గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: శు.నవమి ఉ.8.38 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: విశాఖ రా.3.46 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం: ఉ.7.52 నుండి 9.36 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.56 నుండి 10.48 వరకు తదుపరి ప.3.06 నుండి 3.58 వరకు, అమృత ఘడియలు: సా.6.14 నుండి 7.58 వరకు.
సూర్యోదయం : 5.39
సూర్యాస్తమయం : 6.33
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
మేషం... వ్యవహారాలు మరింత వేగంగా సాగుతాయి. ఆప్తుల ద్వారా శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా ఉంటాయి.
వృషభం... నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుండి కీలక సమాచారం. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశించినరీతిలో ఉంటాయి.
మిథునం... ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. వ్యయప్రయాసలతో గడుపుతారు. పనులు మధ్యలో వాయిదా పడతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
కర్కాటకం... ఎంత పట్టుదలతో ఉన్నా పనులను పూర్తి చేయలేరు. ఆకస్మిక ప్రయాణాలు. రుణభారాలు తప్పదు. పట్టుదల వద్దు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.
సింహం... వ్యవహారాలు పుంజుకుంటాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ధనాదాయం బాగుంటుంది. స్నేహితులతో సఖ్యత. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
కన్య... మిత్రులే శత్రువులుగా మారతారు. ఆర్థిక ఇబ్బందులు. పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
తుల... నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
వృశ్చికం... దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. మానసిక అశాంతి. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు.
ధనుస్సు... మీ సత్తా చాటుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇంటర్వ్యూలు రాగలవు. ధనప్రాప్తి. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
మకరం... దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపార, ఉద్యోగాలలో మీ అంచనాలు నెరవేరతాయి.
కుంభం... సన్నిహితులతో మాటపట్టింపులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
మీనం.... వ్యయప్రయాసలు. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగని పరిస్థితి. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు కొంత ఇబ్బందిపెట్టవచ్చు.


