సాక్షి, న్యూఢిల్లీ: నీట్ అవకతవకలపై దేశ రాజదాని నగరం న్యూడిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ,విద్యార్థులు ఆందోళన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా విడుదల చేస్తున్న వీడియోలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వీడియోలు కాదు, విద్యార్థులపై కోరుతున్న డిమాండ్లపై చర్యలు కావాలి అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో దాడికి గురైన విద్యార్థులకు ప్రధాని మోదీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
23 రోజులుగా నిరాహార దీక్ష చేసిన విద్యార్థులతో కలిసి మీడియాతో మాట్లాడిన రాహుల్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యా వ్యవస్థ అవినీతికి ప్రతీక అని విమర్శించారు. ఆయనను వేరే శాఖకు మార్చడం కాకుండా, ప్రభుత్వం నుంచే పూర్తిగా తొలగించాలని (మంత్రివర్గం నుండి తీసేయాలని) విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారన్నారు.మోదీ రాత్రివేళల్లో చేసే వీడియో సందేశాలను ప్రస్తావిస్తూ విద్యార్థులకు ప్రధాని హామీలు, వీడియోలు వద్దని, తక్షణ చర్యలే కావాలని స్పష్టం చేశారు.
मोदी जी, करोड़ों छात्रों का भविष्य बर्बाद करने के बाद अब आधी रात की Reel से उनका वक़्त बर्बाद मत कीजिए।
प्रधान बर्ख़ास्त। दोषियों पर कार्रवाई। छात्रों से माफ़ी।
इससे कम कुछ भी मंज़ूर नहीं। pic.twitter.com/RWrLLDD0WC— Rahul Gandhi (@RahulGandhi) July 25, 2026
అలాగే ఆందోళన బాట పట్టిన విద్యార్థులపై లాఠీచార్జ్, పెల్లెట్ ప్రయోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గాయపడిన ఒక విద్యార్థిని చూపిస్తూ... విద్యార్థులపై దాడికి బాధ్యులైన వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. విద్యార్థులే ఈ దేశపు భవిష్యత్తు అని మోదీ దేశానికి గతం అని గతం ఎన్నటికీ భవిష్యత్తును ఓడించలేదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా AISA ప్రతినిధి నేహా బోరా మాట్లాడుతూ, రాహుల్ గాంధీతో విద్యా వ్యవస్థపై చర్చలు జరిపినట్లు తెలిపారు. కాగా నీట్ 2026 పేపర్ లీకేజీ అంశంపై విద్యార్థులను ఉద్దేశించి మోదీ గురువారం అర్ధరాత్రి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మరో సెల్ఫీ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.


