
ప్రజలకు అవగాహన కల్పించేలా చేయడం అంటే మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. కార్యరంగంలోకి దిగాక తెలుస్తుంది అసలైన సమస్య. కానీ ఈ మహిళ అవేమి పట్టించుకోకుండా స్వచ్ఛందంగా పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్న తీరు ప్రతి ఒక్కర్నీ కదిలిస్తోంది. పైగా రెండు భాషల్లో వారికర్థమయ్యేలా చెబుతున్న తీరుకి హ్యాట్సాఫ్ అనాల్సిందే. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఒక మహిళ స్వచ్ఛందంగా పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. అందుకోసం సిటీ బస్సు ఎక్కి మరీ వీధుల్లో చెత్త వేయొద్దంటూ ప్రయాణికులను కోరడమే గాక..ఇలా అందరూ సమిష్టిగా చేస్తే..దాని ప్రభావం దేనికి దారితీస్తుందో నొక్కి చెప్పింది. ఈ ఘటన బెంగళూరు సిటీ బస్సులో చోటుచేసుకుంది.
ఆమె కన్నడ, హిందీ భాషలలో ప్రజలకు తన సందేశాన్ని వినిపించడం విశేషం. అంతేగాదు ప్రయాణికులు టిక్కెట్ల, గుట్కా ప్యాకెట్లు రోడ్లపై వేయొద్దని అభ్యర్థిస్తూ అవగాహన కల్పించింది. "మార్పు మన నుంచి మొదలవ్వాలి.. మీ చెత్తను ఇంటికి తీసుకువెళ్లండి.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం." అని పిలుపునిస్తున్న తీరు అక్కడున్నవారందర్నీ బాగా ఆకర్షించింది. ఎవరేం అనుకున్నా పర్లేదు..మార్పు ఒక్కటే ముఖ్యం అంటూ వాలంటీర్‌గా ముందుకువచ్చి ఇలా బహిరంగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది.
కచ్చితంగా ఇది ఎవరెస్టు రేంజ్‌కి మార్పుకి నాంది పలికి తీరుతుంది అంటూ పలువురు నెటిజన్లు ఆమెను అభినందిస్తూ పోస్టులు కూడా పెట్టారు. అంతేగాదు ప్రయత్నం చూడటానికి సాదాసీదాగా కనిపించొచ్చు..మార్పు సంతరించుకున్నప్పడూ కచ్చితంగా దాని విలువ తప్పక తెలుస్తుంది కదూ..!.
(చదవండి: హిమాలయన్ ఆంటీ'..ఆమె శిఖరాగ్ర శక్తికి సాటిలేదు!)