సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీకొట్టిన ఘటన కలకలం రేపింది. స్పైస్‌జెట్, ఆకాసా ఎయిర్ విమానాలు ఢీకొన్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగకపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు.
స్పైస్‌జెట్ విమానం టాక్సింగ్ చేస్తుండగా, నిలిచి ఉన్న అకాసా విమానాన్ని ఢీకొట్టింది. ఈ స్వల్ప ప్రమాదంలో రెండు విమానాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. స్పైస్‌జెట్ విమానం కుడి వింగ్‌లెట్ దెబ్బతినగా, అకాసా విమానం ఎడమ వైపు హారిజాంటల్ స్టెబిలైజర్‌కు దెబ్బ తగిలింది. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి


