breaking news
Meta
-
ఫేస్బుక్ వివాదం.. కేంద్రం యాక్షన్!
భారత ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఫేస్బుక్ పోస్ట్‌ను కొంతసేపు పరిమితం చేసిన ఘటన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం మెటా సంస్థపై మరింత దృష్టి పెట్టింది. ఈ వ్యవహారంపై.. మెటా గ్లోబల్ బృందాన్ని భారత్‌కు పిలిపించి.. సంస్థ విధానాలు, కంటెంట్ నియంత్రణ వ్యవస్థలపై వివరణ కోరాలని నిర్ణయించింది.మెటా ప్రతినిధులను ముఖ్యంగా అల్గారిథమ్‌లు ఎలా పనిచేస్తాయి?, వినియోగదారులకు ఏ కంటెంట్ చూపించాలి?, అనే నిర్ణయాలు ఎలా తీసుకుంటారు, కంటెంట్ మోడరేషన్లో ఏమైనా పక్షపాతం ఉందా?, అనే అంశాలపై ప్రశ్నించనున్నారు. అంతే కాకుండా.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ప్రజా శాంతి, సమాజంపై చూపించే ప్రభావం గురించి కూడా చర్చ జరగనుంది. దీంతో.. మెటా గ్లోబల్ బృందం వచ్చే వారం మధ్యలో భారత్‌కు వచ్చే అవకాశం ఉందని, అనంతరం పార్లమెంటరీ కమిటీ ముందు కూడా హాజరుకానుందని సమాచారం.సోషల్ మీడియా సంస్థలు భారతదేశంలో పనిచేస్తున్నప్పుడు.. దేశ చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ యువతను ఉద్దేశించి షేర్ చేసిన ఒక ఫేస్బుక్ పోస్టును తాత్కాలికంగా పరిమితం చేసింది. ఈ పోస్టులో పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఘటన సాంకేతిక లోపం వల్ల జరిగిందని మెటా వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పినప్పటికీ, ఈ వివరణపై కేంద్రం సంతృప్తి చెందలేదని సమాచారం.ఈ పరిణామాల తర్వాత ప్రధాని మోదీతో పాటు ఇతర ప్రముఖుల ఖాతాల నుంచి వచ్చే పోస్టులపై మరింత పర్యవేక్షణ ఉంటుందని మెటా తెలిపింది. ముఖ్యమైన ఖాతాల కంటెంట్‌ను సీనియర్ అధికారులు పలు స్థాయిల్లో పరిశీలించే విధంగా అదనపు భద్రతా చర్యలు తీసుకున్నట్లు కంపెనీ కేంద్రానికి వివరించింది.ఇదే సమయంలో.. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్ చేసిన చిత్రాలు, ఏఐ ద్వారా రూపొందించిన తప్పుడు పోస్టులు ప్రచారం చేశారనే ఆరోపణలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌తో పాటు కొన్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై కేసులు నమోదు చేశారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చట్టవిరుద్ధమైన లేదా హానికరమైన కంటెంట్‌ను నియంత్రించడంలో సంస్థలు బాధ్యతగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే.. సోషల్ మీడియా అధిక వినియోగం పిల్లలు, పెద్దల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. -
మోదీపై అభ్యంతకర పోస్టులు.. మెటా హెడ్‌పై కేసు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన నిరసనలలో ప్రధాని మోదీకి అభ్యంకతరంగా పోస్టులు చేశారంటూ మోటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. ఆయనతో పాటు పలువురి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై ఇద్దరు బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీకి సంబంధించినటువంటి అభ్యంతరకరమైన, తప్పుడు కంటెంట్‌ను తమ ఫ్లాట్పారమ్లపై (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) ప్రసారం కావడానికి అనుమతించారని,అటువంటి పోస్టులను తొలగించడంలో విఫలమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు, ప్రధానమంత్రిని అసభ్యకరంగా, అవమానకరంగా మరియు తప్పుదోవ పట్టించే విధంగా చిత్రీకరిస్తూ మార్ఫింగ్ చేయబడిన, డిజిటల్‌గా తారుమారు చేయబడిన అనేక వీడియోలు ,చిత్రాలు అందులో కనిపించాయని తెలిపారు.కాగా నీట్లీకేజ్కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. దీంతో మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేశారు. మరిన్ని డిమాండ్లను సైతం కేంద్రం ముందుంచింది. -
బిజినెస్ ఏఐ సేవలతోనే వేల కోట్ల ఆదాయం
కార్పొరేట్ వ్యాపారాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను విక్రయించడంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, ఇదే రాబోయే రోజుల్లో తమ సంస్థకు ప్రధాన ఆదాయ వనరుగా మారనుందని మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆయన టెక్ రంగాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ప్రధానంగా ప్రకటనల ఆదాయంపైనే ఆధారపడిన మెటా ఇప్పుడు ఎంటర్ ప్రైజ్ ఏఐ మార్కెట్లోకి వేగంగా దూసుకెళ్లేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.జుకర్ బర్గ్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. వ్యాపార సంస్థల కోసం ప్రత్యేకంగా రూపొందించే ఏఐ బిజినెస్ ఏజెంట్లు, ఏపీఐల ద్వారా టెక్ సేవలు అందించడం, తమ అధునాతన డేటా సెంటర్లలోని అదనపు కంప్యూటింగ్ సామర్థ్యాన్ని నేరుగా విక్రయించడం వంటి మూడు ప్రధాన మార్గాల్లో బిజినెస్-టు-బిజినెస్ విభాగాన్ని విస్తరిస్తున్నారు. ఇప్పటికే వాట్సాప్, మెసెంజర్ ప్లాట్‌ఫారమ్‌లలో 10 లక్షలకు పైగా వ్యాపార సంస్థలు మెటా ఏఐ ఏజెంట్లను కస్టమర్ సర్వీస్, విక్రయాల కోసం ఉపయోగిస్తున్నాయని, త్వరలోనే ఈ సదుపాయాన్ని ఇన్ స్టాగ్రామ్‌కు కూడా వర్తింపజేస్తున్నామని ఆయన తెలిపారు.మరోవైపు, ఏఐ మౌలిక వసతుల కల్పనకు మెటా భారీగా ఖర్చు చేస్తోంది. 2026 నాటికి తమ మూలధన వ్యయం అంచనాలను 130 బిలియన్ డాలర్ల నుంచి 145 బిలియన్ డాలర్లకు పెంచినట్లు కంపెనీ ప్రకటించింది. బిలియన్ల కొద్దీ వినియోగదారులకు పర్సనల్ ఏఐ అసిస్టెంట్లను అందించడంతో పాటు పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా క్లౌడ్ మౌలిక వసతులను కల్పించడమే తమ లక్ష్యమని జుకర్ బర్గ్ చెప్పారు. అమెజాన్ ఏడబ్ల్యూఎస్, మైక్రోసాఫ్ట్ అజూర్ వంటి దిగ్గజాలకు పోటీగా మెటా సొంత క్లౌడ్ సేవలను విస్తరించే ఆలోచనలో ఉంది.ఈ త్రైమాసికంలో మెటా ఆదాయం 28 శాతం పెరిగి 60.8 బిలియన్ డాలర్లకు చేరినప్పటికీ ఏఐ పరిశోధనలు, సూపర్ కంప్యూటింగ్ మౌలిక వసతులకై చేసిన వ్యయం గణనీయంగా పెరిగింది. స్వల్పకాలిక లాభాల కంటే భవిష్యత్తు సాంకేతిక ఆధిపత్యమే ముఖ్యమని విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సాంకేతిక రంగాన్ని నడిపించే తదుపరి ప్రధాన శక్తి వ్యాపార స్థాయి ఏఐ సాధనాలేనని మెటా ప్రతిపాదనలు స్పష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్‌లో మార్పులు -
నో ఐఐటీ/ఎన్ఐటీ, 27 యూనివర్సిటీల నుంచి తిరస్కరణ..కట్‌చేస్తే..
తిరస్కరణలనేవి మనిషి జీవితంలో కామన్. వాటిని దాటుకుని వెళ్తేనే జీవితం. అంటుంటారు సైకాలజీ నిపుణులు. నిజానికి మనం ఒక్క రిజెక్ట్ వస్తేనే కుదేలైపోతాం. కానీ ఈ టెకీకి అడగడుగున తిరస్కరణలే. కనీసం ఏది కూడా పదికి పైగా రిజెక్ట్‌లు ఎదుర్కొంటే గానీ సక్సెస్ పలకరించలేదు. ఇవాళ ఆ వ్యక్తి మెటా ఆర్టిఫియల్ ఇంటెలిజిన్స్లో కీలక పాత్రపోషించే స్థాయికి చేరుకున్నాడు.అతడే తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన టెకీ సౌమిత్ చింతల. ఐఐటీ లేదా ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక కాలేజ్‌లో చదవలేదు. కనీసం ఇంట్లో కంప్యూటర్ కూడా లేకుండా పెరిగాడు. ఆయన 2009లో విట్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత యూఎస్ ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటే..పదే పదే తిరస్కరణలు ఎదుర్కొన్నాడు. మొత్తం 27 యూనివర్సిటీల నుంచి తిరస్కరణ ఎదుర్కొన్నాడు. చివరికి న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం సంపాదించాడు. అక్కడ లెర్నింగ్ పరిశోధకుడు యాన్ లెకన్ వద్ద పనిచేశాడు. ఈ అనుభవం అతనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడింది. ఆ స్కిల్‌తో 2014లో, మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధన విభాగంలో చేరాడు. ఆ కంపెనీలో ఉన్న సమయంలో, అతను పైటార్చ్ (PyTorch) అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు. పైటార్చ్ అనేది ఒక ఓపెన్-సోర్స్ మెషిన్ లెర్నింగ్ ఫ్రేమ్‌వర్క్, ఇది AI పరిశోధన, అభివృద్ధిలో విస్తృతంగా ఉపయోగించబడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీలు , అధునాతన కంప్యూటింగ్ సిస్టమ్‌లపై పనిచేస్తున్న కంపెనీలతో సహా, ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు, డెవలపర్లు, సంస్థలు ఇప్పుడు పైటార్చ్ను ఉపయోగిస్తున్నాయి.రాబోయే ఎనిమిది సంవత్సరాలలో, పైటార్చ్ను ఒక అంతర్గత పరిశోధనా ప్రాజెక్ట్ నుంచి అత్యంత విస్తృతంగా ఆమోదించబడిన AI ఫ్రేమ్‌వర్క్‌లలో ఒకటిగా ఎదగడంలో చింతల కీలక పాత్ర పోషించారు. ఈ ప్లాట్‌ఫారమ్ ప్రపంచవ్యాప్తంగా మెషిన్ లెర్నింగ్ పరిశోధకులకు ,డెవలపర్లకు ఒక ప్రధాన సాధనంగా మారింది.మెటాలో సుమారు 11 ఏళ్ల పదవీకాలంలో, సౌమిత్ ఎల్4 సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్థాయి నుంచి కంపెనీలో ఒక సీనియర్ టెక్నికల్ లీడర్షిప్ పదవి అయిన వైస్ ప్రెసిడెంట్ అండ్ మెటా ఫెలోగా ఎదిగారు. ఆ తర్వాత ఆయన మెటాను విడిచిపెట్టి, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ అయిన థింకింగ్ మెషీన్స్ ల్యాబ్‌లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా చేరారు.(చదవండి: -
మోదీకి మెటా క్షమాపణలు.. మోదీ వీడియో డిలీట్.. అసలు కారణమిదే!
-
మోదీ సెల్ఫీ వీడియో తొలగింపుపై మెటా వివరణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెల్ఫీ వీడియోలు సోషల్ మీడియాలో ఎంత ప్రభంజనం సృష్టించాయో తెలిసిందే. రికార్డు స్థాయి వ్యూస్, లైక్స్, కామెంట్లు వచ్చాయి వాటికి. అయితే ఫేస్బుక్ నుంచి ఆ వీడియోలు కాసేపు కనిపించకుండా పోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకు తొలగించారంటూ ఫేస్‌బుక్‌పై నెటిజన్లు మండిపడ్డారు. అయితే ఈ ‘తాత్కాలిక’ వ్యవహారంపై మెటా వివరణ ఇచ్చింది. ఆ వీడియోను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెబుతూ.. దాన్ని పునరుద్ధరించామని కూడా వెల్లడించింది.నీట్ వివాదంపై కొనసాగిన విద్యార్థుల ఉద్యమం నేపథ్యంలో ప్రధాని మోదీ జులై 23న ఫేస్బుక్లో ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. జెన్ జీ విద్యార్థులతో మోదీ చేసిన తొలి ప్రత్యక్ష సంభాషణగా ఈ వీడియోకు భారీ స్పందన వచ్చింది.అయితే జులై 28 తెల్లవారుజామున కొంతసేపు ఈ వీడియో భారతీయ వినియోగదారులకు అందుబాటులో లేకుండా పోయింది. వీడియో స్థానంలో ‘‘చట్టపరమైన అభ్యర్థన కారణంగా మీ ప్రాంతంలో ఈ మీడియా అందుబాటులో లేదు’’ అనే సందేశం కనిపించింది. దీంతో రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.మెటా ఏమంది?వీడియో తొలగింపుపై వివరణ ఇచ్చిన మెటా.. ఇది ఉద్దేశపూర్వక చర్య కాదని స్పష్టం చేసింది. పొరపాటున వీడియోను పరిమితం చేశామని, గుర్తించిన వెంటనే దాన్ని పునరుద్ధరించామని తెలిపింది. వీడియోను తొలగించడానికి కారణమైన ప్రక్రియలో తప్పిదం జరిగిందని, వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని మెటా పేర్కొంది.భగ్గుమన్న బీజేపీ, అభిమానులుప్రధాని మోదీ అధికారిక ఖాతాలో ఉన్న వీడియోను ఫేస్బుక్ పరిమితం చేయడంపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. కోట్లాది మంది భారతీయులకు చేరాల్సిన ప్రధానమంత్రి సందేశాన్ని ఒక సోషల్ మీడియా సంస్థ ఎలా అడ్డుకుంటుందని ప్రశ్నించారు. బీజేపీ సోషల్ మీడియా విభాగానికి చెందిన నేతలు మెటాను ట్యాగ్ చేస్తూ పారదర్శకత, జవాబుదారీతనంపై ప్రశ్నలు లేవనెత్తారు. కంటెంట్ నియంత్రణ పేరుతో రాజకీయ పక్షపాతం చూపుతున్నారా? అనే చర్చకు ఈ ఘటన కారణమైంది.జెన్ జీ ఉద్యమం సమయంలో వీడియోనీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై దేశవ్యాప్తంగా సాగిన విద్యార్థుల నిరసనల సమయంలో ప్రధాని మోదీ ఈ వీడియో విడుదల చేశారు. పేపర్ లీక్‌లను అరికట్టేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని, పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ వీడియోకు భారీగా వ్యూస్ రావడంతో పాటు యువతలో చర్చకు దారితీసింది. ఇలాంటి సమయంలో వీడియో తాత్కాలికంగా కనిపించకుండా పోవడం మరింత ఆసక్తిని రేపింది.వివాదం టు వివరణ వరకుసోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ.. ఇన్నేళ్లలో పోస్ట్ చేసిన తొలి సెల్ఫీ వీడియో ఇదే కావడం గమనార్హం. అదీ నీట్ నిరసనలతో జెన్ జీ చేసిన ఆందోళనలపై కావడంతో ప్రపంచవ్యాప్తంగా దానిని కోట్ల మంది వీక్షించారు. అయితే ఉన్నట్లుండి ఆ వీడియో ఎందుకు తొలగించబడిందన్న దానిపై స్పష్టత లేకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. చట్టపరమైన అభ్యర్థన కారణమా? అనే ప్రశ్నా తలెత్తింది. అయితే మెటా తాజాగా ఇచ్చిన వివరణతో ఇది సాంకేతిక పొరపాటేనని తేలింది. ప్రస్తుతం ప్రధాని మోదీ వీడియో మళ్లీ ఫేస్బుక్లో అందుబాటులోకి వచ్చింది.మెటాకు కేంద్రం నోటీసులుమెటా క్షమాపణలు చెప్పినప్పటికీ.. కేంద్రం మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్బుక్ వీడియో తొలగింపు వ్యవహారంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) స్పందించింది. ఈ అంశంపై వివరణ కోరుతూ మెటా గ్లోబల్ హెడ్ ఆఫ్ పబ్లిక్ పాలసీకి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. -
కొత్త ఏఐ టూల్‌ను నిలిపేసిన మెటా
శాన్ఫ్రాన్సిస్కో: పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ చిత్రాలను ఆటోమేటిక్‌గా యాక్సెస్ చేసే కృత్రిమ మేధ(ఏఐ) టూల్లోని ఒక ఫీచర్‌ను ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌ల మాతృసంస్థ ‘మెటా’ నిలిపివేసింది. ఏఐతో చిత్రాలను సృష్టించడానికి ప్రజల ఇన్స్టాగ్రామ్ ఖాతాలను ఒక ముడిసరుకుగా వాడుకుంటోందని ఆ సంస్థపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రజలకు ఉపయోగకరమైన ఒక సృజనాత్మక సాధనాన్ని అందించడం, అలాగే వారి పబ్లిక్ కంటెంట్‌ను ఈ విధంగా వాడుకోవచ్చా లేదా అనే దానిపై అందరికీ అవగాహన కల్పించడమే తమ ఉద్దేశమని మెటా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త ఫీచర్ ఆశించిన స్థాయిలో లేదని అభిప్రాయం రావడంతో దీనిని ఇకపై అందుబాటులో ఉంచడం లేదని పేర్కొంది. మెటా సంస్థ వారం రోజుల క్రితం ‘మ్యూజ్ ఇమేజ్’ పేరిట కొత్త ఏఐ టూల్‌ను తీసుకొచ్చింది. చిత్రాలను రూపొందించే సామర్థ్యం ఉన్న ఇతర ఏఐ యాప్‌ల మాదిరిగానే మ్యూజ్ ఇమేజ్ వినియోగదారుల సూచనల ఆధారంగా చిత్రాలను సృష్టిస్తుంది. కొత్త చిత్రాలను సృష్టించేటప్పుడు రిఫరెన్స్‌గా ఉపయోగపడటానికి అన్ని పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్ చేసిన ఫొటోలను ఈ టూల్ స్వయంచాలకంగా ఉపయోగించుకునేలా రూపొందించారు. ఇది ప్రజల గోప్యతకు భంగం కలిగిస్తోందని ఆరోపణలు వచ్చాయి. -
మెటా, గూగుల్‌కు రూ.50 కోట్ల జరిమానా!
సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ)కు అమెరికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చిన్నతనంలో సోషల్ మీడియాకు బానిస కావడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నదంటూ ఒక 20 ఏళ్ల యువతి దాఖలు చేసిన కేసులో జ్యూరీ ఇచ్చిన తీర్పుపై మెటా తాజా అప్పీల్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. లాస్ ఏంజెల్స్ కౌంటీ సుపీరియర్ కోర్టులో మెటా న్యాయవాదులు అధికారికంగా అప్పీల్ నోటీసును దాఖలు చేశారు.అసలేమిటీ కేసు? బాధితురాలి ఆరోపణలు ఏంటి?ప్రస్తుతం 20 ఏళ్ల వయసున్న కేలీ అనే యువతి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. తను చిన్నతనంలో ఉన్నప్పుడే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు తీవ్రంగా బానిసయ్యానని, దీనివల్ల తను తీవ్రమైన ఆందోళన (యాంగ్జైటీ), డిప్రెషన్, బాడీ డిస్మోర్ఫియా (శరీర ఆకృతిపై తీవ్రమైన అసంతృప్తి) వంటి మానసిక సమస్యలను ఎదుర్కొన్నట్లు ఆమె కోర్టుకు తెలిపింది.టెక్ కంపెనీలు తమ యాప్‌ల్లో వాడే కొన్ని ప్రత్యేక ఫీచర్ల ద్వారా చిన్న పిల్లలను ఉద్దేశపూర్వకంగానే వ్యసనపరులుగా మారుస్తున్నాయని ఆమె తరఫు న్యాయవాదులు బలంగా వాదించారు. ప్రధానంగా కొన్ని ఫీచర్ల రూపకల్పనపై కోర్టులో చర్చ జరిగింది.ఇన్ఫినిట్ స్క్రోలింగ్: యూజర్లు నిరంతరాయంగా కంటెంట్ చూస్తూనే ఉండేలా పేజీలకు ముగింపు లేకుండా డిజైన్ చేయడం.ఆటోప్లే ఫంక్షన్: ఒక వీడియో ముగియగానే మరో వీడియో ఆటోమేటిక్‌గా ప్లే అయ్యేలా చేయడం.అల్గారిథమిక్ రికమండేషన్స్: యూజర్ల ప్రవర్తనను బట్టి మరింత వ్యసనకరమైన కంటెంట్‌ను వారి ముందుకు తీసుకురావడం.సంచలన తీర్పు.. 6 మిలియన్ డాలర్ల జరిమానాఈ ఏడాది మార్చి (2026)లో ఈ కేసును విచారించిన లాస్ ఏంజెల్స్ జ్యూరీ మెటా, గూగుల్ (యూట్యూబ్) సంస్థలు తమ ప్లాట్‌ఫారమ్‌ల రూపకల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయని నిర్ధారించింది. బాధితురాలి మానసిక స్థితి క్షీణించడానికి ఈ కంపెనీల యాప్ డిజైన్లే ప్రధాన కారణమని పేర్కొంటూ మొత్తంగా 6 మిలియన్ డాలర్ల (సుమారు రూ.50 కోట్లు) పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. ఇందులో మెటా 4.2 మిలియన్ డాలర్లు, గూగుల్ 1.8 మిలియన్ డాలర్లు చొప్పున బాధ్యత వహించాలని కోర్టు స్పష్టం చేసింది. దీనిపై టెక్ కంపెనీలు దాఖలు చేసిన ‘జడ్జ్మెంట్ నాట్‌విత్‌స్టాండింగ్ ద వర్డిక్ట్’ (తీర్పును కొట్టివేయాలనే అభ్యర్థన) పిటిషన్లను ట్రయల్ జడ్జ్ కరోలిన్ బి.కుహ్ల్ జూన్ ప్రారంభంలో తిరస్కరించడంతో మెటా ఇప్పుడు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.మెటా వాదన.. టెక్ కంపెనీల రక్షణ కవచంఅప్పీలుపై మెటా ప్రతినిధి స్పందిస్తూ.. ‘టీనేజర్ల మానసిక ఆరోగ్యం అనేది ఎంతో సంక్లిష్టమైన అంశం. దీన్ని కేవలం ఒక యాప్‌తో మాత్రమే ముడిపెట్టలేము. ఆన్లైన్లో యువత రక్షణ కోసం మేము అనేక చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. గూగుల్ ప్రతినిధి కూడా తాము అప్పీల్ చేయనున్నట్లు తెలిపారు. సాధారణంగా అమెరికాలోని ‘కమ్యూనికేషన్స్ డిసెన్సీ యాక్ట్ - సెక్షన్ 230’ ప్రకారం, థర్డ్-పార్టీ యూజర్లు పోస్ట్ చేసే కంటెంట్‌కు టెక్ కంపెనీలు చట్టపరంగా బాధ్యులు కావు. అయితే, ఈ కేసులో న్యాయవాదులు కంటెంట్‌ను కాకుండా టెక్ కంపెనీలు రూపొందించిన యాప్ డిజైన్ (వ్యసనకరమైన ఫీచర్లు) లోపభూయిష్టంగా ఉందంటూ పట్టుబట్టడం విశేషం.ఈ కేసు కేవలం ఒక యువతికి సంబంధించినది కాదు. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా సోషల్ మీడియా సంస్థలపై దాదాపు 10,000 కంటే ఎక్కువ వ్యక్తిగత కేసులు, సుమారు 800 స్కూల్ డిస్ట్రిక్ట్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఈ అప్పీల్ తీర్పు భవిష్యత్తులో సోషల్ మీడియా నియంత్రణలపై, అలాగే కంపెనీల యాప్ డిజైన్ విధానాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. భవిష్యత్తులో పిల్లల కోసం సోషల్ మీడియా యాప్స్‌లో భారీ మార్పులు వచ్చేందుకు ఇది ఒక మైలురాయిగా మారే అవకాశం ఉంది.ఇదీ చదవండి: నిప్పుల కొలిమిలో నగరాలు -
‘పిల్లలను లక్ష్యంగా చేసుకున్నామనడం తప్పు’
ఇన్స్టాగ్రామ్ వేదికగా పెయిడ్ ప్రకటనల ద్వారా ‘చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లోయిటేటివ్ అండ్ అబ్యూజ్ మెటీరియల్’ (సీఎస్ఈఏఎం) ప్రచారమవుతోందన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మైటీ) మెటా సంస్థకు నోటీసులు జారీ చేసింది. అయితే, పిల్లలపై అనుచిత ఆసక్తి ఉన్నవారిని (పెడోఫైల్స్) లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా పిల్లల కంటెంట్‌తో కూడిన ప్రకటనలను అనుమతించామనడం పూర్తిగా తప్పు అని మెటా స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర నోటీసులకు స్పందిస్తూ కంపెనీ ఒక అధికారిక బ్లాగ్ పోస్ట్‌ను విడుదల చేసింది.ఆరోపణలను తోసిపుచ్చిన మెటాప్రభుత్వ ఆందోళనలను తాము అత్యంత తీవ్రంగా పరిగణిస్తామని, తమ ప్లాట్‌ఫారమ్‌లపై ఇలాంటి హేయమైన కంటెంట్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని మెటా స్పష్టం చేసింది. ‘పిల్లలపై వేధింపులకు వ్యతిరేకంగా ఉన్న మా విధానాలను ఉల్లంఘిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ప్రకటనలపై కథనాలు మా దృష్టికి వచ్చాయి. దీనికి పూర్తి విరుద్ధంగా.. పిల్లలకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలను చూపే ఖాతాలను గుర్తించడానికి మేము అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం. గత ఏడాది కాలంలో ఇలాంటి 4 మిలియన్లకు (40 లక్షలు) పైగా ఖాతాలను ఆటోమేటిక్‌గా తొలగించాం’అని మెటా బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.భారతదేశంలో గడచిన ఆరు నెలల్లోనే అనుమానాస్పద లింకులు, పిల్లల దోపిడీ సంకేతాలను గుర్తించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను ఉపయోగించి 1.60 లక్షల ఖాతాలను తొలగించినట్లు కంపెనీ వెల్లడించింది.ఏడు రోజుల్లో నివేదిక ఇవ్వాలన్న కేంద్రంగత శుక్రవారం (జులై 4) కేంద్ర ఐటీ శాఖ మెటాకు నోటీసులు జారీ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో సీఎస్ఈఏఎం కంటెంట్‌కు అవకాశం కల్పించేలా ఉండే ప్రకటనలను, కంటెంట్‌ను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. అంతేకాకుండా, ఈ వ్యవహారంపై ఏడు రోజుల్లోగా సమగ్ర వివరణాత్మక నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన మెటా.. ఈ వ్యవహారం తమ దృష్టికి రాకముందే తమ నిఘా వ్యవస్థలు సదరు ఉల్లంఘన ప్రకటనలను, వాటి వెనుక ఉన్న ఖాతాలను గుర్తించి నిలిపివేశాయని తెలిపింది. అనంతరం జరిపిన అంతర్గత దర్యాప్తులో మరికొన్ని ప్రకటనలను తొలగించి ఖాతాలను రద్దు చేయడంతో పాటు ఆ కంటెంట్‌కు సంబంధించిన యూఆర్ఎల్లను కూడా బ్లాక్ చేసినట్లు పేర్కొంది.నేరస్థులతో నిరంతర యుద్ధంప్రపంచవ్యాప్తంగా తమకున్న 3.5 బిలియన్ల (350 కోట్లు) వినియోగదారుల్లో దాక్కుని తమ నిఘా నేత్రం నుంచి తప్పించుకోవాలని చూసే నేరస్థులతో ఇది నిరంతర యుద్ధమని మెటా వ్యాఖ్యానించింది. పిల్లల దోపిడీకి సంబంధించి తొలగించిన కంటెంట్‌తో పాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ నుంచి 40 లక్షలకు పైగా అనుమానాస్పద ఖాతాలను తొలగించామని తెలిపింది.భారతదేశంలో చట్టాల అమలు తీరును వివరిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా పిల్లల దోపిడీ ఉదంతాలు వెలుగుచూసినప్పుడు వర్తించే చట్టాల ప్రకారం అమెరికాకు చెందిన ‘నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ ప్లోయిటెడ్ చిల్డ్రన్’ (ఎన్‌సీఎంఈసీ)కు నివేదిస్తామని మెటా పేర్కొంది. భారతదేశంలో లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, 2021, ఐటీ నిబంధనల ప్రకారం.. ఎన్‌సీఎంఈసీ ద్వారా భారత జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఈ సమాచారాన్ని మెటా తరపున నివేదిస్తామని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే.. -
వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం నజర్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రతిపాదిత ‘యూజర్ నేమ్’ ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం, మెటా సంస్థల మధ్య చర్చలు ముమ్మరమయ్యాయి. ఈ సరికొత్త ఫీచర్‌పై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) వివరణ కోరిన నేపథ్యంలో, మెటా ప్రతినిధులు శుక్రవారం ప్రభుత్వ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ఈ భేటీలో ప్రభుత్వ అధికారులు తమకున్న పలు ఆందోళనలను మెటా బృందం ముందు ఉంచారు. అలాగే, గతంలో ఆదేశించినట్లుగానే మూడు రోజుల్లోగా దీనిపై సమగ్రమైన, వివరణాత్మక ప్రతిస్పందనను సమర్పించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా కంపెనీ తన అధికారిక సమాధానాన్ని అందిస్తుందని నమ్మదగిన వర్గాలు వెల్లడించాయి.కేంద్రం నోటీసులు.. నిలిచిపోయిన రోల్అవుట్ఈ వారం ప్రారంభంలోనే వాట్సాప్‌లో యూజర్ నేమ్‌ల రోల్ అవుట్ ప్రక్రియపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం మెటా సంస్థకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంతో పూర్తిస్థాయి చర్చలు ముగిసి అన్ని అనుమానాలు నివృత్తి అయ్యే వరకు ఈ ఫీచర్‌ను భారతదేశంలో విడుదల చేయవద్దని కేంద్రం కంపెనీని కరాఖండిగా ఆదేశించింది. ప్రధానంగా సైబర్ భద్రత, వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఫీచర్ ఆన్లైన్ మోసాలకు, గోప్యతా ఉల్లంఘనలకు దారితీసే అవకాశం ఉందని పలువురు నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అసలు ఏంటి ఈ యూజర్ నేమ్ ఫీచర్?వినియోగదారుల పేర్లు ‘@’ చిహ్నంతో ప్రారంభమయ్యే ఒక ప్రత్యేకమైన ఐడెంటిఫైయర్‌గా ఉంటాయి. ఇది పూర్తిగా ఐచ్ఛికం (ఆప్షనల్). ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ వ్యక్తిగత మొబైల్ నంబర్లను ఇతరులతో షేర్ చేయకుండానే మెసేజ్‌లు లేదా కాల్స్ రిసీవ్ చేసుకోగలుగుతారు. యూజర్ ప్రొఫైల్స్‌లో కనిపించే సాధారణ డిస్ ప్లే పేర్ల కంటే ఈ ‘యూజర్ నేమ్’లు భిన్నంగా ఉంటాయి. డిస్ ప్లే పేర్లు ప్రత్యేకంగా ఉండాల్సిన పనిలేదు, కానీ యూజర్ నేమ్స్ మాత్రం ఒక్కొక్కరికి యూనిక్‌గా ఉంటాయి. మీ ఫోన్ నంబర్ సేవ్ చేయని వ్యక్తులకు డైరెక్ట్ మెసేజ్‌లు, కాల్స్, గ్రూప్ చాట్లలో డిఫాల్ట్‌గా మీ ‘యూజర్ నేమ్’ మాత్రమే కనిపిస్తుంది.ఇతరులు దుర్వినియోగం చేయకుండా లేదా క్లెయిమ్ చేయకుండా ఉండటానికి.. కొన్ని నిర్దిష్ట వినియోగదారు పేర్లను వ్యాపారాలు, ప్రభుత్వ సంస్థలు, ప్రజా ప్రముఖులకు మెటా ముందే కొన్ని యూజర్ నేమ్‌లను కేటాయించనుంది.నిపుణుల ఆందోళనమెటా సంస్థ ఎన్ని రక్షణ చర్యలు చెప్తున్నప్పటికీ సైబర్ సెక్యూరిటీ నిపుణులు, ఇంటర్నెట్ వినియోగదారులు మాత్రం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మోసగాళ్లు ప్రముఖ వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలు లేదా ప్రభుత్వ విభాగాలను పోలి ఉండేలా నకిలీ యూజర్ నేమ్స్ సృష్టించే ప్రమాదం ఉంది. దీనివల్ల సాధారణ ప్రజలు సులభంగా మోసపోయే అవకాశం ఉంది’ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన నోటీసుకు మెటా ఇచ్చే సమాధానం, ప్రస్తుతం జరుగుతున్న సంప్రదింపుల ఫలితం ఆధారంగానే.. భారతదేశంలో ఈ వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్ అసలు ప్రారంభమవుతుందా లేదా? ఒకవేళ వస్తే ఎప్పుడు వస్తుంది? అనేది తేలనుంది.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి! -
ఇన్స్టాగ్రామ్ ప్రకటనలపై కేంద్రం సీరియస్!
కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై అభ్యంతరకరమైన, చట్టవిరుద్ధమైన కంటెంట్‌పై కఠిన వైఖరి అవలంబిస్తోంది. ముఖ్యంగా చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన ప్రకటనలు కనిపిస్తున్నాయనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం.. మెటాను వివరణ ఇవ్వాలని కోరింది.ఈ విషయంపై సమాచార సాంకేతిక (ఐటీ) శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులకు మెటా ప్రతినిధులను పిలిపించి వివరణ కోరాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై మెటా నుంచి పూర్తి వివరాలు తెలుసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ లేదా అలాంటి ప్రకటనలు సోషల్ మీడియా వేదికల్లో ఉండటం చాలా తీవ్రమైన అంశంగా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ వారం మెటాపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఇది రెండోసారి. ఇటీవల వాట్సాప్‌లో యూజర్‌నేమ్ ఫీచర్ తీసుకురావాలన్న మెటా నిర్ణయంపై కూడా కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.ప్రభుత్వం అభిప్రాయం ప్రకారం ఈ ఫీచర్ అమల్లోకి వస్తే.. ఆన్లైన్ మోసాలు పెరిగే అవకాశం ఉంది. ఫిషింగ్ దాడులు ఎక్కువ కావచ్చు. డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగే మోసాలు పెరిగే ప్రమాదం ఉంది. ఇతరుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించడం సులభమవుతుంది. ఈ కారణాల వల్ల ప్రభుత్వంతో సంప్రదింపులు పూర్తయ్యే వరకు ఆ ఫీచర్‌ను అమలు చేయవద్దని కేంద్రం మెటాకు నోటీసులు జారీ చేసింది.భారత ఐటీ చట్టం ప్రకారం వాట్సాప్ వంటి పెద్ద సోషల్ మీడియా సంస్థలు వినియోగదారుల భద్రతకు సంబంధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. అక్రమ కంటెంట్‌ను అరికట్టడం, వినియోగదారుల భద్రతను కాపాడడం వంటి అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయా సంస్థలపై ఉంటుంది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఐటీ చట్టం కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం మెటాకు హెచ్చరించింది. -
కేంద్రం ఆందోళనలపై స్పందించిన వాట్సాప్
వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌ను ఇతరులతో పంచుకోకుండా కేవలం యూజర్నేమ్తోనే వాట్సాప్‌లో చాట్ ప్రారంభించేలా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు మెటా సిద్ధమవుతోంది. వ్యక్తిగత గోప్యతను మరింత బలోపేతం చేయడమే ఈ ఫీచర్ ఉద్దేశమని కంపెనీ చెబుతోంది. అయితే ఈ వ్యవస్థను సైబర్ నేరాలకు దుర్వినియోగం చేసే అవకాశం ఉందంటూ కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన ఆందోళనలు, నోటీసులు పంపిన నేపథ్యంలో.. వాట్సాప్ తొలిసారిగా స్పందించింది.ఈ ఫీచర్‌ను సైబర్ నేరాలకు ఉపయోగించే అవకాశం ఉందన్న అనుమానాలను మెటా తోసిపుచ్చింది. ప్రముఖులు, ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, సెలబ్రిటీల పేర్లను ఎవరూ దుర్వినియోగం చేయలేరని స్పష్టం చేసింది. అలాంటి పేర్లను ముందుగానే రిజర్వ్ చేసినట్లు, వాటిని నిజమైన యజమానులు మాత్రమే ఉపయోగించుకునేలా ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.వాట్సాప్ ప్రతినిధి ఒకరు ఎన్డీటీవీ ప్రాఫిట్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో యూజర్‌నేమ్ ఫీచర్‌పై పలు కీలక వివరాలు వెల్లడించారు. మొబైల్ నంబర్‌ను ఇతరులకు వెల్లడించకుండా సంభాషణలు ప్రారంభించేలా ఈ ఫీచర్‌ను రూపొందించామని తెలిపారు. అయితే వాట్సాప్ ఖాతాను ఉపయోగించాలంటే ఫోన్ నంబర్ మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.యూజర్‌నేమ్‌ల విషయంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు వాట్సాప్ తెలిపింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు, ప్రముఖులు, సెలబ్రిటీల పేర్లను ముందుగానే రిజర్వ్ చేసినట్లు వెల్లడించింది. అంతేకాదు, వారి పేర్లను పోలి ఉండే యూజర్‌నేమ్‌లను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని పేర్కొంది. దీంతో ప్రముఖుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి ప్రజలను మోసం చేసే అవకాశాన్ని గణనీయంగా తగ్గించవచ్చని కంపెనీ చెబుతోంది.అంతేకాదు, నకిలీ ఖాతాలు, ఇంపర్సనేషన్, ఫిషింగ్ వంటి మోసాలను గుర్తించే ప్రత్యేక వ్యవస్థలను కూడా అభివృద్ధి చేసినట్లు తెలిపింది. కొత్తగా సృష్టించిన ఖాతాలు ఒకేసారి ఎక్కువ మందిని సంప్రదించకుండా పరిమితులు ఉంటాయని, ఇతరుల యూజర్‌నేమ్‌లను ఊహించి వెతికే ప్రయత్నాలను కూడా అడ్డుకుంటామని వివరించింది. యూజర్‌నేమ్ ద్వారా సందేశం వచ్చినప్పుడు ఆ ఖాతా కొత్తదా? ఇప్పటికే కాంటాక్ట్‌లో ఉందా? ఉమ్మడి గ్రూపులు ఉన్నాయా? ఏ దేశానికి చెందినది? వంటి వివరాలు కూడా వినియోగదారుడికి కనిపించేలా వ్యవస్థను రూపొందించినట్లు తెలిపింది.అలాగే, యూజర్‌నేమ్ ఫీచర్‌ను ఇంకా పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురాలేదని వాట్సాప్ స్పష్టం చేసింది. ప్రస్తుతం దీనిని దశలవారీగా పరీక్షిస్తున్నామని, కొంతమంది వినియోగదారులకు యూజర్‌నేమ్‌ను ఎంపిక చేసుకునే అవకాశం మాత్రమే కల్పించామని తెలిపింది. ఇదిలా ఉండగా, ఈ ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మొబైల్ నంబర్‌ను దాచిపెట్టి యూజర్‌నేమ్‌తో చాట్ చేసే అవకాశం రావడం వల్ల ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు లేదంటే విశ్వసనీయ సంస్థల పేర్లను పోలిన యూజర్‌నేమ్‌లతో నకిలీ ఖాతాలు సృష్టించి ఫిషింగ్, ఆన్లైన్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు, ఇంపర్సనేషన్ దాడులు పెరిగే ప్రమాదం ఉందని కేంద్రం అభిప్రాయపడింది.ఈ నేపథ్యంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) మెటాకు నోటీసులు జారీ చేసింది. యూజర్‌నేమ్ ఫీచర్‌కు సంబంధించి అమలు చేసిన భద్రతా చర్యలు ఏమిటి? మోసాలను ఎలా అడ్డుకుంటారు? అనే అంశాలపై మూడు రోజుల్లోగా పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సంప్రదింపుల ప్రక్రియ పూర్తయ్యే వరకు భారత్‌లో ఈ ఫీచర్‌ను అమలు చేయొద్దని కూడా సూచించినట్లు తెలుస్తోంది.మెటా నుంచి వచ్చే వివరణను పరిశీలించిన అనంతరం, భద్రతా అంశాలపై మరిన్ని సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో భారత్‌లో వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్ అమలుపై ప్రస్తుతం కేంద్రం నిర్ణయమే కీలకంగా మారింది. -
వాట్సాప్ యూజర్‌నేమ్ వ్యవహారం.. కేంద్రం నోటీసులు
మొబైల్ నంబర్‌ను వెల్లడించకుండా వాట్సాప్‌లో సంభాషణలు ప్రారంభించేలా రూపొందించిన ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ కొత్త వ్యవస్థ సైబర్ నేరాలు, ఫిషింగ్, ఇంపర్సనేషన్, ‘డిజిటల్ అరెస్ట్’ తరహా మోసాలకు అవకాశం కల్పించే ప్రమాదం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ ఫీచర్‌పై నియంత్రణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) భారత కార్యకలాపాలకు సంబంధించిన వాట్సాప్ చీఫ్ కంప్లయన్స్ అధికారికి పంపిన లేఖలో, యూజర్‌నేమ్ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌కు బదులుగా ప్రత్యేక యూజర్‌నేమ్‌ను ఉపయోగించి కొత్త వ్యక్తులతో చాట్ ప్రారంభించవచ్చు. పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత మొదటిసారి సంప్రదించే వారికి ఫోన్ నంబర్ కనిపించకుండా ఉండేలా ఈ వ్యవస్థ రూపొందించారు. అదనపు భద్రత కోసం ఐచ్ఛికంగా ‘యూజర్‌నేమ్ కీ’ని కూడా సెట్ చేసుకునే అవకాశం ఉంటుందని వాట్సాప్ వెల్లడించింది.అయితే, ఈ ఫీచర్‌ను సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు లేదా ప్రముఖుల పేర్లను పోలిన యూజర్‌నేమ్‌లతో నకిలీ ఖాతాలు సృష్టించి ప్రజలను మోసగించే ప్రమాదం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే దేశంలో పెరుగుతున్న ఆన్లైన్ మోసాల దృష్ట్యా ఈ ఫీచర్‌ను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని కేంద్రం స్పష్టం చేసింది.తాజా పరిణామాల ప్రకారం, సంప్రదింపుల ప్రక్రియ పూర్తయ్యే వరకు భారత్‌లో యూజర్‌నేమ్ ఫీచర్‌ను అమలు చేయవద్దని కూడా మెటాకు కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. మెటా నుంచి వచ్చే వివరణను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి -
ఇక ఫోన్లతో పనిలేదు.. కళ్లద్దాలతోనే కాల్స్, ట్రాన్స్‌లేషన్స్!
న్యూఢిల్లీ: స్మార్ట్ గ్లాసెస్ ప్రపంచంలోకి టెక్నాలజీ దిగ్గజం ‘మెటా’ సరికొత్త విప్లవాన్ని తీసుకువచ్చింది. ప్రముఖ ఐవేర్ బ్రాండ్స్ ఎస్సిలార్లక్సోటికా (రే-బాన్, ఓక్లీల మాతృసంస్థ) భాగస్వామ్యంతో సరికొత్త ‘మెటా గ్లాసెస్’ను మార్కెట్లోకి విడుదల చేసింది. స్టైల్, అత్యాధునిక టెక్నాలజీల కలయికగా రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్ గ్లాసెస్, వినియోగదారులకు సరికొత్త డిజిటల్ అనుభూతిని పంచేందుకు సిద్ధమయ్యాయి.మ్యూజ్ స్పార్క్ ఏఐ, అద్భుతమైన లైవ్ ట్రాన్స్లేషన్ఈ స్మార్ట్ గ్లాసెస్ కేవలం ఫోటోలు తీయడానికే పరిమితం కాకుండా, మెటాకు చెందిన సరికొత్త ‘మ్యూజ్ స్పార్క్ ఏఐ’ అసిస్టెంట్‌తో పని చేస్తాయి. మీరు దేనినైనా చూస్తున్నప్పుడు, దాని గురించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, మీ దైనందిన పనులను మేనేజ్ చేయడం వంటివి హ్యాండ్స్-ఫ్రీగా చేస్తుంది. ఇందులో ఉన్న అద్భుతమైన లైవ్ ట్రాన్స్లేషన్ ఫీచర్ ద్వారా హిందీ, చైనీస్, జపనీస్, జర్మన్ వంటి 20 భాషలను తక్షణమే అనువదించుకోవచ్చు. భవిష్యత్తులో నడక మార్గాన్ని చూపే పెడెస్ట్రియన్ నావిగేషన్ ఫీచర్‌ను కూడా తీసుకురానున్నట్లు సంస్థ తెలిపింది.12 ఎపీ కెమెరా.. అదిరిపోయే ఆడియో ఫీచర్స్హార్డ్వేర్ పరంగా ఇందులో 100-డిగ్రీల వైడ్ ఫీల్డ్ వ్యూ కలిగిన 12 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. దీని ద్వారా 3K రెజల్యూషన్‌తో వీడియోలు, అలాగే స్లో-మోషన్ షాట్స్ తీసుకోవచ్చు. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి శబ్దాన్ని మార్చుకునే ఓపెన్-ఇయర్ స్పీకర్లు, కాల్స్ మాట్లాడుకోవడానికి విండ్-నాయిస్ రిడక్షన్ కలిగిన ఆరు మైక్రోఫోన్లు ఇందులో ఉన్నాయి. ఈ గ్లాసెస్ సింగిల్ ఛార్జ్‌పై 8 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తాయి, ఛార్జింగ్ కేస్‌తో కలిపి మరో 40 గంటల అదనపు రన్‌టైమ్ లభిస్తుంది.ధర, లభ్యత వివరాలుఈ స్మార్ట్ గ్లాసెస్ ప్రారంభ ధర 299 యూఎస్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 28,000) గా ఉంది. క్లాసిక్ బ్లాక్, రేసింగ్ గ్రీన్, మెర్లాట్, శాండ్‌స్టోన్ వంటి ఆరు ఆకర్షణీయమైన రంగుల్లో, 26 రకాల స్టైల్ సెటప్స్‌తో ఇవి లభిస్తున్నాయి. కంటిచూపు సమస్యలు ఉన్నవారి కోసం ప్రత్యేక ప్రిస్క్రిప్షన్ లెన్స్‌ల సౌకర్యం కూడా ఉంది. ప్రస్తుతం అమెరికా, యూకే, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ గ్లాసెస్, భారతదేశంలో ఎప్పుడు విడుదలవుతాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
మెటా షాక్.. ఉద్యోగుల డేటా లీక్!
ప్రముఖ టెక్ దిగ్గజం మెటా (Meta) మరోసారి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ సమస్యల కారణంగా వార్తల్లో నిలిచింది. కంపెనీ, ఉద్యోగుల కంప్యూటర్ యాక్టివిటీని ట్రాక్ చేసి ఏఐ ట్రైనింగ్ కోసం ఉపయోగిస్తున్న ఒక ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. దీనికి కారణం.. ఉద్యోగులకు సంబంధించిన సున్నితమైన సమాచారం మొత్తం కంపెనీ అంతటా అందుబాటులోకి వచ్చినట్లు తెలియడమే.మెటా కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో తన AI సిస్టమ్స్‌ను మెరుగుపరచడానికి మోడల్ క్యాపబిలిటీ ఇనిషియేటివ్ (MCI)ను తీసుకొచ్చింది. దీనిద్వారా ఉద్యోగులు రోజూ కంప్యూటర్లో చేసే పనుల డేటాను సేకరించేవారు. ఉదాహరణకు కీబోర్డ్ టైపింగ్, మౌస్ కదలికలు, క్లిక్స్ సమాచారం వంటివి.ప్రైవేట్ చాట్స్ లీక్ఇక్కడొచ్చిన సమస్య ఏమిటంటే.. లీకైన డేటాలో ఉద్యోగుల ప్రైవేట్ చాట్స్, పనితీరుకు సంబంధించిన సమాచారం, ట్రాన్స్‌క్రిప్షన్‌లు వంటివి ఉండటం, ఇవి సంస్థలో పనిచేసే అందరికి కనిపించడం. దీంతో కంపెనీ వెంటనే ప్రాజెక్ట్‌ను ఆపేసింది. అయితే.. ఈ లీక్‌పై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కంపెనీ అధికార ప్రతినిధులు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు డేటా దుర్వినియోగం జరిగినట్లు ఆధారాలు లేవని చెప్పారు. అయినప్పటికీ పూర్తి విచారణ కోసం ప్రోగ్రామ్‌ను నిలిపివేస్తున్నామని స్పష్టం చేశారు. అయితే ఈ సమస్య సీరియస్ ఇష్యూ కేటగిరీలోకి వస్తుందని పలువురు పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ ఘటన ఉద్యోగుల్లో అసంతృప్తిని కలిగించింది. ఎందుకంటే.. మొదట ఈ డేటా పూర్తిగా సురక్షితంగా ఉంటుందని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు అది అందరికీ కనిపించడం పెద్ద తప్పిదమని వారు విమర్శించారు. కాగా.. ఇటీవల కాలంలో మెటా ఏఐ సిస్టమ్స్‌కు సంబంధించిన మరికొన్ని సెక్యూరిటీ సమస్యలు కూడా బయటపడ్డాయి. ఇందులో ఇన్స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ కావడం వంటివి ఉన్నాయి.ఏఐ ప్రాజెక్ట్ ఉద్దేశ్యంనిజానికి మెటా ఈ ఏఐ ప్రాజెక్ట్ ప్రారంభించడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. మనుషులు కంప్యూటర్ను ఎలా వాడతారో ఏఐకి నేర్పించడం. తద్వారా ఏఐ ఏజెంట్లు రోజువారీ పనుల్లో మరింత సహాయం చేయగలవు అని కంపెనీ భావించింది. కానీ ఇప్పుడు లీక్ సమస్య తెరమీదకు రావడంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది.ఇదీ చదవండి: మెటా కీలక నిర్ణయం.. భారతీయుడికి వాట్సాప్ పగ్గాలు! -
మెటా కీలక నిర్ణయం.. భారతీయుడికి వాట్సాప్ పగ్గాలు!
ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలలో ఒకటైన మెటా.. భారతీయ ఫిన్‌టెక్ సంస్థలో సుమారు 900 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 8,550 కోట్లు) పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించింది. ఈ ఒప్పందంతో పాటు క్రెడ్ ఫౌండర్ 'కునాల్ షా'ను వాట్సాప్ కొత్త అధిపతిగా నియమితులయ్యారు. ఏడేళ్లుగా ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌కు నాయకత్వం వహించిన విల్ క్యాత్‌కార్ట్ (Will Cathcart) స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు.మెటా సంస్థ క్రెడ్లో సుమారు 20 శాతం మైనారిటీ వాటాను పొందనుంది. ఈ డీల్ తర్వాత క్రెడ్ కంపెనీ విలువ సుమారు 4.5 బిలియన్ డాలర్లు (రూ. 43,239 కోట్లు)గా అంచనా వేశారు. ఈ నిధులు కొత్త షేర్ల కొనుగోలు, ఇప్పటికే ఉన్న షేర్ల కొనుగోలు రూపంలో సమకూరుతున్నాయి.ఈ ఒప్పందంలో.. అత్యంత ఆసక్తికరమైన అంశం కునాల్ షా కొత్త బాధ్యత. ఆయన క్రెడ్ సీఈఓ పదవి నుంచి తప్పుకుని మెటా గ్లోబల్ లీడర్షిప్ టీమ్‌లో చేరనున్నారు. వాట్సప్‌ను తదుపరి దశకు తీసుకెళ్లడం, ప్రకటనలు, సబ్స్క్రిప్షన్ సేవలు, ఏఐ ఆధారిత ఫీచర్ల ద్వారా ఆదాయాన్ని పెంచడం ఆయన ప్రధాన బాధ్యతలుగా ఉంటాయి. కాగా వాట్సప్‌ను గత ఏడు సంవత్సరాలుగా నడిపించిన విల్ క్యాథ్‌కార్ట్, మెటాలోనే కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులపై పనిచేయనున్నారు.కునాల్ షా వైదొలగడంతో, 2020 నుంచి కంపెనీ ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మిటెన్ సంపత్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. భవిష్యత్తులో స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో క్రెడ్ కొత్త శాశ్వత నాయకత్వ నిర్మాణంపై పనిచేస్తోంది.ఇదీ చదవండి: హెచ్చరిక.. వెలుగులోకి కొత్త స్కామ్!2018లో ప్రారంభమైన CRED మొదట క్రెడిట్ కార్డు బిల్లులను సమయానికి చెల్లించే వినియోగదారులకు రివార్డులు అందించే ప్లాట్‌ఫారమ్‌గా మొదలైంది. తర్వాత ఇది చెల్లింపులు, లోన్స్, ఇన్సూరెన్స్, సంపద నిర్వహణ, లైఫ్‌స్టైల్ సేవలు వంటి అనేక రంగాలకు విస్తరించింది. ప్రస్తుతం క్రెడ్‌కు 1.7 కోట్లకు పైగా నెలవారీ యాక్టివ్ సభ్యులు ఉన్నారు. భారతదేశంలోని మొత్తం క్రెడిట్ కార్డు బిల్ చెల్లింపుల్లో 40 శాతానికి పైగా ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా జరుగుతున్నట్లు కంపెనీ తెలిపింది.It’s been a minute. 2015–2018- Exited FreeCharge. Spent time learning and investing.- Pondered about: Why can't trust be rewarded? Started with $1M of personal capital.- Launched CRED to reward people for paying credit card bills on time.2019–2025- Built a system run by a…— Kunal Shah (@kunalb11) June 22, 2026 -
క్రెడ్‌తో మెటా మెగా డీల్
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం మెటా నుంచి రూ. 8,550 కోట్లు సమీకరిస్తున్నట్లు దేశీ ఫిన్‌టెక్ సంస్థ క్రెడ్ వెల్లడించింది. రూ. 38,819 కోట్ల వేల్యుయేషన్‌తో (4.03 బిలియన్ డాలర్ల) చేపట్టిన నిధుల సమీకరణ అనంతరం కంపెనీ వేల్యుయేషన్ సుమారు రూ. 43,239 కోట్లకి (4.5 బిలియన్ డాలర్లు) చేరుతుంది. క్రెడ్లో మెటా మైనారిటీ వాటాదారుగా ఉంటుంది. తాజాగా సమీకరించిన నిధులను వ్యాపార విస్తరణ కోసం కంపెనీ ఉపయోగించుకోనుంది. ఈ మెగా డీల్ ప్రకారం క్రెడ్ వ్యవస్థాపకుడు కునాల్ షా.. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హోదా నుంచి తప్పుకుంటారు. మెటాలో భాగమైన మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్‌కి అంతర్జాతీయంగా సారథ్యం వహిస్తారు. గ్లోబల్‌గా మెటా లీడర్షిప్ టీమ్‌లో ఆయన భాగమైనప్పటికీ.. క్రెడ్లో వ్యక్తిగతంగా తన వాటాలను అట్టే పెట్టుకోనున్నారు. క్రెడ్లో 2020 నుంచి స్ట్రాటెజీ, ఫైనాన్స్ హెడ్‌గా వ్యవహరిస్తున్న మితేన్ సంపత్ తక్షణం తాత్కాలిక సీఈవోగా నియమితులయ్యారు. 2018లో ప్రారంభమైన క్రెడ్‌ని ప్రస్తుతం నెలవారీగా 1.7 కోట్ల మంది సభ్యులు ఉపయోగిస్తున్నారు. దేశీయంగా క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపుల్లో 40 శాతానికి పైగా లావాదేవీలను ప్రాసెస్ చేస్తోంది. రుణాల వ్యాపార విభాగం ఏయూఎం రూ. 24,000 కోట్లకి చేరుకుంది.గ్లోబల్ భారతీయ సీఈవోల లిస్టులో చోటు.. వాట్సాప్ సీఈవోగా వ్యవహరించనున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా దిగ్గజ కంపెనీలకు సారథ్యం వహిస్తున్న భారతీయుల జాబితాలో కునాల్ షా కూడా చేరినట్లవుతుంది. ఇప్పటికే టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్‌కి నేతృత్వం వహిస్తున్న సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ తదితరుల సరసన ఆయన కూడా చేరతారు. ఈ ఏడాది తొలినాళ్లలో మైక్రోసాఫ్ట్ గేమింగ్ సీఈవోగా ఆశా శర్మ నియమితులయ్యారు. గతేడాది అక్టోబర్‌లో ఏఐ దిగ్గజం ఆంథ్రోపిక్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసరుగా రాహుల్ పాటిల్ చేరారు. అలాగే 2023లో యూట్యూబ్ సీఈవోగా నీల్ మోహన్, కాగ్నిజెంట్ సీఈవో ఎస్ రవి కుమార్ చేరారు. టీమ్ క్రెడ్.. మీరంతా కూడా పది రెట్లు వృద్ధి చెందాలని ఆశిస్తున్నాను. నా విషయానికొస్తే.. అంతర్జాతీయంగా వాట్సాప్‌కి నేతృత్వం వహించేందుకు నేను మెటాలో చేరుతున్నాను. – కునాల్ షా, క్రెడ్ ఫౌండర్, సీఈఓభారత్లో అత్యంత ముఖ్యమైన టెక్నాలజీ కంపెనీల్లో ఒకటిగా క్రెడ్‌ని షా తీర్చిదిద్దారు. కోట్లాది ప్రజలు, వ్యాపారాలకు అత్యుత్తమ సేవలందించేలా వాట్సాప్‌ని తీర్చిదిద్దేందుకు షాతో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నాను. – మార్క్ జుకర్‌బర్గ్, మెటా సీఈవో -
ఇన్‌స్టా, ఫేస్బుక్లో కొత్త రూల్స్!
డిజిటల్ యుగంలో టీనేజర్లు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో, వారి భద్రతపై ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెటా తన యాప్ (ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మెసెంజర్)లలో కొత్త భద్రతా అప్డేట్స్ను ప్రకటించింది. ఈ మార్పుల ప్రధాన లక్ష్యం టీనేజర్లకు సురక్షితమైన ఆన్లైన్ అనుభవాన్ని అందించడం, తల్లిదండ్రులకు మరింత నియంత్రణ, అవగాహన కల్పించడం.మెటా తీసుకొచ్చిన ముఖ్యమైన మార్పుల్లో ఒకటి 13+ వయస్సుకు అనుగుణమైన కంటెంట్ సెట్టింగ్స్. దీని ద్వారా టీనేజర్లు తమ వయస్సుకు సరిపోని కంటెంట్‌ను చూడకుండా పరిమితం చేయడం జరుగుతుంది. ఫీడ్, రీల్స్, గ్రూప్స్ వంటి విభాగాల్లో అనుచిత కంటెంట్‌ను తగ్గించడం ద్వారా వారికి 'వయసుకు తగిన డిజిటల్ ప్రపంచం' అందించాలనే లక్ష్యం ఉంది.మెటా ఇప్పుడు కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా ఖాతా వయస్సును గుర్తించే విధానాన్ని అభివృద్ధి చేసింది. కేవలం యూజర్ ఇచ్చిన పుట్టిన తేదీపై ఆధారపడకుండా, ప్రొఫైల్ సమాచారం, పోస్టులు, కామెంట్లు, బయోలు వంటి డేటాను విశ్లేషించి అది మైనర్ ఖాతానా? కాదా? అని అంచనా వేస్తుంది. అంతే కాకుండా, ఫోటోలు.. వీడియోల ఆధారంగా వయస్సును అంచనా వేసే టెక్నాలజీని కూడా ఉపయోగిస్తోంది. ఇది వ్యక్తిని గుర్తించడానికి కాదు, కేవలం సాధారణ వయస్సు అంచనా వేయడానికి మాత్రమే ఉపయోగిస్తామని మెటా స్పష్టం చేసింది.టీనేజర్ల భద్రత కోసం మరో కీలక అప్డేట్ తల్లిదండ్రులకు ఇచ్చే అలర్ట్స్. ఒక టీనేజర్ తక్కువ సమయంలో పదేపదే ఆత్మహత్య లేదా స్వీయహాని సంబంధిత విషయాలు సెర్చ్ చేస్తే, తల్లిదండ్రులకు వెంటనే సమాచారం పంపబడుతుంది. దీని ద్వారా అవసరమైన సమయంలో సహాయం అందించడానికి అవకాశం ఉంటుంది.తల్లిదండ్రులు ఇప్పుడు ఒకే చోట తమ పిల్లల సోషల్ మీడియా కార్యకలాపాలను చూడగలుగుతారు. దీనిని 'ఫామిలీ సెంటర్' అంటారు. ఇందులో స్క్రీన్ టైమ్, యాప్ వినియోగం వంటి వివరాలను సులభంగా పర్యవేక్షించవచ్చు. ఇవన్నీ పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేయడం జరుగుతోంది.ఇదీ చదవండి: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం! -
మెటా, టిక్‌టాక్‌పై కేసు : 12 ఏళ్ల రోసెల్లా విషాద గాథ
రెండువైపులా పదునున్న కత్తి సోషల్ మీడియా. సోషల్ మీడియా యాప్స్‌ను స్క్రోలింగ్ అనేది పిల్లలు పెద్దలు తేడా అనే లేకుండా ఒక వ్యసనం లేకుండా మారిపోయింది. సోషల్ మీడియా అల్గారిథమ్‌తో యువతపై పడుతున్న ప్రతికూల ప్రభావాలు ఇన్నీ అన్నీ కావు. సోషల్ మీడియా సంస్థలపై ఉమ్మడి చట్టపరమైన చర్యలు ఇటలీలో తల్లిదండ్రులు చేస్తున్న న్యాయపోరాటం ఈ విషయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఐరోపా అంతటా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై విమర్శలు తీవ్రమవుతున్నారు. మరోవైపు ఇటీవలే బ్రిటన్ 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన నేపథ్యంలో ఇది మరింత ప్రాధాఘ్యతను సంతరించుకుంది. 12 ఏళ్ల బాలిక రోసెల్లా ఆత్మహత్య వెనుకున్న అత్యంత విషాదకరమైన విషయాలగురించి తెలుసుకుందాం. సోషల్ మీడియాలో విపరీతంగా ఆత్మహత్య , డిప్రెషన్‌కు సంబంధించిన కంటెంట్‌ను చూసిన తర్వాత తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని రోసెల్లా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిజానికి ఆమె మరణం తర్వాతే తల్లి ఇరీన్ రొగ్గెరో ఉగ్వెస్, ఆమె భర్త రోసెల్లా డివైజ్‌లను అన్‌లాక్ చేశారు. దీంతో విషయం తెలిసి షాక్ అయ్యారు. దీనిగురించి ప్రపంచాన్ని హెచ్చరించాలని నిర్ణయించుకున్నారు.విషయం ఏమిటంటే..తమ కుమార్తె రోసెల్లా సోషల్ మీడియాను చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. మరీ ముఖ్యంగా ఆమె ఒక రహస్య ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను వాడుతోందనీ, అందులో 'o'కు బదులుగా 'zero'తో 'Just a dead pers0n' అనే పేరుతో అకౌంట్‌ను నడుపుతోందని గమనించారు.2023 సెప్టెంబర్‌లో రోసెల్లా తన మానసిక స్థితికి తగ్గట్టుగా డిప్రెషన్ కంటెంట్ కోసం వెతకడం ప్రారంభించగానే, సోషల్ మీడియా అల్గారిథమ్‌లు ఆమెకు అలాంటి కంటెంట్‌నే పదే పదే చూపించాయనీ, కేవలం ఐదు నెలల్లోనే (2024) ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.ఈ వ్యవహారంపై రోసెల్లా తల్లిదండ్రులతో పాటు ఇటలీలోనిమరికొన్ని కుటుంబాలు కలిసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మాతృసంస్థ మెటా (Meta) , టిక్‌టాక్ (TikTok)లపై కోర్టులో కేసు వేశారు. మైనర్లకు సోషల్ మీడియా యాక్సెస్‌పై కఠినమైన పరిమితులు విధించాలని, దీనివల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన పెంచాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఆ అల్గారిథం లేకపోతే, ఆమె వేదన - లేదా సైకోసిస్, లేదా మానసిక బాధను, లేదా అంతకుమించి మరేదైనా గానీ తానుతన కూతురికి జరిగిన ఘోరం మరే ఇతర బిడ్డకు జరగకూడదని, సోషల్ మీడియా వెనుక ఉన్న సాంకేతిక ప్రమాదాల గురించి మిగతా తల్లిదండ్రులను అప్రమత్తం చేయడానికే తాను ఈ న్యాయపోరాటంలో చేరానని రోసెల్లా తల్లి ఇరేన్ స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఆరోపణలను మెటా, టిక్‌టాక్ సంస్థలు తిరస్కరించాయి. తాము టీనేజర్ల రక్షణ కోసం 'టీన్ అకౌంట్స్' హానికరమైన కంటెంట్‌ను తొలగించే ఫిల్టర్లను ఉపయోగిస్తున్నామని, యువత మానసిక ఆరోగ్యం వెనుక అనేక ఇతర కారణాలు కూడా ఉంటాయని అవి పేర్కొన్నాయి. యూజర్ల మానసిక, ప్రవర్తనా ఆరోగ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో రూపొందించిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయడం తమ ప్రయత్నాలలో భాగమని టిక్‌టాక్ (ఇండియాలో నిషేధం) తెలిపింది. ఆ నిబంధనలను ఉల్లంఘించే 99శాతం కంటే ఎక్కువ కంటెంట్‌ను తాము తొలగిస్తున్నట్లు కూడా పేర్కొంది. సోషల్ మీడియా వల్ల పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు, ఏకాగ్రత పూర్తిగా నశిస్తున్నాయని ఉదాహరణలతో చెప్పారు.24 గంటలూ ఓ కన్నేసి ఉంచడం సాధ్యమా?పిల్లల సోషల్ మీడియా వాడకాన్ని 24 గంటలూ గమనించడం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని పెద్ద కుటుంబాల అసోసియేషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. పిల్లలు ఇంటర్నెట్లోని ట్యుటోరియల్స్ చూసి తల్లిదండ్రులు పెట్టే ఫిల్టర్లను లేదా సమయ పరిమితులను సులభంగా దాటేస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: ఒక్క రీల్‌కు రూ. 76 లక్షలు, లంచ్‌కి 20 లక్షలు : ఎలా?నిపుణులేమంటున్నారు? సోషల్ మీడియాలో వచ్చే ప్రతి 'లైక్' లేదా 'నోటిఫికేషన్' మెదడులో డోపమైన్ (Dopamine) అనే రసాయనాన్ని విడుదల చేస్తుందని, ఇది స్లాట్ మెషీన్ల (జూదం) లాగా పిల్లలను వ్యసనపరులుగా మారుస్తుందని నిపుణులు కోర్టుకు తెలిపారు. అతిగా సోషల్ మీడియా వాడటం వల్ల టీనేజర్ల మెదడు అభివృద్ధి దెబ్బతింటుందని, నిద్రలేమి,మానసిక సమస్యలు వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా హెచ్చరిస్తోంది.ఇదీ చదవండి : రూ. 14 వేల నుంచి రూ. 10 లక్షల స్కాం : ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వార్నింగ్మరో కోణంఅయితే కొంతమంది సైకాలజిస్టులు కేవలం సోషల్ మీడియాని మాత్రమే బ్లేమ్ చేయలేమని, పిల్లలపై మితిమీరిన నియంత్రణ కంటే వారితో మాట్లాడటం, వారిని నమ్మడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: అఫ్గాన్‌లో సోలో ట్రిప్, భారతీయ మహిళ భావోద్వేగం, దురంధర్ నటుడు కూడా! -
‘మెటాలో ఇక భారీ తొలగింపులు ఉండకపోవచ్చు’
సోషల్ మీడియా దిగ్గజం మెటా కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సంస్థగా రూపాంతరం చెందే క్రమంలో ఉద్యోగులకు సంబంధించి కొన్ని పొరపాట్లు జరిగాయని దాని అధినేత మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) అంగీకరించారు. అంతర్గత మెమోలో ఉద్యోగులను ఉద్దేశించి, వేగంగా మారుతున్న ఏఐ ప్రపంచంలో ఇలాంటి సవాళ్లు సహజమని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. “ఈ మార్పుల సంక్లిష్టత దృష్ట్యా మేము తప్పులు చేశాం. భవిష్యత్తులో కూడా కొన్ని తప్పిదాలు జరిగే అవకాశం ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు.ప్రస్తుతం మెటా సంస్థ తన వ్యాపార వ్యూహాన్ని పూర్తిగా ఏఐ చుట్టూ పునర్వ్యవస్థీకరిస్తోంది. ఇందుకోసం డేటా సెంటర్లు, ఏఐ మౌలిక సదుపాయాలు, సూపర్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులపై వందల బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. ఈ క్రమంలో సంస్థలో విస్తృత స్థాయి పునర్నిర్మాణం చేపట్టింది. మే నెలలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 శాతం ఉద్యోగులను తొలగించగా, మరో 7,000 మంది ఉద్యోగులను ఏఐ సంబంధిత బృందాలకు బదిలీ చేసింది.అయితే ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనలను తగ్గించే ప్రయత్నంలో జుకర్‌బర్గ్ కీలక హామీ ఇచ్చారు. “ఈ ఏడాది సంస్థవ్యాప్తంగా మరోసారి భారీ స్థాయి ఉద్యోగ కోతలు ఉంటాయని మేము భావించడం లేదు” అని స్పష్టం చేశారు. ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతున్నందున అతిగా హామీలు ఇవ్వలేనప్పటికీ, సంస్థాగత స్థిరత్వాన్ని కాపాడటమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఏఐ మోడళ్ల శిక్షణ కోసం బదిలీ చేసిన ఉద్యోగులకు కొత్త అవకాశాలు కల్పించేందుకు సంస్థ కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు. అవసరమైతే కొన్ని విభాగాల్లో తగ్గించిన సిబ్బందిని తిరిగి ఇతర బృందాలకు మార్చే అవకాశమూ ఉంటుందని చెప్పారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉద్యోగుల నైపుణ్యాలను వినియోగించుకోవడమే లక్ష్యమని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, మెటాలో జరిగిన ఏఐ ఆధారిత పునర్వ్యవస్థీకరణపై కొంత అసంతృప్తి కూడా వ్యక్తమవుతోంది. కొత్తగా ఏర్పాటైన ఏఐ విభాగాల్లో పని స్వరూపం, బాధ్యతలపై కొందరు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు జూలైలో భారీ ఏఐ హ్యాకథాన్, టీమ్ ఈవెంట్లు నిర్వహించేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది.ఏఐ పోటీలో ముందంజలో నిలవాలన్న లక్ష్యంతో మెటా దూసుకెళ్తున్నప్పటికీ, ఉద్యోగుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం, సంస్థాగత మార్పులను సమతుల్యం చేయడం కంపెనీకి ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారింది. -
రిలయన్స్, మెటా.. మెగా ప్రాజెక్టు
ప్రపంచ సాంకేతిక దిగ్గజం మెటా, దేశీయ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంయుక్తంగా భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఈ మెగా ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. గ్లోబల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా భారత్‌ను నిలబెట్టే క్రమంలో మెటా సంస్థ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో నిర్మిస్తున్న మొట్టమొదటి ‘బిల్ట్-టు-సూట్’(కస్టమైజ్డ్) డేటా సెంటర్ ఇదే కావడం విశేషం.ప్రాజెక్టు ముఖ్యాంశాలుప్రాథమికంగా 168 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ నిర్మాణం కానుంది. భవిష్యత్తులో దీనిని మరింత విస్తరించే అవకాశం ఉంది.రాబోయే రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.డేటా సెంటర్ డిజైన్, నిర్మాణం, యుటిలిటీల నిర్వహణ, నెట్వర్క్ కనెక్టివిటీ, మేనేజ్డ్ సర్వీసెస్ వంటి అన్ని బాధ్యతలను రిలయన్స్ గ్రూప్ నిర్వహించనుంది.ఈ డేటా సెంటర్ పూర్తిగా పునరుత్పాదక ఇంధనంతో పనిచేస్తుంది. అంతేకాకుండా, ప్లాంట్ శీతలీకరణ (కూలింగ్) కోసం లవణరహితం(ఉప్పు తొలగించిన) చేసిన సముద్రపు నీటిని ఉపయోగించనున్నారు.జామ్‌నగర్ ఎంపికకు గల కారణాలువ్యూహాత్మకంగా జామ్‌నగర్ ఈ ప్రాజెక్టుకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా నిలిచింది. పారిశ్రామికంగా అనుకూలమైన వాతావరణం, మెరుగైన పునరుత్పాదక ఇంధన వనరులు, నీటి లభ్యతతో పాటు సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లకు ఇది సమీపంలో ఉంది. దీనికి తోడు జియోకు చెందిన విస్తృతమైన ఫైబర్ నెట్వర్క్ ఈ డేటా సెంటర్‌కు అదనపు బలాన్ని చేకూర్చనుంది.‘మెటాతో కుదిరిన ఈ భాగస్వామ్యం భారత డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టం. గ్లోబల్ టెక్నాలజీ లీడర్ మెటాతో కలిసి ఇలాంటి అధునాతన డేటా సెంటర్‌ను నిర్మించడం, ప్రపంచ ఏఐ విప్లవానికి నాయకత్వం వహించడానికి భారత్ సిద్ధంగా ఉందనే సంకేతాన్ని ఇస్తోంది. జామ్‌నగర్ ఇకపై గ్లోబల్ హైపర్‌స్కేల్ ఏఐ కంప్యూటింగ్‌కు ప్రధాన కేంద్రంగా మారుతుంది’ అని ముకేష్ అంబానీ అన్నారు.‘భారతదేశంలో మా మొదటి ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ను నిర్మించడానికి రిలయన్స్‌తో చేతులు కలపడం మాకు గర్వకారణం. జామ్‌నగర్‌లోని ఈ ప్రపంచ స్థాయి ఫెసిలిటీ ద్వారా మా ఏఐ మౌలిక సదుపాయాలను విస్తరించడానికి సహాయపడుతుంది. అలాగే భారత ఆర్థిక వ్యవస్థలో మా దీర్ఘకాలిక పెట్టుబడులను మరింత బలోపేతం చేస్తుంది’ అని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.ఇదీ చదవండి: హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో! -
మెటాతో ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, సోషల్ మీడియా దిగ్గజం మెటాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. సోషల్ మీడియా వేదికల ద్వారా క్రియేటర్ ఆధారిత షాపింగ్‌ను ప్రోత్సహించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని తెలిపింది. ఇందులో భాగంగా కంటెంట్ క్రియేటర్లు ఫ్లిప్‌కార్ట్, మింత్రా వేదికలపై లభ్యమయ్యే ఉత్పత్తులను గుర్తించి, వాటిని నేరుగా తమ ఫేస్బుక్ పోస్టులు, రీల్స్‌లో ట్యాగ్ చేస్తారు. వినియోగదారులు ఆ ఉత్పత్తి ట్యాగ్‌లపై ట్యాప్ చేసి నేరుగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా జరిగే ప్రతి విక్రయంపై క్రియేటర్లకు కమీషన్ లభిస్తుందని సంస్థ వెల్లడించింది. ఈ సేవలను తొలుత ఫేస్బుక్లో అందుబాటులోకి తెచ్చి, తదుపరి దశలో ఇన్‌స్ట్రాగామ్‌కు విస్తరించనున్నారు. మారుతున్న కొనుగోలు ధోరణులు: ‘‘భారతీయ రిటైల్ రంగంలో జెన్ జెడ్ కొనుగోలు ధోరణులను ఫ్లిప్‌కార్ట్ రెండేళ్ల క్రితమే గుర్తించింది. ప్రస్తుతం కొనుగోలుదారులు సెర్చ్ బార్ల కంటే సోషల్ మీడియా ఫీడ్స్ ఆధారంగానే ఉత్పత్తులను ఎంపిక చేసుకుంటున్నారు. క్రియేటర్లే కొత్త తరహా డిజిటల్ దుకాణాలుగా అవతరిస్తున్నారు. ఈ క్రమంలో మెటాతో కుదిరిన భాగస్వామ్యం కంటెట్ క్రియేటర్లను వ్యాపారవేత్తలుగా మార్చడమే కాకుండా, బ్రాండ్లు వినియోగదారులకు మరింత చేరువ అవుతాయి’’ అని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఎఫ్‌వో రవి అయ్యర్ తెలిపారు. -
నన్ను జాబ్ నుంచి తొలగించండి.. మెటా ఉద్యోగిని
మెటా సంస్థ ఇటీవలే భారీ లేఆఫ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో జూలీ బోన్ అనే ఉద్యోగిని కూడా ఉన్నారు. అయితే.. ఈమె తనకు తానుగానే ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు.. లింక్డ్ఇన్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.జూలీ బోన్ కంపెనీలో జరుగుతున్న ఉద్యోగాల కోతల్లో తన పేరును కూడా చేర్చాలని స్వయంగా కోరినట్లు వెల్లడించింది. ఈమె సంస్థలో ఆరేళ్లు పనిచేసింది. అయితే ఇప్పుడు ఉద్యోగాన్ని వదులుకోవాలనుకోవడం ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదని పేర్కొంది. చాలా కాలంగా కంపెనీ లక్ష్యాలు, తన వ్యక్తిగత ఆశయాలు వేర్వేరు దారుల్లో సాగుతున్నాయని ఆమె భావించింది. అందుకే తన వ్యక్తిగత జీవితానికి సరైన సమయం వచ్చిందని భావించి ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకుందన్నారు.అంతేకాకుండా.. తాను స్వచ్ఛందంగా బయటకు వస్తే సంస్థలో కొనసాగాలని కోరుకునే మరో ఉద్యోగికి అవకాశం దక్కవచ్చనే ఆలోచన కూడా తనలో ఉందని పేర్కొన్నారు. మెటాలో పని చేసిన కాలంలో ఏఐ ఆధారిత నైపుణ్యాలను కూడా నేర్చుకున్నానని జూలీ వెల్లడించింది. కొత్త ఆలోచనలను రూపొందించడానికి, కోడింగ్ సమస్యలను పరిష్కరించడానికి ఏఐ టూల్స్ ఉపయోగించడం నేర్చుకున్నానని తెలిపింది.ప్రస్తుతం మెటాలో 'AI-first' విధానం అమల్లో ఉందని, ఉద్యోగులు ఏఐ టెక్నాలజీకి అనుగుణంగా తమ నైపుణ్యాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆమె వివరించింది. అయితే.. ఏఐ నేర్చుకోవడం మాత్రమే ఉద్యోగ భద్రతకు హామీ కాదని జూలీ అభిప్రాయపడ్డారు. ఉద్యోగులను రక్షించాలంటే.. సంస్థలు, ఉద్యోగులు కలిసి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.టెక్నాలజీ ఎంత వేగంగా మారుతున్నా, మానవ సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సాంస్కృతిక అవగాహన వంటి అంశాలు ఎంతో ముఖ్యమని జూలీ నమ్మకం. మెటాలో చేసిన పనుల్లో ముఖ్యంగా బ్రాండ్ వాయిస్, లోకలైజేషన్ రంగాల్లో పనిచేయడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఆమె వెల్లడించారు.ప్రస్తుతం కొంత విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్న జూలీ, భవిష్యత్తులో సృజనాత్మకతకు, ఎడిటోరియల్ తీర్పుకు, స్పష్టమైన కమ్యూనికేషన్‌కు ప్రాధాన్యం ఇచ్చే సంస్థల్లో అవకాశాలను వెతుకుతానని వెల్లడించింది. మొత్తం మీద ఈమె వ్యాఖ్యలు.. ప్రస్తుతం ఏఐ ప్రభావం, ఉద్యోగ భద్రత, టెక్నాలజీ రంగంలో మారుతున్న పని సంస్కృతి వంటి అంశాలపై విస్తృత చర్చకు దారితీశాయి. -
ఏఐ టూల్స్ తయారు చేసిన వారికే షాక్!
మెటా కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో, అక్కడి ఉద్యోగాలపై కొత్త చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం.. మెటా ఉద్యోగులను మొదట్లో AI ఆధారిత టూల్స్ తయారు చేయడానికి ప్రోత్సహించారని, తరువాతే కొన్ని టీమ్స్‌లో ఉద్యోగ కోతలు జరిగాయని ఆరోపించారు.మెటాలో ఒక ఏఐ వీక్ నిర్వహించారు. ఆ సమయంలో ఉద్యోగులు తమ సాధారణ పనుల నుంచి కొంత విరామం తీసుకుని, కొత్త AI టూల్స్, ఐడియాలపై ప్రయోగాలు చేయాలని సూచించారట. కొన్ని ప్రోటోటైప్స్ తయారయ్యాయని, వాటిని తర్వాత పెద్ద ప్రాజెక్టులుగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఐడియాలు రూపొందించడంలో సహకరించిన కొంతమంది ఉద్యోగులు తరువాత ఉద్యోగ కోతలకు గురయ్యారని సమాచారం.My wife just got laid off by Meta. We knew the writing was on the wall. But I want to give a little background. Meta a couple months back had a company-wide AI week. During this week Meta halted all day-to-day work and required all employees to familiarize themselves with AI.…— Julian ☽ (@julianblacks_) May 20, 2026మెటా కంపెనీ ఏఐపై ఎక్కువ దృష్టి పెట్టడం నిజమే.. అని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. సంస్థ తన నిర్మాణాన్ని మరింత సరళంగా మార్చి, సమర్థవంతమైన ఏఐ టీమ్స్‌ను తయారు చేస్తోంది. ఈ మార్పుల వల్ల కొన్ని విభాగాల్లో ఉద్యోగ కోతలు, పునర్వ్యవస్థీకరణలు జరిగాయి. అంతే కాకుండా.. మెటా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీలో కూడా భారీగా పెట్టుబడులు పెడుతోంది.ఇదీ చదవండి: రూ.50 వేల అప్పుతో మొదలై.. రూ.8,000 కోట్ల సామ్రాజ్యం!ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు.. టెక్ రంగంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు ఉద్యోగులు ఏఐ టూల్స్ తయారీలో కీలక పాత్ర పోషిస్తుండగా, మరోవైపు అదే ఏఐ వల్ల వారి ఉద్యోగాలకే ముప్పు వస్తుందా? అనే ప్రశ్నలు పుడుతున్నాయి. ముఖ్యంగా ఇంజనీర్లు, డిజైనర్లు, అనలిస్టులు వంటి వైట్ కాలర్ ఉద్యోగాల్లో ఈ భయం ఎక్కువగా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఇంకా ఎంతమంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందో చూడాలి. -
ఉద్యోగం పోయినా సంబరమే..!
ఉద్యోగం పోతే చాలామంది కుంగిపోతారు. ఇక పెద్ద కంపెనీలో పని చేసే వాళ్లైతే మరింత ఆందోళన చెందుతారు. కానీ ఓ యువతి మాత్రం తన ఉద్యోగం పోయిందనే వార్త విన్న వెంటనే ఆనందంతో ఎగిరి గంతేసింది. “ హమ్మయ్యా.. నా ప్రాణం మళ్లీ తిరిగొచ్చినట్లు అనిపిస్తోంది” అంటూ చెబుతున్న మాటలు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీశాయి.అమెరికాలోని ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ మెటాలో నాలుగేళ్లుగా పనిచేసిన ఆశా రావల్ అనే యువతి ఇటీవల లేఆఫ్ కారణంగా ఉద్యోగం కోల్పోయింది. సాధారణంగా ఇలాంటి సమయంలో బాధపడాల్సిందిపోయి.. ఆమె మాత్రం సంతోషంతో తన మనసులోని మాట బయటపెట్టింది.పెద్ద జీతం, సౌకర్యాలు, పేరు ప్రతిష్ఠ అన్నీ ఉన్నా.. ప్రతిరోజూ ఒకేలా జరిగే సమావేశాలు, గంటల కొద్దీ కూర్చుని పత్రాలు తయారు చేయడం విసుగు తెప్పించాయి. బయటికి మంచి జీవితం కనిపించినా.. లోపల మాత్రం ఖాళీగా అనిపించేదని తెలిపిందామె. ఒకానొక టైంలో.. మెకానికల్ వర్క్‌తో లోలోపల తాను చనిపోయినట్లు ఫీలయ్యేదానిని.. ఆ బాధతో కుంగిపోయానని చెప్పుకొచ్చింది. అయితే.. View this post on Instagram A post shared by Asha | Maximalist Fashion (@ashamode_)ఉద్యోగం పోయిన తర్వాత మొదటిసారి ప్రశాంతంగా నిద్రపోయానని కూడా ఆమె చెప్పింది. ఇకపై తనకు నిజంగా ఇష్టమైన.. సృజనాత్మక(క్రియేటివిటీ) పనులు చేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది. కొత్తగా ప్రారంభమైన ఓ చిన్న సంస్థలో చేరి.. కొత్త ఆలోచనలతో పని చేయబోతున్నానని తెలిపింది.ఆమె మాటలు ఇప్పుడు వేలాది ఉద్యోగుల మనసుల్లో ఉన్న భావాలను బయటపెట్టినట్టయ్యాయి. “ఉద్యోగం పోయినా ఇంత ఆనందపడతారా?” అంటూ చాలామంది ఆశ్చర్యపోతుండగా.. “ఆమె చెప్పిందే నిజం” అంటూ మరికొందరు తమ అనుభవాలను పంచుకుంటున్నారు.“డబ్బు కోసం మనసుకు నచ్చని పని చేస్తూ జీవితం మొత్తం గడపాలా?.. లేదంటే మనసు కోరిన దారిలో నడవాలా?” అనే కోణంలో ఆ చర్చ నడుస్తోంది. -
ఉద్యోగాల కోతలు.. జుకర్‌బర్గ్ వివరణ
టెక్ రంగంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే మెటా కంపెనీ భారీ స్థాయిలో ఉద్యోగాల పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ ప్రభావం 8000 ఉద్యోగులపై పడింది. మరో 7000 మంది ఉద్యోగులను కొత్త టీమ్స్‌కు మార్చింది. అంతే కాకుండా ఖాళీగా ఉన్న 6000 పోస్టులను కూడా భర్తీ చేసే యోచన లేదని సంస్థ స్పష్టం చేసింది.ఈ పరిణామాల తరువాత మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఉద్యోగులకు ఒక మెమో పంపించారు. అందులో.. ఈ ఏడాది పెద్ద స్థాయి ఉద్యోగ కోతలు ఉండవని స్పష్టం చేశారు. అంటే ప్రస్తుత ఉద్యోగ కోతల తరువాత సంస్థ ఉద్యోగులను తొలగించే ఆలోచనలో లేదని తెలుస్తోంది.మార్క్ జుకర్‌బర్గ్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణాలను కూడా వివరించారు. కంపెనీ కమ్యూనికేషన్ విషయంలో కొంత స్పష్టత లోపించిందని ఆయన అంగీకరించారు. ఉద్యోగులకు సరైన సమాచారం ఇవ్వడంలో మరింత మెరుగుదల అవసరం ఉందని చెప్పారు. ఏఐ సాంకేతికత భవిష్యత్తును పూర్తిగా మార్చబోతుందని అన్నారు. సంస్థల మధ్య పోటీ తీవ్రంగా ఉందని, కంపెనీలు నిరంతరం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని సూచించారు. ఏఐను మానవ జీవితంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చే టెక్నాలజీగా ఆయన అభివర్ణించారు.ఇదీ చదవండి: ఉద్యోగం పోయింది.. ఈఎంఐ కట్టలేని స్థితి నుంచి విజయం!ఉద్యోగం కోల్పోయిన వారికి సంస్థ 16 వారాల ప్రాథమిక వేతనంతో పాటు, సంస్థలో పనిచేసిన ప్రతి సంవత్సరానికి అదనంగా రెండు వారాల వేతనాన్ని సీవెరన్స్ ప్యాకేజీగా అందిస్తుంది. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు 18 నెలల పాటు ఉచిత ఆరోగ్య సంరక్షణ కవరేజీని కొనసాగిస్తారు. యూఎస్ వెలుపల ఉన్న ఉద్యోగులకు వారి దేశాల నిబంధనలను బట్టి దాదాపు ఇలాంటి ప్రయోజనాలే అందుతాయి. -
తొలగించిన ఆ 8 వేల మందికి మెటా ఇచ్చేది ఇదే..
టెక్ దిగ్గజం 'మెటా' (Meta) పెద్ద ఎత్తున పునర్నిర్మాణ ప్రక్రియను చేపడుతూ, దాదాపు 8,000 మంది ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. ఇది కంపెనీ మొత్తం శ్రామిక శక్తిలో 10 శాతానికి సమానం. ఈ ఏడాది మార్చి ముగిసే నాటికి మెటాలో సుమారు 78,000 మంది ఉద్యోగులు ఉన్నారు. టెక్ పరిశ్రమలో ఈ లేఆఫ్‌లు తీవ్ర సంచలనం సృష్టించినప్పటికీ, తొలగించిన ఉద్యోగుల కోసం మెటా ప్రకటించిన తొలగింపు ప్యాకేజీ (Severance Package) అందరి దృష్టిని ఆకర్షించింది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం అమెరికా ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి..బేస్ పే: 16 వారాల ప్రాథమిక వేతనంతో పాటు, సంస్థలో పనిచేసిన ప్రతి సంవత్సరానికి అదనంగా రెండు వారాల వేతనాన్ని సీవెరన్స్ ప్యాకేజీగా అందిస్తారు.ఆరోగ్య సంరక్షణ: ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు 18 నెలల పాటు ఉచిత ఆరోగ్య సంరక్షణ కవరేజీని కొనసాగిస్తారు.అంతర్జాతీయ ఉద్యోగులు: యూఎస్ వెలుపల ఉన్న ఉద్యోగులకు వారి దేశాల నిబంధనలను బట్టి ఇలాంటి ప్రయోజనాలే అందుతాయి.ఏఐ బృందాల్లోకి పునర్వ్యవస్థీకరణఉద్యోగాల కోతతో పాటు కంపెనీ అంతర్గతంగా మరో పెద్ద మార్పు చేపట్టింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఏఐ-కేంద్రీకృత బృందాల్లోకి 7,000 మందికి పైగా ఉద్యోగులను బదిలీ చేస్తున్నట్లు మెటా చీఫ్ పీపుల్ ఆఫీసర్ జానెల్ గేల్ ప్రకటించారు. ఈ తొలగింపులు, అంతర్గత బదిలీల వల్ల మెటాలోని మొత్తం శ్రామిక శక్తిలో 20% మంది ప్రభావితం కానున్నారు."మేము ఇప్పుడు వేగంగా, ఎక్కువ యాజమాన్య బాధ్యతలతో దూసుకుపోగల చిన్న బృందాలతో కూడిన నిర్మాణంతో పనిచేసే దశకు చేరుకున్నాము" అని రాయిటర్స్ పరిశీలించిన ఒక మెమోలో జానెల్ గేల్ పేర్కొన్నారు.వ్యూహాత్మక మార్పులు - భారీ ఖర్చులుఅంతర్గత పని విధానం, ఉత్పత్తులు రెండింటిలోనూ 'ఏఐ ఏజెంట్లను' కేంద్ర బిందువుగా మార్చే ప్రయత్నంలో భాగంగానే మెటా ఈ వ్యూహాత్మక మార్పులు చేస్తోంది. ఇందుకోసం ఏఐ(AI)లో పెట్టుబడులను భారీగా పెంచుతోంది. కొత్త ఏఐ డేటా సెంటర్ల నిర్మాణం, అధిక మెమరీ ధరల కారణంగా ఈ ఏడాది మెటా మూలధన వ్యయాలు ఏకంగా 145 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని కంపెనీ తెలిపింది.మరోవైపు, 2026 ద్వితీయార్థంలో మెటా మరిన్ని ఉద్యోగ కోతలను ప్రకటించే అవకాశం ఉందని అంచనా. అయితే దీని సమయం, పరిధిపై ఇంకా స్పష్టత లేదు. కాగా, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ గత కొన్ని ఏళ్లుగా మేనేజ్మెంట్ స్థాయిలను తగ్గించే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే 2022, 2023 లలో ఇప్పటికే 20,000 ఉద్యోగాలను తగ్గించారు. -
మూల్యం : ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుకు ఎదురుదెబ్బ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నార్వే పర్యటన సందర్భంగా నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో అనూహ్య ప్రశ్న సంధించి వార్తల్లో నిలిచిన నార్వే మహిళా జర్నలిస్టు హెల్లే లింగ్ (Helle Lyng Svendsen) చేదు అనుభవం ఎదురైంది. ఆమె సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేస్తూ మెటా షాక్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆమె కూడా ధృవీకరించారు.ఆన్లైన్లో వెల్లువెత్తిన తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో తన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖాతాలు నిలిపివేయబడ్డాయని హెలె లింగ్ ట్వీట్ చేశారు. తన ఖాతా నిలిపివేయబడటానికి ముందు రోజంతా తన ఇన్‌స్టాను యాక్సెస్ చేయలేకపోయానని లింగ్ తెలిపారు. "పత్రికా స్వేచ్ఛ కోసం చెల్లించాల్సిన చిన్న మూల్యమే ఇది, కానీ ఇలాంటి అనుభవం ఇంతకు ముందెప్పుడూ ఎదురు కాలేదు," అని ఆమె తన సస్పెన్షన్ నోటీసు స్క్రీన్‌షాట్ షేర్ చేశారు.Throughout all day I have struggled to log onto my Instagram account. Now I have been suspended. It is a small prize to pay for press freedom, but I’ve never experienced it before. pic.twitter.com/XCitS65Rlg— Helle Lyng (@HelleLyngSvends) May 19, 2026 ; మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫామ్స్ ద్వారా తనను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్న వినియోగ దారులకు, తన ఇన్‌స్టా, ఫేస్బుక్ ఖాతాలు రెండూ సస్పెండ్ అయ్యాయని మరో పోస్ట్‌లో లింగ్ తెలియజేశారు. తాను వీలైనంత ఎక్కువ మంది భారతీయులకు స్పందించాలనుకున్నా, కానీ ఇప్పుడు అది లేట్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. కానీ తన ఖాతాలు తిరిగి యాక్టివ్ అవుతాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తన పోస్ట్‌కు ఆమె మెటాను కూడా ట్యాగ్ చేస్తూ రాశారు.ఇదీ చదవండి: ఇది కదా లక్ అంటే : పాత ప్యాంట్లో రూ. 57 కోట్ల జాక్‌పాట్ కాగా ప్రధాని మోదీ పత్రికా సమావేశంలో తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ బాగా వైరల్ అయింది. ఆమె ఫాలోవర్లు కూడా పెరిగారు. దీనిపై బీజేపీ శ్రేణులు లింగ్పై విరుచుకుపడగా, నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. -
దిగ్గజ కంపెనీ లేఆఫ్స్.. 8,000 మందిపై ప్రభావం!
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మాతృ సంస్థ మెటా (Meta) త్వరలో, భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు చేపట్టబోతోందని వచ్చిన సమాచారం.. టెక్ ప్రపంచంలో చర్చకు దారితీసింది. ఈసారి కంపెనీ సుమారు 10 శాతం మందిని తొలగించే అవకాశం ఉంది.మెటా కంపెనీ సుమారు 8,000 మంది ఉద్యోగులను తొలగించనుంది. 2025 చివరి నాటికి సంస్థలో పనిచేసేవారి సంఖ్య సుమారు 78,000గా ఉండేది. దీన్నిబట్టి చూస్తే లేఆఫ్స్ ప్రభావం సుమారు 10 శాతం ఉద్యోగులపై పడుతుందని స్పష్టమవుతోంది. ఇదే సమయంలో కొత్త నియామకాలను కూడా నిలిపివేస్తున్నట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం.. ఖర్చులు తగ్గించడమే కాకుండా, కంపెనీని కొత్త దిశగా మలచడానికి తీసుకుంటున్న నిర్ణయాలు అని తెలుస్తోంది.మెటా ఇప్పుడు తన సంస్థ నిర్మాణాన్ని పూర్తిగా మార్చుకోవడంలో భాగంగా.. పెద్ద పెద్ద టీమ్‌లకు బదులుగా చిన్న, వేగంగా పనిచేసే టీమ్‌లను ఏర్పాటు చేయాలని చూస్తోంది. కంపెనీ ఇప్పుడు పూర్తిగా ఏఐ కేంద్రంగా మారుతోంది. సంస్థ భవిష్యత్ పెట్టుబడుల్లో భారీ భాగాన్ని ఏఐ డేటా సెంటర్లు, చిప్‌లు, మోడల్ ట్రైనింగ్ వంటి రంగాల్లో పెట్టనున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: అమెరికాలో ఏఐపై పెరుగుతున్న వ్యతిరేకత!కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా.. ఉద్యోగుల తొలగింపు మాత్రమే కాదు, 7000 మంది కొత్త ఏఐ ఆధారిత ప్రాజెక్ట్‌ల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ మార్పులు ఉద్యోగుల్లో అసంతృప్తిని కూడా పెంచుతున్నాయి. దీంతో కంపెనీ అంతర్గత వాతావరణం కొంత ఒత్తిడిగా మారిందని నివేదికలు చెబుతున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన కొన్ని AI టూల్స్ ఉద్యోగుల పనిని ట్రాక్ చేస్తాయన్న భయం కూడా ఉంది. కంపెనీ మాత్రం వాటిని కేవలం AI శిక్షణ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నామని వివరణ ఇస్తోంది. -
లేఆఫ్స్.. కోత మొదలు.. డేట్ ఫిక్స్
సోషల్ మీడియా దిగ్గజం మెటా మరోసారి తన ఉద్యోగులకు షాకిచ్చింది. కృత్రిమ మేధ రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్న క్రమంలో వ్యయ నియంత్రణలో భాగంగా మే 20వ తేదీ నుంచి సుమారు 10 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయం మెటా శ్రామిక శక్తిలో తీవ్ర అనిశ్చితిని నింపుతోంది.ఏమిటీ తాజా పరిణామాలు?ఇటీవల కంపెనీ నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో ఈ కీలక ప్రకటన వెలువడింది. ఇప్పటికే మెటా ఆర్థికంగా స్థిరమైన పనితీరును కనబరుస్తున్నప్పటికీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా సంస్థాగత మార్పులు తప్పవని యాజమాన్యం స్పష్టం చేసింది. మే 20న ఈ మొదటి దశలో 10 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నారు. ప్రస్తుత ప్రణాళికల ప్రకారం 2026 పూర్తయ్యే నాటికి ఈ ఉద్యోగ కోతలు మొత్తం శ్రామిక శక్తిలో 20 శాతానికి చేరుకునే అవకాశం ఉందని సంకేతాలు అందుతున్నాయి.యాజమాన్యం ఏమంటోంది?మెటా చీఫ్ పీపుల్ ఆఫీసర్ జానెల్లె గేల్ మాట్లాడుతూ, తదుపరి రౌండ్ల తొలగింపులు ఉండబోవనే హామీ ఇవ్వలేమని స్పష్టం చేశారు. ‘మేము అత్యంత పోటీ వాతావరణంలో పనిచేస్తున్నాం. వ్యాపార ప్రాధాన్యతలను బట్టి జట్లు, ఖర్చుల విషయంలో చురుకుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. అయితే, ప్రభావితమైన కొంతమందిని వేరే విభాగాలకు తరలించే ప్రయత్నం చేస్తామని, మానవతా దృక్పథంతో బాధితులకు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.ఏఐ పెట్టుబడుల ప్రభావంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేరుగా ఉద్యోగాల కోతలకు కారణం కాదని సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కంపెనీ తన బడ్జెట్లో ఎక్కువ భాగం మౌలిక సదుపాయాలు, ఉద్యోగుల జీతభత్యాల కోసం వెచ్చిస్తోంది. ఈ ఏడాది ఏఐ పరిశోధనలు, అత్యాధునిక కంప్యూటింగ్ వ్యవస్థల కోసం మెటా దాదాపు 125 బిలియన్ డాలర్ల నుంచి 145 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయనుంది. ‘ఒక విభాగంలో ఎక్కువ పెట్టుబడి పెట్టాలంటే మరో విభాగంలో వ్యయం తగ్గించక తప్పదు’ అని జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలు ఏఐ విస్తరణ కోసం ఉద్యోగ భద్రతను బలి పెడుతున్నారనే వాదనలకు బలం చేకూరుస్తున్నాయి.ఉద్యోగుల్లో ఆందోళనప్రస్తుతం మెటాలో 77,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. పనితీరులో సామర్థ్యాన్ని పెంచే పేరుతో సాగుతున్న ఈ తొలగింపుల వల్ల ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అంతర్గత ఫోరమ్‌లలో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పారదర్శకమైన కమ్యూనికేషన్ లేకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: మరికొద్ది గంటల్లో ఫోన్లకు అలర్ట్! -
గూగుల్, మెటాలకు షాక్.. ఆస్ట్రేలియా కొత్త పన్ను
సోషల్ మీడియా దిగ్గజాలు మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్), గూగుల్, టిక్‌టాక్‌లకు ఆస్ట్రేలియా ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. జర్నలిజం మనుగడ కోసం, వార్తా సంస్థలకు చెల్లింపులు చేయని పక్షంలో భారీగా పన్ను వసూలు చేసేలా రూపొందించిన కొత్త ముసాయిదా చట్టాన్ని విడుదల చేసింది.వార్తలకు విలువివ్వాల్సిందేజర్నలిస్టుల కష్టానికి తగిన ద్రవ్య విలువ ఉండాలని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సృజనాత్మకమైన వార్తా కంటెంట్‌ను ఉపయోగించుకుని బహుళజాతి సంస్థలు లాభాలు గడించడం తగదు. ఆ కంటెంట్‌ను ఉత్పత్తి చేసే వారికి తగిన పరిహారం అందాలి. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నాణ్యమైన జర్నలిజం వెన్నెముక వంటిది’ అని పేర్కొన్నారు.ప్రతిపాదిత చట్టం ముఖ్యాంశాలువార్తా సంస్థలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి నిరాకరించే ప్లాట్‌ఫారమ్‌లపై ఈ చట్టం కొరడా ఝుళిపించనుంది.వార్తా ప్రచురణకర్తలతో ఒప్పందాలు చేసుకోని పక్షంలో, సదరు కంపెనీల వార్షిక ఆదాయంపై 2.25 శాతం పన్ను విధిస్తారు.వార్తా సంస్థలకు చెల్లింపులు చేసే ప్లాట్‌ఫారమ్‌లకు పన్ను మినహాయింపులు (ఆఫ్సెట్లు) లభిస్తాయి.ఈ పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని (సుమారు 200 - 250 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు), ఆయా వార్తా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం పంపిణీ చేయనుంది.పాత చట్టంలో లొసుగులు 2021లో తెచ్చిన 'న్యూస్ మీడియా బేరసారాల కోడ్' నుండి తప్పుకోవడానికి కొన్ని సంస్థలు తమ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి వార్తలను తొలగించాయి. తాజా చట్టాన్ని అటువంటి లొసుగులను అరికట్టేలా రూపొందించారు.భగ్గుమంటున్న టెక్ దిగ్గజాలుప్రభుత్వ నిర్ణయంపై మెటా, గూగుల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. ‘వార్తా సంస్థలు తమ ప్రయోజనం కోసమే మా ప్లాట్‌ఫారమ్‌లపై కంటెంట్‌ను పోస్ట్ చేస్తాయి. ఇది కేవలం ఒక పరిశ్రమ నుంచి మరో పరిశ్రమకు సంపదను బదిలీ చేసే పన్ను మాత్రమే’ అని మెటా విమర్శించింది. ఇప్పటికే తాము వార్తా సంస్థలతో ఒప్పందాలు కలిగి ఉన్నామని, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ వంటి ప్లాట్‌ఫారమ్‌లను మినహాయించి కేవలం తమనే లక్ష్యంగా చేసుకోవడం సరికాదని గూగుల్ పేర్కొంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో వార్తల ప్రాముఖ్యతను కాపాడటమే లక్ష్యమని ఆస్ట్రేలియన్ ప్రభుత్వం చెబుతుండగా, ఇది డిజిటల్ రంగంపై అనవసరపు భారమని టెక్ సంస్థలు వాదిస్తున్నాయి. ఈ ప్రతిపాదన చట్టరూపం దాల్చితే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలు కూడా ఇదే బాట పడతాయేమో చూడాలి. -
‘ఇక ఏదీ మునుపటిలా ఉండదు’
లండన్: కృత్రిమ మేధస్సు (ఏఐ) రాకతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ రంగంలో అలజడి చెలరేగుతోంది. గడిచిన 37 ఏళ్లలో ఎన్నడూ లేనంత దారుణమైన పరిస్థితిని ప్రస్తుత ఎంట్రీ-లెవల్ జాబ్ మార్కెట్ ఎదుర్కొంటోంది. ఏఐ దెబ్బకు అగ్రశ్రేణి యూనివర్సిటీల విద్యార్థులు సైతం ఉద్యోగాలు సాధించలేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ విపత్కర పరిణామాలను గమనించిన మెటా మాజీ ఎగ్జిక్యూటివ్ క్లారా షిహ్.. ‘ఇకపై ఏదీ మునుపటిలా ఉండదు’ అని హెచ్చరిస్తూనే, యువత (Gen Z) ఉద్యోగ వేట కోసం సరికొత్త ఏఐ సాధనాలను ఆశ్రయించాలన్నారు.టాపర్లనే దాటేసిన ఏఐ.. షాకింగ్ నిజాలుమెటా, సేల్స్ ఫోర్స్ వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసిన క్లారా షిహ్.. ఏఐ టెక్నాలజీతో పొంచి ఉన్న ముప్పును ప్రత్యక్షంగా చూశారు. తమ సంస్థలోని అత్యుత్తమ ఉద్యోగుల కంటే ఏఐ ఏజెంట్లు అనేక పనుల్లో వేగంగా, అద్భుతంగా పనిచేయడం చూసి ఆమె విస్తుపోయారు. ఆ క్షణమే భవిష్యత్తు ఉద్యోగాలన్నీ ఏఐ మయం కాబోతున్నాయని ఆమె గ్రహించారు. ఏఐ ప్రభావంతో తన స్నేహితులు, బంధువుల పిల్లలు కనీసం ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు కూడా సాధించలేకపోవడం చూసి చలించిపోయారు. ఈ సంక్షోభం నుంచి యువతను గట్టెక్కించేందుకు ఆమె ‘న్యూ వర్క్ ఫౌండేషన్’ అనే లాభాపేక్షలేని సంస్థను స్థాపించారు.ఏఐ దెబ్బకు ఏఐతోనే బదులుప్రస్తుతం వస్తున్న ఈ సాంకేతికతను చూసి భయపడటం కంటే, దానిని ఆయుధంగా మలచుకోవడమే ఏకైక మార్గమని క్లారా స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగం సంపాదించాలన్నా, ఉన్న దాన్ని కాపాడుకోవాలన్నా ఏఐ ఏజెంట్లను సమర్థవంతంగా వాడుకోవడంలో యువత నైపుణ్యం సాధించడం తప్పనిసరి. ఇందుకోసం ‘డియర్ సీసీ’ పేరుతో యువత కోసం ప్రత్యేక ఏఐ టూల్స్ ను ఆమె అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ‘ఫీల్డ్ రిపోర్ట్’ అనే టూల్.. విద్యార్థులు ఎంచుకున్న కెరీర్ లో ఉన్న ప్రస్తుత అవకాశాలు, అలాగే ఏఐ వల్ల ఆ రంగంలో పొంచి ఉన్న ఆటోమేషన్ ముప్పును విశ్లేషించి చెబుతుంది.రెజ్యూమ్ అక్కర్లేదు.. ‘జాబ్క్లా’తో కొత్త రకం వేటఉద్యోగాన్వేషణను మరింత సులభతరం చేసేందుకు ‘జాబ్ క్లా’ (JobClaw) అనే మరో అద్భుతమైన టూల్‌ను కూడా ఈ ఫౌండేషన్ పరిచయం చేసింది. దీనికి ఎలాంటి రెజ్యూమ్ అవసరం లేదు. కేవలం ఐదు సాధారణ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే చాలు, అభ్యర్థి ఆసక్తులు, బలాలు ఆధారంగా సరిపోయే ఉద్యోగాలను ఇది వెతికి పెడుతుంది. మరోవైపు ఏఐ విషయంలో యువతలో ఆందోళన, కోపం పెరుగుతున్నాయని గాలప్ సర్వే వెల్లడించింది. ఇది కూడా చదవండి: నాడు రోమాలపై హేళన.. నేడు ఇంటర్‌లోనూ టాపర్! -
ఊడిపోతున్న ఉద్యోగం.. ఇదిగో ఇదే వచ్చే పరిహారం
సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' (ఫేస్బుక్ మాతృసంస్థ) మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమైంది. మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఈ సంస్థ, తన మొత్తం శ్రామిక శక్తిలో సుమారు 10 శాతం మందిని అంటే దాదాపు 8,000 మందిని తొలగించబోతున్నట్లు సమాచారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలో పెట్టుబడులను పెంచడం, సంస్థాగత సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.మే 20 నుంచి ప్రక్రియ ప్రారంభం!తాజా నివేదికల ప్రకారం, ఈ లేఆఫ్స్ ప్రక్రియ మే 20 నుంచి ప్రారంభం కానుంది. కేవలం ఉద్యోగుల తొలగింపు మాత్రమే కాకుండా, సంస్థలో ఖాళీగా ఉన్న సుమారు 6,000 ఓపెన్ పొజిషన్ల భర్తీని కూడా మెటా నిలిపివేసింది. జనవరిలో మెటావర్స్ విభాగం (రియాలిటీ ల్యాబ్స్)లో 1,000 మందిని, మార్చిలో సేల్స్, ఆపరేషన్స్ విభాగాల్లో మరికొందరిని ఇప్పటికే తొలగించిన సంగతి తెలిసిందే.అందుకే ఈ మార్పులు!ఓపెన్ ఏఐ (OpenAI), గూగుల్, ఆంత్రోపిక్ వంటి దిగ్గజ సంస్థలతో ఏఐ రంగంలో పోటీ పడటానికి మెటా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కంపెనీని పునర్వ్యవస్థీకరిస్తోంది. కొన్ని రకాల కాంట్రాక్ట్ పనులను మానవ వనరుల నుండి తొలగించి, వాటి స్థానంలో ఏఐ ఆధారిత టూల్స్ ప్రవేశపెట్టాలని మెటా భావిస్తోంది. తక్కువ మేనేజ్మెంట్ పొరలతో, మరింత వేగంగా పనిచేసేలా సంస్థను తీర్చిదిద్దడమే జుకర్‌బర్గ్ లక్ష్యంగా కనిపిస్తోంది.తొలగించిన వారికి లభించే ప్రయోజనాలుబాధిత ఉద్యోగులను ఆదుకోవడానికి మెటా భారీ పరిహారాన్ని (Severance Package) ప్రకటించింది. నగదు పరిహారం కింద కనీసం 16 వారాల (4 నెలలు) బేస్ పేను చెల్లిస్తుంది. అలాగే కంపెనీలో పనిచేసిన ప్రతి ఏడాదికి అదనంగా రెండు వారాల వేతనంగా అందిస్తుంది. దీంతోపాటు సుమారు 18 నెలల వరకు కోబ్రా (COBRA) హెల్త్ కవరేజ్ కొనసాగుతుంది. విదేశీ ఉద్యోగులకు ఇమ్మిగ్రేషన్ సాయంతో పాటు, కెరీర్ సర్వీసెస్ (కొత్త ఉద్యోగ వేటలో సాయం) అందించనుంది."ఇది నిజంగా అవాంఛనీయ వార్త అని నాకు తెలుసు. దీనివల్ల ఉద్యోగులు అసౌకర్యానికి గురవుతారని అర్థం చేసుకోగలను. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థ ప్రయోజనాల దృష్ట్యా ఇది తప్పనిసరి" అని కంపెనీ అంతర్గత మెమోలో పేర్కొంది.2022-2023 కాలంలో మెటా ఇప్పటికే సుమారు 21,000 మందిని తొలగించింది. ఆ ఏడాదిని 'సామర్థ్యపు సంవత్సరం' (Year of Efficiency)గా జుకర్‌బర్గ్ అభివర్ణించారు. ప్రస్తుతానికి మెటా ఆర్థికంగా బలంగానే ఉన్నప్పటికీ, ఏఐ రంగంలో అగ్రస్థానానికి చేరుకోవడానికి ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: నెలకు రూ.1.90 లక్షల జీతం.. 4 నెలలే సంబరం! -
మెటాలో భారీ లేఆఫ్‌లు.. 16,000 మందిపై వేటు?
సోషల్ మీడియా దిగ్గజం మెటా ప్లాట్ఫార్మ్స్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోంది. రాబోయే నెలల్లో సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మొదటి దశ మే 20న ప్రారంభం కానుందని, తొలి విడతలోనే దాదాపు 8,000 మంది ఉగ్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ఇది మెటా ప్రపంచ శ్రామిక శక్తిలో సుమారు 10 శాతం వంతు కావడం గమనార్హం.మార్క్ జుకర్‌బర్గ్ నాయకత్వంలోని మెటా, ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై ప్రత్యేక దృష్టి సారించింది. భవిష్యత్తులో కార్యకలాపాలను మరింత ఆటోమేషన్ చేసే దిశగా కంపెనీ తన శ్రామిక శక్తిని పునర్నిర్మిస్తోంది. కేవలం ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్లు, సాఫ్ట్వేర్ అభివృద్ధి కోసమే ఏడాదికి సుమారు 135 బిలియన్ డాలర్ల భారీ వ్యయాన్ని కంపెనీ ప్రణాళిక చేస్తోంది. ఈ వ్యూహాత్మక మార్పుల వల్లే ప్రస్తుత ఉద్యోగ కోతలు అనివార్యమవుతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే 2022, 2023 మధ్య కాలంలో మెటా దాదాపు 21,000 మంది ఉద్యోగులను తొలగించింది. కోవిడ్ మహమ్మారి సమయంలో అధిక విస్తరణ, తదనంతర ఆర్థిక మందగమనం వల్ల ఆ నిర్ణయాలు తీసుకున్నట్లు అప్పట్లో కంపెనీ వెల్లడించింది. తాజాగా ఇప్పుడు ఏఐ పురోగతి, ఉద్యోగుల ఉత్పాదకతను ప్రాతిపదికగా తీసుకుని తుది జాబితాను ఎగ్జిక్యూటివ్‌లు సిద్ధం చేస్తున్నారు.నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, స్టాక్ మార్కెట్లో కంపెనీ పనితీరును మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ లేఆఫ్‌లు సాగనున్నాయి. 2026 చివరి నాటికి మరిన్ని ఉద్యోగ కోతలు ఉండే అవకాశం ఉందని, దీనివల్ల ప్రభావితమయ్యే మొత్తం ఉద్యోగుల సంఖ్య 16,000కు చేరుకోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిణామం ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో మరోసారి తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ సీఈవోకి భారీ వేతనం.. రూ.కోట్లలో హైక్ -
ఓపెన్ ఏఐ నిపుణులను తన్నుకుపోయిన మెటా!
కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచంలో ఆధిపత్యం కోసం సాగుతున్న పోరు కొత్త మలుపు తిరుగుతోంది. చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐకు గట్టి షాక్ ఇస్తూ ఆ సంస్థలోని అత్యంత కీలకమైన నిపుణులను మెటా ప్లాట్‌ఫారమ్స్ తన గూటికి చేర్చుకుంటోంది. సూపర్ కంప్యూటింగ్, భారీ డేటా సెంటర్ల నిర్మాణంలో ఆరితేరిన కొందరు అగ్రశ్రేణి ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులు ఇప్పుడు మార్క్ జుకర్‌బర్గ్ టీమ్‌లో చేరడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.మెటా గూటికి స్టార్గేట్ వ్యూహకర్తలుఓపెన్ ఏఐ మౌలిక సదుపాయాల విభాగంలో కీలకంగా నిలిచిన పీటర్ హోషెల్, షమీజ్ హేమానీ, అనుజ్ సహారాన్ ఇప్పుడు మెటాలో చేరారు. వీరు ఓపెన్ ఏఐ అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘స్టార్గేట్’ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన వారు. ఈ ప్రాజెక్ట్‌ను వందల బిలియన్ డాలర్ల వ్యయంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ సామర్థ్యాన్ని నిర్మించే లక్ష్యంతో చేపట్టారు. ఇప్పుడు ఈ నిపుణులు మెటా సొంత సూపర్ కంప్యూటింగ్ ప్రయత్నాలకు, ముఖ్యంగా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ విస్తరణకు కీలకంగా మారనున్నారు.జుకర్‌బర్గ్ భారీ స్కెచ్: రూ. 11 లక్షల కోట్ల పెట్టుబడి!ఏఐ రేసులో వెనుకబడకూడదనే పట్టుదలతో ఉన్న మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మౌలిక సదుపాయాల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. కేవలం ఈ ఏడాదిలోనే సుమారు 135 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.11.25 లక్షల కోట్లు) మూలధన వ్యయాన్ని మెటా అంచనా వేస్తోంది. దీర్ఘకాలికంగా వందల బిలియన్ డాలర్లను ఏఐ హార్డ్‌వేర్, చిప్స్, డేటా సెంటర్ల కోసం వెచ్చించాలని కంపెనీ నిర్ణయించింది. ఈ భారీ సామ్రాజ్యాన్ని నడిపించడానికి ఓపెన్ ఏఐ నుంచి వచ్చిన నిపుణులు దిక్సూచిగా మారనున్నారు.రక్షణలో ఓపెన్ ఏఐ..మరోవైపు, ఓపెన్ ఏఐ తన దూకుడుకు కాస్త బ్రేకులు వేసినట్లు కనిపిస్తోంది. కంపెనీ తన మౌలికసదుపాయాల వ్యూహాలను పునసమీక్షిస్తోంది. బ్రిటన్‌లో చేపట్టాలనుకున్న ‘స్టార్గేట్’ ప్రాజెక్టును కంపెనీ తాత్కాలికంగా పక్కన పెట్టింది. త్వరలో పబ్లిక్ లిస్టింగ్‌కు వెళ్లే ఆలోచనలో ఉన్న ఓపెన్ ఏఐ అపరిమితమైన ఖర్చులను నియంత్రించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే కొత్త సైట్లను లీజుకు తీసుకోవడాన్ని కూడా వాయిదా వేసింది.ఇదీ చదవండి: గ్రాట్యుటీ.. రిటైర్మెంట్ గిఫ్ట్! -
మెటాలో ఆగని కొలువుల కోత.. ఈసారి ఎందరంటే..
సోషల్ మీడియా దిగ్గజం, ఫేస్బుక్ మాతృసంస్థ మెటాలో ఉద్యోగుల తొలగింపుల పర్వం కొనసాగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగానికి పెద్దపీట వేస్తూ కంపెనీలో భారీ పునర్నిర్మాణ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో కాలిఫోర్నియాలో సుమారు 200 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఈ మేరకు కాలిఫోర్నియా ఎంప్లాయిమెంట్ డెవలప్మెంట్ డివిజన్(ఈడీడీ)కు మెటా అధికారిక నివేదికలను సమర్పించింది.కాలిఫోర్నియా విభాగంలో జరుగుతున్న ఈ మార్పుల వల్ల బర్లింగేమ్, సన్నీవేల్ కార్యాలయాల్లోని సిబ్బంది ప్రభావితం కానున్నారు. బర్లింగేమ్‌లో 124 ఉద్యోగాల తొలగింపు, సన్నీవేల్ 74 మంది ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ చెప్పింది. ఈ నిర్ణయం మే నెలాఖరు నుంచి అమలులోకి రానుంది. ఈ లేఆఫ్స్ శాశ్వత ప్రాతిపదికన ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది.ఈ ఏడాది ప్రారంభం నుంచి మెటాలో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. జనవరి 2026లో మెటావర్స్ ప్రాజెక్ట్ రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో దాదాపు 1,500 మందిని తొలగించారు. మార్చి 2026లో రిక్రూట్మెంట్, సేల్స్, ఆపరేషన్స్ విభాగాల్లో సుమారు 700 మందిపై వేటు పడింది. తాజాగా కాలిఫోర్నియా రీజియన్‌లో మరో 200 మందికి ఉద్వాసన పలికారు.ఏఐ పెట్టుబడులే ప్రధాన కారణంఈ ఏడాది ఏఐ మౌలిక సదుపాయాల (డేటా సెంటర్లు, సర్వర్లు) కోసం మెటా దాదాపు 115 బిలియన్ డాలర్ల నుంచి 135 బిలియన్ డాలర్ల మధ్య మూలధన వ్యయాన్ని అంచనా వేసింది. సాధారణ పనుల కోసం మానవ వనరుల కంటే ఏఐ సాధనాలపైనే కంపెనీ ఎక్కువగా ఆధారపడుతోంది. ఒకవైపు తొలగింపులు జరుగుతున్నప్పటికీ హై-లెవల్ టెక్నికల్ ఏఐ ఉద్యోగాల కోసం కంపెనీ కొత్త నియామకాలను చేపడుతోంది.ఇదీ చదవండి: ట్రంప్ పాచిక పారేనా? -
మెటా లేఆఫ్స్.. ఏఐ కోసం ఉద్యోగులపై వేటు?
సోషల్ మీడియా దిగ్గజం మెటా ప్లాట్‌ఫారమ్స్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. కంపెనీకి చెందిన కీలక విభాగాల్లో వందలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘ది ఇన్ఫర్మేషన్’ నివేదిక ప్రకారం, ఈ లేఆఫ్స్ ప్రధానంగా రియాలిటీ ల్యాబ్స్, సోషల్ మీడియా బృందాలు, రిక్రూట్మెంట్ విభాగాలపై ప్రభావం చూపనున్నాయి.ఖర్చుల నియంత్రణే లక్ష్యం?ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు మెటా చేస్తున్న భారీ పెట్టుబడులే ఈ తొలగింపులకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను మెటా మొత్తం ఖర్చులు 162 బిలియన్ల డాలర్లు నుంచి 169 బిలియన్ డాలర్ల మధ్య ఉంటాయని అంచనా. అగ్రశ్రేణి ఏఐ నిపుణులను ఆకర్షించేందుకు, వారిని నిలుపుకునేందుకు కంపెనీ మిలియన్ల కొద్దీ డాలర్లను వేతనాల రూపంలో వెచ్చిస్తోంది. ఈ అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి ఇతర విభాగాల్లో సిబ్బందిని తగ్గిస్తోంది. దాంతో కేవలం టెక్నికల్ విభాగాలే కాకుండా సేల్స్ విభాగంలోని పరిమిత సంఖ్యలో ఉద్యోగులపై కూడా ఈ ప్రభావం ఉండనుంది.నిజానికి ఈ ఉద్యోగ కోతలు ఆకస్మికమైనవి కావు. ఈ నెల ప్రారంభంలోనే రాయిటర్స్ ఒక నివేదికలో మెటా తన మొత్తం శ్రామిక శక్తిలో 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ మందిని తొలగించే ఆలోచనలో ఉందని పేర్కొంది. ఇప్పటికే సీనియర్ నాయకులకు ఈ మేరకు సమాచారం అందిందని, సిబ్బంది తగ్గింపునకు సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.ఇతర కంపెనీలు ఇలా..అమెజాన్అమెజాన్ తన కార్పొరేట్ విభాగంలో భారీ మార్పులు చేస్తోంది. 2026 ప్రారంభంలోనే సుమారు 16,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించింది. కంపెనీలో మధ్యస్థాయి మేనేజ్మెంట్ హైరార్కీలను తగ్గించి నిర్ణయాధికారాన్ని వేగవంతం చేయాలని సీఈఓ ఆండీ జస్సీ నిర్ణయించారు. దీనివల్ల బ్యూరోక్రసీ తగ్గి ఏఐ ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం సులభమవుతుందని వారి భావన.మైక్రోసాఫ్ట్మైక్రోసాఫ్ట్ తన క్లౌడ్ (అజూర్), ఏఐ విభాగాలకు పెద్దపీట వేస్తూనే ఇతర విభాగాల్లో కోతలు విధిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే పలు విడతల్లో వేలాది మందిని తొలగించింది. డేటా సెంటర్ల నిర్మాణం కోసం మైక్రోసాఫ్ట్ ఏటా దాదాపు 80 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. ఈ భారీ పెట్టుబడులను బ్యాలెన్స్ చేయడానికి మార్కెటింగ్, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో ఉద్యోగాలను తగ్గిస్తోంది.గూగుల్గూగుల్ తన అడ్వర్టైజింగ్ సేల్స్, హార్డ్‌వేర్ విభాగాల్లో మార్పులు చేస్తోంది. ఏఐ సహాయంతో పనులను ఆటోమేట్ చేయడం ద్వారా తక్కువ మందితో ఎక్కువ ఉత్పాదకత సాధించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఎఫిషియెన్సీ పేరుతో కస్టమర్ సపోర్ట్ వంటి విభాగాల్లో ఉద్యోగులను తగ్గిస్తోంది.ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన? -
దిగ్గజ కంపెనీ లేఆఫ్స్.. 16వేల మంది ఇంటికి!
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలు ఇటీవల తమ ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగించాయి. ఇప్పుడు తాజాగా.. మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా సంస్థలోని 20శాతం లేదా అంతకంటే ఎక్కువ మందిని తొలగించడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.గత సంవత్సరం నుంచి కంపెనీ సీఈఓ జుకర్‌బర్గ్ ఏఐలో పెట్టుబడులను విపరీతంగా పెంచుతున్నారు. మెటా ఉత్పాదకను పెంచడంలో భాగంగా.. తగిన చర్యలు తీసుకుంటోంది. ఇది సంస్థలోని 16,000 ఉద్యోగులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే లేఆఫ్స్ ఎప్పుడు ఉంటాయనే విషయం మాత్రం అధికారికంగా వెల్లడికాలేదు. కాగా కంపెనీలో డిసెంబర్ 31 నాటికి దాదాపు 79,000 మంది పనిచేస్తున్నట్లు సమాచారం.మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని సంస్థ ఏఐ స్టార్టప్‌లను కొనుగోలు చేయడానికి బిలియన్ల కొద్దీ ఖర్చు చేసింది. చైనీస్ ఏఐ స్టార్టప్, మనుస్‌ను కొనుగోలు చేయడానికి కంపెనీ కనీసం 2 బిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంది. మానవులు పోస్ట్ చేయడానికి అనుమతించని ఏఐ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన మోల్ట్‌బుక్‌ను కొనుగోలు చేయాలనే ప్రణాళికలను కూడా ఇటీవల ప్రకటించింది.ఏఐ కారణంగా లేదా ఏఐను ఉపయోగించుకోవడంలో భాగంగా.. ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో మెటా మాత్రమే కాకుండా.. అమెజాన్, యాక్సెంచర్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, SaaS దిగ్గజం అట్లాసియన్ కూడా ఉన్నాయి. జనవరిలో అమెజాన్ తన శ్రామిక శక్తిలో 1 శాతం లేదా దాదాపు 16,000 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అట్లాసియన్ కూడా AIపై ఎక్కువ ఖర్చు చేయడానికి 1,600 మంది కార్మికులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. -
ఎన్‌సీఎల్‌ఏటా విధివిధానాలకు కట్టుబడతాం
న్యూఢిల్లీ: ప్రకటనల సంబంధిత డేటాకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గోప్యత, అంగీకార నిర్దేశకాలను వర్తింపజేస్తామని సోషల్ నెట్వర్కింగ్ వేదిక వాట్సాప్, దాని మాతృ సంస్థ మెటా సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపాయి. ఈ విషయంలో ఎన్‌సీఎల్‌ఏటా విధివిధానాలకు కట్టుబడతామని పేర్కొన్నాయి.ఎన్‌సీఎల్‌ఏటా నిర్దేశాలను సవాలు చేస్తూ ఆ సంస్థలు పెట్టుకున్న పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీ ధర్మాసనం విచారణ జరిపింది. ట్రిబ్యునల్ నిర్దేశాలను మార్చి 16 కల్లా అమలు చేయాలని మెటా, వాట్సాప్ నిర్ణయించినట్టు వాటి తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ దాఖలు చేసిన విజ్ఞాపనలను పరిగణనలోకి తీసుకుంది. దాంతో వాట్సాప్, మెటా పిటిషన్లను పరిష్కరించినట్టు భావించాలని ధర్మాసనం పేర్కొంది.ప్రైవసీ పాలసీ ఉల్లంఘనకు సంబంధించి వాట్సాప్‌కు సీసీఏ గతంలో రూ.213.14 కోట్ల జరిమానా విధించడం తెలిసిందే. డేటా షేరింగ్ పేరిట పౌరుల భద్రతతో ఆటలాడటాన్ని అనుమతించబోమని ఫిబ్రవరి 3న మెటా, వాట్సాప్‌లను సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. చదవండి: ఏఐ గుప్పిట్లోకి కోచింగ్ మాడ్యూల్ -
నాకేం నష్టం లేదు!
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అన్వేష్ మరో వివాదానికి తెరలేపాడు. ఇతడి ఇన్‌స్ట్రాగాం ఖాతా ‘నా అన్వేషణ’ను హైదరాబాద్ పోలీసులు గురువారం బ్లాక్ చేయించారు. దీనివల్ల తనకు ఏం నష్టం లేదని అంటూ బత్తాయిలూ అని వ్యాఖ్యానిస్తూ రూపొందించిన వీడియోను అన్వేష్ శుక్రవారం విడుదల చేశారు. ఇందులో ప్రత్యక్షంగానే నగర పోలీసులకు సవాల్ విసిరారు. ఇప్పుడు దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.అన్వేష్ వీడియోలో చేసిన వ్యాఖ్యలివి...‘నమస్తే అందరికీ.. నా ఇన్స్టాగ్రామ్ చానల్ బ్లాక్ అయ్యిందని బాధపడుతున్నాననుకున్నారా బత్తాయిలూ... రూపాయి రాని ఇన్స్టాగ్రామ్ ఉంటే ఏమిటి? పోతే ఏమిటి? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి.. ఈ రెండు చేతులు నా రెండు ఇన్స్టాగ్రామ్ ఖాతాల న్న మాట. ఈ రెండు కాళ్లూ నా రెండు యూట్యూబ్ చానళ్లు అన్నమాట. నా బాడీ ఫేస్ అన్నమాట... ఈ ఐదింటినీ నడిపించేలా తెలివైన బుర్ర. బత్తాయిలందరూ కలిసి ఓ చెయ్యి విరగొట్టారు. ఇంకో చెయ్యి ఉంది... రెండు కాళ్లు ఉన్నాయి.ఈ ఇన్స్టాగ్రామ్ (మరో చెయ్యి) విరగ్గొట్టినా పరిగెత్తుకుంటూ వెళ్లిపోతాను. ఒక కాలు తీసేస్తే ఒంటి కాలుతో వెళ్లిపోతాను. రెండు కాళ్లూ తీసేసినా బాడీ ఉంది దేక్కుంటూ వెళ్లిపోతా. బాడీ కూడా నరికేసినా తల ఉంది మాట్లాడుకుంటూ వెళ్లిపోతాను. నేను దొరికితే తియ్యాల్సింది తల. నాకు యూట్యూబ్‌లో గత నెల రూ.తొమ్మిది లక్షల లాభం వచి్చంది. బత్తాయిల్ని క్షమించేది లేదు. నిద్రపోనివ్వను. 2026లో నరకం చూపిస్తాను. నేను ఎవరినీ దేకను’. అని తనదైన శైలిలో ఆడియో విడుదల చేశారు. -
యూట్యూబర్ ‘నా అన్వేషణ’కు మెటా బిగ్‌షాక్!
సాక్షి,హైదరాబాద్: ప్రముఖ యూట్యూబర్ 'నా అన్వేష్' కు బిగ్ షాక్ తగిలింది. ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ మెటా అన్వేష్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేసింది.ఇటీవల అన్వేష్ దేశాన్ని దూషించడంతో పాటు మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల్లో తన సోషల్ మీడియా అకౌంట్లలో అన్వేష్ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.ఫిర్యాదులపై హైదరాబాద్ సీసీఎస్ పోలీలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అన్వేష్ సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించారు. వాటిల్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కంటెంట్ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నట్లు గుర్తించారు. ఇదే అంశంపై ఇన్‌స్టా మాతృ సంస్థ మెటాను సంప్రదించారు. అన్వేష్ అకౌంట్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. మెటా సైతం అన్వేష్ ఇన్‌స్టా అకౌంట్లను పరిశీలించింది. అనంతరం, అతడి అకౌంట్లపై నిషేదం విధించింది. గతంలో అన్వేష్ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 1.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండేవారు. హిందూమతం, భారతదేశంపై అనుచిత కామెంట్లు చేయడంతో అతడి ఫాలోవర్ల సంఖ్య 1.3 మిలియన్లకు తగ్గింది. తాజాగా ఖాతా పూర్తిగా బ్యాన్ అయింది -
పౌరుల గోప్యతను పాటించకపోతే దేశం విడిచి వెళ్లిపోండి: సుప్రీంకోర్టు
సాంకేతికత లేదా వ్యాపార పద్ధతుల పేరుతో భారత పౌరుల గోప్యతా హక్కును హరించలేరని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. డేటా షేరింగ్ నెపంతో ప్రజల వ్యక్తిగత సమాచారంతో ఆటలాడటం సరికాదని మెటా, వాట్సాప్ సంస్థలను అత్యున్నత ధర్మాసనం తీవ్రంగా హెచ్చరించింది. దీనిలో పౌరుల గోప్యతను పాటించకపోతే దేశం విడిచి వెళ్లిపోవచ్చని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరించారు.సమాచారాన్ని దొంగిలించడానికి ఇదో మార్గంవాట్సాప్ తీసుకొచ్చిన వివాదాస్పద గోప్యతా విధానంపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. వినియోగదారుల ‘సమ్మతి’(Consent), ‘ఆప్ట్-అవుట్’(వైదొలగడం) మెకానిజంపై కంపెనీల వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ‘టెక్ కంపెనీల నిబంధనలు సామాన్యులకు అర్థం కానంత తెలివిగా రూపొందించారు. అసలు ‘వైదొలగడం’(ఆప్ట్-అవుట్) అనే విధానం ఎక్కడ ఉంది? ఇది ప్రైవేట్ సమాచారాన్ని దొంగిలించడానికి ఒక తెలివైన మార్గం’ అని కోర్టు వ్యాఖ్యానించింది.కేసు నేపథ్యం ఏమిటి?2021లో వాట్సాప్ ప్రవేశపెట్టిన గోప్యతా విధానంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ.213.14 కోట్ల భారీ జరిమానా విధించింది. దీన్ని సవాలు చేస్తూ మెటా సంస్థ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)ను ఆశ్రయించగా అక్కడ కూడా కంపెనీకి చుక్కెదురైంది. వినియోగదారులు వాట్సాప్ వాడాలంటే తప్పనిసరిగా డేటా షేరింగ్‌కు అంగీకరించాలనే నిబంధన వినియోగదారులను బలవంతం చేయడమేనని గతంలో ఎన్సీఎల్ఏటీ స్పష్టం చేసింది. వాట్సాప్ తన మార్కెట్ ఆధిపత్యాన్ని ఉపయోగించుకుని అన్యాయమైన నిబంధనలను విధిస్తోందని రెగ్యులేటర్లు నిర్ధారించాయి.కేసు పరిధి విస్తరణఈ వివాదాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు కేసు పరిధిని మరింత విస్తరించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను (మైటీ) ఈ విచారణలో చేర్చింది. ఈ వ్యవహారంపై ఫిబ్రవరి 9వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం ప్రకటించింది. ప్రకటనల ప్రయోజనాల కోసం మెటా గ్రూప్ కంపెనీలతో డేటాను పంచుకోవడాన్ని ఐదేళ్లపాటు నిషేధించిన సీసీఐ ఉత్తర్వులను కూడా పరిగణనలోకి తీసుకుని పౌరుల డేటా రక్షణపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది.ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు -
హాయ్ ఫ్రెండ్స్... ఇన్‌స్టా ఇకపై ఫ్రీ కాకపోవచ్చు!
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ వంటి తన ప్లాట్‌ఫాంలలో కొత్త చెల్లింపు సబ్స్క్రిప్షన్లను ప్రవేశపెట్టేందుకు మెటా సిద్ధమవుతోంది. యాప్‌ల ప్రాథమిక వెర్షన్లు ఉచితంగానే కొనసాగుతాయి. అయితే ఉత్పాదకత, సృజనాత్మకత, ఆధునిక ఏఐ (AI) టూల్స్‌తో వచ్చే అదనపు ఫీచర్ల కోసం ప్రీమియం ప్లాన్లను పరీక్షించనున్నట్లు మెటా టెక్‌క్రంచ్‌కు ధ్రువీకరించింది.మెటా ప్రకారం.. ప్రతి యాప్‌కు దాని ప్రత్యేక ప్రయోజనాలకు అనుగుణంగా వేర్వేరు సబ్స్క్రిప్షన్ ప్లాన్లు ఉంటాయి. ఒకే స్థిరమైన ప్లాన్‌కు బదులుగా, వివిధ ఫీచర్ బండిల్స్‌ను ప్రయోగాత్మకంగా అందించి, వినియోగదారులకు ఏవి ఉపయోగకరంగా ఉంటాయో తెలుసుకోవాలని కంపెనీ భావిస్తోంది.ఈ సబ్స్క్రిప్షన్లలో ప్రధానంగా ఏఐ ఫీచర్లు ఉండనున్నాయి. మెటా ఇటీవల సుమారు 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన ‘మానస్’ ఏఐ ఏజెంట్‌ను విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావాలని యోచిస్తోంది. మానస్‌ను మెటా యాప్‌లలోనే భాగంగా చేర్చడమే కాకుండా, వ్యాపారాల కోసం ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్‌గా కూడా అందించనుంది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో మానస్ ఏఐ షార్ట్‌కట్‌ను జోడించే పనిలో మెటా ఉంది.అలాగే, అధునాతన ఏఐ ఫీచర్లకు ఛార్జీలు వసూలు చేయాలని కూడా మెటా భావిస్తోంది. ఉదాహరణకు, ‘వైబ్స్’ అనే ఏఐ ఆధారిత షార్ట్-ఫార్మ్ వీడియో టూల్. దీంట్లో ఏఐని ఉపయోగించి వీడియోలను సృష్టించడం, రీమిక్స్ చేయడం వంటివి చేయొచ్చు. ఇప్పటివరకు ఉచితంగా ఉన్న ఈ ఫీచర్‌ను ఫ్రీమియం మోడల్‌కు మార్చే యోచనలో మెటా ఉంది.ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్స్క్రిప్షన్ తీసుకునే వినియోగదారులకు అపరిమిత ఆడియన్స్ లిస్టులు సృష్టించే అవకాశం, ఎవరు తిరిగి ఫాలో చేయడం లేదో తెలుసుకునే ఫీచర్, స్టోరీలను అనామకంగా వీక్షించే సౌకర్యం (పోస్టర్‌కు తెలియకుండా) వంటి అదనపు ఫీచర్లు అందుబాటులోకి రావొచ్చు.కాగా ఈ కొత్త సబ్స్క్రిప్షన్లు, మెటా వెరిఫైడ్ వేరువేరు. మెటా వెరిఫైడ్ ప్రధానంగా క్రియేటర్లు, బిజినెస్ అకౌంట్ల కోసం రూపొందించినది. ఇందులో వెరిఫైడ్ బ్యాడ్జ్, డైరెక్ట్ సపోర్ట్, ఇంపర్సనేషన్ ప్రొటెక్షన్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. రాబోయే కొత్త సబ్స్క్రిప్షన్లు మాత్రం సాధారణ రోజువారీ యాజర్ల కోసం తీసుకొస్తున్నవి. -
ఈ పనిచేయండి.. ఉద్యోగాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయ్?!
వాషింగ్టన్: ఉద్యోగార్ధులకు ముఖ్య గమనిక!. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా?. వరుస పెట్టి రెజ్యూమేలు పంపిస్తున్నారా? అయినా ఇంటర్వ్యూ కాల్స్ రావడం లేదా?. అయితే, ఉద్యోగాల కోసం మీరు చేస్తున్న ప్రయత్నాల్ని వెంటనే ఆపేయండి. జస్ట్ ఈ పనిచేయండి చాలు. కాళ్లరిగేలా ఆఫీసులు చుట్టూ తిరగక్కర్లేదు. రిఫరెన్స్ ఇవ్వమని ప్రాధేయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మిమ్మల్నే వెతుక్కుంటూ ఉద్యోగాలు వస్తాయి. ఎలా అంటారా? కెనడాకు చెందిన మార్మిక్ పటేల్ అమెరికాలో ఐటీ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. తన ఎడ్యుకేషన్,స్కిల్స్,ఎక్స్పీరియన్స్ ఆధారంగా అందరిలాగే తాను రెజ్యూమేలు తయారు చేసి పంపించేవాడు. పదులు,ఇరవైల నుంచి వందల కొద్దీ రెజ్యూమేలు పంపిస్తున్నాడు. ఉద్యోగం కావాలని వేల మంది రిక్రూటర్లకు మెసేజ్‌లు పెడుతున్నారు. రిక్రూటర్ల నుంచి ఎలాంటి స్పందన వచ్చేది కాదు. ఇక లాభం లేదని రూటు మార్చాడు. అంతే.. ఐదు నెలల్లో 83 మంది రిక్రూటర్లు మా కంపెనీలు ఉద్యోగం ఉందని ఆఫర్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇంతకీ మార్మిక్ పటేల్ చేసిందేంటో తెలుసా? పబ్లిసిటీ.అవును ఆయన గురించి ఆయన గొప్పగా చెప్పుకోవడం. ఇలా చెప్పుకోవడం చేతగాకపోతే ఉద్యోగం చేయడం, బిజినెస్ చేయాలనే ప్రయత్నాలు పక్కన పెట్టాలని సలహా ఇస్తున్నాడు. మీరు ఎంత చదివితేం. మీకంటూ ఓ స్కిల్ ఉందని అందరికి తెలియాలి కదా. అప్పుడే మనమేంటో ఈ ప్రపంచానికి తెలిసేది. చాలా మంది అనుకోవచ్చు. నా గురించి నేను గొప్పలు చెప్పుకుంటే ఏం బాగుంటుందని. అలా చెప్పుకోవాలి బ్రదర్. మార్కెట్లో అవకాశాలు సమానంగా పంచరు. 90 శాతం మందిలో 10శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు దక్కుతున్నాయి.ఇప్పుడు వారిలో నేనున్నందుకు సంతోషంగా ఉంది. ఇంతకీ నేను చేసిన పని ఏంటని అనుకుంటున్నారా? సంప్రదాయ పద్ధతిలో ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం అత్యంత మూర్ఖమైన పని. అందుకే ఉద్యోగాలకు అప్లయి చేసే స్ట్రాటజీ మార్చాను. నా డొమైన్‌కు సంబంధించిన స్కిల్‌ను బిల్డ్ చేశాను. కంటెంట్ క్రియేట్ చేయడం, నెట్వర్కింగ్ పెంచుకుంటూ వెళ్లా. ఫలితంగా ఊహించని విధంగా నా కెరియర్ మలుపు తిరిగింది.నాకు ఉద్యోగం ఇచ్చేందుకు ఏఐ కంపెనీలు,వైకాంబినేటర్ స్టార్టప్స్,యూనికార్న్ కంపెనీలు ముందుకు వచ్చాయి. ప్రస్తుతం మెటా కంపెనీలో టెక్కీగా విధులు నిర్వహిస్తున్నాడు. జాబ్ కోసం ప్రయత్నించే సమయంలో ఇలాంటి వ్యూహాలు అమలు చేస్తే ఉద్యోగం పక్కగా వస్తుందని చెప్పుకొచ్చాడు. చివరిగా.. విజేతల్నే ప్రపంచం గుర్తుంచుకుంటుంది. విజయం సాధించడం, విజేతలుగా నిలవడం తప్ప మనకు వేరే మార్గం లేదని ముగించాడు. applying to jobs is the dumbest shit you can ever do.i learned the hard way. dmed a 1000 recruiters/engineers. did 670 apps. didn't get me anything. cause its not equally distributed: the top 10% of people take 90% of the jobs. it's the same everywhere else. the hottest… https://t.co/gEpcaViXS1— Marmik Patel (@Marmik_Patel19) January 12, 2026 -
ఫేక్ యాడ్స్ మోసం.. వివాదంలో మెటా!
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృ సంస్థ అయిన మెటా (Meta).. తన ప్లాట్‌ఫామ్‌లలో మోసపూరిత ప్రకటనల ద్వారా బిలియన్ డాలర్లు సంపాదిస్తున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఇంతకీ ఈ వివాదం ఏమిటి? దీనిపై మెటా స్పందన ఏమిటి? అనే విషయాలను ఇక్కడ చూసేద్దాం.మెటాపై విమర్శలుమోసపూరిత ప్రకటనలను సంస్థ గుర్తించినప్పటికీ.. కఠినమైన చర్యలు తీసుకోలేదు. స్కామర్ల ప్రకటనల వల్ల మెటాకు అడ్వర్టైజింగ్ రూపంలో భారీ లాభాలు వస్తున్నాయి. కాబట్టి మెటా అటువంటి ప్రకటనలను అరికట్టడం లేదని నివేదికలు చెబుతున్నాయి. సామాన్య ప్రజలు.. ముఖ్యంగా యువత, వృద్ధులు ఈ మోసాలకు బలయ్యారు. దీంతో అనేక దేశాలు మెటాపై విమర్శలు కురిపిస్తున్నాయి. ముఖ్యంగా చైనాకు సంబంధించిన స్కామ్ ప్రకటనలకు విషయంలో లెక్కలేనన్ని ప్రశ్నలు పుడుతున్నాయి.మెటా తన ప్లాట్‌ఫామ్‌లలో స్కామ్.. ఇతర మోసపూరిత ప్రకటనలను ప్రసారం చేయడం ద్వారా ఏటా బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. గత ఏడాదిలో కంపెనీ.. ఒక్క చైనీస్ కంపెనీల ప్రకటనల నుంచి 18 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ డబ్బు సంపాదించిందని, ఇది కంపెనీ ప్రపంచ ఆదాయంలో 10 శాతం కంటే ఎక్కువ అని రాయిటర్స్ దర్యాప్తులో వెల్లడించింది.స్కామ్ ఎగుమతి దేశంగా చైనా!చైనాలో ఫేస్బుక్ & ఇన్‌స్టాగ్రామ్‌లను నిషేదించినప్పటికీ.. అక్కడి కంపెనీలు విదేశీ వినియోగదారులకు ప్రకటనలు ఇవ్వడానికి అనుమతి ఉంది. ఈ విధంగా.. మెటా ప్లాట్‌ఫామ్‌లలో దాదాపు 25% స్కామ్ & నిషేధిత ప్రకటనలు చైనావే కావడం గమనార్హం. దీంతో చాలామంది చైనాను స్కామ్ ఎగుమతి దేశంగా అభివర్ణించారు.అయితే.. చైనా నుంచి వచ్చే స్కామ్ యాడ్లను అరికట్టడానికి మెటా తాత్కాలికంగా ఒక యాంటీ ఫ్రాడ్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందాన్ని ఏర్పాటు చేసిన తరువాత కంపెనీ ఆదాయం 19 శాతం నుంచి 9 శాతానికి తగ్గిపోయింది. దీంతో మెటా ఆ బృందాన్ని 2024 చివరలో రద్దు చేసి, చైనీస్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలపై ఆంక్షలు ఎత్తివేసింది. ఆ తరువాత ఆదాయం మళ్లీ 16%కి పెరిగింది.మెటా స్పందనమెటా ప్రతినిధి ఆండీ స్టోన్ (Andy Stone) రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. యాంటీ ఫ్రాడ్ టీమ్ కేవలం తాత్కాలిక చర్య మాత్రమేనని అన్నారు. సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్.. ఆ బృందాన్ని రద్దు చేయాలని ఆదేశించలేదని, స్కామ్ కార్యకలాపాలను తగ్గించడానికి ప్రపంచవ్యాప్త ప్రయత్నాలను ముమ్మరం చేయాలని కంపెనీని ఆదేశించారని ఆయన స్పష్టం చేశారు. గత 18 నెలల్లో, మెటా తన ప్లాట్‌ఫామ్‌ల నుంచి 46 మిలియన్ల చైనీస్ ప్రకటనలను తొలగించిందని వెల్లడించారు.ఇదీ చదవండి: 26ఏళ్ల వయసు.. ఫోర్బ్స్ జాబితాలో చోటు: ఎవరీ కళ్యాణి రామదుర్గం? -
ఎన్వీడియాకు గూగుల్ గట్టి దెబ్బ
మెటా ప్లాట్‌ఫామ్స్ ఇంక్ తన ఏఐ డేటా సెంటర్లలో గూగుల్ టెన్సర్ ఏఐ చిప్‌లను వాడేందుకు బిలియన్ డాలర్లు ఖర్చు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృ సంస్థ మెటా ఈ కీలక నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం ఏఐ కంప్యూటింగ్ రంగంలో టాప్‌లో ఉన్న ఎన్వీడియాకు గట్టి దెబ్బ తగలబోతుందని కొందరు అంచనా వేస్తున్నారు.2027లో ఏఐ డేటా సెంటర్లలో గూగుల్ టీపీయూలుపరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం మెటా తన ఏఐ డేటా సెంటర్లలో 2027 నాటికి గూగుల్ టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లను(TPU) ఉపయోగించేందుకు చర్చలు జరుపుతోంది. దాంతోపాటు వచ్చే ఏడాది గూగుల్ క్లౌడ్ నుంచి కూడా ఈ చిప్‌లను మెటా అద్దెకు తీసుకునే అవకాశం ఉంది. గూగుల్ ఇప్పటికే ఆంత్రోపిక్ పీబీసీకి 1 మిలియన్ టెన్సర్ చిప్‌లను సరఫరా చేస్తోంది.గూగుల్ టెన్సర్ఏఐ పనుల కోసం దాదాపు 10 సంవత్సరాల క్రితం టెన్సర్ చిప్‌ను గూగుల్ అభివృద్ధి చేసింది. ఎన్వీడియా చిప్‌లపై అతిగా ఆధారపడటంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఏఎండీ వంటి ప్రత్యర్థులు ఉన్నప్పటికీ గూగుల్ టెన్సర్ చిప్స్ ఊపందుకుంటున్నాయి.ఎన్వీడియా చిప్స్ఎన్వీడియా బ్లాక్వెల్ వంటి చిప్‌లు ప్రాథమికంగా గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (GPU). ఇవి గత దశాబ్దంలో వీడియో గేమ్‌లకు కీలకంగా ఉండేవి. లార్జ్ డేటాను నిర్వహించగల సామర్థ్యం కారణంగా ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఇవి చాలా అనుకూలంగా మారాయి.ఇదీ చదవండి: బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్.. వివరాలివే.. -
మెటాకు బైబై చెప్పిన ఏఐ గాడ్ ఫాదర్
ఆధునిక కృత్రిమ మేధ(AI) గాడ్ ఫాదర్‌ల్లో ఒకరిగా పరిగణించబడే ప్రముఖ కంప్యూటర్ సైంటిస్ట్ యాన్ లెకున్ మెటా (Meta) నుంచి తప్పుకుంటున్నట్లు ధ్రువీకరించారు. తన సొంత ఏఐ స్టార్టప్‌ను ప్రారంభించేందుకు 12 ఏళ్ల అనుబంధం తర్వాత లెకున్ మెటాకు వీడ్కోలు పలుకుతున్నారు. 65 ఏళ్ల లెకున్ తన లింక్డ్ఇన్ పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.‘మీలో చాలా మంది ఇటీవలి మీడియా కథనాల్లో విన్నట్లుగా నేను 12 సంవత్సరాల తర్వాత మెటాను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాను. FAIR (ఫేస్బుక్ AI రీసెర్చ్) వ్యవస్థాపక డైరెక్టర్‌గా 5 సంవత్సరాలు, చీఫ్ AI సైంటిస్ట్‌గా 7 సంవత్సరాలు అందులో పని చేశాను’ అని ప్రకటించారు. లెకున్ 2013లో మెటాలో (అప్పటి ఫేస్బుక్) వ్యవస్థాపక డైరెక్టర్‌గా చేరారు.లెకున్ నిష్క్రమణ గురించి చాలా కాలంగా పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. కంపెనీలో ఇటీవలి అంతర్గత మార్పులు AI భవిష్యత్తుపై లెకున్ దృష్టికి మధ్య తేడాలున్నట్లు కొందరు చెబుతున్నారు. ఏఐ ఉత్పత్తులు, వాణిజ్య ప్రాజెక్టులపై మరింత దృష్టి పెట్టడానికి మెటా ఇటీవల తన ఏఐ బృందాలను పునర్వ్యవస్థీకరించింది. ఇందులో భాగంగా అలెగ్జాండర్ వాంగ్ నేతృత్వంలో సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అనే కొత్త విభాగం సృష్టించారు. ఈ మార్పు కారణంగా గతంలో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ క్రిస్ కాక్స్‌కు రిపోర్ట్ చేసిన లెకున్, ఇప్పుడు 28 ఏళ్ల వాంగ్‌కు రిపోర్ట్ చేయాల్సి వస్తుంది.సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ద్వారా ఒకప్పుడు మెటాలో ప్రధాన ఏఐ శాస్త్రవేత్తగా లెకున్ అనుభవించిన స్వాతంత్య్రం తగ్గిపోయిందనే వాదనలున్నాయి. అక్టోబర్‌లో మెటా 600 మంది ఉద్యోగులను తొలగించినప్పుడు ప్రభావితమైన వారిలో చాలా మంది లెకున్ ఏర్పాటు చేసిన ఫేస్బుక్ ఏఐ రీసెర్చ్(FAIR) నుంచే ఉన్నారు. ప్రస్తుతం లెకున్ అడ్వాన్స్డ్ మెషిన్ ఇంటెలిజెన్స్ (AMI) స్టార్టప్‌పై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: జీవిత బీమా వెనుక భారీ సంపద రహస్యం -
ఎన్సీఎల్ఏటీలో వాట్సప్‌కి పాక్షిక ఊరట
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్‌లో (ఎన్సీఎల్ఏటీ) మెసేజింగ్ యాప్ వాట్సాప్‌నకు పాక్షిక ఊరట లభించింది. అడ్వర్టైజింగ్ అవసరాల కోసం మాతృ సంస్థ మెటా ప్లాట్‌ఫాంనకు అయిదేళ్ల పాటు డేటా పంచుకోరాదంటూ సీసీఐ ఇచ్చిన ఆదేశాలను ఎన్సీఎల్ఏటీ పక్కన పెట్టింది. అయితే, కంపెనీపై విధించిన రూ. 213 కోట్ల పెనాల్టీని సమర్థించింది.వైదొలిగేందుకు సరైన ఆప్షన్ ఇవ్వకుండా వాట్సాప్‌ను వాడాలంటే విస్తృతమైన డేటాను చేసుకోవాల్సి ఉంటుందంటూ యూజర్లపై ఒత్తిడి తేవడం సరి కాదని ఎన్సీఎల్ఏటీ వివరించింది. ఎన్సీఎల్ఏటీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వాట్సప్ మాతృ సంస్థ మెటా తెలిపింది. వాట్సాప్ 2021 ప్రైవసీ పాలసీ అప్డేట్ వల్ల ప్రజల వ్యక్తిగత మెసేజీల గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లదని పేర్కొంది. -
ఒక్క నిర్ణయం.. జుకర్‌బర్గ్ సంపదలో భారీ పతనం
మెటా (Meta) సంస్థ ప్రకటించిన 30 బిలియన్ డాలర్ల రుణ విక్రయం ప్రణాళిక ఇన్వెస్టర్లలో ఆందోళన రేపింది. దీని ఫలితంగా కంపెనీ షేర్లు 11 శాతం వరకు పడిపోయాయి. ఈ పతనం కారణంగా కంపెనీ చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ వ్యక్తిగత సంపద 235.2 బిలియన్ డాలర్లకు తగ్గింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ఆయన ఐదవ స్థానానికి పడిపోయారు. రెండేళ్లలో ఇదే ఆయనకు కనిష్ఠ స్థానం.మెటా ఈ నిధులను ప్రధానంగా కృత్రిమ మేధస్సు (AI) పరిశోధన, మౌలిక సదుపాయాలపై వ్యయం చేయడానికి ఉపయోగించనున్నట్లు తెలిపింది. అయితే, పెరుగుతున్న ఏఐ ఖర్చులు పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించాయి. కంపెనీ ఈ ఏడాది మూలధన వ్యయాలు 118 బిలియన్ డాలర్ల వరకు పెరగవచ్చని, 2026 నాటికి మరింత ఖర్చు చేయవచ్చని తెలిపిన తరువాత కనీసం ఇద్దరు విశ్లేషకులు మెటా షేర్ల రేటింగ్‌ను తగ్గించారు.మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) సంపదలో జరిగిన 29.2 బిలియన్ డాలర్ల నష్టాన్ని బ్లూమ్‌బర్గ్ ఇప్పటివరకు నమోదైన నాల్గవ అతిపెద్ద ఒక్కరోజు మార్కెట్ ఆధారిత పతనంగా పేర్కొంది.ఇదే సమయంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఆల్ఫాబెట్ సహవ్యవస్థాపకుడు లారీ పేజ్‌లు.. జుకర్‌బర్గ్‌ను సంపద పరంగా అధిగమించారు. ఏఐ, క్లౌడ్ సేవలపై పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఆల్ఫాబెట్ షేర్లు 2.5% పెరిగాయి. విశ్లేషకుల అంచనాలను మించి ఆదాయం నమోదైంది. -
కొత్త రూల్: 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం!
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు.. 16 ఏళ్లలోపు వినియోగదారులను తొలగించాలని ఆస్ట్రేలియా పార్లమెంట్ ఆమోదించింది. ఈ నిబంధనలను పాటించకపోయితే.. టెక్ కంపెనీలకు భారీ జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేసింది. దీని కోసం 2025 డిసెంబర్ 10 వరకు గడువు ఇచ్చింది.ఆస్ట్రేలియా పార్లమెంట్ విధించిన.. అండర్-16 సోషల్ మీడియా నిషేధాన్ని పాటించడానికి తాము (మెటా, టిక్‌టాక్ & స్నాప్‌చాట్) సిద్ధమని ప్రకటించాయి.చట్టానికి మేము కట్టుబడి ఉన్నప్పటికీ.. దీనిని అమలు చేయడం కష్టమని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ దిగ్గజాలు వెల్లడించాయి. అయితే.. ఇలాంటి చట్టాన్ని విధించడం పట్ల ఆందోళన కూడా వ్యక్తం చేశాయి. డిసెంబర్ 10 నాటికి 16 ఏళ్లలోపు లక్షలాది మంది వినియోగదారులను గుర్తించడం.. వారిని తొలగించడం అనేది చాలా పెద్ద సవాలు. దీనిని పరిష్కరించడం అంత సులభం కాదని మెటా పాలసీ డైరెక్టర్ మియా గార్లిక్ అన్నారు.వయసుకు సంబంధించిన సోషల్ మీడియా నిషేధం అనేది తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని టిక్‌టాక్ ఆస్ట్రేలియా పాలసీ లీడ్ ఎల్లా వుడ్స్ జాయిస్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పార్లమెంట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని.. అస్పష్టం, సమస్యాత్మకం, తొందరపాటు చర్యగా టెక్ కంపెనీలు విమర్శించాయి. 16 ఏళ్లలోపు వారిపై సోషల్ మీడియా నిషేధం విధించడం అనేది.. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన నిషేధాలలో ఒకటిగా పరిగణించబడుతుందని అన్నాయి.ఇదీ చదవండి: ఇంటర్నేషనల్ నంబర్లతో యూపీఐ చెల్లింపులు -
రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్ కామత్ ఆఫర్
ప్రముఖ టెక్ సంస్థ మెటా మరోసారి భారీ ఉద్యోగాల కోతకు సిద్దమైంది. మెటాలోని సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ విభాగం నుంచి 600 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఈ నేపథ్యంలో ఒక భారతీయ స్టార్టప్ సంస్థ వార్తల్లో నిలిచింది. మెటాలో ఉద్యోగాలు కోల్పోయిన 600 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకొచ్చారు. అంతేకాదు భారీగా వేతనాలు ఆఫర్ చేయడం విశేషంగా నిలిచింది.ఇదీ చదవండి: కేరళలో పెళ్లి వైరల్ : ఎన్ఆర్ఐలకు పండగే! స్మాలెస్ట్ ఏఐ(Smallest AI_ వ్యవస్థాపకుడు సుదర్శన్ కామత్ (Sudarshan Kamath) మెటాలో ఉద్వాసనకు గురైన 600 ఉద్యోగులకు భారీ ఊరట కల్పించారు. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన స్టార్టప్ స్మాలెస్ట్ AI బాధిత ఉద్యోగులకు బహిరంగ నియామక ఆహ్వానాన్ని పోస్ట్ చేశారు. రతీయ సంతతికి చెందిన వ్యవస్థాపకుడు వ్యవస్థాపకుడు సుదర్శన్ కామత్ సోషల్ మీడియాలో మాజీ మెటా సిబ్బంది, తమ స్పీచ్ AI బృందంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ట్వీట్ చేశారు. రూ. 1.75 కోట్లనుంచి. 5.27 కోట్ల దాకా వేతనాన్ని, ఈక్విటీని ఆఫర్ చేస్తున్నారు. అభ్యర్థులకు స్పీచ్ మూల్యాంకనం, స్పీచ్ జనరేషన్ , ఫుల్ -డ్యూప్లెక్స్ స్పీచ్-టు-స్పీచ్ సిస్టమ్‌లో నిపుణులై ఉండాలి. ప్రస్తుత పోటీ నేపథ్యంలో స్మార్ట్‌గా, ఉద్యోగ ఆకాంక్షతో ఉన్నవాళ్లకే చాన్స్ అన్నారు. <Laid off from Meta?We are hiring in speech team for Smallest AI in San Francisco!Comp - 200-600K $ baseEquity - FlexibleLooking for - experience with speech evals, speech generation, full duplex speech to speechMust be - fkin smart and hungry.DM me.— Sudarshan Kamath (@kamath_sutra) October 23, 2025p; ప్రధానంగా ఈ తొలగింపులు మెటా తన ఫండమెంటల్ AI రీసెర్చ్ (FAIR) యూనిట్, ప్రోడక్ట్ ఏఐ, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్లపై ఉండనుంది. ఉద్యోగాలు కోల్పోయేవారు ఇతర విభాగాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. నవంబర్ 21 వరకు కనీసం 16 వారాల జీతంతో సహా తొలగించబడిన కొంతమంది ఉద్యోగులను అంతర్గతంగా తిరిగి కేటాయించవచ్చని వెల్లడించింది.(డ్రీమ్ హౌస్ అంటూ గుడ్ న్యూస్ చెప్పిన స్వీట్‌కపుల్) -
మెటా ఏఐ యూనిట్లో 600 మందికి లేఆఫ్స్
సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ కోసం ఇటీవల కాలంలో భారీగా వేతనాలు ఆఫర్ చేసిన మెటా తన ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ల నుంచి 600 మందికి పైగా ఉద్యోగులను తొలగించనుంది. మెటా ప్రతినిధి తాజాగా ఈ పరిణామాలను ధ్రువీకరించారు. మెటా చీఫ్ ఏఐ అధికారి అలెగ్జాండర్ వాంగ్ నుంచి ఉద్యోగులకు అందిన అంతర్గత మెమోలో ఈ తొలగింపులను ప్రకటించారు.ఈ ఉద్యోగ కోతలు మెటా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్లు, ఫండమెంటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ యూనిట్ (FAIR), ఇతర ఉత్పత్తి సంబంధిత కార్యకలాపాలను ప్రభావితం చేయనుందని కొందరు చెబుతున్నారు. అయితే ఈ తొలగింపులు మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్‌లోని ఉద్యోగులను ప్రభావితం చేయవని చెప్పారు.600 మందికి పైగా ఉద్యోగులను తొలగించాలని తీసుకున్న కంపెనీ నిర్ణయం సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఉద్యోగాలు కూడా ఇకపై సురక్షితం కాదని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘకాలం కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులను లక్ష్యంగా చేసుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: ర్యాంక్ వారీగా ఐపీఎస్ అధికారుల వేతనాలు -
‘కొత్త’ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు.. కోట్లలో జీతాలు
టెక్ రంగంలో నూతన ఉద్యోగాల కోసం పోటీ తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా (Meta) తాజాగా గ్రాడ్యుయేట్లను లక్ష్యంగా చేసుకుని ఎంట్రీ లెవల్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, అర్హత ఉన్న అభ్యర్థులకు మెటా మంచి జీతాలు, స్టాక్ ఆప్షన్లు, ఆరోగ్య ప్రయోజనాలువంటి ఆకర్షణీయమైన ప్యాకేజ్‌లను అందిస్తోంది.కావాల్సిన అర్హతలు ఇవే..మెటా ప్రస్తుతం ఫుల్-స్టాక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ (full-stack software engineers), ప్రోడక్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ (product software engineer)లాంటి ఉద్యోగాల కోసం అభ్యర్థులను నియమిస్తోంది. ఈ ఉద్యోగాలకు..కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా అప్లైడ్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి.అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ సమయంలో లేదా తరువాత ఈ కిందివాటిలో కనీసం ఒకదాన్నైనా కలిగి ఉండాలి..సంబంధిత యూనివర్సిటీ కోర్సు, ఇంటర్న్‌షిప్, థీసిస్PHP, Hack, C++, Python లాంటి లాంగ్వేజెస్‌లో 12 నెలల పని అనుభవంReact వంటి ఫ్రేమ్‌వర్క్‌లో పని చేసిన అనుభవంలార్జ్ స్కేల్ స్టోరేజ్ సిస్టమ్‌లతో పని చేయగల సామర్థ్యంiOS సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలకు మాత్రం అభ్యర్థులకు ఒక సంవత్సరం అనుభవం.. ముఖ్యంగా ఆబ్జెక్ట్-ఒరియెంటెడ్ ప్రోగ్రామింగ్, మల్టీ థ్రెడింగ్, Linux/Unix సిస్టమ్స్‌లో ఉండాలి.జీతం ఎంతంటే.. ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం, ఈ ఎంట్రీ లెవల్ పాత్రలకు వార్షిక జీతం 176,000 డాలర్ల నుంచి 290,000 డాలర్ల వరకు ఉంటుంది. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.1.46 కోట్ల నుంచి రూ.2.41 కోట్లు అన్న మాట. జీతంతో పాటు వార్షిక బోనస్‌లు, స్టాక్ ఈక్విటీలు, ఆరోగ్య భద్రతా ప్రయోజనాలు, * ఇతర కార్మిక సంక్షేమ పథకాలు ఉంటాయి.అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఉద్యోగాలు ఆన్-సైట్ మాత్రమే. అంటే వాషింగ్టన్ లేదా కాలిఫోర్నియాలోని మెటా కార్యాలయాల్లో పని చేయాల్సి ఉంటుంది. రిమోట్ వర్క్ ఆప్షన్ ఉండదు.ఈ అవకాశాల ప్రాముఖ్యత ప్రస్తుతం చాలా కంపెనీలు నూతన గ్రాడ్యుయేట్లను నియమించుకోవడంలో జాప్యం చేస్తుండగా, మెటా మాత్రం యువ ప్రతిభను గుర్తించి, వారిని ఉద్యోగాలలో చేర్చుకోవడంలో చురుకుగా వ్యవహరిస్తోంది. ఆటోమేషన్ పెరుగుతున్న ప్రస్తుత ఉద్యోగ విపణిలో, ఇది ఒక దిగ్గజ కంపెనీ నుంచి వచ్చిన సువర్ణావకాశంగా నిలిచింది.మార్క్ జుకర్‌బర్గ్ అభ్యర్థుల్లో చూసేదిదే..మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) సాంప్రదాయ విద్యా ప్రమాణాల కంటే ప్రయోజనకర నైపుణ్యాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఆయన మాటల్లోనే.."ఒకరు ఏదైనా పనిని లోతుగా నేర్చుకొని అద్భుతంగా చేయగలరని చూపగలిగితే, వారు ఆ నైపుణ్యాన్ని ఇతర రంగాల్లో కూడా వర్తింపజేయగలరు"కాబట్టి, అభ్యర్థులు తమ అభ్యాస నైపుణ్యాలను, సమస్యలపై అవగాహనను స్పష్టంగా చూపగలగాలి. మెటా లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో అవకాశాలను అందుకోవాలంటే జ్ఞానం కలిగి ఉండటం ఒక్కటే సరిపోదు.. దాన్ని ప్రయోగించగలగడం ముఖ్యమైంది.ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. చిగురించిన ఆశలు -
‘ఎక్కడున్నా రేపటిలోపు యూఎస్ రావాలి’
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సర్వీసులు అందిస్తున్న సంస్థలుగా గుర్తింపు పొందిన మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్.. వంటి కంపెనీలు యూఎస్ నుంచి వెళ్లి విదేశాల్లో సర్వీసులు అందిస్తున్న తమ ఉద్యోగులకు అడ్వైజరీలు జారీ చేస్తున్నాయి. యూఎస్ వెలుపల ఉన్న హెచ్-1బీ, హెచ్-4 వీసాలు కలిగిన తమ ఉద్యోగులను సెప్టెంబర్ 21, 2025లోపు అమెరికాకు తిరిగి రావాలని కోరుతున్నాయి.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణమని తెలుస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాలపై 1,00,000 అమెరికా డాలర్ల రుసుము విధిస్తూ ఇటీవల కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో అమెరికాలోనే ఉద్యోగులు తమ పనిని కొనసాగించాలని కోరుతూ, వెంటనే యూఎస్‌కు రావాలని మైక్రోసాఫ్ట్‌తోపాటు ఇతర టెక్ కంపెనీలు తమ సూచిస్తున్నాయి. ఈమేరకు ఉద్యోగులకు అంతర్గత ఈమెయిళ్లు పంపిస్తున్నాయి.ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని కొందరు చెబుతున్నారు. సాధారణంగా హెచ్1-బీ వీసాలు లాటరీపై ఆధారపడతుంది. అందుకు నామినల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వీసా జారీ అయితే మాత్రం వార్షిక రుసుము పే చేయాలి. ఈ ఫీజునే ట్రంప్ ప్రభుత్వం 1 లక్ష డాలర్లకు పెంచింది. ఇప్పటివరకు ఇది 4,000 డాలర్ల వరకు ఉండేది. ఈ రుసుమును సాధారణంగా కంపెనీలే భరిస్తాయి. దీని పెంపు కంపెనీలకు భారం కానుంది.అమెరికా స్థానికులకు ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు ఈ చర్యలు తోడ్పడుతాయని వైట్ హౌస్ పేర్కొంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌తోపాటు ఇతర టెక్ కంపెనీలు కూడా H-1B వీసా నిబంధనలలో వచ్చిన మార్పుల నేపథ్యంలో ఉద్యోగులకు ఈ సూచనలు జారీ చేస్తున్నాయి. హెచ్-1బీ వీసాపై ట్రంప్ ప్రకటన నేపథ్యంలో జుకర్‌బర్గ్ నేతృత్వంలోని టెక్ సంస్థ మెటా సైతం తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసింది. ఈ వ్యవహారంపై మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ..‘అభివృద్ధి చెందుతున్న విధాన మార్పును అంచనా వేస్తున్నందున ఇది ముందు జాగ్రత్త చర్యగా భావించాలి. మా ఉద్యోగుల భద్రతను నిర్ధారించడం అత్యంత ప్రాధాన్యతగా ఉంది’ అన్నారు.ట్రంప్ తీసుకొచ్చిన ఈ నిబంధన సెప్టెంబరు 21 నుంచి వర్తించనుంది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి హెచ్-1బీ వీసాదారులు ఎవరైనా అమెరికాలోకి ప్రవేశించాలన్నా.. లేదా ప్రవేశించే ప్రయత్నాల్లో భాగంగా ఈ వీసాకు దరఖాస్తు చేసుకున్నా లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను అప్రమత్తం చేస్తున్నాయి.ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి! -
ఫేస్బుక్లో జుకర్ బర్గ్ బ్యాన్.. కేసేసిన జుకర్ బర్గ్
వాషింగ్టన్: ఫేస్బుక్లో తనని బ్యాన్చేయడంపై జుకర్ బర్గ్ కోర్టులో కేసు వేశాడు. ఈ కేసు ఇప్పటిది కాదు.. గత ఎనిమిదేళ్లుగా కోర్టులో నలుగుతూనే ఉంది. ఇంతకీ.. ఫేస్బుక్ తనని బ్యాన్ చేయడంపై జుకర్ బర్గ్ కేసు ఎందుకు పెట్టారని అనుకుంటున్నారా? అమెరికాలో 38వ అతిపెద్ద రాష్ట్రం ఇండియానా. ఇప్పుడీ రాష్ట్రానికి చెందిన మార్క్ స్టీవెన్ జుకర్‌బర్గ్ అనే న్యాయవాది.. మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌పై న్యాయపోరాటం చేస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా మెటా(గతంలో ఫేస్బుక్) తన అకౌంట్‌ను బ్యాన్ చేసిందని, ఫలితంగా భారీ మొత్తంలో నష్టపోయినట్లు కోర్టులో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ న్యాయవాది పేరు మార్క్ జుకర్ బర్గ్. కానీ అతను మెటావర్స్ నిర్మించడంలో కాదు. దివాళా కేసుల్లో వాదిస్తుంటారు. 2017 నుండి తన న్యాయ సేవలను ప్రచారం చేసేందుకు ఫేస్బుక్ పేజీని ప్రారంభించారు. ఇందుకోసం 11వేల డాలర్ల కంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేశాడు. కానీ అతని పేజీని తరచూ ఫేస్బుక్ బ్లాక్ చేస్తూనే ఉంది. ఎందుకు అని ప్రశ్నిస్తే.. మీరు ఫేస్బుక్ అధినేత జుకర్‌బర్గ్‌ను అనుకరిస్తున్నారనే సమాధానం చెబుతోంది. తనను తానే నిరూపించుకోవడం అతనికి రోజువారీ తలనొప్పిగా మారింది.ఇదే విషయంపై స్థానిక టీవీ ఛానల్‌కు మాట్లాడుతూ, "బిలియనీర్ జుకర్‌బర్గ్ స్కూల్ పూర్తిచేసేలోపే నేను న్యాయవాదిగా పని చేస్తున్నాను’ అని చెప్పారు. ఇది మీకు వ్యంగ్యంగా అనిపించవచ్చు. కానీ ఆర్ధికంగా నష్టపోయేది నేనే కదా. డబ్బుపోయా, శనిపట్టుకుంది అన్న చందంగా ఫేస్బుక్ నా అకౌంట్‌ను బ్యాన్ చేయడంతో బిజినెస్‌ను కోల్పోయాను. iammarkzuckerberg.com అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించి అందులో తన సర్వీసులు అందిద్దామంటే ఆఫ్‌లైన్‌లో క్లయింట్స్కాల్స్ చేస్తే ప్రాంక్ కాల్ అనుకుని కట్ చేస్తున్నారని కోర్టులో వాపోతున్నారు. ‘నేను మార్క్ స్టీవెన్, అతను మార్క్ ఎలియట్. ఇది సరదాగా చెప్పడం లేదు. మెటా నిర్ణయం వల్ల నేను వేలాది డాలర్లు నష్టపోవడం నాకు కోపం తెప్పించింది. 40 ఏళ్లుగా న్యాయవృత్తిలో ఉన్నా. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ ఎలియట్ జుకర్‌బర్గ్ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచే నేను ఈ వృత్తిలో ఉన్నా. నన్ను మెటాలో బ్యాన్ చేయడం తగదు అని అన్నారు. ఈ సందర్భంగా ఫేస్బుక్ వ్యవస్థాపకుడికి ఓ ఆఫర్ కూడా ఇచ్చాడు. ఈ గ్రహం మీద అత్యంత ధనవంతులలో ఒకరైన జుకర్‌బర్గ్ తనని క్షమించమని కోరవచ్చు. లేదంటే అతని పడవలో గడిపేందుకు నాకు ఓ వారం రోజుల పాటు అనుమతిస్తే.. కోర్టులు, కేసులు అవసరం ఉండదని చెప్పాడు. మార్క్ స్టీవెన్ దావా వేయడంపై మెటా స్పందించింది. జుకర్‌బర్గ్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ సమస్య మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం'అని పేర్కొంది. -
అలా... ఆమె ప్రాణాలు కాపాడారు!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలికి చెందిన అమ్మాయి ఒకరు ‘నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను’ అని అర్థరాత్రి దాటిన తరువాత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ‘మెటా’ వెంటనే ఈ పోస్ట్‌ను స్టేట్ పోలీస్ మీడియా సెంటర్‌కు పంపి పోలీసులను అలర్ట్ చేసింది. కేవలం పదహారు నిమిషాల వ్యవధిలో ఒక సబ్–ఇన్స్పెక్టర్, కొందరు మహిళా పోలీసులు ఆ అమ్మాయి ఉన్న ఇంటికి చేరుకున్నారు. వాంతులు చేసుకున్న ఆ అమ్మాయి నిస్తేజంగా పడి ఉంది. వెంటనే ఆమెను హస్పిటల్‌కు తీసుకువెళ్లారు. సమయానికి ఆస్పత్రికి తీసుకురావడం వల్ల ఆ అమ్మాయి చావు నుంచి బయటపడింది. ఆమె కోలుకున్న తరువాత... ‘ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు?’ అని అడిగితే... తాను ప్రేమించిన వ్యక్తి మాట్లాడడం మానేశాడని, తన ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడని...ఇలా చెప్పుకుంటూ పోయింది. పెరుగుతున్న ఆన్లైన్ సుసైడ్ అటెంప్ట్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు, మెటా భాగస్వామ్యంతో ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో సుడైడ్–రిలేటెడ్ పోస్ట్‌లపై నిఘా పెడుతున్నారు. వెంటనే రంగంలోకి దిగుతున్నారు. జనవరి 1, 2023 నుంచి ఆగస్ట్ 25, 2025 వరకు 1,315 మంది ప్రాణాలను కాపాడారు. (చదవండి: తీవ్ర మనోవ్యాధికి సంజీవని!) -
జియో లిస్టింగ్ వచ్చే ఏడాదే..!
వచ్చే ఏడాది(2026) ద్వితీయార్ధంలోగా జియో ప్లాట్‌ఫామ్స్‌ను స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేయనున్నట్లు ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ కంపెనీ 48వ ఏజీఎంలో ప్రకటించారు. ఏఐ సంబంధిత భారీ మౌలికసదుపాయాలతో రిలయన్స్ ఇంటెలిజెన్స్ పేరున కొత్త జేవీకి తెరతీయనున్నట్లు పేర్కొన్నారు. గ్లోబల్ టెక్ దిగ్గజాలు మెటా, గూగుల్‌తో భాగస్వామ్యానికి చేతులు కలిపినట్లు వెల్లడించారు. తద్వారా ప్రతి ఒక్కరికీ ఏఐ, ప్రతి చోటా ఏఐ విజన్‌ను ప్రకటించారు. రిలయన్స్‌తో కలసి జామ్‌నగర్ క్లౌడ్ రీజన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఏజీఎంలో వర్చువల్‌గా పాలుపంచుకున్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. మెటా వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకెర్‌బర్గ్ సైతం రిలయన్స్‌తో భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. సంస్థ ఓపెన్ సోర్స్ లామా మోడళ్లను జేవీ వినియోగించుకోనున్నట్లు తెలియజేశారు. దేశీ సంస్థలకు ఈ జేవీ గేమ్ చేంజర్‌గా నిలవనున్నట్లు ముకేశ్ పేర్కొన్నారు. రూ. 855 కోట్ల ప్రాథమిక పెట్టుబడితో మెటాతో జేవీకి తెరతీయనున్నారు. జేవీలో ఆర్ఐఎల్కు 70 శాతం, మెటాకు 30 శాతం వాటా లభించనుంది.జియో ప్లాట్‌ఫామ్స్ ఆర్ఐఎల్కు టెలికం, డిజిటల్ అనుబంధ సంస్థగా వ్యవహరిస్తున్న జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఎంతమేర వాటా విక్రయించేదీ ముకేశ్ వెల్లడించలేదు. ప్రస్తుతం సంస్థలో ఆర్ఐఎల్కు 66.3 శాతం వాటా ఉంది. మెటా(ఫేస్బుక్) వాటా 10 శాతంకాగా.. గూగుల్ 7.7 శాతం వాటా కలిగి ఉంది. మిగిలిన 16 శాతం వాటా పీఈ దిగ్గజాల చేతిలో ఉంది. ఐపీవోలో 10 శాతం వాటా ఆఫర్ చేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కంపెనీ విలువను 136–154 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఈ స్థాయిలో విలువ నమోదైతే ప్రపంచంలోనే ఆరో పెద్ద కంపెనీగా నిలిచే వీలుంది. ఆవిర్భవించిన దశాబ్ద కాలంలో దేశంలోనే అతిపెద్ద టెలికం కంపెనీగా అవతరించిన జియో వినియోగదారుల సంఖ్య 50 కోట్లను దాటినట్లు సంస్థ చీఫ్ ఆకాశ్ అంబానీ వెల్లడించారు. → జియోఫ్రేమ్స్ పేరుతో జియో స్మార్ట్గ్లాస్లోకి ప్రవేశించింది. చేతులు వినియోగించకుండా కాల్స్, మ్యూజిక్, వీడియో రికార్డింగ్, ఏఐ వాయిస్ అసిస్టెంట్ తదితరాలను వివిధ భాషలతో నిర్వహించవచ్చు.→ వాల్ట్ డిస్నీ ఇండియా విలీనంతో ఏర్పాటైన జియోహాట్‌స్టార్ రెండో పెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా నిలిచింది. 34% టీవీ మార్కెట్ వాటా దీని సొంతం.రిలయన్స్ రిటైల్.. 40,000 కోట్లు ఆసియాలోకెల్లా అతిపెద్ద ఏకీకృత ఫుడ్ పార్క్‌ల ఏర్పాటుకు రిలయన్స్ రిటైల్ రూ. 40,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. వీటిలో ఏఐ ఆధారిత ఆటోమేషన్, రోబోటిక్స్, సస్టెయినబుల్ టెక్నాలజీలు వినియోగించనున్నట్లు సంస్థ ఈడీ ఈషా అంబానీ పేర్కొన్నారు. మూడేళ్లలో వార్షికంగా ఆదాయంలో 20 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఎఫ్ఎంసీజీ బిజినెస్(ఆర్సీపీఎల్)ను 8 రెట్లు పెంచే ప్రణాళికల్లో ఉంది. తద్వారా ఆదా యాన్ని రూ. లక్ష కోట్లకు చేర్చాలని ఆశిస్తోంది.ఓ2సీ... భారీ విస్తరణఆయిల్ 2 కెమికల్స్ విభాగంలో కొత్త ప్రాజెక్టులపై రూ. 75,000 కోట్ల పెట్టుబడులు వెచి్చంచనున్నట్లు ఆర్ఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ వెల్లడించారు. ఏజీఎంలో తొలిసారి ప్రసంగించారు. 2035కల్లా నికర కర్బన రహిత లక్ష్యాన్ని సాధించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. మొబిలిటీ విభాగంలో జియో–బీపీ ఇంధన రిటైల్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈవీ చార్జింగ్, బ్యాటరీల స్వాపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వేగంగా పెంచుతున్నట్లు అనంత్ తెలియజేశారు. n న్యూ ఎనర్జీ విభాగం రానున్న 5–7 ఏళ్లలో ఓ2సీ బిజినెస్‌ను అధిగమించనున్నట్లు ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. 2028 కల్లా రెట్టింపు ఇబిటాను సాధించే లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. 2026 కల్లా బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రణాళికలు వేసింది. 2032 కల్లా 3 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ సామర్థ్యంపై కంపెనీ కన్నేసింది. -
అదిగో అలా వచ్చింది రూ.3.36 కోట్ల ఉద్యోగం..
మనకు ఏ అంశంపైన ఆసక్తి ఉందో.. ఏ పనినైతే మనం ఇష్టంగా చేయగలుగుతామో దాన్నే కెరియర్‌గా ఎంచుకుంటే ప్రతిఒక్కరూ తప్పకుండా విజయవంతం అవుతారు. దీనికి ఉదాహరణే ఈ 23 వేళ్ల ఇండియన్-అమెరికన్ కుర్రాడు మనోజ్ తుము. ప్రస్తుతం ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటాలో 4 లక్షల డాలర్ల (రూ.3.36 కోట్లు) జీతంతో ఉద్యోగం చేస్తున్న తాను.. ఈ జాబ్‌ను గతంలో అమెజాన్‌లో పనిచేస్తున్నప్పుడు ఎలా పొందిందీ వివరించాడు.. తనలాగే ముందుకెళ్లాలనుకుంటున్నవారికి సూచనలూ ఇచ్చాడు.బిజినెస్ ఇన్సైడర్ కోసం రాసిన వ్యాసంలో మనోజ్ తుము పోటీ నియామక ప్రక్రియను ఎలా ఎదుర్కొన్నాడో, తన కెరీర్ మార్గాన్ని తీర్చిదిద్దిన పాఠాల గురించి వివరించాడు. హైస్కూల్ క్రెడిట్స్ కారణంగా ఏడాదిలోనే అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మనోజ్ ఫుల్ టైమ్ పనిచేస్తూనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మాస్టర్స్ చేశారు. మరింత ఉత్తేజకరమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల కోసం మెటాకు మారడానికి ముందు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్‌గా 9 నెలల పాటు అమెజాన్‌లో పనిచేశారు.ఏఐలో ప్రవేశించాలంటే..మనోజ్ ప్రకారం.. మెషిన్ లెర్నింగ్ టైటిల్స్ మారుతూ ఉంటాయి. రిసెర్చ్ సైంటిస్ట్, అప్లైడ్ సైంటిస్ట్, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తదితర పాత్రలు పోషించవచ్చు. క్లాసికల్ ఎంఎల్ నుంచి డీప్ లెర్నింగ్ కు మారడం ఈ రంగాన్ని మరింత డైనమిక్ గా, కాంపిటీటివ్ గా మార్చింది. కళాశాల ఇంటర్న్ షిప్ లు తక్కువ వేతనంతో కూడినవి అయినీ అనుభవం పొందడానికి, నిలదొక్కుకోవడానికి చాలా కీలకం.రెజ్యూమె & ఇంటర్వ్యూ చిట్కాలురెజ్యూమెలో మీరు చేసిన ప్రాజెక్టుల గురించి పేర్కొనడం ఉపయోగకరమే కానీ మీకు రియల్‌టైమ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీ రెజ్యూమ్ పై ప్రాజెక్ట్‌లు ఆధిపత్యం చెలాయించకూడదని కొత్తగా జాబ్ మార్కెట్లోకి వస్తున్నవారికి సూచిస్తున్నారు మనోజ్. బిహేవియరల్ ఇంటర్వ్యూలు కీలకమని, కానీ చాలా మంది అభ్యర్థులు దీన్న విస్మరిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక వేతనాల విషయానికి వస్తే సంబంధిత అనుభవాన్ని పెంచుకోవడానికి మనోజ్ ప్రారంభంలో సంప్రదాయ సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ కంటే తక్కువ వేతనంతో కూడిన ఎంఎల్ ఉద్యోగాన్నే ఎంచుకున్నాడు. ఇది తరువాత అధిక వేతన అవకాశాలకు దారితీసింది. -
మెటాతో కలిసిన సేఫర్ ఇంటర్నెట్ ఇండియా: ఎందుకంటే?
మెటా, సేఫర్ ఇంటర్నెట్ ఇండియాతో కలిసి, పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు.. స్కామ్‌ల నుంచి ప్రజలను రక్షించడంలో సహాయపడటానికి కంటెంట్ క్రియేటర్ల నేతృత్వంలో ఒక కొత్త అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా, కొత్త రకాల స్కామ్‌లను ఎలా గుర్తించాలో, మెటా యొక్క డిజిటల్ భద్రతా సాధనాలను ఎలా ఉపయోగించాలో, ఆన్లైన్లో సురక్షితంగా ఎలా ఉండాలో వారి అనుచరులకు నేర్పించే సులభంగా అర్థం చేసుకోగల కంటెంట్‌ను ఎలా సృష్టించాలో తెలుసుకోవడానికి క్రియేటర్లు వర్క్‌షాప్‌లలో పాల్గొంటారు.సేఫర్ ఇంటర్నెట్ ఇండియా, మెటా మద్దతుతో, ఇటీవల “క్రియేటర్స్ ఫర్ ఆన్లైన్ ట్రస్ట్" అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆన్లైన్ భద్రత గురించి ఆలోచనలు, నిజ జీవిత ఉదాహరణలను పంచుకోవడానికి ఇది కంటెంట్ క్రియేటర్లు, టెక్ కంపెనీలు,ప్రభుత్వ ప్రతినిధులను ఒకచోట చేర్చింది. ఆన్లైన్ మోసాలపై పోరాడటానికి.. ఇంటర్నెట్ను మరింత సురక్షితంగా, తెలివిగా ఉపయోగించమని ప్రజలను ప్రోత్సహించడానికి విశ్వసనీయ క్రియేటర్లు ఎలా సహాయపడతారనే దాని గురించి చర్చించడం జరిగింది.ప్రారంభ కార్యక్రమంలో నథానియల్ గ్లీచెర్ (మెటా గ్లోబల్ హెడ్ ఆఫ్ కౌంటర్ ఫ్రాడ్, సెక్యూరిటీ పాలసీ డైరెక్టర్) మాట్లాడుతూ.. మోసాలు, స్కామ్‌లపై పోరాడటానికి వివిధ పరిశ్రమలలో సమిష్టి కృషి, నిరంతర విద్య అవసరం. ఆన్లైన్లో ఎలా సురక్షితంగా ఉండాలో అర్థం చేసుకోవడంలో ప్రజలకు సహాయపడటం చాలా ముఖ్యం. సేఫర్ ఇంటర్నెట్ ఇండియాతో మా భాగస్వామ్యం ద్వారా, డిజిటల్ భద్రత గురించి అవగాహన కల్పించడంలో కంటెంట్ క్రియేటర్లకు మార్గనిర్దేశం చేయడంలో మేము సహాయం చేయాలనుకుంటున్నామని అన్నారు.ఈ సందర్భంగా సేఫర్ ఇంటర్నెట్ ఇండియా కో-కన్వీనర్, బెర్గెస్ మాలు మాట్లాడుతూ.. కంటెంట్ క్రియేటర్లను ముందుండే భాగస్వాములుగా ఉంచుతూ ఈ ప్రయోజనకరమైన చొరవను ప్రారంభించడం మాకు సంతోషాన్ని కలిగిస్తోంది. సమగ్ర భద్రతా సమాచారంను సులభంగా అర్థమయ్యేలా, నమ్మదగిన ఆన్లైన్ స్వరాల ద్వారా వినియోగదారుల వద్దకు చేరవేయడమే దీని లక్ష్యం. ప్రతి ఒక్కరికి సమాచారంతో కూడిన డిజిటల్ భద్రత కలిగిన భారత్‌ను నిర్మించాలన్న మా దీర్ఘకాలిక దృష్టిలో ఈ ప్రచారం ఒక ముఖ్యమైన మైలురాయి.మెటా తాజాగా తన స్కామ్‌ల వ్యతిరేక ప్రచారం రెండవ ఎడిషన్ “స్కామ్ సే బచో 2.0”ను ప్రారంభించింది. ఈ ప్రచారంలో అనేక క్రియేటర్లు భాగస్వాములై డిజిటల్ భద్రతా చిట్కాలను వినోదాత్మకంగా, ట్విస్ట్‌తో ప్రజలకు అందిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రచారం ముంబైలోని ప్రసిద్ధ వీధుల్లో స్కామ్‌లపై అవగాహన పెంచేలా రూపొందించబడింది. నకిలీ లోన్లు, ఫేక్ లింకులు, OTP మోసాలు వంటి సాధారణ ఆన్లైన్ మోసాల గురించి ప్రజలకు తెలియజేయడానికి, ప్రజల జీవనశైలికి దగ్గరగా ఉండే సాంస్కృతికం సంబంధిత మరియు ఆకర్షణీయమైన విజువల్స్‌ను వినియోగిస్తోంది.అర బిలియన్ భారతీయ వినియోగదారులను చేరుకున్న దాదాపు రెండు డజన్ల వ్యాపార సంస్థల సమాఖ్య అయిన సేఫర్ ఇంటర్నెట్ ఇండియా, భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో వినియోగదారుల సంక్షేమాన్ని మెరుగుపరచడం మరియు ఆవిష్కరణ ఆధారిత వృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కూటమిలో డిజిటల్ సేవల సంస్థలు, టెలికాం, ఇంటర్నెట్ ప్రొవైడర్లు, ఫిన్‌టెక్ కంపెనీలు, అలాగే ఆన్లైన్ ట్రస్ట్ మరియు భద్రత రంగాల్లో పనిచేస్తున్న ఇతర ప్రముఖ సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. -
‘మెటా మాదిరి అనైతిక ఆఫర్ ఇవ్వట్లేదు’
మెటా వంటి కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్న టాలెంట్ వార్‌పై ఎలాన్ మస్క్ మౌనం వీడారు. సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ఏర్పాటు కోసం మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఏఐ టాలెంట్వార్ను ప్రారంభించారు. దాదాపు చాలా టాప్ టెక్నాలజీ కంపెనీల నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగులను మెటాలో నియమించుకుంటున్నారు. అందుకోసం భారీగా వేతన ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, విండ్సర్ఫ్.. వంటి ప్రముఖ కంపెనీల నుంచి ఉద్యోగులకు ఆఫర్ లెటర్లు ఇస్తున్నారు. దీనిపై ఎలాన్ మస్క్ తాజాగా వ్యాఖ్యలు చేశారు.ఎక్స్ఏఐలో చేరిన మెటా ఇంజినీర్లను ఉద్దేశించి ఎలాన్ మస్క్ మాట్లాడుతూ..‘కంపెనీ ఏఐ స్టార్టప్ ఎక్స్ఏఐలో చాలా మంది మెటా ఇంజినీర్లు చేరారు. అయితే మెటా మాదిరిగా కాకుండా, ఎక్స్ఏఐ వారిని అనైతికంగా కంపెనీలో చేరడానికి భారీ వేతనాలు ఇవ్వడం లేదు. మెరుగైన నైపుణ్యం కలిగిన చాలా మంది మెటా ఇంజినీర్లు ఎక్స్ఏఐలో చేరుతున్నారు. మెటా కంటే ఎక్స్ఏఐకి చాలా ఎక్కువ మార్కెట్ క్యాపిటల్ వృద్ధి సామర్థ్యం ఉంది. హైపర్ మెరిట్ ఆధారంగా నియమకాలు చేపడుతున్నాం. భారీ ప్యాకేజీల ఆశ చూపడం లేదు’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘అల్ట్రా హార్డ్ కోర్ ఇంజినీర్లకు ఎక్స్ఏఐ బెటర్ ప్లేస్’ అని మరో పోస్ట్‌లో రాసుకొచ్చారు.ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటలిజెన్స్(ఏజీఐ)ను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్(ఎంఎస్ఎల్) అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ విభాగంలో పనిచేసే మెటా ఏఐ మోడల్, ఉత్పత్తి బృందాలు ఫండమెంటల్ ఏఐ రీసెర్చ్(ఫెయిర్)ను అభివృద్ధి చేస్తాయని చెప్పారు. ఎంఎస్ఎల్ కింద కొత్త ల్యాబ్ తదుపరి తరం లార్జ్ ల్యాంగ్వేజ్ మోడళ్ల (ఎల్ఎల్ఎం) నిర్మాణంపై దృష్టి పెడుతుందని తెలిపారు.ఇదీ చదవండి: ట్రంప్ టారిఫ్ ఆందోళనలు.. త్వరలో మంత్రి భేటీగూగుల్, ఎక్స్, మెటా, ఓపెన్ఏఐ.. వంటి ప్రధాన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ మోడళ్లను సృష్టిస్తున్నాయి. ఈ సంస్థల మధ్య పోటీ తీవ్రతరం అవుతుంది. దాంతో తోటివారికంటే ఓ అడుగు ముందుడాలనే భావనతో కంపెనీ ఏఐ నైపుణ్యాలున్నవారికి భారీ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. కృత్రిమ మేధస్సుపై ఆధిపత్యం చెలాయించే రేసులో భాగంగా మెటా కీలక ప్రచారం ప్రారంభించినట్లు ఇటీవల కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి. ఈ విభాగంలో అగ్రశ్రేణి ఏఐ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. మెరుగైన ఏఐ నైపుణ్యాలున్న ఎక్స్పర్ట్లకు 100 మిలియన్ డాలర్ల (రూ.860 కోట్లు) ప్యాకేజీ చెల్లించేందుకు కూడా వెనుకాడడం లేదని సమాచారం. -
మెటా తీరుతో ఇతర కంపెనీలు సర్వనాశనం
కృత్రిమ మేధస్సు(ఏఐ) విభాగంలో కొత్త ఆవిష్కరణలు చేసేలా ప్రపంచవ్యాప్తంగా టాలెంట్ హంటింగ్ అనూహ్య స్థాయికి చేరుకుంది. ఓపెన్ఏఐ అగ్ర నిపుణులను ఆకర్షించడానికి మెటా 100 మిలియన్ డాలర్ల(సుమారు రూ.870 కోట్లు) బోనస్‌ను సైతం ఆఫర్ చేస్తున్న తరుణంలో ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ తన ఉద్యోగులకు పంపిన అంతర్గత ఈమెయిల్ వైరల్‌గా మారింది. మెటా వంటి పోటీదారుల నుంచి వచ్చే వేతన ఆఫర్లు కంపెనీల సంస్కృతిని నాశనం చేస్తాయని అంతర్గత ఈమెయిల్లో అమోడీ తెలిపారు.ఇతర కంపెనీలు ఆఫర్ చేసే ఆర్థిక ప్రోత్సాహకాల కంటే ఆంత్రోపిక్ తన మిషన్ పట్ల నిబద్ధతగా వ్యవహరించాలని ఆయన ఉద్యోగులను కోరారు. మెటా అసాధ్యాన్ని సాధ్యం చేయాలనే తప్పుడు ఆలోచనతో ఉందన్నారు. మెటా తీరు ఇతర కంపెనీల సంస్కృతిని నాశనం చేసేలా ఉందని అంతర్గత ఈమెయిల్లో అమోడీ తెలిపారు. ఆంత్రోపిక్ ఉద్యోగులకు వేతన ఆఫర్ల కంటే కంపెనీ మిషన్ ప్రధానమని చెప్పారు. మెటా ఆఫర్ చేస్తున్న ప్యాకేజీల కారణంగా సంస్థాగత సమగ్రతను కాపాడుకుంటూ కీలక ప్రతిభావంతులను నిలుపుకోవడంపై పరిశ్రమలో ఇతర కంపెనీలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది.ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటలిజెన్స్(ఏజీఐ)ను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్(ఎంఎస్ఎల్) అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ విభాగంలో పనిచేసే మెటా ఏఐ మోడల్, ఉత్పత్తి బృందాలు ఫండమెంటల్ ఏఐ రీసెర్చ్(ఫెయిర్)ను అభివృద్ధి చేస్తాయని చెప్పారు. ఎంఎస్ఎల్ కింద కొత్త ల్యాబ్ తదుపరి తరం లార్జ్ ల్యాంగ్వేజ్ మోడళ్ల (ఎల్ఎల్ఎం) నిర్మాణంపై దృష్టి పెడుతుందని తెలిపారు.ఇదీ చదవండి: పూర్తిగా వెనక్కి రాని రూ.2,000 నోట్లుగూగుల్, ఎక్స్, మెటా, ఓపెన్ఏఐ.. వంటి ప్రధాన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ మోడళ్లను సృష్టిస్తున్నాయి. ఈ సంస్థల మధ్య పోటీ తీవ్రతరం అవుతుంది. దాంతో తోటివారికంటే ఓ అడుగు ముందుడాలనే భావనతో కంపెనీ ఏఐ నైపుణ్యాలున్నవారికి భారీ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. కృత్రిమ మేధస్సుపై ఆధిపత్యం చెలాయించే రేసులో భాగంగా మెటా కీలక ప్రచారం ప్రారంభించినట్లు ఇటీవల కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి. ఈ విభాగంలో అగ్రశ్రేణి ఏఐ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. మెరుగైన ఏఐ నైపుణ్యాలున్న ఎక్స్పర్ట్లకు 100 మిలియన్ డాలర్ల (రూ.860 కోట్లు) ప్యాకేజీ చెల్లించేందుకు కూడా వెనుకాడడం లేదని సమాచారం. -
మేమంతా ఆమె వెంటే.. వేలకోట్ల ఆఫర్ వదులుకున్న ఉద్యోగులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతోంది. ఈ రంగంలో ప్రతిభ ఉన్నవారిని అవకాశాలు తప్పకుండా వెతుక్కుంటూ వస్తాయని ఎంతోమంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఆ మాటలే ఇప్పుడు నిజమయ్యాయి. కృత్రిమ మేధలో ట్యాలెంట్ ఉన్న ఓ కంపెనీ ఉద్యోగులకు.. దిగ్గజ సంస్థలు వేలకోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చాయి. కానీ వారు మాత్రం తమ బాస్‌ను వదిలిపెట్టకుండా.. ఆఫర్లను తృణప్రాయంగా భావించారు.మీరా మురాటీ 2025 ఫిబ్రవరిలో ఏఐ స్టార్టప్ 'థింకింగ్ మెషీన్స్ ల్యాబ్' ప్రారంభించారు. ఇందులో పనిచేస్తున్నవారందరూ కూడా గతంలో పెద్ద కంపెనీలలో పనిచేసి వచ్చినవారే. అయితే వీరిలో కొందరికి.. 'మార్క్ జుకర్‌బర్గ్'కు చెందిన మెటా.. దాని AI సూపర్ ఇంటెలిజెన్స్ బృందంలో చేరడానికి ఒక బిలియన్ డాలర్లను (రూ.8,755 కోట్లు) ఆఫర్ చేసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.నిజానికి మీరా మురాటీ తన థింకింగ్ మెషీన్స్ ల్యాబ్ ప్రారంభించి.. ఏడాది కూడా పూర్తి కాలేదు. అంతే కాకుండా ఈ కంపెనీ ఒక్క ఉత్పత్తిని కూడా మార్కెట్లోకి విడుదల చేయలేదు. కానీ అప్పుడే ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు భారీ ఆఫర్స్ వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే ఏఐలో నైపుణ్యం ఉన్నవారికి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: సమయాన్ని, డబ్బును దేనికి ఖర్చు చేస్తారు?: రాబర్ట్ కియోసాకిథింకింగ్ మెషీన్స్ ల్యాబ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రం.. వారికి వచ్చిన ఆఫర్స్ వద్దనుకుని మీరా మురాటితో పాటు ఉండటానికే ఆసక్తి చూపించినట్లు సమాచారం. దీనికి కారణం మురాటీ నాయకత్వం.. భవిష్యత్ అంచనాలు కారణమై ఉంటాయని పలువురు భావిస్తున్నారు. కాగా ఈ కంపెనీ మార్కెట్ విలువ 12 బిలియన్ డాలర్లు.ఎవరీ మీరా మురాటీ?ఇంజినీరింగ్ చేసిన మీరా మురాటీ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ ‘టెస్లా’లో ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేశారు. ఆ తరువాత వర్చువల్ రియాలిటీ స్టార్టప్ ‘లిప్ మోషన్’లో పనిచేసి.. 2016లో ‘ఓపెన్ ఏఐ’లో చేరి అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్, టూల్స్ డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషిస్తూ.. చీఫ్ టెక్నికల్ ఆఫీసర్(సీటీవో) స్థాయికి ఎదిగారు. సొంతంగా కంపెనీ స్థాపించాలనే తపనతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ఓపెన్ఏఐ’కి గుడ్‌బై చెప్పి.. థింకింగ్ మెషీన్స్ ల్యాబ్ స్థాపించారు.అల్బేనియాలో పుట్టిన మీరా మురాటీకి చిన్నప్పటి నుంచి సాంకేతిక విషయాలపై అమితమైన ఆసక్తి. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు సాంకేతిక జ్ఞానం పరిష్కారం చూపుతుందనేది ఆమె నమ్మకం. అదే ఈ రోజు ఎన్నో గొప్ప కంపెనీలను సైతం ఆకర్శించేలా చేసింది. -
కీబోర్డు, మౌస్ లేకుండానే.. కంప్యూటర్ పనిచేస్తుంది!
కీబోర్డు, మౌస్, టచ్ స్క్రీన్, వాయిస్ కమాండ్ల వంటివి లేకుండా కంప్యూటర్‌తో పనిచేయించడాన్ని ఊహించగలమా? స్మార్ట్ రిస్ట్ బ్యాండ్‌తో.. దాన్ని సుసాధ్యం చేయనుంది మార్క్ జుకర్‌బర్గ్‌కు చెందిన మెటా సంస్థ. కేవలం మన చేతివేళ్ల కదలికలతో, వాటి సంజ్ఞలతో కంప్యూటర్లూ, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్)తో పనిచేసే వస్తువులను ఇకమీదట నియంత్రించవచ్చు! టెక్నాలజీ వాడకంలో ఇదో గొప్ప మలుపు కానుంది. ముఖ్యంగా దివ్యాంగులకు ఇది వరం. మాట (వాయిస్) లేదా సాధారణ ఇన్పుట్ పద్ధతులు పనిచేయని సందర్భాల్లో ఇది ఉపయోగకరంగా ఉంటుంది.భవిష్యత్తులో మన చేతివేళ్ల కదలికలతోనే కంప్యూటర్‌కు అన్నీ చెప్పేయొచ్చు, వాటిని నియంత్రించవచ్చు. ముఖ్యంగా రహస్యమైన విషయాలను ఎవ్వరికీ తెలియకుండా నిర్భయంగా కంప్యూటర్లో కంపోజ్ చేయొచ్చు.. సెర్చ్ చేయొచ్చు.. ఒకటేమిటి.. మనకు నచ్చినవన్నీ చేయొచ్చు. మెటా సంస్థ తయారుచేస్తున్న స్మార్ట్ రిస్ట్ బ్యాండ్‌తో ఇవన్నీ సాధ్యం కానున్నాయి. టెక్నాలజీ వినియోగంలో ఇదో విప్లవాత్మక మార్పుగా చెబుతున్నారు టెక్ నిపుణులు. ఇప్పటికే వాయిస్ కమాండ్స్‌తో పనిచేసే స్మార్ట్ కళ్లజోళ్లను మెటా రూపొందించింది.మెటా రియాలిటీ ల్యాబ్స్‌లో..: ఈ సాంకేతికతకు సంబంధించిన పురోగతిని ఇటీవల ప్రముఖ జర్నల్ ‘నేచరల్’లో మెటా ప్రచురించింది. మెటాకు చెందిన వ్యాపార, పరిశోధనా విభాగం ‘రియాలిటీ ల్యాబ్స్’లో ఈ పరిశోధనలు నిర్వహించారు. సుమారు 300 మంది వివిధ రకాల పనులు చేస్తుంటే.. వారి కండరాల నుంచి వచ్చే విద్యుత్ సంకేతాలను పసిగట్టేందుకు మెషీన్ లెర్నింగ్ మాడ్యూళ్లకు శిక్షణ ఇచ్చారు. ఆ మోడళ్లు వారి కండరాల సందేశాలను విజయవంతంగా గ్రహించి, వారి కదలికలకు అనుగుణంగా పనిచేశాయి. ఈ రిస్ట్ బ్యాండ్‌ని మెటా ఆగ్మెంటెడ్ రియాలిటీ కళ్లద్దాలు ‘ఓరియన్’తోనూ పరీక్షించారు.ఎలా పనిచేస్తుంది?..: మన మెదడు.. నరాల ద్వారా కండరాలకు విద్యుత్ సంకేతాలు పంపుతుంది. వీటిని ఎలక్ట్రోమయోగ్రాఫిక్ (ఈఎమ్‌జీ) సంకేతాలు అంటారు. మన మణికట్టు దగ్గర ఉండే కండరాల నుంచి వచ్చే విద్యుత్ సంకేతాల ఆధారంగా పనిచేసే రిస్ట్ బ్యాండ్‌ని మెటా కంపెనీ తయారుచేసింది. దీని సాయంతో కంప్యూటర్లు, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్)తో పనిచేసే వస్తువులను నియంత్రించవచ్చు. ఇకమీదట కీబోర్డులు, మౌస్‌లు లేదా స్క్రీన్‌ను టచ్ చేయడం వంటివేవీ అవసరం ఉండదు. కంప్యూటర్లతో పనిచేయించడం మరింత సులభతరం, సరళతరం కానుంది. మన జేబుల్లో చేయి పెట్టి వేళ్లు కదిలించినప్పుడు కూడా ఇది పనిచేయడం విశేషం.ఏమిటీ సాంకేతికత?సాధారణంగా ఎలక్ట్రోమయోగ్రాఫిక్ (ఈఎమ్‌జీ) సంకేతాలు శరీరం లోపలి నుంచి వస్తాయి. వాటిని గ్రహించి బయట నుంచి పనిచేస్తుంది కాబట్టి దీన్ని ‘ఉపరితల ఈఎమ్‌జీ (ఎస్‌ఈఎమ్‌జీ) సాంకేతికతగా పిలుస్తున్నారు. ఇది చాలా తేలికైన రిస్ట్ బ్యాండ్. మనం చేతిని కదిలినప్పుడు కండరాల నుంచి వచ్చే అతి సూక్ష్మ లేదా స్వల్ప స్థాయి విద్యుత్ సంకేతాలను కూడా గ్రహించి పనిచేయడం దీని ప్రత్యేకత. పెద్దపెద్ద పరికరాలు, యంత్రాల అవసరం లేకుండానే ఇది పనిచేస్తుంది. కెమెరాలు, కొన్ని రకాల సెన్సర్లతో పనిచేసే వ్యవస్థలు మన సంజ్ఞలను గుర్తించి పనిచేస్తాయి. కానీ, మన కదలికలు స్పష్టంగా లేకపోతే ఇవి పనిచేయవు. కానీ, మన మెదడు – కంప్యూటర్ లేదా న్యూరో మోటార్ ఇంటర్‌ఫేస్‌లు.. అంటే మన శరీరం నుంచి వచ్చే విద్యుత్ సంకేతాలతో పనిచేసే వాటితో ఈ సమస్య ఉండదని ఈ అధ్యయన కర్తలు చెబుతున్నారు.దీంతో ఏమేం చేయొచ్చు?⇒ ఒక టేబుల్ లేదా మన తొడ లేదా డెస్క్ లాంటి దానిపై మనం రాసిన దాన్ని కూడా ఈ రిస్ట్ బ్యాండ్ గుర్తించి, మనం ఏం రాశామో కంప్యూటర్ స్క్రీన్ మీద చూపిస్తుంది.⇒ మెసేజ్‌లు టైప్ చేయొచ్చు⇒ మెనూలు నియంత్రించ వచ్చు⇒ చేతుల కదలికల ద్వారా డిజిటల్ కంటెంట్‌ను మనకు నచ్చినట్టు యాక్సెస్ చేయవచ్చుఎవరికి ఉపయోగం?దివ్యాంగులకు..⇒ శరీరంలోకి ప్రత్యేకమైన ఇంప్లాంట్లు లేదా సంక్లిష్టమైన పరికరాలు జొప్పించాల్సిన అవసరం లేకుండానే.. వివిధ శారీరక సామర్థ్యాలు ఉన్న వ్యక్తులకు..⇒ సాధారణ ఇన్ పుట్ పరికరాలను ఉపయోగించడంలో ఇబ్బంది పడుతున్నవారికి ..⇒ బహిరంగంగా లేదా ప్రైవేటుగా మాట్లాడలేని సందర్భాల్లో ఏదైనా విషయాన్ని రహస్యంగా అవతలివారికి చేరవేయాల్సి వచ్చినప్పుడు..మరిన్ని ఆవిష్కరణల కోసం..ప్రస్తుతానికి ఈ సాంకేతికత పూర్తిగా అభివృద్ధి కాలేదు. మన శరీరం నుంచి వచ్చే సంకేతాలను గుర్తించే పరికరాలను భవిష్యత్తులో అందరికీ అందుబాటులోకి తీసుకురావడం తమ లక్ష్యమని మెటా చెబుతోంది. ఈ సాంకేతికతకు సంబంధించిన డేటా, సాఫ్ట్వేర్ మోడళ్లు, డిజైన్ మార్గదర్శకాలను పరిశోధకులతో పంచుకునేందుకు మెటా ముందుకు వచ్చింది. తద్వారా.. కండరాల నుంచి వచ్చే విద్యుత్ సంకేతాల ఆధారంగా పనిచేసే మరిన్ని సాంకేతికతల ఆవిష్కరణలకు ఇది తోడ్పాటు అందించనుంది. -
బెట్టింగ్ యాప్ కేసులో గూగుల్, మెటాకు ఈడీ సమన్లు
బెట్టింగ్ యాప్‌ల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు ప్రదర్శిస్తోంది. మొన్నీమధ్యే 29 మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టెక్ దిగ్గజ కంపెనీలు గూగుల్, మెటాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. గూగుల్, మెటా కంపెనీలు ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న బెట్టింగ్ యాప్‌లను ప్రమోషన్ చేస్తున్నాయన్నది ఈడీ అభియోగం. సదరు యాప్‌లు మనీలాండరింగ్, హవాలా లావాదేవీలలాంటి తీవ్రమైన ఆర్థిక నేరాలపై దర్యాప్తు ఎదుర్కొంటున్నాయి. అయితే అలాంటి యాప్‌లకు తమ పేజీల్లో స్లాట్లు కేటాయిస్తూ విపరీతంగా ప్రమోషన్లు నిర్వహిస్తున్నాయని ఈడీ అంటోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన విచారణకు రావాంటూ గూగుల్, మెటాలకు ఈడీ స్పష్టం చేసింది. ఈ పరిణామంపై ఆయా సంస్థల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
ఫేస్‌బుక్‌పై రూ.68 వేలకోట్ల దావా
ఫేస్బుక్ ప్రైవసీ ఉల్లంఘనల ఆరోపణల నేపథ్యంలో మెటాలోని టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, డైరెక్టర్లు వ్యవహరించిన తీరుపై షేర్ హోల్డర్ల బృందంతో బిలియన్ డాలర్ల దావాను పరిష్కరించడానికి మార్క్ జుకర్‌బర్గ్ అంగీకరించినట్లు తెలిసింది. షేర్ హోల్డర్లు 8 బిలియన్ డాలర్లు (6 బిలియన్ పౌండ్లు-సుమారుగా రూ.68 వేల కోట్లు) నష్టపరిహారంగా కోరుతున్నారు. అయితే వారికి ఏమేరకు ముట్టజెబుతామని చెప్పారో మాత్రం తెలియరాలేదు.డెలావేర్ కోర్టులో జరిగిన విచారణ రెండో రోజుకు చేరుకోనున్న నేపథ్యంలో షేర్ హోల్డర్ల తరఫు న్యాయవాది గురువారం ఈ సెటిల్మెంట్ అమౌంట్‌ను ప్రకటించారు. దీనిపై స్పందించేందుకు మెటా నిరాకరించింది. జుకర్‌బర్గ్ చర్యలు కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్‌కు దారితీశాయని, ఇందులో మిలియన్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల డేటాను లీక్ చేసి ఒక రాజకీయ కన్సల్టింగ్ సంస్థ ఉపయోగించిందని మెటా షేర్ హోల్డర్లు ఆరోపించారు.ఇదీ చదవండి: అడుగు దూరంలో ట్రేడ్ డీల్వినియోగదారుల గోప్యతా ఉల్లంఘనల క్లెయిమ్‌లను పరిష్కరించడానికి కంపెనీ చెల్లించాల్సిన జరిమానాలు, చట్టపరమైన ఖర్చులను 8 బిలియన్ డాలర్లకుపైగా తిరిగి చెల్లించేలా మెటాను ఆదేశించాలని వాటాదారులు న్యాయమూర్తిని కోరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2016 ఎన్నికల ప్రచారం కోసం పనిచేసిన రాజకీయ కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా మిలియన్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల డేటాను యాక్సెస్ చేసినట్లు వెల్లడైన తరువాత 2018లో వాటాదారులు దావా వేశారు. -
11 మంది టాప్ ఎక్స్‌పర్ట్‌లతో మెటా కొత్త ల్యాబ్
ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటలిజెన్స్(ఏజీఐ)ను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్(ఎంఎస్ఎల్) అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. ఈ విభాగంలో పనిచేసే మెటా ఏఐ మోడల్, ఉత్పత్తి బృందాలు ఫండమెంటల్ ఏఐ రీసెర్చ్(ఫెయిర్)ను అభివృద్ధి చేస్తాయని చెప్పారు. ఎంఎస్ఎల్ కింద కొత్త ల్యాబ్ తదుపరి తరం లార్జ్ ల్యాంగ్వేజ్ మోడళ్ల (ఎల్ఎల్ఎం) నిర్మాణంపై దృష్టి పెడుతుందని తెలిపారు.డేటా లేబులింగ్ స్టార్టప్ స్కేల్ ఏఐ మాజీ సీఈఓ అలెగ్జాండర్ వాంగ్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్నారు. ఈ విభాగానికి చీఫ్ ఏఐ ఆఫీసర్‌గా వాంగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. బ్లూమ్‌బర్గ్‌లోని వివరాల ప్రకారం.. ఉద్యోగులకు పంపిన మెమోలో జుకర్‌బర్గ్ వాంగ్‌ను ‘ఈ తరం అత్యంత ఆకట్టుకునే వ్యవస్థాపకుడు’ అని అభివర్ణించారు. వాంగ్‌తోపాటు గిట్ హబ్ మాజీ సీఈఓ నాట్ ఫ్రీడ్ మన్ కూడా ఈ బృందంలో చేరనున్నారు. కృత్రిమ మేధ ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, అనువర్తిత పరిశోధనలపై ఫ్రీడ్ మన్ దృష్టి సారించనున్నారు.అగ్రశ్రేణి పరిశోధకులుబ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం, మెటా తన ప్రత్యర్థుల నుంచి 11 మంది అగ్రశ్రేణి ఏఐ పరిశోధకులను నియమించుకుంది. ఎంఎస్ఎల్ కోసం మెటాలో చేరినవారి వివరాలను వైర్డ్ తెలిపింది. ఇందులో ఓపెన్ ఏఐ ఓ-సిరీస్ మోడళ్ల సృష్టికర్త ట్రాపిట్ బన్సాల్, జీపీటీ-4 ఓ వాయిస్, మల్టీమోడల్ పోస్ట్ ట్రైనింగ్‌లో పాల్గొన్న షుచావో బీ, గూగుల్ రీసెర్చ్‌లో ఇమేజ్ జనరేషన్ టూల్స్ అభివృద్ధి చేయడంలో ప్రసిద్ధి చెందిన హుయ్వెన్ చాంగ్, జీపీటీ-4 మోడల్స్, రీజనింగ్ సిస్టమ్‌లకు కంట్రిబ్యూటర్ అయిన జీ లిన్ ఉన్నారు. గూగుల్ నుంచి జాక్ రే, జోహాన్ షాల్క్విక్, పీ సన్, ఓపెన్ఏఐకి చెందిన హాంగ్యు రెన్, జియాహుయి యు, షెంగ్జియా ఝావో.. వంటి ప్రముఖులున్నారు.ఇదీ చదవండి: టెస్లా షేర్లు భారీగా కుదేలుభారీ ప్యాకేజీలు..గూగుల్, ఎక్స్, మెటా, ఓపెన్ఏఐ.. వంటి ప్రధాన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ మోడళ్లను సృష్టిస్తున్నాయి. ఈ సంస్థల మధ్య పోటీ తీవ్రతరం అవుతుంది. దాంతో తోటివారికంటే ఓ అడుగు ముందుడాలనే భావనతో కంపెనీ ఏఐ నైపుణ్యాలున్నవారికి భారీ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. కృత్రిమ మేధస్సుపై ఆధిపత్యం చెలాయించే రేసులో భాగంగా మెటా కీలక ప్రచారం ప్రారంభించినట్లు ఇటీవల కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి. ఈ విభాగంలో అగ్రశ్రేణి ఏఐ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. మెరుగైన ఏఐ నైపుణ్యాలున్న ఎక్స్పర్ట్లకు 100 మిలియన్ డాలర్ల (రూ.860 కోట్లు) ప్యాకేజీ చెల్లించేందుకు కూడా వెనుకాడడం లేదని సమాచారం. -
ముదురుతున్న ఏఐ వార్!
గూగుల్, ఎక్స్, మెటా, ఓపెన్ఏఐ.. వంటి ప్రధాన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ మోడళ్లను సృష్టిస్తున్నాయి. ఈ సంస్థల మధ్య పోటీ తీవ్రతరం అవుతుంది. దాంతో తోటివారికంటే ఓ అడుగు ముందుడాలనే భావనతో కంపెనీ ఏఐ నైపుణ్యాలున్నవారికి భారీ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. కృత్రిమ మేధస్సుపై ఆధిపత్యం చెలాయించే రేసులో భాగంగా మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కీలక ప్రచారం ప్రారంభించినట్లు కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి. ఈ విభాగంలో అగ్రశ్రేణి ఏఐ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. మెరుగైన ఏఐ నైపుణ్యాలున్న ఎక్స్పర్ట్లకు 100 మిలియన్ డాలర్ల (రూ.860 కోట్లు) ప్యాకేజీ చెల్లించేందుకు కూడా వెనుకాడడం లేదని సమాచారం.నేరుగా సంప్రదింపులుకొన్ని సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకులు, డెవలపర్లు, స్టార్టప్ ఫౌండర్లను వాట్సాప్, ఈమెయిల్ ద్వారా మార్క్ జుకర్‌బర్గ్ సంప్రదిస్తున్నారు. వీరిలో కొందరిని వ్యక్తిగతంగా షార్ట్‌లిస్ట్ చేసి ఆయా నిపుణులను నేరుగా సంప్రదిస్తున్నారు. వారితో జరుపుతున్న చర్చల్లో కేవలం నియామకాల గురించే కాకుండా ఆర్టిఫిషియన్ జనరల్ ఇంటెలిజెన్స్, భవిష్యత్తు కార్యకలాపాలు వంటి చాలా అంశాలను చర్చిస్తున్నారు.సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ కోసం..మెటా కొన్ని రోజుల నుంచి మానవ స్థాయి కృత్రిమ మేధ వ్యవస్థలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ‘సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్’ను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందుకు ప్రపంచంలోనే టాప్ స్కిల్డ్ పర్సన్స్‌ను నియమించుకోవాలని మెటా భావిస్తోంది. దాంతో సరైన నైపుణ్యాలు ఉన్నవారికి భారీగా ప్యాకేజీలు ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. అలెగ్జాండర్ వాంగ్ స్థాపించిన స్కేల్ ఏఐ కంపెనీను 14 బిలియన్ డాలర్ల(రూ.1.2 లక్షల కోట్లు) వాల్యుయేషన్‌కు కొనుగోలు చేసింది. సిలికాన్ వ్యాలీలో అత్యంత ప్రభావవంతమైన డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్టప్‌ను నిర్మించడంలో ప్రసిద్ధి చెందిన వాంగ్ ఇప్పుడు కృత్రిమ మేధ ఆవిష్కరణలో మెటా తరఫున పని చేస్తున్నారు.ఇదీ చదవండి: మొదటిసారి ఆదాయపన్ను విధిస్తున్న దేశంకొందరు విముఖతఅయితే కొందరు మాత్రం తమ నైపుణ్యాలకు, తాము స్థాపించిన కంపెనీలకు మెటా ఎంత వెచ్చిస్తానంటున్నా కలిసిరావడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు. జుకర్‌బర్గ్, మెటా ఏఐ చీఫ్ సైంటిస్ట్ యాన్ లెకున్ మధ్య ఫిలాసఫికల్ విభేదాల వల్ల ఈ సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ దీర్ఘకాలికంగా ఎలా అభివృద్ధి చెందుతుందనే దానిపై స్పష్టత లేకపోవడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. -
అథ్లెట్ల కోసం మెటా ఏఐ గ్లాసెస్
అథ్లెట్లు, క్రీడా ఔత్సాహికులను లక్ష్యంగా చేసుకుని మెటా కొత్త తరం ఏఐ గ్లాసెస్‌ను పరిచయం చేయడానికి ఓక్లేతో జతకట్టింది. ఓక్లే మెటా హెచ్ఎస్టీఎన్ అని పిలువబడే ఈ గ్లాసెస్‌తో మెటా అధునాతన సాంకేతికతను వాడినట్లు తెలిపింది. ఈ గ్లాసెస్‌లోని ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి. 3కే అల్ట్రా హెచ్డీ కెమెరా.. 12 మెగాపిక్సెల్ కెమెరాతో హై రిజల్యూషన్, పాయింట్ ఆఫ్ వ్యూ వీడియోలు, ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది.మెటా ఏఐ ఇంటిగ్రేషన్.. రియల్ టైమ్ సమాచారాన్ని పొందడానికి, మ్యూజిక్‌ను నియంత్రించడానికి, వెదర్‌ను తనిఖీ చేయడానికి లేదా ల్యాంగ్వేజ్‌లను ట్రాన్స్‌లేట్ చేయడానికి ‘హే మెటా’ అనే వాయిస్ కమాండ్ ఉపయోగించవచ్చు.ఓపెన్-ఇయర్ ఆడియో.. ఈ గ్లాసెస్‌లో బిల్ట్ ఇన్ స్పీకర్లు ఉండడంతో ఎలాంటి ఇయర్ ఫోన్లు లేకుండానే మ్యూజిక్ వినవచ్చు.నీరు, ధూళి నిరోధకత కోసం ఐపీఎక్స్ 4-రేటింగ్‌తో అవుట్ డోర్ క్రీడలకు ఎంతో అనువైందని కంపెనీ తెలిపింది.బ్యాటరీ లైఫ్.. 8 గంటల వరకు యాక్టివ్ యూజ్, 19 గంటల స్టాండ్ బై ఉంటుంది. 20 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. చార్జింగ్ కేస్ ద్వారా మరో 48 గంటలు అదనంగా ఛార్జింగ్ ఉంటుంది.ఈ లిమిటెడ్ ఎడిషన్ ఓక్లే మెటా హెచ్ఎస్టీఎన్ ధర 499 డాలర్లు (సుమారు రూ.43,200)గా నిర్ణయించారు. ప్రీ-ఆర్డర్లు జులై 11 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.ఇదీ చదవండి: పుత్తడి ప్రియులకు స్వల్ప ఊరటప్రాథమికంగా యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ గ్లాసెస్ అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. ఇండియా, మెక్సికో, యూఏఈతో ఈ సంవత్సరం చివరలో అందుబాటులోకి తేనున్నట్లు చెప్పింది. -
వాట్సాప్..ఇక యాడ్స్ అడ్డా!
టెక్నాలజీ దిగ్గజం మెటా.. ‘వాట్సాప్ యాడ్స్’పె దృష్టి సారించింది. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే కమ్యూనికేషన్ యాప్‌లలో రారాజైన వాట్సాప్‌లో ప్రకటనలను ప్రసారం చేయనున్నట్టు ఈ అమెరికన్ దిగ్గజం ప్రకటించింది. ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్ ప్రకటనల ఆదాయంతో సక్సెస్ చూసిన మెటా.. తాజాగా వాట్సాప్ యాడ్స్‌ను ‘తెర’పైకి తెచ్చింది. వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది వినియోగిస్తున్నారు. వీరిలో ఏకంగా 85 కోట్లతో భారత్ అగ్ర స్థానంలో ఉంది.ప్రపంచవ్యాప్తంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా జనంతో వాట్సాప్ మమేకమైపోయింది. మెసేజ్, ఫొటో, వీడియో.. ఇలా ఏది పంపాలన్న వాట్సాప్ మాత్రమే వాడేంతగా మనం అలవాటు పడిపోయాం. అందుకేనేమో.. చాలా సంవత్సరాలుగా ప్రకటనలు లేకుండానే కొనసాగించిన మెటా కంపెనీ ఎట్టకేలకు వాట్సాప్ అప్డేట్స్ ట్యాబ్‌లో ప్రకటనలు ప్రసారం చేయాలని నిర్ణయించింది.యూజర్లు, వారి కాంటాక్ట్స్ పోస్ట్ చేసిన ఫొటోలు, వీడియోలు, టెక్స్్ట సందేశాలతోపాటు స్టేటస్ ఫీచర్లో వాట్సాప్ స్పాన్సర్ చేసే ప్రకటనలూ ప్రత్యక్షం అవుతాయి. బ్రాండ్స్ తమ చానెళ్లను ప్రచారంలోకి తేవడానికి కావాల్సిన రుసుము చెల్లించే సౌకర్యాన్ని వాట్సాప్ పరిచయం చేయనుంది. తద్వారా ఫాలోవర్లకు టెక్స్ట్ వీడియోల రూపంలో కంటెంట్‌ను పంచుకోవచ్చు. కంటెంట్‌ను ఆస్వాదించేందుకు తమకు నచ్చిన చానెళ్లకు నెలవారీ చందా చెల్లించేందుకు సైతం ఫాలోవర్లకు అవకాశం ఉంటుంది.కళ్లుచెదిరే వ్యాపారం..: వాట్సాప్ నెలవారీ యాక్టివ్ వినియోగదార్ల సంఖ్య 200 కోట్ల పైచిలుకే. 85.4 కోట్ల యూజర్లతో భారత్ ప్రపంచంలో తొలి స్థానంతో దూసుకుపోతోంది. తరవాతి స్థానాల్లో బ్రెజిల్ (14.8 కోట్లు), ఇండోనేషియా (11.2 కోట్లు), యూఎస్ (9.8 కోట్లు), ఫిలిప్పీన్స్ (8.8 కోట్లు) ఉన్నాయి. ప్రస్తుతం వాట్సాప్ 60 భాషల్లో 180 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. వాట్సాప్ ’అప్డేట్స్’ ట్యాబ్‌ను రోజుకు 150 కోట్ల మంది వీక్షిస్తున్నారు. ఈ అంశమే వాట్సాప్ మాతృ సంస్థ మెటాకు కలిసి రానుంది. ఇప్పటికే ఎఫ్బీ, ఇన్స్టాగ్రామ్ వేదికగా కళ్లు చెదిరే వ్యాపారం చేస్తోంది మెటా. ఈ జాబితాలో ఇప్పుడు వాట్సాప్ చేరుతోంది.అంచనాలకు అందనంత....: ఈ టెక్ దిగ్గజాల ప్రకటనల ఆదాయం అంచనాలకు అందనంత ఉంది. గూగుల్ 2024లో రూ.22,75,560 కోట్ల ఆదాయం పొందింది. 2025 జనవరి–మార్చిలో మెటా ప్రకటనల ఆదాయం రూ.3,55,180 కోట్లు. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 16.14 శాతం అధికం. ప్రతిరోజు మెటా యాప్స్‌ను ప్రపంచవ్యాప్తంగా 343 కోట్ల మంది వాడుతున్నారు. ఏడాదిలో ఈ సంఖ్య 6 శాతం పెరిగింది. ఇక భారత్‌లో ఈ రెండు దిగ్గజాలు 2023–24లో ప్రకటనల రూపంలో సుమారు రూ.50,000 కోట్లు అందుకున్నాయంటే ఆశ్చర్యం వేయక మానదు.ఈ రంగాల్లో ప్రయోజనం..: డైరెక్ట్ టు కంజ్యూమర్ (డీ2సీ), ఫాస్ట్ మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ), బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా, ఎడ్యుకేషన్ టెక్నాలజీ (ఎడ్టెక్), ఆరోగ్య సంరక్షణ, క్విక్ కామర్స్ వంటి రంగాలలోని బ్రాండ్స్ వాట్సాప్ స్టేటస్ ప్రకటనల నుండి ప్రయోజనం పొందుతాయని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, రీల్స్, ఫేస్బుక్ షార్ట్ వీడియోలతో పోలిస్తే వాట్సాప్ స్టేటస్‌లోని ప్రకటనలు బ్రాండ్స్ చేసే పెట్టుబడిపై తక్షణ రాబడిని ఇవ్వకపోవచ్చని కూడా చెబుతున్నారు.సమ్మతితో ప్రకటనలుప్రస్తుతానికి ప్రకటనలు కేవలం అప్డేట్స్ ట్యాబ్‌లో మాత్రమే కనిపిస్తాయి. వ్యక్తిగత చాట్స్ ఎప్పటిలానే యాడ్స్ ఫ్రీగానే కొనసాగుతాయని వాట్సాప్ వెల్లడించింది. అలాగే ప్రకటనకర్తలకు వ్యక్తుల ఫోన్ నంబర్లు షేర్ చేయడం లేదా అమ్మడం చేయబోమని కూడా పేర్కొంది. వాట్సాప్ అనేది స్నేహితులు, కుటుంబ సభ్యులతో చాట్ చేయడానికి ఉపయోగించే ప్రైవేట్ డిజిటల్ స్థలం. ఇక్కడ ప్రకటనలు ఇచ్చేటప్పుడు బ్రాండ్స్ జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.వాట్సాప్ పట్ల యూజర్లలో నమ్మకం ఉంది. యూజర్లు కుటుంబంతో, సన్నిహితులతో మాట్లాడతారు. సున్నిత లావాదేవీలను నిర్వహిస్తారు. ప్రకటనలు ఆ పవిత్రతకు భంగం కలిగిస్తే మెటాకు ఎదురుదెబ్బ తగిలే అవకాశం లేకపోలేదు. వినియోగదారుల సమ్మతితో ప్రకటనలు ఇవ్వాలి. యూజర్ల ప్రైవసీకి భంగం కలగకూడదు.అన్నింటా భారతీయులేగూగుల్లో ఏదైనా వెతుకుతున్నప్పుడో.. ఎఫ్బీ, యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్‌లో విహరిస్తున్నప్పుడో ప్రకటనలు వెల్లువెత్తుతుంటాయి. నిముషాల వ్యవధిలోనే కొత్త కొత్త యాడ్స్ ప్రత్యక్షమవుతుంటాయి. ఇందుకు కారణం.. మనతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్స్‌ను కోట్లాది మంది వాడుతుండడమే. ఈ స్థాయిలో యూజర్లు ఉన్నారు కాబట్టే బ్రాండ్ల ప్రచారానికి ఈ యాప్స్ అడ్డాగా మారాయి. వీటికి ఉన్న యూజర్ల సంఖ్య చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఎఫ్బీ, యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ వాడకంలో మన భారతీయులే ముందంజలో ఉన్నారు.గూగుల్: రోజుకు సగటున 850 కోట్ల వరకు సెర్చెస్ నమోదవుతున్నాయి. 100 కోట్ల మంది రోజువారీ యాక్టివ్ యూజర్లున్నారు. భారత్ నుంచి నెలకు 1,200 కోట్ల విజిట్స్ నమోదవుతున్నట్టు సమాచారం. యూఎస్ తర్వాత రెండో స్థానంలో భారత్ నిలిచింది.ఫేస్బుక్: ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైచిలుకు నెలవారీ యాక్టివ్ వినియోగదారులు ఉన్నారు. ప్రపంచంలో అత్యధికంగా వాడుతున్న సామాజిక మాధ్యమం ఇదే. ప్రపంచ జనాభాలో దాదాపు 37 శాతం మంది ఫేస్బుక్ వాడుతున్నారు. రోజు ఎఫ్బీ తెరుస్తున్నవారు 211 కోట్ల మంది. యూజర్లలో ఎక్కువ మంది 25–34 ఏళ్ల వయస్కులు. ఇక పురుషుల సంఖ్య 56.7 శాతం, స్త్రీలు 43.3 శాతం. 37 కోట్ల యూజర్లతో భారత్ అగ్ర స్థానంలో నిలిచింది. యూఎస్ 19.3 కోట్లు, ఇండోనేషియా 11.7 కోట్లు, బ్రెజిల్ 11 కోట్లు, మెక్సికో 9 కోట్లు, ఫిలిప్పీన్స్ 8.7 కోట్లు, వియత్నాం 7.4 కోట్లు, బంగ్లాదేశ్ 5.5 కోట్లతో తర్వాతి వరుసలో ఉన్నాయి.యూట్యూబ్: యాక్టివ్ యూజర్లు నెలకు 253 కోట్లకు పైమాటే. 46.7 కోట్ల మంది యూజర్లతో మన దేశం అగ్రస్థానాన్ని ఆక్రమించింది. యూఎస్‌లో 23.8 కోట్లు, బ్రెజిల్లో 14.4 కోట్ల మంది వాడుతున్నారు. 80 భాషల్లో 100కుపైగా దేశాల్లో అందుబాటులో ఉంది. వినియోగదార్లలో పురుషులు 54 శాతం, స్త్రీలు 46 శాతం ఉన్నారు.ఇన్స్టాగ్రామ్: 200 కోట్లకుపైగా నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. 41.4 కోట్లతో భారత్ మొదటి స్థానంలో ఉంది. యూఎస్ 17 కోట్లు, బ్రెజిల్ 14 కోట్లతో ఆ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి. యూజర్లలో అత్యధికులు 25–34 ఏళ్ల వయసు వారే. -
ఒకే స్టేటస్ ఇమేజ్‌లో ఆరు ఫొటోలు.. వాట్సాప్ కొత్త అప్డేట్
మెటా కంపెనీ ఆధ్వర్యంలోని ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు కొత్త అప్డేట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యక్తిగత సమాచారంతోపాటు వేడుకలు, ఇతర జ్ఞాపకాలను ముఖ్యమైన వారితో పంచుకోవడానికి వాట్సాప్ స్టేటస్‌ను గతంలోనే తీసుకొచ్చింది. అయితే అందులో ఇప్పటివరకు కేవలం ఒకే ఇమేజ్ను అప్లోడ్ చేసే వీలుండేది. తాజాగా వాట్సాస్ తీసుకొచ్చిన అప్డేట్తో స్టేటస్ ఇమేజ్‌లో గరిష్ఠంగా ఆరు ఇమేజ్‌లను అప్లోడ్ చేసేలా వెసులుబాటు కల్పించింది.ఈమేరకు మే 30న కొత్త అప్డేట్ అందించింది. స్టేటస్ ద్వారా యూజర్లు మరింత సృజనాత్మకంగా తమ ఇమేజ్‌లను ఇతరులతో పంచుకునేందుకు అవకాశం కల్పించింది. కొత్తగా లేఅవుట్లు, మ్యూజిక్, ఫొటో స్టిక్కర్లు.. వంటి ఫీచర్లతో ‘యాడ్ యువర్స్’ ఆప్షన్ ద్వారా ఇమేజ్‌లను యాడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది.ఇదీ చదవండి: నీరుగారుతున్న ఉపాధి హామీ చట్టం లక్ష్యంవినియోగదారులు సులభంగా ఉపయోగించేలా ఎడిటింగ్ టూల్స్‌తో గరిష్టంగా ఆరు ఫోటోలను ఒకే ఇమేజ్ స్టేటస్‌లో పొందుపరిచేలా లేఅవుట్‌ను రూపొందించారు. యూజర్లు ఇమేజ్లన్నింటినీ ఒకే ఫ్రేమ్‌లో ఎలా చూపించాలనుకుంటున్నారో సరిగ్గా అమర్చుకుంటే సరిపోతుంది. దీనికి అదనంగా మ్యూజిక్‌ను యాడ్ చేసుకోవచ్చు. వినియోగదారుల మానసిక స్థితిని అనుసరించి ట్యూన్ సెట్ చేయవచ్చు. దాంతోపాటు మ్యాజిక్ స్టిక్కర్‌ను ఉపయోగించవచ్చు. ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించాలంటే వాట్సాప్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. -
పూర్తి కోడింగ్ పనంతా ఏఐదే!
కృత్రిమ మేధ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. దాదాపు అన్ని రంగాల్లో ఏఐ వినియోగం ఎక్కువైంది. సాఫ్ట్వేర్లోనైతే దీని వాడకం మరీ అధికం. ఇప్పటివరకు కోడింగ్ నిపుణులకు ఏఐ సాయంగా నిలుస్తుంది. అయితే రాబోయే కొన్ని నెలల్లోనే ఏఐ పూర్తి కోడింగ్ రాస్తుందని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ అంచనా వేశారు. ఈ నేపథ్యంలో త్వరలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.వచ్చే 12 నుంచి 18 నెలల్లో కృత్రిమ మేధ(ఏఐ) మెటా అంతర్గత ఏఐ ప్రాజెక్టులకు, ముఖ్యంగా దాని లామా ప్రాజెక్ట్‌ల్లో పూర్తిగా కోడింగ్ సేవలందిస్తుందని మార్క్ జుకర్‌బర్గ్ చెప్పారు. ఇప్పటికే ఈ విభాగాల్లో ఏఐ మెజారిటీ కోడ్‌ను రాస్తుందన్నారు. రానున్న రోజుల్లో ప్రాజెక్ట్ లక్ష్యాలను నిర్దేశించడం, పరీక్షలను నిర్వహించడం, బగ్‌లను గుర్తించడం, కోడ్ నాణ్యతను మెరుగుపరచడం వంటి మరింత అధునాతన పనులను ఏఐ చేపడుతుందని జుకర్‌బర్గ్ భావిస్తున్నారు. కృత్రిమ మేధ త్వరలోనే ఈ రంగాల్లో ఇంజినీర్లను రిప్లేస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.సుందర్ పిచాయ్..గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఇటీవల ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రధాన టెక్ కంపెనీల్లో కృత్రిమ మేధను గణనీయంగా వినియోగిస్తున్నట్లు చెప్పారు. గూగుల్ ఆల్ఫాకోడ్, మెటా ఏఐ నమూనాలు వాటి లార్జ్ ల్యాంగ్వేజీ మోడల్స్‌తో ఫంక్షనల్ కోడ్‌ను జనరేట్ చేయడం, దోషాలను డీబగ్గింగ్ చేయడం, పనితీరును ఆప్టిమైజ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.ఇదీ చదవండి: బంగారమా..? మకొద్దు బాబోయ్..!ఏఐకి అంత సీన్ లేదు..ఇదిలాఉండగా, ఏఐను అతిగా అంచనా వేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోడింగ్‌లో ఏఐ పురోగతి మెరుగ్గానే ఉన్నప్పటికీ, హ్యూమన్ డెవలపర్లను పూర్తిగా భర్తీ చేయడం కుదరదని చెబుతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్‌లో ఫంక్షనల్ కోడ్ రాయడం కంటే సంక్లిష్టమైన వ్యాపార అవసరాలను అర్థం చేసుకోవడం, నైతిక నిర్ణయాలు తీసుకోవడం, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా వ్యవస్థలను రూపొందించడం అవసరం అవుతుంది. ఈ పనులకు సృజనాత్మకత, సందర్భోచిత అవగాహన, డెసిషన్ మేకింగ్ ఎంతో తోడ్పడుతుంది. వీటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమర్థంగా నిర్వహించలేదనే వాదనలున్నాయి. -
కార్పొరేట్ సంస్థలకు కళ్లెం
ప్రభుత్వాల హవా తగ్గి కార్పొరేట్లు, గుప్పెడుమంది వ్యక్తులు రాజ్యాన్ని శాసించే స్థితి ప్రపంచమంతటా వచ్చి చాన్నాళ్లవుతోంది. ఇలాంటి స్థితిలో డిజిటల్ మార్కెటింగ్ చట్టం (డీఎంఏ) ఉల్లంఘనలకు పాల్పడినందుకు అమెరికన్ బడా టెక్ సంస్థలు యాపిల్, మెటా (ఫేస్బుక్)లకు భారీయెత్తున జరిమానా విధించి యూరోపియన్ యూనియన్ (ఈయూ) కొంత సాహసాన్ని ప్రదర్శించిందనే చెప్పాలి. యాపిల్ సంస్థకు 57 కోట్ల డాలర్లు (రూ. 4,868 కోట్లుపైగా), మెటా సంస్థకు దాదాపు 23 కోట్ల డాలర్లు (రూ. 1,965 కోట్లు) ఈయూ పెనాల్టీ విధించింది. వచ్చే జూన్ చివరికల్లా యాపిల్ ఈయూ నిబంధనలకు భిన్నంగావున్న తన యాప్ స్టోర్ నిబంధనల్లో సవరణలు చేయకపోతే రోజువారీ జరిమానాలు మొదలవుతాయి. మెటా సంస్థ నిరుడు ఈయూ నోటీసు అందుకున్నాక దారికొచ్చి యాప్ స్టోర్‌లో మార్పులు తెచ్చింది. అందువల్ల పాత తప్పులకు మాత్రమే జరిమానా పడింది. ఈయూ తమపై కక్షసాధింపు ధోరణిలో వ్యవహరిస్తున్నదని ఆ రెండు సంస్థలూ ఆరోపిస్తున్నాయి. నిజానికి ఈ రెండు సంస్థలకు విధించిన జరిమానాలూ చాలా తక్కువన్న అభిప్రాయం యూరప్ ప్రజల్లోవుంది. మ్యూజిక్ స్ట్రీమింగ్‌లో నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ నిరుడు యాపిల్ సంస్థకు 205 కోట్ల డాలర్ల (రూ. 17,500 కోట్లపైమాటే), మెటా సంస్థకు 90 కోట్ల డాలర్ల (రూ. 7,685 కోట్లకుపైగా) జరిమానాలు విధిస్తున్నట్టు ఈయూ ప్రకటించింది. ఏడాదిగా ఆ సంస్థల వివరణను పరిశీలించే పేరిట తాత్సారం చేసి చివరకు తుది తీర్పు ప్రకటించింది. ఆ సంస్థలు మాత్రం ఇది కూడా అన్యాయమేనన్నట్టు భూమ్యాకాశాలు ఏకం చేస్తున్నాయి.వర్తమాన పరిస్థితుల్లో ఈయూ ఈ స్థాయి జరిమానాలు విధించటం ఒకరకంగా సాహసమనే చెప్పాలి. ఎందుకంటే అమెరికా అధ్యక్ష పీఠాన్ని ట్రంప్ అధిష్ఠించాక లెక్కలు మారిపోయాయి. సర్వరోగ నివారిణిగా ఆయన అధిక సుంకాల మోతమోగిస్తానంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రత్యేకించి అమెరికన్ టెక్ కంపెనీల జోలికి ఎవరొచ్చినా తాట తీస్తామంటున్నారు. మొన్న ఫిబ్రవరిలో ప్యారిస్‌లో జరిగిన కృత్రిమ మేధ సదస్సు సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈయూపై బాహాటంగానే అక్కసు వెళ్లగక్కారు. ఏఐ ప్రగతిని అడ్డుకునేలా యూరప్ వ్యవహ రిస్తున్నదని, అమెరికా బడా సంస్థలను అతిగా నియంత్రించే పోకడలు మానుకోవాలని హెచ్చరించారు. ఆయన ప్రత్యేకించి డీఎంఏ, డిజిటల్ సర్వీసెస్ చట్టం (డీఎస్ఏ)లను ప్రస్తావించారు కూడా. జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్) సైతం తమకు సమ్మతం కాదని తెలిపారు. యూరప్ దేశాల్లో నిబంధనలు తమ వ్యాపార విస్తరణకూ, లాభార్జనకూ ఆటంకం కలిగిస్తున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులందుతున్నట్టు వాన్స్ వివరించారు. ఈ పోకడల్ని సహించబోమన్నారు. ఇదంతా గుర్తుంచుకుంటే ఈయూ తాజా నిర్ణయంలోని ఆంతర్యమేమిటో బోధపడుతుంది. కాకి పిల్ల కాకికి ముద్దన్నట్టు ఏటా కోట్లాది డాలర్లు పన్నుల రూపంలో చెల్లిస్తున్న తమ బడా సంస్థలంటే అమెరికాకు అభిమానంవుండొచ్చు. కానీ ఆ సంస్థలు రకరకాల నిబంధనల పేరిట సాధారణ వినియోగదారుల్ని పీల్చి పిప్పి చేస్తున్నా, దివాలా తీయిస్తున్నా వేరే దేశాల వారెవరూ మాట్లాడకూడదని ట్రంప్, వాన్స్ భావించటం తెంపరితనం తప్ప మరోటి కాదు. యాపిల్ యాప్ స్టోర్‌లో లభించే మ్యూజిక్ యాప్ తదితరాలపై అధికంగా వసూలు చేస్తున్నారని భావించే వినియోగదారులు నేరుగా తమ వద్ద కొనుగోలు చేయొచ్చని చెప్పే డెవలపర్ల సందేశం కనబడకుండా, ఆ యాప్‌కు నేరుగా తీసుకెళ్లే లింక్‌లు పనిచేయకుండా యాపిల్ నిరోధిస్తున్నది. ఇక మెటా అయితే తన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో లభ్యమయ్యే యాప్‌లు కావాలంటే వినియోగదారుల వ్యక్తిగత డేటా ఉపయోగించుకోవటానికి అనుమతించాలని షరతు విధిస్తోంది. అంగీకరించనివారికి ఆ యాప్‌లలో వాణిజ్య ప్రకటనలు కనబడేలా చేస్తోంది. అవి వద్దనుకుంటే నెలవారీ ఫీజు చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. సాంకేతికతలు ఎంతగానో విస్తరించిన ఈ తరుణంలో బడా కార్పొరేట్ సంస్థలు వాటిపై ఆధారపడకతప్పని స్థితి జనాలకు కల్పించి చెల్లిస్తారా... చస్తారా అన్నట్టు పీక్కుతింటున్నాయి. ఈ స్థితిలో కీలెరిగి వాతపెట్టిన చందాన డీఎంఏ రంగప్రవేశం చేసింది. టెక్ కంపెనీలు ఉల్లంఘనలకు పాల్పడితే ఆ సంస్థల ప్రపంచ టర్నోవర్‌లో 10 శాతం, పదే పదే ఆ తప్పులు చేస్తూ పోతే ప్రపంచ టర్నోవర్‌లో 20 శాతం మేర జరిమానాలు విధించాలని చట్టం నిర్దేశిస్తోంది. కార్పొరేట్ సంస్థలకు వాతలుపెట్టి అనవసరంగా ట్రంప్ ఆగ్రహాన్ని చవిచూడటమెందుకని ఈయూ జంకుతున్న వైనం తాజా నిర్ణయంలో స్పష్టంగా కనబడుతోంది. వాటిపై చర్య తీసుకుంటున్నామన్న అభిప్రాయం యూరప్ ప్రజల్లో కలగాలి... అదే సమయంలో ట్రంప్ చేత చీవాట్లు తినకుండా, ఆయనగారిని మరీ నొప్పించకుండా గండాన్ని గట్టెక్కాలి అని ఈయూ భావిస్తోంది. అయితే మనకన్నా ఈయూ ఎంతో నయం. గుత్తాధిపత్య వ్యాపార ధోరణులను అరికట్టడానికున్న కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కఠినంగా ఉండలేకపోతున్నది. గూగుల్ సంస్థ పోకడలను అరికట్టడంలో ఎంతో కొంత విజయం సాధించినా అది చాలినంతగా లేదు. వినియోగదారులూ, స్థానిక పరిశ్రమలూ నిలువుదోపిడీకి గురికాకుండా... టెక్ సంస్థలైనా, మరే ఇతర సంస్థలైనా ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా ప్రభుత్వాలు పనిచేయాలి. అందుకు కావలసిన చట్టాలు తీసుకురావాలి. అనారోగ్యకర వ్యాపార పోకడలపై కఠినచర్యలుండాలి. బడా కార్పొరేట్ సంస్థలు తమ లాభాలను అపారంగా పెంచుకోవటం, అవి ప్రభుత్వాల్ని శాసించే స్థితికి ఎదగటం ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగిస్తుంది. అందుకే ఈయూ చర్యల్ని స్వాగతించాలి. -
యాపిల్, మెటాకు ఈయూ షాక్
లండన్: డిజిటల్ కాంపిటీషన్ చట్టాల ఉల్లంఘనకు గాను అమెరికన్ టెక్ దిగ్గజాలు యాపిల్, మెటాకు యూరోపియన్ కమిషన్ షాకిచి్చంది. రెండు వేర్వేరు కేసుల్లో యాపిల్‌పై 500 మిలియన్ యూరోలు, మెటాపై 200 మిలియన్ యూరోల జరిమానా విధించింది. యాప్ స్టోర్ వెలుపల చౌక ఆప్షన్ల గురించి యూజర్లకు తెలియనివ్వకుండా యాప్‌ల తయారీదారులను నియంత్రించిందుకు గాను యాపిల్‌కి పెనాల్టీ విధించింది. వ్యక్తిగతీకరించిన యాడ్లను చూడాలని లేదా వాటిని తప్పించుకోవాలంటే కొంత రుసుములు చెల్లించాలని ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ యూజర్లపై ఆంక్షలు విధించినందుకు జరిమానా కట్టాలంటూ యూరోపియన్ కమిషన్ ఆదేశించింది. రెండు కంపెనీలు 60 రోజుల్లోగా ఈ ఆదేశాలు పాటించకపోతే మరిన్ని పెనాల్టీ మరింత పెరుగుతుందని పేర్కొంది. గతంలో బిలియన్ డాలర్ల స్థాయిలో విధించిన జరిమానాలతో పోలిస్తే తాజా పెనాలీ్టలు గణనీయంగా తక్కువగా ఉండటం గమనార్హం. -
యాపిల్, మెటాకు వేలకోట్ల జరిమానా
ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలైన యాపిల్, మెటాకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) వందల మిలియన్ల డాలర్ల జరిమానా విధించింది.యాపిల్ సంస్థకు 570 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ.48,64,61,08,500).. మెటాకు 228 మిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 19,45,92,38,025) జరిమానా విధించింది. ఈ భారీ జరిమానాలు యూరోపియన్ యూనియన్ & ట్రంప్ పరిపాలన మధ్య ఉద్రిక్తతలను పెంచే ప్రమాదం ఉంది. ఎందుకంటే అమెరికా కంపెనీలపై జరిమానా విధించే దేశాలపై సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇప్పటికే వెల్లడించారు.యాపిల్ కంపెనీ ఐఫోన్ వినియోగదారులను.. ఐఫోన్ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా.. ఇతర యాప్‌లను డౌన్లోడ్ చేయడానికి వీలు లేకుండా పరిమితులు విధించినట్లు యూరోపియన్ యూనియన్ తన పరిశోధనలో తేల్చింది. ఇది డీఎంఏ చట్టం నిబంధనలకు విరుద్ధం. ఈ కారణంగానే జరిమానా విధిస్తున్నట్లు ఈయూ పేర్కొంది. వినియోగదారుల వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని, ఈ కారణంగానే ఇతర యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అనుమతించలేదని యాపిల్ స్పందించింది. అంతే కాకుండా తమ టెక్నాలజీని ఉచితంగా ఇవ్వాలని ఈయూ చెబుతోందని.. ఈ కారణంగానే సంస్థను టార్గెట్ చేసినట్లు వెల్లడించింది.ఇదీ చదవండి: కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..ఇక మెటా విషయానికి వస్తే.. తన సొంత ప్లాట్‌ఫామ్‌లలో వారి వ్యక్తిగత డేటాను కలపకుండానే తన సేవలను ఉపయోగించుకునే అవకాశాన్ని వినియోగదారులకు అందించాల్సి వచ్చింది. అయితే, DMA నిబంధనల ప్రకారం అలా చేయడంలో విఫలమైంది. ఈ కారణంగానే జరిమానా పడింది. ఈ అంశంపై తాము కూడా సవాలు చేస్తామని మెటా పేర్కొంది. -
మనసు మాట మెటాకు తెలుసు!
మీ గురించి ఎవరికి బాగా తెలుసు అని ఎవరైనా అడిగితే ఏం చెబుతారు? అమ్మకో, నాన్నకో, జీవిత భాగస్వామికో, ఆప్త మిత్రుడికో అని చెబితే.. అది కచ్చితంగా అబద్ధమే. ఎందుకంటే.. ఇప్పుడు మీ గురించి అందరికన్నా మీరు వాడే ఫోన్‌కు లేదంటే ల్యాప్టాప్కే బాగా తెలుసు. మీరు కాదన్నా అదే నిజం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా మీకు ఇష్టమైన రంగు.. ఇష్టమైన చిరుతిళ్లు.. ఇష్టమైన బట్టలు.. ఇలా అన్నింటిని గురించి ముందే తెలుసుకుంటున్నాయి సోషల్‌మీడియా సంస్థలు. ఇది గతంలోనూ ఉన్నప్పటికీ ఏఐ వచ్చాక వాణిజ్య ప్రకటనల స్వరూపమే మారిపోతోంది. ఈ రంగంలో ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా తీసుకొచ్చిన ‘ఆండ్రోమెడా’ఇప్పుడు సరికొత్త సంచలనం.అంతా మార్చేసిన ఏఐఫేస్బుక్ ఓపెన్ చేస్తే మీకు కావాల్సిన ప్రొడక్టులే ముందుగా కనిపిస్తున్నాయా? ఇన్‌స్ట్రాగామ్‌లో స్క్రోల్ చేస్తుంటే.. మీకు నచ్చే డ్రెస్ యాడ్ టెంప్ట్ చేస్తుందా? ఇదేమీ యాదృచ్ఛికం కాదు. మీకు ఎలాంటి ప్రకటనలు చూపించాలో ముందే మెటా సంస్థ నిర్ణయిస్తోంది. మన ‘సోషల్’లైఫ్‌లో యాడ్స్ తీరును పూర్తిగా మార్చేస్తోంది. మనల్ని ఏఐ పూర్తిగా చదివేస్తోంది. దీంతో మనకు నచ్చే ఉత్పత్తులే మన ముందు ప్రత్యక్షమవుతున్నాయి.మెటా అభివృద్ధి చేసిన ఆండ్రోమెడా అనే కొత్త ఏఐ టెక్నాలజీనే ఇందుకు కారణం. ఈ సిస్టమ్ రోజుకు కోట్ల యాడ్స్‌ను విశ్లేషిస్తుంది. యూజర్‌కు ఏ ప్రకటన చూపించాలో నిర్ణయిస్తుంది. నిజానికి ఇది కొత్తదేమీ కాదు. గతంలోనూ మనం ఫోన్ ద్వారా నెట్లో ఏదైనా వెదికితే.. దానికి సంబంధించిన అంశాలు మన సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌పై వరుసగా వచ్చేవి. ఇప్పుడు ఆ విధానం మరింత కొత్తరూపు సంతరించుకుంది.ఇన్ఫ్లుయెన్సర్లతో కలిసి యాడ్స్కంపెనీలు తమ ఉత్పత్తుల్ని ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రమోట్ చేయడం చూస్తున్నాం. వీడియో మొత్తం చూశాక.. వీడియోల డిస్క్రిప్షన్లోని లింకులను ఓపెన్‌చేసి నచ్చితే ఆర్డర్ పెట్టేస్తున్నాం. ఇకపై అంత కష్టపడక్కర్లేదు. యూట్యూబర్, ఇన్స్టాగ్రామ్ స్టార్ ఓ ప్రొడక్ట్ గురించి చెప్తే.. వెంటనే దానికి సంబంధించిన యాడ్ మీకు కనిపిస్తుంది. పాపులర్ క్రియేటర్లతో కలసి బ్రాండ్లు తమ ఉత్పత్తులను కొత్తగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ఇదో చక్కని అవకాశమని కంపెనీలు చెబుతున్నాయి.ఇన్ఫ్లుయెన్సర్ వీడియోను చూస్తూనే.. కింద కనిపించే సంబంధిత పాపప్స్‌ను సెలక్ట్ చేసుకుని ఆర్డర్ పెట్టేయొచ్చన్నమాట. ఒకే ప్రకటనలో యూజర్‌కు నచ్చే మరొక ఉత్పత్తిని కూడా చూపించే అవకాశం ఇవ్వనుంది మెటా. అంటే.. ఒక కంపెనీ సమ్మర్ స్పెషల్ కలెక్షన్స్‌ను చూపిస్తూనే.. వచ్చే వర్షాకాలం సీజన్‌కు సరిపడే జాకెట్లను కూడా ప్రమోట్ చేస్తుంది. ఇలా యాడ్స్ ప్రదర్శించినప్పుడు విక్రయాల్లో 14 శాతం పెరుగుదల కనిపించిందని మెటా చెబుతోంది.మీరే మోడల్ఆన్లైన్లో డ్రెస్సులు కొనడం మామూలే. కానీ, మీరే మోడల్‌గా మారి ఆయా డ్రస్సులను ధరించి చూసుకుని కొనుగోలు చేయటం ఇప్పుడు కొత్త ట్రెండ్. ఏఐ ఆధారంగా వర్చువల్ మోడల్స్‌ను చూపించే ఫీచర్‌ను మెటా పరీక్షిస్తోంది. యూజర్ శరీరాకృతికి తగిన డ్రెస్సులను ఎలా ధరించాలో చూపించే ప్రయత్నమిది. ఈ విధానం ఇప్పటికే ఆస్ట్రేలియా, తైవాన్‌లో ప్రయోగాత్మకంగా పరిశీలనలో ఉంది. అంతా బాగానే ఉందిగానీ.. నాకు ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేయడం ఇష్టం అంటారా? అలాంటి వారి కోసం చుట్టు పక్కల మాల్స్‌లోని షాపింగ్ అనుభవాన్ని దగ్గర చేసే ప్రయత్నం చేస్తోంది మెటా.అందుకు తగిన యాడ్స్‌ను వినియోగదారులకు పరిచయం చేస్తోంది. అవే ‘ఓమ్నీ చానల్’యాడ్స్. మీరు ఆన్లైన్లో చూసిన వస్తువు.. మీ సమీపంలోని షాపుల్లో ఉందా? ఎంత ధర? ఎక్కడ కొనాలి? ఇలా అన్నీ చూపించే విధంగా ప్రాంతీయ యాడ్స్ వస్తున్నాయి. దుకాణాల లొకేషన్, డిస్కౌంట్ కోడ్స్ వంటి వివరాలను ఆ యాడ్స్‌లో కనిపిస్తాయి. ఈ యాడ్స్ వాడిన బ్రాండ్లకు 12 శాతం విక్రయాలు పెరిగినట్లు మెటా తెలిపింది.నోటిఫికేషన్లోనూ యాడ్స్ ఇదో సరికొత్త ప్రయోగం. ఫేస్బుక్, ఇన్‌స్టాను ఓపెన్ చేయగానే నోటిఫికేషన్స్ కనిపిస్తాయి. వాటిలో ఇప్పటివరకు ఏ ఫ్రెండ్ రిక్వెస్ట్ లేదంటే కామెంట్స్, లైక్‌లు కనిపిస్తున్నాయి. ఇకపై ఆ నోటిఫికేషన్స్‌లో యాడ్స్ కూడా ఉండొచ్చు. ఆ యాడ్స్ గతంలో మీరు వెతికిన ఉత్పత్తులవే అయి ఉంటాయి. మీరు మళ్లీమళ్లీ వెతికే పని లేకుండా మీ నోటిఫికేషన్‌కు తీసుకొచ్చేస్తోంది మెటా.కొన్ని డిస్కౌంట్ యాడ్స్‌ను కొత్తగా మార్చేస్తోంది. ‘డిస్కౌంట్ పొందాలంటే మీ ఈమెయిల్ ఇవ్వండి’అని నేరుగా అడుగుతుంది. మీరు మెయిల్ అడ్రస్ ఇచ్చి డిస్కౌంట్ ఆఫర్ పొందొచ్చు. దీంతో బ్రాండ్లు తమ కస్టమర్ల లిస్టును పెంచుకోగలుగుతాయి. ఈ మార్పుల ద్వారా మెటా వాణిజ్య ప్రకటనలకు సరికొత్త నిర్వచనం ఇస్తోంది. యాడ్స్‌ను చూడడం టైమ్‌పాస్ కాదు.. టైమ్‌ను సేవ్ చేయడం అని చెబుతోంది. -
జుకర్‌బర్గ్‌పై సంచలన ఆరోపణలు
మెటా అధినేత మార్క జుకర్‌బర్గ్‌పై ఆ సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్ విజిల్‌బ్లోయర్(వేగు) సారా విన్ విలియమ్స్ సంచలన ఆరోపణలకు దిగారు. జుకర్‌బర్గ్‌కు అమెరికా ప్రయోజనాల కన్నా డబ్బే ముఖ్యమని, ఈ క్రమంలోనే చైనాతో చేతులు కలిపి తన సొంత దేశం జాతీయ భద్రతా విషయంలో రాజీ పడ్డారని వెల్లడించారామె. సెనేటర్ జోష్ హవ్యూలే నేతృత్వంలోని కౌంటర్‌టెర్రరిజం సబ్ కమిటీ ఎదుట హాజరైన ఆమె.. తన వాంగ్మూలంలో ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. సీబీఎస్ కథనం ప్రకారం సారా విన్ వాంగ్మూలంలో.. చైనాలో వ్యాపార ఉనికిని పెంచుకోవడానికే మెటా కంపెనీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అన్నారు. చైనాతో మార్క్ జుకర్‌బర్గ్ చేతులు కలిపారు. అందుకే.. పదే పదే అమెరికా జాతీయ భద్రతా విషయంలో మెటా రాజీ పడుతోంది. ఈ క్రమంలోనే అమెరికన్లతో సహా మెటా వినియోగదారుల డేటా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ చేతుల్లోకి వెళ్తోందని ఆరోపించారామె. మెటా కంపెనీ చైనా ప్రభుత్వం కోసం కస్టమ్ సెన్సార్షిప్ను టూల్స్‌ను రూపొందించింది. తద్వారా కంటెంట్ విషయంలో నియంత్రణ వాళ్ల చేతుల్లోకి వెళ్తోంది. తాను స్వేచ్ఛావాదినని, దేశ భక్తుడినని అమెరికా జెండా కప్పేసుకుని ప్రకటించుకునే జుకర్‌బర్గ్.. గత దశాబ్దకాలంగా 18 బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యం అక్కడ ఎలా స్థాపించుకోగలిగారు?. ఇది అమెరికన్లను మోసం చేయడమే అని ఆమె అన్నారు. సారా విన్ విలియమ్స్ గతంలో ఫేస్బుక్లో గ్లోబల్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా పని చేశారు. ఏడేళ్లపాటు సంస్థలో పని చేసిన ఆమె.. ఈ ఏడాది మార్చిలో కేర్లెస్ పీపుల్ పేరిట ఒక నివేదికను పుస్తకాన్ని విడుదల చేసి తీవ్ర చర్చనీయాంశంగా మారారు. అయితే ఈ పుస్తంపై మెటా కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆ పుస్తకాన్ని తాత్కాలికంగా నిషేధించింది. అయితే బుధవారంనాటి విచారణ సందర్భంగా.. ‘‘ఫేస్బుక్ ఆ పుస్త విషయంలో ఆమెను ఎందుకు నిలువరించాలని అనుకుంటోంది?.. అమెరికన్లకు వాస్తవం తెలియాల్సి ఉంది’’ అని సెనేటర్ జోష్ హవ్యూలే అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తమ ఎదట హాజరై వివరణ ఇవ్వాలంటూ గురువారం జుకర్‌బర్గ్‌కు ఆయన ఓ లేఖ రాశారు. వాస్తవాలు బయటపెడితే తనను కోర్టుకు ఈడుస్తామంటూ మెటా బెదిరిస్తోందని సారా విన్ విలియమ్స్ చెబుతుండగా.. ఆమె ఆరోపణలన్నీ అవాస్తవమేనని, చైనాలో తమ కార్యకలాపాలు నడవడం లేదని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. -
మెటా ఏఐ గ్లాసెస్.. ప్రత్యేకతలివే..
సోషల్ మీడియా దిగ్గజం మెటా తమ నెక్ట్స్–జెనరేషన్ గ్లాసెస్ అరియ జెన్ 2 గురించి ప్రకటించింది. ‘అరియ జెన్2 గ్లాసెస్‌కు సంబంధించి మా ప్రయాణంలో తదుపరి దశ గురించి ప్రకటించడానికి సంతోషిస్తున్నాం. మెషిన్ పర్సెప్షన్, కంటెక్ట్స్వల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్‌తో సహా పరిశోధన రంగాలలో కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది’ అని మెటా తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.మెటా అరియా జెన్ 2 స్మార్ట్ గ్లాసెస్ ప్రధానంగా పరిశోధకులు, డెవలపర్ల కోసం రూపొందించిన అత్యాధునిక ఆవిష్కరణ అని కంపెనీ పేర్కొంది. అధునాత వియరబుల్ టెక్నాలజీ(ధరించేందుకు వీలుగా ఉన్న వస్తువుల్లో వాడే టెక్నాలజీ) ఫీచర్లతో ఈ అద్దాలు మార్కెట్లోకి వస్తున్నట్లు స్పష్టం చేసింది.కీలక ఫీచర్లు ఇవే..అధునాతన సెన్సర్లు: హార్ట్ రేట్ మానిటర్, స్పేషియల్ మైక్రోఫోన్లతో పాటు ఐ-ట్రాకింగ్, హ్యాండ్ ట్రాకింగ్, మోషన్ సెన్సార్లను కలిగి ఉంటుంది.కృత్రిమమేధ: ఇంటర్నెట్ కనెక్టివిటీపై ఆధారపడకుండా స్పీచ్ రికగ్నిషన్, ఆబ్జెక్ట్ డిటెక్షన్ వంటి వేగవంతమైన, సమర్థవంతమైన కార్యాచరణలను ప్రాసెస్ చేసి వినియోగదారులకు డేటాను అందిస్తుంది.బ్యాటరీ లైఫ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 6-8 గంటల ఉపయోగించవచ్చని కంపెనీ పేర్కొంది. ఇది పరిశోధన కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది.తేలికపాటి డిజైన్: ఈ గ్లాసెస్ బరువు కేవలం 75 గ్రాములేనని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: మార్చి 17 వరకు ఇంటర్నెట్ సేవలు బంద్ఈ గ్లాస్‌ల వినియోగానికి సంబంధించి మెటా తెలిపిన వివరాల ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ పరిశోధనలో వీటిని ఉపయోగించవచ్చు. దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రియల్‌టైమ్‌లో వస్తువులను, మన ముందుతున్న పరిస్థితులను ట్రాక్ చేసి డేటాను అందిస్తుంది. -
వారి కోసం జుకర్‌బర్గ్ ఫ్యావరెట్ హుడీ వేలం : మార్క్ డ్యాన్స్ వైరల్ వీడియో
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తనకెంతో ఇష్టమైన పాత హుడీని వేలం వేశారు. తద్వారా వచ్చిన సొమ్మును టెక్సాస్ పాఠశాల సంక్షేమం కోసం వినియోగించనున్నారు. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం, ఈ ప్రియమైన హూడీతోపాటు బిడ్ దక్కించుకున్న వ్యక్తికి జుకర్‌బర్గ్ స్వయంగా చేతితో రాసిన నోట్ కూడా దక్కింది. దీనిని ఫేస్బుక్ స్టేషనరీలో రూపొందించారట.2019లో తరచుగా ధరించే నల్లటి హూడీ లాస్ ఏంజిల్స్‌లో జరిగిన వేలంలో భారీ ధరకు అమ్ముడు బోయింది. జూలియన్స్ ఆక్షన్స్ వారి "స్పాట్లైట్: హిస్టరీ అండ్ టెక్నాలజీ" సిరీస్‌లో భాగంగా గత గురువారం ఈ వేలం నిర్వహించింది. దీనికున్న పర్సనల్ టచ్, క్రేజ్ అభిమానులను స్పష్టంగా ఆకట్టుకున్నాయి. దీంతో చాలా వేగంగా బిడ్డింగ్ జరిగింది. దాదాపు 22 బిడ్లు వచ్చాయి. చివరకు రూ.13 లక్షల కంటే ఎక్కువ ధర పలికింది. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) ఇది తన ఆల్-టైమ్ ఫేవరెట్లలో ఒకటిగా అభివర్ణించారు జుకర్‌బర్గ్. , "నేను తొలినాళ్లలో దీన్ని ఎప్పుడూ ధరించేవాడిని. దాని లోపల మా అసలు మిషన్ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అయి ఉంది" అని గుర్తు చేసుకున్నారు. ఈ హూడీ 2010 నాటిది. ఇదే ఏడాది జుకర్‌బర్గ్ టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం సొమ్మను టెక్సాస్‌లోని పాఠశాల పిల్లలకు మద్దతు ఇవ్వడానికి అంకితం చేస్తామని మార్క్ ప్రకటించారు. దీంతోపాటు పాటు ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ధరించిన సిగ్నేచర్ బో టై కూడా వేలంలో అమ్ముడైన ఇతర ప్రసిద్ధ వస్తువులలో ఒకటిగా దాదాపు రూ. 31 కోట్లకు బిడ్దక్కించుకుంది. దీని అసలు ధర వెయ్యి డాలర్లుమాత్రమే.మార్క్ డ్యాన్స్, భార్య ఫిదా మరోవైపు మార్చి 1న, భార్య ప్రిస్సిల్లా చాన్ పుట్టినరోజు సందర్భంగా జుకర్‌బర్గ్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ టక్సేడోలో పార్టీలో ఎంట్రీఇచ్చి టక్సేడోను చింపేసి మరీ, ఒక్క ఉదుటున స్టేజ్‌పైకి అద్భుతమైన నీలిరంగు జంప్‌సూట్‌లో పాట పాడి, డ్యాన్స్ చేశాడు. దీంతో చాన్ ఫిదా అయిపోయింది. తెగ వైరలవుతోంది. 2025 గ్రామీ అవార్డుల వేడుకలో బెన్సన్ బూన్ బ్యూటిఫుల్ థింగ్స్ ప్రదర్శన ఇస్తున్నప్పుడు ధరించిన జంప్‌సూట్ కూడా ఇలాంటిదేనట. -
మెటాలో ఇంత అన్యాయమా?
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృ సంస్థ మెటా (Meta).. వివాదాస్పద నిర్ణయాన్ని ప్రకటించింది. తమ టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు వారి బేసిక్ పేలో 200 శాతం వరకు బోనస్‌లు (Bonus) ఇవ్వాలని నిర్ణయించింది. తక్కువ పనితీరు పేరుతో 5 శాతం మంది ఉద్యోగులను తొలగించిన (Lay Off)వారం రోజుల్లోనే ఈ నిర్ణయం రావడంతో కంపెనీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు బోనస్‌ల చెల్లింపు నిర్ణయాన్ని ఫిబ్రవరి 13న మెటా డైరెక్టర్ల బోర్డు కమిటీ ఆమోదించింది. పోటీ కంపెనీలలో ఇలాంటి పాత్రలతో పోలిస్తే తమ ఎగ్జిక్యూటివ్ పరిహారం 15 శాతం మేర తక్కువగా ఉందన్న కారణంతో మెటా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బోనస్ ప్రకటన సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు వర్తించదని కంపెనీ ఫైలింగ్‌లో పేర్కొంది.అల్ప స్థాయి ఉద్యోగులను తొలగించి బాస్‌లకు బోనస్‌లు ప్రకటించడం తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. ఉద్యోగులను తొలగిస్తూనే ఎగ్జిక్యూటివ్‌లకు భారీగా బోనస్‌లను అందించడం అన్యాయమని విమర్శకులు వాదిస్తున్నారు. కంపెనీలోని ఆదాయ అసమానతల సమస్యలను ఇది ఎత్తి చూపుతుందని పేర్కొంటున్నారు.ఇది చదివారా? ‘ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది’ఈ నిర్ణయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) సమర్థించుకున్నారు. బోనస్‌లు అత్యుత్తమ ప్రతిభను నిలుపుకోవడానికి కంపెనీ నిరంతర వృద్ధి, విజయాన్ని నిర్ధారించడానికి అవసరమైన ప్రోత్సాహకం అని పేర్కొన్నారు. అయితే ఉద్యోగులు, కార్మిక హక్కుల వాదులు ఇటీవలి తొలగింపుల నేపథ్యంలో బోనస్‌లకు ఇదా సమయం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.ఎగ్జిక్యూటివ్ బోనస్‌లను 200 శాతానికి పెంచాలనే నిర్ణయం మునుపటి 75 శాతం నుండి గణనీయమైన పెరుగుదల. పెరుగుతున్న పోటీ, ఆర్థిక సవాళ్ల మధ్య కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, లాభదాయకతను మెరుగుపరచడానికి ఈ చర్య విస్తృత వ్యూహంలో భాగమని కంపెనీ చెబుతోంది. -
భారత్‌కు మెటా ‘ప్రాజెక్ట్ వాటర్వర్త్’
అంతర్జాతీయంగా డిజిటల్ కనెక్టివిటీని పెంచేందుకు సోషల్ మీడియా దిగ్గజం మెటా(Meta) నడుం బిగించింది. ప్రపంచంలోనే అతిపొడవైన సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్ వాటర్వర్త్’(Waterworth)కు శ్రీకారం చుట్టింది. ఐదు ప్రధాన ఖండాలను కలుపుతూ 50,000 కి.మీ. దూరం సముద్రగర్భంలో కేబుల్స్ వేయనుంది. ఈ దశాబ్దం చివరి నాటికి ఈ ప్రాజెక్టుతో భారత్‌ను అనుసంధానించనుంది.న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా డిజిటల్ కనెక్టివిటీని పెంచేందుకు సోషల్ మీడియా దిగ్గజం మెటా సాహసోపేత కార్యక్రమానికి నడుం బిగించింది. ప్రపంచంలోనే అతి పొడవైన సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్ వాటర్వర్త్’కు శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టులో భాగంగా ఈ దశాబ్దం చివరి నాటికి ఈ ప్రాజెక్టుతో భారత్‌ను అనుసంధానించనున్నట్టు మెటా శనివారం ప్రకటించింది. కంపెనీకి అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా భారత్‌ను ఈ సందర్భంగా అభివర్ణించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే భారత్ ప్రపంచ డిజిటల్ హబ్‌గా అవతరిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత మొత్తం వ్యయం కానుందనేది కంపెనీ వెల్లడించలేదు.భూమి చుట్టు కొలత కంటే ఎక్కువ ప్రాజెక్ట్ వాటర్‌వర్త్‌లో భాగంగా ఐదు ప్రధాన ఖండాలను కలుపుతూ 50,000 కిలోమీటర్ల దూరం సముద్ర గర్భంలో కేబుల్స్ వేస్తారు. ఇది భూమి చుట్టు కొలత కంటే ఎక్కువ. సముద్రంలో 7,000 మీటర్ల లోతు వరకు ఈ కేబుల్స్ వేస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా 13న విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ ప్రాజెక్ట్‌ను కూడా చేర్చారు. నమ్మకమైన సంస్థల సహకారంతో హిందూ మహాసముద్రంలో సముద్రగర్భ కేబుల్స్ నిర్వహణ, మరమ్మతు, రుణం సమకూర్చాలని భారత్ భావిస్తోంది. అధునాతన సాంకేతికతతో.. ‘మెటా తన అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారతదేశంలో పెట్టుబడులు పెడుతోంది. భారత్, అమెరికా ఇతర ప్రదేశాలను అనుసంధానించడానికి ప్రపంచంలోనే అతి పొడవైన, అత్యధిక సామర్థ్యం, సాంకేతికంగా అధునాతనమైన సముద్ర కేబుల్ ప్రాజెక్ట్‌ను చేపట్టింది’అని మెటా ప్రతినిధి శనివారం తెలిపారు. ఇంటర్నెట్ కార్యకలాపాలకు సముద్రగర్భ కేబుల్స్ ముఖ్యమైనవి. ఈ కేబుల్స్ వివిధ దేశాలను అనుసంధానిస్తాయి. స్థానిక టెలికం కంపెనీలు తమ వినియోగదారులకు ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడానికి సముద్రగర్భ కేబుల్స్‌తో కనెక్ట్ అవుతాయి. ‘భారత్‌లో డిజిటల్ సేవలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఈ పెట్టుబడి ఆర్థిక వృద్ధి, స్థిర మౌలిక సదుపాయాలు, అందరికీ డిజిటల్ సేవలు అందాలన్న మెటా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. భారత్‌లో అభివృద్ధి చెందుతున్న డిజిటల్ వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది’అని మెటా ప్రతినిధి వివరించారు. -
మెటా ఇండియా-యూఎస్ సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్ట్
గ్లోబల్ డిజిటల్ కనెక్టివిటీని పెంపొందించే లక్ష్యంతో భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ను కలిపే సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్టును ఆవిష్కరించేందుకు మెటా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పింది. ఈ ప్రాజెక్ట్ కోసం బిలియన్ డాలర్ల పెట్టుబడికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. 50,000 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రపంచంలోనే అతి పొడవైన, అత్యధిక సామర్థ్యం కలిగిన సముద్రగర్భ కేబుల్ వ్యవస్థగా అవతరించనుంది.‘ప్రాజెక్ట్ వాటర్ వర్త్’గా పిలిచే ఈ సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్టు భారత్, అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇతర కీలక ప్రాంతాలను కలుపుతుంది. మెటా అప్లికేషన్లు, సర్వీసులను బలోపేతం చేసేందుకు ఈ ప్రాజెక్ట్ కీలకపాత్ర పోషిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ప్రాజెక్ట్ పనులు ఈ ఏడాదే ప్రారంభం కానున్నాయని, వచ్చే ఐదేళ్లలో ఇది పూర్తవుతుందని అంచనా వేస్తుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఈ సమయంలో ఇలాంటి ప్రకటనలు రావడం చర్చనీయాంశమైంది.ఇదీ చదవండి: మొదటి రోజే రూ.8,472 కోట్ల బుకింగ్లుసాంకేతిక పురోగతికంపెనీ ‘రూటింగ్’ అనే కొత్త సాంకేతికత ద్వారా 7,000 మీటర్ల సముద్ర లోతులో కేబుళ్లను ఏర్పాటు చేస్తారని మెటా ప్రతినిధి తెలిపారు. షిప్ లంగర్లు, ఇతర ప్రమాదాల నుంచి నష్టాన్ని నివారించడం కోసం హైరిస్క్ ఫాల్ట్ ప్రాంతాల్లో మెరుగైన టెక్నిక్‌లు ఉపయోగించబోతున్నట్లు చెప్పారు. ఈ సాంకేతిక ఆవిష్కరణ ఇండియాలో అభివృద్ధి చెందుతున్న డిజిటల్ సదుపాయాలకు, సర్వీసులకు మద్దతు ఇవ్వడానికి, వాటిలో సాంకేతిక పురోగతిని ప్రోత్సహించడానికి కంపెనీ నిబద్ధతను నొక్కి చెబుతుందన్నారు. -
మస్క్... ట్రంప్‌కు కోటి డాలర్లు ఎందుకు ఇస్తానన్నాడు?
వాషింగ్టన్: అమెరికాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో ఎక్స్(ట్విట్టర్)పై ట్రంప్ దావా వేసిన కారణంగా తాజాగా ఎలాన్ మస్క్ ఆయనకు దాదాపు 10 మిలియన్ డాలర్లు చెల్లించడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. 2021లో యూఎస్ క్యాపిటల్ భవనంపై దాడి అనంతరం ట్రంప్ ఈ దావా వేశారు.వివరాల ప్రకారం.. 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ (Donald Trump) పరాజయం పాలయ్యారు. తర్వాత 2021 జనవరి 6న అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ (Joe Biden) విజయాన్ని ధ్రువీకరించేందుకు వాషింగ్టన్ క్యాపిటల్ భవనంలో కాంగ్రెస్ సమావేశమైంది. అయితే ఆ సమావేశం జరగడానికి కొన్ని గంటల ముందు ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. అనంతరం ట్రంప్ మద్దతుదారులు వేలాదిగా క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, బైడెన్ విజయాన్ని ధ్రువీకరించకుండా కాంగ్రెస్‌ను ఆపేందుకే క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారని వాషింగ్టన్ ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఆ ఛార్జ్‌షీట్‌లో ట్రంప్ పేరు కూడా ఉంది.ఈ నేపథ్యంలో ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్స్‌ను ఎక్స్(ట్విట్టర్), ఫేస్బుక్.. ట్రంప్ అకౌంట్స్‌ను సస్పెండ్ చేసింది. దీంతో, వారి చర్యలను ఆయా సంస్థలపై ట్రంప్ దావా వేశారు. ఈ దావాను పరిష్కరించుకునేందుకు 25 మిలియన్ డాలర్లు చెల్లిస్తామని గత నెలలో మెటా ప్రకటించింది. ఇక, తాజాగా మస్క్(Elon Musk) కూడా ట్రంప్‌కు 10 మిలియన్ డాలర్లు చెల్లించడానికి సిద్ధమైనట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ చెప్పుకొచ్చింది.*Elon Musk’s company X settles Trump lawsuit over account suspension*• Social media company X has agreed to pay about $10 million to settle a lawsuit by President Donald Trump, The Wall Street Journal reported.• Elon Musk, X’s billionaire owner, is overseeing DOGE, pic.twitter.com/nw7n2HbUwF— AS ♠️🍌✡︎🪬חי🎗️🤟🫶🧡👑❰̶̶͟͞🍓꙰꙰❱̶𖠧̙̞͢▹͍►͍👑 (@AdelBadel7) February 13, 2025ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. యూఎస్ క్యాపిటల్‌పై దాడి చేసిన తన మద్దతుదారులకు ఉపశమనం కల్పించారు. ఈమేరకు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఈ ఘటనలో దాదాపు 1500 మందికి ట్రంప్ క్షమాభిక్ష కల్పించారు. వారిపై పెండింగ్‌లో ఉన్న కేసులు కొట్టివేయాలని అటార్నీ జర్నల్‌కు ఆదేశాలు జారీ చేశారు. -
నాకు మరణశిక్ష పడేలా ఉంది: జుకర్ బర్గ్
వాషింగ్టన్ : ఎవరో ఫేస్బుక్లో (Facebook) పోస్ట్‌లు పెడితే.. దానికి నన్ను బాధ్యుడ్ని చేస్తూ.. నాకు మరణశిక్ష విధించాలని పలువురు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. నాకు మరణశిక్ష పడేలా ఉంది అని’ మెటా (Meta) సీఈవో మార్క్ జూకర్బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జో రోగన్ పాడ్‌కాస్ట్ (Joe Rogan Podcast)లో జూకర్బర్గ్ పై విధంగా మాట్లాడారు.ఆ పాడ్‌కాస్ట్‌లో జూకర్ బర్గ్ పాకిస్తాన్ చట్టాలపై ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో ఫేస్బుక్ చట్టపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. ఓ నెటిజన్ దైవదూషణకు సంబంధించిన పోస్టులను ఫేస్బుక్లో షేర్ చేశాడు. ఆ పోస్టు పెట్టినందుకు నాపై పలువురు కోర్టును ఆశ్రయించారు. నాకు మరణశిక్ష విధించాలని కోరారు. ప్రస్తుతం, ఈ కేసులపై విచారణ కొనసాగుతోంది.ఆ కేసు విచారణపై జూకర్ బర్గ్ ప్రస్తావించారు. స్థానిక నిబంధనలు, సాంస్కృతిక విలువల విషయంలో మెటా నిబద్ధతతో ఉంది. ఉదాహరణకు, పాకిస్తాన్‌కు చెందిన ఓ యూజర్ దైవాన్ని దూషిస్తూ పోస్టులు పెట్టారు. అలా పోస్టులు పెట్టడంపై పలువురు నాపై దావా వేశారు. క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగుతున్నాయి. ఇది ఎక్కడికి వెళుతుందో నాకు తెలియదు. ఎందుకంటే నేను పాకిస్తాన్‌కు వెళ్లాలని అనుకోవడంలేదు. కాబట్టి నేను దాని గురించి ఆందోళన చెందడం లేదు’ అని జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు. Power of Pakistan 😂 pic.twitter.com/V4qokhbq76— Kreately.in (@KreatelyMedia) February 11, 2025👉చదవండి : తగ్గేదేలే.. మరోసారి ఎల్ అండ్ టీ చైర్మన్ వివాదాస్పద వ్యాఖ్యలు -
టెక్ కంపెనీ భారీ లేఆఫ్స్: ఒకేసారి 3000 మంది బయటకు!
ఇన్ఫోసిస్ కంపెనీ ఫ్రెషర్లను తొలగించిన వార్తలు ఇంకా మార్చచిపోక ముందే.. టెక్ దిగ్గజం మెటా (Meta) భారీగా ఉద్యోగులను తొలగించడానికి సన్నద్ధమవుతోంది. ఇంతకీ మెటా ఎందుకు పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతోంది? ఎంతమందిని తొలగించనుంది? అనే విషయాలను వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ కంపెనీల మాతృ సంస్థ మెటా, ఫిబ్రవరి 10 (సోమవారం) నుంచి ప్రపంచవ్యాప్తంగా తొలగింపులను నిర్వహించనున్నట్లు సమాచారం. అదే రోజు అమెరికాతో సహా చాలా దేశాలలో సోమవారం స్థానిక సమయం ఉదయం 5 గంటల నుంచి ఉద్యోగాలు కోల్పోయే ఉద్యోగులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది..జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్‌లోని ఉద్యోగులకు స్థానిక నిబంధనల కారణంగా కోతల నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే యూరప్, ఆసియా, ఆఫ్రికా అంతటా సుమారు 12 దేశాల్లో ఉద్యోగుల తొలగింపు ఉండనుంది. కంపెనీ తొలగింపు ప్రక్రియ కింది సుమారు 3600 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని సమాచారం.పనితీరు సరిగ్గా లేని ఉద్యోగులను తొలగించనున్నట్లు మెటా ఇప్పటికే వెల్లడించింది. ఇప్పుడు చెప్పినట్లుగానే తొలగింపులకు శ్రీకారం చుట్టింది. అయితే కంపెనీ ఏ విభాగంలో ఎంతమంది ఉద్యోగులను తొలగించనుంది అనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు.ఇదీ చదవండి: సిబిల్ స్కోర్ చూసి పెళ్లి క్యాన్సిల్ చేశారు: ఎక్కడో తెలుసా?సెప్టెంబర్ 2024 నాటికి సుమారు 72,000 మందికి ఉపాధి కల్పించిన మెటా, ఉద్యోగుల తొలగింపు మొదలు పెడితే ఆ ప్రభావము 5 శాతం లేదా సుమారు 3600 మంది మీద పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఖాళీలను కూడా వెంటనే భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. లేఆఫ్స్ కారణంతో ఉద్యోగాలు కోల్పోయేవారికి సెవెరెన్స్ ప్యాకేజీ అందిస్తామని జూకర్ బర్గ్ ఇప్పటికే హామీ ఇచ్చారు. -
‘ఆయన దయవల్లే బతికున్నాను’
ఢాకా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశాన్ని వదిలి భారత్‌కు వచ్చే ముందు తనని, తన చెల్లెలు షేక్ రెహానాను హత్య చేసేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు. గతేడాది ఆగస్టు నెలలో ఉద్యోగ రిజర్వేషన్ల చిచ్చు కారణంగా అదుపు తప్పిన అల్లర్ల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కుప్పకూలింది. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. అవమానకర రీతిలో తన సోదరితో కలిసి దేశాన్ని వీడారు. అయితే, నాడు దేశాన్ని వీడే సమయంలో జరిగిన ఘటనను తాజాగా షేక్ హసీనా గుర్తు చేసుకున్నారు. తన బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీ ఫేస్బుక్ పేజీలో షేక్ హసీనా ఆడియో ప్రసంగాన్ని పోస్ట్ చేశారు. ఆ ఆడియో ప్రసంగంలో ‘రెహానా,నేను కేవలం 20-25 నిమిషాల వ్యవధిలో మేం మరణం అంచునుంచి తప్పించుకున్నాము’ అని ఆడియో ప్రసంగంలో తెలిపారు. ఆ ఆడియోలో తనను చంపేందుకు వివిధ సమయాల్లో కుట్రలు పన్నారని షేక్ హసీనా గుర్తు చేసుకున్నారు. అందుకు ఆగస్టు 21న జరిగిన హత్యల నుండి, కోటాలిపారాలో జరిగిన భారీ బాంబు నుండి బయటపడటమే నిదర్శనమన్నారు.అల్లాయే లేకపోతే నేను ఇలా మీ ముందు మాట్లాడం సాధ్యమయ్యేది కాదు. కుట్రదారులు నన్ను ఎలా చంపాలని ప్లాన్ చేశారో మీరే చూశారు. అయితే, నేనింకా సజీవంగా ఉన్నానంటే అల్లా దయే. నేను నా దేశంలో ఎందుకు లేకపోయానా? అని ఇప్పటికీ బాధపడుతున్నాను.కట్టుబట్టలతో బంగ్లాదేశ్‌ను వీడాను’ అంటూ భావోద్వేగంగా కన్నీరు పెట్టుకున్నారు.పలు మార్లు హత్యాయత్నంషేక్ హసీనా పలు మార్లు హత్యహత్నం నుంచి తప్పించుకున్నారు. ఆగస్ట్ 21, 2004న బంగాబంధు అవెన్యూలో అప్పటి ప్రతిపక్ష నాయకురాలు షేక్ హసీనా నిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక ర్యాలీలో గ్రనేడ్ దాడి జరిగింది. ఈ దాడిలో 24 మంది మరణించారు. షేక్ హసీనాతో పాటు 500 మందికి పైగా గాయపడ్డారు. దీంతో పాటు పలు మార్లు హసీనాపై హత్యయత్నం జరగడంతో హసీనా భారీ మొత్తంలో సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. 👉ఇదీ చదవండి : ట్రంప్ ప్రమాణ స్వీకారం.. 40ఏళ్లలో ఇదే తొలిసారి -
కేంద్ర మంత్రికి మెటా క్షమాపణలు
మెటా సీఈఓ మార్క్ జూకర్బర్గ్ చేసిన పొరపాటుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు సంస్థ క్షమాపణలు చెప్పింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలపై కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీకి సారథ్యం వహిస్తున్న డాక్టర్ నిషికాంత్ దూబే నేతృత్వంలోని ప్యానెల్ మెటాకు సమన్లు జారీ చేయాలని యోచించినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మెటా సీఈఓ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.కోవిడ్ -19 మహమ్మారిని నిర్వహించడంలో భారత ప్రభుత్వం విఫలమైందని జుకర్‌బర్గ్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో అన్నారు. దాంతో ప్రస్తుత ప్రభుత్వం 2024 ఎన్నికల్లో విజయం సాధించబోదని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఈ అంశంపై అప్పట్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ మార్క్ జూకర్బర్గ్ మాటలు తప్పని రుజువైందన్నారు. ప్రజలు తమ పార్టీకే స్పష్టమైన మెజార్జీ అందించారని చెప్పారు. జూకర్బర్గ్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీకి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ దూబే ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితమైన సమాచారం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ‘ఈ తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేసినందుకు కమిటీ మెటాపై చర్య తీసుకోవాలని చూస్తుంది. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా తప్పుడు సమాచారం దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది. ఈ పొరపాటుకు ఆ సంస్థ భారత పార్లమెంటుకు, ఇక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అని దూబే అన్నారు. ఈ వ్యవహారంపై మెటా స్పందించింది.ఇదీ చదవండి: పనితీరు సరిగాలేదా.. సర్దుకోవాల్సిందే..మెటా పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ శివంత్ తుక్రాల్ కంపెనీ సీఈఓ చేసిన తప్పుకు క్షమాపణలు కోరారు. కంపెనీకి భారత్ ఎంత ప్రాముఖ్యమైందో పునరుద్ఘాటించారు. ‘అధికారంలో ఉన్న అనేక పార్టీలు 2024 ఎన్నికల్లో తిరిగి విజయం సాధించవనే మార్క్ వ్యాఖ్యలు అనేక దేశాలకు వర్తిస్తుంది. కానీ, భారత్ అందుకు మినహాయింపు. ఈ అనుకోని పొరపాటుకు మేం క్షమాపణలు కోరుతున్నాం. కంపెనీకి భారత్ ఎంతో ప్రాముఖ్యమైంది’ అని తుక్రాల్ అన్నారు. -
మెటా క్షమాపణలు చెప్పాలి.. పార్లమెంటరీ కమిటీ సమన్లు..?
ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్ ఇంక్(Meta) చర్యలను భారత పార్లమెంటరీ ప్యానెల్ పరిశీలిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలపై కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీకి సారథ్యం వహిస్తున్న డాక్టర్ నిషికాంత్ దూబే నేతృత్వంలోని ప్యానెల్ మెటాకు సమన్లు జారీ చేయాలని యోచిస్తోంది.అసలేం జరిగిందంటే..2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మెటా సీఈఓ మాట్లాడుతూ.. కోవిడ్ -19 మహమ్మారిని నిర్వహించడంలో భారత ప్రభుత్వం విఫలమైందన్నారు. దాంతో ప్రస్తుత ప్రభుత్వం 2024 ఎన్నిక(2024 Lok Sabha elections)ల్లో విజయం సాధించబోదని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఈ అంశంపై అప్పట్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ మార్క్ జూకర్బర్గ్ మాటలు తప్పని రుజువైందన్నారు. ప్రజలు తమ పార్టీకే స్పష్టమైన మెజార్జీ అందించారని చెప్పారు. జూకర్బర్గ్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.తప్పుడు సమాచారం..కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీకి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ దూబే ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితమైన సమాచారం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ‘ఈ తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేసినందుకు కమిటీ(parliamentary panel) మెటాపై చర్య తీసుకోవాలని చూస్తుంది. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా తప్పుడు సమాచారం దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది. ఈ పొరపాటుకు ఆ సంస్థ భారత పార్లమెంటుకు, ఇక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అన్నారు దూబే అన్నారు.ఇదీ చదవండి: పనితీరు సరిగాలేదా? సర్దుకోవాల్సిందే..సమాచార నిర్ధారణకు బాధ్యతమెటాకు సమన్లు జారీ చేయాలని పార్లమెంటరీ ప్యానెల్ తీసుకున్న నిర్ణయం.. తప్పుడు సమాచారం వ్యాప్తి, ప్రజాస్వామ్య వ్యవస్థలో దాని ప్రభావంపై పెరుగుతున్న ఆందోళనలను నొక్కి చెబుతుంది. ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల పాత్రపై కూడా చర్చ జరగాల్సి ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. తమ ప్లాట్ఫామ్లో పంచుకునే సమాచారం ఖచ్చితత్వాన్ని నిర్ధారించడంలో టెక్ దిగ్గజాలు బాధ్యత వహించాలని చెబుతున్నారు. -
పనితీరు సరిగాలేదా.. సర్దుకోవాల్సిందే..
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్ తన ఉద్యోగుల్లో దాదాపు ఐదు శాతం మందికి లేఆఫ్స్ ఇచ్చే ప్రణాళికలను ప్రకటించింది. ఉద్యోగులందరికీ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ పంపిన అంతర్గత మెమోలో ఈ విషయాన్ని వెల్లడించారు. పనితీరు నిర్వహణపై పరిమితిని పెంచాలని, తక్కువ పనితీరు కనబరిచేవారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నట్లు జూకర్ బర్గ్ మెమోలో పేర్కొన్నారు.‘కంపెనీ సాధారణంగా ఏడాది కాలంలో తక్కువ పనితీరు కనబరిచేవారిని ట్రాక్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని యోచిస్తున్నాం. ఇప్పటికే 2024లో పనితీరు సరిగాలేని దాదాపు 5 శాతం మంది ఉద్యోగులను తొలగించాం. ఈసారి మరో 5 శాతం మందిని ఉద్యోగులను తొలగించనున్నాం. ఇది భవిష్యత్తులో 10 శాతానికి చేరుతుంది’ అని మెమోలో పేర్కొన్నారు.ప్యాకేజీ ఇస్తామని హామీసెప్టెంబర్ 2024 నాటికి సుమారు 72,000 మందికి ఉపాధి కల్పించిన మెటా, ఈ కోతల వల్ల దాదాపు 3,600 ఉద్యోగులు ప్రభావితం చెందుతారని అంచనా వేసింది. పనితీరు సరిగాలేని వారిని తొలగించే స్థానంలో ఈ ఏడాది చివర్లో ఆయా ఖాళీలను భర్తీ చేయాలని కంపెనీ యోచిస్తోంది. బాధిత ఉద్యోగులకు ఉదారంగా సెవెరెన్స్ ప్యాకేజీ(లేఆఫ్స్ కారణంగా ఇచ్చే ప్యాకేజీ)లు అందిస్తామని జూకర్ బర్గ్ హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: సులభంగా రూ.కోటి సంపాదన!మిశ్రమ స్పందనకార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, సంస్థ భవిష్యత్తు ప్రాజెక్ట్‌లపై కృత్రిమ మేధ, స్మార్ట్ గ్లాసెస్, సోషల్ మీడియా వంటి కీలక విభాగాలపై దృష్టి పెట్టడానికి మెటా చురుకుగా పని చేస్తోంది. కంపెనీ లేఆఫ్స్ ప్రకటనపై ఉద్యోగులు, పరిశ్రమ పరిశీలకుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కంపెనీ సమర్థతను మెరుగుపరచడానికి ఈ నిర్ణయం అవసరమని కొందరు భావిస్తుండగా, మరికొందరు ఉద్యోగుల నైతిక స్థైర్యంపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. -
జుకర్‌బర్గ్ వ్యాఖ్యలు.. మెటాకు భారత్ సమన్లు
సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కేంద్రం సమన్లు జారీ చేయనుంది. లోక్‌సభ ఎన్నికలపై ఆ సంస్థ బాస్ మార్క్ జుకర్‌బర్గ్ చేసిన ‘అసత్య ప్రచారపు’ వ్యాఖ్యలే అందుకు కారణం. గతేడాది భారత్ సహా ప్రపంచంలో అనేక దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓటమి చెందాయని జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించారు. అయితే.. జుకర్‌బర్గ్ చేసిన వాదనను భారత ప్రభుత్వం ఖండించింది. బీజేపీ ఎంపీ, ఐటీ & కమ్యూనికేషన్ పార్లమెంటరీ హౌజ్ ప్యానెల్ చైర్మన్ నిషికాంత్ దుబే మెటాకు సమన్లు పంపే విషయాన్ని ధృవీకరించారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినందుకే సమన్లు అని ఎక్స్ వేదికగా తెలిపారాయన. मेरी कमिटि इस ग़लत जानकारी के लिए @Meta को बुलाएगी । किसी भी लोकतांत्रिक देश की ग़लत जानकारी देश की छवि को धूमिल करती है । इस गलती के लिए भारतीय संसद से तथा यहाँ की जनता से उस संस्था को माफ़ी माँगनी पड़ेगी https://t.co/HulRl1LF4z— Dr Nishikant Dubey (@nishikant_dubey) January 14, 2025ప్రజాస్వామ్య దేశం విషయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం.. ఆ దేశ ప్రతిష్టకు భంగం కలిగించడమే అవుతుంది. ఈ తప్పునకు భారత దేశ ప్రజలకు, చట్ట సభ్యులకు క్షమాపణ చెప్పాల్సిందే అని దుబే ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. అంతకు ముందు.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో.. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏపై ఓటర్లు విశ్వాసం ఉంచి వరుసగా మూడోసారి గెలిపించారని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) కౌంటర్ బదులిచ్చారు.‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో 2024లో నిర్వహించిన ఎన్నికల్లో 64కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విశ్వాసం ఉందని తేల్చిచెప్పారు. కొవిడ్-19 తర్వాత భారత్ సహా అధికారంలో ఉన్న అనేక ప్రభుత్వాలు ఓడిపోయాయి అని జుకర్‌బర్గ్ చెప్పడంలో వాస్తవం లేదు. .. 80 కోట్ల మందికి ఉచిత ఆహారం మొదలు 220కోట్ల వ్యాక్సిన్లు అందించడంతోపాటు కొవిడ్ సమయంలో ప్రపంచ దేశాలకు భారత్ సాయం చేయడం వంటి నిర్ణయాలు మోదీ మూడోసారి విజయానికి నిదర్శనంగా నిలిచాయి’’ అని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. అలాగే జుకర్‌బర్గ్ అలా మాట్లాడటం నిరాశకు గురిచేసిందన్న అశ్వినీ వైష్ణవ్.. వాస్తవాలు, విశ్వసనీయతను కాపాడుకుందామంటూ మెటాను టాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.జుకర్‌బర్గ్ ఏమన్నారంటే..జనవరి 10వ తేదీన ఓ పాడ్‌కాస్ట్‌లో జుకర్‌బర్గ్ మాట్లాడారు. 2024 సంవత్సరం భారీ ఎన్నికల సంవత్సరంగా నిలిచింది. ఉదాహరణగా.. భారత్‌తో సహా ఎన్నో దేశాల్లో ఎన్నికలు జరిగాయి. అయితే అన్నిచోట్లా అక్కడి ప్రభుత్వాలు అక్కడ ఓడిపోయాయి. దీనికి కరోనాతో ఆయా ప్రభుత్వాలు డీల్ చేసిన విధానం.. అది దారితీసిన ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణం అని అన్నారాయన. -
యాపిల్‌పై జుకర్‌బర్గ్ తీవ్ర వ్యాఖ్యలు
దిగ్గజ పారిశ్రామిక వేత్త, మెటా సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్' (Mark Zuckerberg).. 'జో రోగన్ ఎక్స్పీరియన్స్'లో మాట్లాడుతూ యాపిల్ (Apple)ను విమర్శించారు. గ్లోబల్ కనెక్టివిటీని విప్లవాత్మకంగా మార్చినందుకు ఐఫోన్లను ప్రశంసిస్తూనే.. కంపెనీ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించడం లేదని, ఈ విషయంలో యాపిల్ విఫలమైందని అన్నారు.ఐఫోన్ బాగుంది, ఎందుకంటే ప్రపంచంలోని చాలామంది దగ్గర ఇప్పుడు ఈ ఫోన్ ఉందని చెబుతూనే.. సంస్థ కొంతకాలంగా గొప్పగా ఏమీ కనుగొనలేదని జుకర్‌బర్గ్ వెల్లడించారు. స్టీవ్ జాబ్స్ ఐఫోన్‌ను కనుగొన్నారు. అయితే సంస్థ కేవలం దానిపై 20ఏళ్లుగా పనిచేస్తోంది. ప్రతి ఏటా కొత్త వెర్షన్స్ లాంచ్ చేస్తోంది. కానీ అవి పాత వెర్షన్ల కంటే మెరుగ్గా లేదు. ఈ కారణంగానే చాలా తక్కువ మంది మాత్రమే కొత్త ఐఫోన్లను కొనుగోలు చేస్తున్నారని అన్నారు.సంస్థ అందిస్తున్న కొత్త ఐఫోన్ మోడళ్లలో పెద్దగా అప్గ్రేడ్లు లేకపోవడం వల్ల ఫోన్ విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే కంపెనీ కొనుగోలుదారులపై, డెవలపర్లపై ఈ 30 శాతం పన్ను విధిస్తోందని.. ఇలాంటి వాటి వల్లనే యాపిల్ లాభపడుతోందని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు.యాపిల్ ఇతర కంపెనీల పరికరాలను iPhoneలతో సజావుగా ఎలా పని చేయనివ్వదు అనే దాని గురించి జుకర్‌బర్గ్ కలత చెందారు. దీనికి ఆయన ఎయిర్పాడ్లను ఉదాహరణగా చూపాడు, అదే కనెక్షన్ టెక్నాలజీని ఉపయోగించకుండా ఇతర కంపెనీలను బ్లాక్ చేస్తుందని వివరించారు.ఇదీ చదవండి: 'సరిగ్గా 10 గంటలు.. ప్రపంచాన్ని మార్చేయొచ్చు': ఆనంద్ మహీంద్రాతమ రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్ కోసం యాపిల్ కనెక్షన్ ప్రోటోకాల్‌ను ఉపయోగించమని మెటా చేసిన అభ్యర్థనను.. భద్రతా కారణాల వల్ల యాపిల్ తిరస్కరించింది. వినియోగదారు గోప్యత పట్ల నిజమైన ఆందోళన కంటే కూడా వ్యాపార ప్రయోజనాల కారణంగా అభ్యర్థనను తిరస్కరించినట్లు జుకర్‌బర్గ్ చెప్పారు.యూజర్ల గోప్యత, భద్రతపై యాపిల్ వైఖరిని ఆయన విమర్శించారు. యాపిల్ కనిపెట్టిన కొత్త వాటిలో 'విజన్ ప్రో' ఒకటి మాత్రమే అని నేను అనుకుంటున్నానని.. కంపెనీ మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ గురించి జుకర్‌బర్గ్ ప్రస్తావించారు. ఇది కూడా సరైన అమ్మకాలు పొందలేదని ఆయన అన్నారు. -
మెటా కొంపముంచిన ఆ ఒక్క నిర్ణయం
మెటా గ్రూప్ తన ఆన్లైన్ సర్వీసులైన ఫేస్బుక్, థ్రెడ్స్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో ఫ్యాక్ట్ చెకింగ్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కంపెనీకి చుక్కెదురవుతుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్‌ను ఎలా డెలిట్ చేయాలని గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు అనలిటిక్స్ ద్వారా తెలిస్తుంది. ప్రస్తుతం ఆయా అకౌంట్లను ఎలా నిలిపేయాలని అధిక సంఖ్యలో గూగుల్‌లో సెర్చ్ చేస్తుండడంతో ప్రస్తుతం అవి ట్రెడింగ్లో ఉన్నాయి. ఇందుకు ఇటీవల మెటా తీసుకున్న నిర్ణయమే కారణమని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మెటా యాప్స్‌లో థర్డ్‌పార్టీ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్‌ను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు బదులుగా కంపెనీ ‘కమ్యూనిటీ నోట్స్’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. కమ్యూనిటీ నోట్స్ అనే కమ్యూనిటీ ఆధారిత వ్యవస్థ వల్ల తప్పుదోవ పట్టించే పోస్ట్‌లను కట్టడి చేయవచ్చని మెటా తెలిపింది. ఇప్పటికే ఈ వ్యవస్థను ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో వాడుతున్నట్లు తెలుస్తుంది.ట్రంప్ మెప్పు పొందేందుకేనా..?ట్రంప్ త్వరలో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న తరుణంలో మెటా ఇలా ఫ్యాక్ట్ చెకింగ్ సదుపాయాన్ని నిలిపేస్తున్న తీసుకున్న నిర్ణయంపట్ల కంపెనీపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలని నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పటికే ప్రధాన కంపెనీలు కొత్త ప్రభుత్వం పట్ల అభిమానాన్ని చూరగొనేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మార్పుపై ట్రంప్ అధికారులకు మెటా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ అధినేత, ట్రంప్ చిరకాల మిత్రుడు డానా వైట్‌ను మెటా బోర్డులో చేర్చుకున్నట్లు కంపెనీ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇప్పటికే ప్రకటించారు.కఠిన నిర్ణయాలు తప్పవురాబోయే రోజుల్లో అమెరికాలో మార్పు రావాలని ఆశిస్తున్నట్లు మార్క్ చెప్పారు. అందరూ స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేయలని నొక్కి చెప్పారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తుందన్నారు. దాంతో కంపెనీలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. దీనివల్ల కొందరి పోస్టులను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘వినాశనమే తప్ప విజయం కాదు.. వివరణతో దిగజారారు’తప్పుడు సమాచారం తగ్గుతుందా..?మార్క్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి నెటిజన్ల మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇప్పటివరకు మెటా అనుసరించిన ఫ్యాక్ట్ చెకింగ్ విధానంతో ఇటీవల అధికారంలోకి వచ్చిన కన్జర్వేటివ్‌పార్టీ నేతలను అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నట్లు గతంలో భావించారు. ట్రంప్ అధికారంలోకి వస్తే మెటాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందేమోనని భావించి ముందుగానే మార్క్ ఈ మార్పులు చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కన్జర్వేటివ్ మిత్రపక్షాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. అయితే అనేక డిజిటల్ హక్కుల సంఘాలు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. కంపెనీ తీసుకున్న నిర్ణయంతో తప్పుడు సమాచారం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. -
ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్‌ను నిలిపేసిన మెటా
మెటా గ్రూప్ తన ఆన్లైన్ సర్వీసులైన ఫేస్బుక్(Facebook), థ్రెడ్స్, ఇన్స్టాగ్రామ్(Instagram)ల్లో ఫ్యాక్ట్ చెకింగ్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వీటిల్లోని థర్డ్‌పార్టీ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్‌ను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు బదులుగా కంపెనీ ‘కమ్యూనిటీ నోట్స్’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. కమ్యూనిటీ నోట్స్ అనే కమ్యూనిటీ ఆధారిత వ్యవస్థ వల్ల తప్పుదోవ పట్టించే పోస్ట్‌లను కట్టడి చేయవచ్చని మెటా తెలిపింది. ఇప్పటికే ఈ వ్యవస్థను ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో వాడుతున్నట్లు తెలుస్తుంది.ట్రంప్ మెప్పు పొందేందుకేనా..?ట్రంప్ త్వరలో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న తరుణంలో మెటా ఇలా ఫ్యాక్ట్ చెకింగ్ సదుపాయాన్ని నిలిపేస్తున్న తీసుకున్న నిర్ణయంపట్ల కంపెనీపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలని నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పటికే ప్రధాన కంపెనీలు కొత్త ప్రభుత్వం పట్ల అభిమానాన్ని చూరగొనేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మార్పుపై ట్రంప్ అధికారులకు మెటా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ అధినేత, ట్రంప్ చిరకాల మిత్రుడు డానా వైట్‌ను మెటా బోర్డులో చేర్చుకున్నట్లు కంపెనీ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇప్పటికే ప్రకటించారు.కఠిన నిర్ణయాలు తప్పవురాబోయే రోజుల్లో అమెరికాలో మార్పు రావాలని ఆశిస్తున్నట్లు మార్క్(Mark) చెప్పారు. అందరూ స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేయలని నొక్కి చెప్పారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తుందన్నారు. దాంతో కంపెనీలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. దీనివల్ల కొందరి పోస్టులను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆర్థిక మోసాలకు చెక్ పెట్టేలా పరిష్కారాలుతప్పుడు సమాచారం తగ్గుతుందా..?మార్క్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి నెటిజన్ల మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇప్పటివరకు మెటా అనుసరించిన ఫ్యాక్ట్ చెకింగ్ విధానంతో ఇటీవల అధికారంలోకి వచ్చిన కన్జర్వేటివ్‌పార్టీ నేతలను అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నట్లు గతంలో భావించారు. ట్రంప్ అధికారంలోకి వస్తే మెటాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందేమోనని భావించి ముందుగానే మార్క్ ఈ మార్పులు చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కన్జర్వేటివ్ మిత్రపక్షాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. అయితే అనేక డిజిటల్ హక్కుల సంఘాలు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. కంపెనీ తీసుకున్న నిర్ణయంతో తప్పుడు సమాచారం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. -
జనవరి 1 నుంచి వాట్సప్ పని చేయదు! కారణం..
ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ వాట్సప్ జనవరి 1, 2025వ తేదీ నుంచి కొన్ని ఫోన్లలో పని చేయదని మెటా ప్రకటించింది. ఇప్పటికీ చాలామంది వినియోగదారులు ఆండ్రాయిడ్ పాత వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోనే వాట్సప్‌ను ఉపయోగిస్తున్నారని తెలిపింది. దాంతో వాట్సప్ అప్డేట్లు విడుదల చేసినప్పుడు ఆయా డివైజ్‌ల్లో పని చేయడం లేదని పేర్కొంది. వినియోగదారులకు మెరుగైన సర్వీసు, భద్రతను అందించేందుకు కంపెనీ అందిస్తున్న అప్డేట్లను పాత ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న వారు అందుకోలేకపోతున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. భవిష్యత్తులో భద్రత కారణాల వల్ల కొన్ని ఫోన్లలో వాట్సప్‌ను నిలిపేస్తున్నట్లు తెలిపింది. జనవరి 1, 2025 నుంచి వాట్సాప్ పని చేయని డివైజ్‌ల లిస్ట్‌కు ప్రకటించింది.సాంసంగ్: గెలాక్సీ ఎస్3, గెలాక్సీ నోట్ 2, గెలాక్సీ ఏస్ 3, గెలాక్సీ ఎస్4 మినీమోటరోలా: మోటో జి (1వ జనరేషన్), రేజర్ హెచ్డీ, మోటో ఈ 2014హెచ్‌టీసీ: వన్ ఎక్స్, వన్ ఎక్స్+, డిజైర్ 500, డిజైర్ 601ఎల్జీ: ఆప్టిమస్ జీ, నెక్సస్ 4, జీ 2 మినీ, ఎల్ 90సోనీ: ఎక్స్‌పీరియా జెడ్, ఎక్స్‌పీరియా ఎస్పీ, ఎక్స్‌పీరియా టీ, ఎక్స్‌పీరియా వీయాపిల్ ఓఎస్‌లోనూ..ఆండ్రాయిడ్‌తోపాటు యాపిల్ ఓఎస్ ఇన్స్టాల్ అయిన కొన్ని పరికరాల్లోనూ వాట్సప్ పని చేయదని మెటా తెలిపింది. అయితే అందుకు మే 5 వరకు గడువు ఉందని పేర్కొంది. జనవరి నుంచి ఐదు నెలల నోటీస్ పీరియడ్ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఐఓఎస్ 15.1 వర్షన్ కంటే ముందున్న ఓఎస్‌లు వాడుతున్న డివైజ్‌ల్లో వాట్సప్ పనిచేయదని కంపెనీ తెలిపింది. కంపెనీ వివరాల ప్రకారం ప్రధానంగా ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ వాడుతున్న వినియోగదారులపై ఈ ప్రభావం పడుతుంది.ఇదీ చదవండి: అప్పుడు పరీక్షలో ఫెయిల్.. గూగుల్‌లో జాబ్: జీతం తెలిస్తే..అప్డేట్లు ఎందుకు అవసరం అంటే..ఆన్లైన్ యాప్‌లు నిత్యం కొత్త అప్డేట్లు తీసుకొస్తుంటాయి. కొన్ని అప్డేట్లు వినియోగదారులకు మరింత మెరుగైన సర్వీసు అందించేలా ఉంటే, మరికొన్ని భద్రత పరమైనవి ఉంటాయి. పాత డివైజ్‌ల్లోని హార్డ్‌వేర్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను సపోర్ట్ చేయవు. దాంతో కొత్తగా వస్తున్న యాప్ అప్డేట్లు పాత ఓఎస్‌ల్లో పని చేయవు. ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఏదైనా అప్డేట్లు వస్తున్నప్పుడు అందుకు వీలుగా ఓఎస్‌లు, డివైజ్‌ల్లోని యాప్‌లను అప్డేట్ చేసుకోవడమే మేలని కొందరు సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
వాట్సప్‌లో చాట్‌జీపీటీ.. అందుకు ఏం చేయాలంటే..
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని జనరేటివ్‌ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ ఇకపై వాట్సప్‌లోనూ దర్శనమివ్వనుంది. వాట్సప్‌లోనూ చాట్‌జీపీటీ సేవలు వినియోగించుకోవచ్చని ఓపెన్ఏఐ తెలిపింది. వినియోగదారులకు ప్రత్యేకంగా ఇతర యాప్‌తో పనిలేకుండా వాట్సప్‌లోనే నేరుగా ఈ సేవలు వాడుకోవచ్చని కంపెనీ పేర్కొంది.ఈ సేవలు వినియోగించుకోవాలంటే +18002428478 నంబర్‌తో వాట్సప్‌లో చాట్ చేయాల్సి ఉంటుంది. ఈ నంబర్ ద్వారా వాట్సప్‌లో అడిగిన ప్రశ్నలకు చాట్‌జీపీటీ సమాధానాలు ఇస్తుంది. ఈ చాట్‌బాట్ టెక్ట్స్ రూపంలో అందించే సేవలు ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకోవచ్చు. అయితే వాయిస్ ఇంటరాక్షన్స్ మాత్రం ప్రస్తుతం యూఎస్, కెనడా దేశాల్లోనే అందుబాటులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. త్వరలో ఇతర దేశాలకు ఈ సర్వీసును విస్తరిస్తామని పేర్కొంది.You can now talk to ChatGPT by calling 1-800-ChatGPT (1-800-242-8478) in the U.S. or by sending a WhatsApp message to the same number—available everywhere ChatGPT is. pic.twitter.com/R0XOPut7Qw— OpenAI (@OpenAI) December 18, 2024ఇదీ చదవండి: ఈ–వ్యాలెట్లలోకి పీఎఫ్ సొమ్ము?ఈ సర్వీసుకు కొన్ని పరిమితులున్నట్లు కంపెనీ తెలిపింది. రోజువారీ వాడుకలో పరిమితి ముగిశాక నోటిఫికేషన్ ద్వారా సమాధానాలు పొందవచ్చని స్పష్టం చేసింది. భవిష్యత్‌లో చాట్‌జీపీటీ సెర్చ్, ఇమేజ్ బేస్డ్ ఇంటరాక్షన్, కన్వర్జేషన్ మెమొరీ లాగ్స్ వంటి సర్వీసులు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇప్పటికే మెటా సంస్థ ఏఐ చాట్‌బాట్‌ను వాట్సప్‌లో అందిస్తోంది. -
టెక్ దిగ్గజాలపై ఆ్రస్టేలియా కొరడా
కాన్బెర్రా: టెక్ దిగ్గజాలపై కొరడా ఝళిపించేందుకు ఆ్రస్టేలియా సిద్ధమైంది. వార్తలు ప్రచురించినందుకు స్థానిక మీడియాకు చెల్లింపులు చేసేందుకు ఉద్దేశించిన కఠిన చట్టం త్వరలో అమలవనుందని ప్రభుత్వం గురువారం తెలిపింది. 2025 జనవరి నుంచి ఇది అమలవుతుందని, ఫిబ్రవరిలో పార్లమెంట్ ఆమోదం తెలుపుతుందని పేర్కొంది. మెటా, గూగుల్ వంటి బడా కంపెనీలు తమ వేదికలపై ప్రచురించే వార్తలకుగాను ఫీజు చెల్లించాలంటూ 2021లో ఆ్రస్టేలియా ప్రభుత్వం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక చట్టం తీసుకువచ్చింది. తాజా నిర్ణయం ఈ చట్టానికి కొనసాగింపేనని చెబుతున్నారు. అయితే, ఆస్ట్రేలియా వార్తా సంస్థలతో ఉన్న చెల్లింపు ఒప్పందాలను పునరుద్ధరించబోమని ఇటీవల ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ల యాజమాన్య సంస్థ మెటా చేసిన ప్రకటన ఆ్రస్టేలియా పార్లమెంట్‌తో ప్రతిష్టంభనకు కారణమైంది. గురువారం ఆ్రస్టేలియా ప్రభుత్వం ‘న్యూస్ బార్గెనింగ్ ఇన్సెంటివ్’పేరుతో ప్రకటించిన నూతన నిబంధనల ప్రకారం వార్షికాదాయం రూ.1,350 కోట్ల కలిగిన టెక్ కంపెనీలు మీడియా సంస్థలతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే భారీగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఒక పరిశ్రమకు సబ్సిడీ ఇచ్చేందుకు మరో పరిశ్రమపై భారం మోపుతోందని మెటా దీనిపై వ్యాఖ్యానించింది. ‘డిజిటల్ వేదికలు ఆ్రస్టేలియా నుంచి భారీగా ఆర్థిక లబ్ధి పొందుతున్నాయి. ఇదే సమయంలో ఆస్ట్రేలియాలో నాణ్యమైన జర్నలిజం సేవలను పొందుతున్నందుకు తోడ్పాటు నివ్వాల్సిన సామాజిక, ఆర్థిక బాధ్యత వాటిపై ఉంది’అని ప్రభుత్వం అంటోంది. డిజిటల్ వేదికలు పెరిగిపోవడంతో సంప్రదాయ మీడియా సంస్థలు నష్టపోతున్నాయని, ఈ నేపథ్యంలోనే పబ్లిషర్లు, టెక్ కంపెనీల మధ్య సమతూకం పాటించేందుకు నిబంధనలు తెచి్చనట్లు అప్పట్లో ప్రభుత్వం తెలిపింది. ఆ మేరకు మెటా తదితర కంపెనీలు ఆస్ట్రేలియా మీడియా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందాల గడువు పూర్తి కావొచ్చింది. ఫేస్బుక్ కంటెంట్‌లో వార్తలు, రాజకీయ సంబంధ అంశాల వాటా 3 శాతం కంటే తక్కువగా ఉంటుందని మెటా అంటోంది. అందుకే, తిరిగి ఒప్పందాలను కుదుర్చుకోబోమని, బదులుగా వార్తల ట్యాబ్‌లను తొలగిస్తామని చెబుతోంది. ఈ చర్యతో ఆ్రస్టేలియా మీడియా సంస్థలు సుమారు రూ.1,700 కోట్ల మేర నష్టపోయే అవకాశముంది. దీనిపై ఆ్రస్టేలియా ప్రధాని ఆల్బనీస్ తీవ్రంగా స్పందించారు. ఆ్రస్టేలియా వినియోగదారుల పట్ల మెటా ప్రాథమిక బాధ్యతలను సైతం విస్మరిస్తోందంటూ మండిపడ్డారు. ఈ నిబంధనలన్నీ కేవలం ఆ్రస్టేలియా జర్నలిజానికి సాయం పడేందుకే తప్ప తాము ఆదా యం పెంచుకునేందుకు కాదని పేర్కొన్నారు. -
చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం
ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీ సేవలకు సంబంధించి వినియోగదారులు తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొన్నారు. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం కలిగినట్లు వినియోగదారులు గుర్తించారు. ఈ విషయాన్ని పలు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. చాట్‌జీపీటీతోపాటు ఓపెన్ఏఐకు చెందిన ఏపీఐ, సొర(sora-రియల్‌టైమ్ ఇమేజ్ జనరేట్ చేసే ఏఐ) సేవలు కూడా ప్రభావితం చెందినట్లు తెలిపారు.చాట్‌జీపీటీతోపాటు ఇతర అనుబంధ సంస్థల్లో తలెత్తిన సమస్యను ఓపెన్ఏఐ అంగీకరించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ పోస్ట్ చేసింది. ‘ప్రస్తుతం కంపెనీ సేవల్లో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాం. సమస్యను గుర్తించాం. దాన్ని పరిష్కరించేందుకు పని చేస్తున్నాం. మీకు కలిగిన అంతరాయానికి క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఈ విషయంపై త్వరలో మీకు అప్డేట్ చేస్తాం’ అని ఓపెన్ఏఐ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఆన్లైన్ సర్వీసులను ట్రాక్ చేసే డౌన్ డిటెక్టర్ ప్రకారం, చాట్‌జీపీటీ ఆఫ్‌లైన్‌లో ఉండటంపై భారీగానే ఫిర్యాదులు నమోదైనట్లు తెలిపింది.We're experiencing an outage right now. We have identified the issue and are working to roll out a fix.Sorry and we'll keep you updated!— OpenAI (@OpenAI) December 12, 2024ఇదీ చదవండి: రూ.5 కోట్ల వాచ్‌తో జుకర్‌బర్గ్.. ప్రత్యేకతలివే..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్మెటా ఆధ్వర్యంలోని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవల్లో యూఎస్‌లో ఇటీవల అంతరాయం ఏర్పడింది. దాదాపు 27,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఫేస్‌బుక్‌తో సమస్య ఏర్పడినట్లు తెలిపారు. 28,000 కంటే ఎక్కువ మంది యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. -
రూ.5 కోట్ల వాచ్‌తో జుకర్‌బర్గ్.. ప్రత్యేకతలివే..
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కంపెనీ ఏఐ లామాకు సంబంధించిన విషయాలను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో ద్వారా షేర్ చేసుకున్నారు. అయితే ఆ వీడియోలో తాను ధరించిన వాచ్‌పై నెట్టింట చర్చ జరిగింది. ప్రపంచంలోనే అత్యంత సన్నని వాచ్‌ను మార్క్ ధరించినట్లు నెటిజన్లు గుర్తించారు. ఈ బల్గారి ఆక్టో ఫినిసిమో ఆల్ట్రా సీఓఎస్సీ(Bulgari Octo Finissimo Ultra COSC) మోడల్ వాచ్ కేవలం 1.7 మిల్లీమీటర్ మందంతో ఉంటుంది. అంటే దాదాపు రెండు క్రెడిట్ కార్డ్‌ల మందం కంటే సన్నగా ఉంటుంది.ఈ వాచ్ ప్రత్యేకతలు..ఈ వాచ్ కేవలం 1.7 మిమీ మందంతో ఉంటుంది.ఈ వాచ్ బీవీఎల్ 180 క్యాలిబర్‌తో గంటకు 28,800 వైబ్రేషన్స్ (4 హెర్ట్జ్) ఫ్రీక్వెన్సీతో మాన్యువల్ వైండింగ్ మూవ్‌మెంట్‌ను కలిగి ఉంటుంది.ఈ గడియారాన్ని సాండ్బ్లాస్టెడ్ టైటానియంతో తయారు చేశారు. వాచ్ పట్టీలు కూడా పూర్తిగా టైటానియంతోనే రూపొందించారు. కాబట్టి ఇది చాలా ఏళ్లు మన్నికగా ఉంటాయి. దాంతోపాటు తేలికపాటి డిజైన్ దీని సొంతం.ఇది COSC సర్టిఫైడ్ గడియారం. అంటే ఇది కఠినమైన కచ్చితత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.ఈ వాచ్ లిమిటెడ్ ఎడిషన్. ప్రపంచంలో ఇవి 20 మాత్రమే ఉన్నాయి. అందుకే ఇది అంత ప్రత్యేక సంతరించుకుంది.దీని ధర సుమారు 5,90,000 అమెరిన్ డాలర్లు. అంటే రూ.5 కోట్లకు పైనే.లామా 3 కంటే పది రెట్లు ఎక్కువజుకర్బర్గ్ పోస్ట్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. మెటా ఏఐ లామా 4 వెర్షన్‌ను 2025 ప్రారంభంలో విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఇది తదుపరి తరం ఏఐ మోడల్ అని, లామా 3 కంటే ఇది మరింత మెరుగ్గా పని చేస్తుందన్నారు. ఇందులో రీజనింగ్ వ్యవస్థ సమర్థంగా పని చేస్తుందని చెప్పారు. లామా 4కు సుమారు 1,60,000 జీపీయూలు(గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్- కంప్యూటర్లు, గేమింగ్ కన్సోల్స్ కోసం చిత్రాలు, వీడియోలను రియల్ టైమ్‌లో అందించడానికి ఇది ఉపయోగపడుతుంది) అవసరమని భావిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది లామా 3 కంటే పది రెట్లు ఎక్కువ. -
రూ. 213 కోట్లు జరిమానా.. అప్పీలుకు మెటా
న్యూఢిల్లీ: వాట్సాప్ గోప్యతా పాలసీకి సంబంధించి కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) రూ. 213 కోట్లు జరిమానా విధించడంపై అప్పీలుకెళ్లనున్నట్లు సోషల్ మీడియా దిగ్గజం మెటా వెల్లడించింది. 2021లో అమల్లోకి తెచ్చిన అప్డేట్లో యూజర్ల వ్యక్తిగత మెసేజీల గోప్యతకు భంగం కలిగించే మార్పులేమీ చేయలేదని స్పష్టం చేసింది.వాస్తవానికి డేటా సేకరణ, వినియోగంపై మరింత స్పష్టతనివ్వడంతో పాటు పలు బిజినెస్ ఫీచర్లను కూడా ప్రవేశపెట్టామని పేర్కొంది. వివిధ సేవలతో ప్రజలు, వ్యాపార సంస్థలకు వాట్సాప్ ఎంతో ఉపయోగకరమైనదిగా ఉంటోందని, ఇదంతా మెటా సహకారంతోనే సాధ్యపడుతోందని వివరించింది.మాతృసంస్థ మెటాతో యూజర్లు తమ డేటాను తప్పనిసరిగా షేర్ చేసుకునేలా 2021లో పాలసీని అప్డేట్ చేయడం పోటీ నిబంధనలకు విరుద్ధమంటూ సీసీఐ రూ. 213 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. -
మెటాకు రూ.213 కోట్ల జరిమానా.. కంపెనీ రియాక్షన్
వాట్సాప్ గోప్యత పాలసీ 2021 అప్డేట్కి సంబంధించి అనుచిత వ్యాపార విధానాలను అమలు చేసినందుకు సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) రూ.213 కోట్ల జరిమానా విధించింది. వీటిని సరిదిద్దుకునేందుకు నిర్దిష్ట వ్యవధిలోగా తగు చర్యలు తీసుకోవాలని మెటా, వాట్సాప్‌లను ఆదేశించింది. ఇకపై ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.వాట్సాప్ తన ప్లాట్‌ఫాం ద్వారా సేకరించే డేటాను సర్వీస్ అందించడానికైతే తప్ప అయిదేళ్ల వరకు ప్రకటనలపరమైన అవసరాల కోసం ఇతర మెటా కంపెనీలకు షేర్ చేయకూడదని సీసీఐ పేర్కొంది. ఇతరత్రా అవసరాల కోసం షేర్ చేసుకునేటప్పుడు కచ్చితమైన వివరణ ఇవ్వాలని తెలిపింది. 2021 ఫిబ్రవరి నాటి పాలసీ అప్డేట్ ప్రకారం వాట్సాప్‌ను ఉపయోగించుకోవడాన్ని కొనసాగించాలంటే యూజర్లు తమ డేటాను మెటా కంపెనీలతో షేర్ చేసుకోవడానికి తప్పనిసరిగా అంగీకరించాలనే షరతును చేర్చారు. అంతకు ముందు ఇది ఐచ్ఛికంగానే ఉండేది. గుత్తాధిపత్యం ఉన్న మెటాతో డేటాను షేర్ చేయడాన్ని తప్పనిసరి చేయడం వల్ల ప్రకటనల మార్కెట్లో పోటీ సంస్థలకు అవరోధాలు ఏర్పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమైంది.ఇదీ చదవండి: బైబ్యాక్, డివిడెండ్ పాలసీలో మార్పులుమెటా స్పందనడేటా షేరింగ్ విషయంలో సీసీఐ వాదనల్లో నిజం లేదని మెటా ప్రతినిధులు తెలిపారు. ఈ అంశంపై అప్పీల్‌కు వెళ్తామన్నారు. 2021 పాలసీ అప్డేట్ను సమర్థిస్తూ, వినియోగదారుల వ్యక్తిగత సందేశాల గోప్యత విధానాలను మార్చలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో యూజర్లకు ఆప్షన్ ఉన్నట్లు తెలిపారు. పాలసీని అంగీకరించనందుకు ఏ ఒక్క వినియోగదారుడి ఖాతా తొలగించలేదన్నారు. డేటా సేకరణ, దాని వినియోగంలో పారదర్శకతకు మెటా పెద్దపీట వేస్తోందని చెప్పారు. భారతదేశంలో వాట్సాప్ ఒక ప్రధాన ప్లాట్‌ఫామ్‌గా నిలిచిందని, వ్యాపారాలు, ప్రభుత్వ సేవలు, చిన్న సంస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి వీలు కల్పిస్తోందని కంపెనీ పేర్కొంది. -
ఏఐ రేసును గెలిచే మార్గం
భారతదేశం కృత్రిమ మేధా శక్తి కేంద్రంగా అవతరించాలంటే మౌలిక సదుపాయాలు ఒక్కటే చాలవు, పరిశోధనా ప్రతిభ కూడా అవసరం. ఇటీవల ఇండియాలో పర్యటించిన మెటా చీఫ్ ఏఐ సైంటిస్ట్ యాన్ లెకూన్ దీన్నే నొక్కిచెప్పారు. అమెరికా సిలికాన్ వ్యాలీలోని అత్యుత్తమ ప్రతిభావంతుల్లో ఎక్కువ మంది భారత సంతతికి చెందిన వారే. కనీసం వారిలో కొందరినైనా వెనక్కు తేవాలి. వారు ఇక్కడ అభివృద్ధి చెందడానికి అవసరమైన వ్యవస్థను కల్పించాలి. ఇప్పుడు ఏఐలో ఫ్రాన్స్ కీలకంగా మారిందంటే దానికి కారణం, ఎక్కడెక్కడో పని చేస్తున్న ఫ్రెంచ్ ప్రతిభావంతులను తిరిగి ఫ్రాన్స్ వైపు ఆకర్షించేలా చేసిన వారి ఏఐ వ్యూహం. ఇది మనకు ప్రేరణ కావాలి.ఎన్విడియా సంస్థకు చెందిన జెన్సన్ హువాంగ్, మెటా సంస్థకు చెందిన యాన్ లెకూన్ ఇటీవలి భారత్ సందర్శనలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు భారతీయ మార్కెట్ ప్రాముఖ్యాన్ని గురించి మాత్రమే నొక్కి చెప్పడంలేదు; భారతదేశం కృత్రిమ మేధా శక్తి కేంద్రంగా అవతరించాలన్నా, జాతీయ ఏఐ మిషన్ విజయవంతం కావాలన్నా ఏఐ మౌలిక సదుపాయాలు మాత్రమే సరిపోవు; అగ్రశ్రేణి కృత్రిమ మేధ పరిశోధనా ప్రతిభ అవసరం. మెటా సంస్థకు చెందిన చీఫ్ ఏఐ సైంటిస్ట్ యాన్ లెకూన్ తన పర్యటనలో భాగంగా ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ చెన్నై సహా పలు విద్యాసంస్థలలో ప్రసంగించారు. 2018లో ట్యూరింగ్ ప్రైజ్ విజేత అయిన లెకూన్, కృత్రిమ మేధ ఉత్పత్తి అభివృద్ధిపై మాత్రమే భారత్ దృష్టి పెట్టకుండా, ప్రపంచ కృత్రిమ మేధా పరిశోధనలో తన భాగస్వా మ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఏఐలో అత్యాధునిక పరిశోధన అవకాశాల కొరత, ‘బ్రెయిన్ డ్రెయిన్’ (పరిశోధకులు వేరే దేశాలకు వెళ్లిపోవడం) భారత్ తన సొంత ఏఐ నైపుణ్యాన్ని పెంపొందించు కోవడానికి ఉన్న ప్రాథమిక సవాళ్లని ఆయన ఎత్తి చూపారు.ప్రతిభ అవసరం!దీనికి విరుద్ధంగా, గత నెలలో జరిగిన ఎన్విడియా ఏఐ సదస్సులో రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీతో వేదికను పంచు కున్న జెన్సన్ హువాంగ్ భారత్ సరసమైన కృత్రిమ మేధ మౌలిక సదుపాయాలను నిర్మించాలని నొక్కి చెప్పారు. అయితే, ఇండియా లోని అత్యున్నత స్థాయి పరిశోధనా ప్రతిభ గురించి ఆయన దాదాపుగా ప్రస్తావించలేదు. ఏఐ మౌలిక సదుపాయాలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యత, భారత్ తన ‘నేషనల్ ఏఐ మిషన్’ (ఎన్ఏఐఎమ్)లో కంప్యూటర్ మౌలిక సదుపాయాలకు ఇచ్చిన ప్రాధాన్యతకు అనుగుణంగానే ఉంది. మిషన్ నిధులలో సగం వరకు దీనికే కేటాయించారు.అర్థవంతమైన ఏఐ పరిశోధనకు కంప్యూటర్ కనీస అవసరం అని అంగీకరించాలి. జాతీయ ఏఐ మిషన్ లో భాగంగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయంపై దృష్టి సారించిన మూడు ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఈఓ)ను ఏర్పాటు చేస్తున్నట్లు ఇండియా ఇటీవల ప్రకటించింది. అలాగే ‘ఏఐ ఫర్ ఆల్’(అందరికీ కృత్రిమ మేధ) భావనపై దృష్టిని కేంద్రీకరించింది. అయితే, 10,000 జీపీయూ కంప్యూటర్ మౌలిక సదుపాయాలు, 3 సెక్టోరల్ సీఓఈలు మాత్రమే దేశంలో అత్యాధునిక ఏఐ పరిశోధనను సొంతంగా ప్రారంభించలేవు. రాబోయే నెలల్లో భారత్ జీపీయూలను పొందడంపై దృష్టి పెట్టినప్పటికీ, ఏఐలో పోటీ తత్వాన్ని పెంచే కీలకమైన అంశం నిర్లక్ష్యానికి గురవుతోంది.జాతీయ ఏఐ మిషన్ తన మూలస్తంభాలుగా ప్రతిభ, నైపుణ్యా లను కలిగివుందనడంలో సందేహం లేదు. కానీ అగ్రశ్రేణి పరిశోధనా ప్రతిభను ఆకర్షించడం, ఉన్నదాన్ని నిలుపుకోవడం, శిక్షణ ఇవ్వడంపై భారతదేశ అవసరాన్ని ఇది నొక్కి చెప్పడం లేదు. బదులుగా, ఇది గ్రాడ్యుయేట్, పోస్ట్–గ్రాడ్యుయేట్ స్థాయిలలో కృత్రిమ మేధ పాఠ్యాంశాల సంఖ్యను, ప్రాప్యతను పెంచడంపై దృష్టి పెట్టే ఏఐ ఫ్యూచర్ స్కిల్స్ ప్రోగ్రామ్‌ను ఊహిస్తోంది.ఫ్యూచర్‌స్కిల్స్ ప్రోగ్రామ్ ఏఐ పట్ల అవగాహనను, విద్యను పెంపొందించడంలో సహాయపడుతుంది. కానీ రాబోయే రెండు మూడేళ్లలో భారత్‌లో అత్యాధునిక ప్రతిభావంతుల సమూహాన్ని నిర్మించడంలో ఇది తోడ్పడదు. లెకూన్ ఎత్తి చూపినట్లుగా, ప్రస్తుతం ఏఐలో అత్యాధునిక ప్రతిభ లేకపోతే ఈ ఆటలో భారత్ విజయం సాధించలేదు.ఫ్రాన్స్ విజయగాథఉదాహరణకు లెకూన్ స్వదేశమైన ఫ్రాన్స్‌ను చూడండి. అమెరికా, చైనాలకు పోటీగా ఉన్న తమదైన ఏఐ శక్తిని ఫ్రాన్స్ కోల్పోతున్నట్లు అక్కడి నాయకులు గ్రహించారు. అందుకే తాజా ఏఐ టెక్ వేవ్ కార్య క్రమాన్ని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. ఫ్రెంచ్ ఏఐ వ్యూహం, ఎక్కడెక్కడో పని చేస్తున్న ఫ్రెంచ్ ప్రతిభా వంతులను తిరిగి ఫ్రాన్స్ వైపు ఆకర్షించడం చుట్టూ తిరుగుతుంది. గూగుల్ డీప్‌మైండ్, మెటాలో ఫండమెంటల్ ఏఐ రీసెర్చ్ (ఫెయిర్) బృందంతో కలిసి పనిచేసిన ఫ్రెంచ్ వ్యవస్థాపకులు కేవలం ఏడాది క్రితమే ఫ్రెంచ్ స్టార్టప్ అయిన మిస్ట్రాల్‌ను ప్రారంభించారు. ఇది ఓపెన్ఏఐకి చెందిన చాట్‌జీపీటీ వేదికకు అగ్ర పోటీదారులలో ఒకటిగా నిలవడమే కాక, ఏఐ ప్రపంచంలో ఫ్రాన్స్ స్థానాన్ని ప్రధాన స్థాయికి తీసుకొచ్చింది.ప్రపంచ వేదికపై ఫ్రాన్స్ ఈ విజయం వెనుక ఉన్న మరొక కారణాన్ని కూడా లెకూన్ ఎత్తి చూపారు. పదేళ్ల క్రితం ఫ్రాన్స్‌లో మెటా సంస్థకు చెందిన ఫెయిర్ జట్టును ఏర్పాటు చేశారు. ఇది చాలా మంది ఫ్రెంచ్ పరిశోధకులకు ఏఐ పరిశోధనను వృత్తిగా మలుచుకునేలా ప్రేరేపించింది. ఇదే మిస్ట్రాల్ వంటి ఫ్రెంచ్ ఏఐ స్టార్టప్‌ల విజయానికి దోహదపడిందని చెప్పారు.నిలుపుకోవాల్సిన ప్రతిభ భారత్ కూడా ఇలాగే చేయాలి. సిలికాన్ వ్యాలీలోని అగ్రశ్రేణి ఏఐ పరిశోధనా ప్రతిభలో ఎక్కువ మంది భారతీయ మూలాలకు చెంది నవారే అన్నది సత్యం. ఒకట్రెండు ఉదాహరణలను చూద్దాం. చాట్‌జీపీటీకి చెందిన ప్రధాన భాగమైన ట్రాన్స్ఫార్మర్లు వాస్తవానికి ‘అటెన్షన్ ఈజ్ ఆల్ యు నీడ్’ అనే గూగుల్ రీసెర్చ్ పేపర్లో భాగం. ఆ పేపర్ సహ రచయితలలో ఆశిష్ వాశ్వానీ, నికీ పర్మార్ ఇద్దరూ భారతీయ సంతతికి చెందినవారు. బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీలో వాశ్వానీ బీటెక్ చేయగా, పుణె ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీలో పర్మార్ చదివారు. మద్రాస్ ఐఐటీ పూర్వ విద్యార్థి అరవింద్ శ్రీనివాస్ గతంలో ఓపెన్ఏఐలో పరిశోధకుడు. పెర్ప్లెక్సిటీ. ఏఐని ప్రారంభించారు. ఇది ప్రస్తుతం సిలివాన్ వ్యాలీలోని హాటెస్ట్ ఏఐ స్టార్టప్‌లలో ఒకటిగా పరిగణించబడుతోంది.ఇలాంటి ప్రతిభను తిరిగి భారత్‌కు తేవాలి, లేదా ప్రతిభావంతులను నిలుపుకోవాలి. బెంగళూరు, గురుగ్రామ్, హైదరాబాద్, చెన్నై, ముంబై లేదా భారతదేశంలో ఎక్కడైనా అభివృద్ధి చెందడానికి అవస రమైన పరిశోధనా వ్యవస్థను కల్పించాలి. ఐఐటీ మద్రాస్ రీసెర్చ్ పార్క్‌లో చేసినట్లుగా, చిన్న ప్రదేశాల్లో కూడా అభివృద్ధి చెందడానికి వీలు కల్పించే వ్యవస్థ ఈ రంగంలో అద్భుతమైన పురోగతికి, అనేక విజయ గాథలకు దారి తీస్తుంది. ఏఐకి కూడా అదే వ్యూహాన్ని వర్తింప జేస్తే అది ఇండియాను ప్రధాన ఏఐ కేంద్రంగా మలచగలదు.అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కు ఏఐ ఒక మూలస్తంభంగా ఉండాలి. ప్రధాన భారతీయ కార్పొరేట్లతో పాటు, ప్రాథమిక పరిశోధన చేయడానికి, ఈ ప్రతిభను ఆహ్వానించగల కనీసం మూడు, నాలుగు ఏఐ ల్యాబ్‌లకు నిధులు సమకూర్చాలి. ఈ ల్యాబ్‌లకు జాతీయ ఏఐ మిషన్ కింద కొనుగోలు చేయడానికి ప్రతిపాదించిన కంప్యూట్–ఇన్ ఫ్రాస్ట్రక్చర్, అధునాతన ఏఐ చిప్‌లతో సహా క్లిష్టమైన ఏఐ మౌలిక సదుపాయాలను అందించవచ్చు.అయితే, ఏఐలో పరిశోధనా ప్రతిభ ఇప్పటికే భారతదేశంలో లేదని చెప్పడం లేదు. మన విశ్వవిద్యాలయాలు ఏఐ, సంబంధిత రంగాలలో గొప్ప పరిశోధకులను ఉత్పత్తి చేస్తూనే ఉన్నాయి. ఎన్వీడి యాతో సహా అనేక ప్రపంచ కంపెనీలు ఇక్కడున్న తమ ఏఐ ల్యాబ్ లలో వేలాది మంది భారతీయులను కలిగి ఉన్నాయి. ఈ పునాది, అత్యుత్తమ అగ్రశ్రేణి ఏఐ ప్రతిభను ఆకర్షించడం, దాన్ని నిలుపుకోవ డంతో సహా జాతీయ ఏఐ మిషన్ విజయంలో సహాయపడుతుంది. చాలా మంది అంచనాల ప్రకారం, కృత్రిమ మేధలో విజయ ఫలాలు చాలా మధురంగా ఉండగలవు.అనిరుధ్ సూరి వ్యాసకర్త ‘ద గ్రేట్ టెక్ గేమ్’ రచయిత; ‘కార్నెగీ ఇండియా’ నాన్ రెసిడెంట్ స్కాలర్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
మెటాపై రూ.6,972 కోట్ల జరిమానా!
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాపై యురోపియన్ కమిషన్ భారీ జరిమానా విధించింది. యాంటీట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను మెటాకు ఏకంగా 800 మిలియన్ యూరోలు(840 మిలియన్ డాలర్లు-రూ.6,972 కోట్లు) పెనాల్టీ విధించింది. మెటా తన మార్కెట్ గుత్తాధిపత్యాన్ని వినియోగించుకుని ఆన్లైన్ క్లాసిఫైడ్ యాడ్స్ వ్యాపారంలో పోటీ వ్యతిరేక విధానాలను అవలంబించిందని యూరోపియన్ కమిషన్ తెలిపింది.‘యూరోపియన్ యూనియన్ యాంటీట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మెటా సంస్థపై దాదాపు రూ.6,972 కోట్లమేర పెనాల్టీ విధించాం. నిబంధనలకు విరుద్ధంగా ఫేస్బుక్ మార్కెట్ స్పేస్‌ను వినియోగించుకుంటుంది. ఫేస్బుక్లో తనకు పోటీగా ఉన్న ఇతర ప్రకటన ఏజెన్సీలకు సంబంధించి ఆన్లైన్ క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్‌పై అననుకూల వ్యాపార పరిస్థితులను అమలు చేసింది. ఫేస్బుక్ వినియోగదారులకు మార్కెట్‌స్పేస్ యాక్సెస్ ఇస్తూ పోటీ వ్యతిరేక విధానాలను అవలబింస్తుంది. దాని ద్వారా ఫేస్బుక్ తన మార్కెట్ గుత్తాధిపత్యంతో నిబంధనలను దుర్వినియోగం చేస్తోంది. దాంతోపాటు చట్టవిరుద్ధంగా ఫేస్బుక్ వినియోగదారులకు అవసరం ఉన్నా లేకపోయినా ప్రకటనలను జొప్పిస్తోంది’ అని యురోపియన్ కమిషన్ ఆరోపించింది.ఇదీ చదవండి: తగ్గేదేలే.. మరోసారి పని గంటలపై నారాయణ మూర్తి వ్యాఖ్యలుకంపెనీ స్పందనయురోపియన్ కమిషన్ లేవనెత్తిన ఆరోపణలకు ఎలాంటి రుజువులు లేవని మెటా తెలిపింది. ఈ అంశంపై అప్పీలుకు వెళుతామని స్పష్టం చేసింది. మెటా తన ప్రకటనదారుల నిబంధనలకు కట్టుబడి ఉందని తెలిపింది. వినియోగదారులు ఫేస్బుక్ మార్కెట్‌ప్లేస్‌ను అనుసరించాలా వద్దా అనేది పూర్తిగా వారి ఇష్టంపై ఆధారపడుతుందని చెప్పింది. అందులో కంపెనీ ఎలాంటి నియమాలను ఉల్లంఘించలేదని పేర్కొంది. -
ఇన్‌స్టాలో ఇక వయసు దాచలేరు
టీనేజీ యూజర్లు అసభ్య, అనవసర కంటెంట్ బారిన పడకుండా, వాటిని చూడకుండా కట్టడిచేసేందుకు, వారి మానసిక ఆరోగ్యం బాగుకోసం సామాజికమాధ్యమం ఇన్‌స్టా గ్రామ్ నడుం బిగించింది. ఇందుకోసం ఆయా టీనేజర్ల వయసును కనిపెట్టే పనిలో పడింది. తప్పుడు క్రిడెన్షియల్స్, సమాచారంతో లాగిన్ అయినాసరే ఇన్‌స్టా గ్రామ్ యాప్‌ను వాడుతున్నాసరే దానిని కనిపెట్టి అడ్డుకునేందుకు కృత్రిమ మేథ సాయం తీసుకుంటామని దాని మాతృసంస్థ ‘మెటా’వెల్లడించింది.ఎలా కనిపెడతారు? అడల్ట్ క్లాసిఫయర్ పేరిట కొత్త ఏఐ టూల్‌ను మెటా వినియోగించనుంది. దీంతో యూజర్ల వయసును అత్యంత ఖచ్చితత్వంతో నిర్ధారించుకోవచ్చు. ఆన్లైన్లో ఎలాంటి కంటెంట్‌ను యూజర్ వీక్షిస్తున్నాడు?, ఆ యూజర్ ప్రొఫైల్‌లో పొందుపరిచిన వివరాలతో వయసుపై తొలుత ప్రాథమిక అంచనాకొస్తారు. తర్వాత ఈ యూజర్‌ను ఏఏ వయసు వాళ్లు ఫాలో అవుతున్నారు?, ఈ యూజర్‌తో ఎలాంటి కంటెంట్‌ను పంచుకుంటున్నారు?, ఎలాంటి అంశాలపై ఛాటింగ్ చేస్తున్నారు? ఏం ఛాటింగ్ చేస్తున్నారు? వంటి విషయాలను వడబోయనున్నారు. ఫ్రెండ్స్ నుంచి ఈ యూజర్లకు ఎలాంటి బర్త్‌డే పోస్ట్‌లు వస్తున్నాయి వంటివి జల్లెడపట్టి యూజర్ వయసును నిర్ధారిస్తారు. ఆ యూజర్ 18 ఏళ్ల లోపు వయసున్న టీనేజర్‌గా తేలితే ఆ అకౌంట్‌ను వెంటనే టీన్ అకౌంట్‌గా మారుస్తారు. ఈ అకౌంట్ల వ్యక్తిగత గోప్యత సెట్టింగ్స్ ఆటోమేటిక్‌గా మారిపోతాయి. ఈ యూజర్లకు ఏ వయసు వారు మెసేజ్ పంపొచ్చు? అనేది ఏఐ టూల్ నిర్ణయిస్తుంది. ఈ టీనేజర్లు ఎలాంటి కంటెంట్‌ను యాక్సెస్ చేయొచ్చు అనే దానిపై కృత్రిమ మేథ టూల్దే తుది నిర్ణయం. ప్రస్తుతం చాలా మంది టీనేజర్లు లైంగికసంబంధ కంటెంట్‌ను వీక్షించేందుకు, తల్లిదండ్రులకు తెలీకుండా చూసేందుకు తప్పుడు క్రిడెన్షియల్స్, సమాచారం ఇచ్చి లాగిన్ అవుతున్నారు. వీటికి త్వరలో అడ్డుకట్ట పడనుంది.వచ్చే ఏడాది షురూ అడల్ట్ క్లాసిఫయర్ను వచ్చే ఏడాది నుంచి అమలుచేసే వీలుంది. 18 ఏళ్లలోపు టీనేజర్ల ఖాతాలను టీన్ అకౌంట్లుగా మారుస్తాయి. అయితే త్వరలో 18 ఏళ్లు నిండబోయే 17, 16 ఏళ్ల వయసు వారికి కొంత వెసులుబాటు కల్పించే వీలుంది. అంటే నియంత్రణ సెట్టింగ్‌లను మార్చుకోవచ్చు. అయితే ఇది కూడా కాస్తంత కష్టంగా మార్చొచ్చు. సామాజికమాధ్యమ వేదికపై హానికర అంశాలను పిల్లలు చూసి వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో మెటా ఈ దిశగా యాప్‌లో మార్పులు చేస్తోంది. టీనేజీ అమ్మాయిలపై ఇన్‌స్టా గ్రామ్ పెను దుష్ప్రభావాలు చూపుతోందని ప్రజావేగు ఫ్రాన్సెస్ హాగెన్ సంబంధిత అంతర్గత పత్రాలను బహిర్గతం చేయడంతో ఇన్‌స్టా గ్రామ్ నిర్లక్ష్య ధోరణిపై సర్వత్రా విమర్శలు అధికమయ్యాయి. కొత్త టూల్ కారణంగా టీనేజీ యూజర్ల సంఖ్య తగ్గుముఖం పట్టొచ్చేమోగానీ సమస్యకు పూర్తి పరిష్కారం లభించకపోవచ్చని స్వయంగా మెటానే భావిస్తోంది. ఎవరైనా యూజర్ తాను టీనేజర్‌ను కాదు అని చెప్పి టీన్అకౌంట్ను మార్చాలనుకుంటే ఆ మేరకు లైవ్‌లో నిరూపించుకునేలా కొత్త నిబంధన తేవాలని చూస్తున్నారు. బయటి సంస్థకు ఈ బాధ్యతలు అప్పజెప్పనున్నారు. సంబంధిత యూజర్ వీడియో సెల్ఫీ లైవ్‌లో తీసి పంపితే ఈ బయటి సంస్థ వీడియోను సరిచూసి అకౌంట్ స్టేటస్‌పై తుది నిర్ణయం తీసుకుంటుంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రూ.1 కోటి కంటే ఖరీదైన వాచ్ ధరించిన మార్క్
ప్రముఖ టెక్ కంపెనీ మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలో సుమారు రూ.ఒక కోటి వాచ్ ధరించి కనిపించారు. ఈయన ప్రస్తుతం ప్రపంచంలోని మూడో అత్యంత సంపన్న వ్యక్తికి ఉన్నారు. తాను ధరించిన వాచ్‌కు సంబంధించి వాచ్.న్యూజ్ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో వివరాలు వెల్లడించారు.మార్క్ జుకర్‌బర్గ్ పాటెక్ ఫిలిప్ వాచ్ ధరించి తన భార్య ప్రిస్సిల్లా చాన్‌తో కలిసి ఉన్న ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. తాను షేర్ చేసిన ఇమేజ్‌లోని వాచ్‌కు సంబంధించి నెట్టింట చర్చ జరిగింది. దాంతో పలు సమాజిక మాధ్యమాల్లో తన రిస్ట్‌వాచ్ వివరాలు వెల్లడించారు. అందులో భాగంగా వాచ్.న్యూజ్ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ దాని వివరాలు వెల్లడించింది. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck)ఇదీ చదవండి: పెళ్లి కూతురిని వెతకనందుకు రూ.60 వేలు జరిమానా!జుకర్‌బర్గ్ ధరించిన వాచ్ ప్రతిష్టాత్మక స్విస్ బ్రాండ్ పాటెక్ ఫిలిప్ తయారు చేసిన టైమ్పీస్గా గుర్తించారు. ఈ సంస్థ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, ప్రత్యేకమైన గడియారాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందింది. మార్క్ ఈ కంపెనీకు చెందిన దాదాపు రూ.1 కోటి కంటే ఎక్కువ ధర ఉంటే ‘5236పీ’ మోడల్ వాచ్‌ను ధరించినట్లు వాచ్.న్యూజ్ పేర్కొంది. మార్చిలో అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడులకు వచ్చిన జుకర్‌బర్గ్ దంపతులు తను వాడిన పాటక్ ఫిలిప్ వాచ్‌ను చూసి బాగుందని కితాబిచ్చిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by watchnewz (@watch.newz) -
ఫేస్బుక్ ఇండియా లాభం ఎలా ఉందంటే..
సోషల్ మీడియా దిగ్గజం మెటాకు చెందిన అడ్వర్టయిజ్మెంట్ యూనిట్ ఫేస్బుక్ ఇండియా ఆన్లైన్ సర్వీసెస్ గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో పటిష్ట ఫలితాలు సాధించింది. ఫైనాన్షియల్ రీసెర్చ్ సంస్థ టోఫ్లర్ వివరాల ప్రకారం నికర లాభం 43 శాతం జంప్‌చేసి రూ.505 కోట్లను తాకింది.టోఫ్లర్ తెలిపిన వివరాల ప్రకారం..ఫేస్బుక్ ఇండియా 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.353 కోట్ల నికర లాభం మాత్రమే ఆర్జించింది. కానీ 2023-24 ఏడాదిలో ఇది 43 శాతం పెరిగి రూ.505 కోట్లను తాకింది. కంపెనీ దేశీయంగా అడ్వర్టయిజింగ్ ఇన్వెంటరీని కస్టమర్లకు విక్రయించే సర్వీసులతోపాటు మెటా ప్లాట్‌ఫామ్స్ ఇంక్‌కు ఐటీ ఆధారిత సపోర్ట్, డిజైన్ సపోర్ట్ సేవలు సైతం అందిస్తోంది. కాగా..2023-24లో టర్నోవర్ 9 శాతంపైగా ఎగసి రూ.3,035 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది రూ.2,776 కోట్ల ఆదాయం నమోదైంది.ఇదీ చదవండి: గూగుల్ ఆస్తులమ్మినా తీరని జరిమానా!ఫేస్బుక్ ఇండియా విభాగంలో దాదాపు 2,500 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్, హ్యూమన్ రిసోర్స్, సపోర్ట్ సర్వీస్..వంటి విభిన్న విభాగాల్లో సేవలందిస్తున్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా మెటా ప్లాట్‌ఫామ్స్ సుమారు 67,317 మందికి ఉపాధి కల్పిస్తుంది. -
ఇన్‌స్టాగ్రామ్‌లో సాంకేతిక సమస్య! మీకూ ఎదురైందా?
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల వినియోగదారులు ఇబ్బంది పడినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. మంగళవారం సాయంత్రం 5:14 గంటల సమయంలో ప్రత్యేక్ష సందేశాలు(డైరెక్ట్ మెసేజ్‌లు) పంపించడంలో సమస్య ఎదుర్కొన్నట్లు నెటిజన్లు తెలిపారు. ఈమేరకు ఇతర సమాజిక మాధ్యమాల్లో అందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ పోస్ట్‌లు పెట్టారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ సర్వీస్ అంతరాయాలను ట్రాక్ చేసే డౌన్‌డెటెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం..ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్ట్ మెసేజ్ పంపించేందుకు వినియోగదారులు కొంత సమయంపాటు ఇబ్బందిపడ్డారు. మంగళవారం సాయంత్రం సుమారు 5:14 గంటల సమయంలో ఈ సమస్య ఉత్పన్నమైంది. దీనిపై దాదాపు రెండువేల కంటే ఎక్కువే ఫిర్యాదులు అందాయి. ఈ సమస్య ఎదురైన యూజర్లు ట్విటర్ వేదికగా ఇంకెవరికైనా ఇలాంటి ఇబ్బంది తలెత్తిందా అని ప్రశ్నించారు. చాలామంది ఈ సమస్యతో ఇబ్బందిపడడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. కాగా, ఈ సాంకేతిక సమస్యకు కారణాలు తెలియరాలేదు. ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా నుంచి ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు.ఇదీ చదవండి: మూడు ప్లాంట్ల మూసివేత.. 10 వేల మందికి ఉద్వాసన!అమెరికాలో అక్టోబర్ 15న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వినియోగదారులకు సాంకేతిక సమస్య ఎదురైంది. దాంతో వేలాది సంఖ్యలో మెటా యూజర్లు ఇబ్బంది పడినట్లు పలు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. దాదాపు 12,000 కంటే ఎక్కువ మంది యూజర్లు ఫేస్‌బుక్‌కు సంబంధించి సమస్య ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సమస్యల గురించి 5,000 కంటే ఎక్కువ మంది ఫిర్యాదు చేశారు. -
20 ఏళ్ల యువతకు ఏఐ గాడ్‌ఫాదర్ సలహా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శకం కొనసాగుతోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాదాపు ప్రతి రంగంలోకి ఏఐ ప్రవేశిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఈ రంగంలో తమ కెరియర్ పెంపొందించేకోవాలనే వారికి ‘ఏఐ గాడ్‌ఫాదర్’గా పరిగణించబడే ఫ్రెంచ్-అమెరికన్ శాస్త్రవేత్త యాన్ లెకున్ సూచనలిచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ల వయసు గల యువత తమ కెరియర్ను ఉజ్వలంగా మలుచుకోవాలంటే ఏం చేయాలో చెప్పారు.‘ప్రపంచంలో దాదాపు అన్ని రంగాల్లో ఏఐ వేగంగా విస్తరిస్తోంది. 20 ఏళ్ల వయసుగల వారు తమ భవిష్యత్తు కోసం నన్ను ఏం చేయాలో చెప్పమని అడిగితే ఒక సలహా ఇస్తాను. ఎక్కువగా గణితం, భౌతికశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ వంటి అంశాలపై పట్టు సాధించాలి. తరువాతి తరం ఏఐ సిస్టమ్‌లను అర్థం చేసుకోవడానికి ఇవి ఎంతో అవసరం. వీటికి భవిష్యత్తులో ఎక్కువ ఆదరణ ఉంటుంది. అదే మొబైల్ యాప్ డెవలప్మెంట్ వైపు తమ కెరియర్ మలుచుకోవాలనుకునే వారికి భవిష్యత్తులో పెద్దగా అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ రంగం ‘షెల్ఫ్‌లైఫ్’(అధిక ఆదరణ ఉండే సమయం) మూడేళ్లుగా నిర్ధారించారు. 30-40 ఏళ్ల వారు చిప్ తయారీ రంగంపై దృష్టి పెట్టండి. ఎందుకంటే వచ్చే ఐదేళ్లలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి’ అన్నారు.ఇదీ చదవండి: వంటనూనె ధరలు మరింత ప్రియం?యాన్ లెకున్ ప్రస్తుతం మెటా సంస్థలో చీఫ్ ఏఐ సైంటిస్ట్‌గా పని చేస్తున్నారు. మెటా ఫండమెంటల్ ఏఐ రీసెర్చ్ (ఫెయిర్) ల్యాబ్‌ను ఏర్పాటు చేసిందని లెకున్ గుర్తు చేశారు. ఇది లార్జ్ ల్యాంగ్వేజ్ మోడళ్ల(ఎల్ఎల్ఎం) కంటే తదుపరి తరం ఏఐ సిస్టమ్‌లపై పరిశోధనలు చేస్తుందన్నారు. ప్రపంచంలోని ప్రధాన కంపెనీలు ఇప్పటికే వాటి ఏఐ ఉత్పత్తులను పరిచయం చేశాయి. నిత్యం అందులో కొత్త అంశాలను అప్డేట్ చేస్తున్నాయి. గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్ కోపిలట్, ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ, మెటా మెటాఏఐ..వంటివి ప్రత్యేకంగా ఏఐ సేవలందిస్తున్నాయి. -
ఉచిత భోజనం వోచర్లు వాడిన ఉద్యోగుల తొలగింపు
ఉచిత భోజనం కోసం ఇచ్చిన వోచర్లను ఉపయోగించుకున్న ఉద్యోగులకు మెటా సంస్థ షాకిచ్చింది. లాస్ ఏంజిల్స్‌లోని తన కార్యాలయంలో పనిచేస్తున్న 24 మంది ఉద్యోగులను జాజ్ నుంచి తొలగించింది. అసలు ఆ ఉద్యోగులు చేసిన తప్పేంటి..కంపెనీ యాజమాన్యం తమను ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించిందో తెలుసుకుందాం.మార్క్ జుకర్‌బర్గ్ యాజమాన్యంలోని టెక్ దిగ్గజ కంపెనీ మెటా తన ఉద్యోగులకు నిత్యం ఉచిత ప్రోత్సహకాలు అందిస్తోంది. అందులో భాగంగా ఉచిత భోజనం కోసం వోచర్లు ఇస్తోంది. అయితే వీటిని కొందరు ఉద్యోగులు దుర్వినియోగం చేసినట్లు సంస్థ గుర్తించింది. దాంతో లాస్ ఏంజిల్స్ కార్యాలయంలో పనిచేస్తున్న 24 మంది ఉద్యోగులను ఏకంగా జాజ్ నుంచి తొలగించింది. అయితే వారు భోజనానికి బదులుగా ఇతర వస్తువులు కొనుగోలు చేయడమే ఇందుకు కారణం. టూత్‌పేస్ట్, లాండ్రీ డిటర్జెంట్, వైన్ గ్లాసెస్ వంటి వ్యక్తిగత వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ వోచర్లను ఉపయోగించారు. ఉద్యోగం కోల్పోయిన కొందరిలో తాము వీక్ఆఫ్ ఉన్న రోజుల్లోనూ ఇలా ఉచిత భోజనం కోసం ఇచ్చిన వోచర్లను ఉపయోగించినట్లు సంస్థ యాజమాన్యం గుర్తించింది.ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు!మెటా తన ఉద్యోగులకు ‘గ్రూబ్హబ్’, ‘ఉబర్ఈట్స్’ వంటి డెలివరీ సేవల ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి రోజువారీ భోజన వసతి అందిస్తుంది. అందులో భాగంగా తమకు ఉచితంగా వోచర్ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఒక ఉద్యోగికి టిఫిన్ కోసం 20 డాలర్లు(రూ.1,681), మధ్యాహ్నం భోజనం కోసం 25 డాలర్లు(రూ.2,100), రాత్రి భోజనం కోసం 25 డాలర్లు(రూ.2,100) విలువ చేసే వోచర్లు ఇస్తోంది. అయితే కొంతమంది ఉద్యోగులు నాన్-ఫుడ్ వస్తువులను కొనుగోలు చేయడానికి, కార్యాలయానికి రాని సమయంలో భోజన సదుపాయాన్ని వినియోగించినట్లు కంపెనీ దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంపై ఉద్యోగులకు ప్రాథమిక హెచ్చరికలు ఉన్నప్పటికీ వీటిని కొందరు అతిక్రమించారు. దాంతో సంస్థ యాజమాన్యం వారిని ఉద్యోగం నుంచి తొలగించింది. -
కుమార్తె కోసం నెయిల్ ఆర్టిస్ట్‌గా జుకర్‌బర్గ్ - వీడియో
కూతుళ్ళ కోసం తండ్రులు ఎంత దూరమైనా వెళ్తారు. కోతి కావాలంటే కొండ మీదకు ట్రెకింగ్ చేస్తారు. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం కోసం ఆకాశమెత్తు చెట్టునైనా సునాయాసంగా ఎక్కేస్తారు. జుకర్‌బర్గ్ కూడా అంతే! ఆయనెంత టెక్నాలజీ కింగ్ అయినా కూతురి దగ్గర ఒక మామూలు తండ్రే. మానవాళి కలలకు రంగులు అద్దటానికి ప్రపంచం నిరంతరం అప్డేట్లతో పరుగులు తీస్తుండే మెటా సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్' కూతురి గోళ్లకు రంగు వేయడం కోసం ఎలా కుదురుగా కూర్చున్నారో చూడండి. మొత్తానికి టాస్క్ ఫినిష్ చేసేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.జుకర్‌బర్గ్ టేబుల్‌పైకి వంగి, తన కుమార్తె గోళ్లకు నెయిల్ పాలిష్ వేసి నెయిల్ ఆర్టిస్ట్ అయ్యారు. చిన్నారి తన నెయిల్ ఆర్ట్‌ని ప్రదర్శించడంతో క్లిప్ ముగుస్తుంది. నెటిజన్లు ఈ వీడియో చూసి తమదైన రీతిలో స్పందిస్తున్నారు.ఇప్పటికే 20వేల కంటే ఎక్కువ లైక్స్ పొందిన ఈ వీడియో 6,25,000 కంటే ఎక్కువ వీక్షణలను పొందింది. తన కుమార్తె కోసం సీఈఓ నుంచి స్టైలిస్ట్‌గా మారారని ఒకరు కామెంట్ చేశారు. ఫాదర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వాలని ఇంకొకరు చమత్కరించారు.క్వెస్ట్ 3ఎస్కుమార్తె గోళ్లకు నెయిల్ పాలిష్ వేయడానికంటే ముందు జుకర్‌బర్గ్ 'క్వెస్ట్ 3ఎస్'లో మల్టిపుల్ స్క్రీన్స్ చూసారు. క్వెస్ట్ 3ఎస్ అనేది వర్చువల్ రియాలిటీ హెడ్సెట్. దీనిని మెటా 2024 సెప్టెంబర్ 25న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రారంభించింది. దీని ధర రూ. 25,210 నుంచి రూ. 33,610 వరకు ఉంది.ఇదీ చదవండి: జియోభారత్ కొత్త ఫోన్స్ ఇవే.. ధర తెలిస్తే కొనేస్తారు!మెటా క్వెస్ట్ 3ఎస్ హెడ్సెట్.. సినిమా సైజ్ స్క్రీన్‌పై మీకు ఇష్టమైన షోలను చూడటానికి మాత్రమే కాకుండా, మీరు ఎక్కడికెళ్లినా మీతో పాటు తీసుకెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది గేమ్స్ వంటివి ఆడటానికి కూడా అనుమతిస్తుంది. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) -
ఉద్యోగులను తొలగిస్తున్న మెటా
టెక్నాలజీ పరిశ్రమలో ఉద్యోగాల తొలగింపునకు అంతం లేకుండా పోతోంది. ఓ వైపు వేలాదిగా ప్రకటిత కోతలు కొనసాగుతుండగా మరోవైపు అప్రకటిత లేఆఫ్‌ల వార్తలు సైతం వినిపిస్తున్నాయి. తాజాగా టెక్నాలజీ దిగ్గజం మెటా కూడా ఇలాంటి తొలగింపులు చేపట్టింది. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, రియాలిటీ ల్యాబ్‌లతో సహా పలు యూనిట్లలో ఉద్యోగులను తొలగిస్తోందని ఈ విషయం తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ వెర్జ్ నివేదించింది.దీనిని మెటా ప్రతినిధి ధ్రువీకరించారు. రాయిటర్స్‌కు ఇచ్చిన ప్రకటనలో కంపెనీ దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాలు, ప్రాంతీయ వ్యూహాలకు అనుగుణంగా సర్దుబాటు చేయడానికి తమ బృందాల్లో మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. "ఇందులో కొన్ని బృందాలను వేర్వేరు ప్రదేశాలకు తరలించడం, కొంతమంది ఉద్యోగులను ఇతర పాత్రలకు మార్చడం వంటివి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభావితమైన ఉద్యోగులకు ఇతర అవకాశాలను కనుగొనడానికి మేము కృషి చేస్తాం" అని కంపనీ ప్రతినిధి చెప్పారు.ఇదీ చదవండి: టీసీఎస్.. ఇన్ఫోసిస్‌కు ప్రత్యర్థి కాదా?కాగా వెర్జ్ రిపోర్టులో తొలగిస్తున్న ఉద్యోగాల సంఖ్యను కచ్చితంగా పేర్కొనలేదు కానీ అవి తక్కువ సంఖ్యలోనే ఉన్నట్లు వెల్లడించింది. తొలగింపు సంఖ్యపై మెటా కూడా వ్యాఖ్యానించలేదు. మరో వైపు, తమ రోజువారీ 25 డాలర్ల భోజన క్రెడిట్లను ఉపయోగించి వైన్ గ్లాసులు, లాండ్రీ డిటర్జెంట్, ఇతర గృహోపకరణాలను కొనుగోలు చేశారనే ఆరోపణలపై లాస్ ఏంజిల్స్‌లోని మరో రెండు డజన్ల మంది సిబ్బందిని మెటా తొలగించిందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ఈ నివేదికపై వ్యాఖ్యానించడానికి మెటా నిరాకరించింది. -
రూ.16 లక్షల కోట్ల మార్కు దాటిన ‘మార్క్’ సంపద!
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రపంచంలోని నాలుగో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. 200 బిలియన్ డాలర్లు(రూ.16 లక్షల కోట్లు) మించి నికర విలువను సంపాదించిన అతికొద్ది మంది వ్యక్తుల్లో ఒకరిగా స్థానం సంపాదించారు. ఈమేరకు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో వివరాలు వెల్లడయ్యాయి. జుకర్‌బర్గ్ సంపద ప్రస్తుతం 201 బిలియన్ డాలర్ల(రూ.16.8 లక్షల కోట్లు)కు చేరుకుంది.ఇప్పటివరకు టెస్లా సీఈఓ ఇలోన్ మస్క్ 272 బిలియన్ డాలర్ల(రూ.22.7 లక్షల కోట్లు) సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. తర్వాత స్థానాల్లో వరుసగా అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ (211 బిలియన్ డాలర్లు-రూ.17.6 లక్షల కోట్లు), ఎల్వీఎంహెచ్ ఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ (207 బిలియన్ డాలర్లు-రూ.17.3 లక్షల కోట్లు) ఉన్నారు. జుకర్‌బర్గ్ ఇప్పటివరకు నాలుగోస్థానంలో ఉన్న ఓరాకిల్ కార్పొరేషన్ సహవ్యవస్థాపకులు లారీ ఎల్లిసన్‌ను వెనక్కినెట్టారు.ఇదీ చదవండి: వడ్డీతో కలిపి రూ.8,465 కోట్లు చెల్లించిన ఎయిర్టెల్బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం టాప్ 10 ధనవంతులు..ఇలోన్ మస్క్జెఫ్ బెజోస్బెర్నార్డ్ ఆర్నాల్ట్మార్క్ జూకర్బర్గ్లారీ ఎల్లిసన్బిల్గేట్స్లారీపేజ్స్టీవ్ బామర్వారెన్బఫెట్సెర్జీబ్రిన్ -
200 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి...!
సామాజిక మాధ్యమం ‘ఫేస్బుక్’ సృష్టికర్తల్లో ఒకరిగా వెలుగులోకి వచ్చి దాని మాతృసంస్థ ‘మెటా ఫ్లాట్‌ఫామ్స్’ లాభాల పంటతో వేలకోట్లకు పడగలెత్తిన ఔత్సాహిక యువ వ్యాపారవేత్త మార్క్ జుకర్‌బర్గ్ మరో ఘనత సాధించారు. కేవలం 40 ఏళ్ల వయసులోనే 200 బిలయన్ డాలర్ల క్లబ్లో చేరి ప్రపంచంలో నాలుగో అత్యంత ధనవంతుడిగా రికార్డ్ నెలకొల్పారు. ప్రస్తుత ఆయన సంపద విలువ 201 బిలియన్ డాలర్లు చేరిందని బ్లూమ్‌బర్గ్ తన బిలియనీర్ ఇండెక్స్‌లో పేర్కొంది. ఈ ఒక్క ఏడాదే ఆయన సంపద ఏకంగా 73.4 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం. షేర్మార్కెట్లో ఈ ఏడాది ‘మెటా’ షేర్ల విలువ 64 శాతం పెరగడమే ఇతని సంపద వృద్ధికి అసలు కారణమని తెలుస్తోంది. ‘మెటా’ చేతిలో ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, థ్రెడ్స్ సోషల్మీడియాలతోపాటు ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ ఉంది. మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అనేది త్వరలో ప్రపంచంలోనే అత్యంత అధికంగా వాడే ‘ఏఐ అసిస్టెంట్’గా ఎదగబోతోందని గతవారం ‘మెటా కనెక్ట్ 2024’ కార్యక్రమంలో జుకర్‌బర్గ్ ధీమా వ్యక్తంచేయడం తెల్సిందే. చరిత్రలో ఇప్పటిదాకా 200 బిలియన్ డాలర్ల సంపద గల కుబేరులు ముగ్గురే ఉండగా వారికి ఇప్పుడు జుకర్‌బర్గ్ జతయ్యాడు. ఇన్నాళ్లూ 200 బిలియన్ డాలర్లకు మించి సంపదతో ఎలాన్‌మస్క్( 272 బిలియన్ డాలర్లు), జెఫ్ బెజోస్(211 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్లు మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. మస్క్.. టెస్లా, ‘ఎక్స్’కు సీఈవోగా కొనసాగుతున్నారు. జెఫ్ బెజోస్ అమెజాన్ సంస్థకు అధిపతిగా ఉన్నారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్‌కు ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ వస్తువుల బ్రాండ్ అయిన ఎల్వీఎంహెచ్సహా భిన్నరంగాల్లో డజన్లకొద్దీ వ్యాపారాలున్నాయి. – వాషింగ్టన్ -
జుకర్‌బర్గ్ చేతికి అరుదైన వాచ్! రేటు తెలిస్తే..
బిలియనీర్లు, వ్యాపార ప్రముఖుల బిజినెస్ విషయాలే కాదు.. వారు ఏం ధరిస్తున్నారు.. లైఫ్ స్టైల్‌కు సంబంధించిన విశేషాలూ వార్తల్లోకి వస్తుంటాయి. మెటా ఫౌండర్, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల చేతికి అరుదైన వాచ్‌తో కనిపించారు. మరి ఔత్సాహికులు ఊరికే ఉంటారా ఆ వాచీ ఏ కంపెనీ, ధర ఎంత తదితర విషయాలు ఆరా తీసి కనిపెట్టేశారు.జుకర్‌బర్గ్ ధరించిన గడియారం డి బెతునే కంపెనీకి చెందిన డీబీ 25 స్టార్రి వేరియస్ వాచ్. ధర 90,000 నుంచి 95,700 డాలర్లు (రూ. 75 లక్షల నుండి రూ.80 లక్షలు) మధ్య ఉంటుందని బిజినెస్ ఇన్సైడర్ నివేదించింది. అంటే దాదాపుగా భవిష్యత్ టెస్లా సైబర్‌ట్రక్ ధరంత. దీని రేటు 99,990 డాలర్లు. ఇది అరుదైన వాచ్. ఇలాంటివి సంవత్సరానికి కేవలం 20 వాచీలను మాత్రమే తయారు చేస్తారు.డీబీ 25 స్టార్రి వేరియస్ వాచ్‌కి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. స్విస్ వాచ్‌మేకర్ వెబ్సైట్ ప్రకారం.. తెలుపు, గాఢ నీలం రంగుల్లో ప్రకాశవంతమైన డయల్, 24-క్యారెట్ బంగారంతో పాలపుంతలో నక్షత్రాల్లాగా అంకెలను సూచించే చుక్కలు, వాటిని తాకుతూ ముళ్లు, చుట్టూ మెరిసిపోతున్న రోజ్ గోల్డ్ ఫ్రేమ్ చూస్తేనే కళ్లు చెదిరేలా చేస్తున్నాయి.జుకర్‌బర్గ్ ప్రీమియం వాచ్ ధరించడం ఇదే మొదటిసారి కాదు. మొన్నామధ్య తన భార్య భుజాలపై చేయి వేసుకుని తీసుకున్న సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అందులో ఆయన చేతికి ఖరీదైన వాచ్ ధరించారు. అది 1,41,400 డాలర్ల విలువైన పటెక్ ఫిలిప్ వాచ్ అని వెంటనే పట్టేశారు ఔత్సాహికులు.Mark Zuckerberg spotted yesterday during the @AcquiredFM live wearing a DB25 Starry Varius in rose gold from De Bethune. 👀 pic.twitter.com/raZRTyzmAz— ZwapX (@zwapxofficial) September 11, 2024 -
మెటాకు కీలక మార్కెట్‌గా భారత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా తమకు కీలకమైన మార్కెట్లలో భారత్ కూడా ఒకటని సోషల్ మీడియా దిగ్గజం మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంధ్య దేవనాథన్ తెలిపారు. దేశీయంగా రీల్స్, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాధనాలకు గణనీయంగా ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు.కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేసే శక్తి రీల్స్‌కి ఉందని గుర్తించిన బ్రాండ్లు, కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు తమ ప్రచార కార్యక్రమాల్లో వాటిని తొలినాళ్ల నుంచే వినియోగించడం ప్రారంభించాయని సంధ్య చెప్పారు. పేరెంటింగ్ టిప్స్ నుంచి ఓనమ్ వరకు వివిధ అంశాల గురించి సమాచారం కోసం భారతీయ యూజర్లు ఏఐ ఆధారిత చాట్‌బాట్ వైపు మళ్లుతున్నారని వివరించారు.ఈ నేపథ్యంలో దేశీయంగా వ్యాపారావకాశాలు పుష్కలంగా ఉన్నాయని, మరింతగా పెట్టుబడులు పెట్టడాన్ని కంపెనీ కొనసాగిస్తుందని ఆమె చెప్పారు. జెన్ జడ్, యువ జనాభా, ప్రైవేట్ రంగం పుంజుకోవడం, పటిష్టమైన వృద్ధి అవకాశాలు, నవకల్పనలు, స్టార్టప్ వ్యవస్థ, పటిష్టమైన క్యాపిటల్ మార్కెట్లు మొదలైనవి భారత మార్కెట్‌కి సానుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు.పరిశ్రమ వర్గాల్లోనూ ఆశాభావం నెలకొందని సంధ్య వివరించారు. ఇవన్నీ కూడా భారత్ ఒక ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న దాఖలాలను సూచిస్తున్నాయన్నారు. వాస్తవానికి చాలాకాలం క్రితమే దేశానికి ఈ హోదా దక్కాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు. -
వాట్సాప్ నుంచి వేరే యాప్‌లకు మెసేజ్‌లు, కాల్స్..
సోషల్ మీడియాలో మేసేజ్‌లు పంపడానికి, కాల్స్ చేయడానికి విస్తృతంగా వినియోగిస్తున్న యాప్ వాట్సాప్. ఇలాంటివి ఇంకా పలు మెసేజింగ్ యాప్‌లు ఉన్నాయి. ఒక యాప్ నుంచి మరో యాప్‌కి మెసేజ్‌లు, కాల్స్ చేసే వెసులుబాటు ఉంటే ఎంత బాగుంటుంది.. దీనికి సంబంధించే వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా కీలక ప్రకటన చేసింది.యూరోపియన్ యూనియన్ డిజిటల్ మార్కెట్ల చట్టం (DMA)కి అనుగుణంగా తమ ప్రసిద్ధ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లైన వాట్సాప్, మెసెంజర్లను 2027 నాటికి థర్డ్-పార్టీ మెసేజింగ్ సేవలతో ఇంటర్‌ఆపరేబిలిటీకి సపోర్ట్ చేసేలా అభివృద్ధి చేయనున్నట్లు మెటా ప్రకటించింది. దీని ప్రకారం యాజర్లు నేరుగా వాట్సాప్, మెసెంజర్ యాప్‌ల నుంచి ఇతర నాన్-మెటా మెసేజింగ్ యాప్‌లకు నేరుగా మెసేజ్‌లు, కాల్స్ చేయవచ్చు, అందుకోవచ్చు.మెటా ఈ కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్న క్రమంలో యూజర్ల గోప్యత, భద్రత ప్రధాన ప్రాధాన్యతలుగా తీసుకుంది. థర్డ్-పార్టీ చాట్లు ఇప్పటికే ఉన్న వాట్సాప్, మెసెంజర్ కమ్యూనికేషన్ల లాగే ఎన్క్రిప్షన్, వినియోగదారు గోప్యతను నిర్వహించేలా చూసే సాంకేతిక పరిష్కారంపై కంపెనీ పని చేస్తోంది. థర్డ్-పార్టీ చాట్ల గురించి వినియోగదారులకు తెలియజేసే కొత్త నోటిఫికేషన్లను మెటా ప్రవేశపెట్టింది. వాట్సాప్ లేదా మెసెంజర్‌కి వేరే యాప్ అనుసంధానమైన ప్రతిసారీ యూజర్లకు నోటిఫికేషన్ వస్తుంది.కాల్స్ మాత్రం కాస్త ఆలస్యంథర్డ్ పార్టీ యాప్‌లతో అనుసంధానమయ్యే విషయంలో వాట్సాప్, మెసెంజర్ యూజర్లకు సౌలభ్యం ఉంటుంది. ఇందులో భాగంగా అన్ని యాప్‌ల మెసేజ్‌లు ఒకే ఇన్‌బాక్స్‌లో కనిపించే లేదా విడివిడి ఇన్‌బాక్స్‌లలో కనిపించే ఆప్షన్లను ప్రవేశపెట్టే యోచనలో మెటా ఉంది. థర్డ్ పార్టీ యాప్‌లతో రియాక్షన్స్, డైరెక్ట్ రిప్లైస్, టైపింగ్ ఇండికేటర్స్, రీడ్ రిసీపియంట్స్ వంటి మెరుగైన మెసేజింగ్ ఫీచర్లతో పాటు గ్రూప్ చాట్ సౌలభ్యాన్ని కూడా 2025 నాటికి అందుబాటులోకి తెచ్చే పనిలో మెటా ఉంది. అయితే థర్డ్ పార్టీ యాప్‌లతో వాయిస్, వీడియో కాల్స్ ఫీచర్ మాత్రం 2027 నాటికి అందుబాటులోకి రావచ్చు. -
సామాజిక సంక్షేమానికి వాట్సప్ సాయం
భారతీయ వినియోగదారుల జీవితాల్లో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ పోషిస్తున్న పాత్రను తెలియజేస్తూ నివేదిక విడుదలైంది. ‘ఫాస్ట్ లేన్ టు సోషల్ ఇంపాక్ట్’ పేరుతో వాట్సప్ రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ సహాయంతో ఈ రిపోర్ట్‌ను తయారు చేసింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడుతున్న చిన్న వ్యాపారాలు, సామాజిక సంక్షేమ సంస్థలకు వాట్సప్ ఎలా దోహదపడుతోందో తెలిపింది.ఈ నివేదికపై మెటా ఇండియా పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ శివనాథ్ తుక్రాల్ స్పందిస్తూ..‘వ్యక్తులు, వ్యాపారాలు, సామాజిక సంక్షేమ సంస్థలు పరస్పరం కమ్యూనికేట్ చేసుకుంటూ ఆర్థిక వృద్ధి సాధించేందుకు వాట్సాప్ కీలక సాధనంగా మారింది. మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడం నుంచి నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధిని అందించడం, తల్లిదండ్రులు తమ పిల్లలు విద్యపై ఆసక్తి పెంచేలా చేయడం వరకు ఎన్నో విధాలుగా వాట్సప్‌ను వినియోగిస్తున్నారు. సానుకూల సామాజిక మార్పు కోసం ఇదో వేదికగా మారింది. టెక్నాలజీ పరంగా దేశం ఎంతో వృద్ధి చెందుతోంది. అందుకు అనుగుణంగా నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవడానికి దీన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. వాట్సప్ బిజినెస్ యాప్ ద్వారా ఎంఎస్ఎంఈలకు ఎంతో మేలు జరుగుతోంది. సంస్థలు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు ఇదో సాధనంగా మారింది. చిన్న వ్యాపారులకు గుర్తింపు లభించడంలో వాట్సప్ పాత్ర కీలకం’ అన్నారు.నివేదికలోని వివరాల ప్రకారం.. చిన్న వ్యాపారాల కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, ఆన్లైన్లో ఆర్డర్లను సులభంగా స్వీకరించడానికి వాట్సప్ వీలు కల్పిస్తోంది. స్థానిక ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం చేయడానికి ఉపయోగపడుతోంది. వ్యాపార పరిధిని విస్తరించడంలో సహాయపడుతోంది. రానున్న రోజుల్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ), మెటా సంయుక్తంగా ‘వాట్సప్ సే వ్యాపార్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అందులో భాగంగా వాట్సప్ బిజినెస్ యాప్‌లో ఒక కోటి మంది వ్యాపారులకు డిజిటల్ శిక్షణ ఇచ్చి నైపుణ్యాలు పెంపొందించాలని నిర్ణయించారు. ఈ శిక్షణ మొత్తం 29 రాష్ట్రాల్లో 11 భారతీయ భాషల్లో అమలు చేయనున్నారు. ఈ ప్రోగ్రామ్‌లో చేరిన 25,000 మంది ప్రతిభ ఉన్న వ్యాపారులకు మెటా స్మాల్ బిజినెస్ అకాడమీ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలకు సంబంధించిన ధ్రువీకరణను అందిస్తారు. ఇది తమ వ్యాపార విస్తరణ కోసం భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: రూ.83 లక్షల కోట్ల విలువైన తొలి నాన్‌టెక్ కంపెనీదేశంలోని అనేక సామాజిక సంక్షేమ సంస్థలకు విద్య, ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారత, సానుకూల సామాజిక మార్పు వంటి విభాగాల్లో సమస్యల పరిష్కారాలను అందించడానికి వాట్సాప్ వీలు కల్పించింది. ‘మన్ దేశీ ఫౌండేషన్’ అనే సంస్థ తన వాట్సప్ చాట్‌బాట్ ద్వారా లక్ష మంది గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక అక్షరాస్యతను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు వాట్సప్ ద్వారా ఆ సంస్థ 15,000 మంది మహిళలకు డిజిటల్ శిక్షణ ఇచ్చింది. వారిలో 85% మంది గ్రామీణ లబ్ధిదారులే కావడం విశేషం. వాట్సప్ గ్రూప్‌ల్లో సమాచారం అందించి పేదరికాన్ని తగ్గించడం, గర్భిణీ స్త్రీలకు సమగ్ర ఆరోగ్య సంరక్షణ, మహిళలకు మెరుగైన ఉపాధి అవకాశాలు, సమగ్ర పౌర సేవలపై అవగాహన, డిజిటల్ హెల్త్ టెక్నాలజీని ప్రోత్సహించడం, సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించడం..వంటి ఎన్నో కార్యక్రమాల నిర్వహణకు తోడ్పాటును అందిస్తున్నట్లు నివేదిక తెలియజేసింది. -
మెటా ఏఐలో కొత్త ఫీచర్.. ఇదెలా పనిచేస్తుందంటే?
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మెటా ఏఐ కొత్త ఫీచర్ ఆవిషక్రయించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.నచ్చిన స్టైల్లో ఫోటోలు క్రియేట్ చేసుకోవడానికి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. దీనిని ఎలా ఉపయోగించాలో కూడా మెటా సీఈఓ వీడియోలో చూపిస్తారు. యూజర్ తన ముఖాన్ని స్కాన్ చేయి తనకు నచ్చిన విధంగా ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు.జుకర్‌బర్గ్ వీడియోలో మొదట తన ముఖాన్ని స్కాన్ చేసుకున్నారు. ఆ తరువాత సెర్చ్ బార్లో నచ్చిన విధంగా ఎలాంటి ఇమేజ్ కావాలో సెర్చ్ చేయాలి. అప్పుడు మెటా మీరు అడిగినట్లుగా ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. జుకర్‌బర్గ్ తనను గ్లాడియేటర్‌గా చూపించమని సెర్చ్ చేశారు. అప్పుడు మెటా అలాంటి ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. ఆ తరువాత బాయ్ బ్యాండ్, గోల్డ్ వేసుకున్నట్లు ఇలా ఫోటోలను క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ వీడియోలో చూడవచ్చు. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) -
ఫేస్బుక్, ఇన్‌స్టా సబ్స్క్రిప్షన్ ప్లాన్స్.. ప్రారంభ ధర ఎంతంటే?
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా.. భారతదేశంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ బిజినెస్ కోసం వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లను పరిచయం చేసింది. గత ఏడాది లిమిటెడ్ యూజర్లతో మాత్రమే సబ్స్క్రిప్షన్ ప్లాన్ టెస్ట్ చేసిన తరువాత.. ఇప్పుడు మరిన్ని ఫీచర్లను అందిస్తుంది.వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు రూ. 639 నుంచి రూ. 21000 వరకు ఉన్నాయి. అయితే వివిధ సంస్థలు తమ అవసరాలకు సరిపోయే మెంబర్షిప్ ప్యాకేజీని ఎంచుకోవడంలో ఉపయోగకరంగా ఉండటానికి నాలుగు విభిన్న ప్లాన్లను అందిస్తోంది. ఈ వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి వెరిఫైడ్ బ్యాడ్జ్, భద్రత, కనెక్టివిటీకి సపోర్ట్ చేసే అదనపు ఫీచర్స్ కూడా పొందవచ్చు.టెస్టింగ్ సమయంలో ఒకే ప్లాన్ అందించిన మెటా.. ఇప్పుడు మొత్తం నాలుగు ప్లాన్స్ అందించినట్లు ప్రకటించింది. ఈ ప్లాన్స్ కేవలం ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ అనేది గతంలో ఎక్స్ (ట్విటర్) ప్రారంభించింది. ఇప్పుడు ఈ జాబితాలోకి మెటా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా చేరాయి. -
అధ్యక్ష బరిలో ట్రంప్.. మెటా కీలక నిర్ణయం
అమెరికా అధ్యక్షుడిగా ఉన్న టైంలో.. డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు 2021లో యూఎస్ క్యాపిటల్‌పై హింసాత్మకంగా దాడి చేశారు. ఆ సమయంలో హింసకు కారకులైనవారిని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రశంసించినట్లు మెటా నిర్దారించింది. ఆ తరువాత ఆయన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై మెటా ఆంక్షలు విధించింది. అయితే.. తాజాగా అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ట్రంప్ మళ్ళీ భవిష్యత్తులో అలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానాలు విధించే అవకాశం ఉందని మెటా స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా తప్పకుండా కొన్ని నియమాలకు లోబడి ఉండాలి. ద్వేషపూరిత ప్రసంగాలు, హింసను ప్రేరేపించడం వంటివి చేస్తే.. శాంతికి భంగం కలుగుతుంది. కాబట్టి సోషల్ మీడియాను చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని మెటా తెలిపింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాత్రమే కాకుండా.. ట్రంప్ ఎక్స్ (ట్విటర్), యూట్యూబ్ అకౌంట్లపై కూడా గతంలో సంబంధిత సంస్థలు ఆంక్షలు విధించాయి. గత ఏడాది ఈ పరిమితులను ఎత్తివేసినప్పటికీ.. ట్రంప్ మాత్రం తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్ ద్వారా తన సందేశాలను జనాలకు చేరవేస్తూ వస్తున్నారు. -
వాట్సాప్ బిజినెస్ కోసం ఏఐ ఫీచర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న వ్యాపారాలను కొనుగోలుదారులకు మరింత చేరువ చేసే దిశగా వాట్సాప్ బిజినెస్ యాప్‌లో కృత్రిమ మేథ (ఏఐ) ఫీచర్లను ప్రవేశపెట్టనున్నట్లు మెటా బిజినెస్ మెసేజింగ్ విభాగం డైరెక్టర్ రవి గర్గ్ తెలిపారు. ఈ ఏడాది ఆఖరులోగా ఏఐ ఏజెంట్, అసిస్టెన్స్ సేవలు అందుబాటులోకి రాగలవని ఆయన వివరించారు. వినియోగదారులకు నిరంతర సేవలు అందించేందుకు .. కంటెంట్, యాడ్స్ మొదలైనవి క్రియేట్ చేయడానికి ఇవి ఉపయోగపడగలవని పేర్కొన్నారు. క్యాటలాగ్ రూపకల్పన నుంచి ఆర్డర్లు, చెల్లింపుల వరకు వాట్సాప్ ద్వారా లావాదేవీల నిర్వహణను సులభతరం చేసేందుకు పలు సంస్థలతో చేతులు కలుపుతున్నట్లు గర్గ్ చెప్పారు. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 6 మెట్రోలతో జట్టు కట్టామని, ప్రస్తుతం నెలకు సుమారు 20 లక్షల మెట్రో రైలు టికెట్ల కొనుగోలు వాట్సాప్ ద్వారా జరుగుతోందని తెలిపారు. బస్సు టికెట్లకు సంబంధించి టీఎస్ఆర్టీసీ మొదలైన వాటితో చర్చలు జరుపుతున్నామని వివరించారు. వాట్సాప్ బిజినెస్‌పై అవగాహన కలి్పంచేందుకు ప్రచారం, సీఏఐటీ వంటి పరిశ్రమ సమాఖ్యలతో శిక్షణ కార్యక్రమాలు మొదలైనవి నిర్వహిస్తున్నట్లు గర్గ్ చెప్పారు. -
‘అమెరికా ఇండిపెండెన్స్ డే’..మార్క్ జుకర్‌బర్గ్ వినూత్న వేడుకలు
అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ జులై 4న వినూత్నంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో విడుదల చేసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.జులై 4న అమెరికా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రముఖులు వేడుకలు నిర్వహించుకున్నారు. అందులో భాగంగా మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఒక చేతిలో బీర్ బాటిల్, మరో చేతిలో అమెరికా జెండాతో నీటిపై హైడ్రోఫాయిల్(నీటిపై కదలడం) చేశారు. ఇందులో మార్క్ బ్లాక్ యాప్రాన్, వైట్ షర్ట్ ధరించారు. కళ్లకు బ్లాక్ గాగుల్స్ పెట్టి అదిరిపోయే పోజు ఇచ్చారు. ఈ వీడియోను ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ‘హ్యాపీ బర్త్‌డే అమెరికా’ అని రాశారు. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck)జుకర్‌బర్గ్ ఆరు నెలల కిందట మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ)లో శిక్షణ పొందుతున్నప్పుడు ప్రమాదవశాత్తు కింద పడ్డారు. దాంతో తన మోకాలికి తీవ్ర గాయమై శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇటీవల కోలుకున్న మార్క్ తన 40వ పుట్టినరోజు వేడులకు ఘనంగా జురుపుకున్నారు. తాజాగా ఇలా హైడ్రోఫాయిల్ చేయడంతో తన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
Mark Zuckerberg: భారత్‌లో మెటా థ్రెడ్స్ జోరు
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ (ఇప్పుడు ఎక్స్)కు పోటీగా ఏడాది క్రితం ప్రవేశపెట్టిన థ్రెడ్స్ యాప్‌కి గణనీయంగా ఆదరణ లభిస్తోందని సోషల్ మీడియా దిగ్గజం మెటా తెలిపింది. అంతర్జాతీయంగా నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 17.5 కోట్లుగా ఉందని పేర్కొంది. క్రియాశీలక వినియోగదారులు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని మెటా సీఈవో మార్క్ జూకర్బర్గ్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్‌లో ఎక్కువగా సినిమాలు, టీవీ, ఓటీటీ, సెలబ్రిటీలు, స్పోర్ట్స్‌కి సంబంధించిన కంటెంట్ ఉంటోందని మెటా వివరించింది. క్రికెట్లో రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, ఆకాశ్ చోప్రా మొదలైన వారు క్రియాశీలకంగా ఉంటున్నారని పేర్కొంది. టీ20 క్రికెట్ వరల్డ్ కప్, ఐపీఎల్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 మొదలైనవి హాట్ టాపిక్‌లుగా నిల్చాయని, 200 మంది పైచిలుకు క్రియేటర్లు ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌పై అప్డేట్స్ ఇచ్చారని వివరించింది. 2023 జూలైలో ప్రవేశపెట్టిన వారం రోజులకే 10 కోట్లకు పైగా యూజర్ సైనప్లతో థ్రెడ్స్ ఒక్కసారిగా ప్రాచుర్యంలోకి వచి్చంది. అయితే, క్రమంగా దానిపై యూజర్ల ఆసక్తి తగ్గుతూ వస్తోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
యాపిల్ ఉత్పత్తుల్లో మెటా ఏఐ.. క్లారిటీ ఇచ్చిన దిగ్గజ సంస్థ
ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా తయారుచేసిన లామా ఏఐ చాట్‌బాట్‌ను యాపిల్ ఉత్పత్తుల్లో వినియోగిస్తారని వస్తున్న వార్తలపై యాపిల్ స్పష్టతనిచ్చింది. రెండు కంపెనీల భాగస్వామ్యానికి సంబంధించి ఎలాంటి చర్చలు జరపలేదని యాపిల్ వర్గాలు తెలిపినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది.జనరేటివ్ఏఐకు ఆదరణ పెరుగుతుండడంతో యాపిల్ ఉత్పత్తుల్లోనూ ఈ టెక్నాలజీను వినియోగించాలని సంస్థ యోచిస్తోంది. దాంతో గతంలో పలు కంపెనీలతో చర్చలు జరిపింది. అందులో భాగంగానే మార్చిలో మెటాతోనూ చర్చించింది. అయితే గోప్యతాపరమైన కారణాల వల్ల ఈ భాగస్వామ్యం కుదరలేదని చెప్పింది. ఇటీవల యాపిల్ ప్రొడక్ట్‌ల్లో మెటా కంపెనీకు చెందిన లామా చాట్‌బాట్‌ను వినియోగించేందుకు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. దాంతో బ్లూమ్‌బర్గ్ వేదికగా యాపిల్ వర్గాలు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చాయి. అలాంటి చర్చలు ఏవీ జరగడం లేదని స్పష్టం చేశాయి.ఇదీ చదవండి: రైలు టికెట్ బుక్ చేస్తే జైలు శిక్ష, 10వేలు జరిమానా..!ఇటీవల యాపిల్ నిర్వహించిన వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2024 కార్యక్రమంలో ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీను వినియోగించేందుకు ఒప్పందం జరిగింది. జనరేటివ్‌ఏఐతో పాటు తన వినియోగదారులకు మరిన్ని సేవలందించేందుకు యాపిల్ సంస్థ ‘యాపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ)’ను తయారుచేసింది. ఐఫోన్ 14 తర్వాత విడుదలైన మోడళ్లలో దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ ఈ కాన్ఫరెన్స్‌లో తెలిపింది. ఈ ఏడాది చివరకు విడుదలయ్యే కొత్త యాపిల్ ఓఎస్‌లో ఈ ఫీచర్‌ను అందించనున్నట్లు చెప్పింది. -
యువతను ఆకర్షిస్తున్న ఫేస్బుక్
మెటా ఆధ్వర్యంలోని ఫేస్బుక్ సంస్థ తన బేస్ వినియోగదారుల్లో యువతను అధికంగా ఆకర్షిస్తోంది. పాత యూజర్ బేస్‌తో పోలిస్తే యువకుల సంఖ్యను పెంచుకుంటున్నట్లు ఫేస్బుక్ తెలిపింది.టిక్‌టాక్‌తో పోటీపడేలా ఫేస్బుక్లో తీసుకొచ్చిన మార్పులు, గ్రూప్ ఫీచర్ల ద్వారా యూజర్లను పెంచుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. యూఎస్, కెనడాకు చెందిన 18 నుంచి 29 ఏళ్ల వయసు ఉన్న 40 మిలియన్ల మంది యువత రోజూ ఫేస్‌బుక్‌ను వాడుతున్నారని చెప్పింది. ప్రాంతాలవారీగా డెమోగ్రఫిక్ వినియోగదారుల సమాచారాన్ని మొదటగా ఫేస్బుక్ సంస్థే విడుదల చేసినట్లు తెలిపింది.ఇదీ చదవండి: తగ్గనున్న ద్రవ్యోల్బణం.. ఆర్బీఐ నివేదికయువత యాప్‌ను ఎలా ఉపయోగిస్తుందో తెలియజేసేలా న్యూయార్క్‌లో ఒక కార్యక్రమం నిర్వహించారు. అందులో ఫేస్బుక్ మెటా హెడ్ టామ్ అలిసన్ మాట్లాడుతూ..‘చైనాకు చెందిన బైట్‌డాన్స్ యాజమాన్యంలోని స్మాల్ వీడియో యాప్ టిక్‌టాక్ వైపు మొగ్గు చూపుతున్న యువత దృష్టిని తిరిగి తనవైపు ఆకర్షించడానికి కంపెనీ కొన్ని సంవత్సరాలుగా ఎంతో ప్రయత్నించింది. తరువాతి తరానికి ఉపయోగపడేలా ఉండేందుకు ఎంతో అభివృద్ధి చెందాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా మార్కెట్‌ప్లేస్, గ్రూప్‌లు, స్మాల్ వీడియా ఫీచర్లను తీసుకొచ్చాం. ప్రస్తుతం ఎక్కువగా యువత ఫీడ్ లేదా రీల్స్‌ను వాడుతున్నారు. సంస్థను స్థాపించిన 2004నుంచి మూడేళ్లలో 50 మిలియన్ల వినియోగదారులను సంపాదించుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3.2 బిలియన్ యూజర్లను కలిగి ఉంది’ అన్నారు. -
నెట్ లేకుండానే ఫైల్ షేరింగ్.. ప్రముఖ కంపెనీ కొత్త ఫీచర్
మెటా ఆధ్వర్యంలోని వాట్సప్ తన వినియోగదారులకు నెట్ అవసరం లేకుండానే ఫైల్ షేరింగ్ సదుపాయాన్ని కల్పించాలని యోచిస్తోంది. వాట్సప్ ఆఫ్‌లైన్ ఫైల్ షేరింగ్, ఇన్-యాప్ డయలర్‌తో సహా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. ఆఫ్‌లైన్ ఫైల్ షేరింగ్‌కు సంబంధించి ఇప్పటికే బీటా వెర్షన్లో పరీక్షలు నిర్వహిస్తోంది.యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా ప్రస్తుతం వాట్సప్‌లో ఫైల్ షేర్ చేయడం కుదరదు. కానీ కొత్తగా తీసుకురాబోతున్న ఫీచర్‌తో ఇది సాధ్యం అవుతుంది. సమీపంలోని వాట్సప్ యూజర్లతో ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, ఇతర ఫైల్‌లను షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఎంపిక చేసిన బీటా టెస్టర్లకు ఇప్పటికే దీన్ని అందుబాటులో ఉంచారు. ఫైల్ షేరింగ్ సేవలకు అవసరమైన డిస్కవరీ సెర్చ్‌ని ప్రారంభించడానికి వినియోగదారులు వాట్సప్‌లో అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ గూగుల్‌కు చెందిన క్విక్ షేర్, యాపిల్‌లోని ఎయిర్‌డ్రాప్ మాదిరి పనిచేయనుంది. లోకల్ నెట్వర్క్ ద్వారా ఫైల్‌లను పంపవచ్చు. ఇందులో ఫైల్స్ ట్రాన్స్ఫర్ అయ్యేపుడు భద్రత కారణంగా సందేశాల మాదిరిగానే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవుతాయి. ఇన్-యాప్ డయలర్వాట్సప్ ఇన్-యాప్ కాల్ డయలర్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్చేయని నంబర్‌కు నేరుగా వాట్సప్‌కాల్ చేయడం కుదరదు. కానీ కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్‌తో నంబర్ సేవ్‌లో లేకపోయినా నేరుగా వాట్సప్‌లో కాల్ చేసేలా, మెసేజ్ చేసేలా అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఫీచర్‌కు సంబంధించి కంపెనీ చేస్తున్న కార్యకలాపాలు ఏ దశలో ఉన్నాయో స్పష్టంగా తెలియరాలేదు. -
ఇండియాలో డేటా సెంటర్‌ను ప్రారంభించనున్న ప్రముఖ సంస్థ
ఇండియాలో టిక్‌టాక్ వినియోగంలో ఉన్నపుడు దానికి వచ్చిన ఆదరణ అంతాఇంతా కాదు. చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ ఆధీనంలోని షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను మన దేశంలో నిషేధించాక, వినియోగదార్లు ప్రత్యామ్నాయ యాప్‌లపై దృష్టి సారించారు. దీన్ని అవకాశంగా మలుచుకున్న ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా.. తమ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ను తీసుకొచ్చింది. 2020 జులైలో తొలుత భారత్‌లోనే వీటిని పరిచయం చేసింది. భారత్‌లో రీల్స్‌కు వస్తున్న ఆదరణను గమనించిన మెటా, ఈ డేటాను భద్రపరచేందుకు మనదేశంలోనే డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఈ డేటా సెంటర్లలో 10-20 మెగావాట్ల సామర్థ్యం కలిగిని చిన్న కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మెటా అవకాశాలను పరిశీలిస్తోందని తెలిసింది. ఈ డేటా కేంద్రం ఏర్పాటుకు ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టనుంది? ఎక్కడ ఏర్పాటు చేయబోతోంది? వంటి విషయాలు కంపెనీ నిర్వహిస్తున్న అధ్యయనం తర్వాత తెలుస్తుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు పేర్కొన్నాయి. పరిశ్రమ నిపుణుల ప్రకారం, టైర్-4 డేటా కేంద్రం మన దేశంలో ఏర్పాటు చేయాలంటే సుమారు రూ.50-60 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: ప్రతి డిమాండ్‌ను నెరవేర్చలేమన్న మంత్రి -
ఫేస్బుక్, మెసెంజర్, ఇన్‌స్టా యాప్స్‌కు తీవ్ర అంతరాయం
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు ఇతర మెటా యాజమాన్య ప్లాట్‌ఫారమ్ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9 గంటలకు మెటా యాప్స్ సర్వీసుల్లో అంతరాయం గురించి ఫిర్యాదులు వచ్చినట్లు సోషల్ మీడియా నెట్వర్క్ ఔటేజ్ ట్రాకర్ ప్లాట్‌ఫాం డైన్ డిటెక్టర్ వెల్లడించింది. మరోవైన తోటి సోషల్ నెట్వర్క్ సైట్లలో అంతరాయాలను వెక్కిరిస్తూ ఎలోన్మస్క్ స్పందించారు. ‘మీరు(యూజర్లు) ఈ పోస్టును చదువుతున్నారంటే మా సర్వర్లు పక్కాగా పని చేస్తున్నాయని అర్థం’ అంటూ పోస్ట్ చేశారు. If you’re reading this post, it’s because our servers are working — Elon Musk (@elonmusk) March 5, 2024 ఇదీ చదవండి: మరో సంస్థపై ఆంక్షలు విధించిన ఆర్బీఐ మెటా స్పోక్స్‌పర్సన్ ఆండీస్టోన్ స్పందిస్తూ తమ యూజర్లు మెటా యాప్స్ ద్వారా సమస్యను ఎదుర్కొన్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. We're aware people are having trouble accessing our services. We are working on this now. — Andy Stone (@andymstone) March 5, 2024 -
ఆగిపోయిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్
ప్రపంచవ్యాప్తంగా మెటా సేవలు స్తంభించాయి. మెటా నెట్వర్క్ పరిధిలో ఉన్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలకు విఘాతం కలిగింది. దీంతో యూజర్లు అల్లలాడిపోతున్నారు. ఏం జరిగిందో చెప్పాలంటూ.. ఎక్స్ (ట్విటర్) వేదికగా మెటా నెట్‌వర్క్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే మెటా పరిధిలోని వాట్సాప్ సేవలు మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి. సాంకేతికలోపం వల్లే మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) సర్వీసులు నిలిచిపోయి ఉండొచ్చని తెలుస్తోంది. సాంకేతిక సమస్య వల్ల ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల కంటే ఎక్కువ మంది ఫేస్బుక్ యూజర్లు, 47000 కంటే ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మెటా అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సమస్యలను నివేదించడానికి వందలాది యూజర్లు మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్ (ట్విట్టర్) ఉపయోగిస్తున్నారు. ఇందులో మెటా డౌన్ అయిందా, లేదా నేను హ్యాక్ చేయబడుతున్నానా?, నా ఇన్స్టాగ్రామ్ లోడ్ కావడం లేదు, ఫేస్బుక్ & ఇన్స్టాగ్రామ్ ఒక సెకను హ్యాక్ అయిందని అనుకున్నన్నానాని.. కామెంట్స్ చేస్తున్నారు. -
డీప్‌ఫేక్స్‌పై పోరు
న్యూఢిల్లీ: డీప్ ఫేక్స్ వంటి కృత్రిమ మేధ ఆధారిత తప్పుడు సమాచార వ్యాప్తిని కట్టడి చేసేందుకు టెక్ దిగ్గజం మెటా, మిస్ఇన్ఫర్మేషన్ కంబాట్ అలయన్స్ (ఎంసీఏ) జట్టు కట్టాయి. వాస్తవాలను చెక్ చేసేందుకు ఉపయోగపడేలా వాట్సాప్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రవేశపెడుతున్నాయి. ఇది 2024 మార్చి నుంచి అందరికీ అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన చాట్‌బాట్‌కు ప్రజలు డీప్‌ఫేక్‌ల గురించిన సమాచారాన్ని పంపవచ్చు. ఆ మెసేజీలను విశ్లేíÙంచేందుకు ఎంసీఏ ప్రత్యేక యూనిట్‌ను (డీఏయూ) ఏర్పాటు చేస్తుంది. ఈ వాట్సాప్ చాట్‌బాట్ ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అందుబాటులో ఉంటుంది. పరిశ్రమ కూటమి అయిన ఎంసీఏలో 16 సంస్థలకు సభ్యత్వం ఉంది. -
ఎన్నికల వేళ సోషల్ మీడియా షాక్.. మెటా కీలక నిర్ణయం!
ఎన్నికల వేళ రాజకీయ నేతలకు సోషల్ మీడియా దిగ్గజం మెటా ( Meta ) షాకిచ్చింది. పొలిటికల్ కంటెంట్‌ను తమ ఇన్స్టాగ్రామ్ ( Instagram ), థ్రెడ్స్ ప్లాట్‌ఫామ్‌లలో రెకమెండ్ చేయబోమని ప్రకటించింది. అంతేకాకుండా ఫేస్బుక్లో కూడా త్వరలో అవాంఛిత పొలిటికల్ కంటెంట్‌కి కళ్లెం వేస్తామంటోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ ప్లాట్‌ఫామ్‌లలో తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్‌ల వ్యాప్తిని అరికట్టడానికి ఫేస్బుక్ మాతృ సంస్థ ఇప్పటికే కృషి చేస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలతో రూపొందించిన చిత్రాలను గుర్తించడానికి ఇటీవల ప్రయత్నాలను విస్తరించింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ ప్లాట్‌ఫామ్‌లలో పొలిటికల్ కంటెంట్‌ను రెకమెండ్ చేయబోమని ప్రకటిచింది. అయితే రాజకీయ కంటెంట్‌ను ఇష్టపడేవారికి మాత్రం ఇటువంటి ఇబ్బంది ఉండదని మెటా తెలిపింది. అలాంటి కంటెంట్‌ను పోస్ట్ చేసే ఖాతాలను అనుసరించాలకుంటే తాము ఏ మాత్రం అడ్డు రాబోమని స్పష్టం చేసింది. ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ ప్రతి ఒక్కరికీ గొప్ప అనుభూతి కావాలని తాము కోరుకుంటున్నాని, అందుకే ఫాలో కాని అకౌంట్ల నుంచి రాజకీయ కంటెంట్‌ను ముందస్తుగా సిఫార్సు మాత్రం చేయబోమని చెప్పింది. ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ యాప్‌లలో రాజకీయ కంటెంట్ సిఫార్సులను చూడాలా వద్దా అన్నది పూర్తిగా యూజర్ల ఇష్టం. ఈ మేరకు ఎంపిక చేసుకోవడానికి అనుమతించే సెట్టింగ్‌లను మెటా తీసుకురాబోతోంది. ఇదే విధమైన నియంత్రణ రాబోయే రోజుల్లో ఫేస్బుక్లో అమలు కానుంది. "రాజకీయ కంటెంట్ కావాలా వద్దా అన్న ఎంపిక యూజర్లకు కల్పించడమే మా లక్ష్యం. అదే సమయంలో ప్రతి ఒక్కరి ఆసక్తిని గౌరవించాల్సిన అవసరం ఉంది" అని ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి థ్రెడ్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. రాజకీయ నాయకుల సోషల్ మీడియా బలమైన వేదికగా ఉంది. తమ భావాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రధాన మీడియా కంటే సోషల్ మీడియానే అనువుగా మారింది. వీటిలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటివి ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఇకపై ఆయా ప్లాట్‌ఫామ్‌లలో పొలిటికల్ కంటెంట్ అవాంఛితంగా అందిరికీ చేరదు. పొలిటికల్ అకౌంట్లు, పేజీలు ఫాలో అవుతున్నవారికి మాత్రమే ఆ కంటెంట్ చేరుతుంది. సార్వత్రిక ఎన్నికల వేళ మెటా తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ నాయకులకు గట్టి ఎదురుదెబ్బనే చెప్పాలి. -
మా సీఈవో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాడు.. ఆందోళన చెందుతున్న కంపెనీ
నేటి ఆధునిక ప్రపంచంలో టెక్ దిగ్గజాల ప్రతి కదలికను మార్కెట్లు నిశితంగా గమనిస్తుంటాయి. ప్రముఖ టెక్నాలజీ కంపెనీ మెటా.. తమ సీఈవో గురించి తెగ ఆందోళన పడిపోతోంది. హై రిస్క్ పనులతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాడని, దీని ప్రభావం కంపెనీ భవిష్యత్తుపై పడుతుందని బెంగపడుతోంది. మెటా తమ తాజా ఆర్థిక నివేదికలో కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు పొంచిఉన్న ముప్పును వెల్లడించింది. జుకర్‌బర్గ్ అలవాట్లు, జీవనశైలితో మెటా స్పష్టంగా సంతోషంగా లేన్నట్లు కనిపిస్తోంది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ , హానికరమైన క్రీడలతో జుకర్‌బర్గ్ థ్రిల్ కోరుకుంటున్నారని, ఇది కేవలం ఆయన వ్యక్తిగతంగానే కాకుండా కంపెనీకి, అందులో పెట్టుబడివారికి కూడా ప్రమాదాన్ని కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. "జుకర్‌బర్గ్‌తోపాటు మేనేజ్మెంట్లోని కొంతమంది తీవ్రమైన గాయాలు, ప్రాణాల మీదకు తెచ్చే క్రీడలు, ఇతర హై రిస్క్ కార్యకలాపాలలో పాల్గొంటున్నారు. జుకర్‌బర్గ్ ఏ కారణం చేతనైనా అందుబాటులో లేకుంటే మా కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం ఉండవచ్చు" అని మెటా తన వార్షిక నివేదికలో పేర్కొంది. మస్క్‌తో కేజ్ ఫైట్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, ఇతర హానికరమైన క్రీడల పట్ల జుకర్‌బర్గ్‌కు ఉన్న మక్కువ తెలిసిందే. గత నవంబర్‌లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కోసం శిక్షణ తీసుకుంటున్న సమయంలో మోకాలికి గాయం కావడంతో ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలిసిందే. టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో కేజ్ ఫైట్‌కి సిద్ధమైనప్పుడు జుకర్‌బర్గ్ సాహసాలు మరోసారి ముఖ్యాంశాలుగా మారాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై గొడవలకు పేరుగాంచిన ఇద్దరు బిలియనీర్లు తమ విభేదాలను పరిష్కరించడానికి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మ్యాచ్‌ని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఒకరినొకరు వెనక్కు తగ్గినట్లు ఆరోపణలు చేయడంతో ఆ ఫైట్ రద్దయింది. "హై రిస్క్ = హై రివార్డ్" ఈ కొత్త రిస్క్‌ల గురించి చర్చలకు ప్రతిస్పందనగా, జుకర్‌బర్గ్ "హై రిస్క్ = హై రివార్డ్" అనే సందేశంతో థ్రెడ్స్‌లో జిఫ్ పోస్ట్ చేశారు. జుకర్‌బర్గ్ డేర్‌డెవిల్ సాహసాలతో ప్రమాదాలు ఉన్నప్పటికీ, మెటా శుక్రవారం తన షేర్లలో గణనీయమైన వృద్ధిని సాధించింది. కంపెనీ నాల్గవ త్రైమాసిక లాభాలలో మూడు రెట్లు పెరిగినట్లు నివేదించింది. దానితో పాటు దాని మొట్టమొదటి డివిడెండ్ ప్రకటించింది. -
గూగుల్‌లో శాలరీ తక్కువ.. ‘జాబ్ కంటే జీతం ముఖ్యం!’ మరి మీకు?
మీకు జీతం ముఖ్యమా? శాలరీ ముఖ్యమా? అంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జాబ్ కంటే తీసుకునే జీతం ఎంత ఎక్కువైతే మంచిదనే అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తుంటారు మనలో చాలా మంది. అందుకు మెటాలాంటి దిగ్గజ కంపెనీల్లో పనిచేస్తూ వందల కోట్లలో వేతనం తీసుకుంటున్న ఉద్యోగులు అతీతులేం కాదు. గతంలో వాళ్లు కూడా జీతం తక్కువైందని పేరున్న కంపెనీలు పిలిచి ఉద్యోగం ఇస్తాంటే సున్నితంగా తిరస్కరిస్తున్న సందర్భాలున్నాయి. మరి మీరూ? ట్యూరింగ్ అవార్డ్‌ను సొంతం చేసుకుని మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైంటిస్ట్ యాన్ లెకున్. ఏఐలో రంగంలో చేసిన పరిశోధనలకు గాను నోబెల్ పురస్కారంతో సమానమైన ట్యూరింగ్ అవార్డును సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టీవ్‌గా ఉండే యాన్ లెకున్ తాజాగా ఎక్స్.కామ్‌లో తనకు గూగుల్ జాబ్ ఆఫర్ ఇస్తే దాన్ని ఎందుకు వదులుకున్నారో తెలిపారు. అనేక కారణాల వల్ల 2002లో గూగుల్‌లో రీసెర్చ్ డైరెక్టర్ జాబ్ ఆఫర్‌ను తిరస్కరించినట్లు వెల్లడించారు. వాటిల్లో ప్రధానంగా జీతం తక్కువ కావడమేనని అన్నారు. జాబ్ కన్నా.. జీతం ముఖ్యం ‘‘జీతం తక్కువగా ఉంది. స్టాక్ ఆప్షన్ ఎక్కువే. కానీ నాకు కాలేజీ చదవాల్సిన టీనేజ్ కుమారులున్నారు. డబ్బులు అవసరం. న్యూజెర్సీలో కంటే సిలికాన్ వ్యాలీలో నివాసం ఖరీదైన వ్యవహారం’’ అని అన్నారు. గూగుల్ ఆఫర్ తిరస్కరణ ‘‘ఆ సమయంలో గూగుల్‌కి 600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నాయి. ఆదాయం లేదు. ఆ సమయంలో గూగుల్‌లో 600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కానీ ఆదాయం అంతంత మాత్రమే. అలాంటి సమయాల్లో గూగుల్‌లో చేరి కార్పొరేట్ వ్యూహం, సాంకేతికత అభివృద్ధి, ఉత్పత్తులు, నిర్వహణ మొదలైన వాటి మెషిన్ లెర్నింగ్, విజన్, రోబోటిక్స్ అండ్ కంప్యూటేషనల్ న్యూరోసైన్స్ విభాగాల్లో రీసెర్చ్ చేయాలంటే చాలా కష్టం. కాబట్టే గూగుల్ ఆఫర్‌ను తిరస్కరించా’’నని యాన్ లెకున్ అన్నారు. -
Parliament security breach: వారి ‘ఫేస్బుక్’ వివరాలివ్వండి
న్యూఢిల్లీ: లోక్‌సభలో పొగబెట్టిన ఉదంతంలో అరెస్టయిన నిందితుల ‘ఫేస్బుక్’ ఖాతాల వివరాలు ఇవ్వాలని ‘మెటా’ సంస్థను ఢిల్లీ పోలీసులు కోరారు. నిందితులు సభ్యులుగా ఉన్న, ప్రస్తుతం మనుగడలో లేని ‘భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్’ ఫేస్బుక్ పేజీ వివరాలను అందించాలని ‘మెటా’కు ఢిల్లీ పోలీస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం లేఖ రాసిందని సంబంధితవర్గాలు వెల్లడించాయి. ఈ ఫేస్బుక్ పేజీని నిందితులే క్రియేట్ చేసి ఘటన తర్వాత డిలీట్ చేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లకు ‘మెటా’ మాతృసంస్థ. ఈ నేపథ్యంలో నిందితుల మధ్య జరిగిన వాట్సాప్ ఛాటింగ్లనూ తమకు ఇవ్వాలని పోలీసులు ‘మెటా’ను కోరారు. -
త్వరలోనే డిలీట్.. మెటా,ఇన్స్టాగ్రామ్ యూజర్లకు అలెర్ట్!
ఫేస్బుక్ (మెటా) సరిగ్గా మూడేళ్ల క్రితం చాట్ ఇంటిగ్రేషన్ అని ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఆ ఫీచర్ సాయంతో యూజర్లు ఫేస్బుక్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లోని వారి స్నేహితులతో మాట్లాడుకోవడం, వీడియో కాల్స్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇందుకోసం మెటాలో సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది. అయితే తాజాగా, ఆ ఫీచర్‌ను డిసెంబర్ నెలలో డిలీట్ చేస్తున్నట్లు మెటా ప్రకటించింది. మరి ఆఫీచర్ను ఎందుకు తొలగిస్తున్నారనే అంశంపై మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ స్పష్టత ఇవ్వలేదు. కానీ, ఇటీవల యురేపియన్ యూనియన్‌కి చెందిన ప్రభుత్వ సంస్థ యూరోపియన్ కమిషన్ ‘యూరప్ డిజిటల్ మార్కెట్ యాక్ట్ (డీఎంఏ)’ లో కొన్ని మార్పులు చేసింది. వాటికి అనుగుణంగా ఆయా టెక్నాలజీ సంస్థలు మెసేజింగ్ ఫ్లాట్‌ఫామ్‌ల మధ్య క్రాస్ చాటింగ్ సదుపాయం ఉండేలా చూడాలని కోరింది. ఈ సమయంలో మెటా ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. క్రాస్ చాటింగ్ సాదుపాయం లేకపోతే ‘క్రాస్ చాటింగ్ ఫీచర్‌ను తొలిగిస్తే యూజర్ల మధ్య మెసేజ్ పంపుకునే అవకాశాన్ని కోల్పోవడంతో పాటు వీడియో కాల్స్ చేసుకునే వీలుండదు’ అని మెటా తెలిపింది. ఇప్పటికే యూజర్ల మధ్య జరిగిన చాటింగ్‌లు రీడ్-ఓన్లీ మెసేజ్లుగా మారిపోనున్నాయి. అంతేకాదు క్రాస్ చాటింగ్‌కు సంబంధం ఉన్న మెటా అకౌంట్స్‌ను తొలగిస్తామని వెల్లడించింది. ఒకవేళ యూజర్లు చాటింగ్ చేసుకోవాలంటే మెటా అకౌంట్స్ లేదా మెసేంజర్ నుంచి చాటింగ్ చేసుకోవచ్చని పేర్కొంది. -
కీలక నిర్ణయం.. వందల కోట్ల విలువైన మెటా షేర్లు అమ్మిన మార్క్ జూకర్ బర్గ్!
సోషల్ మీడియా దిగ్గజం మెటాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ సంస్థ అధినేత మార్క్ జుకర్ బర్గ్ వందల కోట్లలో విలువైన కంపెనీ షేర్లను ఒకే రోజు రెండు సార్లు అమ్ముకున్నారని తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. దాదాపూ రెండేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత నవంబర్ నెల ముగిసే సమయానికి మెటా షేర్ల విలువ 172 శాతం పెరిగింది. అయితే అదే రోజు కంపెనీ షేర్లను అమ్ముకునేందుకు అనుమతి కోరుతూ జుకర్ బర్గ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ కమిషన్ ఫారమ్ 4కు అప్లయ్ చేసుకున్నారు. అనంతరం తొలిసారి 560,180 షేర్లు, కొద్ది సేపటి తర్వాత అదనంగా 28,009 షేర్లను అమ్ముతూ 144 ఫారమ్ అప్లయ్ చేసుకున్నట్లు సెక్యూరిటీ ఎక్ఛేంజ్ ఫైలింగ్ తేలింది. ఆ మొత్తం షేర్ల విలువ రూ.1,600 కోట్లు. మార్క్ జూకర్ బర్గ్ సంస్థ షేర్లు అమ్ముకున్నారన్న నివేదికలతో యూఎస్ మార్కెట్లు ముగిసే సమయానికి మెటా షేర ధర 320.02 డాలర్ల వద్ద ముగిసింది. ఇక కంపెనీలో షేర్లు అమ్మగా సేకరించిన నిధుల్ని ఆయన ఎందుకు వినియోగిస్తారనే అంశంపై స్పష్టత లేదు. మెటా.. తీవ్ర వాద సంస్థ : రష్యా ఈ అక్టోబరులో రష్యా అధికారిక వర్గాలు మెటాను ఓ తీవ్రవాద సంస్థగా పేర్కొనడం, తల్లిదండ్రుల అనుమతి లేకుండా 2019 నుంచి 13 ఏళ్ల కంటే తక్కువ వయసున్న లక్షల మంది ఇన్స్టాగ్రామ్ యూజర్ల సమాచారాన్ని తీసుకుందని ఆరోపిస్తూ 33 రాష్ట్రాలు పలు న్యాయ స్థానాల్ని ఆశ్రయించడం వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం మెటా షేర్లు ఈ ఏడాదిలో వరుసగా పాజిటీవ్‌గా ట్రేడయ్యాయి. దీంతో నవంబర్ 22న మెటా షేర్ విలువ గరిష్టా స్థాయికి 341.49 డాలర్లకు చేరుకోగా.. చివరి సారిగా అదే షేర్ విలువ డిసెంబరు 30, 2021 నుంచి తగ్గుతూ వస్తుంది. -
పిల్లల వ్యక్తిగత డేటాను తస్కరించిన ‘మెటా’
శాన్ఫ్రాన్సిస్కో: సోషల్ మీడియా వేదికలైన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృసంస్థ ‘మెటా’పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 13 ఏళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని మెటా సేకరించిందని, ఎక్కువ సమయం తమ సామాజిక మాధ్యమాల వేదికల్లోనే వారు గడిపేలా ఒక బిజినెస్ మోడల్‌ను రూపొందించిందని అమెరికాలోని పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. పిల్లల డేటాను తస్కరించేలా ఉద్దేశపూర్వకంగానే తమ సోషల్ మీడియా వేదికల్లో మెటా మార్పులు చేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెటా సంస్థ నిర్వాకంపై గత నెలలో 33 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టులో దావా వేశారు. ఈ సంగతి తాజాగా బయటకు వచి్చంది. యుక్త వయసులో ఉన్నవారిని సోషల్ మీడియా సైట్లవైపు ఆకర్శించడానికి, ప్రలోభాలకు గురిచేయడానికి మెటా ప్రయతి్నస్తోందని వారు ఆరోపించారు. 13 ఏళ్ల కంటే తక్కువ వయసున్న లక్షల మంది యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని వారి తల్లిదండ్రుల అనుమతి లేకుండానే ఇన్స్టాగ్రామ్ సేకరించిందని, ఇలా చేయడం చట్టవిరుద్ధమేనని తమ దావాలో పేర్కొన్నారు. చిన్నారుల గోప్యతను కాపాడడానికి ఉద్దేశించిన చట్టాలను మెటా పాటించలేదని ఆరోపించాయి. తమపై వచి్చన ఆరోపణలపై మెటా యాజమాన్యం స్పందించింది. 13 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు సోషల్ మీడియా వేదికల్లో ఖాతాలు తెరవడానికి అనుమతి లేదని వెల్లడించింది. ఒకవేళ అలాంటి ఖాతాలు ఉంటే తొలగిస్తామని ప్రకటించింది. సోషల్ మీడియా వేదికలు యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్నాయని ఏళ్లుగా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజా వార్తలతో వాటికి మరింత బలం సమకూరిందని అభిప్రాయపడుతున్నారు. -
వారెవ్వా! వాట్సప్‌లో ఇకపై అన్నీ ఇన్‌స్టంట్‌గానే..
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్లకు శుభవార్త చెప్పింది. వాట్సప్‌లో మరో ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉండగా.. మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశం కలగనుంది. గతంలో మీ వాట్సప్ నెంబర్ నుంచి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఓ మెసేజ్ పంపి ఉంటారు. అత్యవసరంగా ఆ మెసెజ్ ఇప్పుడు కావాలి. వెతకాలంటే సమయం పడుతుంది. మరి ఇప్పుడు దానిని సెకన్లలో గుర్తించడం ఎలా? దీనికే వాట్సప్ మాతృ సంస్థ మెటా పరిష్కారం కనిపెట్టింది. ఇందుకోసం వాట్సప్ వెబ్‌లో ‘సెర్చ్ బై డేట్’ ఫీచర్‌పై పనిచేస్తుంది. దీని సాయంతో వాట్సప్‌లో వీడియోలు, టెక్ట్స్ ఇతర ఆడియో ఫైల్స్‌ని మీరు ఎప్పుడు, ఎవరికి ఏం పంపారో ఈజీగా తెలుస్తుంది. అవతలి వారు మీకు పంపిన మెసేజ్‌లను సైతం గుర్తించవచ్చు. ఫీచర్ ట్రాకర్ నివేదిక ప్రకారం.. వాట్సప్ వెబ్ కోసం కొత్త సెర్చ్ బై డేట్ ఫీచర్‌తో యూజర్లు పంపిన మెసేజ్‌లను లేదంటే రిసీవ్ చేసుకున్న వాటిని సులభంగా చూసేందుకు పైన ఇమేజ్‌లో పేర్కొన్నట్లుగా క్యాలెండర్‌ను ఓపెన్ చేసింది. అందులో తారీఖు, సంవత్సరం, నెలను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం మీ ఎంచుకున్న తేదీని బట్టి మీ వాట్సప్ డేటా డిస్ప్లే అవుతుంది. అయితే, ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలంటే మరికొన్ని ఆగాల్సిందే. -
హాస్పిటల్ బెడ్‌పై జుకర్‌బర్గ్ - ఇన్‌స్టా పోస్ట్ వైరల్
మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'మార్క్ జుకర్‌బర్గ్' (Mark Zuckerberg) మోకాలికి గాయం కావడంతో ఇటీవల ఆపరేషన్ చేయించుకున్నారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సమయంలో మోకాలికి తీవ్రమైన గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు అతని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసారు. మార్క్ జుకర్‌బర్గ్ పోస్ట్ ప్రకారం, ఏఎల్సీ (Anterior Cruciate Ligament) తొలగించి రీప్లేస్ చేయించుకోవడానికి ఆపరేషన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. హాస్పిటల్‌లోని వైద్య సిబ్బంది తనను జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. ఇదీ చదవండి: భవిష్యత్తు వీటిదే అంటున్న నితిన్ గడ్కరీ - వైరల్ వీడియో వచ్చే ఏడాది మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ పోటీలో పాల్గొనటానికి ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, దీని వల్ల శిక్షణకు ఇంకా కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి ఉందని, కోలుకున్న తరువాత మళ్ళీ శిక్షణ ప్రారంభిస్తానని జుకర్‌బర్గ్ వెల్లడించారు. నాపైన ప్రేమ చూపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ఇన్స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) -
ఇన్‌స్టాలో అదిరిపోయే ఏఐ ఫీచర్..అదెలా పనిచేస్తుందంటే?
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా యూజర్లకు శుభవార్త చెప్పనుంది. అన్ని వేళల్లో పర్సనల్ అసిస్టెంట్ అందుబాటులో ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి..ఆ ఊహలను నిజం చేస్తూ ఇన్స్టాగ్రాం తన యూజర్లకు పర్సనలైజ్డ్ ఏఐ చాట్‌బాట్‌ను క్రియేట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఏఐ ఫ్రెండ్’ అనే చాట్‌బాట్‌పై పనిచేస్తుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తద్వారా యూజర్లు ఎవరికి వారే ఏఐ చాట్‌బాట్‌ను ప్రత్యేకంగా తయారు చేసుకునే వెసలు బాటు కలగనుంది. టెక్‌క్రంచ్ ప్రకారం ఇన్ స్టా పరిచయం చేయనున్న ఈ ఫీచర్ సాయంతో యూజర్లు వారి వారి అభిప్రాయాల గురించి చర్చించుకోవచ్చు. రకరకాల ఐడియాలను ఈ చాట్‌బాట్ ద్వారా పొందవచ్చు. ఉదాహరణకు ఫుడ్, ఫ్యాషన్, టెక్నాలజీ, బిజినెస్ ఎంటర్టైన్మెంట్ రంగాలకు ఏమైనా ఈవెంట్లు జరుగుతుంటే..వాటికి మీరు ఎలాంటి దుస్తులు ధరించాలి. ఆ ఈవెంట్లో ఎలా ఉండాలి’ ఇలా అనేక విషయాల గురించి చాట్‌బాట్‌ను అడిగి తెలుసుకోవచ్చు. కాగా, పర్సనలైజ్డ్ ఏఐ చాట్‌బాట్స్ ఫీచర్‌తో ఇన్స్టాగ్రాం సంచలనానికి కేంద్ర బిందువు కానుందని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
వాట్సాప్ యూజర్లకు షాక్! 71.1 లక్షల అకౌంట్లపై నిషేధం
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (WhatsApp) గత సెప్టెంబర్ నెలలో భారత్‌కు చెందిన 71.1 లక్షల వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసింది. ఈ ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ విడుదల చేసిన తాజా ఇండియా నెలవారీ నివేదిక ప్రకారం.. వాట్సాప్ సెప్టెంబర్‌లో ఐటీ నిబంధనలకు అనుగుణంగా 71.1 లక్షల ఖాతాలను నిషేధించింది. 2023 సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీల మధ్య 71,11,000 ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ పేర్కొంది. వీటిలో 25,71,000 అకౌంట్లను వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రాకముందే ముందస్తుగా బ్యాన్ చేసినట్లు వివరించింది. ఇదీ చదవండి: బిగ్ డీల్స్: రూ.15 వేల కంటే తక్కువకే బెస్ట్ 5జీ ఫోన్లు! వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వాటిపై వాట్సాప్ తీసుకున్న సంబంధిత చర్యలు, అలాగే ప్లాట్ఫామ్లో దుర్వినియోగాన్ని అరికట్టడానికి వాట్సాప్ చేపట్టిన సొంత నివారణ చర్యలు తదితర వివరాలు ‘యూజర్ సేఫ్టీ రిపోర్ట్’లో ఉన్నాయి. ఈ రిపోర్ట్ ప్రకారం.. సెప్టెంబర్ 1 నుంచి 30 మధ్య గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ నుంచి వాట్సాప్‌కు ఆరు ఆర్డర్లు రాగా అన్నింటినీ పరిష్కరించింది. కాగా వాట్సాప్ గత ఆగస్టులో 74 లక్షల ఖాతాలను నిషేధించింది. వీటిలో 35 లక్షల ఖాతాలను ముందస్తుగా బ్యాన్ చేసింది. -
వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అగంతకుల నుంచి వచ్చే కాల్స్ నుంచి యూజర్లను కాపాడేలా ఐపీ అడ్రస్‌ను ఈ ఫీచర్ సురక్షితంగా ఉంచనుంది. వాట్సాప్‌కు సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అందించే వాబీటా ఇన్ఫో ఈ ఫీచర్‌ను గుర్తించింది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్ ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. వాట్సప్‌లో ఎబుల్, డిసేబుల్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవడం ద్వారా యూజర్ల ఐపీ అడ్రస్‌లకు రక్షణ కవచంలా ఉంటుంది. నివేదిక ప్రకారం.. యూజర్లు వాట్సప్‌లో వాయిస్స్ కాల్స్, వీడియో కాల్స్ చేసే సమయంలో సురక్షితంగా ఉండేలా ప్రైవసీ సెట్టింగ్ స్క్రీన్‌లో అడ్వాన్డ్స్ అనే సెక్షన్లో ‘ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్’ ఎనేబుల్ చేసుకోవాలి. తద్వారా, ఇతరులు మీరు కాల్స్ మాట్లాడే సమయంలో మీరు ఎక్కడ నుంచి ఫోన్ మాట్లాడుతున్నారు. ఐపీ అడ్రస్ ఏంటనేది తెలుసుకునే అవకాశం ఉండదు. ఫిల్టరింగ్ ఫర్ చానెల్ ఛానెల్ అప్డేట్ల కోసం రియాక్షన్లను ఫిల్టర్ చేసేలా వాట్సప్ మరో ఫీచర్‌ను విడుదల చేయనుంది. కాంటాక్ట్‌లలో ఎవరైనా ఎమోజీని ఉపయోగించి కంటెంట్‌కి ప్రతిస్పందించినట్లయితే వెంటనే గుర్తించడానికి ఛానెల్ యజమానులకు ఇది సహాయపడుతుంది. ఈ ఫీచర్ ఇప్పుడు కొంతమంది బీటా టెస్టర్లకు అందుబాటులో ఉందని వాబీటా నివేదించింది. -
రూ.6.5 కోట్ల జాబ్ వదులుకున్న మెటా ఉద్యోగి - రీజన్ తెలిస్తే..
ఎవరైనా ఎక్కువ శాలరీ వచ్చే జాబ్.. లేదా ప్రసిద్ధి చెందిన కంపెనీలో ఉద్యోగం చేయాలనుకుంటారు. ఫేస్బుక్లో జాబ్ సంపాదించి రూ.6.5 కోట్ల వేతనం తీసుకునే ఒక టెకీ ఉద్యోగం వదిలి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇంతకీ అతడెవరు, ఉద్యోగం వదిలేయడానికి కారణం ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మెటాలో టెక్ లీడ్ అండ్ మేనేజర్‌గా ఐదేళ్లపాటు పనిచేసిన 'రాహుల్ పాండే' 2022లో తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. అప్పటికి అతని శాలరీ రూ. 6.5 కోట్లు కంటే ఎక్కువ. జాబ్ వదిలేసిన తరువాత ఫేస్బుక్లో పనిచేసిన అనుభవం గురించి వివరిస్తూ లింక్డ్ఇన్ పోస్ట్ చేసాడు. ఫేస్బుక్లో చేరిన ప్రారంభంలో సీనియర్ ఇంజనీర్‌గా ఎంతో ఆత్రుతగా పనిచేసాని, కంపెనీ స్టాక్ పడిపోవడంతో నైతికతకు దెబ్బ తగిలిందని, అర్హత లేని వ్యక్తిగా చేసిందని, దీంతో పనితీరును మరింత మెరుగుపరచుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేసి రెండు సంవత్సరాల్లో మంచి స్థాయికి చేరుకున్నానని వెల్లడించాడు. ఇదీ చదవండి: సరికొత్త అధ్యాయానికి నాంది.. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకం! మెటాను మించిన ప్రపంచం కోసం.. ఫేస్బుక్లో నా చివరి సంవత్సరం మేనేజర్ బాధ్యతలు స్వీకరించి.. అదే సంస్థలో మంచి పురోగతి పొందాను. 2021 తరువాత మెటాను మించిన ప్రపంచాన్ని అన్వేషించడం ప్రారంభించాను. దాదాపు పదేళ్లపాటు టెక్‌లో పనిచేసిన తర్వాత, కొంతవరకు ఆర్థిక స్వేచ్ఛను సాధించాను, ఇంజినీరింగ్‌కు మించి ఇంకా ఎంత నేర్చుకోవాలో పూర్తిగా గ్రహించానని వెల్లడించాడు. -
మాజీ మహిళా ఉద్యోగి దెబ్బ, కదులుతున్న లక్షల కోట్ల విలువైన కంపెనీ పునాదులు?
ఒక్క మహిళా ఉద్యోగి. 8.48 నిమిషాల నిడివి గల వీడియో. వందల కొద్దీ డాక్యుమెంట్లు.వెరసీ ప్రపంచంలో అత్యంత విలువైన సోషల్ మీడియా కంపెనీ మెటా పునాదులు ఒక్కొక్కటిగా కదులుతున్నాయా? 2021లో మెటా (అప్పడు ఫేస్బుక్)లోని అక్రమాల్ని బయటపెట్టింది తానేనంటూ వెలుగులోకి వచ్చిన ఓ వీడియోతో గంటల వ్యవధిలో ఆ సంస్థ రూ.50 వేల కోట్లు నష్టపోయింది. ప్రారంభంలో మహిళ చేసిన ఆరోపణల్ని సీఈవో జూకర్ బెర్గ్ సైతం ఇదంతా 'టీ కప్పులో తుఫాను' అని అనుకున్నారు. కానీ మెటాను ముంచే విధ్వంసానికి దారితీస్తుందనుకోలేదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. తాజాగా, ఆ వీడియో తాలుకు ప్రభావం మరోసారి మెటాపై పడింది. మెటా, ఆ సంస్థకు చెందిన ప్రముఖ ఫొటో/వీడియో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌కు భారీ షాక్ తగిలింది. 41 రాష్ట్రాలకు చెందిన పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు యువతను వ్యసనపరులుగా మార్చడం ద్వారా వారిలో మానసిక రుగ్మతలు పెరిగేలా ఆజ్యం పోస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఫిర్యాదుల వెల్లువ మెటా, ఇన్‌స్టాగ్రామ్‌పై ఓక్లాండ్, కాలిఫోర్నియా, ఫెడరల్ కోర్టులో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా కాలిఫోర్నియా, న్యూయార్క్‌తో పాటు మరో 33 రాష్ట్రాల పిటిషనర్లు.. ఈ రెండు ఫ్లాట్‌ఫామ్‌లు తప్పుడు ప్రచారాలు చేస్తూ పదే పదే తప్పుదారి పట్టిస్తున్నాయని.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ప్రలోభపెట్టి.. ఆన్లైన్లో గంటల కొద్ది గడిపేలా శక్తివంతమైన టెక్నాలజీని మెటా ఉపయోగించుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా ఆదాయాన్ని గడించి లాభపడుతుందని అన్నారు. యూజర్ల కన్నా.. డబ్బులే ముఖ్యం ఓ వైపు అడ్వటైజర్లు చేజారిపోకుండా యువతను కట్టిపడేయడంలో మెటా వ్యూహాత్మకంగా ఎలా వ్యాపారం చేస్తుందో వారు వివరించారు. ముఖ్యంగా, పలు అంతర్జాతీయ సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకాలు జరిగేలా చిన్న వయస్సు వారినే తమ వ్యాపారానికి అనువుగా మార్చుకుంటున్నాయి. ఇలా చేయడం వల్ల పిల్లలు యుక్తవయస్సు వచ్చే వరకు తమ సంస్థ బ్రాండ్లను వినియోగించుకుంటారనే ఉద్దేశ్యంతో ఈ తరహా వ్యాపార వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వారికి లాభం చేకూరేలా మెటా,ఇన్‌స్టాగ్రామ్‌లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తద్వారా ఆదాయాన్ని పొందుతున్నాయి’ అని కోర్టు దావాలో తెలిపారు. పిల్లల్ని నాశనం చేస్తున్నాయ్ అంతేకాదు, ‘నిరాశ, ఆందోళన, నిద్రలేమి, విద్య, రోజువారీ జీవితంలో జోక్యం, అనేక ఇతర ప్రతికూల ఫలితాలు పిల్లల జీవితాల్ని నాశనం చేస్తున్నాయని పిటిషన్లు కోర్టు మెట్లెక్కారు. దీంతో మెటాపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వివిధ రాష్ట్ర చట్టాలను ఉల్లంఘించినందుకు మెటా 1,000 వెయ్యి నుంచి 50,000 డాలర్ల వరకు సివిల్ పెనాల్టీలను ఎదుర్కొంటుంది. కేసు తీవ్రతను బట్టి భారీ మొత్తంలో మెటా చెల్లించాల్సి ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ మొత్తాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించే మిలియన్ల మంది పిల్లలు, యవకులకు చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రాన్సెస్ హౌగెన్ దెబ్బే ఇలా మెటా వరుస ఇబ్బందులు ఎదుర్కొవటానికి ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ కారణం. ఆమె గతంలో ఫేస్బుక్లో తప్పుడు సమాచారం నిరోధించే విభాగంలో మేనేజర్‌గా పని చేశారు. 2021లో ఫ్రాన్సెస్ హౌగెన్ మెటా తీరును తప్పుబట్టారు. ప్రజల భద్రత కంటే లాభాలే ఫేస్‌బుక్‌కు ముఖ్యమని..ద్వేషాన్నిరెచ్చగొట్టే తప్పుడు సమాచారాన్ని ఎంతగా వ్యాప్తి చెందిస్తున్నదీ కంపెనీ సొంత పరిశోధన కూడా చెబుతోందంటూ కొన్ని డాక్యుమెంట్లను విడుదల చేశారు. ఇద్దరు టీనేజర్ల అభిప్రాయాలు ఆ డాక్యుమెంట్లలో వీడియోలు కూడా ఉన్నాయి. వీడియోల్లో ఇద్దరు టీనేజర్లు మెటాకి చెందిన సోషల్ సైట్లపై తమ అభిప్రాయాల్ని వివరించారు. ‘‘14ఏళ్ల ఎలీనార్, ఫ్రేయా’లు ఇద్దరూ తమ వయస్సు వారిలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారు. ఓ టీనేజర్‌గా మేం ఇందులో మోడల్స్‌ను ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను చూస్తుంటాం. వాళ్లందరూ స్కిన్నీగా పర్ఫెక్ట్ బాడీతో ఉంటారు. వాళ్లని చూసినప్పుడు అనుకోకుండానే వాళ్లతో మనల్ని పోల్చి చూసుకుంటాం. ఇదే అన్నింటికన్నా ప్రమాదకరమైందని నాకు అనిపిస్తుంది. ‘‘మనసుకు ఏదీ తోచనప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళుతుంటాం. అందులో చాలా వరకు మనల్ని టార్గెట్ చేసేవే మనకి కనిపిస్తుంటాయి. అంటే ఉదాహరణకు మోడల్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను సెలబ్రిటీస్ మనకి కనిపిస్తుంటారు. అప్పుడనప్పిస్తుంది. ఓహ్! ‘అలా మనం ఎప్పటికీ అవ్వలేమని’ ఫ్రేయా అన్నారు. ఎలీనార్, ఫ్రేయాల ఆందోళనని షేర్ చేసింది.మానసిక ఆరోగ్య సమస్యలపై బాధపడుతున్న టీనేజర్ల పరిస్థితిని ఇన్ స్టాగ్రామ్ మరింత దారుణంగా చేస్తుందని లీకైన ఫేస్బుక్ అంతర్గత పత్రాల్లో ఉంది. ఈ డాక్యుమెంట్స్‌ను ఫ్రాన్సెస్ హౌగెన్ లీక్ చేసింది. లీకైన కొద్ది సేపటికే రూ.50 వేల కోట్లు నష్టం ఇలా లీకైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో అంతరాయం ఏర్పడడంతో ఫేస్‌బుక్‌కు 7 బిలియన్ డాలర్లు అంటే సుమారు మన కరెన్సీలో రూ.50 వేల కోట్లకు పైగానే నష్టం వాటిల్లింది. ఈ ప్రభావం ఫేస్బుక్ స్థాపించినప్పటి నుంచి సర్వీసులు నిలిచిపోవడం, ఈ రేంజ్లో డ్యామేజీ జరగడం ఇదే మొదటి సారి. అంతేకాదు ఈ అంతరాయంతో అపరకుబేరుల జాబితా నుంచి మార్క్ జూకర్ బర్గ్ స్థానం కిందకి దిగజారింది. ఇది అప్పట్లో సంచలనంగా మారింది. కోలుకోలేని నష్టం నాటి నుంచి మెటా ఊహించని విధంగా నష్టపోతూ వస్తుంది. లీకైన పత్రాల వల్ల కొన్ని గంటల వ్యవధిలో వేల కోట్ల నష్టంతో పాటు, సంస్థ పేరును మార్చడంతో పాటు అన్నీ రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. అయితే తాజాగా, 41 రాష్ట్రాల్లో మెటాపై దాఖలైన వాజ్యం ఆ సంస్థ ఇంకెన్ని ఇబ్బందులు ఎదుర్కొనుందో చూడాల్సి ఉంది. చదవండి👉సంచలన నిర్ణయం.. భారత్‌కు గుడ్‌బై చెప్పిన రెండు దిగ్గజ కంపెనీలు -
సాఫ్ట్వేర్ జాబ్.. రూ.3 కోట్లు వేతనం - అయినా వదిలేశాడు! కారణం తెలిస్తే..
ఆధునిక కాలంలో చాలామంది గూగుల్, మెటా వంటి బడా కంపెనీలలో ఉద్యోగం చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే ఒక ఉద్యోగి మాత్రం కొన్ని కారణాల వల్ల కోట్లు వేతనం వచ్చే మెటా సంస్థలో ఉద్యోగాన్ని వదిలేసినట్లు సమాచారం. దీనికి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాలో ఏడాదికి రూ. 3 కోట్లు వేతనాన్ని పొందే 28 సంవత్సరాల సాఫ్ట్వేర్ ఉద్యోగి 'ఎరిక్ యు' (Eric You) వర్క్ తరువాత కూడా అదే ఆలోచనలతో ఉండటం వల్ల పానిక్ అటాక్స్ ఎదుర్కోవాల్సి వచ్చిందని, దీంతో జాబ్ వదిలేయాల్సి వచ్చినట్లు తెలిపాడు. నిజానికి వర్క్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. కానీ ఆ పని ఒత్తిడి అలాగే ఉండేది. వీకెండ్ సమయంలో పని చేసినా కూడా బాస్ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కారణాల వల్ల ఆఫీసులోనే మొదటి సారి పానిక్ అటాక్ వచ్చినట్లు తెలిపాడు. ఇదీ చదవండి: మామకు తగ్గ మేనల్లుడు.. అర్జున్ కొఠారి ఆస్తులు ఇన్ని కోట్లా? 2019 నవంబర్ సమయంలో వర్క్ ఫ్రమ్ చేస్తున్నప్పుడు కూడా పానిక్ అటాక్ వచ్చిందని, ఆ తరువాత పలుమార్లు ఈ అటాక్ వెంటాడుతూనే ఉండటం వల్ల జాబ్ వదిలి, రియల్ ఎస్టేట్‌లో పనిచేస్తున్నట్లు వెల్లడించాడు. -
‘జీతంలో జీవితం ఉండదు బ్రదర్’, రూ.3 కోట్ల జీతాన్ని వద్దనుకున్న ఉద్యోగి
జీతంలో జీవితం ఉండదనుకున్నాడో ఏమో ఓ ఐటీ ఉద్యోగి తాను చేస్తున్న జాబ్‌కు రాజీనామా చేశాడు. రూ.కోట్లలో జీతం, పెద్ద ఉద్యోగాన్ని వదులుకున్నందుకు హాయిగా ఉందని అంటున్నాడు. ఇంతకీ ఆ ఉద్యోగి కథాకమామిషు ఏంటో తెలుసుకుందాం పదండి ఎరిక్ యు (28) మెటా ఉద్యోగి. జీతం రూ.3 కోట్లు. అంతా బాగానే ఉంది. కానీ జాబ్ చేసే సమయంలో గుండె వేగంగా కొట్టుకోవడం, చెవులు పగిలిపోయా శబ్ధాలు వచ్చేవి. అయినప్పటికీ, కోడింగ్‌తో కుస్తీ పట్టాడు. చివరికి తీవ్ర భయాందోళనల మధ్య మెటాకు రిజైన్ చేసి బయటకొచ్చాడు. ఇప్పుడు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నట్లు లింక్డిన్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. కష్టపడ్డా.. జాబ్ సంపాదించా ఊహ తెలిసిన వయస్సు నుంచే ఫేస్బుక్లో పనిచేయాలన్న కోరిక బలంగా ఉండేది. అందుకు తగ్గేట్లే కష్టపడ్డా. నా స్కిల్‌కు గూగుల్‌లో ఉద్యోగం వచ్చినా మెటాలో పనిచేసేందుకు మొగ్గు చూపా. ఎందుకంటే? మెటా క్యాంపస్ చాలా బాగుంటుంది. కానీ నేను తీసుకున్న నిర్ణయం తప్పని తర్వాతే తెలిసింది. భయంకరమైన ఒత్తిడికి గురైన తాను మెటాలో తన అనుభవాల్ని నెటిజన్లతో పంచుకున్నాడు. View this post on Instagram A post shared by Eric Yu (@helloericyu) అదృష్టాన్ని పరీక్షించి ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఎంతో ప్రయత్నించా. అదృష్టవశాత్తూ, మెటాలో పనిచేస్తున్న నా స్నేహితురాలు వాండా (ఇప్పుడు ఎరిక్ కాబోయే భార్య) నాలో ఆందోళల్ని గుర్తించింది. అందుకే ఆ ఒత్తిడి నుంచి బయట పడేలా ప్రయత్నించారు. ఇతర ఆదాయా మార్గాల్ని అన్వేషించా. చివరికి రియల్ ఎస్టేట్‌లో అదృష్టాన్ని పరీక్షించుకున్నా. మెటా నుంచి బయటకొచ్చినట్లు చెప్పుకొచ్చాడు. రూ.3 కోట్ల జీతం అంటే మాటలా 370,000 డాలర్లు (రూ.3 కోట్లు) ఉద్యోగాన్ని వదిలివేయడం పిచ్చి పనే అని నాకు తెలుసు. మెటాలో కొనసాగితే ఆర్ధిక భద్రత ఉండేది. అయితే అది నాకు సరైనది కాదని భావిస్తున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న యుకు’ ఇలాగే కొనసాగుతానని మాత్రం చెప్పడం లేదు. భవిష్యత్ బాగుండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు లింక్డిన్ పోస్ట్‌లో ముగించాడు. -
జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం.. ఫేస్బుక్, ఇన్‌స్టా యూజర్లకు షాక్!
మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ 'మెటా' (Meta) 2024 నుంచి యాడ్-ఫ్రీ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను యాడ్స్ లేకుండా వినియోగించాలనుకుంటే తప్పకుండా డబ్బు చెల్లించాల్సిందే అంటూ వార్తలు వస్తున్నాయి. ఇది నిజమే అంటూ కంపెనీ కూడా ప్రకటించింది. అయితే యాడ్స్ వచ్చినా వినియోగించుకోవచ్చు అనుకునేవారు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ విధానం ప్రవేశపెట్టడానికి సంస్థ సన్నద్ధమవుతోంది. ట్రయల్ తరువాత అధికారికంగా 2024 మధ్యలో గానీ లేదా ఆ సంవత్సరం చివరి నాటికి గానీ అమలులోకి రానున్నట్లు సమాచారం. ఇప్పటికే వినియోగదారుని అనుమతి లేకుండా ప్రకటనలు పంపినందుకు ఐర్లాండ్ ప్రైవసీ కమీషన్ మెటాకు భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రకటనలు పంపించాలంటే తప్పకుండా యూజర్ అనుమతి అవసరం అనే రీతిలో యాడ్-ఫ్రీ సబ్స్క్రిప్షన్ విధానం తీసుకువచ్చింది. ఇదీ చదవండి: ముకేశ్ అంబానీకి కాబోయే కోడలు ఆస్తి ఎన్ని కోట్లంటే? ఈ విధానం అమలులోకి వచ్చిన తరువాత యూజర్ యాడ్-ఫ్రీ సబ్స్క్రిప్షన్ కోసం నెలకు ఇన్స్టాగ్రామ్ 14 డాలర్లు, ఫేస్బుక్ 17 డాలర్లను చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. దీనికి సంబందించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది. ప్రారంభంలో ఫ్రీ అన్న జుకర్‌బర్గ్ ఇప్పుడు ఎక్స్ (ట్విటర్) బాటలో పయనించడానికి సిద్దమవడం గమనార్హం. -
మెటాలో ఊడిన ఉద్యోగం.. ఆనందంలో తేలిపోయిన మేనేజర్
అసలే ఆర్ధిక మాంద్యం భయాలు. పైగా లేఆఫ్స్. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో దిగ్గజ కంపెనీ నుంచి ఉద్యోగం తొలగిస్తే. ఊహించుకోవడమే కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితే ఈ మేనేజర్‌కి ఎదురైంది. కానీ ఆమె మాత్రం ఉద్యోగం పోయిందన్న విషయం పక్కన పెట్టి ఆనందంలో తేలిపోయింది. తనను తానే పొగడ్తల్లో ముంచెత్తుకుంది. పింక్ స్లిప్‌తో ఎగిరి గంతేసినంత పనిచేసింది. కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో సింగపూర్‌కి చెందిన హౌ జుయోనీ హెర్మియోన్కు మెటాలో ఉద్యోగం సంపాదించింది. వైరస్ సోకుతుందేమోనన్న భయంలోనూ ఉద్యోగం దొరికిందన్న ఆనందం రెట్టింపైంది. అందులోనే ప్రాజెక్ట్ సోర్సింగ్ మేనేజర్‌గా కొనసాగుతూ వచ్చారు. ఈ క్రమంలో మెటా వర్క్ ఫోర్స్‌ని తగ్గిస్తూ తొలగిస్తూ ప్రకటించింది. వారిలో హెర్మియోన్ కూడా ఉన్నారు. ఉద్యోగాన్ని పోగొట్టుకున్నందుకు విచారం వ్యక్తం చేయక పోగా.. లేఆఫ్స్‌కు గురైనందుకు సంతోషం వ్యక్తం చేసింది. అందుకు కారణం.. ఆమెకు తన డ్రీమ్ కంపెనీలో ఉద్యోగం దక్కించుకోవడమేనని తెలుస్తోంది. నా డ్రీమ్ కంపెనీలో జాబ్ దొరికింది మెటాలో చేరి మూడో వార్షికోత్సవానికి దగ్గర ఉన్న సమయంలో తన ఉద్యోగం పోయిందంటూ నెటిజన్లతో తన అనుభవాల్ని పంచుకున్నారు. మెటాలో లేఆఫ్స్ గురైనందుకు సంతోషంగా ఉంది. గూగుల్ నా డ్రీమ్ కంపెనీ. మెటా కాదు. మెటాలో ఉద్యోగం పోయిన వెంటనే గూగుల్‌లో జాబ్ కోసం ట్రై చేశా. సరిగ్గా 5 నెలల తర్వాత తాను కోరుకున్న సంస్థలో ఉన్నత ఉద్యోగం సంపాదించుకున్నట్లు తెలిపారు. సరదాగా మాట్లాడుతున్నానని ‘మీలో కొందరు నేను సరదాగా మాట్లాడుతున్నానని అనుకోవచ్చు. గూగుల్‌లో ఉద్యోగం చేయడం నాకు చాలా ఇష్టం. గూగుల్ ఆఫీస్‌కు చేరుకోవడానికి 15 నిమిషాలే పడుతుంది. విమాన ప్రయాణం చేస్తే 16 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. కానీ, మీ కల నెరవేతుందంటూ హెర్మియోన్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ఆమె ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ఉన్న గూగుల్ యూరప్ విభాగ రీజనల్ కమోడిటీ మేనేజర్‌గా చేరనుంది. ఇక, హెర్మియోన్ తీరుపై పలువురు నెటిజన్లు ఇదేమి చోద్యం అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం కొని సార్లు చెడులో కూడా మంచి జరుగుతుందంటూ ఆమె నిర్ణయాన్ని సమర్దిస్తున్నారు. చదవండి👉 బై..బై అమెరికా, స్వదేశానికి తిరిగి వస్తున్న భారతీయులు -
ఉద్యోగం పోయి చాలా రోజులైంది.. అప్పటి నుంచి.. మెటా మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్!
కరోనా మహమ్మారి ఎంతోమంది ఉద్యోగుల జీవితాలను తలకిందులు చేసింది. ఈ ప్రభావం ఇప్పటికి కూడా కొంతమంది మీద ఉంది అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లేఆప్స్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన ఒక ఉద్యోగి ఇటీవల సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ ఏడాది ప్రారంభం నుంచి వేలమంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. మెటా సైతం ఇప్పటి వరకు సుమారు 20వేలమందిని ఇంటికి పంపింది. ఇందులో ఒక ఉద్యోగి లేఆప్స్ మీద తన అసహనం ప్రదర్శిస్తూ లింక్డ్ఇన్లో పోస్ట్ పెట్టింది. జాబ్ పోయి 201 రోజులు (ఆరు నెలల కంటే ఎక్కువ) అవుతోంది, ఇప్పటికి ఒక్క అవకాశం కూడా లభించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మనుషులతో కలవడం పూర్తిగా తగ్గిపోయిందని, పని వాతావరణం మిస్ అవుతున్నట్లు వెల్లడించింది. రెండు సంవత్సరాలు ఫేస్బుక్లో టెక్నికల్ రిక్రూటర్‌గా పని చేసిన యువతి ఈ పోస్ట్ చేసింది. ఆగిపోయిన చోటే నిలిచిపోయానని, త్వరలోనే కొత్త ఉద్యోగం వస్తుందనే ఆశతో ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: కంపెనీలకు వణుకు పుట్టిస్తున్న 'రిలయన్స్' కొత్త ఆవిష్కరణ ఉద్యోగం కోల్పోయిన వ్యక్తులు ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా చాలామంది లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తూ తమ అసహనం, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అయితే మెటా సంస్థ మాత్రం ఇప్పటికి తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు సుమారు 21,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. -
ఐటీలో లేఆఫ్స్ కలకలం: మరోసారి మెటాలో ఉద్యోగాల కోత!
Meta Layoffs: ఐటీ రంగంలో లేఆఫ్స్ పర్వానికి ఇంకా తెరపడే అవకాశాలు కనిపించడం లేదు. ముఖ్యంగా ప్రముఖ సోషల్ మీడియా సంస్థలు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాలో మరోసారి ఉద్యోగాల కోత వార్త కలకలం రేపుతోంది. త్వరలోనే మరింత మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ విడత తొలగింపుల్లో కంపెనీలోని చిప్ డెవలప్మెంట్ టీమ్‌పై ప్రభావం చూపుతుంది. గత నవంబర్ నుండి 21వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించిన Meta, ఈసారి తన Metaverse డివిజన్ నుండి ఎంప్లాయిస్‌పై వేటు వేయనుంది. దీంతో ఆగ్మెంటెడ్ , వర్చువల్ రియాలిటీ ఉత్పత్తుల సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రభావితం చేయవచ్చు. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఫేస్బుక్ ఎజైల్ సిలికాన్ టీమ్ లేదా ఫాస్ట్ టీంలో ఉద్యోగులను సాగనంపాలని భావిస్తోంది. కంపెనీ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా బాధిత ఉద్యోగులకు సమాచారం అందిందనీ, దాదాపు 600 మంది ఉద్యోగుల తొలగింపుల ప్రక్రియ బుధవారం ఉంటుందని భావిస్తున్నారు. అయితే తొలగింపులపై మెటా ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. కృత్రిమ మేధస్సు పనిపై దృష్టి కేంద్రీకరించిన మెటాలోని మరొక చిప్-మేకింగ్ యూనిట్ కష్టాల్లో పడింది. ఆ ప్రయత్నాలకు బాధ్యత వహించిన ఎగ్జిక్యూటివ్ ఇటీవల రాజీనామా చేశారు. కాగా Meta ప్రస్తుతం క్వెస్ట్ వంటి మిశ్రమ రియాలిటీ హెడ్సెట్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ పరికరాలు AI వర్చువల్ అసిస్టెంట్ ద్వారా వీడియోను ప్రసారం చేయగలవు మరియు ధరించిన వారితో కమ్యూనికేట్ చేయగలవని కంపెనీ తెలిపింది. కంపెనీ సాధారణ కళ్లద్దాలను పోలి ఉండే సరళమైన డిజైన్‌తో సాంకేతికంగా అభివృద్ధి చెందిన AR గ్లాసెస్, స్మార్ట్‌వాచ్‌లపై కూడా పని చేస్తోంది. కాగా గ్లోబల్ ఆర్థిక మాంద్య పరిస్థితులు, ఆదాయాల క్షీణత నేపథ్యంలో ఐటీ సహా చాలాకంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా ఫేస్బుక్, ట్విటర్, గూగుల్ లాంటి దిగ్గజాలు వేలాది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. -
భారీ షాక్.. ఇకపై మెటా,ఇన్స్టాగ్రామ్ యూజర్లు డబ్బులు కట్టాల్సిందే!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్బుక్) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎక్స్ (ట్విటర్) తరహాలో మెటా, ఇన్‌స్టాగ్రామ్‌ను వినియోగించుకోవాలంటే నెలవారీ సబ్స్క్రిప్షన్ చెల్లించేలా కొత్త చెల్లింపు పద్దతిని అమలు చేయనుందని సమాచారం. అయితే, ఈ సబ్ స్క్రిప్షన్ విధానం యాడ్స్ వద్దనుకునే యూజర్లు మాత్రమే నెలవారీ చొప్పున కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే యూరప్ దేశాలకు చెందిన మెటా, ఇన్స్టాగ్రామ్ యూజర్ల నుంచి యాడ్- ఫ్రీ ఎక్స్పీరియన్స్ పేరుతో మెటా నెలకు రూ.1,165 వసూలు చేస్తుంది. మరి ఆసియా దేశాల్లో అతిపెద్ద సోషల్ మీడియా మార్కెట్‌గా కొనసాగుతున్న భారత్‌లోని యూజర్లకు ఈ సబ్స్క్రిప్షన్ విధానం ఉంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే భద్రత దృష్ట్యా భారత్ యాడ్-ఫ్రీ ఎక్స్‌పీరియన్స్‌కు అనుమతి ఇవ్వనుందనే అంచనాలు నెలకొన్నాయి. యూరప్‌లో మెటా నోయాడ్స్ సబ్స్క్రిప్షన్ ధరలు పలు నివేదికల ప్రకారం.. డెస్క్‌టాప్ పరికరాలలో ప్రకటనలు లేకుండా మెటా లేదా ఇన్స్ట్రాగ్రామ్ని యాక్సెస్ చేయాలనుకునే వినియోగదారుల నెలకు 10.46 డాలర్లకు సమానమైన సుమారు 10 యూరోల సబ్స్క్రిప్షన్ ఫీజును వసూలు చేయాలని మెటా ఆలోచిస్తోంది. ఒకటి కంటే ఎక్కువ సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటే వారి వద్ద నుంచి ఒక్కో ఖాతాకు దాదాపు 6 యూరోల అదనపు ఛార్జీని విధించవచ్చు. మొబైల్ యూజర్ల సబ్స్క్రిప్షన్ ధర నెలకు దాదాపు 13 యూరోలకు పెరగవచ్చని అంచనా. కమిషన్ల భారం తగ్గించుకునేందుకే యాపిల్, గూగుల్ ప్లేస్టోర్‌లో ఉదాహరణకు మెటా,ఇన్‌స్ట్రాగ్రామ్, వాట్సాప్ యాప్స్‌ను యూజర్ల కోసం అందుబాటులో ఉన్నాయి. ఆ యాప్స్‌ను తమ ప్లేస్టోర్లలో ఉంచేందుకు గూగుల్, యాపిల్ సంస్థలు మెటా నుంచి కమిషన్ తీసుకుంటుంది. ఇప్పుడా కమిషన్ ఛార్జీలు పెంచడంతో .. ఆ భారాన్ని తగ్గించుకునేందుకు మెటా నోయాడ్స్ అంటూ కొత్త పేమెంట్ మెథడ్ అస్త్రాన్ని వదిలింది. చదవండి👉 కోర్టు హాలులో గూగుల్‌పై విరుచుకుపడ్డ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల! -
గూగుల్, మెటా,ఎక్స్‌కు భారత్ భారీ షాక్!
మెటా,ఎక్స్, గూగుల్ సంస్థలకు భారత్ భారీ షాక్ ఇవ్వనుంది. త్వరలో ఆయా సంస్థల నుంచి 18 శాతం ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్ విభాగం ఐజీఎస్టీ నుంచి ఓఐడీఏఆర్ సంస్థలకు ఇకపై మినహాయింపు ఇవ్వబోదని తెలుస్తోంది. అక్టోబర్ నుంచి భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ అడ్వటైజింగ్, క్లౌడ్ సర్వీస్, మ్యూజిక్, సబ్స్క్రిప్షన్ సర్వీసులు, ఆన్లైన్ ఎడ్యుకేషన్ సేవలందిస్తున్న ఆయా కంపెనీలు నుంచి ఐజీఎస్టీని వసూలు చేసేందుకు కేంద్రం సిద్ధమైందంటూ ఈ అంశంలో ప్రమేయం ఉన్న ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. ప్రస్తుతం, ఓఐడీఏఆర్ సంస్థలు ఎలాంటి ట్యాక్స్ చెల్లించే పనిలేదు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా సంస్థలకు పన్ను నుంచి మినహాయింపులు ఇస్తున్నాయి. కేవలం, బిజినెస్ టూ బిజినెస్ సర్వీస్‌లు అందించే కంపెనీలు మాత్రమే ట్యాక్స్‌లు చెల్లిస్తున్నాయి. తాజాగా పన్నుల విభాగం తీసుకున్న నిర్ణయంతో ఓఐడీఏఆర్ సంస్థలైన మెటా,ఎక్స్, గూగుల్ వంటి సంస్థల మీద పన్ను భారం పడనుంది. ఓడీఐఆర్ అంటే ఏమిటి? ఓడీఐఆర్ ని ఆన్ లైన్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ యాక్సెస్ అండ్ రిట్రీవల్ సర్వీసెస్ అని పిలుస్తారు. ఈ విభాగంలో సేవలందించే సంస్థలు వ్యక్తులు లేదంటే కస్టమర్లుతో ఎలాంటి భౌతిక సంబంధం ఉండదు. ఆన్లైన్ ద్వారా వినియోగదారుల అవసరాల్ని తీర్చుతాయి. గూగుల్,మెటా,ఎక్స్ తో పాటు ఆన్లైన్ ద్వారా కస్టమర్ల అవసరాల్ని తీర్చే కంపెనీలు ఈ ఓఐడీఐఆర్ విభాగం కిందకే వస్తాయి.


