రిలయన్స్‌ చేతికి సదరన్‌ హెల్త్‌ ఫుడ్స్‌ | Reliance Acquires Southern Health Foods Takes Over Manna Brand To Expand Millet Based Portfolio | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ చేతికి సదరన్‌ హెల్త్‌ ఫుడ్స్‌

Feb 11 2026 4:51 PM | Updated on Feb 11 2026 5:03 PM

Reliance Acquires Southern Health Foods Takes Over Manna Brand

న్యూఢిల్లీ: అనుబంధ ఎఫ్‌ఎంసీజీ విభాగం రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌(ఆర్‌సీపీఎల్‌) తాజాగా తమిళనాడు కంపెనీ సదరన్‌ హెల్త్‌ ఫుడ్స్‌ను సొంతం చేసుకుంటున్నట్లు డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది. అయితే డీల్‌ విలువను తెలియజేయలేదు.

తాజా కొనుగోలు ద్వారా తృణ ధాన్యాల(మిల్లెట్స్‌) ఆధారిత ఫుడ్‌ విభాగంలో రిలయన్స్‌ కన్జూమర్‌ విస్తరించనుంది. రెండు దశాబ్దాలుగా ఆరోగ్యకర ఆహార విభాగంలో మన్నా బ్రాండ్‌తో సదరన్‌ హెల్త్‌ ఫుడ్స్‌ విభిన్న ప్రొడక్టులను విక్రయిస్తోంది. ఆర్‌సీపీఎల్‌ ఇటీవలే ఆ్రస్టేలియా సంస్థ గుడ్‌నెస్‌ గ్రూప్‌ గ్లోబల్‌ పీటీవైను సొంతం చేసుకున్న నేపథ్యంలో తాజా కొనుగోలుకి ప్రాధాన్యత ఏర్పడింది. తద్వారా బెటర్‌ ఫర్‌ యు బ్రాండ్‌ పానీయాల బిజినెస్‌ను సొంతం చేసుకున్న విషయం విదితమే.

Advertisement
 
Advertisement
Advertisement