‘సాక్షి’ సోషల్‌ మీడియా అరుదైన ఘనత | Sakshi Social Media Milestones, Achieved 100 Million Plus Monthly Viewership In All Social Media Platforms | Sakshi
Sakshi News home page

Sakshi Social Media: ‘సాక్షి’ సోషల్‌ మీడియా అరుదైన ఘనత

Feb 21 2026 4:31 PM | Updated on Feb 21 2026 7:23 PM

Sakshi Social Media: Achieved 100 Million Plus Monthly Views All Platforms

నేటి సమాజంలో వార్తా విశేషాల్ని తెలుసుకోవడానికి టీవీలు, పేపర్ల పాత్ర చాలా తక్కువైపోయింది.  అంతా సోషల్‌ మీడియా హవానే నడుస్తోంది. ప్రజలు ఎక్కువగా సామాజిక మాధ్యమాల వేదికలపై దృష్టి పెడుతున్నారు. వార్తలు, వినోదం, అభిప్రాయాలు ఇలా  ఆల్‌ ఇన్‌ వన్‌ తరహాలో అన్నీ ఒకే చోట అందుబాటులో ఉన్నాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ఎక్స్(ట్విటర్) వంటి ప్లాట్‌ఫాంలు ప్రధాన సమాచార వనరులుగా మారాయి. తక్షణ సమాచారం అందించే సామర్థ్యం సామాజిక మాధ్యమాలకు ఉండడం ప్రజలను ఆకర్షిస్తోంది.  ఫలితంగా యువతలో సోషల్ మీడియా వినియోగం అత్యధికంగా ఉంది.

సమాజంలో అభిప్రాయాలు, చర్చలు ఇప్పుడు ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. సోషల్ మీడియా ప్రభావం భవిష్యత్తులో మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా కూడా. 

ఈ క్రమంలోనే ఇక్కడ మీతో(ప్రేక్షక్షులకు) ఒక విషయాన్ని షేర్‌ చేసుకోవడానికి సంతోషిస్తున్నాము. ‘సాక్షి’ సోషల్‌ మీడియా అన్ని ప్లాట్‌ఫామ్స్‌లలో నెలవారీ వీక్షణలో 100 మిలియన్ల వ్యూయర్‌షిప్‌ను సాధించింది.  

తెలుగు సోషల్‌ మీడియాలో దూసుకుపోతున్న ‘సాక్షి’ని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ ఆదరణ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ.. ఎప్పటికప్పుడు  వేగంగా వార్తా సమాచారాన్ని తెలుసుకోవడానికి  ‘సాక్షి’ సోషల్‌ మీడియాని ఫోలో అవ్వమని విజ్ఞప్తి చేస్తున్నాం.

సాక్షి ఫేస్‌బుక్‌

సాక్షి ఇన్‌స్టా

సాక్షి ‘ఎక్స్‌’

సాక్షి  వాట్సాప్‌ చానల్‌

Advertisement
 
Advertisement
Advertisement