
జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు నిరసనలు తెలుపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు దగ్గుపాటి క్షమాపణ చెప్పాలని ఆయన ప్యాన్స్ కర్ణాటక, బళ్లారి, ఏపీలోని ఇతర జిల్లాల నుంచి భారీగా అనంతపురం చేరుకున్నారు. అయితే, సమాచారం అందుకున్న పోలీసు సిబ్బంది వారిని అరెస్టు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ తమ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన అనుచిత వాఖ్యలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి నిరసన తెలిపారు. అయితే, ఈ ఆందోళన కేవలం అనంతపురం జిల్లాకు మాత్రమే పరిమితం కాలేదు. నేటి నుంచి ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాలని వారు ప్లాన్ చేస్తున్నారు.
'ఛలో అనంతపూర్' పేరుతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనంతపపురంలోని దగ్గుపాటి క్యాంప్ ఆఫీస్‌కు రాబోతున్నారు. అభిమానుల చర్యల వల్ల దగ్గుపాటి నుంచి సరైన సమాధానం రాకపోతే.. రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు చేపడతామని వారు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే అఖిల కర్నాటక ఎన్టీఆర్ సేవాసమితి సభ్యుల్ని పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు 40 మందిని ఉరవకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో కొంతమందిపై పోలీసులు చేయిచేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తారక్ ఫ్యాన్స్‌పై టీడీపీ పేరుతో ఉన్న కొన్ని పేజీలు బూతులతో దాడులకు దిగుతున్నాయి.
అనంతపురంలో ఇంత జరుగుతుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం తారక్ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. కేవలం ఎమ్మెల్యేపై చంద్రబాబు భగ్గుమన్నారంటూ లీకులు మాత్రమే ఇచ్చి సరిపెట్టారు. అయితే, తారక్ ఫ్యాన్స్ మాత్రం దానిని నమ్మలేదు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బహిరంగంగా మీడియా ముందు క్షమాపణలు చెప్పడంతో పాటు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న ఎమ్మేల్యే వెనుక లోకేష్ ఉన్నారని ఫ్యాన్స్ కూడా చెప్పుకొస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ వివాదం మరింత తీవ్రరూపం దాల్చేలా కనిపిస్తుంది. ఇప్పటికే కర్ణాటక, బళ్ళారి నుంచి చాలామంది అభిమానులు అనంతపురం చేరుకున్నారు. నేడు తమిళనాడు నుంచి కూడా ఫ్యాన్స్ అక్కడికి రానున్నారు. దీంతో పోలీసులు కూడా అలెర్ట్‌గా ఉన్నారు.
The Constitution Of India Gives People The Right To Speak Freely And Protest Peacefully Under Article 19(1)(a) and 19(1)(b)
When The Government Stops Such Protests, Is It Really Following The Constitution?#SuspendMLADaggupatiPrasad pic.twitter.com/lKpDjfGmuY— NTR Trends (@NTRFanTrends) August 24, 2025
🙏🙏#SuspendMLADaggupatiPrasad pic.twitter.com/naYbfuvbRN
— Jr NTR Fan Club (@JrNTRFC) August 24, 2025