TCS Nasik case టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాసిక్ కార్యాలయంలో కొంతమంది ఉద్యోగులపై లైంగిక వేధింపులు,మత మార్పిడి ఆరోపణల కేసులో రోజుకో పరిమాణం చోటు చేసుకుటోంది. ముఖ్యంగా మతమార్పిడి ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ కేసులో సంచలన ఆరోపణల నేపథ్యంలో కొంతమంది కార్యకర్తలు, హిందూ మహిళలు నగరంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఘీ కొనసాగుతున్న ఈ ఆందోళనలు, ఆఫీస్‌పై దాడుల నేపథ్యంలో టీసీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది.
బలవంతపు మత మార్పిడులు జరిగాయని ఆరోపిస్తూ, ఏప్రిల్ 16, 17 తేదీలలో దేశవ్యాప్త నిరసనలకు బజరంగ్ దళ్ బుధవారం పిలుపునిచ్చింది. దీనికి తోడ స్థానిక రాజకీయ పార్టీలు కార్యాలయ ప్రాంగణాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం, లైంగిక వేధింపుల విచారణ కొనసాగుతున్ననేపథ్యంలో, నాసిక్ బ్రాంచ్ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయమని (work from home) కోరింది. ఉద్యోగుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ పరిణామం గురించి తెలిసిన ఒక కంపెనీ అధికారి మీడియాకు తెలిపారు. నాసిక్ బీపీఓ యూనిట్ 5000 చదరపు అడుగుల కార్యాలయ స్థలం, ఇక్కడ సుమారు 170 మంది ఉద్యోగులు రెండు షిఫ్టులలో పనిచేస్తారు. ప్రస్తుతం, టీసీఎస్ కార్యాలయం ఉన్న అశోకా బిజినెస్ ఎన్‌క్లేవ్ గేటు బయట నాసిక్ పోలీసుల బృందం మోహరించి ఉంది అయితే పోలీసులు ప్రాంగణాన్ని అధికారికంగా సీల్ చేశారన్న వాదనలను కంపెనీ అధికారి ఖండించారు.
ఇదీ చదవండి: టీసీఎస్ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్

కాగా టీసీఎస్ నాసిక్ బీపీఓ యూనిట్‌లో పనిచేస్తున్న ఒక మహిళ, తన సహోద్యోగి పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి తనతో శారీరక సంబంధం కొనసాగించాడని ఆరోపిస్తూ మార్చిలో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు సమయంలో, 2022 మరియు 2026 మధ్య ఎదుర్కొన్న మానసిక మరియు లైంగిక వేధింపులకు సంబంధించి, అలాగే మానవ వనరుల విభాగం చర్యలు తీసుకోకపోవడంపై పోలీసులు మరో ఎనిమిది ఎఫ్‌ఐఆర్‌లను (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్) నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) సందీప్ మిట్కే నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ) విచారిస్తోంది.
ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి


