విద్యార్థుల కోసం ప్రత్యేకమైన టర్మ్‌ ప్లాన్‌ | Tata AIA Launches Term Plan for Students | Sakshi
Sakshi News home page

విద్యార్థుల కోసం ప్రత్యేకమైన టర్మ్‌ ప్లాన్‌

Apr 20 2026 4:54 PM | Updated on Apr 20 2026 5:13 PM

Tata AIA Launches Term Plan for Students

నేడు ఎంతో మంది విద్యార్థులు రుణాలతో విదేశీ విద్య కోసం వెళుతున్న నేపథ్యంలో.. వారికంటూ ప్రత్యేకమైన టర్మ్‌ ప్లాన్‌ను టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకొచ్చింది. విద్యా రుణం తీసుకున్న వారు విద్య పూర్తి చేసుకుని, ఉపాధి పొందిన వెంటనే తిరిగి చెల్లింపులు మొదలు పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ ఆ లోపు విద్యార్థికి అనుకోనిది ఏదైనా జరిగితే ఆ రుణాన్ని చెల్లించాల్సిన భారం కుటుంబంపై పడుతుంది.

ఈ ఇబ్బంది లేకుండా ఉండేందుకు టాటా ఏఐఏ ‘స్టూడెంట్‌ ఫోకస్డ్‌ టర్మ్‌ ప్లాన్‌’ను ప్రవేశపెట్టింది. 18–25 ఏళ్ల వయసులోని విద్యార్థులు దీన్ని తీసుకోవచ్చు. భారత్‌లో లేదా విదేశాల్లో గుర్తింపు పొందిన విద్యా కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. రూ.2 కోట్ల వరకు సమ్‌ ఇన్సూర్డ్‌తో ప్లాన్‌ తీసుకోవచ్చు. లేదా ఎంత మేర విద్యా రుణం తీసుకుంటే, అంత వరకే కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు. పాలసీ కాల వ్యవధి పదేళ్ల పాటు ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement