రసాద్ ధర్నాకు దిగారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టిడిపి ఎమ్మెల్యే బండారు శ్రావణి కు సొంత కార్యకర్త నుంచి నిరసన సెగ. పార్టీ కోసం చాలా కష్టపడ్డాను కానీ గుర్తింపు ఇవ్వడం లేదు.- టిడిపి కార్యకర్త pic.twitter.com/ZibwkRqIZv— రాజా రెడ్డి YSRCP (@rajareddzysrcp) April 18, 2025 -
AP: ‘మీ జైలర్ తప్పు చేశారు.. ఆచూకీ ఇవ్వండి’
విశాఖ,సాక్షి: ‘మీ జైలర్ తప్పు చేశారు.. ఆచూకీ ఇవ్వండి’ అంటూ జైళ్ల శాఖ డీజీపీకి విశాఖ నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి లేఖ రాశారు. ఆ లేఖ ప్రస్తుతం పోలీసు, జైళ్ల శాఖలో చర్చనీయాంశంగా మారింది.పోలీసుల సమాచారం మేరకు..గతంలో విశాఖకు చెందిన ఓ గృహిణికి అనంతపురం జైలర్ సుబ్బారెడ్డి అసభ్య సందేశాలు పంపించారు. దీనిపై బాధితురాలు పోలీసులు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన నాటి నుంచి జైలర్ సుబ్బారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు.ఈ నేపథ్యంలో జైళ్ల శాఖ డీజీపీకి విశాఖ నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి లేఖ రాశారు. ఆ లేఖలో విచారణ నిమిత్తం జైలర్ సుబ్బారెడ్డి ఆచూకీ చెప్పాలని కోరారు. -
నీటి సంరక్షణలో ప్రముఖ సిమెంట్ కంపెనీ
ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా.. తాము దృష్టి సారించిన నీటి నిర్వహణ పద్ధతులు, ప్రభావవంతమైన పాలనా వ్యవస్థల ద్వారా బాధ్యతాయుతమైన నీటి నిర్వహణ పట్ల తమ నిబద్ధతను అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ వెల్లడించింది. అల్ట్రాటెక్ నీటి నిర్వహణ ప్రయత్నాలు.. యూనిట్ ప్రాంగణంలో, కంచెకు ఆవల ఉన్న ప్రాంతాలను.. అంటే కంపెనీ కార్యకలాపాలను నిర్వహించే ప్రాంతాలలోని కమ్యూనిటీలను సైతం చేరుకుంటాయి.ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో వున్న అల్ట్రాటెక్ యొక్క ఇంటిగ్రేటెడ్ సిమెంట్ తయారీ యూనిట్, ఆంధ్రప్రదేశ్ సిమెంట్ వర్క్స్, నీటి సంరక్షణ పట్ల సమగ్ర విధానాన్ని కలిగి ఉంది. వారి నీటి సంరక్షణ కార్యక్రమాలలో ఒకటి వరుసగా నంద్యాల జిల్లా, అనంతపురం జిల్లాలోని పెట్నికోట, అయ్యవారిపల్లి గ్రామాలపై దృష్టి పెడుతుంది. ఇక్కడ తక్కువ వర్షపాతం, భూమి క్షీణత, అతి తక్కవ పంట ఉత్పాదకత వంటివి గ్రామీణ జీవనోపాధికి చాలా కాలంగా అడ్డంకులుగా ఉన్నాయి. ఫలితంగా, ఈ ప్రాంతంలో సమగ్ర వాటర్‌షెడ్ నిర్వహణ కార్యక్రమాలను అమలు చేయడానికి యూనిట్ 2019-20లో ఐదు సంవత్సరాల కార్యక్రమాన్ని చేపట్టింది.ఈ రోజు వరకు.. ఆంధ్రప్రదేశ్ సిమెంట్ వర్క్స్ ఈ గ్రామాల్లో ఏడు వర్షపు నీటి ఇంకుడు గుంతల నిర్మాణాలను నిర్మించింది. ఇది భూగర్భజల స్థాయిలను గణనీయంగా పెంచుతుంది. ఈ నిర్మాణాలు 35,000 క్యూబిక్ మీటర్ల మొత్తం నీటి నిల్వ సామర్థ్యాన్ని సృష్టించాయి, జనవరి 2025 నాటికి 7 లక్షల క్యూబిక్ మీటర్ల వర్షపు నీటిని ఇవి సేకరించాయి. దీని వలన భూగర్భ జలాలు 2 నుంచి 4 మీటర్ల వరకు పెరిగాయి, దాదాపు 346 హెక్టార్ల సాగు భూమికి నీటిపారుదల లభించింది.గతంలో బంజరుగా ఉన్న 400 ఎకరాల భూమిని కూడా సాగులోకి తీసుకువచ్చారు, వ్యవసాయ ఉత్పాదకత, ఆదాయ భద్రతను పెంచారు. సమతుల్య పోషక వినియోగ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు ఈ గ్రామాల్లో నేల మరియు భూగర్భ జల కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా సహాయపడ్డాయి. ఈ ప్రాజెక్ట్ నంద్యాల, అనంతపురం జిల్లాల్లోని ఈ రెండు గ్రామాల్లో నివసిస్తున్న 500 గృహాలలో 2,000 మందికి పైగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చింది.అల్ట్రాటెక్ సమగ్ర నీటి సంరక్షణ విధానంకమ్యూనిటీ నీటి సంరక్షణ కార్యక్రమాలతో పాటు, అల్ట్రాటెక్ దాని తయారీ కార్యకలాపాలలో నీటి సంరక్షణకు బహుముఖ విధానాన్ని కూడా తీసుకు వచ్చింది. ఈ విధానంలో అయిపోయిన గని గుంటలను జలాశయాలుగా మార్చడం, పైకప్పుపై వర్షపు నీటి సేకరణ నిర్మాణాలను నిర్మించడం, పునర్వినియోగించబడిన నీటి వినియోగం పెరగడంతో పాటు తయారీ కార్యకలాపాలలో నీటి సామర్థ్యాన్ని పెంచే కార్యక్రమాలు ఉన్నాయి.అల్ట్రాటెక్ తమ అనేక తయారీ యూనిట్లలో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ (ZLD) ప్లాంట్లను ఏర్పాటు చేసింది, దీని ద్వారా యూనిట్లలో 100 శాతం శుద్ధి చేసిన నీటిని తిరిగి ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. తద్వారా మంచినీటిపై ఆధారపడటం తగ్గుతుంది. నీటి సామర్థ్య మెరుగుదల అవకాశాలను గుర్తించడానికి, రోజుకు 100 క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ నీటి ఆధారపడటం ఉన్న దేశీయ ప్రదేశాలలో ఇది ద్వైవార్షిక నీటి ఆడిట్లను కూడా నిర్వహిస్తుంది.ఆంధ్రప్రదేశ్ సిమెంట్ వర్క్స్ తమ యూనిట్ ప్రాంగణంలో అనేక నీటి సంరక్షణ కార్యక్రమాలను చేపట్టింది. ప్రారంభం నుంచి ఈ యూనిట్ తమ ప్రాంగణంలో 1.9 మిలియన్ క్యూబిక్ మీటర్లకు పైగా నీటిని సేకరించి, రీఛార్జ్ చేసి.. తిరిగి ఉపయోగించుకుంది, ఒక్క FY24 లో మాత్రమే 1.2 లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని ఆదా చేసింది. -
పచ్చని చిలుకలు తోడుంటే.. పాడే కోయిల వెంటుంటే!
గతంలో పల్లెలు అంటే చాలు ఠక్కున పక్షుల కిలకిలలు స్ఫురణకు వచ్చేవి. ఏ ఇంటి పెరట్లో అయినా ఒక జామ చెట్టు దానిమీద నిత్యం పారాడుతూ జామకాయలు కొరుకుతూ ఉండే చిలుకలు.. పొలంలో కల్లంలో.. ఇంటి ముందున్న కరెంటి వైర్ల మీద చిలుకలతోబాటు కోయిలలు.. లెక్కకుమిక్కిలిగా ఊరపిచ్చుకలు.. కత్తెర పిట్టలు.. పాలపిట్టల.. ఒకటేమిటి.. ఊరు అంటేనే మనుషుల కన్నా పక్షులే ఎక్కువగా ఉండేవి.. కానీ కాలం మారింది.. మారుతోంది.. వేలాది పక్షి జాతులు అంతరించిపోతున్నాయి. మనిషి తాను బతకడం కోసం పక్షులను పొట్టనబెట్టుకుంటున్నాడు. ఎక్కడికక్కడ ఏర్పాటయ్యే సెల్ ఫోన్ టవర్ల కారణంగా పిచ్చుకలవంటి జీవాలు కనుమరుగైపోతున్నాయి.ఈ భూమి మనుషులకోసమే కాదు.. పశుపక్ష్యాదులు వంటి ఎన్నో జీవులకు ఆలవాలం.. కానీ మనిషి తన తెలివిని అతితెలివిగా మార్చి మిగతా జీవులన్నింటినీ మింగేస్తూ తానొక్కడే భూగోళాన్ని ఏలాలని చూస్తున్నాడు. ఆ క్రమంలోనే తూనీగలు.. నత్తగుల్లలు.. పలు రకాల చేపలు.. పిచుకలు వంటివి అంతరించిపోతున్నాయి. అయితే అందరూ ఇలా దారుణాలు చేస్తూ పోతుంటే ఎలా.. దిక్కులేనివాళ్లకు దేవుడే దిక్కు అన్నట్లుగా ఈ జీవాల రక్షణ కోసం ఎవరో ఒకరు ఉండే ఉంటారు.. దేవుడే ఎవరోఒకరికి బాధ్యత అప్పగించి ఉంటారు.. వాళ్ళే ఈ చిరు జీవుల రక్షణ బాధ్యతలు భుజానికి ఎత్తుకుంటారు. అనంతపురం పట్టణ యువత పక్షులను సంరక్షించేందుకు హోమ్ ఫర్ బర్డ్స్(Home For Birds) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. అనిల్ కుమార్(Anil Kumar) అనే యువకుడి సారథ్యంలోనే ఈ బర్డ్స్ సొసైటీ పక్షులకు ఇళ్ళు నిర్మిస్తోంది.. అవును.. పక్షుల కోసం గూళ్ళు కడుతూ వాటిని చెట్లకు వేలాడతీస్తోంది. అంతేకాకుండా ఔత్సాహికులకు వాటిని ఉచితంగా ఇస్తోంది.రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వినూత్నమైన కార్యక్రమం చేపట్టాలని ఎలా అనిపించింది అనే ప్రశ్నకు అయన నా బాల్యంలో మా ఊళ్ళో... ఇంట్లో.. పొలంలో పెరట్లో ఎన్నో మొక్కలు చెట్లు ఉండేవి.. వాటిమీద రకరకాల పిచ్చుకలు.. పక్షులు సందడి చేసేవి.. వాటిని చూస్తూ ఆడుకునేవాళ్ళం .. ఇప్పుడు పట్టణాల్లో పారిశ్రామికీకరణ పెరిగింది.. ఎక్కడ చూసినా సెల్ ఫోన్ టవర్లు.. విద్యుత్ స్తంభాలు ఉంటున్నాయి తప్ప పక్షులు వాలెందుకు.. అవి గూళ్ళు కట్టుకునేందుకు చెట్లే కరువయ్యాయి. దీంతో అవి తమ సంతతిని వృద్ధి చెందించుకోలేక క్రమేణా తగ్గిపోతున్నాయి. వాటికి మళ్ళీ మనం గూళ్ళు కల్పించి.. ఆహారం అందిస్తే మళ్ళీ మనచుట్టూ తిరుగుతూ సందడి చేస్తాయి. అందుకే వాటిని మళ్ళీ ఆహ్వానించాలని భావించి అనంతపురం చుట్టుపక్కల ప్రతి ఇంటికి ఇలా గూళ్ళు అందిస్తున్నాం. రకరకాల పక్షులు తమ గూళ్ళను ఎలా రూపొందిస్తాయో. మేమూ అచ్చం అలాగే వాటిని తయారు చేసి పంచుతున్నాం. వీటిలో ఇప్పుడు పిచ్చుకలు.. పక్షులు నివాసం ఉంటున్నాయి.. ఇది చాలా సంతోషకరమైన అంశం అని అయన చెబుతున్నారు.హోమ్ ఫర్ బర్డ్స్ సొసైటీ సభ్యులు వీధుల్లో తిరుగుతూ పక్షుల అలికిడిని బట్టి.. ఏయే ప్రాంతాల్లో ఎలాంటి పక్షులు ఉంటున్నాయనేది ఒక సర్వే మాదిరి చేసి ఆయా ప్రాంతాల్లో అలంటి గూళ్ళు ఏర్పాటు చేస్తున్నారు.. స్కూళ్ళు.. విద్యాసంస్థలు.. కాలేజీలు.. పార్కులు.. పెద్దపెద్ద చెట్లు ఉన్న చోట్ల ఈ గూళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాకుండా వాటికీ నీళ్లు ఆహారం కూడా అందిస్తూ వాటి మనుగడకు ఎంతో దోహదం చేస్తున్నారు. పక్షి నిపుణులతో మాట్లాడి.. ఏయే జాతి పక్షులు ఎలాంటి గూళ్ళు కడతాయనేది తెలుసుకుని ఆమేరకు నాలుగు రకాల గూళ్ళు తయారు చేసి అందజేస్తున్నారు. ఈ సంస్థ పుణ్యాన ఇప్పుడు అనంతపురం చుట్టుపక్కల పక్షుల సంతతి పెరిగింది.. వాటి సందడి సైతం పెరిగింది. మనం బతుకుదాం.. చిరు జీవులను బతికిద్దాం :::సిమ్మాదిరప్పన్న -
‘మన పంటలు – మన వంటలు’ మూడు రోజుల సదస్సు
మారుతున్న వాతావరణం నేపథ్యంలో ‘మన పంటలు – మన వంటలు’ అనే శీర్షికతో అనంతపురంలోని పోలిస్ కళ్యాణ మండపంలో ఈ నెల 22 నుంచి 3 రోజుల పాటు ఎగ్జిబిషన్, సదస్సులు నిర్వహించనున్నట్లు అనంత సుస్థిర వ్యవసాయ వేదిక కన్వీనర్ డా. వై.వి. మల్లారెడ్డి తెలిపారు. ఆహారమే ఆరోగ్యం అనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లటంతో పాటు.. వర్షాధార ప్రకృతి వ్యవసాయంలో పంటలు, వంటల గురించి ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు మూడు రోజులూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. 23 (ఆదివారం) న ఉ.10.30 గం.కు డా. ఖాదర్ వలి ప్రసంగం ఉంటుందన్నారు. 20 స్వచ్ఛంద సంస్థలు కలసి వరుసగా రెండో ఏడాది ఈ సదస్సులు నిర్వహిస్తుండటం విశేషం. 22,23 తేదీల్లోబయోచార్పై శిక్షణ వ్యవసాయ వ్యర్థాలతో బయోచార్ (బొగ్గు పొడి)ని తయారు చేసి పొలంలో తగిన మోతాదులో చల్లితే భూసారం పెరుగుతుంది. ఈ విషయమై రైతులకు లోతైన అవగాహన కల్పించటం కోసం ఘట్కేసర్ సమీపంలోని పిట్టల ఆర్గానిక్ ఫామ్ (ఎన్ఎఫ్సి నగర్ – అంకుష్పుర్ మధ్య)లో జరగనుంది. ప్రసిద్ధ బయోచార్ నిపుణులు డా. నక్కా సాయిభాస్కర్ రెడ్డి శిక్షణ ఇస్తారని నిర్వాహకులు పిట్టల శ్రీశైలం తెలిపారు రు. ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇతర వివరాలకు.. 70137 84740 నెంబర్‌ను సంప్రదించవచ్చు. చదవండి: డాన్ ఆఫ్ ఫ్రూట్స్.. అవొకాడో పండ్ల తోటలు సాగు ఎలా చెయ్యాలి? -
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ముఖ్య అనుచరుడు అరెస్ట్
సాక్షి,అనంతపురం: మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ముఖ్య అనుచరుడు మహానందరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహానందరెడ్డిపై ఎలాంటి కేసులు లేకున్నా అదుపులోకి తీసుకోవడంపై ఆయన కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే, టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఒత్తిడితో మహానందరెడ్డిని పోలీసులు వేధిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో మహానందరెడ్డి అరెస్ట్‌ను మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఖండించారు. మహానందరెడ్డికి పోలీసుల నుంచి ప్రాణహాని ఉంది. మహానందరెడ్డిని చంపడానికి టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. అందుకు పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. -
అనంతపురంలో దళిత సంఘాల నేతలకు అవమానం
సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురంలో దళిత సంఘాల నేతలకు అవమానం జరిగింది. హోంమంత్రి అనితను కలిసేందుకు వెళ్లిన దళిత సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. హోంమంత్రి అనిత తమను పట్టించుకోవడం లేదని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దళితులపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని నేతలు మండిపడ్డారు. హోం మంత్రి అనితను కలిసి వినతి పత్రం అందజేసేందుకు వెళ్లిన ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు సాకే హరి వెళ్లగా.. అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీసులు అడ్డుకున్నారు.కారు కూడా దిగకుండా.. మంత్రిగారూ.. ఇదేం తీరు!కర్నూలు: మంత్రి హోదాలో ఉన్న టీజీ భరత్ కనీసం ప్రజల సమస్యలను వినడానికి కూడా ఇష్టపడటం లేదు.పింఛన్ రావడం లేదని సమస్యను చెప్పుకోవడానికి వెళ్లిన వృద్ధురాలి మంత్రి పట్టించుకోలేదు. నడవడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధురాలు మంత్రి దగ్గరకు వెళ్లగా.. టీజీ భరత్ కారు కూడా దిగలేదు. తనకు పింఛన్ రావడం లేదని.. ఇప్పించాలంటూ మంత్రిని వృద్ధురాలు కోరింది. కొత్త పింఛన్లు వస్తే ఇస్తామంటూ మాట దాటేశారు. సమస్యలను వినాల్సిన మంత్రి.. కారు కూడా దిగకుండానే ప్రజలు సమస్యలను ఏసీ కారులో కూర్చోని విన్నారు. మంత్రి తీరుపై స్థానికులు మండిపడ్డారు. -
జగన్ అంటే ఒక ఎమోషన్.. దేవికాపై ట్రోల్స్.. ఐటీడీపీకి స్ట్రాంగ్ కౌంటర్
-
AP: సబ్ రిజిస్ట్రార్ నిర్వాకం.. టీ కేఫ్‌లో కీలక ఫైళ్లపై సంతకాలు!
సాక్షి, కదిరి: కూటమి సర్కార్ పాలనలో అధికారుల తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఆఫీసుల్లో చేయాల్సిన పనులు.. టీ షాపుల్లో, కేఫ్‌ల్లో, తమకు నచ్చిన చోట చేస్తున్నారు. తాజాగా శ్రీసత్యసాయి జిల్లా కదిరి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు ఓ టీ కేఫ్‌లో కూర్చొని రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన కీలక ఫైళ్లపై సంతకాలు చేయడం దుమారం రేపుతోంది. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వివరాల ప్రకారం.. కదిరి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు ప్రస్తుతం సెలవులో ఉన్నారు. కానీ, శుక్రవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని ఓ టీ కేఫ్‌లో కూర్చొని కీలక ఫైళ్లపై చకచకా సంతకాలు చేశారు. ఈ ఫైళ్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి అక్కడికి తీసుకెళ్లడం గమనార్హం. అయితే, ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలు పెంచిన నేపథ్యంలో అవి అమల్లోకి రావడానికి ముందు రోజు (శుక్రవారం) భారీ ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగేందుకు వీలుగా సబ్ రిజిస్ట్రార్ ఈ నిర్వాకానికి ఒడిగట్టారు.శుక్రవారం ఉమ్మడి జిల్లాలోనే గరిష్టంగా కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 139 రిజిస్ట్రేషన్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో భారీ మొత్తాలు చేతులు మారినట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులును వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా.. ఆయన ఫోన్లో అందుబాటులోకి రాలేదు. కార్యాలయ సిబ్బందిని అడగ్గా.. సబ్ రిజిస్ట్రార్ సెలవులో ఉన్నట్లు తెలిపారు. సెలవులో ఉన్నప్పటికీ టీ కేఫ్‌లో కూర్చొని డాక్యుమెంట్లపై సంతకాలు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
అనంత: నారాయణ కాలేజీ వద్ద ఉద్రికత్త
సాక్షి, అనంతపురం: నారాయణ కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థుల మరణాలకు కారణమైన నారాయణ కాలేజీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ సందర్బంగా విద్యార్థి సంఘాలు కాలేజీకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో, అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.అనంతపురం నారాయణ కాలేజీ వద్ద విద్యార్థులు సంఘాలు ఆందోళనలకు దిగాయి. మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలని విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేస్తున్నారు. కాగా, నారాయణ కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకి ఇటీవల చరణ్ అనే విద్యార్థి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల మరణాలకు కారణమైన నారాయణ కాలేజీపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం, విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు.. కొద్దిరోజుల క్రితమే నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చరణ్ అనే విద్యార్థి బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. క్లాస్ రూమ్‌లో అందరితో పాటు కూర్చున్న విద్యార్థి ఒక్కసారిగా లేచి వెళ్లి, చెప్పులు విప్పేసి కారిడార్ నుంచి కిందకు దూకేశాడు. దాంతో తరగతిలో ఉన్న లెక్చరర్‌తో పాటు విద్యార్థులంతా షాకయ్యారు. తీవ్రంగా గాయపడ్డ చరణ్‌ను ఆసుపత్రికి తీసుకెళుతుండగానే ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఇటీవల సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చి వెళ్లిన కుమారుడు ఇంతలోనే ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. అతడి మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఆంధ్ర ప్రదేశ్ : రాచరిక దర్పం..గుత్తి కోట రహస్యాలు ఇవిగో.. (ఫొటోలు)
-
'డాకు మహారాజ్' ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు
నటుడు నందమూరి బాలకృష్ణ(Balakrishna) నటించిన ‘డాకు మహారాజ్’ (Daku Maharaj) చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre Release) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో నేడు అనంతపురంలో ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే, శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన భక్తులు తిరుపతిలో టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరగడంతో ఆరుగురు భక్తులు మరణించారు. ఇలాంటి విషాధ ఘటన సమయంలో సినిమా ఈవెంట్‌ను నిర్వహించడం సరైన నిర్ణయం కాదని చిత్ర యూనిట్ రద్దు చేసింది.ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిఅనంత వేదికగా జనవరి 9న డాకు మహారాజ్ ప్రీరిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ముందుగానే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు శ్రీనగర్‌కాలనీ అయ్యప్పస్వామి ఆలయ సమీపంలో ఖాళీ ప్రాంతంలో ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే అక్కడ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎస్పీ జగదీశ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ఐటీశాఖ మంత్రి లోకేశ్ ముఖ్య అతిథిగా హజరుకానున్నారని అధికారికంగా కూడ ప్రకటించారు. అయితే, తిరుపతిలో జరిగిన ఘటనతో ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.మమ్మిల్ని తీవ్రంగా బాధించింది: డాకు మహారాజ్ మేకర్స్తిరుపతిలో జరిగిన విషా సంఘటన మమ్మిల్ని తీవ్రంగా బాధించింది. మన కుటుంబాల సంప్రదాయాల్లో వెంకటేశ్వర స్వామి ఒక భాగం. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే భక్తులు దర్శనం కోసం వెళ్తారు. అక్కడ ఇలాంటి సంఘటన జరగడం హృదయ విదారకంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని అనుకున్న విధంగా కొనసాగించడం సరికాదని మేము భావిస్తున్నాము. బరువెక్కిన హృదయంతో దేవునిపై ప్రజల్లో ఉన్న భక్తి, మనోభావాల పట్ల అత్యంత గౌరవంతో, మేము నేటి కార్యక్రమాన్ని విరమించుకోవాలని నిర్ణయించుకున్నాము.' అని వారు పేర్కొన్నారు.(ఇదీ చదవండి: నా కుటుంబంపై తప్పుగా ప్రచారం చేస్తున్నారు: చాహల్ సతీమణి) -
‘బాబూ.. ఒక్కో రైతుకు 20వేల ఆర్థిక సాయం ఏమైంది?’
సాక్షి, అనంతపురం: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేదన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో రైతు సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమైనట్టు తెలిపారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబుది అసమర్థత పాలన. హామీలను అమలు చేయడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం విఫలమైంది. రైతు సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధం. ఈనెల 13వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమం జరుగుతుంది. అనంతపురంలో ర్యాలీ, అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తాం. రైతు భరోసా పథకం కింద ఒక్కో రైతుకు 20వేల ఆర్థిక సాయం ఏమైంది?. ధాన్యం కొనుగోలు, మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందన్నారు.మాజీ ఎంపీ తలారి రంగయ్య మీడియాతో మాట్లాడుతూ..‘రైతులకు భరోసా కల్పించడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. రైతులకు ఇచ్చిన హామీలను టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేదు. ఈనెల 13వ తేదీన వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతం చేయండి అని పిలుపునిచ్చారు. -
తాడిపత్రిలో టీడీపీ నేతల దౌర్జన్యం
సాక్షి, అనంతపురం జిల్లా: వైఎస్సార్సీపీ నేత జావేద్ ఇంటి వద్ద ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి అనుచరుడు వీరంగం సృష్టించాడు. డబ్బులు బాకీ ఉన్నారంటూ వైఎస్సార్సీపీ నేత ఇంటి వద్ద అనుచరులతో దౌర్జన్యానికి దిగాడు. కుటుంబ సభ్యులను నిర్బంధించారని పోలీసులకు వైఎస్సార్సీపీ నేత జావేద్ ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి పేరుతో బెదిరింపులకు దిగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేత గోరాకు ఎలాంటి బాకీ లేనని జావెద్ స్పష్టం చేశారు.హోంగార్డుపై టీడీపీ నేత దౌర్జన్యం శింగనమల మండలంలోని ఉల్లికల్లు గ్రామానికి చెందిన టీడీపీ నేత రంగారెడ్డి తనపై దాడికి ప్రయత్నించాడంటూ శింగనమల పీఎస్‌లో పనిచేస్తున్న హోంగార్డు నాగేంద్ర మంగళవారం సీఐ కౌలుట్లయ్యకు ఫిర్యాదు చేశారు. వివరాలు... సెప్టెంబరులో ఒక రోజు రాత్రి నాయనపల్లి క్రాస్ నుంచి మరువకొమ్మ వరకూ హెడ్ కానిస్టేబుల్ గిరి మహేష్‌తో కలసి, హోంగార్డు నాగేంద్ర గస్తీ విధులు నిర్వర్తించాడు.ఆ సమయంలో టీడీపీ నేత ఉల్లికల్లు రంగారెడ్డికి చెందిన టిప్పరులో అక్రమంగా ఇసుక తరలిస్తుండడం గుర్తించి పోతురాజుకాలువ సమీపంలో అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. దీంతో అప్పటి నుంచి హోంగార్డు నాగేంద్ర ఎక్కడ కనిపించిన రంగారెడ్డి కోపంతో దుర్భాషలాడేవాడు. ఈ క్రమంలో మంగళవారం నాయనవారిపల్లిలో జరిగిన శుభకార్యానికి ఎమ్మెల్యేలు బండారు శ్రావణి, ఎంఎస్ రాజు హాజరుకానుండడంతో ఎస్ఐ, ఎఎస్ఐ, హెడ్ కానిస్టేబులు, సిబ్బందితో ఎస్కార్ట్ విధుల్లో నాగేంద్ర కూడా పాల్గొన్నాడు. అక్కడ సిబ్బంది భోజనం చేస్తున్న సమయంలో నాగేంద్రపై రంగారెడ్డి దాడికి ప్రయతి్నంచాడు. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది అడ్డుకోవడంతో నీ కథ చూస్తా అంటూ బెదిరిస్తూ వెళ్లిపోయాడు. టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐకి బాధితుడు ఫిర్యాదు చేశాడు. -
జడ్పీ వైస్ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి హత్యకు కుట్ర
-
AP: తెలంగాణ ఆర్టీసీ బస్సును ఢీకొన్న ట్యాంకర్
సాక్షి,అనంతపురం:బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సును గురువారం(అక్టోబర్11) అర్ధరాత్రి అనంతపురంజిల్లా గార్లదిన్నె మండలం తిమ్మంపేట సమీపంలో ట్యాంకరు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ట్యాంకరు డ్రైవరుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని హైవే పెట్రోలింగ్ అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగిలిన ప్రయాణికులను ఇతర బస్సుల్లో హైదరాబాద్‌కు తరలించారు. జాతీయ రహదారి44పై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.ఇదీ చదవండి: ఈ టీతో నష్టాలే -
అనంతపురం వైద్య కళాశాలలో వేధింపుల కలకలం
సాక్షి ప్రతినిధి, అనంతపురం :వైద్య విద్యార్థులను వేధించారన్న వార్తలు అనంతపురం మెడికల్ కాలేజీలో కలకలం రేపుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ కాలేజీలోని మూడు విభాగాల్లోని కొందరు అధ్యాపకులు మెడికోలను వేధించినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా.. గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ విభాగాలకు సంబంధించిన అధ్యాపకులు ఈ వేధింపులకు గురిచేసినట్లు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు హల్చల్ చేస్తున్నాయి.వాస్తవానికి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివే విద్యార్థులు రాష్ట్రంలోని ఇతర కాలేజీలు, ఇతర రాష్ట్రాల్లోని కాలేజీల విద్యార్థులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేసుకుంటారు. ఇప్పుడు ఈ గ్రూపుల్లో అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో వేధింపుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే వైద్యవిద్య పూర్తి చేసుకున్న ఓ విద్యార్థిని ఏకంగా జనరల్ సర్జరీ విభాగంలో లైంగిక వేధింపులు జరిగాయంటూ తన ఇన్‌స్ట్రాగాంలో వెల్లడించినట్లు మెడికోలు చెబుతున్నారు. ఈ అమ్మాయి చేసిన పోస్టే ఇప్పుడు కలకలం రేపుతోంది.పలు అనుమానాలకు తావిస్తున్న వైనం..ప్రస్తుతం అనంతపురం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థులు (నాలుగేళ్లకు కలిపి) 600 మంది, పీజీ వైద్య విద్యార్థులు 200 మంది ఉన్నారు. కాలేజీలో జరిగే వ్యవహారాలు బయటకు చెబితే ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ చేస్తారన్న భయంతో విద్యార్థినులు మౌనం వహించినట్లు తెలుస్తోంది. ఎంబీబీఎస్ అడ్మిషన్లు జరుగుతున్న వేళ వేధింపుల కలకలం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.సైబర్ క్రైంకు ఫిర్యాదు చేస్తాం..మాకు కూడా ఈ విషయాలు వారం రోజుల కిందటే తెలిశాయి. కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైంకు ఫిర్యాదు చేస్తున్నాం. – డాక్టర్ మాణిక్యాలరావు, ప్రిన్సిపాల్, అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలవాళ్లనే అడగండి చెబుతారు..లైంగిక వేధింపుల విషయం నా దృష్టికి రాలేదు. కొంతమంది పాస్డ్‌ఔట్ విద్యార్థులు పోస్ట్ చేశారని మీరే అంటున్నారు. వాళ్లనే అడగండి.. వాళ్లే మీకు ఏం జరిగిందో చెబుతారు. – డాక్టర్ రామస్వామి నాయక్, హెచ్ఓడీ, జనరల్ సర్జరీ విభాగం, అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల -
అంతర్జాతీయ వేదికగా వైఎస్ జగన్ పాలనపై ప్రశంసలు
సాక్షి, అనంతపురం: అంతర్జాతీయ వేదికగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై ప్రశంసలు దక్కాయి. రష్యాలో జరిగిన మేయర్ల సదస్సుకు వర్చువల్‌గా హాజరైన అనంతపురం మేయర్ మహ్మద్ వాసీం.. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ అమలు చేసిన విద్యా సంస్కరణలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. పాఠశాలల్లో నాడు-నేడు, ట్యాబుల పంపిణీ, ఇంగ్లీష్ మీడియం వంటి వైఎస్ జగన్ చేసిన మంచిని అంతర్జాతీయ డిజిటల్ వీక్ సెమినార్లో మేయర్ వివరించారు. కాగా, రాష్ట్రంలో పెట్టుబడులను పెద్దఎత్తున ప్రోత్సహించేలా గత సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలకు మరోసారి కేంద్రం గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. సులభతర వాణిజ్య ర్యాంకులు (ఈవోడీబీ)–2022 ర్యాంకుల కోసం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ రూపొందించిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక–2022 అమల్లో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో నిలిచింది. గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల కంటే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందంజంలో ఉంది.ఇదే విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకటించారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న పారిశ్రామిక సంస్కరణలను ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్ పనితీరు భేష్ అని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: వైఎస్ జగన్ నిర్ణయాలకు కేంద్రం గుర్తింపు -
అనంతపురంలో ఆడటం సంతోషంగా ఉంది: శ్రేయస్ అయ్యర్
దేశవాళీ క్రికెట్లో పాల్గొనటం ద్వారా నైపుణ్యాలను మరింతగా పెంచుకోవచ్చని టీమిండియా స్టార్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ అన్నారు. జాతీయ జట్టుకు ఆడుతున్న క్రికెటర్లు ఈ టోర్నీల్లో ఆడటం వల్ల యువతలో స్ఫూర్తినింపినట్లు అవుతుందని పేర్కొన్నారు. కాగా జాతీయ విధుల నుంచి విరామం లభించినపుడు.. ఫిట్‌గా ఉన్న సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్లంతా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న దులిప్ ట్రోఫీ-2024లో శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ తదితర టీమిండియా స్టార్లు పాల్గొనున్నారు. ఇండియా-ఏ, ఇండియా-బి- ఇండియా-సి, ఇండియా-డి జట్ల తరఫున ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. ఈ రెడ్‌బాల్ టోర్నీ పోటీలు అనంతపురం వేదికగా గురువారం ఆరంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే క్రికెటర్లంతా అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు.ఈ క్రమంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇండియా-సి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఇండియా-డి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అనంతపురం లో జరిగే దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లో ఆడుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ ఫోర్-డే టోర్నీలో ఆడటం ద్వారా నైపుణ్యాలను పదునుపెట్టుకునే అవకాశం దొరుకుతుందని హర్షం వ్యక్తం చేశారు.దులిప్ ట్రోఫీ- 2024 జట్లుఇండియా-ఏశుబ్మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనూష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుషాగ్రా, శస్వత్ రావత్.ఇండియా-బిఅభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి*, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, యశ్ దయాళ్, ముకేష్ కుమార్, రాహుల్ చహర్, ఆర్. సాయి కిషోర్, మోహిత్ అవస్థి, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్).ఇండియా-సిరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), సందీప్ వారియర్.ఇండియా-డిశ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రికీ భుయ్, శరణ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య థాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సేన్‌గుప్తా, కేఎస్ భరత్(వికెట్ కీపర్), సౌరభ్ కుమార్.చదవండి: సెంచరీ హీరో’కు గాయం.. సంజూ శాంసన్‌కు లక్కీ ఛాన్స్! -
వామ్మో.. పాము!
పాములు మనుషులను బెంబేలెత్తిస్తున్నాయి. పాముకాటు బాధితుల సంఖ్య ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీగా పెరుగుతోంది. ఎక్కువగా వర్షాకాలంలో పాముకాట్లు నమోదవుతున్నాయి. ఏటా సగటున 2,600 మంది పాముకాటుకు గురవుతున్నారు. రాష్ట్రంలోనే పాముకాటు బాధితుల్లో ‘అనంత’ నాలుగో స్థానంలో ఉంది. వ్యవసాయాధారిత జిల్లా కావడంతో ఎక్కువగా పొలం పనులకు వెళ్లే వారే పాము కాటుకు గురవుతున్నట్టు తాజా గణాంకాల్లో బయటపడింది.సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో అత్యంత విషపూరితమైన పాములుగా నాలుగు రకాల పాములను గుర్తించారు. వీటిలో నాగుపాము, కట్ల పాము, రక్త పింజరి, చిన్న పింజరి లేదా తోటి పింజరి పాములు ఉన్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నమోదవుతున్న పాముకాటు కేసుల్లో 23 శాతం ఈ నాలుగు రకాల పాములకు సంబంధించినవేనని తేలింది. ఈ పాములు కాటేసిన 30 నిమిషాల్లో ప్రథమ చికిత్స చేయకపోతే ప్రాణాపాయం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ నాలుగు రకాల పాములు స్వతహాగా కాటువేయడానికి ఆసక్తి చూపించవు. కానీ వాటిని తాకడం, తొక్కడం వంటివి చేసినప్పుడు బలంగా కాటు వేసే అవకాశం ఉందంటున్నారు. కొన్ని నీటిపాములు, జెర్రిగొడ్లు వంటివి ప్రాణాపాయం కాదని, ప్రథమ చికిత్స చేస్తే వెంటనే కోలుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.బాధితుల్లో యువకులే ఎక్కువపాముకాటుకు గురవుతున్న బాధితుల్లో ఎక్కువగా యువకులు, మధ్య వయస్కుల వారే ఉండటం గమనార్హం. పొలం పనులకు వెళ్లేవారిలో వీళ్లే ఎక్కువ. 21–30 ఏళ్ల వయస్కుల్లో 24 శాతం మంది బాధితులుండగా, 31–40 ఏళ్ల మధ్య వయసు వారు 24 శాతం మంది ఉన్నారు. 41–50 ఏళ్ల వారు 19 శాతం మంది పాముకాటు బాధితులు ఉన్నారు. పదేళ్లలోపు చిన్నారుల్లో 10 శాతం మంది ఉన్నారు. ఇదిలా ఉండగా పురుషులే ఎక్కువ మంది పాముకాటుకు గురవుతున్నారు. బాధితుల్లో 63 శాతం మంది పురుషులు, 37 శాతం మంది మహిళలు ఉన్నారు.రాత్రిపూటే పాముకాట్లుపొలం పనులకు వెళ్లే రైతులు లేదా కూలీలు రాత్రి పూట అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న పాముకాట్లు 35 శాతానికి పైగా సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య జరుగుతున్నట్టు వెల్లడైంది. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల లోపు 32 శాతం మేర కేసులు నమోదయ్యాయి. మిగతా కేసులన్నీ పగలు పూట నమోదైనవిగా గుర్తించారు. పాము కాటుకు గురైన బాధితులు 92 శాతం మంది 108 సర్వీసులోనే ఆస్పత్రులకు చేరారు. మొత్తం బాధితుల్లో 8 శాతం మంది ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లగా, మిగతా 92 శాతం మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. ఇదిలా ఉండగా గడిచిన రెండు మాసాల్లో పాముకాటుతో ముగ్గురు మృతిచెందారు. -
జేసీ కేతన్‌గార్గ్ బదిలీ
● రాజమహేంద్రవరం మునిసిపల్కమిషనర్గా నియామకం● అనంతపురం నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, జెడ్పీ సీఈఓ నిదియాదేవి కూడా బదిలీఅనంతపురం అర్బన్: జేసీ కేతన్‌గార్గ్ బదిలీ అయ్యారు. రాజమహేంద్రవరం మునిసిపల్ కమిషనర్‌గా ప్రభుత్వం ఆయనను నియమించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జేసీతో పాటు అనంతపురం నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, జెడ్పీ సీఈఓ వైఖోమ్ నిదియాదేవిని కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. మేఘస్వ రూప్‌ను మదనపల్లి సబ్ కలెక్టర్‌గా, నిదియాదేవిని రాజంపేట సబ్‌కలెక్టర్‌గా నియమించింది.జేసీగా రెండేళ్లు పూర్తిజాయింట్ కలెక్టర్‌గా కేతన్‌గార్గ్ జిల్లాలో రెండేళ్ల ఐదు నెలలు జిల్లాలో విధులు నిర్వర్తించారు. 2022, ఫిబ్రవరి 5వ తేదీన ఆయన జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఎక్కడా విమర్శలకు తావివ్వకుండా విధులు నిర్వర్తించారు.టీబీ డ్యాంకు కొనసాగుతున్న వరదబొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయానికి వరద పోటు ఆగడం లేదు. శుక్రవారం 1,08,790 క్యూసెక్కులు ఉన్న ఇన్‌ఫ్లో శనివారం ఉదయానికి 1,16,040 క్యూసెక్కులకు పెరిగింది. జలాశయం ఎగువ ప్రాంతాలైన మలెనాడు, శివమొగ్గ, ఆగుంబే, శృంగేరి, చిక్‌మగళూరు, వరనాడులో భారీ వర్షాలు కురుస్తుండడంతో తుంగ నది పోటెత్తుతోంది. ఈ క్రమంలో పరుగులు తీస్తూ నీరంతా టీబీ డ్యాం చేరుతోంది. ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే నాలుగు రోజుల్లో జలాశయం పూర్తిగా నిండవచ్చని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంలో 105.788 టీఎంసీల పూర్తి నీటి నిల్వ సామర్థ్యానికి గానూ 65.110 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 1,633 అడుగుల నీటి మట్టానికి గాను 1,621.32 అడుగులకు నీరు చేరింది. ఈ నెల 22 నుంచి ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కు నీరు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే టీబీ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే.జేఎన్టీయూరిజిస్ట్రార్గా కృష్ణయ్యఅనంతపురం: జేఎన్టీయూ (ఏ) రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ ఎస్. కృష్ణయ్య నియమితులయ్యారు. ఈ మేరకు ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శన రావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కృష్ణయ్య విలేకరులతో మాట్లాడారు. రిజిస్ట్రార్‌గా ఎంపిక చేసిన వీసీకి కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు. వర్సిటీ పురోగతికి కృషి చేస్తానన్నారు. అనంతరం ఆయనకు వర్సిటీ డైరెక్టర్లు, బోధన, బోధనేతర సిబ్బంది అభినందనలు తెలియజేశారు. కాగా, గతంలో టీడీపీ అధికారంలో ఉన్న 2014 నుంచి 2019 వరకూ జేఎన్టీయూ రిజిస్ట్రార్‌గా కృష్ణయ్య పనిచేశారు. ఇటీవల టీడీపీతో కూడిన కూటమి అధికారంలోకి రాగానే రిజిస్ట్రార్‌గా మళ్లీ ఆయననే నియమించడం గమనార్హం. -
పదోతరగతి నుంచే మద్యపానం.. ప్రాణాల మీదకు తెచ్చిన వైనం
సాక్షి, అనంతపురం: పదో తరగతి చదివే సమయం నుంచే ఉన్న మద్యపానం అలవాటు.. ఓ యువకుడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. 16 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి మద్యపానం అలవాటైపోయిన ఓ యువకుడికి.. దాని కారణంగా పాంక్రియాస్ (క్లోమం) బాగా పాడైపోయి, కుళ్లిపోయిన స్థితికి చేరుకోవడంతో ప్రాణాపాయం ఏర్పడింది. ఇన్ఫెక్షన్ తీవ్రస్థాయిలో వ్యాపించడంతో శస్త్రచికిత్స చేసినా బతికే అవకాశాలు దాదాపు లేవనే బెంగళూరులోని పలు ఆస్పత్రుల వైద్యులు అసలు కేసు తీసుకునేందుకే ఇష్టపడలేదు. అలాంటి కేసులో అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రి వైద్యులు అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేయడమే కాక.. రోగి ప్రాణాలను విజయవంతంగా కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ ఎన్.మహ్మద్ షాహిద్ తెలిపారు.“హిందూపురానికి చెందిన 26 ఏళ్ల లోకేష్‌కు తాను పదోతరగతి చదివే సమయం నుంచి మద్యపానం అలవాటు ఉంది. కొంతమందిలో దానివల్ల మరీ అంత సమస్యలు రాకపోయినా, కొందరికి మాత్రం శరీర తత్వం కారణంగా తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. లోకేష్‌కు పాంక్రియాస్ చుట్టూ నీరు చేరి, ఒక గోడలా తయారైపోవడమే కాక.. బాగా చీముపట్టి విపరీతమైన ఇన్ఫెక్షన్ (నెక్రోసిస్)కు దారితీసింది. అతడు బీఎస్సీ ఎనస్థీషియా టెక్నాలజీ చదువుతూ వైద్యరంగంలోనే ఉన్నాడు. సమస్య వచ్చిన మొదట్లో ఇక్కడ చూపించుకున్నప్పుడు మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ మనోజ్‌కు చూపించారు. ఆయన కొన్ని మందులు ఇచ్చి, శస్త్రచికిత్స అవసరం అవుతుందని చెప్పారు. దాంతో రోగి, అతడి బంధువులు బెంగళూరు తీసుకెళ్లారు. అక్కడ మూడు నాలుగు పెద్దపెద్ద ఆస్పత్రులకు తిరిగారు. ఇలాంటి కేసులో శస్త్రచికిత్స చేయకపోతే బతికే అవకాశాలు దాదాపు ఉండవు. ఒకవేళ చేసినా, 60-70శాతం మంది చనిపోతారు. బతికేవారిలో కూడా జీవితాంతం ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితి ఉండటంతో బెంగళూరు ఆస్పత్రులలో వైద్యులెవరూ ఈ కేసు తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఇన్ఫెక్షన్ తీవ్రస్థాయిలో ఉండటంతో పాటు గుండె రేటు కూడా గణనీయంగా పెరిగిపోయింది. రక్తపోటు పడిపోయింది. క్లోమం పూర్తిగా పాడైపోవడంతో దాన్ని తొలగించక తప్పలేదు. ఇన్ఫెక్షన్ ప్రేగులకు కూడా విస్తరించడంతో ముందు జాగ్రత్తగా స్టోమా చేశాం. దీన్ని మరో రెండు మూడు నెలల తర్వాత మళ్లీ లోపల పెట్టేస్తాం.ఈ శస్త్రచికిత్స తర్వాత లోకేష్ పూర్తిగా కోలుకున్నాడు. అయితే, పాంక్రియాస్‌ను తొలగించడం వల్ల భవిష్యత్తులో అతడికి కచ్చితంగా మధుమేహం వస్తుంది. ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం కూడా ఉంటుంది. మధుమేహ నియంత్రణకు టాబ్లెట్లు గానీ, ఇన్సులిన్ గానీ వాడాల్సి ఉంటుంది. మద్యపానానికి పూర్తిగా దూరం కావాలి. ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్త పడాలి” అని డాక్టర్ మహ్మద్ షాహిద్ వివరించారు. -
అగ్ని గుండంలో పడి వ్యక్తికి తీవ్ర గాయాలు
విడపనకల్లు: అగ్ని గుండంలో పడి వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన మండల పరిధిలోని పొలికి గ్రామంలో జరిగింది. వివరాలు.. పొలికి గ్రామంలో చిన్న సరిగెత్తు సందర్భంగా సోమవారం తెల్లవారుజామున పీర్ల దేవుళ్లను ఊరేగించారు.గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ పీర్ల దేవున్ని ఎత్తుకుని అగ్ని గుండం దాటే క్రమంలో అకస్మాత్తుగా పడిపోయాడు. స్థానికులు వెంటనే అగ్ని గుండంలో నుంచి లక్ష్మీనారాయణను బయటకు లాగారు.అప్పటికే ఆయన కాళ్లు, చేతులు తీవ్రంగా కాలి గాయాలయ్యాయి. వెంటనే గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయించారు.