ఆలయాన్ని తలపించే కేఫ్‌..! ఏకంగా ప్రపంచంలోనే.. | World's largest cafe in Bengaluru constructed just like south Indian temple theme | Sakshi
Sakshi News home page

ఆలయాన్ని తలపించే కేఫ్‌..! ఏకంగా ప్రపంచంలోనే..

Apr 20 2026 2:05 PM | Updated on Apr 20 2026 2:10 PM

World's largest cafe in Bengaluru constructed just like south Indian temple theme

ఎన్నో కేఫ్‌లు చూసుంటాం. ఇలాంటి కేఫ్‌ చూసే ఛాన్సే లేదు. ఎందుకంటే..మనసుకి హాయినిచ్చే ఆధ్యాత్మికత, కడుపు నింపే కమ్మని భోజనం ఒకే చోట లభించే హోటల్‌ లేదా రెస్టారెంట్‌ గురించి ఇంతవరకు చూడలేదు. అలాంటి అపురూపమైన దృశ్యం ఆ కేఫ్‌లో చూడొచ్చు. ఆలయానికి వెళ్తున్నామా లేక కేఫ్‌కి వెళ్తున్నామా అనే గందరగోళానికి గురి చేసే అద్భుతమైన కేఫ్‌ ఇది. ఎక్కడ ఉందంటే..

బొమ్మసంద్రలోని బెంగళూరు కొత్త రామేశ్వరం కేఫ్, 9 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో 'ప్రపంచంలోనే అతిపెద్ద కేఫ్'గా అలరారుతోంది. ఇందులో 600 మందికి పైగా కూర్చునే సౌకర్యం ఉంది. ఆదియోగి విగ్రహంతో కూడిన ఒక జలాశయం కూడా ఉంది. బొమ్మసంద్రలో రామేశ్వరం కేఫ్ సరికొత్త అతిపెద్ద అవుట్‌లెట్తో బెంగళూరు పాక ప్రపంచాన్ని ఓ రేంజ్‌కి తీసుకెళ్లింది. 

ఆలయ ప్రాంగణాన్ని తలపించే ప్రవేశ ద్వారం అత్యంత ఆకర్షణీయంగా ఆకట్టుకుంటుంది. అతిథులు రాగానే, మధ్యలో ఆదియోగి విగ్రహం, ఫౌంటెన్‌తో కూడిన ప్రశాంతమైన జలాశయం వారికి స్వాగతం పలుకుతుంది. దక్షిణ భారత దేవాలయ వాస్తుశిల్పాన్ని ఆధునికతను జోడించి..భోజనాన్ని కేవలం ఒక పూట భోజనంగా కాకుండా ఒక ఆధ్యాత్మిక ఆచారంగా అందంగా మార్చారు. 'దైవ స్పర్శ' అనే థీమ్‌తో ఈ కేఫ్‌ని నిర్మించారట. ఈ కేఫ్‌లో హైలెట్‌గా దేవి లింగ భైరవి ఆలయం, అలాగే కర్ణాటక వారసత్వానికి ప్రతీక అయిన భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలు, వీణా కచేరీలతో సహా సంగీత ప్రదర్శనల కోసం రూపొందించిన ఒక యాంఫీథియేటర్ కూడా ఉంది. 

అలాగే అక్కడ సేవ కౌంటర్ల వద్ద విత్ర చిహ్నాల క్లిష్టమైన చెక్క శిల్పాలు చూపురులను ఆకర్షిస్తాయి. ఇక్కడ ఒక ప్రత్యేక గోశాల కూడా ఉంది. ఆధ్యాత్మిక దృశ్యాలను ప్రదర్శించే హై-టెక్ డిజిటల్ స్క్రీన్‌లు, పురాతన రాతి విగ్రహాల వైభవంతో చాలా అందంగా తీర్చిదిద్దారు. 'ది రామేశ్వరం కేఫ్' వ్యవస్థాపకుడు రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. ఈ భారీ ప్రాజెక్ట్ వెనుక ఉన్న తత్వాన్ని గురించి వెల్లడించారు. ఇది సంస్కృతి, నమ్మకం, ఆహారం ఏకమై ఉండే ఒక ప్రదేశాన్ని సృష్టించడమే  లక్ష్యంగా ఇలా కేఫ్‌ని తీర్చిదిద్దామని అన్నారు. 

అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అంతేగాదు పోస్ట్‌లో రామేశ్వరం కేఫ్‌ ఇలా పేర్కొంది. ఇక్కడ ప్రతి దేవాలయం, ప్రతి విగ్రహం, ప్రతి వివరం ఒక ఉద్దేశ్యంతోనే ఉంచాం. కేవలం సర్వీస్‌ మాత్రమే కాదు సంస్కృతి, నమ్మకం, ఆహారం కలగలిసిన అనుభూతికి కేంద్రబిందువుగా ఒక దేవాలయ అనుభూతిని తీసుకొచ్చే.. ఒక దివ్యమైన భోజన అనుభవం అని ప్రకటించింది.

 

(చదవండి: లండన్ వ్లాగర్ మదిని దోచిన వంటకం..! అత్యంత ఆరోగ్యకరం కూడా..)

 

Advertisement
 
Advertisement
Advertisement