భారత్‌లో ‘ఐకియా’కు మరిన్ని నష్టాలు | IKEA Indias Losses Widen to Rs 1,325 Crore as Sales Dip and Debt Rises | Sakshi
Sakshi News home page

భారత్‌లో ‘ఐకియా’కు మరిన్ని నష్టాలు

Feb 6 2026 8:40 AM | Updated on Feb 6 2026 8:51 AM

IKEA Indias Losses Widen to Rs 1,325 Crore as Sales Dip and Debt Rises

న్యూఢిల్లీ: స్వీడన్‌కు చెందిన ఫర్నిచర్, గృహ ఫర్నిషింగ్‌ రిటైల్‌ కంపెనీ ‘ఐకియా’ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌కు భారత్‌లో నష్టాలు మరింత అధికమయ్యాయి. 2024–25 సంవత్సరానికి రూ.1,325 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. విక్రయాల ద్వారా ఆదాయం 3.33 శాతం తగ్గి రూ.1,749 కోట్లకు పరిమితమైంది. ఈ సంస్థ అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2023–24) రూ.1,810 కోట్ల ఆదాయంపై రూ.1,299 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒకవైపు భారీ నష్టం ఎదురవుతున్నా కానీ, గత ఆర్థిక సంవత్సరంలో ప్రకటనలపై 14 శాతం అధికంగా రూ.224 కోట్లు ఖర్చు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ రూపంలో చేసిన వ్యయం రూ.196 కోట్లు, ఐకియా ఇండియా రుణ భారం రూ.8,335 కోట్లకు పెరిగింది. 2024 మార్చి నాటికి రుణ భారం రూ.7,060 కోట్లుగానే ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement