విజయ్‌ వరాల జల్లు : భారీ హామీలతో TVK మేనిఫెస్టో | TVK manifesto Vijay aid for women gold for brides and AI led governance | Sakshi
Sakshi News home page

విజయ్‌ వరాల జల్లు : భారీ హామీలతో TVK మేనిఫెస్టో

Apr 16 2026 6:28 PM | Updated on Apr 16 2026 6:47 PM

TVK manifesto Vijay aid for women gold for brides and AI led governance

మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయం

మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు

చిన్న రైతులకు పంట రుణ మాఫీ ,రూ. 3,500 కనీస మద్దతు ధర (MSP)

ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా

విద్యార్థులకు రుణాలు, ప్రోత్సాహకాలు

పేద వధువులకు కాసు బంగారం, పట్టుచీర

సాక్షి, చెన్నై: రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం యాక్టర్‌ టర్న్డ్‌ పొలిటీషియన్‌ విజయ్ గురువారం తమిళగ వెట్రి కజగం(TVK) మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఇందులో మహిళలు, రైతులు మరియు బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని పలు సంక్షేమ చర్యలను వాగ్దానం చేశారు. విజయ్ తన మేనిఫెస్టోను నిజాయితీకి నిదర్శనంగా అభివర్ణించారు. విజయ్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలు, వాగ్దానాలు  ఆసక్తికరంగా మారాయి.

నిజాయితీ పరిపాలనను తన సిద్ధాంతం టీవీకే  పార్టీ అధినేత ప్రకటించారు. అందుకే  తమ పార్టీ తొలి ఎన్నికల ప్రణాళిక కూడా నిజాయితీకి హామీలనీ,  తాము స్టాలిన్ లాగా ప్రజలను తప్పుదోవ పట్టించమని  వెల్లడించారు.. ప్రజలకు ఉత్తుత్తి వాగ్దానాలతో రూపొందించిన తొందరపాటు ఎన్నికల ప్రణాళిక తమది కాదని  పేర్కొన్నారు. డీఎంకే, మిగతా పార్టీలన్నీ ఒకటే అని చెప్పాం కదా?...  కావాలంటే ఇరు పక్షాలు విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలను తీసుకుని పోల్చి చూడండని విజయ్ అన్నారు.

పీటీఐ ప్రకారం, ఈ ప్రకటనలలో ముఖ్యంంగా మహిళలకు నెలకు రూ. 2,500 సహాయం,   పెళ్లి చేసుకునే పేదింటి వధువులకు నాణ్యమైన పట్టు చీరతో పాటు 8 గ్రాముల బంగారం మహిళలు నడుపుతున్న స్వయం సహాయక బృందాలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు , బడి మానేయడాన్ని నివారించడానికి తల్లులకు సంవత్సరానికి రూ. 15,000 సహాయం అందిస్తామని కూడా విజయ్ హామీ ఇచ్చారు.  

ప్రధాన పార్టీలు నిజమైన విధాన ప్రత్యామ్నాయాలను అందించడం కంటే, ఒకరిని మించి ఒకరు పోటీ పడాలనే లక్ష్యంతో ఒకే రకమైన వాగ్దానాలతో కూడిన తొందరపాటు ఎన్నికల ప్రణాళికలను జారీ చేస్తున్నాయని  ఎద్దేవా ఏశారు. ఈ పార్టీలన్నీ ఒకే గొడుగు కింద పనిచేస్తున్న "అవినీతి ముఠాలు" అని ఆయన ఆరోపించారు.  టీవీకే ఓటర్లను అదే విధంగా తప్పుదోవ పట్టించదని అన్నారు.

ముఖ్యమైన  హామీలు

  • మహిళా సంక్షేమానికి నగదు సాయం: మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం.

  • నిరుపేద వధువులకు 8 గ్రాముల  (కాసు) బంగారం , పట్టుచీర.

  • మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు.

  • 5 ఎకరాలలోపు భూమి ఉన్న చిన్న రైతులకు సహకార బ్యాంకుల్లో ఉన్న పంట రుణాల పూర్తి మాఫీ.

  • వరి పంటకు క్వింటాల్‌కు రూ. 3,500 మద్దతు ధర (MSP).

  • ఆరోగ్యం మరియు విద్య విషయంలో కూడా కీలక హామీని తన మానిఫెస్టోలో పొందుపర్చారు. 
    దీనికి ప్రకారం ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా.

  • రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక ఆసుపత్రుల ఏర్పాటు మరియు ఏటా ఉచిత ఆరోగ్య పరీక్షలు.

  • విద్యా రంగానికి సంబంధించి, విద్యార్థులకు అండగా నిలిచేందుకు రూ. 20 లక్షల వరకు ఉన్నత విద్యా రుణాలను అందించనున్నట్లు TVK అధినేత ప్రకటించారు మాజీ ముఖ్యమంత్రి కె. కామరాజ్ పేరుతో 100 ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు  చేస్తామన్నారు. పాఠశాల విద్యను మధ్యలోనే మానేసే సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో, ప్రభుత్వ, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఏటా రూ. 15,000 ఆర్థిక సాయం. దీంతోపాటు తమిళనాడును డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని హామీ ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై  విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే అవినీతి రహిత, నిజాయితీతో కూడిన పరిపాలన అందిస్తామని విజయ్ పేర్కొన్నారు.ప్రస్తుత అధికార పక్షం (DMK), ఇతర పార్టీలు తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్నాయని, తమ మేనిఫెస్టో మాత్రం ఆచరణాత్మక మైందని ఆయన స్పష్టం చేశారు.

    ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్‌ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి

Advertisement
 
Advertisement
Advertisement