ఈ రాశి వారికి ఆస్తిలాభం | Rasi Phalalu: Daily Horoscope On 21-07-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆస్తిలాభం

Jul 21 2026 3:04 AM | Updated on Jul 21 2026 10:55 AM

Rasi Phalalu: Daily Horoscope On 21-07-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: శు.సప్తమి ఉ.7.06 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: చిత్త రా.12.17 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం: ఉ.7.36 నుండి 9.16 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.13 నుండి 9.04 వరకు, తదుపరి రా.10.58 నుండి 11.43 వరకు, అమృత ఘడియలు: సా.5.35 నుండి 6.16 వరకు.

సూర్యోదయం : 5.38
సూర్యాస్తమయం : 6.34
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు 

మేషం.... దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. బంధువర్గంతో ఉత్సాహంగా గడుపుతారు. నూతన ఉద్యోగలాభం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

వృషభం... ఆకస్మిక ప్రయణాలు. కుటుంబంలో చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువుల కలయిక. అనారోగ్యం. విద్యార్థుల శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

మిథునం.... రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం.  ఇంటాబయటా చికాకులు. దైవదర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు.

కర్కాటకం... ఇంటర్వూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి.

సింహం.... పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

కన్య.. కుటుంబసభ్యులతో వివాదాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక చింతన. కార్యజయం. ఆస్తిలాభం. ప్రముఖులతో పరిచయాలు.  వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

తుల.... మిత్రులతో మాటపట్టింపులు. వృథా ఖర్చులు. మానసిక ఆందోళన. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

వృశ్చికం...... కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి.

ధనుస్సు... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మకరం.... మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కుంభం.... బంధువర్గంతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. కుటుంబసమస్యలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు మార్పులు.

మీనం.... బంధువుల కలయిక. పాతబాకీలు వసూలవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం తొలగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement