జియో ఏఐ పెవిలియన్‌ సందర్శించిన మోదీ | Prime Minister Modi Visits Jio AI Pavilion at India AI Impact Summit | Sakshi
Sakshi News home page

India AI Impact Summit 2026: జియో ఏఐ పెవిలియన్‌ సందర్శించిన మోదీ

Feb 16 2026 7:44 PM | Updated on Feb 16 2026 8:40 PM

Prime Minister Modi Visits Jio AI Pavilion at India AI Impact Summit

ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026) అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ జియో ఇంటెలిజెన్స్ పెవిలియన్‌ను సందర్శించారు. ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ వంటి వివిధ ఏఐ మోడల్స్ వీక్షించారు.

జియో ఏఐ మోడల్స్ అన్నీ కూడా ఎంటర్‌ప్రైజ్ ఇంటెలిజెన్స్‌ను నడిపించడానికి, భారతీయ భాషలు & సాంస్కృతిక కంటెంట్‌ను ప్రోత్సహించడానికి, ఆరోగ్య సంరక్షణ డెలివరీని మెరుగుపరచడానికి, విద్యా వ్యవస్థలను బలోపేతం చేయడానికి & ఏఐ బేస్డ్ స్మార్ట్ లివింగ్‌ను ప్రారంభించడానికి ప్రత్యేకంగా రూపొందించారు.

ఏఐ ఎకోసిస్టమ్ & వివిధ రంగాల్లో డిజిటల్ మార్పును వేగవంతం చేయడంలో ఏఐ పాత్ర గురించి జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ.. ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు. సంస్థ 'ఏఐ ఫర్ ఆల్' (అందరికి ఏఐ) అనే దృక్పథాన్ని ప్రతిపాదిస్తూ, ఆధునిక సాంకేతికతలను అందరికీ చేరువయ్యేలా చూస్తోందని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement