ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువకుడు, 40ఏళ్ల వితంతువు చేసిన పని నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సోషల్‌మీడియా పరిచయం పెళ్లికి దారి తీసింది. మరి వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారా? నెటిజన్లు ఏమంటున్నారు? సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ ఉదంతం గురించి తెలుసుకుందాం
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ ఒకరికొకరు పరిచయమయ్యారు. 'రీల్స్' చాటింగ్ ద్వారా వీరి పరచయం కాస్తా ప్రణయంగా మారింది. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి జీవించాలని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒక రోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇరు కుటుంబ సహ్యులకు ఎవరికి సమాచారం ఇవ్వకుండా, రహస్యంగా, గుడిలో పెళ్లి చేసుకున్నారు.కలిసి జీవితం మొదలుపెట్టారు. చివరికి ఈ విషయం అబ్బాయి తల్లికి తెలిసింది. ఆగ్రాలోని మహిళ ఇంట్లో ఇద్దరినీ గుర్తించారు. కానీ కుటుంబ సభ్యులు ఈ యువకుడిని ఇంట్లో ఉంచుకోవడానికి నిరాకరించారు.
ఇదీ చదవండి: టీసీఎస్ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్
దీనిపై నెటిజనులలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమైనాయి. ఇది నిజమైన ప్రేమా లేక కేవలం తాత్కాలిక ఆకర్షణా? 19 ఏళ్ల వయసు వ్యత్యాసం, రహస్య వివాహం ఎంతవరకు నిలబడుతుంది అని కొందరు ప్రశ్నించగా, కుటుంబ మద్దతు లేకుండా ఇంత పెద్ద అడుగు వేయడం కష్టమే, అని ఒకరు వర్చువల్ చాటింగ్, రీల్స్‌ను చూసి నిజజీవితంలో నిజమని నమ్మితే ఇలాంటి పరిణామాలే సంభవిస్తాయని కొందరు వ్యాఖ్యానించారు. ఇన్‌స్టాలో పరిచయం అయిన ఒక మహిళ కోసం తన కుటుంబాన్ని, ఇంటిని త్యాగం చేశాడు. సోషల్ మీడియాలో కలిసిన ఒక అపరిచితుడి కోసం ఏ అబ్బాయి లేదా అమ్మాయైనా తమ తల్లిదండ్రులను, విలువలను పణంగా పెట్టడం పచ్చి అవివేకం, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఎంత దూరమైనా వెళతాయి అనేందుకు ఈ ఘటనే నిదర్శనం అని మరికొందరు వ్యాఖ్యానించారు ఇద్దరూ చట్టపరంగా వయోజనులే, కాబట్టి వారి వివాహం చట్టబద్ధమే. ఎలాంటి కష్టనష్టాలొచ్చినా వారే భరిస్తారు. కానీ వీరి సంబంధం కలకాలం నిలబడాలంటే అధిక భావోద్వేగ పరిపక్వత, బలమైన విశ్వాసం అవసరమని నిపుణులు చెబుతున్న మాట.
ఇదీ చదవండి: రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్‌నైట్ : తీవ్ర ఘర్షణ, కట్ చేస్తే!


