గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: శు.పంచమి ఉ.7.38 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: ఉత్తర రా.10.43 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: ఉ.5.53 నుండి 7.29 వరకు, దుర్ముహూర్తం: సా.4.51 నుండి 5.43 వరకు, అమృత ఘడియలు: ప.3.30 నుండి 5.06 వరకు.
సూర్యోదయం : 5.38
సూర్యాస్తమయం : 6.34
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వాహనయోగం. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
వృషభం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్య సూచనలు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. బంధువులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కర్కాటకం: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సా«ధిస్తారు.
సింహం: బంధువులతో విభేదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి. దైవదర్శనాలు.
కన్య: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. ఉద్యోగయత్నాలు సఫలం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ఆహ్వానాలు రాగలవు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
తుల: మిత్రుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యవహారాలలో ప్రతిబంధకాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు.
వృశ్చికం: వ్యతిరేకులు సైతం మిత్రులుగా మారతారు. భూ, గృహయోగాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలం.
ధనుస్సు: రావలసిన బాకీలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. సంఘంలో గౌరవం. సోదరుల నుండి పిలుపు రావచ్చు. చర్చలు సఫలం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మకరం: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. అనుకోని ప్రయాణాలు. రుణఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. నిరుద్యోగులకు కొంత నిరాశ. వ్యాపార,ఉద్యోగాలలో చిక్కులు. మానసిక అశాంతి.
కుంభం: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మీనం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.


