విశేషం
సౌరభ్‌జైన్ అనే భారతీయుడి కుటుంబంతో దుబాయ్ పాలకుడు సరదాగా గడిపిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది... దుబాయ్‌లోని సాయిహ్ అల్ సలాం ఎడారి. చుట్టూ ఇసుక తిన్నెలు, ప్రశాంతమైన అల్ ఖుద్రా సరస్సు. వారాంతాల్లో సరదాగా గడపడానికి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఈసారి అక్కడికి దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎటువంటి హడావిడి, భద్రతా సిబ్బంది లేకుండా స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చారు.
సరస్సు దగ్గర ఆడుకుంటున్న పిల్లలను చూసి, కారు ఆపి ఆత్మీయంగా పలకరించారు. ఆశ్చర్యంతో చూస్తున్న వారి కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లి చిరునవ్వుతో పలకరించారు. పిల్లలతో కలిసి ఫొటో దిగారు. ఈ అద్భుతమైన క్షణాలను సౌరభ్‌జైన్ తన ఫోన్‌లో బంధించాడు.
‘ఖుద్రా లేక్ దగ్గర గడిపిన ఒక సాధారణ వారాంతం అద్భుతం. దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్‌ని కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది, పిల్లలపై ఆయన చూపిన ప్రేమ, ఆత్మీయత మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి’ అంటూ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. చాలా తక్కువ టైమ్‌లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజనులు దీనిని ‘డ్రీమ్ ఆఫ్ మిలియ¯Œ ్స’ అంటున్నారు.


