మేషం...
మీ మనస్సులోని భావాలను కుటుంబసభ్యులతో పంచుకుంటారు. ఎదుటవారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటారు. ఆత్మీయుల నుండి శుభవర్తమానాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండి అప్పుల బాధలు తీరతాయి. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఉపశమనం పొందుతారు. సోదరులతో ముఖ్య విషయాలపై సంప్రదిస్తారు. ఆస్తుల క్రయవిక్రయాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారస్తులు గతంతో పోలిస్తే మెరుగైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు కొన్ని బాధ్యతల నుండి విముక్తి లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారుల ఆశలు ఫలించే సమయం. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. పసుపు, గులాబీ రంగులు, కాలభైరవాష్టకం పఠించండి.
వృషభం...
కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు చొరవ చూపుతారు. సేవాదృక్ఫథంతో కొన్ని కార్యక్రమాలు చేపడతారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు శ్రమకోర్చి పూర్తి చేస్తారు. నైతికస్థైర్యం పెరిగి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబసభ్యుల ఆదరణ, ప్రేమ పొందుతారు. జీవితాన్ని మలుపు తిప్పే ఒక సమాచారం రావచ్చు. విద్యార్థులు నిర్భయంగా అడుగులు వేసి చేతికందిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. కొందరికి విదేశీ పర్యటన అవకాశాలున్నాయి. తరచూ దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారస్తుల చిరకాల కోరిక నెరవేరి ఆదిశగా అడుగులు వేస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నతస్థితి రావచ్చు, అయితే బాధ్యతల నుండి తప్పించుకోలేరు. రాజకీయవేత్తలు, కళాకారులకు శుభవార్తా శ్రవణం. ఊహించని పరిణామాలు ఆశ్చర్యపరుస్తాయి. వారం మధ్యలో ప్రయాణాలు. అనారోగ్యం. మానసిక అశాంతి. నీలం, నలుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.
మిథునం....
కొన్ని కార్యక్రమాలను పూర్తి చేసేవరకూ విశ్రమించరు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుని వారి అభిప్రాయాలు స్వీకరిస్తారు. ఆస్తుల తగాదాలు తీరి కొంతమేర లబ్ధి చేకూరుతుంది. వివాహయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో తట్టుకుని నిలబడతారు. ఆత్మీయులు కొంత ఇబ్బందిపెట్టినా మౌనంగానే భరిస్తారు. ఆర్థిక లావాదేవీలు మరింత అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేసే వీలుంది. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. మీపై పెత్తనం చేసేందుకు కొందరు యత్నించవచ్చు, అప్రమత్తంగా మెలగండి. దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపారస్తులు శ్రమకు తగిన ఫలితం దక్కించుకుంటారు. కొత్త పెట్టుబడులను సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతలు మీదపడినా లెక్కచేయరు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ధనవ్యయం. ఆకుపచ్చ, నేరేడు రంగులు, సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
కర్కాటకం...
జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో ఉంచుకుంటూ సరైన దిశగా అడుగులు వేస్తారు. ఆత్మీయులు, బంధువుల నుండి విశేష ప్రేమ లభిస్తుంది. ఇంతకాలం పట్టిపీడించిన కొన్ని ఇబ్బందులు తీరే సమయం వచ్చింది. ధైర్యంగా ఉండండి. మీ ఆలోచనలు, ప్రతిపాదనలను మిత్రులతో పంచుకుంటారు. ఆస్తుల కొనుగోలు వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఇంటి నిర్మాణాలపై తుది నిర్ణయానికి వస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారస్తుల ఆశలు నెరవేరతాయి. అనుకున్న లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులకు ఊరట కలిగించే సమాచారం అందుతుంది. వీరిపై ఉన్నతాధికారులలో మరింత నమ్మకం పెరుగుతుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు ఊహించని అవకాశాలు రావచ్చు. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. ఆరోగ్యసమస్యలు. గులాబీ, తెలుపు రంగులు. దుర్గామాతను స్మరించండి.
సింహం...
చీటికీమాటికీ ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య తీరుతుంది. కొన్ని అత్యవసర ప్రయాణాలు చేస్తారు. ఆర్థికంగా మరింత అనుకూలిస్తుంది. అప్పులు తీరే సమయం ఆసన్నమైంది. మీ నిర్ణయాలపై కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తారు. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుకుంటాయి. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆస్తి ఒప్పందాలు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. అనుకున్న పనులను సరైన సమయానికి చక్కదిద్దుతారు. వాహనయోగం. వ్యాపారస్తులకు మరింత లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఒక సంతోషకరమైన విషయం తెలుస్తుంది. రాజకీయ, పారిశ్రామికవేత్తల కృషి ఫలిస్తుంది. వీరికి విదేశీయానం కూడా ఉండవచ్చు. వారం ప్రారంభంలో మిత్రులతో కలహాలు. కొన్ని బాధ్యతలు తలకుమించిన భారంగా మారతాయి. దైవదర్శనాలు. గులాబీ, ఎరుపు రంగులు. సూర్యభగవానుని స్మరించండి.
కన్య....
అనుకున్న కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. విద్యార్థుల్లోని ప్రతిభకు సరైన గుర్తింపు లభిస్తుంది. ఇతరులకు సాయం చేసేందుకు కష్టాన్ని కూడా లెక్కచేయరు. దూరపు బంధువుల ద్వారా శుభవార్తలు అందుతాయి. కోర్టులో ఉన్న ఒక సుదీర్ఘ కేసు నుండి బయటపడతారు. ఆస్తులు క్రయవిక్రయాలపై ఒక నిర్ణయానికి వస్తారు. శుభకార్యాలకు తగు సన్నాహాలు సాగిస్తారు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టినా క్రమేపీ సర్దుకుంటుంది. మిత్రులతో పరిపూర్ణ విశ్వాసంతో కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారస్తులకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. లాభాలకు లోటు రాదు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు రావచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అంచనాలు నిజం కాగలవు. వారం మధ్యలో దూరప్రయాణాలు. అదనపు ఖర్చులు. మానసిక అశాంతి. ఆకుపచ్చ, నేరేడు రంగులు. విష్ణుద్యానం చేయండి.
తుల....
కుటుంబసమస్యలతో సతమతమవుతారు. ఎంతగా కష్టపడినా ఆశించిన ఫలితం రాక డీలా పడతారు. విద్యార్థుల యత్నాలు చివరి క్షణంలో వాయిదా పడతాయి. ఆలోచనలు అంతగా కలసిరావు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకునేందుకు అప్పులు చేస్తారు. చిత్రమైన సంఘటనలు ఎదురై ఆశ్చర్యపరుస్తాయి. ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురై కొంత ఇబ్బంది పడతారు. మిత్రులతో అకారణంగా విభేదాలు రావచ్చు. చేసే ప్రతి పనిలోనూ అప్రమత్తత పాటించండి. లేనిపోని వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆస్తుల క్రయవిక్రయాలు కొంతకాలం నిలుపుదల చేయడం ఉత్తమం. వ్యాపారస్తులకు లాభనష్టాలు సమంగా ఉంటాయి. ఉద్యోగస్తులు మరింత పనిభారంతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. పారిశ్రామికవేత్తలు, క్రీటాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి. విదేశీ పర్యటనలు వాయిదా వేస్తారు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య సమాచారం అందుతుంది. గులాబీ, నీలం రంగులు, హనుమాన్ చాలీసా పఠనం మంచిది.
వృశ్చికం...
వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తులు కొనుగోలు, విక్రయాలపై ఒప్పందాలు కుదురుతాయి. అనుకున్న కార్యక్రమాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. దూరప్రయాణాలకు సిద్ధంగా ఉండండి. ఆలోచనలపై సోదరులతో చర్చిస్తారు. వివాహాది శుభకార్యాల నిర్వహణకు కుటుంబంలో చర్చలు కొనసాగిస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలం కాగలవు. ఇల్లు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారస్తులు లావాదేవీలు విస్తరిస్తారు. ఉద్యోగస్తులకు విధుల్లో సంపూర్ణ సహకారం అందుతుంది. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వీరికి పురస్కారాలు కూడా అందవచ్చు. వారం చివరిలో మానసిక ఆందోళన. అనారోగ్యం. కుటుంబసభ్యులతో మనస్పర్థలు. ఎరుపు, నేరేడు రంగులు. దేవీస్థుతి మంచిది.
ధనుస్సు...
కొన్ని జఠిలమైన సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. మీరు తలచినట్లే పనులు పూర్తి చేస్తారు. ఇంతకాలం పడిన శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. భవిష్యత్తు అంచనాలు రూపొందించి తదనుగుణంగా అడుగులు వేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు. సేవా, ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. మీలో దాగిన ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. జీవితంలో మరపురాని సంఘటన ఎదురవుతుంది. వ్యాపారస్తుల చిరకాల ఆశలు నెరవేరతాయి. పెట్టుబడులకు ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగస్తులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. పసుపు, నేరేడు రంగులు, శ్రీదత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
మకరం...
కొన్ని వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుని అందరి ప్రశంసలు అందుకుంటారు. వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి. ఆప్తుల సహాయసహకారాలు అందుకుంటారు. ఆస్తుల విషయంలో చిక్కులు తొలVగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో మీ మాటకు తిరుగుండదు. మీలోని సేవాభావానికి తగిన గుర్తింపు రాగలదు. బంధువుల రాకతో ఇంట సందడి నెలకొంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శనతో మనశ్శాంతి పొందుతారు. వ్యాపారస్తులకు లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు రావచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులకు మరింత గుర్తింపు లభిస్తుంది. వారం చివరిలో దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. మిత్రులతో వివాదాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
కుంభం...
మీ మనస్సులోని అభిప్రాయాలు ఆప్తులతో పంచుకుంటారు. కష్టాల్లో ఉన్న వారిని చూసి చలించిపోతారు. వారికి చేతనైన సాయం అందిస్తారు. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నా ఏదో విధంగా సర్దుకుంటారు. ఖర్చులు కొంతమేర తగ్గిస్తారు. ఆస్తుల విషయంలో నెలకొన్న సందిగ్ధత తొలగుతుంది. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు రావచ్చు. ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకు లావాదేవీలు పంజుకుంటాయి. ఉద్యోగస్తులు విధుల్లో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఆరోగ్యభంగం. నలుపు, పసుపు రంగులు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
మీనం....
మీరు అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల నుండి శుభవార్తలు రావచ్చు. విద్యావకాశాలు మరింతగా దక్కుతాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అందరికీ ఇష్టమైన వారికి ఉంటూ వారి అభిమానం పొందుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి ద్వారా కొద్దిపాటి ఆస్తిలాభం ఉండవచ్చు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. బాధ్యతలు కఠినంగా ఉన్నా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు దైర్యాన్నిస్తాయి. ఉద్యోగులకు పనిభారం నుండి విముక్తి లభిస్తుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ధనవ్యయం. ఆరోగ్యం సహకరించదు. గులాబీ, తెలుపు రంగులు, కనకధారా స్తోత్రాలు పఠించండి.


