గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: శు.ద్వాదశి ప.1.50 వరకు, తదుపరి త్రయోదశి,నక్షత్రం: జ్యేష్ఠ ఉ.8.36 వరకు, తదుపరి మూల, వర్జ్యం: లేదు,దుర్ముహూర్తం: సా.4.48 నుండి 5.41 వరకు, అమృత ఘడియలు: లేవు.
సూర్యోదయం : 5.40
సూర్యాస్తమయం : 6.32
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం... వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మరింతగా ఒత్తిడులు.
వృషభం... ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రయణాలు కొంత మార్పులు. ఆధ్యాత్మిక చింతన. బంధువర్గంతో మాటపట్టింపులు. వ్యాపారాలలో సాధారణ లాభాలు. ఉద్యోగాలలో కొంతమేర ఒత్తిడులు.
మిథునం... పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వస్త్ర, వస్తులాభాలు. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు రాగలవు.
కర్కాటకం... దూరపు బంధువుల కలయిక. శుభవర్తమానాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఆటంకాలు అధిగమిస్తారు.ఉద్యోగాలలో ఉన్నతపోస్టులు. దైవదర్శనాలు చేసుకుంటారు.
సింహం... బంధువులతో విభేదాలు. ఆరోగ్యభంగం. పనుల్లో ప్రతిష్ఠంభన. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఇబ్బందులు. ఉద్యోగాలలో పనిభారం. విద్యార్థులకు గందరగోళం.
కన్య.... కుటుంబసభ్యులతో కొద్దిపాటి విభేదాలు. అనుకోని ధనవ్యయం. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. కళాకారులకు విదేశీ పర్యటనలు. అనారోగ్యం.
తుల.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి.సోదరుల నుంచి కీలక సందేశం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలో ప్రతిష్ఠంభన తొలగుతుంది.
వృశ్చికం... బంధువులతో మాటపట్టింపులు. ప్రయాణాలు చివరిలో వాయిదా. కొన్ని పనులు ముందుకు సాగవు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.
ధనుస్సు.... నిరుద్యోగులకు ఉద్యోగయోగం. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. బంధువుల నుంచి శుభవర్తమానాలు. ఆస్తిలాభం. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
మకరం...... పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. విద్యార్థులకు శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.
కుంభం..... ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వస్తులాభాలు. విలువైన వస్తువులు కొంటారు. ఆస్తిలాభ సూచనలు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
మీనం.... చేపట్టిన పనుల్లో విజయం. శుభవర్తమానాలు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు రాగలవు. వస్తులాభాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.


