వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు స్వస్తి.. కొత్త వర్క్‌ పాలసీని అమలు చేయనున్న మెటా!

Meta Employees Have To Work From The Office Thrice A Week - Sakshi

ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకోనుంది. వర్క్‌ ప్రమ్‌ హోమ్‌ను తగ్గించేలా చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం కొత్త వర్క్‌ పాలసీని తయారు చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ కొత్త పని నిబంధనలు అమల్లోకి వస్తే ఉద్యోగులు కనీసం వారానికి మూడు రోజులు కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది.   

బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక ప్రకారం.. వర్క్‌లో సమర్ధత, ఉత్పాదకత వంటి అంశాల్ని పరిగణలోకి తీసుకున్న మెటా ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి కొత్త పాలసీని అమలు చేయనుంది. అయితే, ఇప్పటికే రిమోట్‌ వర్క్‌కి పరిమితమైన ఉద్యోగులు వారి ప్రస్తుత స్థానాల నుంచి విధులు నిర్వహించేందుకు మెటా అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. 

ఈ సందర్భంగా మెటా ప్రతినిధులు కొత్త వర్క్‌ పాలసీ విషయంలో ఉద్యోగులు పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది కార్యాలయం నుంచి లేదంటే ఇంటి నుంచి పని చేసినా ఉద్యోగుల పనితీరులో ఎలాంటి మార్పులు ఉండవని, సమర్ధవంతంగా పనిచేస్తారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సహకారం, సంబంధాలు, అనుకూలమైన పని సంస్కృతిని పెంపొందించేందుకే కొత్త పని విధానంపై పనిచేస్తున్నట్లు మెటా ప్రతినిధి ప్రస్తావించారు.ఈ నిర్ణయం మెటా గత కొంతకాలంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ ఏడాది మార్చి నెలలో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌తో జరిగిన ఇంటర్నల్‌ మీటింగ్‌లో ఇంజినీర్లు వారంలో కనీసం మూడు రోజులు సహచరులతో కలిసి పనిచేసినప్పుడే మెరుగైన పనితీరు కనబరుస్తామనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో మెటా వర్క్‌ పాలసీ అమలు చేయనున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి.

చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్‌? అదేంటంటే?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top