గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: శు.ఏకాదశి ప.11.52 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: అనూరాధ ఉ.6.02 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం: ప.12.14 నుండి 2.00 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.40 నుండి 7.22 వరకు, అమృత ఘడియలు: రా.10.50 నుండి 12.56 వరకు, తొలి ఏకాదశి (శయన ఏకాదశి).
సూర్యోదయం : 5.39
సూర్యాస్తమయం : 6.33
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు
మేషం: పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు.
వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మరింత గుర్తింపు.
మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. వ్యాపారాలలో మరింత అనుకూలత. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
కర్కాటకం: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.
సింహం: పనులలో ఆటంకాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. బంధువిరోధాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.
కన్య: పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. ఆహ్వానాలు రాగలవు. ఆస్తిలాభం. వ్యాపారాలలో మరింత లాభాలు. ఉద్యోగాలలో అనుకూలత.
తుల: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. శ్రమ తప్పదు. బంధువులతో అకారణంగా తగాదాలు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.
వృశ్చికం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
ధనుస్సు: నేర్పుగా వ్యవహరించడం మంచిది. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం.
మకరం: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాత మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతన హోదాలు.
కుంభం: ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ సత్తా చాటుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మీనం: శ్రమ తప్పకపోవచ్చు. పనుల్లో ప్రతిష్ఠంభన. బంధువులతో తగాదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.


