వాట్సాప్‌లో కొత్త మోసం.. 'ఘోస్ట్ పేయిరింగ్'తో జాగ్రత్త! | WhatsApp GhostPairing Scam Explained And VC Sajjanar Tweet | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో కొత్త మోసం.. 'ఘోస్ట్ పేయిరింగ్'తో జాగ్రత్త!

Dec 21 2025 3:42 PM | Updated on Dec 21 2025 3:58 PM

WhatsApp GhostPairing Scam Explained And VC Sajjanar Tweet

టెక్నాలజీ పెరుగుతున్న వేళ.. రోజుకో కొత్త స్కామ్ పుట్టుకొస్తోంది. ఇప్పుడు తాజాగా 'ఘోస్ట్‌పెయిరింగ్' పేరుతో వాట్సాప్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఘోస్ట్‌పెయిరింగ్ స్కామ్
వాట్సప్‌లోని డివైజ్ లింక్ ఫీచర్ ద్వారా.. ఓటీపీ, పాస్‌వర్డ్స్, వెరిఫికేషన్స్ వంటి వివరాలతో సంబంధం లేకుండానే స్కామర్లు.. యూజర్స్ ఖాతాల్లోకి చొరబడతున్నారు. దీనినే టెక్ నిపుణులు ఘోస్ట్‌పెయిరింగ్ అంటున్నారు.

ఘోస్ట్‌పెయిరింగ్ స్కామ్ ఇలా..
సోషల్ ఇంజినీరింగ్ ద్వారా.. సైబర్ నేరగాళ్లు ఘోస్ట్‌పెయిరింగ్ మోసాలకు పాల్పడుతున్నారు. స్కామర్లు.. యూజర్ల వాట్సప్‌కు తెలిసిన కాంటాక్టుల ద్వారా Hey, is this you in this photo? లేదా I just found your picture అనే మోసపూరిత మెసేజ్ వస్తుంది. ఇలాంటి మెసేజ్‌లో ఇంటర్నల్‌గా వేరే లింక్ ఉంటుంది. కాబట్టి యూజర్లు తమకు వచ్చిన లింక్ క్లిక్ చేయగానే.. ఒక ఫేక్ వెబ్‌పేజ్ ఓపెన్ అవుతుంది.

ఓటీపీ గానీ, స్కానింగ్ లేకుండా.. మీకు తెలియకుండా మీ వాట్సాప్‌ ఖాతా హ్యాకర్ల డివైజ్‌కు కనెక్ట్‌ అవుతుంది. ఒక్కసారి వారి చేతికి చిక్కితే.. మీ వ్యక్తిగత చాటింగ్స్, ఫొటోలు, వీడియోలు అన్నీ చూస్తారు. మీ కాంటాక్ట్స్ లిస్ట్ దొంగిలిస్తారు. మీ పేరుతో ఇతరులకు సందేశాలు పంపి మోసాలకు పాల్పడతారు. చివరికి మీ ఖాతాను మీరే వాడుకోలేక లాక్‌ చేస్తారు.

ఘోస్ట్‌పెయిరింగ్ స్కామ్ నుంచి తప్పించుకోవడం ఎలా

  • మీకు తెలియని లేదా.. అనుమానాస్పద లింక్‌లను క్లిక్‌ చేయవద్దు.

  • వాట్సాప్‌ సెట్టింగ్స్‌లో 'Linked Devices' ఆప్షన్‌ను తరచూ పరిశీలించండి. తెలియని డివైజ్‌లు ఉంటే వెంటనే రిమూవ్‌ చేయండి.

  • Two-step verification తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోవాలి.

వీసీ సజ్జనార్ ట్వీట్
వాట్సాప్ ఘోస్ట్‌పెయిరింగ్ ఫీచర్ గురించి.. వీసీ సజ్జనార్ ట్వీట్ చేసారు. ఇందులో.. "హేయ్.. మీ ఫొటో చూశారా? అంటూ ఏదైనా లింక్‌ వచ్చిందా? తెలిసిన వారి నుంచి వచ్చినా సరే.. పొరపాటున కూడా క్లిక్‌ చేయకండి'' అని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement