గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: శు.అష్టమి ఉ.7.38 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: స్వాతి రా.1.49 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం: ఉ.6.15 నుండి 7.57 వరకు, దుర్ముహూర్తం: ప.11.40 నుండి 12.31 వరకు, అమృత ఘడియలు: సా.4.25 నుండి 6.10 వరకు.
సూర్యోదయం : 5.38
సూర్యాస్తమయం : 6.34
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం.... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది.
వృషభం.... రుణబాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.
మిథునం... వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో కర్కాటకం...ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి.
కర్కాటకం... శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
సింహం...... ప్రముఖులు పరిచయమవుతారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.
కన్య....... వ్యయప్రయాసలు. బంధువర్గంతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనుకోని ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.
తుల...... సాఫీగా సాగుతాయి. పాతబాకీలు వసూలవుతాయి. కొన్ని సమస్యలు తీరతాయి. ఆస్తి లాభం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
వృశ్చికం..... పనులు ముందుకు సాగవు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.
ధనుస్సు.... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి పిలుపు. ఇంటర్వ్యూలు రాగలవు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.
మకరం.... భూవివాదాల పరిష్కారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది.
కుంభం... ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. కొన్ని కార్యక్రమాలు మందగిస్తాయి. బంధువర్గంతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
మీనం... రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువర్గంతో విభేదాలు. పనులు వాయిదా. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.


