లిఫ్ట్ ఫెయిల్ ..చిన్నారి తెగువతో తప్పిన ప్రమాదం | Girl Blocking Closing Lift Doors To Rescue Toddlers | Sakshi
Sakshi News home page

లిఫ్ట్ ఫెయిల్ ..చిన్నారి తెగువతో తప్పిన ప్రమాదం

Feb 22 2026 6:40 PM | Updated on Feb 22 2026 6:48 PM

 Girl Blocking Closing Lift Doors To Rescue Toddlers

ఇటీవల కాలంలో లిఫ్ట్ ప్రమాదాలు కామన్ గా మారాయి. తయారీ సంస్థలు సరైన విధంగా భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా అటువంటి ఘటనే ఇక్కడ జరిగింది. అయితే లిఫ్ట్ లో చిక్కుకోబోయిన ఇద్దరు చిన్నారులను ఒక బాలిక మెలకువతో తక్షణమే స్పందించి కాపాడింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

ఒక అపార్టుమెంటులోని ఎలివేటర్ లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అయితే వారి కుటుంబసభ్యుల కోసం వేచిచూస్తు అక్కడే ఉన్న బాలిక  లిఫ్ట్ ని తన చేతితో ఆపుతుంది. అయితే వారు లిఫ్ట్ ద్వారాల మధ్యలో ఉండగానే ఆ గేట్స్ అకస్మాత్తుగా  క్లోజ్ అయ్యాయి. దీంతో ఆ చిన్నారి లోపలికి వెళ్లిపోయింది. అయితే అక్కడే ఉన్న బాలిక తక్షణమే స్పందించి వారికి తన చేయితే లిఫ్ట్ ని బిగియపట్టింది.

తన శక్తికి మించిన పనైనా ఏమాత్రం అ ధైర్యపడకుండా బిగుతుగా లిఫ్ట్ గేటును పట్టుకుంది. ఇంతలోనే వారి కుటుంబసభ్యులు వచ్చి ఎట్టకేలకు బలవంతంగా ఆ చిన్నపిల్లలను బయిటకి తీశారు. దీంతో  అంతా ఉపిరిపీల్చుకున్నారు. సాధారణంగా లిఫ్ట్ సెన్సార్స్ ఏదైనా అడ్డు చూపితేనే వెనక్కి వెళతాయి. అయితే ఇందులో చిన్న పాప అడ్డు ఉన్నప్పటికీ ఆ డోర్స్ క్లోజ్ అవడం ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ లిఫ్ట్ వీడియో ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ బాలిక ధైర్యసాహసాలకను  నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు.  అదే సమయంలో ఆ ఎలివెేటర్ల భద్రతని ప్రశ్నిస్తున్నారు. లిఫ్ట్ తయారిలో ఇలాంటి భద్రత ప్రమాణాలు పాటించకపోవడం ఏంటని ఇలాంటి వాటి వల్లే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు. అయితే ఈ ప్రమాద ఘటన ఎక్కడ జరిగిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement