
కసరత్తులు, వర్కౌట్లు చేస్తేనే స్ట్రాంగ్‌గా ఉంటారనుకుంటే పొరబడ్డట్టే. ఎందుకంటే..ఎలాంటి వర్కౌట్లు, శిక్షణ ట్రైనింగ్ లేకుండా ఈ మహిళ అవలీలగా బరువులు ఎత్తి ఔరా అనిపించుకుంది. అంతేగాదు..ట్రెక్కింగ్ వంటి సాహస కృత్యాలు చేసే విదేశీ మహిళ సైతం అంతలా ఆ బరువులను ఎత్తలేకపోయింది. అంతేగాదు ఆమెను చూసి పోటీ అనే పదానికి తావివ్వని శక్తిమంతులు ఈ మహిళలు అని కితాబిచ్చేసింది. ఇంతకీ ఎవరా మహిళ అంటే..
ఆమె ఉత్తరాఖండ్‌లోని చమోలీ అనే స్థానిక పహాడి(పర్వత) మహిళ. హిమాలయాల్లో నివశిసించే ఈ మహిళల శక్తి సామర్థ్యాలకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వుతోంది. ఆ వీడియోకి గెమ్మకోల్లెల అనే విదేశీ మహిళ 'నువ్వు బలవంతుడివని విశ్వసిస్తావు..అది తప్పని నిరూపించేంత వరకు' అనే క్యాష్షన్ జోడించి మరి పోస్ట్ చేసింది.
ఆ విదేశీ మహిళ గెమ్మ ఉత్తరాఖండ్‌లోని చమోలిలో నది సమీపంలోని ఒక చిన్నగ్రామంలోని ఇద్దరు మహళలు తమ గెదెల కోసం గడ్డికోస్తున్నట్లుగా కనిపించారు. వాళ్లలో ఒక మహిళ సదరు విదేశీ మహిళను చూడటమే గాదు, ఓ సవాలు కూడా విసిరారు. కొంటెగా నవ్వుతూ ఈ గడ్డిమోపు ఎత్తగలవా అని సవాలు విసిరింది స్థానిక హిమాలయన్ ఆంటి. అక్కడంతా ముద్దుగా ఆ మహిళలను అలా పిలుచుకుంటుంటారు. అయితే ట్రెక్కింగ్‌కి వెళ్లే అనుభవం ఉన్న విదేశీ మహాళ గెమ్మకి అదేమంతా పెద్ద కష్టమైన విషయం కాదు.
ఎందుకంటే ట్రెక్కింగ్ చేసేటప్పుడు..సుమారు 20 నుంచి 25 కిలోలు దాక బరువులు మోసే అలవాటు ఉంది ఆమెకు. దాంతో అదేమంతా పని అన్నట్లుగా సై అంది విదేశీ మహిళ. ఆ తర్వాత మొదలయ్యాయి..ఆమె కష్టాలు, పాట్లు చూస్తే నవ్వు ఆగదు. కొంచెం కూడా గడ్డిమోపుని ఎత్తలేక నానా అవస్థలు పడింది.
కానీ ఈ పర్వతాల్లో నివశించే హిమాలయన్ మహిళ మాత్రం చాలా అలవోకగా ఆ భారీ గడ్డిమోపుని సులభంగా ఎత్తేయడమే కాదు ట్రక్కు వద్దకు నేరుగా తీసుకెళ్లింది కూడా. ఆమె శక్తి సామర్థ్యాలకు ఫిదా అవ్వతూ ఆ మహిళ ఎంతలా అప్రయత్నంగా ఆ గడ్డిమోపుని ఎత్తేసిందంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.
అస్సలు పోటీ అనేదే ఆమెకు లేదు అంటూ గడ్లల జల్లు కురిపించింది సదరు విదేశీ మహిళ. అయితే నెటిజన్లు..హిమాలయల ఇళ్లకు వెన్నముక ఈ స్త్రీలు. సగటు పర్వతపు మహిళ దినచర్య ఇదేనని అభినందన జల్లు కురిపిస్తున్నారు. పైగా ఆమె చాలా క్యాజువల్‌గా పహాడి కండరాలను వంచు తోందంటూ పోస్టులు పెట్టారు.
(చదవండి: Success Story: ఐఏఎస్‌గా సెక్యూరిటీ గార్డు కుమార్తె..! హిందీ మాధ్యమంలో టాపర్‌గా..)