కళ్లముందు ఏదైనా ఉపద్రవం ముంచుకొస్తున్నప్పుడు మనల్ని రక్షించుకునేందుకు అందరమూ ముందుగా చేసి పని అక్కడినుంచి పారిపోవడం, ఎంత వేగంగా సాధ్యమైతే అంత వేగంగా పరుగెత్తడం. ఏప్రిల్ 6న ఇండోనేషియాలోని అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతాలలో ఒకటైన మౌంట్ డుకోనో (Mount Dukono) వద్ద ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులకు ఊహించని అనుభవం ఎదురైంది. అయితే క్షణాల్లో వారి ప్రాణాలను కాపాడిన గైడ్ నిర్ణయం నెట్టింట విశేషంగా నిలుస్తోంది. అదేంటో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
ఛానల్ న్యూస్ ఏషియా నివేదిక ప్రకారం మౌంట్ డుకోనో అగ్నిపర్వతం శిఖరానికి సమీపంలో ఆ బృందం ట్రెక్కింగ్ చేస్తుండగా, కేవలం కొన్ని మీటర్ల దూరంలో అకస్మాత్తుగా విస్ఫోటనం సంభవించింది. క్షణాల్లో బూడిద, శిథిలాలతో కూడిన ఒక ఎత్తైన స్తంభం ఆకాశంలోకి ఎగసి పడింది. దీంతో అక్కడున్న పర్వతా రోహకులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. అక్కడినుంచి దూరంగా వెళ్ళాలనే ఆశతో కొండ కిందికి వెళ్లడం ప్రారంభించారు. కానీ వారి లోకల్ గైడ్ వెంటనే జోక్యం చేసుకుని, అందరినీ ఆగి, ఉన్నచోటనే ఉండమని ఆదేశించాడు. "కిందికి వెళ్లొద్దు, పైకే రండి!" అని ఆ గైడ్ గట్టి గట్టిగా కేకలు వేసి మరీ అప్రమత్తం చేశాడు. గైడ్ చాకచక్యంతో వారు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. గాలి దిశను, బూడిద ప్రవహించే మార్గాన్ని అంచనా వేసిన గైడ్, అందరినీ ఒకే చోట ఉంచడం ద్వారా వారు సురక్షితంగా ఉండేలా చూడడం ప్రశంసలు దక్కించుకుంటోంది. ఇలాంటి కీలక ప్రదేశాల్లో ట్రెక్కింగ్ చేసేటపుడు అనుభవం ఉన్న స్థానిక గైడ్ల సలహాలు పాటించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన నిరూపించింది అంటున్నారు.
Terjebak di puncak saat abu vulkanik mulai membumbung tinggi!
Di saat semua orang panik ingin lari ke bawah, guide ini justru mengambil keputusan yang dianggap 'gila': Melarang pendaki turun!
Ternyata, ini adalah langkah paling jenius untuk menghindari awan panas dan material… pic.twitter.com/JNGe1g8pzA— Cadas (@Music_Cadas) April 14, 2026
ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి
ఎందుకు కిందికి వెళ్లకూడదు అంటే
సాధారణంగా ప్రమాదం జరిగినప్పుడు దూరంగా వెళ్లాలని అనుకుంటాం. కానీ అగ్నిపర్వతాల విషయంలో, వేగంగా కదిలే వేడి బూడిద మేఘాలు (Ashclouds) విష వాయువులు కొండవాలు గుండా కిందికి ప్రవహిస్తాయి. కిందికి పరిగెత్తితే నేరుగా ఆ ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉంటుంది.
మౌంట్ డుకోనో: ఇది ఉత్తర మలుకులోని హల్మహెరా ద్వీపంలో ఉంది. ఇది తరచుగా విస్ఫోటనం చెందుతూ ఉంటూ, బూడిదను వెదజల్లుతుంటుంది. సాహస యాత్రికులకు ఇది ఇష్టమైన ప్రదేశం అయినప్పటికీ, ఇక్కడి పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉంటాయి.
ఇదీ చదవండి: TCS Nasik case: టీసీఎస్ మరో కీలక నిర్ణయం


