మ్యూచువల్‌ ఫండ్స్‌.. ‘కొత్త’ ఆఫర్స్‌! | Tata AIA Old Bridge Mutual Fund Roll Out New Fund Offers | Sakshi
Sakshi News home page

మ్యూచువల్‌ ఫండ్స్‌.. ‘కొత్త’ ఆఫర్స్‌!

Feb 16 2026 5:34 PM | Updated on Feb 16 2026 5:44 PM

Tata AIA Old Bridge Mutual Fund Roll Out New Fund Offers

ఓవైపు జీవిత బీమా భద్రత పొందుతూనే మరోవైపు సంపదను పెంచుకునేందుకు అవకాశం కలి్పస్తూ టాటా ఏఐఏ లైఫ్‌ కొత్తగా ఎన్హాన్స్‌డ్‌ వేల్యూ ఇండెక్స్‌ ఫండ్స్‌ని ఆవిష్కరించింది.  ఎన్‌హాన్స్‌డ్‌ వేల్యూ ఇండెక్స్‌ ఫండ్, ఎన్‌హాన్స్‌డ్‌ వేల్యూ ఇండెక్స్‌ పెన్షన్‌ ఫండ్‌ వీటిలో ఉన్నాయి. ఇవి ప్రధానంగా వేల్యూ ఇన్వెస్టింగ్‌ పద్ధతిలో లార్జ్, మిడ్, స్మాల్‌ క్యాప్‌ కంపెనీల స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. టాటా ఏఐఏ యూనిట్‌ లింక్డ్‌ ప్లాన్ల ద్వారా వీటిని తీసుకోవచ్చు. పిల్లల చదువులు, అసెట్స్‌ సమకూర్చుకోవడం, దీర్ఘకాలిక ఆర్థిక భద్రత మొదలైన ప్రణాళికలకు మొదటి ఫండ్‌ ఉపయోగకరంగా ఉంటుంది. రిటైర్మెంట్‌ నిధిని ఏర్పర్చుకోవడానికి రెండోది పని చేస్తుంది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ ఫిబ్రవరి 16 వరకు అందుబాటులో ఉంటుంది.  

ఓల్డ్‌ బ్రిడ్జ్‌ ఫ్లెక్సి క్యాప్‌ ఫండ్‌ 
లార్జ్, మిడ్, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే ఈ ఫండ్‌ని ఓల్డ్‌ బ్రిడ్జ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 23 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. బాటమ్‌–అప్‌ వ్యూహంతో దీర్ఘకాలిక పెట్టుబడి వృద్ధికి దోహదపడే స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. అయిదేళ్లకు పైగా పెట్టుబడులు కొనసాగించే వారికి అనువైన ఫండ్‌. కనీసం రూ. 5,000 నుంచి, సిప్‌ అయితే రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు. కేవలం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఆధారంగా పెట్టుబడులను కేటాయించకుండా కంపెనీ వ్యాపార నాణ్యత, వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఫండ్‌ ఇన్వెస్ట్‌ చేస్తుంది. బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ దీనికి ప్రామాణికంగా ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement