
దేశంలోనే అత్యుత్తుమ గౌరవప్రదమైన సర్వీసులు, ఐఏఎస్, ఐపీఎస్ . ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ తమ సేవలను అందిస్తుంటారు. అలా తమ సేవలతో ప్రజల గుండెల్లో స్థానం దక్కించుకుని, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న అధికారులు ఎందరో ఉన్నారు. అలానే ఒక కలెక్టర్ తన కింద సిబ్బంది, ప్రజల మన్ననలను అందుకుని అద్భుతమైన గౌరవాన్ని అందుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశలోని సియోని జిల్లా కలెక్టర్ సంస్కృతి జైన్ బదిలీపై వెళ్తూ..తన సహచర సిబ్బంది, ప్రజల నుంచి రాజవంశీకులు రేంజ్‌లో గొప్ప సత్కారం పొందారామె. మాజీ కలెక్టర్ సంస్కృతి జైన్, ఆమె ఇద్దరు కుమార్తెలను బంగారు పల్లకీలో కూర్చోబెట్టి మరీ వీడ్కోలు పలికారు. సిబ్బంది స్వయంగా తమ భుజాలపై మోస్తూ ఆమె వాహనం వద్దకు తీసుకువెళ్లి ఘనంగా వీడ్కోలు పలికారు.
ఇక ఇటీవలే, మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సియోని కలెక్టర్ సంస్కృతి జైన్‌ని భోపాల్‌కి బదిలీ చేసింది. ఈ నేపథ్యంలోనే నూతన కలెక్టర్ శీతల పాట్లేకు స్వాగతం పలికి, సంస్కృతి జైన్‌కు వీడ్కోలు పలికే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, కలెక్టర్ జైన్ అవసరమైనప్పుడల్లా ముందుకు వచ్చి డిపార్ట్మెంటల్ సిబ్బందికి నాయకత్వం వహించి వారి తప్పులను ఎత్తి చూపేవారట.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని మెరుగుపరచడానికి కలెక్టర్ జైన్ ప్రారంభించిన “గిఫ్ట్ ఎ డెస్క్” ప్రచారం కూడా అత్యంత ప్రజాదరణ పొందింది. అంతేగాక సమాజంలోని అన్ని వర్గాలచే ప్రశంసలు అందుకున్నారామె. సుమారు 15 నెలల కాలంలో ప్రజలకు చేరువవ్వడమే కాకుండా తన సేవలకుగానూ విశిష్ట గుర్తింపు కుడా దక్కించుకున్నారామె.
An MP IAS officer Sanskriti Jain, Collector Seoni,was given a unique farewell by her staff. Unheard of before.
Many officers hv been popular during their postings owing to people-oriented works & honesty, yet this was something new.
Let more officers be like her.@IASassociation pic.twitter.com/wsebdt9ELw— Abhilash Khandekar (@Abhikhandekar1) October 5, 2025
(చదవండి: డిజిటల్ డిటాక్స్‌లో ఉండగా ..వరించిన నోబెల్ బహుమతి! ట్విస్ట్ ఏంటంటే..)