breaking news
Tata AIA
-
శుభ్ ఫ్లెక్సి పెన్షన్.. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్
జీవించినంత కాలం నిరంతర ఆదాయం అందుతుందనే భరోసాతో రిటైర్ కావడాన్ని ఒకసారి ఊహించుకోండి. మీ పొదుపులు స్థిరమైన ఆదాయాన్ని అందించడమే కాకుండా, పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా పెరుగుతూ మీ జీవనశైలిని కొనసాగించేందుకు సహాయపడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అచ్చంగా ఈ ఆలోచనకే వాస్తవ రూపం ఇచ్చేలా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ‘శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్’ను ఆవిష్కరించింది. మీరు ధీమాగా, సౌకర్యవంతంగా, ఆర్థిక భద్రత దన్నుతో పదవీ విరమణను ప్లాన్ చేసుకునేందుకు తోడ్పడేలా ఇది తీర్చిదిద్దబడింది.నేటి రిటైర్మెంట్ - సరికొత్త పరిస్థితులుప్రస్తుతం రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే కేవలం భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మాత్రమే కాదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళిక అవసరం. ఆయుర్దాయం పెరగడం, ఆరోగ్య వ్యయాలు పెరుగుతుండటం వల్ల రిటైర్ అయిన వారిపై ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది రిటైర్మెంట్ అనంతరం కూడా తమ జీవనశైలిని కొనసాగిస్తూ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నారు. అందుకే స్థిరత్వంతో పాటు వృద్ధి అవకాశాలు కలిగిన స్మార్ట్ ఫైనాన్షియల్ పరిష్కారాల కోసం చూస్తున్నారు.ఇప్పటి రిటైరీలు కారు కొనడం లేదా విదేశీ పర్యటనలు చేయడం వంటి లక్ష్యాల గురించి కూడా కలలు గంటున్నారు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ ఎర్లీ (FIRE) తరానికి చెందిన వారు కావచ్చు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు కావచ్చు లేదా ఉద్యోగ మార్పుల మధ్యలో ఉన్నవారు కావచ్చు, ఇలా చాలా మందికి సంప్రదాయ పెన్షన్ పథకాలు సరిపోవడం లేదు. అంతేకాదు, జీవితకాలం ముగిసేలోగానే, దాచుకున్న డబ్బు పూర్తిగా ఖర్చయిపోతుందనే భయం కూడా చాలా మందిలో ఉంది.అయితే రిటైర్మెంట్ జీవితం గురించి ఆందోళన చెందే పరిస్థితి లేకపోతే ఎలా ఉంటుంది? నిర్దిష్ట హామీతో కచ్చితమైన ఆదాయం పొందుతూ మార్కెట్ వృద్ధి అవకాశాలను కూడా పొందగలిగితే ఎలా ఉంటుంది?‘శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్’ అచ్చంగా అలాగే ఉంటుంది. ఈ పథకం ద్వారా భద్రతతో పాటు వృద్ధి అవకాశాలు కూడా లభిస్తాయి. దీంతో మీరు కోరుకున్న జీవనశైలి విషయంలో రాజీపడాల్సిన అవసరం లేకుండా, ధీమాగా రిటైర్ కావచ్చు.రిటైర్మెంట్ ప్లానింగ్‌కు స్మార్ట్ మార్గంఆయుర్దాయం పెరుగుతుండటం, ఆరోగ్య వ్యయాలు పెరుగుతుండటం వల్ల ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతోంది. సంప్రదాయ రుణాధారిత పెన్షన్ పథకాలు భరోసా ఇస్తాయి కానీ ఆదాయం పెరిగే అవకాశం ఉండదు. మరోవైపు సూచీ ఆధారిత పెట్టుబడులు వృద్ధి అవకాశాలను ఇస్తాయి కానీ స్థిరత్వం ఉండదు. అలాంటప్పుడు ఈ రెండు ప్రయోజనాలు ఒకే పథకంలో లభిస్తే ఎలా ఉంటుంది?శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్ జీవితాంతం హామీ ఆదాయాన్ని అందిస్తుంది. ఈక్విటీల్లో 40 శాతం వరకు పెట్టుబడుల దన్నుతో ఇది అదనంగా మార్కెట్ ఆధారిత వృద్ధి అవకాశాలను కూడా అందిస్తుంది. ‘ఈక్విటీ ఓరియెంటెడ్, రెగ్యులర్ పే’ సొల్యూషన్‌గా ఈ పథకం ఇలా పనిచేస్తుంది.జీవితాంతం హామీతో కూడుకున్న ఆదాయంమీరు జీవించినంతకాలం యాన్యుటీ రూపంలో ఆదాయం అందుతుంది. రిటైర్మెంట్ సమయంలో డబ్బు సరిపోదేమోనని ఆందోళన చెందనక్కర్లేదు.మార్కెట్ ఆధారిత వృద్ధికి అవకాశంవేరియబుల్ యాన్యుటీ ఆప్షన్ ద్వారా మీ ఆదాయంలో కొంత భాగాన్ని NIFTY 50 పనితీరుకు అనుసంధానం చేసుకోవచ్చు. ఇందులో ఈ ఆప్షన్లు ఉన్నాయి:➤60% గ్యారంటీడ్ ఆదాయం (డెట్) + 40% మార్కెట్ ఆధారితం (ఈక్విటీ)➤70% గ్యారంటీడ్ ఆదాయం (డెట్) + 30% మార్కెట్ ఆధారితం (ఈక్విటీ)➤80% గ్యారంటీడ్ ఆదాయం (డెట్) + 20% మార్కెట్ ఆధారితం (ఈక్విటీ)➤90% గ్యారంటీడ్ ఆదాయం (డెట్) + 10% మార్కెట్ ఆధారితం (ఈక్విటీ)ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనగలిగేలా, మీకు ఒక స్థిరమైన ఆదాయం ఉండడమే కాకుండా మార్కెట్ పెరుగుదలతో మీ పెన్షన్ కూడా పెరిగే అవకాశం ఉండేలా చూసేందుకు ఇది సహాయకరంగా ఉంటుంది.“భారతదేశంలో రిటైర్మెంట్ ప్లానింగ్ విధానం మారుతోంది. ఆయుర్దాయాలు పెరగడం, ఆరోగ్య వ్యయాలు పెరుగుతుండటం, వడ్డీ రేట్లు మారడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు స్థిరత్వంతో పాటు వృద్ధి అవకాశాలను కూడా అందించే సాధనాలను కోరుకుంటున్నారు. శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు హామీతో కూడుకున్న ఆదాయం మరియు పొదుపు మొత్తాన్ని పెంచుకునే అవకాశం, ఇలా రెండింటినీ అందిస్తున్నాం,” అని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ అపాయింటెడ్ యాక్చువరీ క్షితిజ్ శర్మ తెలిపారు.మీ రిటైర్మెంట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దబడినదిప్రతి ఒక్కరి రిటైర్మెంట్ లక్ష్యాలు భిన్నంగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి తమవైన లక్ష్యాలు, కాలవ్యవధులు ఉంటాయి. అందుకే శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్, వివిధ రకాల రిటైర్మెంట్ అవసరాలకు తగ్గట్లుగా అనేక అనువైన ఆప్షన్లు అందిస్తుంది.ముందుగానే ప్రారంభించండి: 35 ఏళ్ల వయసు నుంచే రిటైర్మెంట్ నిధిని ఏర్పర్చుకోవడాన్ని ప్రారంభించవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి కావడం వల్ల కాంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది.ఎప్పటి నుంచి ఆదాయం కావాలో మీరే ఎంచుకోవచ్చుఇమిడియేట్ యాన్యుటీ: రిటైర్ అయిన వెంటనే ఆదాయం ప్రారంభం.డిఫర్డ్ యాన్యుటీ: చెల్లింపులు ప్రారంభమయ్యే ముందు 20 సంవత్సరాల వరకు నిధికి పెరిగే అవకాశాన్ని కల్పించడం ద్వారా మూలనిధిని పెంచుకోవచ్చు. PPTకి అదనంగా గరిష్ట స్థాయిలో 20 ఏళ్ల వరకు వాయిదా వేసే వీలు. ఉదాహరణకు పాలసీ ప్రీమియం చెల్లింపు వ్యవధి 12 ఏళ్లు అనుకుంటే, గరిష్టంగా 12 + 20 = 32 ఏళ్లు డిఫర్ చేసుకోవచ్చు.సరళతర ప్రీమియం ఆప్షన్లుఏకమొత్తంగా చెల్లించవచ్చు2–12 ఏళ్ల వరకు విడతలవారీగా చెల్లింపులు జరపవచ్చుకుటుంబానికి రక్షణఈ పథకం కేవలం మీ భవిష్యత్తు కోసం మాత్రమే కాదు, మీ కుటుంబ భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. “రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్” ఆప్షన్ని ఎంచుకోవడం వల్ల పాలసీదారు మరణించిన తర్వాత కొనుగోలు కోసం మీరు మొదట చెల్లించిన మొత్తం తిరిగి నామినీకి లభిస్తుంది.ఎవరికి అనుకూలం?శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్ వివిధ వర్గాలవారందరికీ అనుకూలమైనదిగా ఉంటుందిముందుగానే రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రారంభించాలనుకునే వారు (FIRE తరం)ఆర్థిక స్వాతంత్య్రంతో జీవనశైలిని కొనసాగించాలనుకునే వారుస్థిరమైన ఆదాయం, వృద్ధి అవకాశాలను కోరుకుంటూ, రిటైర్మెంట్కు సమీపిస్తున్న వారుస్థిరత్వంతో పాటు వృద్ధి అవకాశాలు కోరుకునే రిటైరీలుయాన్యుటైజేషన్ ఆప్షన్లను కోరుకునే NPS సభ్యులునిర్మాణాత్మకమైన, దీర్ఘకాలిక రిటైర్మెంట్ వ్యూహం కోరుకునే వ్యక్తులు -
ఇన్సూరెన్స్‌తోపాటు ఈక్విటీ.. కొత్త మ్యూచువల్ ఫండ్స్ ఇవే..
అంతర్జాతీయంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని కల్పించే దిశగా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ‘టాటా ఏఐఏ గ్లోబల్ ఈక్విటీ ఫండ్’ను ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ మార్చి 5 వరకు అందుబాటులో ఉంటుంది. జీవిత బీమా రక్షణ కల్పించడంతో పాటు గ్లోబల్ ఈక్విటీల్లో పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలికంగా మూలధన వృద్ధికి కూడా దోహదపడేలా ఇది ఉంటుంది. టాటా ఏఐఏ శుభ్ గ్లోబల్ ఇన్వెస్ట్ లాంటి యూనిట్ లింక్డ్ పథకాల ద్వారా ఈ ఫండ్ అందుబాటులో ఉంటుంది. ప్రధానంగా ఈ ఫండ్ నిధుల్లో 70%–100% వరకు భాగాన్ని గ్లోబల్ ఈక్విటీల్లో, మిగతా భాగాన్ని డెట్, మనీ మార్కెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారు.ట్రస్ట్ ఎంఎఫ్ మిడ్‌క్యాప్ ఫండ్ ప్రధానంగా మిడ్–క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా మిడ్ క్యాప్ ఫండ్‌ని ఆవిష్కరించింది. ఇది మార్చి 13 వరకు అందుబాటులో ఉంటుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్‌పరంగా 101 నుంచి 250 ర్యాంకుల వరకు ఉండే సంస్థల షేర్లు, ఈక్విటీ సంబంధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీనికి నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 టీఆర్ఐ ప్రామాణికంగా ఉంటుంది. దేశీయంగా తయారీ, ఆర్థిక సేవలు తదితర రంగాలకు చెందిన పలు మిడ్ క్యాప్ కంపెనీలు గణనీయంగా రాణిస్తున్నాయని సంస్థ తెలిపింది. గత అయిదేళ్లలో ఈ విభాగంలోని 37 కంపెనీలు మూడు రెట్లు రాబడులు అందించాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో మిడ్–క్యాప్ కంపెనీల వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ఫండ్ ఉపయోగపడుతుందని సంస్థ సీఈవో సందీప్ బాగ్లా తెలిపారు. ఐసీఐసీఐ ప్రు లైఫ్ డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (యులిప్) కింద ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్‌ని ప్రవేశపెట్టింది. నిలకడగా డివిడెండ్లను చెల్లించే ట్రాక్ రికార్డుతో ఫండమెంటల్‌గా పటిష్టంగా ఉన్న స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులు అందించడం దీని లక్ష్యం. బీఎస్ఈ 500 నుంచి ఎంపిక చేసిన 50 కంపెనీల ఇండెక్స్‌ని ఇది ట్రాక్ చేస్తుంది. ఐసీఐసీఐ ప్రు సిగ్నేచర్ అష్యూర్, స్మార్ట్‌కిడ్ అష్యూర్, స్మార్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్లస్ (సిప్ ప్లస్) తదితర పథకాలతో ఇది లభిస్తుంది. -
మ్యూచువల్ ఫండ్స్.. ‘కొత్త’ ఆఫర్స్!
