యూట్యూబర్ ‘నా అన్వేషణ’కు మెటా బిగ్‌షాక్‌! | Naa Anveshana Instagram Close | Sakshi
Sakshi News home page

యూట్యూబర్ ‘నా అన్వేషణ’కు మెటా బిగ్‌షాక్‌!

Feb 19 2026 9:29 PM | Updated on Feb 20 2026 10:05 AM

Naa Anveshana Instagram Close

సాక్షి,హైదరాబాద్‌: ప్రముఖ యూట్యూబర్ 'నా అన్వేష్' కు బిగ్‌ షాక్‌ తగిలింది.  ప్రముఖ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ మెటా అన్వేష్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను డిలీట్‌ చేసింది.

ఇటీవల అన్వేష్‌ దేశాన్ని దూషించడంతో పాటు మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల్లో తన సోషల్‌ మీడియా అకౌంట్లలో అన్వేష్‌ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

ఫిర్యాదులపై హైదరాబాద్ సీసీఎస్ పోలీలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అన్వేష్‌ సోషల్‌ మీడియా అకౌంట్లను పరిశీలించారు. వాటిల్లో ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో కంటెంట్‌ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నట్లు గుర్తించారు. ఇదే అంశంపై ఇన్‌స్టా మాతృ సంస్థ మెటాను సంప్రదించారు. అన్వేష్‌ అకౌంట్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

మెటా సైతం అన్వేష్‌ ఇన్‌స్టా అకౌంట్‌లను పరిశీలించింది. అనంతరం, అతడి అకౌంట్లపై నిషేదం విధించింది. గతంలో అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 1.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండేవారు. హిందూమతం, భారతదేశంపై అనుచిత కామెంట్లు చేయడంతో అతడి ఫాలోవర్ల సంఖ్య 1.3 మిలియన్లకు తగ్గింది. తాజాగా ఖాతా పూర్తిగా బ్యాన్ అయింది

Advertisement
 
Advertisement
Advertisement