న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్‌లో (ఎన్‌సీఎల్‌ఏటీ) మెసేజింగ్ యాప్ వాట్సాప్‌నకు పాక్షిక ఊరట లభించింది. అడ్వర్టైజింగ్ అవసరాల కోసం మాతృ సంస్థ మెటా ప్లాట్‌ఫాంనకు అయిదేళ్ల పాటు డేటా పంచుకోరాదంటూ సీసీఐ ఇచ్చిన ఆదేశాలను ఎన్‌సీఎల్‌ఏటీ పక్కన పెట్టింది. అయితే, కంపెనీపై విధించిన రూ. 213 కోట్ల పెనాల్టీని సమర్థించింది.
వైదొలిగేందుకు సరైన ఆప్షన్ ఇవ్వకుండా వాట్సాప్‌ను వాడాలంటే విస్తృతమైన డేటాను చేసుకోవాల్సి ఉంటుందంటూ యూజర్లపై ఒత్తిడి తేవడం సరి కాదని ఎన్‌సీఎల్‌ఏటీ వివరించింది. ఎన్‌సీఎల్‌ఏటీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వాట్సప్ మాతృ సంస్థ మెటా తెలిపింది. వాట్సాప్ 2021 ప్రైవసీ పాలసీ అప్‌డేట్ వల్ల ప్రజల వ్యక్తిగత మెసేజీల గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లదని పేర్కొంది.


