ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు | Rasi Phalalu: Daily Horoscope On 13-06-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు

Jun 13 2026 12:16 AM | Updated on Jun 13 2026 12:16 AM

Rasi Phalalu: Daily Horoscope On 13-06-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధికజ్యేష్ఠ మాసం, తిథి: బ.త్రయోదశి ప.2.03 వరకు తదుపరి చతుర్దశి, నక్షత్రం: కృత్తిక రా.12.24 వరకు తదుపరి రోహిణి, వర్జ్యం: ప.1.08 నుండి 2.38 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.29 నుండి 7.13 వరకు, అమృత ఘడియలు: లేవు, శనిత్రయోదశి.

సూర్యోదయం :    5.28
సూర్యాస్తమయం     :  6.30
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు

మేషం: యత్నకార్యసిద్ధి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటుంది.

వృషభం: దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వ్యయప్రయాసలు.

మిథునం: ఉద్యోగయత్నాలు సానుకూలం. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

కర్కాటకం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సింహం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. దూరప్రయాణాలు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

కన్య: శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.

తుల: పనుల్లో విజయం. కీలక నిర్ణయాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. దైవదర్శనాలు.

వృశ్చికం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. పనులలో విజయం. శుభవార్తలు. ఆస్తి లాభం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. వాహనయోగం.

ధనుస్సు: రుణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ.

మకరం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

కుంభం: బంధువులతో సఖ్యత. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త ఆశలు. గృహ, వాహనయోగాలు.

మీనం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అదనపు బా«ధ్యతలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం. ఆలయాలు సందర్శిస్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement