టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ యూనిట్‌లో జరిగిన లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ఆరోపణలపై కొనసాగుతున్న దర్యాప్తు కొత్త మలుపు తీసుకుంది. అరెస్టు అయిన ఉద్యోగులలో ఒకరి భార్య సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడు డానిష్ షేక్ భార్య ఫిర్యాదుదారులలో ఒక మహిళకు, తన భర్తకు మధ్య ఉన్న చెడిపోవడంతోనే ఈ పరిమాణానికి దారి తీసిందని, అదే ఇతరుల జీవితాలను నాశనం చేసిందని ఆరోపించింది ఈ కేసులో తన భర్తతో సహా ఇతర పురుషులందరూ నిర్దోషులని, వేర్వేరు సమస్యలు, కేసులను కలిపివేశారని ఆమె ఆరోపించింది.
నిందితుడి భార్య సంచలన ఆరోపణలు
కేవలం వారి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధం విఫలం కావడంవల్ల తలెత్తిన వివాదమని ఆమె పేర్కొంది. డానిష్ షేక్, బాధితురాలిగా చెబుతున్న మహిళకు మధ్య సంబంధం ఆఫీసులో అందరికీ తెలుసంటూ ఆమెపై పలు ఆరోపణలు చేసింది. ఆ మహిళ తన భర్త (నిందితుడు) కోసం గంటల తరబడి వేచి చూసేదని, ఆమె అతనిపై ఇష్టంతోనే తన ఆహార్యాన్ని, అలవాట్లను మార్చుకుందని ఆరోపించారు.ఉపవాసాలు చేయడం, దుస్తులు మార్చుకోవడం లాంటి ప నులెన్నో చేసిన తన భర్తకు ఆకర్షించిదని తెలిపింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కలత చెందారని ఆమె పేర్కొంది. ఆ సంబంధం ముగిసిన తర్వాత, ఫిర్యాదుదారురాలి తల్లిదండ్రులు కొంతమంది రాజకీయ నాయకులను సంప్రదించి, ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని ఇతర పురుషుల పేర్లను కూడా చేర్చి పోలీసులకు ఫిర్యాదు చేయమని ఆమెను ఒప్పించారని ఆమె ఆరోపించింది.
కేసు పూర్వాపరాలు, అరెస్టుల పర్వం
పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి తన సహోద్యోగి ఒకరు తనతో సంబంధం పెట్టుకున్నాడని ఒక మహిళా ఉద్యోగి ఆరోపించడంతో ఈ కేసు ప్రారంభమైంది. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ, ఇలాంటి అనుభవాలే ఎదురైన మరో ఏడుగురు మహిళలు ముందుకు రావడంతో ఈ కేసు మరింత ముదిరింది.మొత్తం 8 మంది మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో, 8 మంది ఉద్యోగులపై మొత్తం 9 FIRలు నమోదయ్యాయి.
ఇప్పటివరకు 7 గురు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో డానిష్ షేక్, తౌసిఫ్ అత్తార్, రజా మెమోన్, షారూఖ్ ఖురేషీ, షఫీ షేక్, ఆసిఫ్ అఫ్తాబ్ అన్సారీ ,ఒక మహిళా ఆపరేషన్స్ మేనేజర్ ఉన్నారు. ప్రధానంగా రేప్, మానసిక , లైంగిక వేధింపులతో మత మార్పిడికి ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు సంచలనం రేపాయి. అలాగే ఫిర్యాదులను పట్టించుకోలేదనే కారణంతో HR ఎగ్జిక్యూటివ్ నిదా ఖాన్‌పై కూడా కేసు నమోదైంది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులందరినీ టీసీఎస్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంపై స్పందించిన టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ COO ఆర్తి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సమగ్ర అంతర్గత విచారణకు ఆదేశించారు.
ఇదీ చదవండి: రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్‌నైట్ : తీవ్ర ఘర్షణ, కట్ చేస్తే!
సిట్ విచారణ
ఈ కేసు తీవ్రత దృష్ట్యా నాసిక్ పోలీసులు ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. కేవలం ఒక మహిళా ఫిర్యాదుతో మొదలైన ఈ కేసు, విచారణ కొనసాగుతున్న కొద్దీ మరికొంతమంది బాధితులు ముందుకు రావడంతో మరింత విస్తృతమైంది.ఈ కేసులో ఒకవైపు తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు, మరోవైపు వ్యక్తిగత కక్షలనే వాదనలు వినిపిస్తుండటంతో సిట్ విచారణ కీలకంగా మారింది.
ఇదీ చదవండి: ఎల్‌పీజీ యథాస్థితికి రావాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా?
నిదా ఖాన్‌పై ఆరోపణలు
బాధితుల నుండి వచ్చిన 70కి పైగా ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండా, హెచ్‌ఆర్ మేనేజర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం) వాటిని పట్టించుకోలేదని సిట్ వెల్లడించింది. కార్యాలయంలోని లైంగిక వేధింపుల నివారణ (పోష్) కమిటీలో సభ్యురాలిగా ఉన్నప్పటికీ, ఫిర్యాదులను పక్కన పెట్టి, నిందితులను రక్షించడానికి ప్రయత్నించిన హెచ్‌ఆర్ మేనేజర్ నిదాఖాన్‌ను పోలీసులు కీలక 'సూత్రధారి'గా గుర్తించారు. నిందితుల మధ్య జరిగిన సుమారు 78 అనుమానాస్పద కాల్ రికార్డులు, ఈమెయిళ్లు, చాట్ సంభాషణలతో సహా పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఆర్థిక లావా దేవీలు జరిగినట్లు కూడా అనుమానిస్తున్నారు.


