నీట్ లీకేజీ రచ్చ.. హీరోయిన్‌ జ్యోతిక ఆసక్తికర పోస్ట్‌! | Jyothika Extends Support To Students NEET Paper Leak Protest, Demands Dharmendra Pradhan Resignation, Post Went Viral | Sakshi
Sakshi News home page

నీట్ లీకేజీ రచ్చ.. హీరోయిన్‌ జ్యోతిక ఆసక్తికర పోస్ట్‌!

Jul 25 2026 11:07 AM | Updated on Jul 25 2026 11:30 AM

Actress Jyothika Support To Students On Protesting Against Neet Paper Leak

నీట్ పేపర్‌ లీక్ వివాదం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పేపర్‌ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు సినీ తారలు సైతం మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే సల్మాన్‌ ఖాన్‌, అదితిరావు హైదరీతో పాటు పలువురు సినీ తారలు విద్యార్థులకు మద్దతుగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. 

తాజాగా దక్షిణాది స్టార్‌ హీరో సూర్య సతీమణి, హీరోయిన్‌ కూడా విద్యార్థుల ఆందోళనకు తన మద్దతు తెలిపారు. నీట్‌ పేపర్‌ లీక్‌కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఇన్‌స్టాలో ఒక పోస్ట్‌ పెట్టారు.

‘నేను విద్యార్థులు, దేశ భవిష్యత్తు తరపున నిలబడతా. నేను ప్రజాస్వామ్య భారతదేశానికి మద్దదు ఇస్తున్నా. విద్యా వ్యవస్థలో సంస్కరణలు రావాలని కోరున్నా. తల్లులుగా మా పిల్లలను ‘సోనమ్‌ వాంగ్‌చక్‌, అభిజీత్‌ దీప్కే, సౌరవ్‌ దాస్‌లా గా పెంచాలని కోరుకుంటున్నాం. జెన్‌ జీ చేస్తున్న పోరాటం చూసి గర్వంగా ఉంది. భయం లేకుండా ఉద్యమం చేస్తున్న సీజేపీకి ధన్యవాదాలు. జైహింద్‌’అని జ్యోతిక తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement