
అత్యంత ప్రతిష్టాత్మకమైన కఠినమైన ఎగ్జామ్ యూపీఎస్సీ సివిల్స్ సర్వీస్. అలాంటి సివిల్స్ ఎగ్జామ్స్‌లో సత్తా చాటి ఐఏఎస్ కావాలనేది ఎందరో యువత కల. అందరు ఒక్కోలా తపించి కలను సాకారం చేసుకుంటుంటారు. కానీ ఈమె అత్యంత విభిన్న పద్ధతిలో తన డ్రీమ్‌ని సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. సాధించాలనుకునేవాడికి సవాలక్ష మార్గాలు తన కళ్లమందు ఉంటాయనేందుకు ఉదాహరణగా నిలిచింది.
ఆ అమ్మాయే అంకిత కాంతి(Ankita Kanti,). ఉత్తరాఖండ్(Uttarakhand)లోని చమోలి జిల్లాలోని చిర్ఖున్ అనే చిన్న గ్రామానికి చెందిన అంకిత కాంతి కుటుంబం మధ్యతరగతి నేపథ్యానికి చెందిన అతి సామాన్య కుటుంబం. ఆమె తండ్రి దేవేశ్వర్ కాంతి బ్యాంకులకు నగదు తీసుకెళ్లే పనిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తల్లి ఉషా కాంతి గృహిణి. బాల్యం నుంచి అంకిత కాంతి చదువులో మంచి ప్రతిభను చాటుకుంది. ఆమె తుంటోవాలాలోని డూన్ మోడరన్ స్కూల్, కర్బరిలోని సంజయ్ పబ్లిక్ స్కూల్‌లలో పాఠశాల విద్యను పూర్తి చేసింది. పదోతరగతి పరీక్షలో 92.40% మార్కులు సాధించింది.
తర్వాత 2018లో 12వ తరగతి పరీక్షలలో 96.4% మార్కులు సాధించి, ఉత్తరాఖండ్ రాష్ట్రానికే నాల్గవ టాపర్‌గా నిలిచింది. ఇక డీబీఎస్ కళాశాలలో బీఎస్సీ డిగ్రీ, ఎంఎస్సీ పూర్తి చేసింది. అయితే అప్పటి నుంచే ఆమె యూపీఎస్సీ సివిల్స్(UPSC Civil Services Examination (CSE))కి సన్నద్ధమైంది. కానీ సివిల్స్ ఔత్సాహిక అభ్యర్థుల్లా కాకుండా..స్వీయంగా సన్నద్ధమైంది.
అయితే ఆమె హిందీ మాధ్యమంలో ఈ సివిల్స్ 2024 ఎగ్జామ్‌ని రాసి ఆల్ ఇండియా ర్యాంకు 137 సాధించి, ఐఏఎస్ అవ్వాలనే తన కలను సాకారం చేసుకుందామె. దీంతో అంకిత తొలిసారగా హిందీ మాధ్యమంలో పరీక్ష రాసి.. టాపర్‌గా నిలిచిన అమ్మాయిగా వార్తల్లో నిలిచింది. ఆమె చెల్లెలు కూడా బ్యాంకు ఉద్యోగం సంపాదించింది. ప్రస్తుతం ఆమె కూడా తన అక్క అంకిత అడుగుజాడల్లో వెళ్తోంది. అంజలి కూడా ప్రస్తుతం యూపీఎస్సీకి ప్రిపేరవ్వుతోంది.
ఎక్కడ నియమించారంటే..
ప్రస్తుతం ఆమె ట్రైనింగ్‌లో ఉంది. అధికారికంగా ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదామెకు.
(చదవండి: ఐఏఎస్ అధికారిణికి బంగారు పల్లకితో వీడ్కోలు..!)