ఓవైపు జీవిత బీమా భద్రత పొందుతూనే మరోవైపు సంపదను పెంచుకునేందుకు అవకాశం కలి్పస్తూ టాటా ఏఐఏ లైఫ్ కొత్తగా ఎన్హాన్స్డ్ వేల్యూ ఇండెక్స్ ఫండ్స్‌ని ఆవిష్కరించింది. ఎన్హాన్స్డ్ వేల్యూ ఇండెక్స్ ఫండ్, ఎన్హాన్స్డ్ వేల్యూ ఇండెక్స్ పెన్షన్ ఫండ్ వీటిలో ఉన్నాయి. ఇవి ప్రధానంగా వేల్యూ ఇన్వెస్టింగ్ పద్ధతిలో లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీల స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. టాటా ఏఐఏ యూనిట్ లింక్డ్ ప్లాన్ల ద్వారా వీటిని తీసుకోవచ్చు. పిల్లల చదువులు, అసెట్స్ సమకూర్చుకోవడం, దీర్ఘకాలిక ఆర్థిక భద్రత మొదలైన ప్రణాళికలకు మొదటి ఫండ్ ఉపయోగకరంగా ఉంటుంది. రిటైర్మెంట్ నిధిని ఏర్పర్చుకోవడానికి రెండోది పని చేస్తుంది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ ఫిబ్రవరి 16 వరకు అందుబాటులో ఉంటుంది. ఓల్డ్ బ్రిడ్జ్ ఫ్లెక్సి క్యాప్ ఫండ్ లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఈ ఫండ్‌ని ఓల్డ్ బ్రిడ్జ్ మ్యూచువల్ ఫండ్ ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 23 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. బాటమ్–అప్ వ్యూహంతో దీర్ఘకాలిక పెట్టుబడి వృద్ధికి దోహదపడే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. అయిదేళ్లకు పైగా పెట్టుబడులు కొనసాగించే వారికి అనువైన ఫండ్. కనీసం రూ. 5,000 నుంచి, సిప్ అయితే రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. కేవలం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా పెట్టుబడులను కేటాయించకుండా కంపెనీ వ్యాపార నాణ్యత, వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. బీఎస్ఈ 500 టీఆర్ఐ దీనికి ప్రామాణికంగా ఉంటుంది. -
ఇన్సూరెన్స్ ఏజంట్లను కాపాడుకోవడం కష్టమైపోయింది..
జీవిత బీమా కంపెనీలకు ఏజంట్ల రిటెన్షన్ (వారు వైదొలగకుండా అట్టే పెట్టుకోవడం) సవాలుగా ఉంటోందని టాటా ఏఐఏ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ (ప్రొప్రైటరీ బిజినెస్, అలైడ్ చానల్స్) అమిత్ దవే తెలిపారు. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ 2023–24 వార్షిక నివేదిక ప్రకారం పరిశ్రమలో కొత్తగా 9.7 లక్షల మంది జీవిత బీమా ఏజంట్లు చేరగా, 6.9 లక్షల మంది నిష్క్రమించినట్లు చెప్పారు.సత్వర ప్రయోజనాలు లభిస్తాయంటూ పరిశ్రమపై నెలకొన్న అభిప్రాయమే ఇందుకు కారణంగా ఉంటోందని తెలిపారు. ఇలా ఏజంట్ల నిష్క్రమణ అనేది వ్యాపారాన్ని స్థిరంగా కొనసాగించడానికి, కస్టమర్ల నమ్మకాన్ని పొందడానికి సవాలుగా ఉంటోందని దవే తెలిపారు. ఈ నేపథ్యంలో ఏజంట్లను రిటైన్ చేసుకునేందుకు పరిశ్రమ పలు ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు.క్లయింట్ కమ్యూనికేషన్, డిజిటల్ టూల్స్ మొదలైన వాటిల్లో కంపెనీలు శిక్షణనిస్తున్నాయని తెలిపారు. అధునాతన టెక్నాలజీ, మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచుతున్నాయన్నారు.ఇదీ చదవండి: బంగారాన్నే నమ్ముతా: జోహో సీఈఓ శ్రీధర్ వెంబు -
నివా బూపా పాలసీ.. టాటా ఏఐఏ అప్డేట్స్
నివా బూపా ‘రైజ్’ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మధ్యతరగతి వర్గాల ఆదాయాలు, జీవన విధానాలకు అనుగుణంగా ఉండేలా హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ నివా బూపా ‘రైజ్’ పేరిట ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. స్వయం ఉపాధి పొందుతున్నవారు, చిన్న వ్యాపారాలు చేసే వారు, స్థిరంగా నెలవారీ ఆదాయం ఉండని వర్గాలకు కూడా ఉపయోగపడే విధంగా అందుబాటు ప్రీమియంలతో ఇది ఉంటుంది. ఫ్లెక్సీ–పే బెనిఫిట్ ఫీచరుతో కస్టమర్లు ముందుగా ప్రీమియంలో 20 శాతమే చెల్లించి పాలసీ తీసుకుని, మిగతా మొత్తాన్ని పాలసీ వ్యవధిలో చెల్లించవచ్చు. ఎంత త్వరగా చెల్లించేస్తే అంత ఎక్కువగా డిస్కౌంటు పొందవచ్చు. ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా చికిత్స పొందినా స్మార్ట్ క్యాష్ బెనిఫిట్‌తో, చికిత్సానంతర వ్యయాల కోసం నిర్దిష్ట మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రీమియంలో 50 శాతం మొత్తానికి సరిపడేంతగా సమ్ ఇన్సూ్జర్డ్ను పెంచే రిటర్న్ బెనిఫిట్, 16 ప్రాంతీయ భాషల్లో డాక్టర్లతో డిజిటల్ కన్సల్టేషన్లు తదితర ప్రయోజనాలను కూడా దీనితో పొందవచ్చు. ఇదీ చదవండి: చైనా ఆర్మీలోకి ‘డీప్‌సీక్’!టాటా ఏఐఏ ట్యాక్స్ బొనాంజా కన్జంప్షన్ ఫండ్టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా రెండు ఫండ్స్‌ను ఆవిష్కరించింది. ట్యాక్స్ బొనాంజా కన్జంప్షన్ ఫండ్, ట్యాక్స్ బొనాంజా కన్జంప్షన్ పెన్షన్ ఫండ్ వీటిలో ఉన్నాయి. ఇందులో మొదటిది సంపద సృష్టికి అలాగే ఆర్థిక భద్రతకు తోడ్పడుతుంది. రెండోది, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక అవసరాల కోసం పొదుపు చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ రెండు న్యూ ఫండ్ ఆఫర్లు మార్చి 31తో ముగుస్తాయి. యూనిట్ ధర రూ.10గా ఉంటుంది. పెరుగుతున్న వినియోగం వల్ల లబ్ధి పొందే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వచ్చే ప్రయోజనాలను మదుపరులకు అందించే విధంగా ఈ ఫండ్స్ ఉంటాయి. ప్రధానంగా ఎఫ్ఎంసీజీ, రిటైల్..ఈ–కామర్స్, ఆటోమొబైల్స్.. ప్రీమియం ఉత్పత్తుల రంగాల సంస్థల్లో ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. -
తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ జీవిత బీమా దిగ్గజం టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ .. తెలుగు రాష్ట్రాల్లో విస్తరణపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా గత మూడు నెలల వ్యవధిలో 9 శాఖలు ఏర్పాటు చేసింది. గత ఆర్థిక సంవత్సరం 2,000 మంది పైచిలుకు అడ్వైజర్లను నియమించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా సుమారు 1,400 మంది చేరారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో టాటా ఏఐఏ లైఫ్ శాఖల సంఖ్య 22కి చేరగా, అడ్వైజర్ల సంఖ్య 4,400 పైచిలుకు పెరిగింది. కంపెనీ ఎండీ, సీఈవో నవీన్ తహ్లియానీ మీడియా సమావేశంలో ఈ విషయాలు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం తమకు సుమారు 314 శాఖలు ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 12, తెలంగాణలో 10 ఉన్నాయని చెప్పారు. ఏజెన్సీల ద్వారా వచ్చే కొత్త ప్రీమియం వసూళ్లకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాటా 8%గా నమోదైందని, అన్ని మాధ్యమాల ద్వారా వచ్చిన కొత్త ప్రీమియం వ్యాపారంలో ఇది 5.5%గా ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం తమ సంస్థ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) రూ.54,000 కోట్లుగా ఉంటాయన్నారు. 30–40 శాతం వృద్ధి అంచనా.. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రీమియం ఆదాయం సుమారు 30% పెరిగి రూ. 11,105 కోట్లకు చేరిందని నవీన్ చెప్పారు. తమ కంపెనీపరంగా ఈ ఆర్థిక సంవత్సరం కూడా 30–40% వృద్ధి అంచనా వేస్తున్నామని, పరిశ్రమ సగటు 20% స్థాయిలో ఉండవచ్చన్నారు. సుమారు రూ. 488 కోట్లు సమీకరించేందుకు నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ నుంచి అనుమతి లభించిందని, త్వరలో ఈ నిధులను సమీకరించనున్నామని నవీన్ పేర్కొన్నారు. కోవిడ్ క్లెయిమ్‌లు పెరుగుతున్న నేపథ్యంలో రీఇన్సూరెన్స్ సంస్థలు కూడా రేట్లు పెంచే యోచనలో ఉన్నాయని ఆయన తెలిపారు. దీనివల్ల పాలసీదారులపై భారం పడకుండా ఉండేలా చూసేందుకు వాటితో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. -
‘టాటా ఏఐఏ’ బ్రాండ్ అంబాసిడర్‌గా నీరజ్ చోప్రా
న్యూఢిల్లీ: టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. ఇటీవలే టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్టు ప్రకటించింది. బహుళ సంత్స రాల బ్రాండ్ భాగస్వామ్యంగా దీన్ని పేర్కొంది. దేశవ్యాప్తంగా వినియోగదారులుకు అత్యుత్తమ జీవిత బీమా, ఆరోగ్య బీమా రక్షణకుతోడు, ఆరోగ్య పరిష్కారాలను అందించాలన్న కంపెనీ ప్రయత్నాలకు నీరజ్‌చోప్రా మద్దతుగా నిలుస్తారని టాటా ఏఐఏ లైఫ్ తన ప్రకటనలో తెలిపింది. నీరజ్ భాగస్వామ్యంతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కంపెనీ మరింత విస్తరించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. (చదవండి: IND VS ENG: ఇంగ్లండ్‌లో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్.. షెడ్యూల్ ఇదే) -
టాటా టెలీ యూజర్లకు జీవిత బీమా కవరేజీ
ఏపీ, తెలంగాణల్లో ప్రయోగాత్మకంగా ఎం – ఇన్సూరెన్స్ సర్వీసులు ముంబై: ఎం–ఇన్సూరెన్స్ సేవలు అందించేందుకు టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా టెలీసర్వీసెస్ (టీటీఎస్ఎల్) చేతులు కలిపాయి. ఈ ఒప్పందం కింద ఆర్థికంగా బలహీన వర్గాలకు రూ. 1,00,000 దాకా జీవిత బీమా కవరేజీ అందించనున్నాయి. నిర్దిష్ట రీచార్జ్‌లపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని టాటా టెలీ ప్రీపెయిడ్ యూజర్లకు ప్రయోగాత్మకంగా ఈ ఎం–ఇన్సూరెన్స్ పాలసీ అందించనున్నట్లు టాటా ఏఐఏ లైఫ్ తెలిపింది. అన్ని వర్గాలకు బీమా ప్రయోజనాలు అందుబాటులోకి తేవాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి తగ్గట్లుగా, బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ నిబంధనలకు అనుగుణంగా దీన్ని రూపొందించినట్లు సంస్థ చైర్మన్ ఇషాత్ హుసేన్ తెలిపారు.


